13, ఏప్రిల్ 2025, ఆదివారం

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                *విరచిత*

         *”శివానందలహరి”*

            *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*శివ భక్తులు ధన్యులని శంకరులు ఈ శ్లోకంలో తెలిపారు.*


*శ్లోకము : 72*


*ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం*

     

*భిత్వా మహా బలిభిరీశ్వర నామ మంత్రైః*

    

*దివ్యాశ్రితం భుజగ భూషణ ముద్వహంతి*

    

*యే పాదపద్మ మిహతే శివతే కృతార్థాః !!"*


*తాత్పర్యము :~*


*ఈశ్వరా ! నిధులు వెదికేవాడు, కన్నులకు అంజనము వేసికొని అది కనిపెట్టి ఆ చోట నిధి రక్షకులైన దేవతలను పూజించి, త్రవ్వి ఆనిధిని తీసుకొని సంతోషాన్ని పొందిన విధంగా భక్తుడు ధ్యానమనే అంజనంతో మీ పాదపద్మ నిధిని కనిపెట్టి మీ నామ మంత్రముతో మహా బలియొనర్చి, ఆవరణమైన అఙ్ఞానమును తొలగించి, దేవతాశ్రితమూ, భుజగభూషితమూ, అయిన మీ పాదపద్మములను గ్రహించి వాటిని శిరసా వహించి , జన్మసాఫల్యంగా పరమానందమును పొందుతాడు.*


*వివరణ :-*


*శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో ఈశ్వరుని పాదపద్మాన్ని గొప్ప నిధిగా వర్ణించారు. భూమిలో అనేక నిధులుంటాయి. అందువలననే భూమిని "రత్న గర్భ" అంటారు. భూమిలోని నిధులను దక్కించుకోవడానికి, గట్టి ప్రయత్నం చేయాలి.*


*అలాగే శివపాదములనే నిధిని పొందాలన్నా కూడా ఎంతో కష్టపడాలి.*


*భూమిలో నిధి ఎక్కడుందో తెలియాలంటే కంటికి అంజనం రాసుకోవాలి. అంజనమంటే ఒక విధమైన ప్రత్యేక కాటుక. శివపాద నిధిని చూడాలంటే ముందుగా శివధ్యానం చేసి దర్శించాలి.  శివ ధ్యానం శివనిధిని పొందడానికి అంజనంలాంటిదన్నమాట.*


*నిధి కనబడగానే మనచేతికందదు.  ఎందుకంటే నిధి భూమి బయట వుండదు. అది రాళ్ళచేత రప్పలచేత కప్పబడి ఉంటుంది.  దాన్ని కొందరు దేవతలో దేవతా సర్పములో కాపలా కాస్తూంటాయి. కొన్ని ప్రత్యేకమైన మంత్రాల నుచ్చరించి , బలుల సమర్పించి నిదులను రక్షించే దేవతలను ప్రసన్నము గావించుకొని, భూమిని త్రవ్వి అడ్డుగావున్న రాళ్ళను తొలగించుకొని  ఆ నిధులను పొందాలి.*


*అలాగే శివపాద నిధిని ధ్యానంలో దర్శించినంత మాత్రాన అది మనకు లభింపదు. మన పాపాలు శివధ్యానానికి ప్రతి బంధకాలు అవుతాయి  ముందు వాటిని తొలగించాలి. తరువాత మంత్రోచ్చారణ శివనామ స్మరణలతో శివుని చుట్టూ కాపలాగా వున్న ప్రమథగణాది దేవతలను ప్రసన్నులను చేసుకోవాలి. ఆ తరువాత సన్నిధిలో బ్రహ్మాది దేవతలచే ఆశ్రయింప బడినదీ, వాసుకి మొదలైన సర్పాలంకృతులతో యుండేది అయిన శివపాద నిధిని దక్కించుకోవాలి. ఇవన్నీ చేయగలిగితే తప్పక శివపాద నిధిని పొంది ధన్యులు కావచ్చునని శంకరులు చెప్పారు.*.


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మహా శక్తి…

 *మనలోని మహా శక్తి………….*.

(హనుమత్ విజయోత్సవం సందర్బంగా)

************************

*హనుమా!! సీతాన్వేషణ నీకు తప్పా మరెవారికీ సాధ్యం కాదయ్యా!!**ఆ తల్లిని వెదకి కనుక్కొని వచ్చే ధీరుడివి నువ్వొక్కడివే. ఈ సప్త సముద్రాలు దాటి నేను పొగలను కానీ మళ్ళీ రావడం నాకు కష్టం. నేను వృద్ధుడిని కదా. నీకు ఏదైనా సుసాధ్యం. వాయు పుత్రుడివి. రుద్రాంశ సంభూతుడువి. ఆ సీతా రాములను సదా నీ హృదయాంతరగమున ప్రతిష్టించుకున్న శ్రీరామ భక్తుడువి. 


ఈ సప్త సముద్రాలే కాదు సకల భూనభోంతరాలను ఒక్క క్షణంలో చుట్టి వచ్చే వాడివి అని జాంబవంతుడు అనగానే అక్కడున్న అంగద వానర వీరులంతా ముక్త కంఠంతో *జై హనుమా జయ జయ హనుమా* అంటూ  ఒక్క పెట్టున నినాదాలు చేయగా………


అంతవరకూ ఈ సముద్రాలు ఎలా దాటాలి లంకకు ఎలా వెళ్ళాలి  రాముని ఆజ్ఞ ఎలా పాలించాలి  *ఆ సీతమ్మ తల్లీ జాడ భారం నాపై పెట్టిన ఆ రామచంద్రునికి ఏమని సమాధానం చెప్పాలి* లక్ష్మణ మూర్తి ముందే కోపగ్రస్తుడు అని  విచార వదనంతో విచారిస్తూ ఆ పర్వతంఫై ఓ మూలకు కూర్చున్న హనుమంతుడు 


తన తోటి సహచరుల నినాదాలు, జాంబవంతుని మాటలు విని  వారి ప్రోత్సాహం, వారి పొగడ్తలతో అత్యుత్సాహం పొంది ఒక్కసారే తన శరీరాన్ని పెంచి

విశ్వ రూపం తో భీకరమైన కంఠంతో  *హూం**అంటూ 

ఒక్క  భయంకరమైన కేక పెట్టాడు. 

                                        

ఆ అరపు విని పర్వతం అటూ ఇటూ ఉగసాగింది.పర్వతం ఫై ఉన్న వానరులంతా భయబ్రాంతులతో చెల్లా చెదురై కేకలు పెట్టసాగారు. 

ఆ కొండపై ఉన్న పశు పక్ష్యాదులు అన్నీ బిక్కు బిక్కు మంటూ రోధించ సాగాయి. సముద్రాలు పెద్ద హోరుతో అల్లకల్లోలం కాసాగాయి. సాగర కె రటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ అంబరాన్ని తాకసాగాయి

ఆ భీభత్స వాతావరణాన్ని, ఆ ప్రళయాన్ని చూచి జాంబవంతుడు  *హనుమా శాంతించు ఆంజనేయ శాంతించు**అని అనగానే హనుమంతుడు తన తప్పిదం తెలుసుకుని ఒక్క పెట్టున ఆ కొండను తన కాలితో తన్ని ఆకాశం పైకి లంఘించి వాయు వేగమున సీతమ్మ తల్లిని వెదకుటకు లంక దిశగా ఎగిరిపోసాగాడు ఆ ఆ వీర హనుమానుడు.


*కొందరికి తమలో దాగి ఉన్న శక్తిని మరొకరు గుర్తించి చెబితే గానీ తమకు తెలువదు.**ఆంజనేయ స్వామి విషయంలో అదే కదా జరిగింది.


జై వీర హనుమాన్ 🙏జయ జయ హనుమాన్ 🙏శ్రీ రామ జయ రామ 🙏జయ జయ రామా 🙏


*మిత్రాజీ**

(గుండవరం ప్రభాకర్ రావు, అత్వెల్లి మేడ్చల్ జిల్లా)

కుంతీదేవి శ్రీకృష్ణ ప్రార్ధన

 🙏కుంతీదేవి శ్రీకృష్ణ ప్రార్ధన 🙏

శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా! 

లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా

నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా! 

నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!

              శ్రీకృష్ణా = కృష్ణా {కృష్ణ - నల్లనివాడు}; యదుభూషణా = కృష్ణా {యదు భూషణుడు - యదు వంశమునకు భూషణము వంటి వాడు, కృష్ణుడు}; నరసఖా = కృష్ణా {నరసఖుడు - అర్జునునకు సఖుడు, కృష్ణుడు}; శృంగారరత్నాకరా = కృష్ణా {శృంగార రత్నాకరుడు -శృగార రసమునకు సముద్రము వంటివాడు, కృష్ణుడు}; లోకద్రోహినరేంద్రవంశదహనా = కృష్ణా {లోకద్రోహినరేంద్రవంశదహన - దుష్టరాజవంశముల నాశనము చేయువాడు, కృష్ణుడు}; లోకేశ్వరా = కృష్ణా {లోకేశ్వరుడు - లోకములకు ఈశ్వరుడు, కృష్ణుడు}; దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణా = కృష్ణా {దేవతానీకగోబ్రాహ్మణార్తి హరణుడు - దేవత = దేవతల, అనీక = సమూహమునకును, బ్రాహ్మణ = బ్రాహ్మణులకును, గోగణ = గోవులమందకును, ఆర్తి = బాధలను, హరణా = హరించువాడు, కృష్ణుడు}; నిర్వాణ సంధాయకా = కృష్ణా {నిర్వాణ సంధాయికుడు - మోక్షమును కలింగించువాడు, కృష్ణుడు}; నీకున్ = నీకు; మ్రొక్కెదన్ = నమస్కరిస్తున్నాను; త్రుంపవే = తెంపుము; భవ = సంసార; లతల్ = బంధనములు; నిత్యానుకంపానిధీ = కృష్ణా {నిత్యానుకంపానిధి -శాశ్వతమైన దయకు నిలయమైనవాడు, కృష్ణుడు}.

            శ్రీ కృష్ణా! యదుకులవిభూషణా! అర్జునమిత్రా! శృంగార రత్నాకరా! జగత్కంటకులైన రాజుల వంశాలను దహించే వాడా! జగదీశ్వరా! ఆపన్నులైన దేవతల, బ్రాహ్మణుల, ఆవులమందల ఆర్తులను బాపువాడా! మోక్షాన్ని ప్రసాదించే ప్రభూ! నీకు నమస్కరిస్తున్నాను; నాకీ ఈ భవబంధాలను తెంపెయ్యి.

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

‘అదేం పిచ్చి కోరిక

 ❤️ *ఒక్క సారి చదడానికి ప్రయత్నం చేయండి* ❤️ ఒకబ్బాయికి ఉరిశిక్ష అమలు చేస్తారు.

కారణం అతను చేసిన తప్పులు.


అధికారి: ‘ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పు’



అబ్బాయి: నాకంటే ముందు నా తల్లిదండ్రులను ఉరితీయాలి

అధికారి: ‘అదేం పిచ్చి కోరిక. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ఉరితీయమంటావా?. అందులో ఏమైనా అర్థం ఉందా?’


అబ్బాయి: అవును అర్థం ఉంది..

నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే

నన్ను చూసి మురిసిపోయారు.

నేను అల్లరి చేస్తుంటే గద్దించలేదు.

వయసొచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే నన్ను మంద లించలేదు.


ఆ తర్వాత నేను వ్యసనాలకు బానిసనయ్యాను.

తప్పుడు మార్గంలో పయనించాను.

ఎన్నో ఘోరమైన పనులు చేశాను.

నేను ఒక్కడ్నే కొడుకునని.. నన్ను ఆనాడే గారాబం చేయకుండా..

దండించి ఉంటే.. నేను ఈ రోజు.. ఈ పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు.


నేనే మారతానని అనుకున్నారే కానీ…

నేను ఎలా మారాలో చెప్పలేదు.

నేను చేసే పనులకు తల్లిదండ్రులే అడ్డుచెప్పకపోవడంతో..

నేను చేసే పనులన్నీ కరెక్టే అనుకున్నా.

ఇప్పుడు అలాంటి పనులకు సమాజం అడ్డు చెబుతుంటే తెలిసొచ్చింది..

నేను నడిచింది తప్పుడు మార్గమని.


నాడు వాళ్లు నన్ను అలా వదిలేశారు కాబట్టే..

నేనిలా ఉరికంభంపై ఉన్నా.

అందుకే నా కంటే ముందు నా తల్లిదండ్రులనే ముందు ఉరి తీయాలి అన్నాడు.


డబ్బు సంపాదనలో పడి మన పిల్లల ఆలోచన ఎలా వుంది, ఎలాంటి పనులు చేస్తున్నారు అని గమనించకపోతే మనమే బాధపడాల్సి వుంటుంది. దయచేసి పిల్లలు చేసే పనులను గమనించండి, వారిని మంచి మార్గంలో నడపండి. మంచి సమాజానికి నిర్మించేందుకు దోహద పడండి.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం  - ప్రతిపత్ - చిత్ర -‌‌ భాను వాసరే* (13.04.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

సుభాషితమ్

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎                

𝕝𝕝 *శ్లో* 𝕝𝕝    *మహాజనస్యసంసర్గః* 

  *కస్య నోన్నతికారకః ।*

       *పద్మపత్రస్థితం తోయమ్*

             *దత్తే ముక్తాఫలశ్రీయమ్ 

𝕝𝕝 *తా* 𝕝𝕝 *గొప్ప వ్యక్తుల సహవాసం ఎవరికి ప్రయోజనకరం కాదు?  తామర రేకుపై ఉన్న నీటి బిందువు కూడా ముత్యంలా ప్రకాశిస్తుంది.....*

 ✍️💐🌹🪷🙏

పణ్డితులకు

 శోకస్థానసహస్రాణి వర్షస్థాన శతాని చ|

దివసే దివసే మూఢమావిశన్తి న పణ్డితమ్||


ప్రతిరోజూ వేలకొలది దుఃఖములు మరియు వందలకొద్దీ సంతోషములు మూర్ఖులకే వస్తాయి కానీ పణ్డితులకు కాదు

కాలపథం

 "దిగ్దేశకాలపథినాం చ జ్ఞానం సూర్యాద్వినిర్గతం|


దిక్కులు (దిక్పథం), దేశాలు, కాలపథం మొదలైన జ్ఞానాలన్నీ సూర్యుని నుంచే ఉద్భవించాయి.

ధనికులు విద్యావంతులు

 *2070*

*కం*

ధనికులు విద్యావంతులు

ఘనజీవన్మూర్తులైన కడతేరగనే

తనువును శవమని పిలుతురు

మననము ప్రేతని తలతురు మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనికులు, విద్యావంతులు, గొప్ప జీవితం గడుపుతూ ఉన్న వారైననూ కడతేరగనే ఈ భూలోకంలో దేహాన్ని శవం అని పిలుస్తారు, వ్యక్తి ని ప్రేత అని తలుస్తారు.

*సందేశం*:-- ఎంత గొప్పపేరు ప్రతిష్ఠ లు కల వారి నైనా చనిపోయిన వెంటనే శవం, ప్రేత అనే పేరులతో మాత్రమే గుర్తిస్తారు. అక్కడ అందరూ సమానులే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ఆదివారం🌞* *🌹13, ఏప్రిల్, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌞ఆదివారం🌞*

*🌹13, ఏప్రిల్, 2025🌹*

   *దృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్ర మాసం - కృష్ణపక్షం*


*తిథి      : పాడ్యమి* పూర్తిగా రోజంతా రాత్రితో సహా

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం   : చిత్త* రా 09.11 వరకు ఉపరి *స్వాతి*


*యోగం  : హర్షణ* రా 09.40 వరకు ఉపరి *వజ్ర*

*కరణం   : బాలువ* రా 07.08 *కౌలువ* పూర్తిగా రాత్రంతా


*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 12.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *మ 01.58 - 03.46*

అభిజిత్ కాలం  : *ప 11.44 - 12.33*


*వర్జ్యం          : రా 03.29 - 05.18 తె*

*దుర్ముహూర్తం  : సా 04.43 - 05.32*

*రాహు కాలం   : సా 04.49 - 06.22*

గుళికకాళం      : *మ 03.15 - 04.48*

యమగండం     : *మ 12.08 - 01.42*

సూర్యరాశి : *మీనం*

చంద్రరాశి : *కన్య/తుల*

సూర్యోదయం :*ఉ 05.54* 

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం          :  *ఉ 05.54 - 08.23*

సంగవకాలం         :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    :     *10.53 - 01.23*

అపరాహ్న కాలం    : *మ 01.23 - 03.53*


*ఆబ్ధికం తిధి         : చైత్ర పౌర్ణమి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.22*

ప్రదోష కాలం         :  *సా 06.22 - 08.40*

రాత్రి కాలం         :  *రా 08.40 - 11.45*

నిశీధి కాలం          :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.07*

--------------------------------------------------

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌞శ్రీ సూర్య చంద్ర కళా స్తోత్రం🌝*


*ద్వాదశాత్మా సుధాత్మానౌ* 

*దివాకరనిశాకరౌ |*

*సప్తమీ దశమీ జాతౌ*

*సూర్యచంద్రౌ గతిర్మమ ||*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹