18, అక్టోబర్ 2020, ఆదివారం

 16-09-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


ఏతాం దృష్టి మవష్టభ్య నష్ణాత్మానోఽల్పబుద్ధయః | 

ప్రభవన్త్యుగ్రకర్మాణః 

క్షయాయ జగతోఽహితాః || 


తాత్పర్యము:- ( అసురస్వభావము కలవారు) ఇట్టి నాస్తికదృష్టిని అవలంబించి చెడిన మనస్సుగలవారును, అల్పబుద్ధితో గూడియున్నవారును, క్రూరకార్యములను జేయువారును, ( జగత్తునకు) శత్రువులును (లోకకంటకులును) అయి ప్రపంచముయొక్క వినాశముకొఱకు పుట్టుచున్నారు.


వ్యాఖ్య:- "నష్టాత్మానః" అను ఈ పదముచే నాస్తికదృష్టి, కామస్వభావములు కలవారి మనస్సు తప్పకచెడిపోగలదని స్పష్టమగుచున్నది. మఱియు అట్టివారిబుద్ధి అల్పముగనే యుండును కాని విశాలముగా నుండదనియు తెలియుచున్నది. వారిది హ్రస్వదృష్టి.  విశాలదృక్పథము, విశాలదృష్టి వారికి ఉండదు. ఇవ్విధముగ నాస్తికత్వము, కామదృష్టి చిత్తవినాశకరములగుటచే త్యాజ్యములని పై భగవద్వాక్యముల వలన ఋజువగుచున్నది. మఱియు నాస్తికులు, కామమే సర్వస్వమని, సృష్టికి మూలమని తలంచు అవివేకులు తమను గొప్పగా తలంచుకొనినను భగవద్దృష్టిలో, పెద్దల దృష్టిలో వారు “అల్పబుద్ధులే” యని తేలుచున్నది.


“క్షయాయ జగతః” - జగత్తుయొక్క నాశముకొఱకే వారి పుట్టుక కాని ఉద్ధారముకొఱకుగాదు. పరప్రాణులను హింసించుటయే వారిపని గాని, వారికి ఉపకారము చేయుటగాదు. వారు లోకకంటకులేకాని, లోకహితులుకారు. వారు "కబంధులే” కాని లోకబంధువులుకారు. వెయ్యేల, అట్టివారు భూమికి భారభూతులే యగుదురు. 


ప్రశ్న: - అసురస్వభావముకలవారి లక్షణములను మఱికొన్నింటిని పేర్కొనుము?

ఉత్తరము:- (1) (ఇట్టి) నాస్తికదృష్టి నవలంబించి మనస్సును చెడగొట్టుకొందురు (2) స్వల్పబుద్ధి గలిగియుందురు (3) క్రూరకర్మలు చేయుదురు (4) లోకకంటకులై వర్తించుదురు (5) జగత్తు యొక్క క్షయమునకే జన్మించుదురు.

 

చిత్తాయత్తం ధాతుబద్ధం శరీరం

నష్టే చిత్తే ధాతవో యాన్తి నాశమ్,

తస్మాచిత్తం సర్వదా రక్షణీయం

స్వస్థే చిత్తే బుద్ధయః సంభవన్తి.



సప్తధాతువులతో ఏర్పడిన శరీరం చిత్తం మీద ఆధారపడి ఉన్నది. చిత్తం పాడవుతే ధాతువులు నశిస్తాయి. అందుచేత చిత్తాన్ని ఎల్లప్పుడూ రక్షించుకోవాలి. చిత్తం స్వస్థం (ఆరోగ్యం)గా ఉంటే సద్బుద్ధులు పుడతాయి.


శుభోదయము !:

 *శుభోదయం*      

           

           *మనిషన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలనుకుంటాడు కాని*

           *మనసున్నవాడు కష్టాల్లో ఉన్న వారికి దగ్గర ఉండాలనుకుంటాడు.*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

 సభా పర్వము -6

ద్రౌపది వస్త్రాపహరణం

అలా దుర్యోధనుడు అడిగేసరికి తప్పని సరి పరిస్థితిలో ధృతరాష్ట్రుడు విదురునితో ” విదురా! మనము ఒక సభ నిర్మించాము కదా దానిని చూడటానికి ధర్మరాజుని అతని తమ్ములతో ఆహ్వానించి నీతో తీసుకుని రా. పొద్దు పోవడానికి దుర్వోధనునితో జూదం ఆడుతాడు ” అన్నాడు. విదురుడు జూదం అనర్ధమని ఎన్ని మార్లు చెప్పినా ప్రయోజనం లేక పోయింది. ఇక తప్పదని ఇంద్రప్రస్థానికి వెళ్ళాడు.

ధర్మరాజు విదురుని సాదరంగా ఆహ్వానించాడు. విదురుని రాకకు కారణం తెలుసుకున్న ధర్మరాజు విదురునితో ” విదురా ! మా పెదనాన ఆహ్వానం మన్నించి నీ వెంట వస్తాము . సభను చూస్తాము కానీ జూదం తగునా జూదం వలన విభేదాలు వస్తాయి. అయినా దృతరాష్ట్రుని ఆజ్ఞ మాకు శిరోధార్యము . అందుకని మీతో వస్తాము ” అన్నాడు. హస్థినాపురంలో కుమారులతోను భీష్ముడు, ద్రోణుడు, శల్యుడు , శకుని, అశ్వత్థామ, సైంధవుడు మొదలైనవారితో ఉన్న దృతరాష్ట్రుడికి, భానునుమతి మొదలైన కోడళ్ళతో ఉన్న గాంధారి కి ధర్మరాజాదులు నమస్కరించారు. ద్రౌపది సౌందర్యానికి గాంధారి కోడళ్ళకు ఆశ్చర్యంతో కూడిన అసూయ చెందారు. దుర్యోధనునితో కలసి పాడవులు సభను తిలకించి సుఖానుశీనులైనారు.

ఆ సమయంలో దుర్యోధనుడు ” ధర్మజా! కొంచెం సేపు జూదం ఆడతాము. నీకు జూదం ఆడటంలో ఆసక్తి ఉంది కదా ” అన్నాడు. ధర్మరాజు ” సుయోధనా ! జూదం అందులో మోసపూరిత జూదం క్షత్రియ ధర్మం కాదు. రాజులు జూదం ఆడుట ధర్మం కాదు. కుటిలులతో జూదం తగదు. దాని వలన ఎంతటి వారైనా సంపద కోల్పోతారు. ధర్మ జూదంలో గెలవడం పుణ్యం , కపట జూదంలో గెలవడం పాపం ” అన్నాడు. శకుని ” జూదంలో నేర్పరులు, లోకజ్ఞానం కలవారు, సుక్షత్రియులు, రాజనీతి తెలినవారు జూదాన్ని నిందించటం తగదు. బలహీనులు బలవంతులను ఓడించటానికి మాయలు పరిపాటి కదా. నీకు భయమైతే వద్దు ” అన్నాడు. ధర్మరాజు ” బలవంతంగా జూదానికి పిలువబడ్డాము. ఆడక తప్పుతుందా. ఇక మాటలెందుకు కానివ్వండి ” అన్నాడు. ధర్మరాజు ” మీలో నాతో ఎవరు జూదం ఆడుతారు ” అని అడిగాడు. దుర్యోధనుడు ” ధర్మజా! నా తరఫున శకుని జూదం ఆడతాడు అతడు ఓడిన ధనరాశులు నీవి ” అన్నాడు. ధర్మరాజు ” ఒకరి కోసం ఒకరు ఇది అక్రమం ” అనుకున్నాడు. చేసేది లేక తన చేతి రత్నఖచిత కంకణాన్ని ఫణంగా పెట్టాడు. జూదం స్నేహపూరితంగా జరుగుతున్నది. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, విదురుడు వికల మనస్కులై చూస్తున్నారు.

శకుని తనకోసం చేయించుకున్న ప్రత్యేక పాచికలతో జూదం ఆడి గెలుస్తున్నాడు. ధర్మరాజు లో పంతం పెరిగింది. ఒకటి తరువాత ఒకటిగా ఒడ్డుతూ ఓడుతున్నాడు. బంగారు బండాగారాలు, వజ్రాల బండాగారాలు, రత్నబండాగారాలు, బంగారు నిధులు, అశ్వములు, ఏనుగులు, సేవకులు, దాసదాసీ జనాలు, గూవులు, సేనావాహిని, అన్నింటినీ ఓడి పోయాడు. ఇది చూసి విదురుడు దృతరాష్ట్రునితో ” దుర్యోధనుడు పాపాత్ముడు కురు వంశం పాపంతో నిండపోతుంది. దుర్యోధనుని నివారించు. ధర్మాన్ని రక్షించు. వినాశనాన్ని ఆపించు. దుర్యోధనుని బహిష్కరించు. అతడు బలవంతులతో యుద్ధానికి కాలుదువ్వుతున్నాడు. జూదాన్ని ఆపు ఉపేక్షించకు ” అన్నాడు. పుత్రుల మీద మమకారంతో ధృతరాష్ట్రుడు మిన్నకున్నాడు. విదురుడు దుర్యోధనునితో ” సుయోధనా ! నువ్వు ఈ ప్రకారంగా శకుని సహకారంతో పాండవులను కొల్లగొడుతుంటే ప్రజలు ఛీ కొట్టరా ? ఇలా మోసం చెయ్యటం మంచిదా ” అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి కోపంతో ” నువ్వు ఎప్పుడూ పాండవుల పక్షాన మాట్లాడతావు. నువ్వు మా ఇంట్లో ఉంటే విష సర్పం ఉన్నట్లే. శత్రువుల సంపదను సులభ మార్గంలో అపహరించడం రాజధర్మం. కనుక మాకు బుద్ధులు చెప్పద్దు ” అని దూషించాడు. శకుని ధర్మరాజు తో ” ధర్మజా! నీవు నీ సంపదనంతా పందెంలో ఒడ్డి ఓడావు. తరువాత పందెం ఏమిటి ” అన్నాడు. అప్పటికే ధర్మరాజు జూదానికి బానిస అయ్యాడు. తన సమస్త రాజ్యాన్ని ఒడ్డి ఓడిపోయాడు. తరువాత బ్రాహ్మణులకు, దేవాలయాలకు ఇచ్చిన భూములు తప్ప మిగిలిన ఆస్తులను ఒడ్డి ఓడిపోయాడు. తన తమ్ములను ఒడ్డి ఓడిపోయాడు ఆఖరున తనను తాను ఓడ్డుకున్నాడు. అప్పుడు శకుని ” ధర్మజా ! అదేమిటి నిన్ను నీవు ఒడ్డుకున్నావు. నీ వద్ద ఒడ్డడానికి మరొక ధనం ఉంది మరిచి పోయావా ? నీ భార్య ద్రౌపది నీ ధనం కాదా?” అని ఎత్తి పొడిచాడు. అప్పుడు పాచికలు అందుకున్న ధర్మరాజు ద్రౌపది ని ఫణంగా పెట్టి ఓడి పోయాడు. అప్పుడు ఆట చాలించాడు.

ఇదంతా చూస్తున్న భీష్మునకు నోట మాటరాలేదు. విదురుడు దుఃఖిస్తున్నాడు. కర్ణుడు, సైంధవుడు ఆనందంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పడు ధృతరాష్ట్రునికి తెలివి వచ్చింది. ” విదురా! ఏమైంది? ఎవరెవరు ఏ పందాలు ఒడ్డారు?” అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు విదురుని చూసి ” నా ఇల్లు తుడవటానికి దాసి ద్రౌపదిని పిలుచుకురా ” అని ఆజ్ఞాపించాడు. విదురుడు ” ఛీ నీవంటి మూర్ఖుడు లేడు. ఇలాంటి పనికి నన్ను పంపుతారా. ద్రౌపది ఎవరు ? సమస్త భూమండలానికి పట్టమహిషి. ఆ సాధ్విని అవమానిస్తారా ! ” అని అడిగాడు. సుయోధనుడు ప్రాతిగామి అను సూతనందనుని పిలిచి ” నీవు పోయి ద్రౌపదిని సభకు తోడ్కొని రా ” అన్నాడు. ప్రాతిగామి ద్రౌపది వద్దకు పోయి ” అమ్మా ! ధర్మరాజు జూదంలో సమస్త సామ్రాజ్యాన్ని, తమ్ములను, తనను, నిన్ను ఓడిపోయాడు. దుర్యోధనుడు నిన్ను సభకు తీసుకురమ్మని నన్ను పంపాడు. పదమ్మా పోదాము ” అన్నాడు. అప్పుడు ద్రౌపది ” అయ్యా! ఏ యుగంలోనైనా ఇలాంటి చెడ్డ జూదగాడు ఉంటాడా ? ధర్మరాజు ఇలా చేసాడా? తనను కూడా ఓడాడు అంటున్నావు. తన్నోడి నన్నోడెనా ? నన్నోడి తన్నోడెనా ? తెలుసుకుని వచ్చి నన్ను తీసుకు పో ” అన్నది. ప్రాతిగామి తిరిగి వచ్చి ఇదే విషయం అడిగాడు. ” ఇది సమాధానం చెప్ప వీలులేని విషయం. ఇక్కడికే వచ్చి అడగమను. నీవుపోయి ద్రౌపది ని తీసుకు రా ” అని పంపాడు. ప్రాతిగామి ద్రౌపది వద్దకు పోయి ” అమ్మా! నీవు అడిగిన విషయం తెలుసుకోవడానికి నిన్ను అక్కడికి రమ్మన్నారు ” అన్నాడు. చేసేది లేక ద్రౌపది ఏకవస్త్రంతో సభకు వచ్చింది. దృతరాష్ట్రుని పక్కన నిలబడింది. ద్రౌపది దుస్థితి చూడలేక పాండవులు తలలు వంచుకున్నారు.

అప్పుడు దుర్యోధనుడు దుశ్శాశనుని చూసి ” నీవు పోయి ద్రౌపదిని ఇక్కడికి తీసుకు రా ” అన్నాడు. ద్రౌపది ఒక్క పరుగున గాంధారి పక్కకు పోయి నిలబడింది.

దుశ్శాసనుడు ద్రౌపదితో ఎక్కడికి పోతావు నిన్ను శకుని జూదంలో గెలిచాడు. నువ్వు దుర్యోదనుని సొత్తు అయినావు ” అంటూ దగ్గరికి వచ్చాడు. ” అయ్యా నేను రజస్వలను. ఏకవస్త్రను. నన్ను ముట్టవద్దు. సభకు రాలేను ” అన్నది. దుశ్శాసనుడు నవ్వి ” ఏకవస్త్రవైనా విగత వస్త్రవైనా రాక తప్పదు. నేను నిన్ను తీసుకు పోతాను ” అంటూ దుశ్శాసనుడు ద్రౌపది కురులు పట్టుకుని ఈడ్చుకుంటూ సభకు తీసుకు వచ్చాడు. ద్రౌపది కురువంశ పెద్దలను చూసి ” అయ్యా! దుశ్శాసనుడు నన్ను ఈ సభకు ఈడ్చుకు వచ్చాడు. మీరందరూ చూస్తుండగా అవమానించాడు. అధర్మం పెరిగి పోయింది ” అని అంటూ భయంతో మనసులో శ్రీకృష్ణుని ధ్యానించింది. భీముడు ధర్మరాజు ని చూసి ” ఓ ధర్మజా! ఈ రాజ్యం, నీ తమ్ములు నీ వశంలో ఉన్నాము కనుక జూదంలో ఒడ్డావు. దృపదరాజ పుత్రిని జూదంలో పెట్టడం తగునా ? అందు వలన ద్రౌపది అవమానాల పాలైంది. జరుగుతున్నది అధర్మ జూదమని తెలిసి నువ్వు జూదం ఆడావు. నీ చెయ్యి కాల్చాలి కదా ” అర్జునుడు ” అన్నయ్యా ! స్నేహంగా ఆడుకునే జూదానికి , ధర్మయుద్ధానికి పిలిస్తే పోవడం రాజధర్మం. అందుకనే ధర్మరాజు ధర్మం పాటించి ఆడాడు కాని విధి వైపరీత్యానికి ఏమి చేస్తాం ? ” అన్నాడు.

దుర్యోధనుని తమ్ముడు వికర్ణుడు ” ఈ సభలో ఉన్న కురువృద్ధులు , గురువులు, పెద్దలు అందరూ మౌనంగా ఉన్నారు. మిగిలిన వారైనా ధర్మం చెప్పండి. ఆలోచించండి ఇక్కడ జరుగుతున్నది ధర్మమా ? ” అన్నాడు. ఎవరూ బదులు చెప్పక పోవడం చూసి వికర్ణుడు ” నేను ఇక్కడ ధర్మనిర్ణయం చేస్తాను. జూదం, వేట, మద్యపానం, అతిగా తినడం దుర్వ్యసనాలు. వీటి వలన మానవులు ధర్మం తప్పి ప్రవర్తిస్తారు. అలాంటి వారు చేసే పనులు లెక్కలోకి రావు. ఒక జూదరి చేత పిలువబడిన వ్యసనపరుడైన మరో జూదరి ధర్మరాజు పాండవుల ఉమ్మడి ధనమైన ద్రౌపది ని ఫణంగా పెట్టి ఆడి ఓడడం ధర్మం కాదు. పైగా ఏకవస్త్రను సభకు తీసుకు రావడం అన్యాయం ” అన్నాడు.

కర్ణుడు వికర్ణుని చూసిన కర్ణుడు ” ఎందుకీ అధిక ప్రసంగం ? చిన్నవాడివి ధర్మం గురించి నీకేమి తెలుసు. ఇంత మంది పెద్దలు ఉండగా ధర్మ నిర్ణయం చెయ్యడం నీకు తగదు. ద్రౌపది ధర్మరాజు ధనం. కనుక ధర్మ విజిత. లేకుంటే పాండవులు అంగీకరిస్తారా. పెక్కు మంది భర్తలు కలిగిన ద్రౌపది బంధకి. అలాంటి వారిని ఏకవస్త్రగానే కాదు. విగత వస్త్రగా తెచ్చినా అధర్మం కాదు ” అన్నాడు. దుర్యోధనుడు ఇలా అన్నాడు ” కర్ణుడు బాగ చెప్పాడు. దుశ్శాశనా ! ద్రౌపది పాడవుల వస్త్రాలు తీసుకో ” అన్నాడు. దుశ్శాసనుడు ఇది ధర్మం కాదు అని ఆలోచించక ద్రౌపది కట్టుకున్న చీరను లాగాడు. విచిత్రంగా ద్రౌపది నడుముకు ఉన్న చీర నడుము భాగాన్ని వదలలేదు. లాగుతుంటే అలాంటి వస్త్రాలు వస్తూనే ఉన్నాయి. విప్పిన చీరలు గుట్టలుగా పడ్డాయి కాని ద్రౌపది నడుముకు చీర అలాగే ఉంది. ఇది చూసి దుశ్శాసనుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఇది చూసి భీముడు ఆగ్రహంతో ” కురువృద్ధులు, బంధువులు సభాసదులు చూస్తుండగా ద్రౌపది ని ఇలా అవమానించిన దుశ్శాశనుని సుయోధనుడు చూస్తుండగా యుద్ధ భూమిలో ఘోరంగా చంపి అతని రక్తం దోసిలి పట్టి తాగకుంటే నేను నా పితృ పితామహులకు పుట్టలేదు ” అని భీముడు భీకర ప్రతిజ్ఞ చేసాడు. సభలోని వారు ” కుమారుడి మీద ప్రేమతో ధృతరాష్ట్రుడు ద్రౌపది అడిగిన దానికి ఉపేక్షించాడు ” అని అనుకున్నారు.

 రామాయణమ్ 151

..............

ఎదో స్వరము దీనముగా వినపడుతున్నది ,

అది ఎవరిదో ఆర్తనాదమే !

 అవును! ఆ స్వరము నా నాధుడిదే !

ఏమి ఆపదలో చిక్కుకున్నాడో ఏమో,

 పాపము ఆమె హృదయము తల్లడిల్లిపోయింది .

.

వెంటనే లక్ష్మణునితో " నీవు వెళ్లి రామునికి ఏమైనదో తెలుసుకోనిరా !" అని పలికింది సీతమ్మ.

.

ఆ అరుపులు సింహము నోట్లో చిక్కి విలలవిల లాడుతూ రక్షించమని అంబారవములు చేసే ఎద్దు దీనాలాపములుగా ఉన్నవి ,.

.

నా ప్రాణము హృదయము పరితపిస్తున్నాయి 

రామునికి ఏ ఆపద వచ్చినదోయని .

నీ సోదరుడు రక్షణ కోరుతున్నాడు .

నీవు త్వరగా వెళ్ళు అని సీత మరలమరల పలికింది .

.

సీత అంతగా చెప్పినప్పటికీ లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞకు బద్ధుడై అంగుళము కూడా కదలలేదు.

.

సీత కుపితురాలైంది.

 ఒక ప్రక్క తన భర్తకు ఏమైందో అన్న ఆందోళన ఆమెలోని ఆలోచనను, విచక్షణను కోల్పోయేలా చేసింది ,

.

లక్ష్మణా! నీకు నామీద గల కోరిక చేత నీ అన్నకు వచ్చిన ఆపదను పట్టించుకోవటములేదు.

.

నీవు మిత్రుడి రూపములో ఉన్న శత్రువు ,ఆ విషయము నీ అన్న తెలుసుకోలేకపోయాడు .నీకు నా మీద ఆశ ఉండుట చేత అన్నకు కష్టము వచ్చినప్పటికీ అడుగు ముందుకు వేయడములేదు ,ఆయనకా కష్టము కలగాలనే నీవు కోరుకొంటున్నావు.

.

ఇప్పుడు రాముడు కష్టాలలో ఉన్నాడు ఆయనను రక్షించడమే నీ  ప్రధాన కర్తవ్యము నన్ను రక్షించడము కాదు .

.

అని ఒక ఉన్మాదినిలాగా మాట్లాడుతున్న సీతను చూసి ,

.

ఓ సీతా ! రాముడంటే ఏమనుకున్నావు  పరాక్రమము లో ఆయన సాటి నిలువగల వారు మూడులోకాలలో ఎవరూ లేరు .

.

పన్నగ,గంధర్వ,అసుర,మానవ ,దేవతా గణాలలో నీ భర్తను జయించగలవారేవ్వరూ లేరు. .

.

రాముణ్ణి యుద్ధములో జయించగలగటము కలలో కూడా జరుగని పని.

.

నీవు ఈ విధముగా మాటలాడటము తగదు '

.

నిన్ను ఒంటరిగా ఈ అడవిలో విడిచి వెళ్ళను ఇది రామాజ్ఞ.

.

నిన్ను నా రక్షణలో ఉంచి ఆయన వెళ్ళాడు .

.

నీవు విన్నది రాముని స్వరము కాదు అది మాయావులైన రాక్షసుల పని . 

అది ఒక ఇంద్రజాలము.

.

ఖరుడితో మనకు కలిగిన వైరము ,అతనిని సంహరించడము వలన మన మీద ప్రతీకారము తీర్చుకొనుటకు రాక్షసులు పన్నిన ఎదో పన్నాగమది .

.

అని పలికి నిలుచున్నాడు రామానుజుడు.

.

రామాయణమ్ 152

..........

తను ఆ విధముగా ఆందోళన పడుతూ మాట్లాడినప్పటికీ ఏమీ పట్టించుకోకుండా స్థిమితముగా ,నిమ్మకు నీరేత్తినట్లున్న లక్ష్మణుని చూసి ఆవిడకు వళ్ళు మండిపోయింది .

.

చాలా కోపముతోఎర్ర బడ్డ  కళ్ళతో ,

.

నీవు కులములో  చెడబుట్టావు ,మనసులో దుష్టపు ఆలోచనతో రాముడి ఆపద గురించి ఏ మాత్రమూ ఆలోచించటము లేదు .ఆయనకు ఆవిధముగా జరగాలని కోరుకుంటున్నావు అని గట్టిగా అరిచింది సీత

.

పాపపు అభిప్రాయాలు కడుపులో పెట్టుకొని రహస్యముగా ప్రవర్తించే నీ వంటి వాడు మిత్రుడి రూపము లోని  శత్రువు.

.

దుష్టబుద్దివి నీవు ,భరతుడిచే ప్రేరేపింపబడి మమ్ములను అనుసరిస్తూ వస్తున్నావు .ఇది నీ పన్నాగమైనా ,భరతుడి పన్నాగమైనా ,మీ కోరిక సిద్ధించదు .ప్రాణాలైనా నేను తీసుకుంటాను కానీ మీకెప్పటికీ వశము కాను. 

.

ఉన్మాదినిలా మాట్లాడుతున్న ఆవిడ మాటలు విని 

 ఇంద్రియ నిగ్రహ వంతుడైన లక్ష్మణుడు అంజలిఘటించి నమస్కరిస్తూ , 

.

సీతా ! నీ మాటలకు బదులు చెప్పటము నా కిష్టము లేదు నీవు నాకు దైవము . ఈవిధముగా మాటలాడటము స్త్రీ సహజ లక్షణమే !జనకుని కొమరితవైన ఓ సీతా పదునైన బాణముల వంటి నీ పలుకులు ములుకులలాగా నా హృదయాన్ని పీడిస్తున్నాయి సహించలేకున్నాను .

.

స్త్రీవైన నీవు అన్నగారి ఆజ్ఞ పాటించుచున్న నన్ను అనరాని మాటలంటున్నావు ,ధర్మవిరుద్ధముగాప్రవర్తిస్తున్నావు .

అందుకు ఈ వన దేవతలే సాక్షి !  

.

ఛీ ! నీ విప్పుడు నశించెదవుగాక!

.

నేనిప్పుడే రాముడున్న చోటికి వెళ్లేదను ,ఇప్పుడు అగుపడుతున్న శకునాలు చూడబోతే నేను మరల నిన్ను తిరిగి చూస్తాననే నమ్మకము కలగటము లేదు అని బాధ నిండిన హృదయముతో పలికిన లక్ష్మణుని చూసి ,

.

రాముడు లేకపోతే నేను ఇప్పుడే ఇదుగో ఈ గోదావరిలో దూకిచస్తాను ,లేదా ఉరి వేసుకుంటాను ,లేదా అదుగో ఆ కనపడుతున్న ఎత్తైన గిరిశిఖరము మీదనుండి దూకి చస్తాను అని పలికింది సీత.

.

విషమైనా త్రాగుతాను ,అగ్నిలో దూకనైనా దూకుతాను కానీ అన్యుడైన పరపురుషుని పాదములతోనైనా తాకను.అని అంటూ గుండెలు బాదుకొంటూ ఏడుస్తున్నది సీత.

.

ఆవిడను ఓదార్చడానికి విఫల యత్నము చేసి తనవల్లగాక ఆవిడకు అభివాదము చేసి మాటిమాటికీ వెనుదిరిగిచూస్తూ విడిచిపెట్టలేక ,విడిచిపెట్టలేక రాముడి కొరకు అడవిలోకి పయనమయ్యాడు సుమిత్రా నందనుడు.

రామాయణమ్ 153

.............

పాపమా పిచ్చితల్లి ఒంటరిగా భర్తనుగురించిన తలపులతో ఆయనకు ఏ  ఆపద వాటిల్లినదో అనే భీతితో తల్లడిల్లిపోతూ దిగులుగా కూర్చొని ఉన్నది .

.

ఇంతలో ఆ పర్ణశాల ముందు వేదఘోష చేసుకుంటూ .  .అత్యంత మృదువైన కాషాయ వస్త్రము ధరించి ,శిఖను,ఛత్రమును,పాదుకలను ధరించి ,మంగళకరమైన దండ కమండలములను ఎడమ భుజానికి తగిలించుకొని  ఒక సన్యాసి వస్తున్నాడు.

.

అతడు మారు వేషములో వచ్చిన సర్వలోక భయంకరుడైన రావణుడు .

.

చంద్ర సూర్యులు లేని సంధ్యను అంధకారము ఆవరించినట్లు ఆమె సమీపములోకి వచ్చాడు రావణుడు.

.

ఆతని చూడగానే జనస్థానము లోని పశు పక్ష్యాదులన్నీ కూడా గజగజవణికి పోయిననాయి ,గాలికూడా భయముతో మెల్లగా వీచసాగింది ,అప్పటివరకు గలగలా ప్రవహించే గోదావరీ నది తన వేగాన్నీ ఉధృతిని తగ్గించుకొని చాలా నెమ్మదిగా ప్రవహించసాగింది .

.

రామ లక్ష్మణులిరువురూ లేని సమయాన్ని చూసుకొని ఇదే అదనుగా భావించి లోకకంటకుడైన రావణుడు సీతా దేవిని సమీపించి నిలిచాడు.

.

ఈ లోకములో లేదు సీతమ్మ ! 

మనసంతా మగని గూర్చిన ఆలోచనలే ! 

పరిపరి విధాలుగా పోతున్న మనస్సును అదుపు చేసుకోలేక భర్తకు ఆపద వాటిల్లినదేమో అని చింతిస్తూ ఉన్న  ఆవిడ తనకు వాటిల్లబోయే విపత్తును లేశమాత్రము కూడా గ్రహించలేని స్థితిలో దైన్యముతో అలాగే కూర్చుని ఉన్నది.

.

 రావణుడు సీతను చూశాడు 

,వాడి మీద మన్మధుడు తన పని చేసుకు పోతున్నాడు .

వాడిలో వికారము మొదలయ్యింది .


పద్మములో కూర్చున్న లక్ష్మీదేవిలాగా ప్రకాశించే సీతమ్మను కామాతురుడై నిర్లజ్జగా ,నిర్భయముగా చూస్తూ ఆవిడ సౌందర్యాన్ని చూపులతో గ్రోలుతూ ఇలా పలికాడు.

.

ఓ దేవి! నీ శరీరము అంతా పద్మముల వరుస లాగా ఉన్నది .పద్మలత లాగా ఉన్నది నీ తనువు( అనగా ముఖము పద్మము ,హస్తములు పద్మములు ,పాదములు పద్మములు ,నేత్రములు పద్మములు ..)

.

 ఇన్ని పద్మములు ధరించిన నీవు ఎవ్వరవు ?

.

శుభకరమైన ముఖము కలదానా ! 

నీవు పార్వతివా ?

నీవు కీర్తికి అదిష్ఠాన దేవతవా ?

కాంతికి అదిష్ఠాన దేవతవా?

ఐశ్వర్యానికి అదిష్ఠాన దేవతవా ?

మంగళ ప్రదురాలైన శ్రీ లక్ష్మివా ?

అప్సరసవా ?

 స్వేచ్ఛాసంచారిణి అయిన రతీ దేవివా ?

ఎవరవు? 

నీవెవరవు ?



రామాయణమ్ .154


అందమైన చిరునవ్వు, ముత్యములవంటి పలువరుస, చక్కని నేత్రములు గల ఓ విలాసవతీ!

 నీవు నా హృదయాన్నిమనస్సును 

వరద ఉధృతితో ఉన్న నది ఒడ్డులను ఎలా కోసివేస్తుందో అలా కోసివేశావు.

.

జగదేకమోహినివై భాసిల్లుతున్న నీవు ఎవరు?

 గంధర్వ కాంతవా?,

అప్సరసవా? ,

కింనర స్త్రీవా ?

లేక యక్షజాతికి చెందిన దానివా ?

 అయినా నేను ఇంతకుమునుపు నీ వంటి స్త్రీని ఏ జాతిలోనూ చూసి ఉండలేదు .

.

క్రూరమృగాలకు  ఆలవాలమై ,భయంకరమైన రాక్షసులు స్వేచ్చగా సంచరించే ఈ ఘోరాటవిలో నీ వెందుకు ఒంటరిగా నివసిస్తున్నావు ? నిన్ను చూసి నా మనసు తల్లడిల్లుతున్నది .

.

నీ వంటి అపురూప సౌందర్యరాశి ఉండదగ్గ ప్రదేశము కాదిది !

.

రమణీయ ప్రాసాదోపరిభాగాలు,సుందర ఉద్యానవనాలు  ఉన్న నగర ప్రాంతములు నీవు సంచరించుటకు అనుకూలమైనవి !

.

నల్లని కన్నులు కల ఓ కోమలాంగీ నీవు 

శ్రేష్ఠమైన పూలమాలలు ధరించి,

శ్రేష్ఠమైన ఆహారము,

శ్రేష్ఠమైన వస్త్రములు ,

శ్రేష్టుడైన భర్తతో సుఖించటము యుక్తము అని నా అభిప్రాయము .

.

అని పలుకుతున్న బ్రాహ్మణ రూపములోనున్న రావణుని చూసి సీతమ్మ సమస్త అతిధి ఉపచారములతో సేవించింది ,అర్ఘ్య పాద్యాదులిచ్చి భోజనము సిద్దముగా నున్నది అని కూడా పలికింది .

.

కాషాయ వస్త్రము ధరించి బ్రాహ్మణ వేషముతో ఉన్న రావణుడు ఏ మాత్రము ద్వేషింప రాని ప్రశాంత చిత్తుడి లాగా కనపడుతున్నాడు సీతమ్మకు.

.

అలాంటి రావణునికి ,ఇంటికి వచ్చిన అతిధికి ఏ ఏ మర్యాదలు చేయాలో ఆయా మర్యాదలన్నీ చేసి నిండుగా మాటలాడుతున్నది సీతా మహాసాధ్వి.

.

కానీ రూపుదిద్దుకున్న దురాలోచనతో ఉన్న రావణుడు తన చావును ఆహ్వానిస్తూ సీతను బలాత్కారముగా అపహరించాలని మనస్సులో నిశ్చయించుకున్నాడు.

 బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధించడం తీవ్రమైన తపస్సుతో సమానం. భక్తులను పునరుద్ధరించేందుకు కావలసిన ధర్మాలను, గొప్పతనాలు తెచ్చే విలువలను ఇది అందిస్తుంది. కఠినమైన అడ్డంకులను తొలగించి వారి పురోగతికి విజయాలకు దగ్గర చేస్తుంది మరియు ఆ కుటుంబాలు వారి పనులలో గొప్ప మానసిక శాంతి మరియు సంతృప్తి పొందుతాయి. నవరాత్రి 2 రోజున బ్రహ్మచారిణి అమ్మవారిని ఆరాధించడం వల్ల మీ పురోగతికి అడ్డంకులుగా ఉన్న పరిస్థితులను దాటి ముందుకు సాగిపోగలరు. బ్రహ్మచారిణి అనగా పెళ్లికాని మరియు యవ్వనంలో ఉన్న అని అర్థం. బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క రూపం కోమలమైనదిగా, శాంతియుతమైనదిగా ఉంటూ; భక్తులకు శారీరకమైన, మానసికమైన ప్రశాంతతని కలుగజేస్తూ, ప్రజలలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.


బ్రహ్మచారిణి అమ్మవారి యొక్క కథ : కుష్మందా దేవతా స్వరూపం అనంతరం, బ్రహ్మచారిణిగా అవతారాన్ని ధరించింది. పార్వతీదేవి శివుని కోసం లోతైనది ధిక్కారాన్ని కలిగి ఉన్న దక్ష ప్రజాపతి ఇంటిలో జన్మించింది. ఆమె కన్య రూపంలో ఉన్నప్పుడు 'బ్రహ్మచారిణిగా' ఆరాధించబడింది. తన తదుపరి జన్మలో, శివుడిని గౌరవించే ఒక మంచి తండ్రిని పొందటానికి ఈ దేవత తీవ్రమైన తపస్సు చేసింది. ఆమె పొట్టి పాదాలతో నడిచింది మరియు శివుడిని వివాహం చేసుకోవడం కోసం అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసింది. ఆమె పుష్పాలు, పండ్ల మీద నివసించింది ఆ తరువాత ఆకుల మీద మాత్రమే కాగా, మరికొంతకాలానికి వాటన్నింటిని నిలిపివేసి కేవలం గాలిలో మాత్రమే నివసించింది. అందువలన బ్రహ్మచారిణి "అపర్ణ"గా కూడా పిలువబడింది (ఆకులు లేకుండా కూడా నివసించడం).


బ్రహ్మచారిణి అమ్మవారి ప్రాముఖ్యత : బ్రహ్మచారిణి అమ్మవారు - కుజుడు (అంగారకుడు) గ్రహం యొక్క పాలకురాలిగా గ్రంథాలు చెబుతున్నాయి. ఈ అమ్మవారు భక్తుల యొక్క దుఖాన్ని మరియు మానసిక బాధలను తొలగించి, అదృష్టాన్ని కలగజేసేదిగా ఆశీర్వదిస్తుంది. అమంగళ దోషాలను తొలగించేదిగా మరియు జాతక చక్రంలో కుజుడు అననుకూలత వల్ల వచ్చిన సమస్యలను దూరం చేసేందుకు ఈ అమ్మవారిని ప్రజలు ఆరాధిస్తారు.


బ్రహ్మచారిణి అమ్మవారి పూజ : బ్రహ్మచారిణి అమ్మవారికి ఇష్టమైన పుష్పం మల్లెలు. అందువల్ల, నవరాత్రి 2 వ రోజున ఈ మల్లె పువ్వులతో అమ్మవారిని ప్రార్థించడం వలన మరియు అత్యంత కరుణ గల ఆతల్లి యొక్క ఆశీర్వాదాలను పొందవచ్చు. మా బ్రహ్మచారిణి యొక్క దైవ రూపం మరియు పూజను ముగించేందుకు అర్తతో ముగిసిన పదహారు రకాల్లోని గురించి ఆలోచించండి. బ్రహ్మచారిణి అమ్మవారి దైవ స్వరూపం 16 రకాలుగా షోడశోపచారాలతో పూజించండి. చివరిలో అమ్మవారికి హారతిని ఇవ్వడం ద్వారా పూజ ముగుస్తుంది.


బ్రహ్మచారిణి అమ్మవారి మంత్రాలు : ఓం దేవి బ్రహ్మచారిణే నమః ఓం దేవి బ్రహ్మచారిణే నమః దధానా కర్ పడ్మాభ్యామక్ష్మల కమండలో దేవి ప్రసాద్యుడు మేయి బ్రహ్మచరిన్యుతమమ


బ్రహ్మచారిణి అమ్మవారి ప్రార్థన : దధాన కర పడ్మాభ్యామక్ష్మల కమండలో దేవి ప్రసాద్యుడు మేయి బ్రహ్మచరిన్యుతమమ


బ్రహ్మచారిణి అమ్మవారి స్తుతి : యా దేవి సర్వభూతేషూ మా బ్రహ్మచారిణి రూపేనా సమస్తిత నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః


బ్రహ్మచారిణి అమ్మవారి ధ్యానం : వందే వాన్ఛితాభాయ చంద్రార్ధక్రితశేఖరం జపమాల కమండాలు ధారా బ్రహ్మచారిణి శుభమ్ గౌరవర్న శ్వధిష్తనాస్తిత ద్వితీయ దుర్గ త్రినేత్రం ధవళ పరిధన బ్రహ్మ రూప పుష్పలకర భుషితాం పరమ వందన పల్లవరదరం కంట కపోల పిన పయోధరం కమనీయ లావణ్యం స్మెరముఖి నిమ్ననాభి నితాంబనియం


బ్రహ్మచారిణి అమ్మవారి స్త్రోత్రం : తపష్చరణి త్వాంహి తపత్రాయ నివరణిమ్ బ్రహ్మరూపధరా బ్రహ్మచారిణి ప్రణమామ్యహః శంకారాప్రియ త్వాంహి భక్తి - ముక్తి దాయాని శాంతిదా జ్ఞానద బ్రహ్మచారిణి ప్రణమామ్యహః


బ్రహ్మచారిణి అమ్మవారి కవచం : త్రిపుర మెయిన్ హృదయము పాటు లలాటే పాటు శంకరాభామిని అర్పనా సదాపాటు నెత్రో, అర్దరి చ కపోలో పంచదాశి కాంతే పాటు మద్యదేశి పాటు మహేశ్వరి శోడషి సదాపాటు నబో గ్రిహో చ పడాయో అంగ ప్రత్యంగా సతట పాటు బ్రహ్మచారిణి.

 Hindu Dharmam Vardhillali (హిందూ ధర్మం వర్ధిల్లాలి):

*దేవీనవరాత్రుల విశిష్టత* 


ఆశ్వీయుజమాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గలకారణం "అమ్మ" గుర్తుకు రావటమే! అమ్మ అంటే మరి ఎవరోకాదు ఆ జగన్మాత, ముగ్గురమ్మల మూలపుటలమ్మ, నవదుర్గాస్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో వున్న చరాచర వస్తువులన్నిటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది.


ఈ సృష్టిలోగల జ్యోతిర్మండలాలు మానవనిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢీగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగానూ, పరాశక్తిగానూ, జగన్మాత శక్తిగాను పలురూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏనోట విన్నా ఈ దుర్గాసప్తశతి శ్లోకం వింటూ ఉంటాము.


శ్లో!! సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే,

శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.


ఈ శక్తే కనుక లేకుంటే శివుడైనా ఏమి చెయ్యలేడని శివునియొక్క శక్తి రూపమే "దుర్గ" అని ఆదిశంకరాచార్యుల వారు వారి అమృతవాక్కులో చెప్పారు. ఈ దేవదేవి రాత్రిరూపం గలది అని పరమేశ్వరుడు పగలు రూపం గలవాడు అని ఈ దేవిని రాత్రి సమయాల్లో అర్చిస్తే సర్వపాపాలు నాశనమవుతాయని సమస్త కోరికలు సిద్ధిస్తాయని మత్స్యపురాణం మనకు తెలియజేస్తోంది. ఆశ్వీయుజమాసంలోని  శుక్లపక్షంలో పాడ్యమి తిథిలో, హస్తా నక్షత్రముతో కూడియున్న శుభదినాన ఈదేవీపూజ ప్రారంభించుటకు చాలా మంచిదని మార్కండేయ పురాణం చెప్తోంది. అందువల్ల ఆ రోజునుండి ఈ నవరాత్రులు ప్రారంభిస్తారు. మొదటి మూడురోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలి.


దేవతలు భండాసురుడనే రాక్షసుని బారినుండి రక్షణ పొందడానికి ఆ ఆదిపరాశక్తి తప్ప వేరేమార్గములేదని తలచి ఆ మహాశక్తి కోసం ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. ఆ యజ్ఞగుండంలో వారి వారి శరీర భాగాలను ఖండించుకుని ఆహుతి చెయ్యగా ఆ జగన్మాత కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యింది. వారికి అభయమిచ్చి భండాసురుని సంహరించి వారి అభీష్టము నెరవేర్చింది.


ఆ దేవి పాడ్యమి నుండి నవమి వరకు ఒక్కోరోజు ఒక్కొక్క రాక్షసుని వధించసాగింది. ఆ ఆది శక్తి నుండి ప్రకటితమైన వివిధ శక్తులు నవదుర్గలుగా

1. శైలపుత్రి

2. బ్రహ్మచారిణి

3. చంద్రఘంట

4. కుష్మాండ

5. స్కందమాత

6. కాత్యాయనీ

7. కాళరాత్రి

8. మహాగౌరి

9. సిద్ధిధాత్రి

అను రూపాలతో ఆ దేవి పూజలు అందుకోసాగింది. మొదట ఈ దేవదేవీ "శ్రీకృష్ణ పరమాత్మ" చే గోకులం, బృందావనంలో పూజలందుకుంది. బ్రహ్మదేవుడు మధు కైటభులనే రాక్షసుల నుండి రక్షణకై ఈమెను స్తుతించి విముక్తి పొందాడు. పరమేశ్వరుడు త్రిపురాసుర సంహార సమయము నందు ఈ జగన్మాతను ఆరాధించి విజయం పొందినాడు. దేవేంద్రుడు దుర్వాసుని శాపంవల్ల సంపదలన్నీ సముద్రములో కలసిపోగా ఈ పరాశక్తిని సేవించి తిరిగి సంపదల్ని పొందగలిగిగాడు. ఇలా మహామునులు, దేవతలు, సిద్ధులు, మనువు వల్ల ఏర్పడిన ఈ మానవులు ఆ మహాశక్తిని ఎంతగానో ఆరాధించి ఆమె కటాక్షం పొందుతున్నారు. ఈ నవరాత్రి ఉత్సవములలో దేవి నవాంశల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. రెండు సంవత్సరాల బాలిక నుండి పది సంవత్సరాల బాలిక వరకు అనేక రూపాల్లో వారిని షోఢశోపచారాలతో పూజిస్తారు. ఈ కుమారి పూజలోని ఔచిత్యాన్ని ఎరిగిన అగస్త్యుని భార్య పాముద్ర పూజను చేసిందట! ఈ దేవి యొక్క అష్టాదశ (18) శక్తిపీఠాలు దేశమంతటా ఉన్నాయి. ఇందు దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక దేవీ ఉపాసకులైతే ఈ నవరాత్రులు అంటే, ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు.


ఇలా అందరూ నవరాత్రులు జరుపుకుని విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన సమయాన శమీవృక్షం (జమ్మిచెట్టు) వద్దగల అపరాజితాదేవిని పూజించి ఈ శ్లోకంతో


శ్లో ! శమీ శమయతే పాపం శమీశతృవినాశినీ !

అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ !!


అను శ్లోకమును స్మరిస్తూ ప్రదక్షిణ చేసి ఆ శ్లోకం వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయుటవల్ల అమ్మవారి కృపతో పాటుగా శనిదోష నివారణ కూడా పొందుతారని ప్రతీతి. ఇలా మానవులను మానవులుగా తీర్చిదిద్ది, మ అనగా మాయ, న అంటే లేకుండా, వ అంటే వర్తింప చేసే తల్లిగా లాలించి, తండ్రిగా పోషించి, గురువుగా ప్రపంచ విలువలను చాటి చెప్పే శక్తి ఆ జగన్మాతకే సాధ్యం.


అసాధ్యాలను సుసాధ్యాలుగా చేయాలన్నా మనకు ఏర్పడిన సర్వ దుఃఖాల నుండి ఉపశమనం పొందాలన్నా దారిద్రం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో ఇహలోక పరలోక సుఖాలను పొందుటకై ఈదేవి నవరాత్రుల యందు ఆదేవదేవికి పూజలతోపాటు ఖడ్గమాల స్తోత్రం, శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యమూ గావించి ఆ జగన్మాత కృపాకటాక్ష వీక్షణలు మనమంతా పొందుదాం.


*శరన్నవరాత్రులలో అమ్మవారి అలంకరణలు ముహూర్తాలు*


🌷 శరద్రుతువులో ఆశ్వీయుజమాసం ప్రారంభం మొదలుకొని తొమ్మిది రాత్రులు నవరాత్రలుగా జరిపి , పదవరోజు ఉదయం శమీ పూజతో ఉద్వాసన చేయడం పరిపాటి. వివిధ రోజులలో వివిధ పద్ధతులలో అలంకారాలు నివేదించి అమ్మవారికి వివిధ పద్ధతులలో పూజించి రకరకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారి అనుగ్రహం పొందటం పరిపాటి. నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి రోజు అంగ్ల తేది ప్రకారం 17 అక్టోబర్ 2020 దేవి శరన్నవరాత్రారంభం.


🌷 17 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి , శనివారం మొదటి రోజున 'బాలా త్రిపుర సుందరీ' అలంకారం.


🌷 ముహూర్తం :- కలశస్థాపన శుభ సమయం ఉదయం 7:38 నిమిషాల నుండి 11:29 వరకు, మధ్యాహ్నం 11:29 నుండి 12:16 వరకు.


🌷 నైవేద్యం - పులగం


🌷 18 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ విదియ, ఆదివారం రెండవ రోజున 'గాయత్రీ దేవి' అలంకారం.


🌷 ఉదయం 8:05 - 8:35 , సాయంత్రం 6:18 - 6: 56


🌷 నైవేద్యం - పులిహోర


🌷 19 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ తదియ, సోమవారం మూడవ రోజున 'మహాలక్ష్మి దేవి' అలంకారం


🌷 ఉదయం 9 :05 - 9 :30 , సాయంత్రం 5 :35 - 6:30


🌷 నైవేద్యం - వడపప్పు, పానకం


🌷 20 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ చవితి, మంగళవారం నాల్గవ రోజున 'అన్నపూర్ణ' అలంకారం.


🌷 ఉదయం 7 :02 - 7 :40 , సాయంత్రం 5 :05 - 5 : 32


🌷 నైవేద్యం - పరమాన్ణం, బూరెలు


🌷 21 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ పంచమి, బుధవారం ఐదవ రోజున 'లలితా దేవి' అలంకారం.


🌷 ముహూర్తం:- సరస్వతీ ఆవాహనం ఉదయం 6:05 - 7:53 ( మూల 1 వ పాదం )


🌷 సరస్వతీ దేవి మూల నక్షత్ర పూజ ఉదయం 7:54 - 8:58


🌷 సరస్వతీ దేవి సాయాహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:39 వరకు


🌷 నైవేద్యం - పెసర బూరెలు, పరమాన్నం


🌷 22 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ షష్టి, గురువారం ఆరవ రోజున 'శాకంబరీ దేవి' అలంకారం.


🌷 ముహూర్తం:- త్రిరాత్ర కలశస్థాపన సమయం ఉదయం 6:05 - 7:32


🌷 పూర్వాషాడ సాయహ్న పూజ మధ్యాహానం 3:29 - 5:38


🌷 పూర్వాషాడప్రదోష పూజ సాయంత్రం 5:39 - 8:02


🌷 నైవేద్యం - శాకాన్నం (కూర అన్నం)


🌷 23 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, శుక్రవారం ఏడవ రోజున 'సరస్వతీ దేవి' అలంకారం.


🌷 ఉదయం 6 :20 - 7 :05 , సాయంత్రం 5 :39 - 6:20


🌷 నైవేద్యం - కదంబం ప్రసాదం.


🌷 24 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, శనివారం ఎనిమిదవ రోజున దుర్గాష్టమి 'దుర్గాదేవి' అలంకారం.


🌷 ముహూర్తం:- ఉదయం 7;38 - 8:59, మధ్యాహ్నం 11:28 - 12:14 , సాయంత్రం 5:37 - 7:11


🌷 నైవేద్యం - నిమ్మకాయ పులిహోర


🌷 24 -10 -2020 సరస్వతీదేవి ఉద్వాసన ముహూర్త సమయం ఉదయం 7:38 - 8:59


🌷 25 -10 -2020 నిజ ఆశ్వీయుజ శుద్ధ నవమి, ఆదివారం తొమ్మిదవ రోజున 'మహిషాసుర మర్దినీ' అలంకారం.


🌷 ఉదయం 8:45 - 9:15 , సాయంత్రం 6:12 - 6: 37


🌷 నైవేద్యం -చలివిడి, వడపప్పు, పానకం.


🌷 అక్టోబర్ 25


🌷 విజయదశమి పూజ ప్రారంభ ముహూర్త సమయం ఉదయం 8:40 - 11:57


🌷 శమీ పూజ, ఆయుద పూజలు ఉదయం 10:25 - మధ్యాహానం 12:14


🌷 అపరాజితా దేవి పూజా సమయం మధ్యాహ్నం 1:00 - 3:18


🌷 విజయ దశమి విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:46 - 2:32


🌷 విజయ దశమి పర్వదినాన దుర్గాదేవి ఉద్వాసన సాయంత్రం 5:36 - 8:00

 #భాగవతం – 90


#నరకాసుర_వధ:


కృష్ణ భగవానుడు తనంత తానుగా శక్తి మంతుడు. కృష్ణుడు లేని నాడు అష్ట ప్రకృతులకు కదలిక లేదు. అతి చిన్నతనం లోనే ఎందఱో రాక్షసులను పరిమార్చాడు. నరకాసురుడిని సంహరించడంలోకి వచ్చేటప్పటికీ సత్యభామను తీసుకువెళ్ళాడు


 తన ఎనమండుగురు భార్యలలో ఒక్క సత్యభామను తప్ప మిగిలినవారి నెవ్వరినీ తీసుకువెళ్ళలేదు. ఇలా రామాయణంలో దశరథ మహారాజు గారు కైకమ్మను తీసుకు వెడితే మనకు రామాయణం అంతా వచ్చింది. సత్యభామతో కృష్ణుడు యుద్ధమునకు వెళ్ళడం వలన మనకు దీపావళి పండుగ వచ్చింది. 


ఒకనాడు కృష్ణ భగవానుడు కొలువుతీరి ఉండగా దేవతలు,ఇంద్రుడు, దుర్వాసమహర్షి వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ‘మహానుభావా కృష్ణా, నరకాసురుని ఆగడములు రోజు రోజుకూ మితిమీరి పోతున్నాయి. నరకాసురుడు దేవతలకు తల్లి అయిన అదితి కుండలములను తస్కరించాడు. వరుణుడి ఛత్రమును ఎత్తుకుపోయాడు. దేవతలందరూ విహారము చేసే మణిపర్వతమును ఎత్తుకు పోయాడు. వాని ఆగడములు అన్నీ యిన్నీ కాదు. కృష్ణా, నీవే వానిని పరిమార్చాలి’ అన్నారు. 


అపుడు కృష్ణుడు తాను తప్పకుండా నరకాసుర సంహారం చేస్తాను’ అని చెప్పి దేవతల నందరిని సాంత్వన పరిచాడు. తరువాత తాను యుద్ధభూమికి బయలు దేరడం కోసమని రథమును ఎక్కుతున్నాడు. సరిగ్గా అదే సమయమునకు సత్యభామ అక్కడికి వచ్చింది.


సత్యభామ అనే పేరు చాలా గమ్మత్తయిన పేరు. శ్రీకృష్ణుని వద్ద సత్యభామ పొందిన స్థానం చాలా గొప్పది. సత్యభామ అనేక రంగములలో ప్రవీణురాలు. ఆ తల్లి కృష్ణ భగవానుని దగ్గరకు వచ్చి ఒక మాట అడిగింది. ‘నాథా, మీతో యుద్ధ భూమికి వద్దామనుకుంటున్నాను’ అంది.. 


కృష్ణ పరమాత్మ అన్నారు – ‘ సత్యభామా! యుద్ధం అంటే ఏమిటో సరదాగా ఉంటుందని అనుకుంటున్నావు.. రోజూ నాతొ ప్రణయ విలాసాలతో తేలియాడుతూ ఇది కూడా ఏదో ఉద్యానవనంలో విహరించడం అనుకుంటున్నావు. యుద్ధభూమి అంటే తుమ్మెదల ఝుంకారములు వినపడవు. బ్రహ్మాండమయిన ఏనుగులు తొండములను ఎత్తి ఘీంకారములు చేస్తుంటాయి. అక్కడ పద్మముల నుండి వచ్చే పుప్పొడితో కూడిన గాలి రాదు. శరవేగంతో పరుగెత్తే గుర్రములు యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల నుండి పైకి రేగిన ధూళి వచ్చి మీద పడుతుంది. అక్కడ సరోవరముల నుండి వచ్చే చల్లని గాలి రాదు. శత్రువులు విడిచి పెట్టిన బాణపరంపరలు వచ్చి మీద పడిపోతాయి. అక్కడ కలహంసలు మొదలయిన పక్షులతో కూడిన సరోవరము లు ఉంటాయని నీవు అనుకుంటున్నావేమో భయంకరమయిన శత్రువులు రాక్షసులతో కూడిన యుద్ధభూమి ఉంటుంది. నేను రాక్షసులను పరిమార్చి తిరిగి తొందరగా వచ్చేస్తాను. నీవు నాతో రావద్దు’ అన్నారు. 


అపుడు.. సత్యభామ కృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయన చెవిలో మాత్రమే వినపడేటట్లు గా ఎంతో ప్రియముగా చక్కటి మాట చెప్పింది. ఆ యుద్ధభూమిలో ఉన్నవారు రాక్షసులే అయినా అక్కడ దైత్య సమూహములే ఉన్నా నాకేమీ భయం లేదు. నీ భుజములనబడే దుర్గముల చాటున నేను ఉంటాను. నీ యుద్ధం చూడాలని అనుకుంటున్నాను. అని ప్రార్ధన చేసింది. కృష్ణ పరమాత్మ ఆమెను యుద్ధ రంగమునకు తీసుకువెళ్ళడానికి అంగీకరించాడు. 


ఇద్దరూ గరుత్మంతుని అధిరోహించి యుద్ధభూమిని వెళ్ళారు. ప్రాగ్జ్యోతిష పురము నకు చేరుకున్నారు. అక్కడ నరకాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఆ నరకాసురుడికి నమ్మిన బంట్లు వంటి మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు ఉన్నారు. హయగ్రీవుడు అంటే లక్ష్మీ హయగ్రీవుల అవతారంలోని హయగ్రీవుడు కాదు. ఇక్కడ చెప్పబడిన హయగ్రీవుడు రాక్షసుడు. అక్కడ దుర్గములు చాలా ఉన్నాయి. 


పరమాత్మ ఒక్కసారి తన చేతిలో పట్టుకున్న గద చేత ప్రహారము చేస్తూ ఆ దుర్గముల నన్నిటినీ నేలకూల్చేశాడు. పాంచజన్యమును చేతిలో పట్టుకొని ప్రళయ కాలంలో మేఘము ఎలా ఉరుముతుందో అలా పాంచజన్యమును పూరించారు. మురాసురుడు అక్కడ ఉన్న జలదుర్గంలో పడుకుని నిద్రపోతున్నాడు. పెద్ద జడ వేసుకున్నాడు. వాడు ప్రాగ్జ్యోతిష పురమును మురాపాశములతో కట్టి ఉంచుతాడు. కృష్ణ పరమాత్మ తన చేతి ఖడ్గంతో ఆ పాశములను ఖండించారు.


 మురాసురుడు పైకి వచ్చాడు. తన అయిదు తలలతో వాడు బ్రహ్మాండములో ఉన్నటు వంటి పంచ భూతములను మ్రింగివేసేలా ఉన్నాడు. వాని జడ సాగిన అగ్నిహోత్రంలా ఉంది. అటువంటి జడతో వాడు నీటిలోనుండి పైకి లేచి కృష్ణుని వంక చూశాడు. పరమాత్మ తన గదా ప్రహారముతో మురాసురుని శిరస్సుని బ్రద్దలు చేశాడు. వాడు మరణించాడు. మురాసురుడు మరణించగానే వాని కుమారులు ఏడుగురు కృష్ణ పరమాత్మ మీదికి యుద్ధమునకు  వచ్చారు. ఏడుగురిని కూడా కృష్ణ పరమాత్మ nirjinచారు. ఈవార్త నరకాసురుడికి చేరి యుద్ధమునకు వచ్చాడు. 


నరకాసురుడు ఆది వరాహమూర్తి కి భూదేవికి  జన్మించిన వాడు. వాడు పధ్నాలుగు భువనములను గెలిచినవాడు. సత్యభామ తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గభాలున లేచి ముందుకు వచ్చింది. 

తన పెద్ద జడను కదలకుండా గట్టిగా ముడి వేసింది. తను వేసుకున్న హారములు అవీ బయటకు వ్రేలాడకుండా అమరిక చేసేసుకుంది. ఆమెలో ఎక్కడ భయం కనపడడం లేదు. ముఖం దేదీప్యమానం అయిపోతూ ఉండగా పమిట వ్రేలాడకుండా బొడ్డులో దోపుకుంది. కృష్ణుని ముందుకు వచ్చి ‘నాథా, ధనుస్సును ఇలా యివ్వండి’ అని అడిగింది. కృష్ణుడు తెల్లబోయాడు. ఆయన ఏమీ తెలియని వాడిలా ఒక నవ్వు నవ్వాడు. ఆయనకు తెలియనివి ఏమి ఉంటాయి. 


రాక్షసుల మస్తకమును ఖండించడానికి అనువయిన సమస్త శక్తులను క్రోడీకరించుకున్న ధనుస్సును స్వామి సత్యభామ చేతికి ఇచ్చారు. ఆ ధనుస్సును ఎడమచేతితో పట్టుకుని ఒంచి వింటినారిని విప్పి వంగి కుడిచేతి తో కట్టింది. ఈ దృశ్యము ను చూసి కృష్ణ పరమాత్మ తో పాటు రాక్షసులు కూడా తెల్లబోయారు. ఆ ధనుస్సును పట్టుకోగానే ఆవిడలో ఒక గొప్ప తేజస్సు కనపడింది. వెంటనే యుద్దమును ప్రారంభించి ఒక్కొక్క బాణము తీసి అభిమంత్రించి విడిచి పెడుతోంది. ఆవిడ ఒక్కొక్క బాణమును తీసి తొడుగుతుంటే వీర రసము, శృంగార రసము, భయ రసము, రౌద్ర రసములు ఆమెలో తాండవిస్తున్నాయి. రానురాను యుద్ధం పెరిగిపోతోంది. 


స్త్రీ అని ఉపేక్షిస్తే వీలు లేదని రాక్షసులలో వీరులందరూ ముందుకు వచ్చి ఆమెపై బాణములను ప్రయోగించడం ప్రారంభించారు. మూడు లోకములలో ఉన్నవాళ్ళు తెల్లబోయే రీతిలో అందరూ ఆశ్చర్యపోయి చూసేటట్లుగా సత్యభామ యుద్ధం చేస్తోంది. 


భయంకరమయిన యుద్ధం చేసి చెమట పట్టేషి ముంగురులన్నీ నుదుటికి అంటుకు పోయిన సత్యభామ వంక చూసి కృష్ణుడు ‘సత్యా, నీ యుద్ధమునకు నేను ఎంతో పొంగిపోయాను. అని ఆ ధనుస్సు పట్టుకున్నాడు. అప్పటికే అందరూ నిహతులయి పోయారు. నరకాసురుడు మాత్రం ఇంకా ప్రాణములతో నిలబడి ఉన్నాడు.. అపుడు నరకాసురుడు అన్నాడు..


 ‘చేతకాని వాడివై భార్య యుద్ధం చేస్తుంటే నీవు పక్కన కూర్చున్నావు. పౌరుషం ఉన్నవాడివైతే యిప్పుడు యుద్ధమునకు రావలసింది’ అన్నాడు. ఈమాటలు విన్న నిన్ను నిర్జించడానికే కదా నేను వచ్చాను’ అని తన చేతిలో వున్న సుదర్శన చక్రమును ప్రయోగించారు. ప్రయోగించగానే సుదర్శన చక్రధారల చేత త్రుంపబడిన నరకాసురుని శిరస్సు కుండలములు ప్రకాశిస్తూ ఉండగా దుళ్ళి నేలమీద పడింది. నరకాసురుని వధ జరిగిన వెంటనే నరకాసురుడు మరణించాదనే పరమ సంతోషంతో దేవతలు అందరూ వారి వారి లోకముల యందు దీపములను వెలిగించారు. వాడు అమావాస్య నాడు చచ్చిపోయాడు. అందుకనే మనం దీపావళి అమావాస్య అంటాము. 


దీని వెనకాతల ఉండే రహస్యమును మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. యథార్థమునకు నరకాసురుడు అనేవాడు మనలోనే ఉంటాడు.నరకాసురుడు ఆదివరాహ మూర్తికి, భూదేవికి జన్మించాడు. అనగా ప్రకృతి పురుషుల సంయోగ ఫలితమే నరకాసురుడు. భూదేవి అతని తల్లి. ప్రాక్ – జ్యోతి అనగా మొదటి నుండి వున్న జ్యోతి – అనగా ఇక్కడే ఉన్న ఆత్మ వస్తువు. ఈ ఆత్మా వస్తువును తెలుసుకోవడానికే మనం ఈ శరీరంలోకి వచ్చాము. ఇందులోకి రాగానే వాడు ప్రాగ్జ్యోతిషపురము నకు దూరంగా ఉండడం మొదలు పెట్టాడు. మాహిష్మతీ పురమునకు వెళ్ళాడు. మాహిషి అనగా మహిష ప్రవృత్తి –దున్నపోతు లక్షణం. వాడు మురాసురుడు, నిశుంబుడు, హయగ్రీవుడు అనబడే ముగ్గురు స్నేహితులను పట్టుకున్నాడు. సత్వరజస్తమో గుణములనే మూడు గుణములతో స్నేహమును ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడూ ఈ మూడు గుణములలో తిరుగుతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురము నుండి మాహిష్మతీ పురమునకు వచ్చేశాడు. 


బ్రహ్మ గారి గురించి తపస్సు చేయగా బ్రహ్మ గారు ప్రత్యక్షమై ’నీకు ఏమి కావాలి’ అని అడిగారు. ఇది భాగవతం లోనిది కాదు. తనకు మరణం ఉండకూడదని అన్నాడు. ‘కుదరదు.. మరొక వరం కోరుకొనమని చెప్పారు.. వాడు ఏమి అడుగుదామా అని ఆలోచిస్తుండగా బ్రహ్మ గారు ‘అమ్మ చేతిలో చచ్చిపోయేలా నీకు వరం యిస్తాను, పుచ్చుకుంటావా’ అని అడిగారు. అంటే వాడు అనుకున్నాడు ‘అమ్మకి పెంచడం తెలుసు తప్ప చంపడం తెలియదు కదా! కాబట్టి నాకు చావు ఉండదు అని భావించాడు. ఆ మేరకు బ్రహ్మగారి వద్దనుండి వరమును పొందాడు.


 తాను అమ్మ చేతిలో పోతాడు కాబట్టి తన తల్లి ఎవరు అని వెతకడం మొదలు పెట్టాడు. తెలుసుకోలేక అదితి కుండలములను అపహరించాడు. ఆకాశమునకు ప్రకాశించే రెండు కుండలములు సూర్య చంద్రులు. వాటిని దొంగిలించాను, కాలము యొక్క ప్రసరణ తనమీద లేదన్నాడు. తనకు మరణం లేదన్నాడు. 


మాయ అనగా ప్రకృతి. ప్రకృతి అంటే పధ్నాలుగు భువనములు. అవే చతుర్దశి. చతుర్దశీ కన్యను వివాహం చేసుకున్నాడు. అనగా 14 భువనముల మాయకు చిక్కి ఈ భోగ భాగ్యములన్నీ శాశ్వతo అనుకున్నాడు. అనేక మంది రాజుల దగ్గరికి వెళ్లి వారిని చంపి ఆ పిల్లలను తీసుకువచ్చే వాడు. తాను తెచ్చిన ఏ స్త్రీనీ అనుభవించలేదు. కారాగారంలో పెట్టాడు. 


నరకాసుర వధ అయిన తరువాత కృష్ణ పరమాత్మ వారిని ద్వారకా నగరం పంపించి వేసి యింద్రుడి దగ్గరకు వెళ్లి వచ్చిన తరువాత ఈ 16 వేల మందికి 16 వేల అంతఃపురము లను కట్టి ఏక ముహూర్తము నందు ఒకే కృష్ణుడుగా కనపడుతూ 16 వేల రూపములతో  వివాహం చేసుకున్నాడు. 16 వేల మందిని చెరసాలలో పెట్టడం అంటే ఈశ్వరుని పదహారు కళలు. బ్రహ్మగారి వరం ప్రకారం నరకాసురుడు తల్లి చేతిలోనే చనిపోవాలి. ఆ భూదేవి అంశగానే సత్యభామ వచ్చింది. 


సత్య అనగా మారనిది అని అర్థం. ఈ ప్రపంచంలో మారనిది పరమేశ్వరుడు మాత్రమే. మారని వాడు సత్యము అయితే ఆ సత్యము ‘భా’ – అనగా కాంతి – ‘మ’ అనగా సంపద – సత్యము కాంతి వలన వచ్చే సంపద. ఇది మనకు భూమిలో కనపడుతుంది. భా – ఈశ్వరుడు ‘మ’ – సంపద. సత్యభామ – భూదేవి – ఐశ్వర్యం.

గరుత్మంతుని మీద కృష్ణుని పక్కన సత్యభామగా కనపడుతున్నది ఈశ్వరుని సోత్తయిన భూసంపద. లక్ష్మీ అంశ రుక్మిణి, భూ అంశ సత్యభామ. 


సత్యభామాదేవి వృత్తాంతమును ఎవరు వింటున్నారో వారికి బ్రహ్మ జ్ఞానము ఒక జన్మలోనయినా కలుగుతుంది. సత్య-భ-మ ఈశ్వరుడి కాంతి సంపద యుద్దమును వింటున్నారు. ఆ యుద్ధము అజ్ఞానము మీద ఉంటుంది. కాబట్టి అది విన్నవాడు జ్యోతినే పొందుతాడు. మనకోసమని పరమాత్మ నరకాసుర సంహారంలో ఇంత గొప్ప లీల చేశాడు...


ఓం నమో భగవతే వాసుదేవాయ..🙏

 **దశిక రాము**


**దేవీ నవరాత్రులు*  


2వ రోజు :

 శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి.


**హ్రీంకారాసన గర్భితానల శిఖాం**

*సౌ:క్లీం కళాంబిభ్రతీం*

**సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం*

**త్రినేత్రోజ్జ్వలామ్**

**వందే పుస్తక** *పాశమంకుశధరాం*

**స్రగ్భూషితాముజ్జ్వలాం**

**తాంగౌరీం త్రిపురాం** 

**పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్" **


త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి.


అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈమెను ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి.నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. 


షొడశ విద్యకు ఈమే అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము.


త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది.


త్రిపుర సుందరి అంటే మనలోని ముాడు అవస్తలు జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!

ఈమూడు అవస్థలు లేదా పురములకు బాల అధిష్ఠాన దేవత!


ఈమూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింపచేస్తు బాలగా.అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తినా, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.


అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే ఙ్ఞ్నానము కలిగి తానె శివ స్వరూపము తో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.


బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది

బాలా త్రిపురసుందరి ఆవిర్భావం గురించి మనకి బ్రహ్మాండ పురాణంలో కథ ఉన్నది. అది లలితా సహస్రంలో కూడా మనకు వస్తున్నది. భండాసురునియొక్క పుత్రులు ముప్ఫైమంది. వీళ్ళు అవిద్యా వృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ శక్తి సేనలన్నీ కూడా భయపడతాయి. ఆ సమయంలో బాలా త్రిపురసుందరి దివ్యమైన రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడే రథం. పైగా హంసలు లాగుతున్నటువంటి రథం. ఆ ఒక్క తల్లి ముప్ఫైమంది భండాసుర పుత్రులనూ సంహరించింది. వాళ్ళు సామాన్యులు కారు. ఇదివరకటి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారు. అంత భయంకరమైన భండ పుత్రులు. వారందరినీ ఒక్క తల్లే కేవలం ఒక్క అర్థచంద్ర బాణంతో సంహరించిందిట. అది ఈ తల్లియొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువలేదు. బాలోపాసనలో ఉన్నటువంటి విశేషమంతా ఇతివృత్తంలోనే మనకు కనపడుతున్నది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. అందుకే ఆవిడ హంసలు కూర్చిన రథంపై రావడం అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాసనిశ్వాసాత్మకమైన శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉత్ప్రేక్షించారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెప్పబడుతున్నది. ఈ బాలా త్రిపుర సుందరీ మంత్రము సిద్ధి పొందినటువంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశిని ఆరాధించడానికి అర్హులవుతారు. శ్రీవిద్యలో ఒక భాగంగా ఉన్న బాలా విద్య ఒక ప్రత్యేకవిద్యగా కూడా చాలామందిచేత ఆరాధింపబడుతోంది. ఈరోజు బాలా మహా త్రిపురసుందరీ రూపంగా ఈ రోజు చేసి ఇక్కడనుంచి నవరాత్రుల ఆరాధన కొనసాగిస్తున్నాం. బాలా భావనతో కుమారీ పూజ చేసినప్పుడు వాటి ఫలితాలు చెప్పారు. ఏవండీ ఒక్కరోజు ఒక్కసారి పూజచేస్తే చాలు కదా! తొమ్మిది రోజులు చేయాలా? అంటే చేయాలిట. బాల పూజ తొమ్మిదిరోజులూ చేయడం వల్ల ఒక్కొక్క ఫలితం ఉన్నది.


మొదటిరోజు బాల పూజా ఫలితం – “శతృక్షయం ధనాయుష్యం బలవృద్ధిం కరోతివై” అన్నారు. – శతృనాశనము, ధనాన్ని, ఆయుష్షునీ, బలాన్ని వృద్ధి చేయడం అనేది మొదటిరోజు చేసే కుమారీపూజయొక్క ఫలం.


శ్రీ బాలాత్రిపురసుందరీ ధ్యాన శ్లోకం;


అరుణకిరణ జాలైః అంచితావకాశా

విధృత జపపటీనా పుస్తకాభీతి హస్తా

ఇతర కర వరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థా

నివసతు హృది బాలా నిత్య కళ్యాణ శీలా

(ఎర్రని కిరణాలను వెదజల్లుతూ..జప మాల, పుస్తకము, వరద మరియు అభయ హస్తాలతో విరాజిల్లుతూ..విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి నిత్యమూ నా హృదయమునందు ఉండుగాక)


బాలా త్రిపురసుందరి త్రిపురేశ్యైచ విద్మహే

కామేశ్వర్యై చ ధీమహి


తన్నోబాలా ప్రచోదయాత్ ||


లోకా సమస్తా సుఖినోభవంతు..!!


శ్రీ బాలా త్రిపురసుందరి అష్టోత్తర శతనామావళి


ఓం కళ్యాణ్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం బాలాయై / మాయాయై నమః

ఓం త్రిపురసుందర్యై నమః

ఓం సుందర్యై నమః

ఓం సౌభాగ్యవత్యై నమః

ఓం క్లీంకార్యై నమః

ఓం సర్వమంగళాయై నమః

ఓం హ్రీంకార్యై నమః

ఓం స్కందజనన్యై నమః

ఓం పరాయై నమః

ఓం పంచదశాక్షర్యై నమః

ఓం త్రిలోక్యై నమః

ఓం మోహనాధీశాయై నమః

ఓం సర్వేశ్వర్యై నమః

ఓం సర్వరూపిణ్యై నమః

ఓం సర్వసంక్షభిణ్యై నమః

ఓం పూర్ణాయై నమః

ఓం నవముద్రేశ్వర్యై నమః

ఓం శివాయై నమః

ఓం అనంగకుసుమాయై నమః

ఓం ఖ్యాతాయై /అనంగాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః

ఓం జప్యాయై నమః

ఓం స్త్వ్యాయై / శ్రుత్యై నమః

ఓం నిత్యాయై నమః

ఓం నిత్యక్లిన్నాయై నమః

ఓం అమృతోద్బభవాయై నమః

ఓం మోహిన్యై నమః

ఓం పరమాయై నమః

ఓం ఆనందదాయై నమః

ఓం కామేశ్యై నమః

ఓం తరణాయై నమః

ఓం కళయై / కళవత్యై నమః

ఓం భగవత్యై నమః

ఓం పద్మరాగకిరీటన్యై నమః

ఓం సౌగంధన్యై నమః

ఓం సరిద్వేణ్యై నమః

ఓం మంత్రిణ్యై నమః

ఓం మంత్రరూపిణ్యై నమః

ఓం తత్త్వత్రయ్యై నమః

ఓం తత్త్వమయ్యై నమః

ఓం సిద్దాయై నమః

ఓం త్రిపురవాసిన్యై నమః

ఓం శ్రియై /మత్యై నమః

ఓం మహాదేవ్యై నమః

ఓం కౌళిన్యై నమః

ఓం పరదేవతాయై నమః

ఓం కైవల్యరేఖాయై నమః

ఓం వశిన్యై / సర్వేశ్వర్యై నమః

ఓం సర్వమాతృకాయై నమః

ఓం విష్ణుస్వశ్రేయసే నమః

ఓం దేవమాత్రే నమః

ఓం సర్వసంపత్ప్రదాయిన్యై నమః

ఓం కింకర్యై నమః

ఓం మాత్రే నమః

ఓం గీర్వాణ్యై నమః

ఓం సురాపానామోదిన్యై నమః

ఓం ఆధారాయై నమః

ఓం హితపత్నికాయై నమః

ఓం స్వాధిస్ఠానసమాశ్రయాయై నమః

ఓం అనాహతాబ్జనిలయాయై నమః

ఓం అజ్ఞాయై నమః

ఓం పద్మాసనాసీనాయై నమః

ఓం విశుద్దస్థలసంస్థితాయై నమః

ఓం అష్టత్రింశత్కళామూర్త్యై నమః

ఓం సుషుమ్నాయై నమః

ఓం చారుమధ్యాయై నమః

ఓం యోగేశ్వర్యై నమః

ఓం మునిద్యేయాయై నమః

ఓం పరబ్రహ్మస్వరూపిణ్యై నమః

ఓం చతుర్భుజాయై నమః

ఓం చంద్రచూడాయై నమః

ఓం పురాణాగమరూపిణ్యై నమః

ఓం ఐంకారారాదయే నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం పంచప్రణవరూపిణ్యై నమః

ఓం భూతేశ్వర్యై నమః

ఓం భూతమయ్యై నమః

ఓం పంచాశద్వర్ణరూపిణ్యై నమః

ఓం షోడశన్యాసమహాభూషాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం దశమాతృకాయై నమః

ఓం ఆధారశక్యై నమః

ఓం తరుణ్యై నమః

ఓం లక్ష్యై నమః

ఓం త్రిపురభైరవ్యై నమః

ఓం శాంభవ్యై నమః

ఓం సచ్చిదానందాయై నమః

ఓం సచ్చిదానందరూపిణ్యై నమః

ఓం మాంగళుఅదాయిన్యై నమః

ఓం మాన్యాయ్యై నమః

ఓం సర్వమంగళాకారిణ్యై నమః

ఓం యోగలక్ష్మ్యై నమః

ఓం భోగలక్ష్మ్యై నమః

ఓం రాజ్యలక్ష్మ్యై నమః

ఓం త్రికోణగాయై నమః

ఓం సర్వసౌభాగ్యసంపన్నాయై నమః

ఓం సర్వసంపత్తిదాయన్యై నమః

ఓం నవకోణపురావాసాయై నమః

ఓం బిందుత్రయసమన్వితాయై నమః

 


🌹శ్రీ మాత్రే నమః🌹

🙏🙏🙏

 రామాయణమ్.96

.

ఇంత సైన్యము గంగ ఒడ్డుకు ఎందుకు వచ్చింది? కారణమేమై ఉంటుంది ? అనుమానం వచ్చింది గుహుడికి.ఆ రధము మీద కనపడే ధ్వజాన్ని బట్టి చూస్తే ఇది భరతుడిసేనావాహిని అని తేటతెల్లమవుతున్నది.

.

భరతుడు ఇప్పుడెందుకు వచ్చినాడు ? ఇక్కడున్న పల్లెలోని జనులను బంధించటానికి రాలేదుకదా! మనలను చంపటానికి కాదుకదా ! లేక రాజ్యాన్ని పూర్తిగా నిష్కంటకం చేసుకోవాలనే ఉద్దేశంతో రాముని చంపివేయటానికి కాదుకదా!

.

రాముడు నాకు ప్రభువే కాదు ,నాకు మిత్రుడు కూడా ఆయన ప్రయోజనం కాపాడటానికి అందరూ సన్నద్ధం కండు అని సేనను ఆజ్ఞాపించాడు .

.

ఐదువందల నావలలో ఒక్కొక్క దానిపై నూర్గురు యోధులు కవచధారులై సిద్ధంగా ఉండండి ! రాముడివిషయంలో భరతుడికి ఏ విధమైన దుష్టబుద్ధిలేదని తేలిన తరువాతనే ఆతని సేన గంగను సుఖంగా దాటగలుగుతుంది.అని పలికి అందరినీ సిద్ధం చేసి తాను మాత్రం భరతుడికి మత్స్యమాంసములు,తేనె పట్టుకొని వినయంగా భరతుడికి ఎదురు వెళ్ళాడు.

.

సుమంత్రుడు ఆతనిని చూపి భరతునితో ఈయన పేరు గుహుడు నీ అన్నకు ప్రాణస్నేహితుడు ఆయనను నీవుకలిసి మాట్లాడితే రాముని ఆచూకీ మనకు తెలుస్తుంది.అని చెప్పాడు.

.

అప్పుడు భరతుడు శీఘ్రంగా గుహుని తనవద్దకు తీసుకురమ్మన్నాడు.

.

గుహుడు వినయంగా భరతుడితో మేమంతా నీకు లొంగిఉండేవారము.ఇది నీదాసుని గృహము. దీనిలో నీ ఇచ్ఛానుసారము నివసింపు అని కోరినాడు

.

.నీకునీసైన్యమునకుసరిపడునంతదుంపలు  ,పండ్లు,పచ్చిమాంసము,ఎండుమాంసము ఉన్నది నీ సైన్యము సుఖముగా నేటిరాత్రికి భుజించి ,విశ్రమించి రేపు బయలుదేరవచ్చును అని వినయంగా పలికాడు గుహుడు.

.

రాముని మిత్రుడా   ఇంత సేనకు నీవు ఒక్కడవే ఆతిధ్యమివ్వాలనుకొనే నీ మనస్సు ఎంతగొప్పది ! .

.

మాకు ఒకటే కోరిక ఈ గంగ దాటి భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళాలి మేమంతా సుఖంగా గంగదాటే మార్గం చూపించు అని భరతుడు కోరాడు.

.

అదెంత పని మేమంతా నీ వెంట వచ్చి దాటించగలము కానీ నాకొక సందేహమున్నది ,ఇంత సేనతో నీవెందుకు బయలుదేరావు రామునికి కీడు తలపెట్టే ఉద్దేశ్యమేమీ లేదుకదా!

.

అతని మాటలు విన్న భరతుడు ,రాముడికి కీడు తలపెట్టే దుష్కాలము ఎన్నడునూ రాకుండు గాక రాముడు నాకు తండ్రివంటి వాడు ! ( భ్రాతా ! జ్యేష్టః పితృసమో).

.

వనములో నివసిస్తున్న రాముని వెనుకకు తీసుకొని వచ్చుటకే వెళుతున్నాను .గుహుడా మరొక విధముగా తలపకుము .

ఇది సత్యము!.

.

భరతుడి మాటలువిన్న గుహుడి ముఖం వికసించింది.

.

ఆహా ! అప్రయత్నముగా లభించిన రాజ్యలక్ష్మిని తృణప్రాయంగా విడిచిపెట్టే నీవంటివాడు నాకీ లోకంలో ఎవ్వరూ కనపడలేదు.నీ కీర్తి లోకంలో శాశ్వతంగా వ్యాపించగలదు .

.

ఇంతలో రాత్రి అయ్యింది .అందరూ విశ్రమించారు.

.

రాముడిగురించిన ఆలోచనలతో భరతుడికి దుఃఖము చుట్టుముట్టింది.ఆయనను అది కాల్చి వేయసాగింది.అన్ని అవయవాలనుండీ ధారాపాతంగా చెమట కారటం మొదలుపెట్టింది.

.

 ఆయన దుఃఖమే ఒక మహా పర్వతము

ఆయన ఆలోచనలే ఆ పర్వతమందలి శిలలు

ఆయన నిట్టూర్పులు ధాతువులు

ఆయన దైన్యమే ఆపర్వతమందలి వృక్ష సముదాయము

ఆయనకు కలిగే శోకము,ఆయాసము ,మనస్తాపము దాని శిఖరములు.

ఆయనకు కలిగిన మోహము అనంతమైన జంతుసముదాయము

ఆయనకు కలిగిన సంతాపము దానిమీదున్న వెదురుపొదలు.

.

ఏమి చేయాలో తోచటం లేదు నిదురరాదు !కనులు మూత పడటం లేదు. దుఃఖము దుఃఖము ఒకటే దుఃఖము.మనశ్శాంతి కరవై అల్లల్లాడిపోతున్న భరతుడిని గుహుడు ఆ రాత్రి అంతా ఓదారుస్తునే ఉన్నాడు.

.

NB

చుట్టూ అష్టదిగ్బంధము చేసి వచ్చాడు గుహుడు .రాముడికి హాని జరుగుతుందేమో అని ఏమాత్రం అనుమానంకలిగినా భరతుడి సేన ముందుకు కదలలేదు.

.అందుకే "రామస్య ఆత్మ సమో సఖా" అని గుహుడి గురించి మహర్షి వ్రాసింది.

.

వూటుకూరు జానకిరామారావు

దైవలీల

 *దైవలీల*  


✍🏻 నారంశెట్టి ఉమామహేశ్వరరావు 


 మరణ భయమనేది  ప్రాణులన్నిటికీ  సహజమే. “మనుష్యుడు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నదని” భగవద్గీతలో వచించినట్టు గ్రహించే జ్ఞానులు అరుదుగా కనిపిస్తారు.  మరణానికి ముందే  బ్రహ్మానుభవాన్ని పొందిన వారు కాలాన్ని  సద్వినియోగం చేసుకుని ఆత్మజ్ఞాన సంపన్నులై చరిస్తారు.  అలాంటి కథ భారతంలో కనిపిస్తుంది. 

      కురుక్షేత్ర  యుద్ధం ముగిసింది. భీష్ముడు అంపశయ్య మీద మరణం కోసం  ఎదురు  చూస్తున్నాడు. పాండవులతో సహా  కృష్ణుడు  భీష్ముడి దర్శనానికి  వెళ్ళాడు. పాండవులను చూసిన భీష్ముడి నయనాలు అశ్రు పూరితాలయ్యాయి. 

భీష్మ పితామహుని ఆ స్థితిలో చూసిన ధర్మరాజు కలత చెంది “ఇచ్ఛామరణం వరంగా పొందిన మహానుభావుడైన భీష్ముని,  అనుమతి గ్రహించి మాత్రమే జయించగలిగాము. అంతటి మహాత్ముడి అశ్రు నయనాలను తిలకించడం చిత్రంగా ఉంది. మరణ భయం పీడిస్తున్నదేమో” అనే సందేహం వెంటాడగా కృష్ణుడితో  ప్రస్తావించాడు.

‘నీ సందేహాన్ని భీష్ముడినే ప్రశ్నించి సంతృప్తి చెందు” అని బదులిచ్చాడు కృష్ణుడు. జగన్నాటక సూత్రధారి కృష్ణుడికి తెలియందేమీ లేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానం అర్హులైన వారు చెబితే అధిక ప్రభావం ఉంటుందని అలా చేసాడు కృష్ణుడు. 

సమాధానం తెలుసుకోవాలన్న ఉత్సుకతలో ఉన్న ధర్మరాజు “పితామహా! నీ నాయనాలు అశ్రుపూరితం కావడం చూడలేక పోతున్నాను. మరణ భయమా? లేక మరేదైనా కారణమా? దయతో వివరించగలవా” అని అడిగాడు. 

భీష్ముడు “ధర్మజా! మీరు జీవితంలో చాలా కష్టనష్టాలు అనుభవించారు. బాధలు మీతో పక్క పంచుకున్నాయి. కష్టాలంటే సాధారణ  కష్టాలు కాదు సుమీ. ఇతరుల కష్టాలు వేరు. మీ కష్టాలు వేరు. మీకు సాక్షాత్తు భగవంతుడే ప్రక్కన నిలబడి సాయమందించినప్పటికీ ఎన్నో అవమానాలు అనుభవించారు. అలాంటప్పుడు ఇతరుల కష్టాలు కష్టాలే కాదు. భగవంతుడి యొక్క లీల, మాయ ఇంత విచిత్రంగా ఉంటుందా అన్న జ్ఞాపకం కలగగానే నయనాలు అశ్రు పూరితలయ్యాయి తప్ప మరణ భయం క్రుంగదీయలేదు” అన్నాడు.

దైవశక్తి, లీలలు గ్రహించి మెలగాలి నరులు. లోకాన్ని సృష్టించిన విధాత , పాలించే విష్ణువు, లయ  కారకుడైన పరమేశ్వరులకు సృష్టిలోని జీవులకు ఏమివ్వాలో తెలుసు. ఎనభై  నాలుగు లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన మానవ  జన్మ పొందిన మానవుడు  ఆధ్యాత్మిక చింతన మార్గంలో  పయనిస్తూ  పరోపకారాన్ని  కాంక్షిస్తూ  దైవస్మరణతో  గడుపుతూ  జన్మను సార్ధకం  చేసుకుని తరించాలి.  

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది.     9985831828*