21, ఏప్రిల్ 2024, ఆదివారం

కాశీ యాత్ర (ఐదవ భాగము)

 

కాశీ యాత్ర (ఐదవ భాగము) 

7వ తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి రూముకు తాళం వేసి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు  మీదకు)వెళ్ళాము మేము అక్కడకు చేరుకోగానే  మా కారు సిద్ధంగా వుంది డ్రైవరు పేరు యాదవ్. మేము ఫోను చేసి కారుదగ్గరకు వెళ్లి మా లగేజీని డిక్కీలో పెట్టి కూర్చున్నాము. అది మారుతి డిజైర్ తెల్ల కారు. డ్రైవరు చిన్నగా కారు నడిపి ఒక అర్థగంటకు కాశీ పట్టణాన్ని వదలి గయావైపు వెళ్లే రోడ్డు ఎక్కించాడు. . మధ్యలో బనారస్ హిందూ యూనివర్శిటీ  గేట్లను దాటుతూ మా కారు వెళ్ళింది. అందులో ఒక గేటు పేరు హైదరాబాదు గేటు అని డ్రైవరు చెప్పాడు. కొంతదూరం వెళ్లిన తరువాత కారును ఒక డాబా ముందు ఆపి మీరు ఇక్కడ టిఫిన్ చేయవచ్చు అన్నాడు. మేము టిఫిన్ చేసాము.  అక్కడ కూడా మన టిఫిన్లే వున్నాయి. దోశ 70 రూపాయలు, ఇడ్లీ ప్లేటు (4 చిన్నవి) 50 రూపాయలు, టి  10 రూపాయలు. తరువాత ఎక్కడ ఆగకుండా మాకారు మధ్యాన్నం 12 గంటల సమయంలో గయను చేరింది. ముందుగా విష్ణు పాద ఆలయూయాన్ని చూసాము. అక్కడ క్యూ పద్దతి లేదు సెల్ఫోనులు లోపలి అనుమతించరు.  ఒక్కసారిగా ఒక గుంపు గుంపుగా భక్తులను గుడిలోకి వదులుతారు.  నాకు ఆ పద్ధతి మంచిగా అనిపించలేదు. ఎట్లాగో మేము ఆ గుంపులోవెళ్లి విష్ణుపాదాన్ని దర్శించుకొని వంటిగంటకల్లా బయటకు వచ్చాము. మా డ్రైవరు తిరిగి మమ్మలను ఊళ్లోకి తీసుకొని వచ్చాడు. ఊర్లో తెలుగులో ఆంధ్ర భోజనం అని వ్రాసి ఉన్న ఒక హోటలులో భోజనం చేసాము. ఏ మాత్రం రుచిగా లేదు ప్లేటుకు 120 తీసుకున్నారు. అక్కడినుంచి మేము అక్కడి శక్తిపీఠం అయినా మాంగల్యగౌరి అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. ఆ దేవాలయం ఒక చిన్న కొండ మీద  వున్నది. మేము వెళుతుంటే ఎవరో భక్తులు అక్కడ ఇప్పుడు దర్శనం కావటం లేదు అందుకే మేము తిరిగి వెళుతున్నాము అని అన్నారు. వారి మాటలు మాకు కొంత నిరుత్సాహం కలుగ చేసింది. మేము అమ్మవారిని తలుచుకొని కొండ  ఎక్కాము అక్కడ క్యూ చాలా పెద్దగా వుంది. అక్కడ ఒక టేబులు ముందు ఒక ముగ్గురు కూర్చొని వున్నారు. మేము వారలను విచారిస్తే కొంత సేపు లాగండి ఇక్కడికి డిప్యూటీ సీఎం వస్తున్నారు.  ఆయన వెళ్లిన తరువాత మీరు ఒక్కొక్కరు రూ 250 కడితే ప్రత్యేక దర్శనం లభిస్తుందని అన్నారు. మేము రూ 750 ఇచ్చి టికెట్లు తీసుకున్నాము. ఒక ఆర్ గంటలోనే మాకు దర్శనమ్ అయ్యింది. నేను అమ్మవారు అంటే మన దేవాలయాలలో మాదిరిగా తల్లి విగ్రహం ఉంటుందని అనుకున్నా కానీ ఆలా లేదు ఒక చిన్న గది మధ్యలో ఒక చిన్న గద్దెమీద దీరఘాచేతురస్రాకారంలో వెండితాపడం చేసిఉంది. దానిమీద ఒక దీపం వెలుగుతున్నది. మేము కొండదిగి క్రిందికి రాగానే మా డ్రైవరు మమ్మలను బుద్ధగయాకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మా కారు వెళ్ళటానికి పర్మిషన్ ఉండదట అక్కడి వాహనాలలోనే వెళ్ళాలట. మేము ఒక ఈరీక్షను 400 రూపాయలకు మాట్లాడుకొని అన్ని బుద్ధ దేవాలయాలను చూసాము. ఎండ మండిపోతున్నది. మేము కారులో గొడుగులు తెచ్చాము కానీ వాటిని అక్కడే వదలటం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. 3-4 గంటల సమయంలో తిరుగు ప్రయాణం చేసాము. సాయంత్రం 5 గంటల సమయంలో ఉదయం టిఫిన్ చేసిన హోటలులో మళ్ళి వెళ్లి టీ  తాగి ప్రయాణం కొనసాగించాము. ఆ డాబా హోటలు చుట్టూ గోధుమ పంట కోతకు సిద్ధంగా ఉండి వుంది. నేను మొదటిసారి గోధుమ పంటను చూడటం. రాత్రి 7 గంటల సమయంకల్లా మమ్మలను వారణాసిలో బెంగాలీ టోలి వద్ద దింపాడు దారిలో ఒక పార్ధవ శరీరాన్ని ఊరేగిస్తూ తీసుకొని  వెళుతున్నారు. ఈ బాడీని మణికంటిక గాటుకే తీసుకొని వెళతారు అని డ్రైవరు చెప్పాడు. నేను నా కాళ్ళ చెప్పులు కారులోనే విప్పి మోక్షప్రాప్తి పొందిన ఆ జీవికి నమస్కరించాను. ప్రతి రోజు రాత్రి 12 గంటల సమయంలో మణికంటిక గాటులో జ్వలించే చితి భస్మాన్ని తీసుకొని వచ్చి కాశీ విశ్వనాధునికి అభిషేకం చేస్తారని డ్రైవర్ చెప్పాడు.  రాత్రి రూముకు చేరుకోగానే మేము ఆశ్రమంలో పెట్టిన టిఫిన్ తిని విశ్రాన్తి తీసుకున్నాము. మరుసటి రోజు ప్రయాగ వెళ్ళటానికి అదే డ్రైవరుతో మాట్లాడుకున్నాము ట్రిప్ ఖరీదు 3,400/- 

 7వ తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి రూముకు తాళం వేసి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు  మీదకు)వెళ్ళాము. మా డ్రైవరు సిద్ధంగా వున్నాడు. ఈ రోజు మనం తొందరగానే వస్తాము ప్రయాగ 110 కిలోమీటర్లే అని అన్నాడు. 8 గంటల సమయంలో ఒక హోటలు ముందు కారుని ఆపి టిఫిన్ చేయమన్నాడు. మేము టిఫిన్ చేసాము. అక్కడినుంచి దాదాపు 9-30 కల్లా ప్రయాగ గంగా బ్రిడ్జి మీదుగా ప్రయాగరాజ్కు తీసుకొని వెళ్ళాడు. బ్రిడ్జిమీద కారువున్నప్పుడు దూరంగా ఒక వంతెనను చూపించి అది యమునా నదిమీద వున్నదని చెప్పాడు. మమ్మలను యమునా నదీ తీరానికి తీసుకొని వెళ్లి మీరు బోటులో త్రివేణి సంగమంకు వెళ్లి స్నానాలు చేయమని చెప్పాడు. మేము ఒక చిన్నపడవను 1600 రూపాయలకు మాట్లాడుకొని వెళ్ళాము. అక్కడకు వెళ్లి స్నానాలు చేసి తిరిగి వడ్డుకు వచ్చాము. అక్కడే వున్న హనుమంతుని దేవాలయానికి వెళ్ళమని చెపితే మేము వెళ్ళాము. అక్కడ స్వామి పడుకొని వుంటారు. "లేటేహుయే బడా హనుమాన్ దేవల్ " అని చెప్పాడు. తొందరలోనే స్వామీ దర్శనం అయ్యింది. అక్కడినుంచి మమ్ములను ఇంకొక శక్తీ పీఠం అయిన మాతా మాధవేశ్వరి దేవాలయంకు తీసుకొని వెళ్ళాడు. అక్కడ మన దేవాలయాల్లో మాదిరిగానే బారికేట్లు వున్నాయి కానీ జనం ఎక్కువ లేక పోవటం వలన దర్శనం త్వరగానే అయ్యింది. అక్కడ అమ్మవారు ఒక ఉయ్యాల కట్టి క్రింద ఒక నాలుగు పలకల ఫలకం వుంది. విగ్రహం లేదు. అమ్మవారి దర్శనం అవ్వగానే మేము తిరోన్ముకులం అయ్యాము. ఈ రోజు సోమవారం కాబట్టి మ్యూజియంకు సెలవు అని చెప్పి మమ్మలను మ్యూజియంకు తీసుకొని వెళ్ళలేదు. మధ్యాన్నం 2-30కు రూముకు చేరుకొని సత్రంలో భోజనం చేసి విశ్రమించి మరుసటి రోజు హైదరాబాదు ప్రయాణానికి సంసిద్ధులం అయ్యాము. ఆ డ్రైవరుకు తిరిగి ఉదయం 5 గంటలకు వచ్చి మమ్మలను విమానాశ్రయంలో విడవాలని చెప్పాము. రాత్రే రూము రెంటు 1500 చెల్లించి రసీదు తీసుకున్నాము. ఆంధ్రశ్రమంలో సాయంత్రం 7ఇంటికి ఒక డాక్టరు రూము 1 లో వస్తారు అన్నారు. నేను నాకు కొంత జలుబుగా ఉంటే డాక్టరు దగ్గరకు వెళ్లి మందులు తీసుకున్నాను. మందులు కూడా ఉచితంగా ఇస్తారు. 

9వ .తారీకు ఉదయం 5గంటలకు మేము తయారయి సామానులన్నీ తీసుకొని  రూముకు తాళం వేసి గేటుదగ్గర వాచిమనుకు రసీదు చూపించి చిన్నగా సైకిలుబాబా ఆశ్రమంముందునుంచి నడుచుకుంటూ బెంగాలి టోలె (రోడ్డు  మీదకు)వెళ్ళాము. మా కారు మాకోసం సిద్ధంగా వుంది. కారులో కూర్చోగానే ఒక 40 నిముషాలలో మమ్ములను విమానాశ్రయంలో దింపాడు. నేను డ్రైవరుకు 700 రూపాయలను ఇచ్చాను. టైము ప్రకారం మా విమానం 7-40 కి వచ్చింది. వారణాసిలో చెకింగ్ మన హైదరాబాదుకన్నా ఎక్కువగా వుంది.  మా సూటుకేసును కాబిన్లో వేయక తప్పదన్నారు. దానికి ట్యాగ్ వేయించుకొని మిగిలిన రెండు బ్యాగులు నేనొకటి నా కుమారుడు ఒకటి పట్టుకొని విమానం ఎక్కాము. మా విమానం యెరిండియా ఎక్ష్ప్రెస్స్ మేము హైదరాబాదులో 10 గంటలకల్లా దిగాము. ఒక టాక్సీ మాట్లాడుకొని ఇంటికి చేరాము. దానితో మా యాత్ర పరిసమాప్తం ఐయ్యింది . 

శుభం బురియత్ 

సర్వజన సుఖుఇనోభవంతు 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ

 

Joke


















 

మూలకారణం

 ॐ దీనికి మూలకారణం 

     రామానుజులవారి అష్టోత్తర నామావళిలో 65వ నామం 

   "అద్వైతమత విచ్ఛేత్రే" అని ఉన్నప్పుడు, 

    భగవద్రామానుజులు నిజంగా ఆ పని చేశారా?  

    లేక తరువాత వచ్చిన ఈ జీయర్ స్వామివంటివారు రామానుజలకు ఆపాదిస్తూ, అద్వైతాన్ని ద్వేషిస్తున్నారా? ? 

   ఆ నామం వలన, సర్వమత సహజీవనం ఎలా కుదురుతుంది?


 రామానుజాష్టోత్తర శతనామావళిః ॥


ఓం రామానుజాయ నమః । 

పుష్కరాక్షాయ । 

యతీన్ద్రాయ । 

కరుణాకరాయ ।

కాన్తిమత్యాత్మజాయ । 

శ్రీమతే । 

లీలామానుషవిగ్రహాయ । 

సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞాయ ।

సర్వజ్ఞాయ । 

సజ్జనప్రియాయ ।

నారాయణకృపాపాత్రాయ । 

శ్రీభూతపురనాయకాయ । 

అనఘాయ । 

భక్తమన్దారాయ ।

కేశవానన్దవర్ధనాయ । 

కాఞ్చిపూర్ణప్రియసఖాయ । 

ప్రణతార్తివినాశకాయ ।

పుణ్యసఙ్కీర్తనాయ । 

పుణ్యాయ । 

బ్రహ్మరాక్షసమోచకాయ నమః ॥౨౦ ॥ యాదవపాదితాపార్థవృక్షఛేదకుఠారకాయ నమః । 

అమోఘాయ । 

లక్ష్మణమునయే । 

శారదాషోకనాశనాయ ।

నిరన్తరజనాజ్ఞానవిమోచనవిచక్షణాయ । 

వేదాన్తద్వయసారజ్ఞాయ ।

వరదామ్బుప్రదాయకాయ । 

పరాభిప్రాయతత్త్వజ్ఞాయ । 

యామునాఙ్గులిమోచకాయ ।

దేవరాజకృపాలబ్ధషడ్వాక్యార్థమహోదధయే । 

పూర్ణార్యలబ్ధసన్మన్త్రాయ ।

శౌరిపాదాబ్జషట్పదాయ । 

త్రిదణ్డధారిణే । 

బ్రహ్మజ్ఞాయ ।

బ్రహ్మజ్ఞానపరాయణాయ । 

రఙ్గేశకైఙ్కర్యరథాయ ।

విభూతిద్వయనాయకాయ । 

గోష్ఠిపూర్ణకృపాలబ్ధమన్త్రరాజప్రకాశకాయ ।

వరరఙ్గానుకమ్పాత్తద్రావిడామ్నాయపారగాయ ।

మాలాధరార్యసుజ్ఞాతద్రావిడామ్నాయతత్త్వధియే నమః ॥ ౪౦ ॥ 

చతుస్సప్తశిష్యాఢ్యాయ నమః । 

పఞ్చాచార్యపదాశ్రయాయ ।

ప్రపీతవిషతీర్థామ్బుప్రకటీకృతవైభవాయ ।

ప్రణతార్తిహరాచార్యదత్తభిక్షైకభోజనాయ । 

పవిత్రీకృతకూరేశాయ ।

భాగినేయత్రిదణ్డకాయ । 

కూరేశదాశరథ్యాదిచరమార్థప్రకాశకాయ ।

రఙ్గేశవేఙ్కటేశాదిప్రకటీకృతవైభవాయ । 

దేవరాజార్చనరతాయ ।

మూకముక్తిప్రదాయకాయ । 

యజ్ఞమూర్తిప్రతిష్ఠాత్రే । 

మన్నాథాయ ।

ధరణీధరాయ । 

వరదాచార్యసద్భక్తాయ । 

యజ్ఞేశార్తివినాశకాయ ।

అనన్తాభిష్టఫలదాయ । 

విట్టలేశప్రపూజితాయ ।

శ్రీశైలపూర్ణకరుణాలబ్ధరామాయణార్థకాయ । 

ప్రపత్తిధర్మైకరతాయ ।

గోవిన్దార్యప్రియానుజాయ నమః ॥ ౬౦ ॥ 

వ్యాససూత్రార్థతత్త్వజ్ఞాయ నమః ।

బోధాయనమతానుగాయ ।

శ్రీభాష్యాదిమహాగ్రన్థకారకాయ । 

కలినాశనాయ । 

అద్వైతమతవిచ్ఛేత్రే ।

విశిష్టాద్వైతపారగాయ । 

కురఙ్గనగరీపూర్ణమన్త్రరత్నోపదేశికాయ ।

వినాశితేతరమతాయ । 

శేషీకృతరమాపతయే । 

పుత్రీకృత శఠారాతయే ।

శఠజితే । 

ఋణమోచకాయ । 

భాషాదత్తహయగ్రీవాయ । 

భాష్యకారాయ ।

మఘహాయశసే ।

పవిత్రీకృతభూభాగాయ । 

కూర్మనాథప్రకాశకాయ ।

శ్రీవేఙ్కటాచలాధీశ-శఙ్ఖచక్రప్రదాయకాయ ।

శ్రీవేఙ్కటేశశ్వశురాయ । 

శ్రీరామసకఖదేశికాయ నమః ॥ ౮౦ ॥

కృపామాత్రప్రసన్నార్యాయ నమః । 

గోపికామోక్షదాయకాయ ।

సమీచీనార్యసచ్ఛిష్యసత్కృతాయ । 

వైష్ణవప్రియాయ ।

కృమికాణ్టనృపధ్వంసీనే । 

సర్వమన్త్రమహోదధయే ।

అఙ్గీకృతాన్ధ్రపూర్ణార్యాయ । శాలగ్రామప్రతిష్ఠితాయ ।

శ్రీభక్తగ్రామపూర్ణేశాయ ।

విష్ణువర్ధనరక్షకాయ ।

బౌద్ధధ్వాన్తసహస్రాంశవే । 

శేషరూపప్రదర్శకాయ ।

నగరీకృతవేదాద్రయే । 

దిల్లీశ్వరసమర్చితాయ । 

నారాయణప్రతిష్ఠాత్రే ।

సమ్పత్పుత్రవిమోచకాయ । 

సమ్పత్కుమారజనకాయ । 

సాధులోకశిఖామణయే ।

సుప్రతిష్ఠితగోవిన్దరాజాయ । 

పూర్ణమనోరథాయ నమః ॥ ౧౦౦ ॥

గోదాగ్రజాయ నమః । 

దిగ్విజేత్రే । 

గోదాభీష్టప్రపూరకాయ ।

సర్వసంశయవిచ్ఛేత్రే । 

విష్ణులోకప్రదాయకాయ । 

అవ్యాహతమహద్వర్త్మనే ।

యతిరాజాయ । 

జగద్గురవే నమః ॥ ౧౦౮ ॥


ఇతి రామానుజాష్టోత్తరశతనామావళిః సమాప్తా ।

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*21-04-2024 / ఆదివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


సమాజంలో విశేషంగా పలుకుబడి పెరుగుతుంది. నూతన వాహనం  కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులు నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.  ఉద్యోగస్తులకు పదవులు పెరుగుతాయి.

---------------------------------------

వృషభం


నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు సంబంధించి ఆప్తుల  నుండి కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితాలు పొందుతారు. సంతానం విద్యా  ఫలితాలు  సంతృప్తి కలిగిస్తాయి.

---------------------------------------

మిధునం


బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఇతరులకు ధన పరంగా మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు ఆకస్మికంగా వాయిదా వేస్తారు. కుటుంబ విషయంలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఒత్తిడి తప్పదు.

---------------------------------------

కర్కాటకం


పాత రుణాలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి.   దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందగిస్తాయి.

---------------------------------------

సింహం


గృహమున శుభకార్యాలు  నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది.  విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగార్థులకు ఆశించిన స్థాన చలనాలు కలుగుతాయి.

---------------------------------------

కన్య


దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలరు.  వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతాహవరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. స్ధిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.

---------------------------------------

తుల


కొన్ని వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. సోదరులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు మరింత కష్టపడాలి.

---------------------------------------

వృశ్చికం


చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో  కాని  పూర్తికావు. కొన్ని వ్యవహారాలలో కావలసిన వారే మోసగిస్తారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.  సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రహారాలు ఉండవు.  వ్యాపారాలు తీసుకున్న నిర్ణయాలు కలిసిరాక నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------

ధనస్సు


సమాజంలో విశేషమైన గౌరవమర్యాదలు కలుగుతాయి. నూతన వ్యక్తుల  పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి.  భూ సంబంధిత  క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

మకరం


అధిక శ్రమతో అల్ప  ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత కలవర పెడతాయి. బంధు మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన విశ్రాంతి ఉండదు.

---------------------------------------

కుంభం


ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అవసరానికి మించి ఖర్చు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ఆర్థికంగా కొంత ప్రతికూల పరిస్థితులుంటాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో లోపాలు ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

---------------------------------------

మీనం


ఆర్థిక లావాదేవీలు కొంత మందకోడిగా  సాగుతాయి. శ్రమతో గాని కొన్ని పనులు పూర్తి కావు. కుటుంబ పెద్దలతో కల సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలలో వాహనం ఇబ్బందులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

వెలిగించిన దీపం

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో ।।   

*యథా ప్రదీప్తః పురతః ప్రదీపః*

*ప్రకాశమన్యస్య కరోతి దీప్యన్।*

*తధేహ పంచేంద్రియదీపవృక్షాః*

*జ్ఞానప్రదీప్తాఃపరవంత ఏవ॥*


          వెలిగించిన దీపం తాను ప్రకాశిస్తూ, తన సమీపాన గల ఇతరవస్తువులను కూడా ప్రకాశింపజేసినట్లు *శరీరమనే వృక్షంలోనున్న పంచేంద్రియాలు జ్ఞానంతో తాము ప్రకాశిస్తూ, విషయాలను కూడా ప్రకాశింపజేస్తాయి*....

నాలుగు రకాల వారూ

 


కర్తా కారయితా చైవ

ప్రేరకశ్చానుమోదకః

సుకృతం దుష్కృతం చైవ

చత్వారి సమభాగినః


చేసిన, చేయించిన, ప్రేరేపించిన, ఊరక చోద్యం చూస్తున్నా .... ఈ నాలుగు రకాల వారూ *అనుభవించాల్సిందే*. మహామహా భీష్మునకే తప్పలేదు. పరమాత్మ కూడా అతీతంగా వ్యవహరించడు


మూర్తి,ఫిజిక్స్ లెక్చరర్,9985617100

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం -‌ త్రయోదశి - ఉత్తరాఫల్గుని -‌‌ భాను వాసరే* (21.04.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


*నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం  -‌ త్రయోదశి - ఉత్తరాఫల్గుని -‌‌ భాను వాసరే* (21.04.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/XWjZ5cWhuVY?si=QTPgLq46jB2SWUhR


.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

మాన్యత లేమిని,

 ధార్మికగీత 

                                                                   

      01. శ్లో: మన స్యేకం వచ స్యేకం 

                 కర్మ ణ్యేకం మహాత్మనామ్

                 మన స్యన్యత్ వచ స్యన్యత్

                 కర్మ ణ్యన్యత్ దురాత్మనామ్

                                        

చ. మనసును మాట చేతయును మాన్యుల కుండెడు నేక రీతిలో ,

     ననయము వారి జీవనము నందఱి కుండును మార్గదర్శియై, 

     మనసును మాట చేత నణు మాత్రము పొంతన లేక యుంద్రు దు

     ర్మనుజులు లోకమందు , తగు మాన్యత లేమిని,మంచి లేమి చేన్. 01*


✍️గోపాలుని మధుసూదన రావు 🙏