14, అక్టోబర్ 2020, బుధవారం

ధార్మికగీత - 49*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                        *ధార్మికగీత - 49*

                                 *****

     *శ్లో:- గురవో బహవ స్సన్తి ౹*

            *శిష్య విత్తాపహారిణః ౹*

            *దుర్లభో ౽యం గురు ర్దేవి!*

            *శిష్య చిత్తాపహారకః ౹౹*

                           *****

*భా:- "గురువు", "దేవుడు" ప్రతి ఒక్కరికి జీవితనౌకకు దిక్సూచి వంటివారు. ఒకరు జ్ఞానదాత. ఒకరు మోక్షప్రదాత. వీరిరువురు ప్రత్యక్షమైతే దేవుని సాక్షాత్కరింపజేయగల జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకే ముందుగా నమస్కారం చేయాలి. "గు" అంటే చీకటి. "రు" అంటే పోగొట్టేవాడు. మన అజ్ఞానాంధకారాన్ని పోగొట్టబట్టే "గురుదేవుడు" అందరికి పూజనీయుడు అయినాడు. గురువు శిష్యునిలో నిద్రాణమై యున్న సృజనాత్మకశక్తిని వెలికితీయ గల "బ్రహ్మ"స్వరూపుడు. జ్ఞానదీపిక యైన సాధనాసంపత్తిని పెంచి, పోషించగల "విష్ణు"స్వరూపుడు. జ్ఞానార్జన కడ్డుతగిలే అష్టమదాలను, అరిషడ్వర్గాన్ని లయం చేయగల "శివ" స్వరూపుడు. అందుకే గురువు సాక్షాత్తు "పరబ్రహ్మ" మే. ఆయన మన జీవిత లక్ష్య మార్గదర్శి. కాని ఓ జగన్మాతా! నేటి ఆధునిక యాంత్రిక కాలంలో శిష్యపరమాణువుల విత్తము(డబ్బు)ను దోచుకునే గురువులు కోకొల్లలుగా ఉన్నారు. విద్యారంగ మంతా ధనమయమైనది. శిష్యుని చిత్తము(మనసు)ను దోచుకునే గురువే కరువైనాడు. గురువు తను అపార విద్యాపారంగతుడైనా, విద్యార్థి స్థాయికి దిగి, అతని హృదయానికి హత్తుకొనేలా పాఠం బోధించగల "బోధ" గురువే నిజమైన ఆదర్శగురువు. మిగిలినవారంతా "బాధ" గురువులే. ఆనాటి మేటి గురుశిష్యసంబంధాలు నేడు కనుమరుగై పోతున్నాయి. గురుస్థానాన్ని మన హృదిలో, మదిలో పవిత్రంగా పది కాలాలపాటు పదిలం చేసుకొంటూ, నిరంతర జ్ఞాన సముపార్జనచే , గురుకృపతో పరమాత్ముని ప్రసన్నం చేసుకునే దిశగా పురోగమించాలి*

                *ఓం శ్రీ గురుభ్యో నమః*

                            *****

                    *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

ధార్మికగీత - 39*

 *ధార్మికగీత - 39*

                                       *****

           *శ్లో:- కృషితో నాస్తి దుర్భిక్షం ౹*

                  *జపతో నాస్తి పాతకః ౹*

                  *మౌనేన కలహో నాస్తి ౹*

                  *నాస్తి జాగరతో భయమ్* ౹౹




ఉండదు కాటకం బెపుడు

         నుర్వి కృషిన్ మరి సేయుచుండగన్ 

నుండదు పాతకం బెపుడు

         నుర్వి జపంబును సేయ భక్తితోన్

నుండదు కయ్య మెప్పుడును

          నుర్విలొ మౌనముదాల్చి నుండగన్ 

నుండదు నెట్టియున్ భయము

          నుర్విలొ నుండగ జాగరూకతన్ 



✍️ గోపాలుని మధుసూదన రావు

అమ్మతనం

 అమ్మతనం యొక్క మాధుర్యం వర్ణనాతీతం 


మాతృమూర్తి


ఇద్దరూ బిడ్డలు మొదట బిడ్డ తాళి కట్టిన భర్త,రెండవ బిడ్డ గర్బాన దాచి తొమ్మిది మాసాలు మోసి కన్న బిడ్డ!!

కానీ వీరి పుట్టుక ఎక్కడ, ఎలా!!!


స్త్రీ మూర్తి మెడలో తాళి పడిన క్షణం అమ్మ అనే పిలుపు కోసం ఆరాటపడుతుంది స్త్రీ!!!


మాతృత్వంలో ఉన్న అ పిలుపు మాధుర్యం అటువంటిది!!


ఎదుట ఎందరో తల్లుల బాధని చూసి ఉంటుంది బిడ్డ పుట్టుక ఇవ్వడానికి కానీ వెనకాడదు స్త్రీ మూర్తి!!!


మొదటి మూడు నెలలు నీవు స్థిరం అయ్యే వరకు గర్బాన ఎన్ని కలలో తల్లీ కంట్టిన!!!


నాలుగవ నెల వచ్చే సరికి నీవు గర్బాన చేసే వింత పనులకి తల్లికి ఎన్ని వాంతిపులు.

తినాలి అని ఉన్నా తిననీవు కదా నీవు గర్బాన!!!


ఐదవ నెల కుదుట పడ్డావు అనుకుంటూ నీతో ఎన్ని మాటలో తల్లీకి ఎదుట నిను చూసుకుంటూ నిన్ను లాలిస్తుంది తల్లీ!!!


ఆరవ నెల ఎన్ని ఎన్ని చెప్పను నీవు కోరే కోరికలు ఒకట రెండా నీవు గర్బాన ఎన్ని కోరిన తల్లీ కాదు అనదు ఎంత కష్టమైన తాళి కట్టిన భర్తతో తెపించ్చుకొని నీకు తినిపిస్తుంది తన నాలం ద్వారా నీ కడుపు నింపుతుంది అప్పుడ్డే కుదుట తల్లీ మనసు!!!


ఏడవ నెల ఇక నీ చేష్టలు ఎన్నో ఎన్నో గర్బాన నీ చిన్ని చిన్ని పాదలతో తల్లిని ఓ వైపు కూర్చోనీవు ఓ వైపు నిద్రపోనీవు నీవు ఎన్ని చేసిన తల్లీ సంతోషం పడుతూ గర్బాన దాస్తుంది నిన్ను!!!


ఎనిమిదవ నెల ఇక నీకు నిద్ర లేదు కదా తల్లికి నిద్ర లేదు నీ ఆకలికి సమయం లేదు నీవు గర్బాన తిరుగుతూ ఉంటే తల్లీ తల్లడిల్లీ పోతుంది. నీవు నిద్రించకుండా అటూ, ఇటూ తిరుగుతుంటే గర్బాన కుమిలి పోతుంది నా బిడ్డకి నేను కడుపు నింపలేదా అని బాధతో కానీ దేవుడు అంటాడు తల్లీ బాధపడకు గర్బాన నీ బిడ్డ అనందంతో ఆటలు అడుకుంటున్నాడు అని చెప్పగానే ఉపొంగ్గి పోతుంది తల్లీ అనందంతో!!!


తొమిదవ నెల నీవు చేసే యుద్ధాలు అన్ని ఇన్ని కావు కదా దేవుడితోనే వాదన పడితివి ఏమిటి మూడు రోజుల నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి అని దేవుడు వివరణ నీవు బయట ప్రపంచంలోకి వెల్లు సమయం ఆసన్నమైంది అని చెప్పగానే నేను బయటికి వెళ్ళను ఈ గర్బానే ఉంటాను అని నా తల్లీ నన్ను చాలా బాగా లాలిస్తుంది అని వాదిస్తే తల్లి గర్బాన ఇంత లాలన చూసావు తల్లీ వడిన చేరు ఎంతగా లాలిస్తుందో నీ కంటిలో నలుసు కూడా పడనీవదు తల్లీ అని చెప్పి సెలవు భగవంతుడు!!!


ఇక నీ యుద్ధం తల్లీతో ఎప్పుడ్డు, ఎప్పుడ్డు నేను నీ వడిన చేరును అని నీ పచ్చని కాలితో తన్నుకుంటూ మొదలు పెడ్తివి బయటకు రావటానికి!!!

నీవు బయటికి వచ్చు సమయం తల్లీ ఎముకలు కటకటా అంటూ విరగుతున్న కాలయముడు వెంట పడ్తున్నా నీకు ప్రాణం పోస్తుంది తల్లీ ఎంత ఏడ్చిన ఎంత బాధ పడిన నిన్ను చూసిన క్షణమే తల్లీ బాధ మరచి ముద్దుడాతుంది!!


తల్లీ అమ్మతత్వం మాతృమూర్తి మాతృదేవోభవ!!!🙏🙏

దూరం నుంచి దర్శనం

 దూరం నుంచి దర్శనం..


"అయ్యా..గుడి దగ్గరకు దంపతులు ఇద్దరు కారులో వచ్చారయ్యా..ఇద్దరూ వయసులో పెద్దవాళ్ళు..సుమారు అరవై ఐదు, డెబ్భై ఏళ్ళు వుంటాయేమో..చాలా దూరం నుంచి వచ్చారట..స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్లిపోతారట..దర్శనం కుదరదు అని చెపుతున్నాము..కానీ ప్రాధేయపడుతున్నారు..ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేస్తున్నాము.." అని మా సిబ్బందిలో ఒకరు నాకు తెలిపారు..అప్పటికి కరోనా తాలూకు లాక్ డౌన్ పెట్టి సరిగ్గా పదిరోజులు..ఏప్రిల్ నెల 4,5 తేదీలలో నాటి సంఘటన ఇది..ప్రయాణాలు చేయకుండా పూర్తి స్థాయిలో నిషేధం ఉంది..మరి ఈ దంపతులు ఎలా వచ్చారు? అని నాకు సందేహం వచ్చింది..పైగా..ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రార్ధనా మందిరాలు తెరువరాదనే నియమం పెట్టారు..స్వామివారి నిత్య పూజలూ..నైవేద్యములు..కైంకర్యాలు..అర్చకస్వాములు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు..అప్పటికి స్వామివారి మందిరం వద్ద దత్తదీక్ష స్వీకరించిన స్వాములు సుమారు 250 మంది వున్నారు..వాళ్ళు కాకుండా దూరప్రాంత వాసులు..ప్రయాణం చేసే వీలులేక..మరో 50 మంది కూడా వున్నారు..వీళ్ళందరికీ రెండుపూటలా అన్నప్రసాదం ఏర్పాటు చేసాము..ఆ హడావిడి లో మా సిబ్బంది వున్నారు..అక్కడ దీక్ష చేస్తున్న స్వాములు దర్శనానికి స్వామివారి మందిరం లోకి రాకుండా మేము అనుమతి ఇవ్వలేదు..ఆ పరిస్థితుల్లో ఈ దంపతులకు అనుమతి ఇవ్వడం కుదరదని చెప్పి..భోజనం పెట్టించి..వెనక్కు పంపివేయమని చెప్పాను..మా సిబ్బంది సరే అన్నారు..


ఆరోజు నేను మొగిలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్దకు వెళ్లలేదు..ప్రక్కరోజు ఉదయం స్వామివారి మందిరానికి వెళ్ళాను..స్వామివారి ఆలయం వెనుక వైపు ద్వారం వద్ద ఆ దంపతులు నిలబడి వున్నారు..వారి వద్దకు వెళ్ళాను..నమస్కారం చేశారు.."నా పేరు వెంకటేశ్వరరావు అండీ..నా భార్య సుబ్బలక్ష్మి..మా ఊరు మచిలీపట్నం దగ్గర..తీవ్రమైన సమస్యలో వున్నాము.. మా అమ్మాయి జీవితానికి సంబంధించినది.. మాకు ఒక్కతే కూతురు..అది ఇంట్లో కూర్చుని దుఃఖ పడుతుంటే చూడలేకుండా వున్నాము.. స్వామివారి గురించి ఆరేడు నెలల నుంచీ చదువుతున్నాను..ఇక ఏ దారీ తోచలేదు..కారు తీసుకొని..నా భార్యను తోడు తీసుకొని..నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసాను..ఒకసారి స్వామివారి సమాధిని దర్శించుకొని..మా సమస్యను ఆ అవధూత చెవిలో వేసి వెళ్లిపోదామని అనుకున్నామండీ..కానీ ఇక్కడికి వచ్చాక మాకు పరిస్థితి అర్ధం అయింది..దత్తదీక్ష స్వీకరించిన వారిని కూడా మీరు లోపలికి అనుమతించడం లేదు..ప్రభుత్వ నిబంధనలు మీరు పాటించాలి..ఈ రెండురోజులు స్వామివారి ప్రసాదం తీసుకున్నాము..ఇంత వత్తిడి లోనూ మీరు ఇంతమందికి ఇబ్బంది లేకుండా ఆహారం అందిస్తున్నారు..సరే నండీ మాకు ప్రాప్తం లేదు..మీరు స్వామివారి ని ప్రత్యక్షంగా చూసి, సేవ చేసుకున్న వారు కనుక..మీతో మా సమస్య చెప్పుకొని వెళ్లిపోతాము..మళ్లీ ప్రాప్తం ఉంటే..ఇంకొకసారి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటాము.." అన్నారు..మందిరం ప్రధాన ద్వారం వద్దకు వచ్చి..ఆ ద్వారం అవతల వైపునుంచే స్వామివారి సమాధికి నమస్కారం చేసుకున్నారు..


"అయ్యా..మీ మనసులోని వేదనను స్వామివారి కి ఇక్కడినుంచే విన్నవించుకోండి.. ఈ ప్రదేశం అంతా స్వామివారు నడచిన నేల.. మీరు మనస్ఫూర్తిగా స్వామివారిపై విశ్వాసం ఉంచండి.." అని చెప్పాను..దంపతులిద్దరూ..ఆ గేట్ కు తమ తలలు ఆనించి..కళ్ళు మూసుకొని సుమారు పది నిమిషాలు అలానే ఉండిపోయారు..ఆ తరువాత ఇవతలికి వచ్చి..నాకు వెళ్ళొస్తామని చెప్పి.. "స్వామివారి విభూతి గంధం ఇప్పించగలరా?" అన్నారు..మా సిబ్బందికి చెప్పి రెండు పాకెట్లు విభూతి గంధం, స్వామివారి చిన్న ఫోటో తెప్పించి..వారికి ఇచ్చాను..భక్తిగా కళ్లకద్దుకొని తీసుకొని..కారులో వెళ్లిపోయారు..


వైశాఖ శుద్ధ సప్తమి రోజు స్వామివారి ఆరాధన వైభవోపేతంగా నిర్వహించడం ఆనవాయితీ..ఈసారి ఈ కరోనా కారణంగా వేడుక పూర్తిగా రద్దుచేసి..కేవలం మా అర్చకస్వాములు, సిబ్బంది సమక్షంలో ప్రత్యేక పూజలు, అభిషేకము నిర్వహించాము..దత్తదీక్ష స్వీకరించిన స్వాములు ఆలయం వెలుపలే వుండి దీక్ష విరమణ చేశారు..ఆరోజు ఉదయం 10 గంటల వేళ.."ప్రసాద్ గారూ..నా పేరు వెంకటేశ్వర రావు..మేము 25 రోజుల క్రితం మొగిలిచెర్ల వచ్చి, గేటు దగ్గరనుంచి స్వామివారి సమాధిని చూసి..మొక్కుకొని..మీతో మాట్లాడి వెళ్ళాము..గుర్తుకు వచ్చామా? " అని ఫోన్ లో అడిగారు.."గుర్తు వున్నారు.." అన్నాను..


"స్వామివారు మమ్మల్ని కరుణించారు.. మా సమస్య తీరిపోయింది..ఈ వయసులో మా నెత్తిమీద ఉన్న బరువు తొలిగిపోయింది..మాకు మనోవేదన కలగడానికి కారణం అయిన మా అమ్మాయి కాపురం చక్కబడింది..అల్లుడు గారే వచ్చి మాకు క్షమాపణ చెప్పి, అమ్మాయిని తీసుకెళ్లాడు..మీకొక విషయం చెప్పాలి..స్వామివారి విభూతి గంధం మా అమ్మాయి రోజూ ధరించింది..మేము అక్కడ ఉన్న రెండురోజులు మీ సిబ్బంది బాగా సహకరించారు..ఈ కరోనా కష్ట కాలం తొలగిపోగానే వచ్చి స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటాము..స్వామివారి సమాధి వద్దకు ఆరోజు పోలేకపోయామే అని బాధపడ్డాము కానీ.. మీరు చెప్పినట్టు ఆ ప్రదేశం అంతా స్వామివారు నిండిపోయి వున్నారు..దూరం నుంచి దర్శనం చేసుకున్నాము..స్వామివారు మమ్మల్ని దయతో దగ్గరకు తీసుకున్నారు.. అక్కడే మూడు రాత్రులు నిద్ర చేసాము.. ఆయన మా మొర విన్నాడు..ఈసారి తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకుంటాము.." అని ఉద్వేగంతో చెప్పారు..


స్వామివారి పై ఆ దంపతుల అచంచల విశ్వాసమే వారి ఆనందానికి హేతువు..


సర్వం..

శ్రీ దత్తకృప!!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 & 99089 73699).

సుగంధ పరిమళాలను

 ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️


  _*👌*సుగంధి పుష్పం తన సుగంధ పరిమళాలను పరులకు పంచి వారిని పరవశింప చేస్తుంది. అలాగే మంచివారు ఎప్పుడూ కూడా తమ మంచితనాన్ని పరులకు పంచి వారిని కూడా మంచివారిగా తీర్చి దిద్దుతారు..*_👌


   _**అతడు తమిళనాడు రాష్ట్రంలోని తిరునల్వేలి జిల్లాకు చెందిన ఒక మారుమూల ప్రాంతంలోని ఒక పేద కుటుంబానికి చెందిన వాడు కతిరేశన్. అతడికి చిన్నతనం నుండి బాగా చదువుకోవాలనే కోరిక బలంగా ఉన్నా కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అనేక రకాల సమస్యలు ఉండడం వల్ల అతడి చదువు తొమ్మిదవ తరగతికే పరిమితమై అంతటితో చదువు ఆపేయ వలసి వచ్చింది. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలన్న సదుద్దేశంతో కష్టపడి ఏదో ఒకవిధంగా 1979 లో ఆర్మీలో చేరగలిగాడు. అక్కడ కతిరేశన్ వాహనాలను నడిపించే డ్రైవర్ గా పని చేస్తుండేవాడు.*_


     _**అలా ఇరవై సంవత్సరాల పైనే అనుభవం ఉన్న కతిరేశన్ ను 2002 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అతడిని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ లోని DRDL ఆఫీసుకు బదిలీ చేసింది. అక్కడ ఆ సమయంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లాబొరేటరీస్ కు డైరెక్టర్ గా డాక్టర్ ఏ పి జే అబ్దుల్ కలామ్ గారు పని చేస్తుండేవారు. ఆయన కారుకు డ్రైవర్ గా వి. కతిరేశన్ ను నియమించారు ప్రభుత్వం వారు. ఒకసారి కలాం గారు కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో కతిరేశన్ తో మాట్లాడు తున్నప్పుడు, మాటల మధ్యలో అతను కూడా కలాంగారి లాగా తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లాకు చెందినవాడేనని తెలిసింది.*_


   _**ఒక రోజు కలాం గారు కారులో ఆఫీసుకు వెళుతూ డ్రైవర్ కతిరేశన్ తో నీవు ఎంతదాకా చదువుకొన్నావు? అని అడిగారు. ఆర్థిక ఇబ్బందులతో డబ్బులులేక, నా చదువును 9 వ తరగతికే ఆపేశానండి. ఆ తరువాత 1979 లో ఆర్మీ లో చేరాను. అక్కడ డ్రైవర్ గా పనిచేస్తుంటే ఇపుడు ఇక్కడికి బదిలీ చేసారు, అన్నాడు అతను. అవునా అయితే ఆ మిగిలిన చదువును నీవు ఇప్పుడు చదవడానికి ప్రయత్నించు అన్నారు కలాం గారు. ఉలిక్కిపడిన కతిరేశన్ సార్ నాకు ఇంగ్లీషు అంటే చాలా భయం సార్, నేను ఫెయిల్ అయ్యింది కూడా అందులోనే సార్ అన్నాడు.*_


     _**సరిగ్గా ఆ సమయానికే డబ్బులు కూడా లేకుండా అయిపోయింది. అంతటితో నా చదువు ఆగిపోయింది అని అనగానే, చూడు కతిరేశన్ నీ చదువు ఆగిపోయింది నీ పేదరికం వల్ల కానేకాదు, అది కేవలం నీ భయం అనే బలహీనత వల్లనే, మనసుంటే మార్గం ఉంటుంది, ధైర్యంతో ప్రయత్నించు తప్పకుండా విజయం సాధిస్తావు అన్నారు కలాం గారు. ఆ మాటలకు ఆ రాత్రి కతిరేశన్ కు నిద్ర పట్టలేదు. మరుసటిరోజు కలాం గారు ఆఫీస్ ముందు కారు దిగుతూ ''నీవు వెళ్ళి పరీక్షకు డబ్బు కట్టిరా '' అని పంపారు. కాదనలేక అలానే చేసాడు కతిరేశన్. ప్రతిరోజూ సాయంత్రం ఆఫీసు పని అయ్యాక కలాం గారు కతిరేశన్ కు ఇంగ్లీషు ట్యూషన్ చెప్పించారు.*_


     _**కతిరేశన్ కూడా పట్టుదలతో చదువుకొని పరీక్ష రాసి ఈసారి ఇంగ్లీషులో పాస్ అయ్యాడు. అతడి భుజం తట్టి చూడు ''నీవు ఇంతటితో ఆపరాదు, మెట్రిక్యులేషన్ కూడా పూర్తి చేయాలి '' అన్నారు కలాం గారు. తనకు అత్యంత కష్టమైన ఇంగ్లీషులోనే పాస్ అయ్యక చాలా ధైర్యం వచ్చింది కతిరేశన్కి. మెట్రిక్యులేషన్, డిగ్రీ కూడా పూర్తీ చేసాడు [దూరవిద్య ద్వారా ] ఇంతలో అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యి, డిల్లీకి వెళ్ళిపోయినా, ఆయన తన కారు డ్రైవర్ ను మరచిపోలేదు. ఆ మహానుభావుడు అక్కడి నుండే కతిరేశన్ ముందు ముందు ఏమేమి చేయాలో సలహాలు ఇచ్చేవారు కలాం గారు. ఒకసారి కతిరేశన్ తనను కలవడానికి వచ్చినపుడు కలాం గారు అతనికీ Polygars of Tirunalveli అనే పుస్తకం ఇచ్చి, దీన్ని నీవు పూర్తిగా చదువు, ముందు ముందు నీకు పనికొస్తుంది, అన్నారు.*_


       _**డిగ్రీ పూర్తి చేసిన తరువాత M.A లో చేరి హిస్టరీ ని స్పెషలైజేషన్ గా తీసుకొన్నాడు కతిరేశన్. కలాం గారి సూచన మేరకు PhD కూడా చేయాలనుకొని, ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తిరునల్వేలి పాయగార్ ల మీద, ఆనాటి జమిందారి వ్యవస్థ మీద పరిశోధన చేయాలనుకొన్నాడు అతను. ఆసక్తికరమైన విషయ మేమంటే ఒకప్పుడు కలాం గారు తనకిచ్చిన పుస్తకం సరిగా ఆ విషయం మీదనే ఉంది. దాంతో విజయ వంతంగా PhD కూడా పూర్తీ చేసాడు. డ్రైవర్ ఉద్యోగం నుండి స్వచ్చంద పదవీ విరమణ [ VRS] తీసుకుని, ప్రస్తుతం తమిళనాడు లోని గవర్నమెంటు కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ [ Arthur ] లో కతిరేశన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు.*_


           _**చూశారా మిత్రులారా ! అయస్కాంతము, ఇనుము అనే ఈ రెండు కూడా లోహాలే కానీ వేటి గుణం వాటిదే. అయస్కాంతం దగ్గరికి ఇనుము వచ్చినా, ఇనుము దగ్గరికి అయస్కాంతం చేరినా, ఆ ఇనుప ముక్క అయస్కాంతంగా మారి దాని విలువ పెరుగుతుంది. కానీ అయస్కాంతం మాత్రం ఇనుముగా మారదు. అదేవిధంగా అయస్కాంతం వంటి అబ్దుల్ కలాం గారు ఇనుము వంటి కతిరేశన్ ను అయస్కాంతంగా మార్చి ఈ సమాజానికి ఉపయోగపడే ఒక మంచి వ్యక్తిగా మలిచి ఈ సమాజానికి అందించారు. కాబట్టి మీరందరూ కూడా మంచి వారిగా ఉంటూ మీ చుట్టూ ఉన్న వారిని కూడా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులుగా మార్చి ఈ సమాజానికి అందించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్.*_👌


_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘


       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌


       _**For Every Action Equal &*_   

             _*Opposite Reaction**_        


    _**రామభక్త గురూజీ ప్రొద్దుటూరు**_                                          

           _**సెల్ - 8328170075.**_

బ్రహ్మముహూర్తం

 అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!


పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.  

 

నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.


పురాణగాథ

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.


ఏం చేయాలి..?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.


ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.


చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.  


బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.  


బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

పరమ_శివుడు_కొలువైన_పంచారామ_క్షేత్రాలు శ్రీ సోమేశ్వర స్వామి (అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు. పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు. రెండోది ‘ద్రాక్షారామం’. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ. మూడోది ‘కుమారారామం’. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్య సుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్టించాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వాసికెక్కారు. నాలుగో ఆరామం ‘సోమారామం’. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా గునుపుండి (భీమవరం) లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజ లందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవక్షేత్రం ఇది. ఐదో ఆరామం ‘క్షీరారామం’ (పాలకొల్లు). ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీ మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టితమై ఈశాన్య ముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు. పంచారామాలన్ని ఒకే రోజులో సందర్శించాలను కుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించుకోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు. 4. సోమారామం ఇది పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి (భీమవరం) లో వెలిసిన పవిత్ర క్షేత్రం. నీలకంధరుడు ఇక్కడ సద్యోజాతముఖుడై, నిత్య నూతన స్వరూపుడై దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఇది పంచారామాలలో నాల్గవది. గునుపూడి సోమారామంలో స్వామి ‘శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి’గా దర్శనమిస్తాడు. పంచారామాలన్నీ మహామహులు ప్రతిష్టించినవే. అయితే మూడవ శతాబ్దికి చెందిన చాళుక్య భీముడు దీనిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ‘గౌతమీ తీరంబున, దక్షిణ కూలంబున, గునుపూడి అను గ్రామంబున, సోమునిచే ప్రతిష్టితంబగుట చేత సోమలింగంబన ప్రఖ్యాతంబై సోమారామంబును’ అని వర్ణించాడు. స్థల పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెబితే పూర్వం తారకాసురుడనే రాక్షస శివ భక్తుడుండేవాడు. ఆ తారకుని కంఠంలో ఉన్న అమృత లింగం అతనికి ప్రాణరక్షగా నిలిచింది. అతడు అందరినీ హింసించే వాడు. ఆ బాధలు భరించలేక దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసనా లింగంలో ఉందని గ్రహించి తన అస్త్రంతో దానిని ఛేదించాడు. ఆ లింగం ఐదు ముక్కలై పలు ప్రాంతాలో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలయ్యాయి. అందులో గునుపూడిలో పడినది సోమారామమై వెలిసినట్లు చెబుతారు. ఇక్కడ నాగభూషణుడిగా స్ఫటికలింగ రూపంలో సోమేశ్వరుడు అవతరించాడు. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అయితే ఇక్కడ సోమేశ్వర లింగం గోధుమ, నలుపు ఛాయలోను; పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోను ప్రకాశిస్తూ ఉంటుంది. సోమేశ్వర పీఠం నుండి రెండు అడుగుల ఎత్తు గల ఈ లింగాన్ని స్ఫటిక లింగంగా పేర్కొంటారు. లింగాకారం చంద్రశిల అని, చంద్రశిలలు శుక్ల, బహుళ పక్షాలలో చంద్రునిలో వచ్చే మార్పులకు అనుగుణంగా రంగు మార్చుకునే అవకాశం ఉందని కొందరు చెబుతారు. ఈ శివలింగం పై భాగంలో అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇటువంటి నిర్మాణం దేశంలో మరెక్కడా కనిపించదు. ఈశ్వరుడు గంగమ్మను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఇక్కడ ఇలా దీన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. ఈ ఆరామానికి తూర్పు వైపున చంద్రపుష్కరిణి (సోమగుండం) చెరువు ఉన్నది. ప్రతీ ఏడాది మహాశివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథయాత్ర చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. సోమగుండంలో నిర్వహించే తెప్పోత్సవాన్ని తిలకించేందుకు సమీప గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని కనులారా చూసి ఆనందిస్తుంటారు.

 పరమ_శివుడు_కొలువైన_పంచారామ_క్షేత్రాలు


 శ్రీ సోమేశ్వర స్వామి


(అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు.


పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.


రెండోది ‘ద్రాక్షారామం’. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ.


మూడోది ‘కుమారారామం’. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్య సుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్టించాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వాసికెక్కారు.


నాలుగో ఆరామం ‘సోమారామం’. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా గునుపుండి (భీమవరం) లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజ లందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవక్షేత్రం ఇది.


ఐదో ఆరామం ‘క్షీరారామం’ (పాలకొల్లు). ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీ మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టితమై ఈశాన్య ముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు.


పంచారామాలన్ని ఒకే రోజులో సందర్శించాలను కుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించుకోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు.


4. సోమారామం


ఇది పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి (భీమవరం) లో వెలిసిన పవిత్ర క్షేత్రం. నీలకంధరుడు ఇక్కడ సద్యోజాతముఖుడై, నిత్య నూతన స్వరూపుడై దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఇది పంచారామాలలో నాల్గవది. గునుపూడి సోమారామంలో స్వామి ‘శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి’గా దర్శనమిస్తాడు. పంచారామాలన్నీ మహామహులు ప్రతిష్టించినవే.


అయితే మూడవ శతాబ్దికి చెందిన చాళుక్య భీముడు దీనిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ‘గౌతమీ తీరంబున, దక్షిణ కూలంబున, గునుపూడి అను గ్రామంబున, సోమునిచే ప్రతిష్టితంబగుట చేత సోమలింగంబన ప్రఖ్యాతంబై సోమారామంబును’ అని వర్ణించాడు.


స్థల పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెబితే పూర్వం తారకాసురుడనే రాక్షస శివ భక్తుడుండేవాడు. ఆ తారకుని కంఠంలో ఉన్న అమృత లింగం అతనికి ప్రాణరక్షగా నిలిచింది. అతడు అందరినీ హింసించే వాడు. ఆ బాధలు భరించలేక దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసనా లింగంలో ఉందని గ్రహించి తన అస్త్రంతో దానిని ఛేదించాడు. ఆ లింగం ఐదు ముక్కలై పలు ప్రాంతాలో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలయ్యాయి. అందులో గునుపూడిలో పడినది సోమారామమై వెలిసినట్లు చెబుతారు. ఇక్కడ నాగభూషణుడిగా స్ఫటికలింగ రూపంలో సోమేశ్వరుడు అవతరించాడు. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.


అయితే ఇక్కడ సోమేశ్వర లింగం గోధుమ, నలుపు ఛాయలోను; పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోను ప్రకాశిస్తూ ఉంటుంది. సోమేశ్వర పీఠం నుండి రెండు అడుగుల ఎత్తు గల ఈ లింగాన్ని స్ఫటిక లింగంగా పేర్కొంటారు. లింగాకారం చంద్రశిల అని, చంద్రశిలలు శుక్ల, బహుళ పక్షాలలో చంద్రునిలో వచ్చే మార్పులకు అనుగుణంగా రంగు మార్చుకునే అవకాశం ఉందని కొందరు చెబుతారు. ఈ శివలింగం పై భాగంలో అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇటువంటి నిర్మాణం దేశంలో మరెక్కడా కనిపించదు. ఈశ్వరుడు గంగమ్మను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఇక్కడ ఇలా దీన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. ఈ ఆరామానికి తూర్పు వైపున చంద్రపుష్కరిణి (సోమగుండం) చెరువు ఉన్నది. ప్రతీ ఏడాది మహాశివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథయాత్ర చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. సోమగుండంలో నిర్వహించే తెప్పోత్సవాన్ని తిలకించేందుకు సమీప గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని కనులారా చూసి ఆనందిస్తుంటారు.


 శ్రీ సోమేశ్వర స్వామి


(అమరారామం, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామం) దివ్య క్షేత్రాలుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వర్ధిల్లుతున్నాయి. వీటిని స్వయంభూ క్షేత్రాలని, దేవతా నిర్మిత క్షేత్రాలని, ఋషి కల్పితమైన క్షేత్రాలని, మానవ ప్రతిష్టితమైన క్షేత్రాలని నాలుగు విధాలుగా విభజించారు. పంచారామ క్షేత్ర దర్శనం భక్తి, ముక్తి ప్రదమైనదని చెబుతారు.


పంచారామాలలో మొదటిది ‘అమరారామం’. ఇది అమరావతిలో నిర్మితమైంది. ఇక్కడ అమరేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం దేవరాజైన ఇంద్రుని ప్రతిష్ఠను తెలుపుతుంది. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.


రెండోది ‘ద్రాక్షారామం’. ఈ క్షేత్రం తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఇక్కడ భక్తులు శివుణ్ణి భీమేశ్వరుడిగా కొలుస్తున్నారు. అమ్మవారు మాణిక్యాంబ.


మూడోది ‘కుమారారామం’. ఈ క్షేత్రం సామర్లకోటలో ఉంది. ఇక్కడ శివుణ్ణి సత్య సుందర స్వరూపంలో కుమారస్వామి ప్రతిష్టించాడు. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా వాసికెక్కారు.


నాలుగో ఆరామం ‘సోమారామం’. ఈ క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా గునుపుండి (భీమవరం) లో ఉంది. ఇక్కడ శివుడు సోమేశ్వరుడిగా నిత్య పూజ లందుకుంటున్నాడు. ఇక్కడ శివపత్ని పార్వతీదేవిని భక్తులు నిత్య నూతనంగా కొలుస్తున్నారు. చంద్ర ప్రతిష్ఠితమైన శైవక్షేత్రం ఇది.


ఐదో ఆరామం ‘క్షీరారామం’ (పాలకొల్లు). ఇక్కడ కొలువైన స్వామి రామలింగేశ్వరుడు. అమ్మ పార్వతీ మాత. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రతిష్టితమై ఈశాన్య ముఖుడిగా లోకమంతా తానే అయి విలసిల్లుతున్నాడు.


పంచారామాలన్ని ఒకే రోజులో సందర్శించాలను కుంటే అమరావతితో ప్రారంభించి భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను క్రమంగా దర్శించుకోవలసి ఉంటుంది. ఈ క్షేత్రాలు దర్శిస్తే సర్వ పాపాలు నశిస్తాయని, అఖండ ఫలితంతో పాటు, కాశీ క్షేత్ర దర్శనం వలన కలిగే పుణ్యం కూడా లభిస్తుందని పెద్దలంటారు.


4. సోమారామం


ఇది పశ్చిమ గోదావరి జిల్లా గునుపూడి (భీమవరం) లో వెలిసిన పవిత్ర క్షేత్రం. నీలకంధరుడు ఇక్కడ సద్యోజాతముఖుడై, నిత్య నూతన స్వరూపుడై దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని చంద్రుడు ప్రతిష్టించాడని చెబుతారు. ఇది పంచారామాలలో నాల్గవది. గునుపూడి సోమారామంలో స్వామి ‘శ్రీ సోమేశ్వర జనార్దనస్వామి’గా దర్శనమిస్తాడు. పంచారామాలన్నీ మహామహులు ప్రతిష్టించినవే.


అయితే మూడవ శతాబ్దికి చెందిన చాళుక్య భీముడు దీనిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ‘గౌతమీ తీరంబున, దక్షిణ కూలంబున, గునుపూడి అను గ్రామంబున, సోమునిచే ప్రతిష్టితంబగుట చేత సోమలింగంబన ప్రఖ్యాతంబై సోమారామంబును’ అని వర్ణించాడు.


స్థల పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెబితే పూర్వం తారకాసురుడనే రాక్షస శివ భక్తుడుండేవాడు. ఆ తారకుని కంఠంలో ఉన్న అమృత లింగం అతనికి ప్రాణరక్షగా నిలిచింది. అతడు అందరినీ హింసించే వాడు. ఆ బాధలు భరించలేక దేవతలు కుమారస్వామిని ప్రార్థించారు. సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షమై తారకాసురుని మరణం అతను ధరించిన ఉపాసనా లింగంలో ఉందని గ్రహించి తన అస్త్రంతో దానిని ఛేదించాడు. ఆ లింగం ఐదు ముక్కలై పలు ప్రాంతాలో పడ్డాయి. అవే పంచారామ క్షేత్రాలయ్యాయి. అందులో గునుపూడిలో పడినది సోమారామమై వెలిసినట్లు చెబుతారు. ఇక్కడ నాగభూషణుడిగా స్ఫటికలింగ రూపంలో సోమేశ్వరుడు అవతరించాడు. దీనికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి.


అయితే ఇక్కడ సోమేశ్వర లింగం గోధుమ, నలుపు ఛాయలోను; పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోను ప్రకాశిస్తూ ఉంటుంది. సోమేశ్వర పీఠం నుండి రెండు అడుగుల ఎత్తు గల ఈ లింగాన్ని స్ఫటిక లింగంగా పేర్కొంటారు. లింగాకారం చంద్రశిల అని, చంద్రశిలలు శుక్ల, బహుళ పక్షాలలో చంద్రునిలో వచ్చే మార్పులకు అనుగుణంగా రంగు మార్చుకునే అవకాశం ఉందని కొందరు చెబుతారు. ఈ శివలింగం పై భాగంలో అన్నపూర్ణ అమ్మవారి విగ్రహం ఉండటం ఈ ఆలయంలోని ప్రత్యేకత. ఇటువంటి నిర్మాణం దేశంలో మరెక్కడా కనిపించదు. ఈశ్వరుడు గంగమ్మను శిరస్సుపై ధరించడానికి ప్రతీకగా ఇక్కడ ఇలా దీన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం. ఈ ఆరామానికి తూర్పు వైపున చంద్రపుష్కరిణి (సోమగుండం) చెరువు ఉన్నది. ప్రతీ ఏడాది మహాశివరాత్రి నాడు ఇక్కడ ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. రథయాత్ర చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. సోమగుండంలో నిర్వహించే తెప్పోత్సవాన్ని తిలకించేందుకు సమీప గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని కనులారా చూసి ఆనందిస్తుంటారు.

పితృశాపం

 Hindu Dharmam Vardhillali (హిందూ ధర్మం వర్ధిల్లాలి):

*పితృశాపం :-*


పితృదోషం కారణంగా ఏర్పడిన వివిధ రకాల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని రకాల ప్రక్రియలను శాస్త్రాలలో చెప్పబడింది. అందు ముఖ్యమైనది *తిలాహోమం*. హోమంలో నువ్వులను వేస్తూ హోమం చేస్తారు. బలితర్పణ అనే ప్రక్రియ ఆ తర్వాత ఈ తిలాహోమం జరుగుతుంది. ధర్మశాస్త్రాల ప్రకారం తల్లి వైపుకి చెందిన నాలుగు తరాలలో లేక తండ్రికి చెందిన ఏడు తరాలలో ఎవరైనా వ్యక్తి వివాహం కాకుండా చిన్న వయసులోనే మరణించిన లేక యుక్త వయస్సులో అకాల మృత్యువు పొందినా , లేక హత్య చేయబడినా పితృదోషం ఏర్పడుతుంది. ఈ పితృదోష నివారణ కోసం బలి తర్పణం మరియు తిలాహోమం జరుగుతుంది. మొదట పితృబలి, ఆ తర్వాత శార్థం , తర్వాత బలితర్పణం ఇచ్చి ఆ తర్వాత తిలాహోమం జరుపుతారు . 


పితృశాపం వలన కలిగిన ఫలితాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఒక వ్యక్తి తాను గత రెండు జన్మలలో కానీ లేక ఈ జన్మలో గానీ తల్లిదండ్రులకు చేసిన అపకారం కారణంగా ఆ వ్యక్తి తన జీవితంలో పొందే రకరకాల నష్టాలు. రెండవది ఓక వ్యక్తికి సంబంధించిన పూర్వీకులు కొన్ని కారణాల వల్ల అకాల మృత్యువు పొందిన ఆ తర్వాత ఏ విధమైన శార్థకర్మలు లాంటివి లేని కారణంగా ప్రేతాత్మగా ఉండి తన వారసులను శపించడం జరుగుతుంది. ఈ విధమైన పిథృశాపం వలన కూడా మానవుడు ఆర్థిక నష్టాలు, సంతాన లేమి , ఇలా ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొనివలసి వస్తుంది. ఈ రెండు రకాల పితృశాపలకు కూడా పరిహారం చేయబడే ఒక హైందవ తాంత్రిక ప్రక్రియలను నారాయణ నాగ బలి అని పిలుస్తారు. 


మానవులకు అనేక కొరికలు ఉంటాయి . అయితే చాలా కొద్ది మందికి మాత్రమే వారి వారి కోరికలు కోరింది పొందగలరు. కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన మనుషులు ఆశించినవన్నీ పొందుతారు అనుకోవడం అజ్ఞానం. అంతే కాక ఏది ఎవరికి ప్రాప్తమో , ఎంతవరకు ప్రాప్తమో అది అంతవరకే వరిస్తుంది. అయితే కొన్ని సార్లు గ్రహ ప్రభావం కారణంగా మానవులు కొన్ని పొందలేకపోతారు . అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పితృశాపం అనే అతిశక్తివంతమైన అంశం నవగ్రహాలకన్నా అధికంగా మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. పితృశాపం అంటే ఏమిటి అంటే మానవులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తగిన విధంగా సేవలు చేసి వారిని సంతోషపెట్టి ఆపై వారు స్వర్గస్థులైన తర్వాత వారికి తగిన విధంగా అంత్యక్రియలు పూర్తి చేసి అటు తర్వాత ప్రతీ సంవత్సరం మాతా , పితరుల ఆత్మశాంతి కోసం శార్థకర్మలు చేయిస్తూ ఆకలిగొన్న వారికి అన్నశాంతిని చేయిస్తూ ఉండాలి. అలా పితృఋణం , మాతృఋణం తీర్చుకొనే మానవులకు మంచి సంతానం, సంపదలు , సౌఖ్యాలు లభిస్తాయని హైందవ ధర్మం చెబుతోంది. అయితే కొందరు పితృశాంతి కోసం ప్రతీ సంవత్సరమూ ఎన్నో చేస్తున్నా వారికి సంతానం లేకపోవడం, జీవితం లో పైకి రాలేకపోవడం ఏదో ఒక విధంగా ప్రతీ దాంట్లోనూ నష్టాలు పాలు కావడం ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్న వివేకం ఉన్న ఏ మానవుడికైనా ఎదురౌతుంది. ఇందుకు గల కారణం ఏమిటంటే కేవలం ఈ జన్మలో పితృఋణం తీర్చుకుంటే చాలదు . గతజన్మ లో మరి అంతకు ముందు జన్మలో తల్లిదండ్రులుగా ఉన్న వారికి ఏవిధమైన సేవలు చేయకుండా మరి పితృకర్మలు చేయకుండా తప్పించుకొనే మానవులు కనీసం ఈ జన్మలో అయినా పితృఋణం తీర్చాల్సి ఉంటుంది. ఒక మనిషి తీర్చాల్సిన పితృఋణం మూడు జన్మలవరకూ ఉంటుంది అని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. ఈ జన్మలో పితృఋణం తీరుస్తున్నప్పటికి గత రెండు జన్మలలో మాతాపితరులకు ఋణపడి ఉన్న కారణంగా ఆ పితృదేవతల యొక్క ఆగ్రహం , అసంతృప్తి మూడవ జన్మలో ఉన్న మానవులపై ప్రసరించి ఆ మానవులు పితృశాపానికి గురికావడం జరుగుతుంది. ఆ ఫలితంగా మానవులు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు .


👉 పితృశాపం ఉన్నవారికి సంతానం కలుగదు. ఒకవేళ సంతానం కలిగినా చిన్న వయసులోనే నశించిపోతుంది. 


👉 పితృశాపం అనుభవిస్తున్న వారిపై పిశాఫిడ , దుష్ట గ్రహపీడలు అధికంగా ఉంటుంది. వీరికి విపరీతంగా చెడు దృష్టి తగులుతుంది. అంతే కాక వీరిపై వీరి శత్రువులు చేతబడులు అనేక సార్లు చేయించడం జరుగుతుంది. 


👉పితృశాపం ఉన్నవారికి అతి తొందరగా షుగర్, ఊబకాయం, ఆస్తమా లాంటి నివారణ లేని వ్యాధులు వస్తాయి. అంతే కాకుండా వీరి పిల్లల్ని కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. 


👉 పితృశాపం ఉన్నవారికి తరచుగా యాక్సిడెంట్స్ జరగడం , హాస్పిటల్ పాలవడం జరుగుతుంది.


👉 గృహంలోని సభ్యులు అకాల మృత్యువు పొందటం లేక ఆత్మహత్య చేసుకోవడం , నీటిలో మునిగి చనిపోవడం లేక ప్రమాదంలో మరణించడం లాంటివి జరుగుతాయి.


గత రెండు జన్మలలో పితృఋణం తీర్చకుండా ఉండటమే కాక తల్లి తండ్రిని అన్నం పెట్టకుండా వారిని బాధించి మరియు హింసించిన వారికి మూడవ జన్మలో అతిభయంకమైన కష్టాలు కలగడం జరుగుతుంది. అయితే గత జన్మ లో వేరే విధమైన పుణ్య కార్యాలు చేసిన కారణం గా వీరికి అపారమైన డబ్బు, పరపతి, లభిస్తాయి. అయినంత మాత్రాన వీళ్ళు సుఖపడతారని బావించవలదు . వీళ్ళు సంపాదించే ఆస్తిని అనుభవించాల్సిన వాళ్ళు ( వారసులు ) అకాల మృత్యువు పొందటం వీళ్ళకు పైకి చెప్పుకోలేని దుఃఖాన్ని ఆక్రోశాన్ని కలిగిస్తారు . ఈ బాధాకరమైన సమస్యలను నివారించడానికి పితృశాప పరిహారాన్ని చేయించుకోవాలి. 


కొంత మంది


లు ఈ కింది పరిస్థితులలో అకాల మృత్యువు పాలవడం జరుగుతుంది. అలాంటి వారికి తగిన శార్ధకర్మలు చేసే వారసులు లేక , ఆ చనిపోయిన వారు ప్రేతాత్మలు గా మారి తమ కుటుంబం లోని వారిని వీలైనన్ని విధాలుగా భాధించడం జరుగుతుంది. అలా ఆత్మశాంతి లేకుండా ప్రేత రూపంలో సంచరించే కుటుంబీకుల ఆత్మఘోష పితృశాపంగా మారి బ్రతికి ఉన్నవారికి తగిలి బాధించడం జరుగుతుంది. 


*పితృశాపం ఎవరికి తగులుతుంది !?* 


👉 వివాహానికి పూర్వమే తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేక స్త్రీ మరణించడం .


👉 నీటిలో మునిగి తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం.


👉 ప్రమాదకరమైన జంతువుచే కానీ , విషపూరిత సర్పాలచే కానీ తమ కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించడం. 


👉 కాల్చుకుని గానీ, విద్యుత్ షాక్ తో గాని , విషం తాగి గానీ, ఉరివేసుకుని గానీ తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం. 


👉 ఆహారం తినేటప్పుడు లేదా పానీయం తాగేటప్పుడు అది గొంతుకు అడ్డంపడి తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం. 


👉 విపరీతంగా తినడం వల్ల గానీ, మద్యాన్ని సేవించడం వల్ల కానీ తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం.


👉 విదేశాల్లో లేక దూరప్రాంతాలలో దిక్కులేకుండా తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం.


👉 దక్షిణాయణంలో గానీ, ఫంచక కాలంలో గానీ , అతిదుష్ట నక్షత్ర మరి తిథి కలిసి ఉన్న కాలంలో గానీ తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం.


👉 ఈ విధమైన కారణాలవల్ల చనిపోయిన స్త్రీ లేదా పురుషులకు మరణానంతర కర్మకాండలు చేయించేవారు ఉండరు . చిన్న వయసులో ఇలా వివిధ కారణాల వల్ల దుర్మరణం పొందిన వ్యక్తల యొక్క ఆత్మలు , ప్రతాత్మలుగా మారి తమ తమ కుటుంబీకులను పీడిస్తాయని గరుడపురాణం చెబుతోంది. అయితే తమకు పితృశాపం ఉన్నది లేనిది ఎలా తెలుసుకోవాలి !? 


పితృశాపం ఉన్నవారికి , వారిని ఆ శాపానికి గురిచేసిన ప్రేతాత్మ లు తరచుగా కలలలోకి వస్తూ ఉంటారు. ఒక్కోసారి పితృశాపం ఉన్నవారికి నేరుగా ప్రేతాత్మలు కనబడకుండా పితృశాపానికి చిహ్నంగా కొన్ని ప్రత్యేక ప్రతీకలు స్వప్నంలో కనిపిస్తుంది. 


👉 కలలో. ఒక త్రాచుపాము పడగవిప్పి కనిపించడం గానీ, ముక్కలు ముక్కలుగా కనిపించడం గానీ ఆ కలకంటున్న వ్యక్తికి తాను కలలో త్రాచుపామును చంపుతున్నట్లగా కనిపించడం జరిగితే ఆ వ్యక్తికి పితృశాపం ఉన్నట్లు. 


👉 మహాసముద్రం గానీ , పెద్ద నదీగాని , పెద్ద సరస్సు కానీ అనేక సార్లు కలలో కనిపిస్తే అతనికి పితృశాపం ఉన్నట్లు.


👉 తాను నీటిలో మునిగి పోతున్నట్లు కానీ లేక నీటిలో నుండి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు గానీ అనేక సార్లు కలలు వస్తే ఆ వ్యక్తికి పితృశాపం ఉన్నట్లు .


👉 తాను ఇతరులతో తగాదాలు పడుతున్నట్లు, కోట్లాటలు చేస్తున్నట్లు అనేక సార్లు కలలు వస్తే ఆ వ్యక్తికి పితృశాపం ఉన్నట్లు.


👉 ఒక మహాభవనం పడగొట్టబడుతున్నట్లు కలలో కనిపిస్తే అతనికి పితృశాపం ఉన్నట్లు.


👉 ఇటీవలి కాలంలో భర్తను పోగోట్టుకున్న స్ర్తీ లేక చనిపోయిన స్త్రీ కలలో కనిపిస్తే అతనికి పితృశాపం ఉన్నట్లు.


👉 ఎవరో ఒక స్త్రీ పెద్దగా రోదిస్తూ భుజంపై చనిపోయిన తనబిడ్డను వేసుకుని ఎటో నడుచుకుంటూ వెళుతున్నట్లు కలవచ్చినా అతనికి పితృశాపం ఉన్నట్లు. 


ఇలాంటి స్వప్నాలు వచ్చేవారికి కచ్చితంగా పితృశాపం ఉండి తీరుతుంది. అలాగే ఆ పితృశాపం వలన కలిగే దుష్పలితాలలో కనిసం ఒకటైన వారికి కనిపిస్తుంది.

మహనీయుల మాట*

 🌻 *మహనీయుల మాట* 🌻


            *శాంతాన్ని మించిన తపస్సు లేదు, సంతోషానికి సమానమైన సుఖంలేదు.

           *కోరికలను మించిన అనారోగ్యం లేదు, కరుణను మించిన ధనం లేదు.

       

🌷 *నేటి మంచి మాట* 🌷


 మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు.. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువగా ఆలోచించాలి. భవిష్యత్తును ఎక్కువగా ప్రేమించాలి.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

Flood