30, డిసెంబర్ 2020, బుధవారం

పురుషా రాజన్,

 "సులభా: పురుషా రాజన్, 

సతతం ప్రియవాదినః !

అప్రియస్య చ పథ్యస్య

వక్తా శ్రోతా చ దుర్లభ : !!"


"ఓ రాజా, అధికారంలోవున్న నీ చుట్టూ భజనపరులు చేరి ముఖప్రీతి మాటలతో తమ పబ్బం గడుపుకుంటారు, కానీ నీ హితవు చెప్పేవారు ఉండరు, ఒకవేళ చెప్పినా వినేవారులేరు" అని శ్రీరామాయణంలో చెప్పిన మారీచుడున్నూ; మహాభారతంలో వికర్ణుడున్నూ ఈ ఉభయులు చేసిన జ్ఞానోపదేశం పెడచెవిన పెట్టిన వారికి సంప్రాప్తమైన గతి, వర్తమాన రాచకీయ యవనికపై తాము అవతార యుగ పురుషులుగా భ్రమ, మైకంలో ఉన్న వారికి రాకూడదని ....

బుధుడు

 బుధుడు : 

సోమునకును రోహిని తారకు బుదుడు  సౌమ్య నామ సంవత్సరం భాద్రపద శుద్ద ఏకాదశిజన్మించెను బుదుని భార్య:- వైరజ కుమారుడు :- పురూరవుడు 

బుధుడు : బంధనం , హేమలాభంచ . రిపుపీడం , రిపుక్షయం

దారిద్ర్యం ,భూషణం , లాభం, మనసిద్దిం ,ధనక్షయం

ప్రమోదం, మోదసంహారం, బుదః కుర్యాత్క్రమాద్గతః


తాత్పర్యము: బుధుడు పన్నెండు రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము 3 శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును. 


బుధ నపుంసక గ్రహం. మిశ్రమ రుచుల కారకత్వం కలిగిన వాడు. ఇరవై వయసున్న వారిని సూచిస్తాడు. వర్ణం ఆకు పచ్చ, జాతి వైశ్య, అధి దేవత విష్ణువు, గుండ్రని ఆకారం, పరిమాణం పొడుగు, ప్రకృతి కఫ, వాత, పిత్తములు కల వాడు. శరధృతువును ఉత్తర దిక్కునూ, సూచిస్తూ, పృధ్వీ తత్వం కలిగిన వాడు, గ్రహ సంఖ్య అయిదు, రత్నం పచ్చ, లోహం, ఇత్తడి, కంచు, గుణం రజో గుణం కలిగిన వాడు. లగ్నంలో దిక్బలం కలిగి ఉంటాడు. ఆశ్లేష, మూల, రేవతి నక్షత్రములకు బుధుడు అధిపతి. మిధున కన్యా రాశులకు అధిపతి. బుధుడు కన్యారాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ ఉచ్ఛ స్థితిని పొందుతాడు. మీనరాశిలో పదిహేను డిగ్రీల వద్ద పరమ నీచను పొందుతుంది. కన్యారాశిలో పదిహేను ఇరవై డిగ్రీలు మూల త్రికోణము ఔతుంది. బుధుడికి సూర్యుడు, శుక్రుడు మిత్రులు. సింహరాశి, వృషభరాశి, తులారాశులు మిత్ర స్థానములు. చంద్రుడు శత్రువు. కర్కాటక రాశి శత్రు స్థానం. బుధ గ్రహ దశ పదిహేడు సంవత్సరాలు. బుధుడు ఏడవ స్థానం మీద మాత్య్రమే దృష్టిని సారిస్తాడు. బుధుడు స్వభావరీత్యా శుభుడు, తత్వము భూతత్వం, గ్రహ స్వభావం, ఒంటరిగాపాపి శుభగ్రహములతో చేరిన శుభుడు. జీవులు పక్షులు, గ్రహ స్థానం క్రీడాస్థలాలు, జలతత్వం జలభాగం, ఆత్మాధికారం వాక్కు, పాలనా శక్తి రాకుమారుడు, గ్రహపీడ బంధువుల వలన బాధలు, గ్రహ వర్గం శని, గృహంలో భాగములు పఠనా మందిరం, దిక్బలం తూర్పు, నివాస ప్రదేశములు జనావాసాలు, చెట్లు ఫలములు లేని చెట్లు, పండ్లు సీమ చింత, ధాన్యం పెసలు, పక్షులు చిలుక, గబ్బిలం, జంతువులు మేక గొర్రె, ఇతర వస్తువులు నగలు, మిశ్ర లోహములు. వస్త్రం తడి వస్త్రం, దేవ వ్ర్గం శైవ, గ్రహ వేదం అధ్ర్వణ వేదం, గ్రహ గోత్య్రం ఆత్రేయ, అర్ధశుభుడు, అవతారం బుద్ధావతారం, గ్రహవర్ణం తాళపత్ర వర్ణం, వారం బుధవారం, మన స్థితి సాత్వికం, బలంగా ఉంటే వాక్చాతుర్యం బుద్ధి జ్ఞానం, ఋషి నారాయణుడు. హోమముకు వాడవలసిన సమిధ ఉత్తరేణి.


లగ్నములో బుధుడు ఉన్న జాతకుడు దీర్ఘాయువు, మృదుమధుర వాక్కులు పలికేవాడు, హాస్యచతురుడు ఔతాడు.

ద్వితీయస్థానమున బుధుడు ఉన్న జాతకుడు స్వశక్తితో ధనమును సంపాదించు వాడు, ఆకర్ష్ణీయంగా మాటాడు వాడు, ప్రస్పుటముగా మాటాడు వాడు, భోజన ప్రియుడు ఔతాడు.

తృతీయమున బుధుడు ఉన్న జాతకుడు ధైర్యశాలి, శౌర్యం కల వాడు, సమ ఆయుషు కలవాడు, మంచిసోదరులు కలవాడు, త్వరితంగా అలసట పొందువాడు ఔతాడు.

చతుర్ధభావమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, హాస్యవిశారదుడు, భూమి కలవాడు, మిత్రులు కలవాడు, ధాన్యసమృద్ధి కలవాడు, ఐశ్వర్యం కలవాడు, సంతోషం కలవాడు ఔతాడు.

పంచమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, సుఖవంతుడు, శైర్యవంతుడు, మంత్రవిద్యాభిలాషి, సంతానవంతుడు ఔతాడు.

ష్టమ భావమున బుధుడు ఉన్న జాతకుడు వివాదాస్పదుడు, క్రోధము కలవాడు, నిష్టుర వాక్కులు పలుకు వాడు, శత్రువులను నాశనం చేయువాడు ఔతాడు.

సప్తమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్యావంతుడు, ఔన్నత్యం కల వాడు, ధనసంపన్నత కలిఉగిన భార్య కలిగిన వాడు, అందమైన వస్తధారణ చేయువాడు ఔతాడు.

అష్టమ స్థానమున ఉన్న జాతకుడు ప్రఖ్యాతి కలిగిన వాడు, చిరంజీవి, కుటుంబానికి అండగా ఉండే వాడు, ప్రభువు లేక సైన్యాధ్యక్షుడు ఔతాడు.

నవమ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు విద్య, ఐశ్వర్యం, సచ్చరిత్ర, ఆచారము, ప్రావీణ్యం, స్వచ్ఛమైన పలుకులు కలిగిన వాడు ఔతాడు.

బుధుడు దశమస్థానమున ఉన్న జాతకుడు మంచి విద్య, సకలకార్య విజయం, శక్తివంతుడు, మేధా సంపన్నుడు, సుఖము కలవాడు, సత్ప్రవర్తన, సత్యవాక్కు పలుకు వాడు ఔతాడు.

ఏకాదశ స్థానమున ఉన్న జాతకుడు చిరంజీవి, సత్యసంధుడు, బహుధనవంతుడు, సుఖజీవి, సేవాజనము కలవాడు ఔతాడు.

ద్వాదశ స్థానమున బుధుడు ఉన్న జాతకుడు కష్టజీవి, విద్యాహీనుడు, నమ్రత కలిగిన వాడు, క్రూరుడు, తేజోహీనుడు ఔతాడు.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

Valueble information


ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం కూడా మరోసారి మననం చేసుకుందాం.


 దిక్కులు : (1) తూర్పు, (2) దక్షిణం, (3) పడమర, (4) ఉత్తరం


మూలలు :(1) ఆగ్నేయం, (2) నైరుతి,(3) వాయువ్యం, (4) ఈశాన్యం


 వేదాలు :(1) ఋగ్వే దం, 

(2) యజుర్వేదం,(3) సామవేదం,

(4) అదర్వణ వేదం


 పురుషార్ధాలు :(1) ధర్మ, (2) అర్థ,

(3) కామ,(4) మోక్షా


 పంచభూతాలు :(1) గాలి, (2) నీరు,

(3) భూమి,(4) ఆకాశం,(5) అగ్ని.


  పంచేంద్రియాలు : (1) కన్ను, 

(2) ముక్కు, (3) చెవి, (4) నాలుక,

(5) చర్మం.


 లలిత కళలు : (1) కవిత్వం,

(2) చిత్రలేఖనం, (3) నాట్యం,

(4) సంగీతం, (5) శిల్పం.


 పంచగంగలు : (1) గంగ, (2)  కృష్ణ,

(3) గోదావరి, (4) కావేరి, 

(5) తుంగభద్ర.


 దేవతావృక్షాలు : (1) మందారం, 

(2) పారిజాతం, (3) కల్పవృక్షం, 

(4) సంతానం, (5) హరిచందనం.


 పంచోపచారాలు : (1) స్నానం,

(2) పూజ,  (3) నైవేద్యం,

(4) ప్రదక్షిణం, )5) నమస్కారం.


  

పంచామృతాలు : (1) ఆవుపాలు,

(2) పెరుగు, (3) నెయ్యి, (4) చక్కెర, 

(5) తేనె.


 పంచలోహాలు : (1) బంగారం, 

(2) వెండి,  (3) రాగి,

(4) సీసం, (5) తగరం.


 పంచారామాలు : )1) అమరావతి,

(2) భీమవరం, (3) పాలకొల్లు,

(4) సామర్లకోట, (5) ద్రాక్షారామం


 షడ్రుచులు : (1) తీపి, (2) పులుపు, 

(3) చేదు, (4) వగరు, 

(5) కారం, (6) ఉప్పు.


అరిషడ్వర్గాలు  షడ్గుణాలు:(1) కామం, 

(2) క్రోధం, (3) లోభం, (4) మోహం,

(5) మదం, (6) మత్సరం.


ఋతువులు : (1) వసంత,(2) గ్రీష్మ,

(3) వర్ష, (4) శరద్ఋతువు, 

(5) హేమంత, (6) శిశిర


 సప్త ఋషులు : (1) కాశ్యపుడు,

(2) గౌతముడు,  (3) అత్రి,

(4) విశ్వామిత్రుడు, (5) భరద్వాజ,

(6) జమదగ్ని, (7) వశిష్ఠుడు.


తిరుపతి సప్తగిరులు : (1) శేషాద్రి,

(2) నీలాద్రి, (3) గరుడాద్రి, 

(4) అంజనాద్రి, (5) వృషభాద్రి, 

(6) నారాయణాద్రి, (7) వేంకటాద్రి.


సప్త వ్యసనాలు : (1) జూదం,

(2) మద్యం, (3) దొంగతనం, 

(4) వేట, (5) వ్యభిచారం, 

(6) దుబారఖర్చు,

(7) కఠినంగా మాట్లాడటం.


 సప్త నదులు : (1) గంగ, 

(2) యమునా,  (3) సరస్వతి, 

(4) గోదావరి,  (5) సింధు,

(6) నర్మద,  (7) కావేరి.

            

నవధాన్యాలు : (1) గోధుమ,

(2) వడ్లు,  (3) పెసలు,

(4) శనగలు, (5) కందులు,

(6) నువ్వులు, (7) మినుములు, 

(8) ఉలవలు, (9) అలసందలు.


నవరత్నాలు : (1) ముత్యం, 

(2) పగడం, (3) గోమేధికం,

(4) వజ్రం, (5) కెంపు, (6) నీలం, 

(7) కనకపుష్యరాగం, 

(8) పచ్చ (మరకతం), 

(9) ఎరుపు (వైడూర్యం).


నవధాతువులు : (1) బంగారం,

(2) వెండి, (3) ఇత్తడి, (4) రాగి, 

(5) ఇనుము, (6) కంచు,

(7) సీసం, (8) తగరం, 

(9) కాంతలోహం.


నవరసాలు : (1) హాస్యం,(2) శృంగార, 

(3) కరుణ, (4) శాంత, (5) రౌద్ర, 

(6) భయానక, (7) బీభత్స, 

(8) అద్భుత, (9) వీర


నవదుర్గలు : (1) శైలపుత్రి, 

(2) బ్రహ్మ చారిణి, (3) చంద్రఘంట,

(4) కూష్మాండ, (5) స్కందమాత, 

(6) కాత్యాయని, (7) కాళరాత్రి, 

(8) మహాగౌరి, (9) సిద్ధిధాత్రి.


 దశ సంస్కారాలు : (1 ) వివాహం, 

( 2 ) గర్భాదానం, (3 ) పుంసవనం , 

(4 ) సీమంతం, (5) జాతకకర్మ, 

(6 ) నామకరణం, (7) అన్నప్రాశనం, 

(8 ) చూడకర్మ, (9 ) ఉపనయనం, 

(10) సమవర్తనం


దశావతారాలు : (1) మత్స్య,

(2) కూర్మ, (3 ) వరాహ,

(4) నరసింహ, (5) వామన, 

(6) పరశురామ, (7) శ్రీరామ,

(8) శ్రీకృష్ణ, (9) బుద్ధ, (10) కల్కి.


జ్యోతిర్లింగాలు :


హిమలయపర్వతం ~ కేదారేశ్వరలింగం .


కాశీ ~ కాశీవిశ్వేశ్వరుడు .


మధ్యప్రదేశ్ ~ మహాకాలేశ్వరలింగం, ఓంకారేశ్వరలింగం. (2)


గుజరాత్ ~ సోమనాధలింగం, నాగేశ్వరలింగం. (2)


మహారాష్ట్ర ~ భీమశంకరం, త్ర్యంబకేశ్వరం,    ఘృష్ణేశ్వరం, వైద్యనాదేశ్వరం. (4)


ఆంధ్రప్రదేశ్ ~ మల్లిఖార్జునలింగం (శ్రీశైలం) 


తమిళనాడు ~ రామలింగేశ్వరం

 

తెలుగు వారాలు : (1) ఆది, (2) సోమ, 

(3) మంగళ, (4) బుధ, (5) గురు, 

(6) శుక్ర, (7) శని.


తెలుగు నెలలు : (1) చైత్రం,

(2) వైశాఖం,(3) జ్యేష్ఠం,(4) ఆషాఢం, 

(5) శ్రావణం, (6) భాద్రపదం, 

(7) ఆశ్వీయుజం, (8) కార్తీకం, 

(9) మార్గశిరం, (10) పుష్యం, 

(11) మాఘం, (12) ఫాల్గుణం.


 రాశులు : (1) మేషం,(2) వృషభం, 

(3) మిథునం, (4) కర్కాటకం,

(5) సింహం, (6) కన్య, (7) తుల, 

(8) వృశ్చికం, (9) ధనస్సు, 

(10) మకరం, (11) కుంభం, 

(12) మీనం.


తిథులు : (1) పాఢ్యమి, (2) విధియ, 

(3) తదియ, (4) చవితి,(5) పంచమి, 

(6) షష్ఠి, (7) సప్తమి, (8) అష్టమి, 

(9) నవమి, (10) దశమి,(11) ఏకాదశి, 

(12) ద్వాదశి, (13) త్రయోదశి, 

(14) చతుర్దశి, 

(15) అమావాస్య /పౌర్ణమి.


నక్షత్రాలు : (1) అశ్విని, (2) భరణి, 

(3) కృత్తిక, (4) రోహిణి, (5) మృగశిర, 

(6) ఆరుద్ర, (7) పునర్వసు, 

(8) పుష్యమి, (9) ఆశ్లేష, (10) మఖ, 

(11) పుబ్బ, (12) ఉత్తర, (13) హస్త, 

(14) చిత్త, (15) స్వాతి, (16) విశాఖ, 

(17) అనురాధ, (18) జ్యేష్ఠ, 

(19) మూల, (20) పూర్వాషాఢ, 

(21) ఉత్తరాషాఢ, (22) శ్రావణం, 

(23) ధనిష్ఠ, (24) శతభిషం, 

(25) పూర్వాబాద్ర, (26) ఉత్తరాబాద్ర, 

(27) రేవతి.


తెలుగు సంవత్సరాల పేర్లు :

(1) ప్రభవ :-

1927, 1987, 2047, 2107


(2) విభవ :- 

1928, 1988, 2048, 2108


(3) శుక్ల :-

1929, 1989, 2049, 2109


( 4 ) ప్రమోదూత :-

1930, 1990, 2050, 2110


( 5 ) ప్రజోత్పత్తి :-

1931, 1991, 2051, 2111


( 6 ) అంగీరస :- 

1932, 1992, 2052, 2112


( 7 ) శ్రీముఖ :-

1933, 1993, 2053, 2113


( 8 )భావ. - 

1934, 1994, 2054, 2114


9యువ.  - 

1935, 1995, 2055, 2115


10.ధాత.  - 

1936, 1996, 2056, 2116


11.ఈశ్వర. - 

1937, 1997, 2057, 2117


12.బహుధాన్య.-

1938, 1998, 2058, 2118


13.ప్రమాది. - 

1939, 1999, 2059, 2119


14.విక్రమ. - 

1940, 2000, 2060, 2120


15.వృష.-

1941, 2001, 2061, 2121


16.చిత్రభాను. - 

1942, 2002, 2062, 2122


17.స్వభాను. - 

1943, 2003, 2063, 2123


18.తారణ. - 

1944, 2004, 2064, 2124


19.పార్థివ. - 

1945, 2005, 2065, 2125


20.వ్యయ.-

1946, 2006, 2066, 2126


21.సర్వజిత్తు. - 

1947, 2007, 2067, 2127


22.సర్వదారి. - 

1948, 2008, 2068, 2128


23.విరోధి. - 

1949, 2009, 2069, 2129


24.వికృతి. - 

1950, 2010, 2070, 2130


25.ఖర. 

1951, 2011, 2071, 2131


26.నందన.

1952, 2012, 2072, 2132


27 విజయ.

1953, 2013, 2073, 2133,


28.జయ. 

1954, 2014, 2074, 2134


29.మన్మద.

1955, 2015, 2075 , 2135


30.దుర్మిఖి. 

1956, 2016, 2076, 2136


31.హేవళంబి. 

1957, 2017, 2077, 2137


32.విళంబి. 

1958, 2018, 2078, 2138


33.వికారి.

1959, 2019, 2079, 2139


34.శార్వారి. 

1960, 2020, 2080, 2140


35.ప్లవ

1961, 2021, 2081, 2141


36.శుభకృత్. 

1962, 2022, 2082, 2142


37.శోభకృత్. 

1963, 2023, 2083, 2143


38. క్రోది.

1964, 2024, 2084, 2144, 


39.విశ్వావసు.

1965, 2025, 2085, 2145


40.పరాభవ.

1966, 2026, 2086, 2146


41.ప్లవంగ. 

1967, 2027, 2087, 2147


42.కీలక. 

1968, 2028, 2088, 2148


43.సౌమ్య. 

1969, 2029, 2089, 2149


44.సాధారణ . 

1970, 2030, 2090, 2150


45.విరోధికృత్. 

1971, 2031, 2091, 2151


46.పరీదావి. 

1972, 2032, 2092, 2152


47.ప్రమాది. 

1973, 2033, 2093, 2153


48.ఆనంద. 

1974, 2034, 2094, 2154


49.రాక్షస. 

1975, 2035, 2095, 2155


50.నల :-

1976, 2036, 2096, 2156, 


51.పింగళ                 

1977, 2037, 2097, 2157


52.కాళయుక్తి         

1978, 2038, 2098, 2158


53.సిద్ధార్ధి              

1979, 2039, 2099, 2159


54.రౌద్రి                 

1980, 2040, 2100, 2160


55.దుర్మతి              

1981, 2041, 2101, 2161


56.దుందుభి             

1982, 2042, 2102, 2162


57.రుదిరోద్గారి         

1983, 2043, 2103, 2163


58.రక్తాక్షి                 

1984, 2044, 2104, 2164


59.క్రోదన                  

1985, 2045, 2105, 216


60.అక్షయ              

1986, 2046, 2106, 2166.


ఈ తరం పిల్లలకు నేర్పించండి. చదివించండి మరియు మనం మరోసారి మననం చేసుకుందాం....

పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు .

 60,65 సంవత్సరాలు దాటిన ఆడ,మగ పెద్దలందరికి విలువైన కొన్ని సూత్రాలు . 

*************************

1) మీరు బాత్రూంలో  వున్నప్పుడు లోపల గడియ పెట్టుకో వద్దు.మీరు లోపల వున్నట్లు తెలియటానికి మీకు వస్తే ఏదైనా కూని రాగాలు పాడుతుండడమో లేకుంటే మీ మొబైల్ తీసుకెళ్లి దాంట్లో  ఏదైనా పాట పెట్టుకోవడమో చేయండి.

2) తడిగాఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ , టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు. అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం.

3) ఫ్యాన్ లు,ఫోటోలు తుడచడానికి గానీ , రిపేరు చేయటానికి గానీ , గుడ్డలు ఆరవేయటానికి గానీ            స్టూళ్ళు , కుర్చీలు, బెంచీలు ఎక్కడం మానుకోండి .

4) కారు గానీ , స్కూటర్  గానీ మీరు ఒంటరిగా నడపడం మంచిది కాదు. ఎవరో ఒకరిని తోడుగా పిలుచుకుని వెళ్ళండి. 

5) మీరు వేసుకునే మందులు ఏమైనా వుంటే డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటికంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం. 

6)మిమ్మల్ని సంతోషపరిచే విషయాలలో గానీ,ఆనందపరిచే విషయాలలో గానీ , 

మనశ్శాంతిగా వుండే  విషయాలలో గానీ వేరే వాళ్ళ ఆలోచనలతో రాజీపడవద్దు. 

7) మీరు ఎక్కడికి వెళ్ళినా అంటే బ్యాంకుకు వెళ్లినా , మార్కెట్టుకు వెళ్ళినా, షాపింగ్ కి  వెళ్ళినా ఇంక ఎక్కడకి వెళ్ళినా మీ సహధర్మచారిణిని (భార్యను)తీసుకవెళ్ళండి.

వాళ్ళూ సంతోష పడతారు. మీకు నిజమై తోడు వాళ్ళే.

8) ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి.     వీలైనంత త్వరగా  మాట్లాడి పంపించేయండి.జాగ్రత్తగా ఉండండి. 

9) ఎప్పుడూ ఇంటి తాళాలు రెండు మెయింటేన్ చేయండి. ఒకటి మీ దగ్గర ,రెండోది మీ భార్య దగ్గర. 

10) మీ బెడ్ రూంలో బెడ్ ప్రక్కనే ఒక కాలింగ్ బెల్ అరేంజ్ చేసుకోండి.ఎప్పుడైనా అవసరం రావచ్చు. 

11) ఇంట్లో వారితోను , బయటి వారితోను 

మాట్లాడేటప్పుడు మర్యాదగా , మృదువుగా మాట్లాడండి . కోపంగాను , రాష్ గాను మాట్లాడుతే మీ మీద గౌరవం పోయి అసహ్యించుకుంటారు.

12) ఎప్పుడు కూడా జరిగిపోయినదాని గురించి గానీ , జరిగేదాని గురించి గానీ, జరుగబోయేదాని గురించి గానీ ఆలోచించ వద్దు. జరిగేది జరుగక మానదు.

13) ఈ వయసులో  మనశ్శాంతి,మంచి ఆరోగ్యం,మంచి బంధుత్వం + మంచి స్నేహితం చాలా ముఖ్యం. 

Note = మీరు వీలు చేసుకుని  + ఓపిక చేసుకుని మీకు తెలిసిన పెద్ద వారికి అందరికి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేయండి.

అద్వైతచైతన్యజాగృతి

 *14- శ్రీ ఆదిశంకరాచార్య విరచితము అపరోక్షానుభూతి*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*శ్లో|| ఏవందేహ ద్వయాదన్య ఆత్మపూరుష ఈశ్వరః |*

*సర్వాత్మాసర్వ రూపశ్చ సర్వాతీతో೭ హోమవ్యయః ||*


*తాత్పర్య వివరణం:-*


*సూల సూక్ష్మ దేహములకంటే అతీతుడను. దేహములకు ప్రేరకుడను, జీవుడనుకాదు. ఈశ్వరస్వరూపుడను, సర్వమునకు అత్మస్వరూపుడను, నాయందే అంతయు కల్పితమైనది గనుక సర్వము నాస్వరూపమే నేను సర్వాతీతుడను అనగా ఈదృశ్య స్వరూపం నాదికాదు. దృశ్యము కంటే నేను వేరు. అధిష్ఠానము కంటే ఆరోపము ఇది వేరు కాదు గనుక నాకంటే ఇది వేరుకాదు. స్వప్రకాశ స్వరూపడను, సాక్షిని అని గ్రహించ వలయును.*




*శ్లో|| ఇత్యాత్మ దేహభాగేన ప్రపంచసైయ వసత్యతా|*

*యథోక్తాతర్కశాస్త్రేణ తతః కింపురుషార్థతా||*


*తాత్పర్య వివరణం:-*


*ఇంతవరకు మూల శ్లోకములను బట్టి ఆత్మ శరీరము కంటే ప్రపంచంకంటే వేరని తేలినది. రెండూ వేరయినప్పుడు ఆత్మవలె ప్రపంచం కూడా సత్యమని చెప్పినట్లయినది. తర్కశాస్త్రము చెప్పినట్లే చెప్పబడినది. దీనివలన మోక్షపురుషార్థ మెట్లు సిద్దించును? అని ప్రశ్నయే ఈ శ్లోకమున కర్థము.*




*శ్లో|| ఇత్యాత్మ దేహభేదేన దేహాత్మత్వం నివారితం|ఇదానీందేహ భేదస్య హ్యసత్వం స్ఫుటముచ్వ తే||*


*తాత్పర్య వివరణం:-*


*ఇంతవరకు దేహదులకంటే ఆత్మవేరని చెప్పడమైనది. అనగా ముందు అనాత్మవస్తు కంటే ఆత్మవేరుగా నున్నదని, పరిశోధన చేయవలెను. తరువాత ఆత్మకంటే అనాత్మ వేరులేదని విచారించవలయును. ఇదియే బ్రహ్మవిచారమునకు లక్షణము. ఇక ఆత్మకంటే దేహము మొదలగు దృశ్యం వేరులేదని చెప్పుచున్నారు.*




*శ్లో|| చైతన్య సై#్యకరూపత్వాద్భేదోయుక్తో నకర్హిచిత్‌ | జీవత్వం చమృషాజ్ఞేయం రజ్ఞౌ సర్పగ్రహోయథా||*


*తాత్పర్య వివరణం:-*


*ఘటము ప్రకాశించుచున్నది అనగా తెలియుచున్నది. పటముతెలియుచున్నది, అని అనుగతమైన అనుభవమునుబట్టి చైతన్యరూపమైన ఆత్మ ఏకరూపమేగాని, నానా రూపమైనది కాదు. చైతన్యరూపులైన జీవులు నానావిధముగా నున్నారు కదా. అంటే తాడుయందు పాము అను భ్రమవలే, పరమాత్మయందు జీవత్వభ్రమ కలిగినది. భ్రమవలన ఏర్పడిన జీవనానాత్వము వల్ల పారమార్థికమగు పరమాత్మ ఏకత్వమునకు విరోధము లేదు. మనముఖం ఒకటి అయినను నూరు అద్దములలో నూరుముఖములు కనిపించును, గాని అద్దములనే ఉపాధుల వలననే నానాత్వము యేర్పడినది. దానివలన ముఖం ఒకటి యనుటలో విరోధంలేదు. ఘటాకాశము మఠాకాశము అని అనేక ఉపాధులలో ఆకాశము ఉపాధి భేధముచేత అనేక ఆకాశములగా కనిపించినను, పరమార్థముగా ఆకాశం ఒకటేగాని నానాకాదు. అటులనే అజ్ఞానకల్పితమైన అంతఃకరణ లనేకములు గనుక ఆయంతఃకరణలయందు పరమాత్మ ప్రతిబింబములే ఆజీవులుగను,ఆజీవులు చాలా మందియున్నను. బింబమైన పరమాత్మ ఒకటియేగాని నానాకాదని అద్వితీయమని ప్రతిబింబ రూపులయిన జీవులందరు బింబమైన పరమాత్మకంటే వేరుకాదు. గనుక ఏకత్వమునకు భంగములేదని గ్రహించవలసిన విషయం.*


🕉🌞🌏🌙🌟🚩

15. వేదాంగములు : శిక్ష*

 *41-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️*

🕉🌞🌏🌙🌟🚩

🔥ఓంశ్రీమాత్రే నమః🔥

అద్వైతచైతన్యజాగృతి

🕉🌞🌏🌙🌟🚩


*15. వేదాంగములు : శిక్ష*


((((((((((🕉))))))))))


*అక్షమాల - జపమాల :-*


*''రుద్రక్షమాల'' అంటే రుద్రాక్షలు కల జపమాల అని అర్థం - రుద్రుని కళ్ల నుండి వచ్చినవి రుద్రాక్షలు అని జనశృతి. ఇక్కడ ''అక్ష'' అంటే 'కన్ను' అని అర్థం. 'అక్షమాల' అంటే ఏమిటి? ఇక్కడ ''అక్ష''ని కన్నుగా అన్వయించుకోవటం తప్పు. ''అ'' నుండి ''క్ష'' వరకూ గల అక్షరాలకి ప్రతీక. సంస్కృతంలో మొదటి అక్షరం ''అ'' చివరిది ''క్ష''. సంపూర్ణతని సూచించటానికి ఇంగ్లీషులో ''A to Z'' అంటారు, సంస్కృతంలో ''అ"కారాది "క్ష" కారాంతః'' అంటారు. అంటే ''అ''తో ఆరంభించి ''క్ష''తో అంతమవటం. అక్షరాలన్నీ కలిపి 50, అందువల్ల అక్షమాలలో 50 పూసలుంటాయి.*



*శబ్దోచ్చారణ యొక్క ప్రాముఖ్యత :- మంత్రపఠనంలో అప్రమత్తత అవసరమని ముందు చెప్పడం జరిగింది. శబ్దోచ్చారణలో పొరపాటు జరిగితే మంత్రం సరియైన ఫలమివ్వకపోగా హానిని గాని, వ్యతిరేక ఫలితాలని గాని ఇస్తుంది. తైత్తిరీయ సంహితలో ఈ విషయాన్ని తెల్పే కథ ఒకటుంది. (2.4.12) త్వష్టుడుకి ఇంద్రునితో వైరం. ఇంద్రుని సంహరించగల కుమారుడు కావాలని కోరుకొంటాడు. అందుకని ''ఇంద్రశత్రుర్వర్ధస్వ'' అన్న మంత్రాన్ని జపిస్తూ ఒక హోమాన్ని చేశాడు. ఈ మంత్రాన్ని సరిగ్గా పఠించే పద్దతిలో పలికితే,''త్వష్టుని కుమారుడు పెరిగి ఇంద్రుని వధించుగాక'' అనే అర్థం వస్తుంది. ఆ శబ్ద ప్రాబల్యం వల్లనే ఆ కుమారుడు పెరిగి ఇంద్రుని వధింప గలిగే వాడు. కాని శబ్దోచ్చారణలో త్వష్టుడు పొరపాటు చేశాడు. అందువల్ల అర్థం తారుమారైంది. అక్షరాలూ, పదాలూ మారకపోయినా స్వరోచ్చారణ దోషం వల్ల, త్వష్టుడు ఆశించిన దానికి సరిగ్గా వ్యతిరేకం జరిగింది. అతని కుమారుని ఇంద్రుడే చంపి వేశాడు. అందువల్ల వృత్రుడన్న అతని కుమారుని వధకు త్వష్టుడే కారణమైనాడు.*



*వేదాలలోని ఈ ఉదంతాన్ని చెప్తూ, సరియైన పద్ధతిలో మంత్రాలని పలకాలంటుంది ఈ శ్లోకం :- ''మంత్రో హీనస్వరతో వర్ణతో వా మిథ్యా ప్రయుక్తో న తమర్థమాహ స వాగ్వజ్రో యజమానం హినస్తి యతేంద్రశత్రుః స్వరతో`òపరాధాత్‌''*


*కొన్ని స్వల్ప భేదాలు :- ఇప్పటి వరకూ వేద శబ్దమెంత శుద్ధంగా ఉండాలో వివరించడము జరిగింది. దీనికి నిదర్శనమిదే; రామేశ్వరం నుండి హిమాలయాల వరకూ భారతదేశంలో ఏ విధమైన సామాజిక సంపర్కమూ లేని ప్రదేశాలలో కూడా వేదాలకి గల పాఠాలని నూటికి తొంభైతొమ్మిది పాళ్లు ఒకే విధంగా అక్షరంగాని పదంగాని వ్యత్యాసం లేకుండా ఉంటాయి. ఇక్కడ వేదాలు ఒక తరం నుంచి మరొక తరానికి లిఖిత పూర్వకంగా కాక, వాక్కు వల్లనే సంక్రమించిన విషయం కూడ గుర్తుంచుకోవాలి.*



*అంటే, స్వల్ప వ్యత్యాస ముందని దీని అర్థమా? అవును, ఉన్నది. ఒక ప్రాంతంలో ఉన్న ప్రతిశాఖకీ మరొక ప్రాంతంలో కల పాఠంలో కొద్ది వ్యత్యాసముంటుంది. ఇది ఆమోద నీయమేనా? ఏ మార్పు ఉన్నా అది విపరీతాలకు దారితీస్తుందని చెప్పిన తర్వాత ఈ 1% వ్యత్యాసం మాత్రమెట్లా సహించటం? శుద్ధమైన రూపము ఒకటే ఉంటే 1%  మార్పుకూడా అనుకొన్న ఫలితాన్నివ్వక పోవచ్చు, వేరొక ఫలితాన్నివ్వవచ్చును. ఈ ప్రశ్నకి సమాధానముంది. మంత్రాలలోని పదాలను మారిస్తే ఫలితం విపరీతమవుతుంది. నిజమే - జబ్బుని కుదర్చటానికి మందుని మార్పు చేస్తే వైద్యం మారినట్టే ఇది కూడ. కాని ఇది రోగికే వర్తిస్తుంది, తనంతట తానే అతడు ఔషధాన్ని మార్చుకో కూడదు, వైద్యుడు మార్చవచ్చు. ఒక వ్యాధిని కుదర్చటానికి ఎన్నో మందు లుంటాయి. అటువంటి సమయాల్లో వైద్యుడు ఒక మందుకి బదులు మరొక దానిని సూచించటంలో తప్పేమీ లేదు. ఒకే జబ్బైనా రోగి దేహస్థితిని బట్టి ఔషధంలోని పదార్థాల మిశ్రమాన్ని కూడ వైద్యుడు మార్చవచ్చు: ఆ విధంగానే ఉద్దేశ పూర్వకంగానే ఋషులు వివిధ శాఖలలోని పదాలను మార్చారు. తమ తరువాత వచ్చేవారు వల్లించటానికి వీలుగా ఈ మార్పు చేయబడింది.*



*''ప్రాతిశాఖ్య'' పాఠాలలో ఈ మార్పులకు సంబంధించిన నియమాలు వివరింపబడ్డాయి. ''ప్రాతిశాఖ్య'' అన్న మాటకి అసలైన అర్థం ''ప్రాంతీయం'' అని. మాటలలోని తేడాలు స్వల్పము - ఆ తేడాలు గణనీయము కావు. సన్నిహిత పదాలు, ఇంచుమించు ఒకే విధంగా ఉచ్చరింపబడే పదాలనే వాడారు. వైదిక శబ్దాలూ - ప్రాంతీయభాషలూ : వేద పదాలలో ప్రాంతీయ భేదాలను దృష్టిలో పెట్టుకొని వివిధ భారతీయ భాషలలో గల తేడాలను గమనిస్తే సాంస్కృతిక భేదాలకు మూలకారణం వైదిక శబ్దాలన్న ఆశ్చర్యకరమైన విషయం బయట పడుతుంది. భాషా శాస్త్ర సంబంధమైన  పరిశోధనలివి.*



*''ద'' ''ర'' ''ల'' ''ళ'' - ఇవన్నీ ఒక దానికొకటి దగ్గరి శబ్దాలు. చిన్న పిల్లవాడిని ''రైలు'' ''రామ'' అనమంటే ''దైలు'' ''దామ'' అంటాడు. ''ద'' ''ర''లకు శబ్దపరంగా సాన్నిహిత్య ముండటమే దీనికి కారణం. ''ద'' ''ర''గా మారగలదు. కనుక 'ల', 'ద'లకు శబ్దపరంగా మారగలదు కదా! ''ల'', ''ళ''లు దగ్గర శబ్దాలు. 'ల'కి, తమిళ శబ్దం ''ళ'' (zha)కి గల సాన్నిహిత్యాన్ని వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కొక్క వేదం బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలనూ, ఆయా భాషల లక్షణాలనూ గమనిద్దాం. ఈ రోజులలో వేదాలు ఆర్యులవనీ, ద్రవిడ సంస్కృతి దానికి భిన్నమనీ ఒక ప్రచారం జరుగుతోంది. కాబట్టి సమిష్టిగా ద్రవిడ ప్రాంతమని చెప్పబడే మూడు ప్రాంతాలను తీసికుందాము. అంటే తమిళం, తెలుగు, కన్నడ భాషలను. సంస్కృతంలో ''ప్రవాల''మనే శబ్దముంది. ఇదే - తమిళంలో ''పవళం'', తెలుగులో ''పగడం'' కన్నడంలో ''హవళ''. ''ప్రవాల'', తమిళంలో 'పవళం' అయింది తెలుగులో 'పగడ'మయింది. 'వ', 'గ'గా మారింది. 'ప్రవాల' కన్నడంలో ''హవళ''గా మారినప్పుడు మొదటి అక్షరమే మారుతుంది.*



 *''ప్ర'' అన్న అక్షరం తెలుగులో, తమిళంలో ''ప''గా మారటం పెద్ద మార్పుకాదు. కాని కన్నడంలో అది ''హ'' అవుతుంది. ఇది ఆ భాష ప్రత్యేక లక్షణం. ఇతర భాషలలోని ''ప'' కన్నడంలో - 'హ'గా మారుతుంది. ''పంప'' ''హంప''గా ఇంకా ''హంపి''గా మారుతుంది. ఆర్య, ద్రావిడ అంటూ రెండు జాతులుగా కాకపోయినా భాషలను సంస్కృతంలో సంబంధమున్న భాషలనీ, కేవలం ద్రావిడ భాషలనీ వర్గీకరిస్తారు. ఇప్పటి పరిశోధనలననుసరించే ఈ వర్గీకరణం. ఇంకా కొంత పరిశోధన జరిగితే ఈ వర్గీకరణ మనకవసరమేమో ననీ, అన్ని భాషలకూ మాతృక ఒకటేనేమోననీ కూడ నిరూపించవచ్చును. పశ్చిమ భారతంలో, కర్నాటకతో సహా, ప్రాచుర్యంలో ఉండేది ఋగ్వేదం. ఋగ్వేదంలో ''ళ'' శబ్దం ఎక్కువ వాడుకలో ఉంది. ద్రావిడభాష అని అందరూ అనుకునే కన్నడలోకి ''ళ'' అట్లా వచ్చింది.*


🕉🌞🌏🌙🌟🚩

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



పరమేశ్వరా ! నీదు పాదముల్ దర్శి0ప

            కిటిరూప మెత్తె నా కేశవుండు

శీర్ష భాగంబైన శిరమును దర్శింప

            హంసగా మారె నయ్యబ్జభవుడు

యిర్వురు వారలు యెంత శ్రమించినా

             హర పద శిరములన్నరయరైరి     

వారి కసాధ్యమై పరగిన కార్యంబు 

          శివ శివా నేనెట్లు చేయ గలను ?             

శ్రీకరా ! నేను నిన్నెట్లు చిత్తమందు

దివ్యమౌ రీతి నిక్కంబు తెలియ గలను ?

తెలియ పరచుము శంకరా ! తెల్లముగను

భక్త వత్సల ! పరమేశ ! పాహి పాహి ! 99 #



భవసేవ మగ్నులౌ బ్రహ్మాది దేవతల్

           స్తుతియించ బడదగు స్తుత్య వరుల

గణనమ్ము సల్పెడి క్షణములందున వారు

            నిను నట్గ్రగణ్యుగా నెంచినారు

మాహాత్మ్యవంతుల మహనీయపురుషుల

           చిద్విచారంబును చేయు నపుడు

ధాన్య పొల్లు పగిది తామంత విడిపోగ

           నికర ధాన్యము వోలె నిల్తు వీవు

ఉత్తమోత్తమ ఫలముగనుండినటుల

           విశ్వ దేవతలెల్ల వేద్యు లైరి

యిందు సత్యేతరము లేదు యిందు మౌళి !

స్తోత్ర మించుక లేదయ్య శోభితాంగ !

సర్వమంగళ దాత ! యో సకలవినుత !

భక్త పరిపాల ! శంకరా ! పాహి పాహి ! 100



                           శుభము

                    మంగళం. మహత్


        ✍️గోపాలుని మధుసూదన రావు🙏

Dance









 

Monkey








 

🙏 *శుభోదయమ్*🙏 🌸 *సుభాషితమ్* 🌸 శ్లో|| విష బీజం భువిన్యస్య కథం స్వాదు ఫలం లభేత్?౹ బీజం రుహ్యా త్తధా పుష్పే త్ఫలే దిత్యవాద చ్చ్రుతి:౹౹ తా|| విష బీజములు భూమిలో నాటి మధురమగు ఫలములు కావలెనన్న యెట్లు దొరుకును? మనుష్యుడు పాపమను బీజములు నాటి (అంటే పాపకర్మలు చేసి) పుణ్యము, మోక్షము ఆశించిన యెట్లు లభించును? ఎటువంటి విత్తనము నాటితే అటువంటి ఫలములే లభించును. *_సేకరణ. ప్రభాకరశర్మ_*


🌸 *సుభాషితమ్* 🌸


శ్లో|| విష బీజం భువిన్యస్య కథం స్వాదు ఫలం లభేత్?౹

బీజం రుహ్యా త్తధా పుష్పే త్ఫలే దిత్యవాద చ్చ్రుతి:౹౹


తా|| విష బీజములు భూమిలో నాటి మధురమగు ఫలములు కావలెనన్న యెట్లు దొరుకును? మనుష్యుడు పాపమను బీజములు నాటి (అంటే పాపకర్మలు చేసి) పుణ్యము, మోక్షము ఆశించిన యెట్లు లభించును? ఎటువంటి విత్తనము నాటితే అటువంటి ఫలములే లభించును.


*_సేకరణ.   ప్రభాకరశర్మ_*