🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
. *🌹వేమన పద్యములు🌹*
. *అర్థము - తాత్పర్యము*
. *Part - 6*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
*💥వేమన పద్యాలు-- 13*
*అంజనంబు కనుల కంటించి చూచిన*
*సొమ్ము దొరకు భువిని సూత్రముగను*
*నమ్మి గురుని కరుణ నభమంటి చూడరా*
*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*
*🌹తాత్పర్యము --*
అంజనం వేసి చూస్తే సొమ్ములు దొరకవచ్చును గానీ దైవకృప గాంచలేడు కదా !
*💥వేమన పద్యాలు -- 14*
*అంజనంబు బెట్టి యాత్మలో ద్రవ్యంబు*
*గనగలేని ఘనత కడగి ఎరిగి*
*ఆశదప్పినప్పు డతడెపో ఘనయోగి*
*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*
*🌹 తాత్పర్యము --*
ఆశాపాశముతో మానవ జన్మను వృధా చేసుకొనరాదు.
ఆశ వీడిన వాడే యోగిగా చలామణియై ఘనతను పొందుతాడు.
*💥వేమన పద్యాలు -- 15*
*ఆంటి యంటకుండు నమల స్వరూపమై*
*మింటి మంటి నడుమ మెలగు దాని*
*నొంటి స్థంభమందు జంటించి చూడరా*
*విశ్వదాభిరామ రామ వినుర వేమా !*
*🌹తాత్పర్యము --*
మనిషి తావన్మాత్రముగా ఆంటీ ముట్టనట్లుండి స్వచ్ఛమైన మనసుతో ప్రవర్తించిన , ఏకేశ్వరోపాసన చేసిన మోక్షము తప్పకుండా కలుగును.
*పార్వతీపరమేశ్వరుల దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ శుభరాత్రి*
*సర్వేజనా సుఖినోభవంతు*
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి