🌹శ్రీకాళహస్తీశ్వరమ్🌹
శ్రీకరంబగు దివ్య చిత్కవిత్వశ్రీల
మెఱుపు తీగల చేత మించిగూడి
జనన మరణ యుక్త సంసార ఘన వర్ష -
ధారల వేగాన తల్లడిల్లి
నా మనః పద్మమ్ము నవవికాసత్వమున్
గోల్పోయె పూర్తిగా క్రుంగి పోతి
సర్వేశ్వరా ! నీదు సత్కరుణామృత
సత్త్వ శరత్కాల సమయమింక
కొంచమైనను నామీద కూర్మి మీర
జాలు వారిన చాలును సర్వవినుత !
మదిని కలిగిన సద్భక్తి మహిమ చేత
సతము తామర తంపరై సాగు బ్రతుకు.
ప్రణతి శ్రీకాళహస్తీశ్వరా ! మహేశ ! 01*
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి