3, ఫిబ్రవరి 2024, శనివారం

భాగవతము

 🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

*🌹పోతనామాత్యులవారి భాగవతము నందలి ఆణిముత్యాలు🌹*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

**తృతీయ స్కంధము*


*అనయమును భువనరక్షణ*

*మునకై స్వేచ్ఛానురూపమున పుట్టెడి వి*

*ష్ణుని భయవిరహితమగు పద*

*వనజయుగం బర్థి కొల్తు వారనిభక్తిన్*


ఆ శ్రీ మహావిష్ణువు ఎల్లకాలాలలో లోకాలన్నింటినీ కాపాడటంకోసం తన యిష్టాన్ని బట్టి అవతరిస్తూ ఉంటాడు. ఆ మహాత్ముని పాదాలు పద్మాలవంటివి. వానిని ఆశ్రయిస్తే సంసారభయం తొలగిపోతుంది. నిశ్చలమైన భక్తితో ఆ పాదపద్మాలను నేను పూజించుకొంటూ ఉంటాను.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

కామెంట్‌లు లేవు: