15, అక్టోబర్ 2021, శుక్రవారం

నవావరణ పద్యార్చన*

 *శ్రీ ప్లవ - శరన్నవరాత్రులు - నవావరణ పద్యార్చన*

           రచన: శ్రీశర్మద - స్వర్ణపురి (పొన్నూరు)



ఆశ్వయుజ శుక్ల దశమి: ది.15-10-2021

శార్దూలము: 19. *విజయదశమి*

ఈ గేస్తుల్ తమ సాధనావిధమునన్ హ్రీంబీజసంసేవలో

రాగంబొప్పగ మున్గిదేలుచు సదా లక్ష్యార్థచిత్తాత్ములై

భోగంబన్నను నీదు సేవ యనుచున్ ముమ్మాటికిం దల్తురే

క్రీగంటన్మము జూడుమా! జయమగున్ హ్రీంకారసింహాసినీ!

                               (((0)))

కామెంట్‌లు లేవు: