7, నవంబర్ 2026, శనివారం

చరించువాడు

  *చరన్నై మధు విందతి చరన్ స్వాదుముదుంబరం*


🔵🟢🟡🔴🙏🔴🟡🟢🔵


చరించువాడు మధువును పొందుతున్నాడు - తీయని ఫలాలను

అనుభవిస్తున్నాడు(యజుర్వేదం)


'చవేతి చరైతి' అని వేదమాత బోధిస్తోంది.

-

హరిశ్చంద్రుని పుత్రుడైన రోహితునకు ఇన్ద్రుడు గోచరించి “చరైవేతి” అనే పదంతో పూర్తయ్యే ఐదు మంత్రాలను బోధించాడు.


'చరించు' - అని దీని భావం. 'ఆచరించు' అని కూడా అర్థాన్ని స్వీకరించాలి.'చరించుట' - అంటే ‘నడచుట' అని అర్థం.


'నిద్రించకు-నడువు' అని బోధ.


వ్యక్తి నిరంతరం ఆచరించాలి. ఆచరణ-అంటే కర్మానుష్ఠానం. ఈ జీవితం కర్మాచరణకు లభించింది. సత్కర్మను ఆచరించి, బ్రతుకును సార్థకం చేసుకోవాలి.

ఆచరించడమే మన పని.


ఆచరిస్తూ సాగాలి జీవితం.


సోమరితనం, అకర్మణ్యత-మనిషికి కూడదు. 'విశ్రాంతి' మన జీవిత విధానం కాకూడదు. శ్రమించడానికి తగిన బలాన్ని పుంజుకునేందుకు, సేదతీరడానికి మాత్రమే 'విశ్రాంతి'. అంతేకానీ 'విశ్రాంతి' కోసమే జీవితం కాదు. శరీరాన్ని విశ్రమింపజేయాలనుకున్నా మనస్సు విశ్రమించదు. ఏ శ్రమా లేనివారి జీవితంలో మనసు వికృత భావాలను పెంపొందించుకుని, మానసిక రుగ్మతలకు లోనవుతుంది.

అందుకే భౌతిక, శారీరక శ్రమ అవసరం. శ్రమించడానికే ఈ దేహం ఏర్పడింది.


సూర్యస్య పశ్య స్థేమానం

యోన తన్హయతే అనిశం ||


'సూర్యుని నిత్య కర్మణ్యతని చూడమని ఆదేశించాడు ఇన్ద్రుడు. విశ్రమించకుండా నిరంతరం (ఆ)చరిస్తున్న సూర్యచక్రుల నుండి మనం నిత్యకర్మణ్యతని గ్రహించాలి.

'నిద్రపోవద్దు' - అజాగ్రత్త, అలసత్వం పనికిరాదు.


స్వస్తిపంథామను చరేమ సూర్యాచన్ద్ర మసావివ (ఋగ్వేదం) - సూర్యచంద్రుల వలె శుభమార్గాన్ని అనుసరిద్దాం అని బోధిస్తోంది వేదం.


విధ్యుక్తమైన విహిత ధర్మాన్ని అనుసరించి నిరంతరం ఉత్తమ కార్యాలను ఆచరిస్తూనే ఉండాలి. ‘సోమరి కన్నా దొంగ మేలు' అని స్వామి వివేకానంద ఘోషించారు. దీని

అర్థం దొంగతనాన్ని ప్రోత్సహించడం కాదు, దానికంటే సోమరితనం మహాపాపం అని చెప్పడం ఆ మహాత్ముని ఉద్దేశం.


ఒక పడవ నదిలో ప్రయాణించడానికే తయారు చేయబడింది. అంతేగానీ, ఒడ్డున కూర్చోబెట్టడానికి కాదు. అలాగే ఈ శరీరం కర్మకై ప్రభవించింది. అంతేగానీ పనికిమాలిన వాక్యాలు వల్లిస్తూ సోమరిగా బ్రతకడానికి కాదు.


ఒక యంత్రాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే క్రమంగా పాడవుతుంది. అలాగే ఈ

శరీరంలో మనస్సును, దేహాన్ని కూడా వాటిపని వాటిని చేయనివ్వాలి.


అలాగని నిరంతరం భుక్తి కోసం వృత్తిని 'మాత్రమే' చేయమని కాదు. ఉద్యోగ వ్యాపారాదులే కాక, ఆధ్యాత్మిక సాధన, నిరంతరం చైతన్యవంతమైన జీవితం,

సానుకూలమైన(Positive) దృక్పథంతో కూడిన చక్కని ఆలోచనలు శక్తిమంతమైన జీవిత విధానాలు.


సంఘంలో ఒక ఉత్పాదక (Productive) క్రియను ప్రతి వ్యక్తీ ఆచరించాలి. తన ఉనికిని సార్థకపరచుకోవాలి. లాభాపేక్షతో చేసినవి మాత్రమే పనులు-అని చెప్పలేం. మన లాభమే కాక పదిమందికీ పనికి వచ్చే కర్మలే సార్థకాలు. వాటిని ఆచరిస్తూ

సాగడమే అసలైన జీవితం.



అంతేకానీ విశ్రాంతిని లక్ష్యంగా చేసుకొని జీవిత ప్రయాణాన్ని సాగించడం తగని పని.


“తగినంత సంపాదించాం, ఇంక విశ్రాంతి తీసుకుందాం” అనే దృక్పథం మంచిది కాదు. “ఇంతవరకు సంపాదన కోసం శ్రమించాం. ఇప్పుడు సంపాదన కంటే విలువైన ధర్మాదుల కోసం శ్రమిద్దాం" అనుకొని జీవితాన్ని నిత్య చైతన్యంగా మలచుకోవాలి.


ఆచరించే వారికే ఆనందం(మధువు), ధర్మం, జ్ఞానం లభిస్తాయి. 'ఆచార ప్రభవో ధర్మః' అనే మాటకి ఇదే అర్థం. సిద్ధి, ఫలం కర్మశీలునకే ప్రాప్తిస్తాయి.



🔴🔵🟡🟢🙏🟢🟡🔵🔴


*నాహం కర్త*🙏*హరి కర్తా*


*కర్తను నేను కాదు,చేసేది చేయించేది అంతా శ్రీహరి*


🔴🟣🔵🟢🙏🟢🔵🟣🔴



*సమస్త దేవతల శుభాశీస్సులతో...*

*శుభమస్తు! నిత్య శుభమస్తు! సమస్త సన్మంగళాని భవన్తు! శ్రీరస్తు! విజయోస్తు! దిగ్విజయోస్తు! అవిఘ్నమస్తు! ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు! పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు! ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు!  సకల మనోభీష్ట సిద్ధిరస్తు!*


*సర్వేజనాః సుఖినోభవంతు!*


*సర్వ సజ్జనా స్వజనో భవంతు!*

*సర్వ స్వజ్జనా సుకృతో భవంతు!*

*సర్వ సుకృతజనః సుఖినోభవంతు!!*


*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు!*

*అందరికీ శుభమే జరుగుగాక!*


*సర్వేషాం శాన్తిర్భవతు!*

*అందరూ సుఖసంతోషాలతో ఉండుగాక!*


*సర్వేషాం పూర్ణంభవతు!*

*అందరి జీవితాలూ సమృద్ధిగా ఉండుగాక!*


*సర్వేషాం మంగళం భవతు!*

*అందరి జీవితాలూ మంగళకరంగా ఉండుగాక!*

🙏🌹☘️🌹☘️🌹🙏


*వేదఆశీర్వచనము 👇*                                 

కష్టం" విలువ

  *🔔 _శుభోదయం_ 🔔*


      *_కాలే కడుపుకు "కష్టం" విలువ, ఒంటరితనంలో "బంధాల" విలువ, అవకాశం చేజారినప్పుడే "సమయం" విలువ_*

      *_చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడే "మనిషి" విలువ తెలుస్తాయి._*


🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞🌅🌞

పెద్దవాళ్లు* వెళ్లిపోతే

 *మన పెద్దవాళ్లు* వెళ్లిపోతే… ఒక మనిషి మాత్రమే కాదు, ఒక జీవన విధానం, ఒక పాత ప్రపంచం వెళ్లిపోతుంది…*💔


ఒక్కసారి ఆలోచించండి…


ఇంకో 10–15 ఏళ్ల తర్వాత మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా ఉంటుందో…


1. మన తాతయ్యలు…

2. మన బామ్మలు…

3. మన అమ్మా నాన్నలు…

4. మన బాబాయిలు, పిన్నిలు…


ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లి పోతున్నారు, వెళ్లి పోతారు, మనం కూడా. పోయిన ఏడాది ఉన్న కొందరు పెద్దవారు, తెలిసిన వారు, పరిచయస్థులు ఆత్మీయులు, 

కొందరు ఇరుగు పొరుగు, మన వీధిలోని లేదా ప్రక్క వీధిలోని వారే, ఇప్పుడు లేరు, లేరుగా 


అప్పుడు మనం కేవలం కొంతమంది మనుషులను కోల్పోము.


1. ఒక జీవన విధానాన్ని కోల్పోతాం.

2. ఒక సంస్కృతిని కోల్పోతాం.

3. ఒక తరం జ్ఞాపకాలను కోల్పోతాం.


🌅 వాళ్ల ఉదయాలు వేరు…


1. సూర్యుడు ఉదయించకముందే నిద్రలేచేవారు.


2. ఇంటి ముందు ముగ్గు వేసేవారు.

3. మొక్కలకు నీళ్లు పోసేవారు.

4. తోటలో పూలు కోసేవారు.

4. ఆ పూలను దేవుడి దగ్గర పెట్టేవారు.


5. ఏ పని చేయాలన్నా దేవుడి పేరు చెప్పుకుని రోజు మొదలుపెట్టేవారు.


మనకు ఇవన్నీ ఇప్పుడు చిన్న విషయాల్లా అనిపించవచ్చు…


కానీ అదే వాళ్ల జీవితం.


🙏 దేవుడిని నమ్మేవారు.


1. దేవాలయానికి వెళ్లేవారు.

2. ఏకాదశి ఎప్పుడు?

4. అమావాస్య ఎప్పుడు?

5. పౌర్ణమి ఎప్పుడు?అన్నది తెలుసుకోవడానికివారికి మొబైల్‌లో రిమైండర్ అవసరం లేదు. వారి మనసులోనే ఒక పంచాంగం ఉండేది.


🤝 వాళ్ల పలకరింపులు కూడా నిజమైనవే…


1. దారిలో ఎవరో కనిపిస్తే ఆగి, “ఎలా ఉన్నావు? అంతా బాగుందా?” అని అడిగేవారు.


2. అది మర్యాద కోసం కాదు.మనస్ఫూర్తిగా అడిగేవారు.

3. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారని తెలిస్తే వారి ఇంటికి వెళ్లి పరామర్శించేవారు.

4. ఎవరి ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తమ ఇంటి వేడుకలా భావించేవారు.

5. ఎవరికైనా కష్టం వస్తే

“నీకేం కావాలి?” అని అడిగేవారు.


1. ఈ రోజుల్లో మనకు వందల మంది Facebook friends ఉండొచ్చు…కానీ ఇలాంటి మనుషులు ఎంతమంది ఉన్నారు?

3. 📖 వార్తాపత్రికను ఉదయం చదివేవారు.

4. మళ్లీ మధ్యాహ్నం తీసుకుని చదివేవారు.

5. సాయంత్రం కూడా ఒకసారి తిరగేసేవారు.


అది కేవలం వార్తల కోసం కాదు…


ప్రపంచంతో తమకున్న అనుబంధం కోసం.


📒 ఫోన్ నంబర్లు?


1. చిన్న డైరీలో రాసుకునేవారు. ఆ డైరీ ఎక్కడుందో కూడా వాళ్లకు తెలుసు.


2. మనకు వందల కాంటాక్ట్స్ ఉన్నా మన పక్కింటి మనిషి నంబర్ తెలియకపోవచ్చు.


3. వాళ్లకు మాత్రం

        ఊరిలోని చాలా  మంది నంబర్లు గుర్తుండేవి.


🏡 వాళ్ల జీవితంలో ఆడంబరం లేదు…


1. పాత చెప్పులు.

సాధారణ బట్టలు.

మందపాటి కళ్లద్దాలు.


అయినా…


ఎవరినీ మెప్పించాలనే అవసరం వాళ్లకు ఉండేది కాదు.


ఉన్నదానితో సంతోషంగా ఉండేవారు.


సంతృప్తి అంటే ఏమిటో వాళ్లను చూస్తే అర్థమయ్యేది.


🌱 వేసవి వచ్చిందంటే…


1. ఇంట్లో ఊరగాయలు.

2. వడియాలు.

3. అప్పడాలు.

4. . ఇంట్లోనే మసాలాలు.

5. . నాటు టమాటాలు. దేశీ వంకాయలు. తాజా ఆకుకూరలు. ఆహారంలో కేవలం రుచి కాదు…


ఒక తరం జ్ఞాపకం ఉండేది.


❤️ పండుగ అంటే కొత్త బట్టలు మాత్రమే కాదు…


అందరూ ఒకచోట చేరడం.


1. ఇంట్లో నవ్వులు.

2. పిల్లల అల్లరి.

3. అతిథుల రాక.

4. పక్కింటివారికి పిలుపు.

5. అందరూ కలిసి భోజనం చేయడం.

6. అదే పండుగ.

8. అదే ఆనందం.

9. అదే జీవితం.


కానీ…


ఆ ప్రపంచం నెమ్మదిగా మన కళ్ల ముందే కనుమరుగవుతోంది. 💔


ఒక్కొక్కరుగా…


వాళ్లు వెళ్లిపోతున్నారు.


వాళ్లు వెళ్లిపోయినప్పుడు

కేవలం ఒక కుర్చీ ఖాళీ కాదు…


1. ఒక ఇల్లు ఖాళీ అవుతుంది.

2. వాళ్ల గది ఖాళీ అవుతుంది.

3. వాళ్ల గొంతు వినిపించదు.

4. వాళ్ల పిలుపు వినిపించదు.

5. వాళ్ల చేతి వంట రుచి ఉండదు.

6. వాళ్లు చెప్పే పాత కథలు ఉండవు.

7. అప్పుడు మనకు అర్థమవుతుంది…

8. వాళ్లు మన జీవితంలో ఎంత పెద్ద భాగమో.

9. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వారి ఫొటో ముందు నిలబడి ఎన్ని కన్నీళ్లు పెట్టుకున్నా…వారితో మాట్లాడలేం.


అందుకే…

1. ఇప్పుడే మాట్లాడండి.

2. ఇప్పుడే కలవండి.

3. ఇప్పుడే వాళ్ల పక్కన కూర్చోండి.

4. వాళ్ల చిన్ననాటి కథలు అడగండి.

5. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది? అని అడగండి.

6. వాళ్లు చెప్పే అదే కథను పదోసారి చెప్పినా వినండి.

ఎందుకంటే…

7. వాళ్లకు అది పాత కథ కావచ్చు. కానీ రేపు అది మనకు దొరకని జ్ఞాపకం కావచ్చు.

8. వారితో కలిసి భోజనం చేయండి.

9. వారి చేతిని పట్టుకోండి.

10. కాసేపు వారి పక్కన మౌనంగా కూర్చున్నా సరే…

11. మీ సమయాన్ని ఇవ్వండి.

12. ఎందుకంటే మనం వారికి ఇచ్చే ఖరీదైన బహుమతుల కంటే…


13. మన సమయమే వారికి ఎక్కువ విలువైనది.


ఒకరోజు…

14. వాళ్లు కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంటుంది.

15. ఆ గదిలోకి వెళ్లినప్పుడు వారి వాసన గుర్తుకు రావచ్చు.

16. వారి గొంతు వినిపించినట్టుగా అనిపించవచ్చు.

17. అప్పుడు మనసులో ఒక్క మాట రావచ్చు…

18. “ఇంకొంచెం సమయం వాళ్లతో గడిపి ఉంటే బాగుండేది…” 


ఆ బాధ రాకముందే…


19. వారితో సమయం గడపండి.


ఎందుకంటే…


20. మన పెద్దలు కేవలం మన కుటుంబ సభ్యులు కాదు.


1. వాళ్లు మన వేర్లు.

2. వాళ్లు మన చరిత్ర.

3. వాళ్లు మన సంస్కృతి.

4. వాళ్లే మన గతానికి, మన వర్తమానానికి మధ్య ఉన్న వంతెన.

5. వేర్లను మర్చిపోయిన చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా…

6. ఎప్పటికో ఒకరోజు ఒంటరిగా మారుతుంది.


అందుకే…


వారిని ప్రేమించండి.

. వారిని గౌరవించండి.

వారిని పలకరించండి.

. వారిని దగ్గరగా ఉంచుకోండి.

వారికి మీ సమయాన్ని ఇవ్వండి.


రేపు సమయం ఉండకపోవచ్చు.


కానీ ఈరోజు… ఇంకా మన చేతుల్లోనే ఉంది. 


మన పెద్దలను వారు మనతో ఉన్నప్పుడే ప్రేమిద్దాం. ఐరుగు పొరుగు వారిని కూడా ప్రేమిద్దాం, కల్సు కొందాం, మాటలాడు కొందాం, అరమారికలు, ఎటువంటి భేద భావాలు లేకుండా. 


LET US ACT AS BRIDGES, CONNECTING PEOPLE, NOT AS WALLS, DEVIDING PEOPLE.


PEOPLE MAY FORGET WHAT YOU GAVE, PEOPLE MAY FORGET WHAT YOU TOLD OR SPOKE BUT PEOPLE WILL NEVER FORGET BUT ALWAYS REMEMBER, HOW YOU MADE THEM FEEL AND HOW YOU TREATED THEM . 👌😊.


వాళ్లు వెళ్లిపోయిన తర్వాత వారి విలువ తెలుసుకోవడం కంటే… వాళ్లు మనతో ఉన్నప్పుడే వారి విలువను తెలుసుకోవడం మంచిది.


*వాళ్లు మన మూలాలు*.

*వాళ్లు మన జ్ఞాపకాలు.*

*వాళ్లు మన ఇల్లు*.

వాళ్లు… *మన వాళ్లు*


ఈ వ్యాసం వ్రాసి పంపిన వారికి వేలాది వందనాలు. 🙏🙏🙏

👍🌹🌹🌹

5, నవంబర్ 2026, గురువారం

డబ్బులు లేని యవ్వనం

 *"డబ్బులు లేని యవ్వనం… తోడు లేని వృద్ధాప్యం..."*

               ➖➖➖✍️```


“మనిషి జీవితంలో డబ్బులు లేని యవ్వనం, 

తోడు లేని వృద్ధాప్యం ఈ రెండూ నరకమే”... 

ఇదే జీవితంలో దాగి ఉన్న ఒక లోతైన సత్యం.


జీవితం మనిషికి అన్నీ ఒకేసారి ఇవ్వదు.

ఒక దశలో శక్తిని ఇస్తుంది… కానీ సంపదను ఇవ్వదు.

మరో దశలో సంపదను ఇస్తుంది… కానీ ఆ సంపదను ఆస్వాదించే శక్తిని తగ్గిస్తుంది.

చివరికి శరీరం ఉంటుంది… జ్ఞాపకాలు ఉంటాయి… 

కానీ పక్కన తోడుగా మనిషి ఉండకపోవచ్చు.


యవ్వనం అంటే సంపాదించగల శక్తితో పాటు రేపు అనే కాలం.

వృద్ధాప్యం అంటే సంపాదించిన దానికంటే, తోడుగా నిలిచే మనుషుల విలువ తెలిసే కాలం.


యవ్వనంలో డబ్బు లేకపోవడం బాధే. కోరికలు ఉంటాయి… అవసరాలు ఉంటాయి… బాధ్యతలు ఉంటాయి... వాటిని మార్చే శక్తి కూడా ఉంటుంది. చేతులు పనిచేస్తాయి. కాళ్లు నడుస్తాయి. మనసులో ఆశ ఉంటుంది. అందుకే ఆ దశలో  లేమి అన్నది ఒక పరిస్థితి మాత్రమే; అది జీవితానికి తుది తీర్పు కాదు.


కానీ వృద్ధాప్యంలో ఒంటరితనం అలా కాదు.

జీవితమంతా సంపాదించి,

ఉండడానికి ఒక ఇంటిని నిర్మించుకొని, పిల్లలను పెంచి, భవిష్యత్తు కోసం దాచుకున్న మనిషి... ఒకరోజున కిటికీ దగ్గర కూర్చుని ఒంటరిగా బయటకు చూస్తూ  ఉండవచ్చు. 

ఇంట్లో అన్నీ ఉండొచ్చు… కానీ “ఎలా ఉన్నావు”...అని పలకరించే బంధం మీతో లేకపోవచ్చు.

అప్పుడు తెలుస్తుంది...

జీవితంలో మనం కూడబెట్టవలసింది ఆస్తి కాదు,తోడుగా ఉండే అనుబంధాలు అని! 

.

మనిషి పుట్టినప్పుడు తనతో ఏమీ తీసుకురాడు.

చనిపోయేటప్పుడు ఏమీ తీసుకెళ్లడు.

మధ్యలో మాత్రం “ఇది నాది… ఇది నా కోసం…” అంటూ జీవితమంతా కూడబెడతాడు.

కానీ చివరికి అతనికి కావాల్సింది ఒక చిన్న గది, రెండు పూటల భోజనం, జీవించి ఉండడానికి మందులు… అంతకంటే ముఖ్యంగా తన మాట వినే ఒక తోడు.


అందుకే జీవితం మనకు ఒక విచిత్రమైన పాఠం నేర్పుతుంది.

యవ్వనంలో సంపాదన అవసరం.

వృద్ధాప్యంలో సాన్నిహిత్యం అవసరం.

కానీ రెండింటికంటే జీవితమంతా అవసరమైనది...మనుషులను కోల్పోకుండా జీవించడం.


డబ్బు సంపాదించాలి. ఎందుకంటే అది అవసరం. 

కానీ డబ్బు కోసం మనుషులను కోల్పోతే, ఒకరోజు ఆ డబ్బే మన ఒంటరితనానికి సాక్షిగా మిగిలిపోతుంది.

పిల్లల కోసం జీవితాన్ని అర్పించిన తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో వారి సమయం కావాలి; పిల్లల ఆస్తి కాదు.

జీవిత భాగస్వామికి చివరి దశలో ఆస్తులు,సంపద అవసరం లేదు; పక్కన కూర్చునే ఒక మనసు చాలు.


జీవితం అడిగేది...

“ఎంత సంపాదించావు” అని కాదు…

“ఎవరెవరి జీవితాల్లో నువ్వు ఒక మనిషిగా మిగిలిఉన్నావు”... అని.  అదే జీవితపు అసలు నిజం.


యవ్వనంలో డబ్బు లేకపోతే జీవితం మనల్ని పరీక్షిస్తుంది.

వృద్ధాప్యంలో తోడు లేకపోతే జీవితం అనుబంధాల అవసరాన్ని గుర్తుచేస్తుంది.


అందుకే సంపాదిద్దాం…అలాగే ఎదుగుదాం…

కానీ సంబంధాలను దూరం చేయకుండా...

మనతో కలిసి నడిచిన మనుషులను వెనక్కి వదిలిపెట్టకుండా.


ఎందుకంటే...

చివరికి మనిషి జీవించడానికి కావలసింది  డబ్బు కాదు… జీవితం అర్థవంతంగా నడిపించడానికి తోడుగా ఉండే ఒక మనిషి.✍️```

06నవంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹భృగువారం🌹*          

 *🪷06నవంబర్26🪷*           

  *దృగ్గణిత పంచాంగం*

                 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు* 

*ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం*


*తిథి       : ద్వాదశి* ఉ 10.30 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం   : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం   : హస్త* రా 04.43 తె వరకు ఉపరి *చిత్త*

*యోగం  : విష్కుంబ* రా 04.10 తె వరకు ఉపరి *ప్రీతి*

*కరణం   : తైతుల* ఉ 10.30 *గరజి* రా 10.36 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 04.30 - 05.30*

 అమృత కాలం  :  *రా 10.31 - 12.10*

 అభిజిత్ కాలం  :  *ఉ 11.28 - 12.14*

*వర్జ్యం             :మ12.36 - 02.15*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.10 మ 12.14 - 01.00*

*రాహు కాలం   : ఉ 10.25 - 11.51*

గుళికకాళం       : *ఉ 07.33 - 08.59*

యమగండం    : *మ 02.43 - 04.09*

 సూర్యరాశి : *తుల*                                       

చంద్రరాశి : *కన్య* 

సూర్యోదయం :*ఉ 06.17*  

సూర్యాస్తమయం :*సా 05.43*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      : *ఉ 06.07 - 08.24*

సంగవ కాలం        : *08.24 - 10.42*

మధ్యాహ్న కాలం   : *10.42 - 01.00*

అపరాహ్న కాలం  : *మ 01.00-03.17*

*ఆబ్ధికం తిధి        : ఆశ్వయుజ బహుళ త్రయోదశి*

సాయంకాలం     : *సా 03.17- 05.35*

ప్రదోష కాలం   :  *సా 05.35 - 08.05*

రాత్రి కాలం       : *రా 08.05 - 11.26*

నిశీధి కాలం       : *రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.27 - 05.17*

¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■

                  *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

            *🌷ఓం శ్రీ🌷*

*🪷మహాలక్ష్మీ దేవ్యై  నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

కర్మఫలం, కాల మహిమ

 *🌹 మన పాపకర్మే గ్రహరూపంలో బాధిస్తుంది 🌹*


               *కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు.మన పాపకర్మే గ్రహ రూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది. పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు. తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు. ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్ర మహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబర పడుతున్నాను అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.*


               *అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో? అన్నాడు. తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు కశ్యపుడు. అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు.*


                 *అంతటా కశ్యపుడు, సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం అని  అన్నాడా కశ్యపుడు. అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియ రానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు.*


               *కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు.  ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు! అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు. చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది.*


               *వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు.  ఇంతకూ తమకు కావలసింది.... అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ధనమయ్యా! ధనం! అన్నాడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.*


               *ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది. "మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు." ఒక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం. "పాపకర్మ బలీయంగా ఉంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా".*


               *ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి. కౌశికుడు రాజును రక్షించుదామని బయలుదేరినా,  పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది. ఏమిటి ఆ పాప కర్మ?  ఒక ముని మీద చచ్చిన పామును వేయడం. "మంచివారితో మహాత్ములతో చెలగాడటం." కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.*


               *రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు,"కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు." పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! "మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం ఉంటుంది".*


               *మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి. నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు." మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. "కర్మ బలీయమైనది. గోవిందా, నారాయణా, రామా, కృష్ణా!కాపాడు!కాపాడు!అని ప్రార్ధిస్తూ ఉంటాం.*


               *"ప్రాణాపాయంలో ఉన్నవాడి జాతకం చూసి భగవంతుడు ఇలా అంటాడు. ఓయి, నీవు ఎప్పుడన్నా పుణ్యం చేశావా?"* 


                 *నీ భార్య చేసిందా? నీ బిడ్డలు చేసినారా? నీ మిత్రులు నీకు పుణ్యం ధారపోసినారా? నీకు గురువుల అనుగ్రహం ఉన్నదా? నీవు చేసిన పుణ్యం లేదు, ఇతరులు నీకు ధారపోసిన పుణ్యం లేదు. మరి నేను ఎక్కడి నుంచి తెచ్చేది? అనుభవించు! నీ కర్మ అని అంటాడు. మన పుణ్యపలం మన జాతకంలో గురురూపంలో కనిపిస్తుంది. గురు అనుగ్రహం ఉన్నదా?  గురు దృష్టి ఉన్నదా?శుభగ్రహ దృష్టి వున్నదా? ఉంటే బ్రతికిపోతాము. లేదా బాధ పడాలి, తప్పదు. పాపం అంటే శరీరాన్ని తద్వారా మనసును బాధ పెట్టడమే.*


*"మనసు బాధ పడితేనే పాపకర్మ క్షయం అవుతుంది."*


*"మనసు సుఖ పడితే పుణ్యకర్మ క్షయం అవుతుంది"* .


               *పాపానికి, పుణ్యానికీ కారణం మనస్సే. ఆ మనసు చలించకుండా ఉంటే పుణ్యమూ లేదు, పాపమూ లేదు. అదే అకర్మ,వికర్మ,సుకర్మ. కోరిక లేకుండా చేస్తే కర్మ మనసును పట్టుకోదు.*


               *తాతముత్తాతలు చేసిన "పుణ్యఫలం, పాపఫలం తప్పక పిల్లలకు వస్తుంది, వచ్చి తీరుతుంది". ఆ పుణ్యమే మన సంతానాన్ని, మనుమలను కాపాడుతుంది. మన వంశాన్ని కూడా కాపాడుతుంది. ఇదే మన జాతకంలో రెండవ స్థానం, తొమ్మిదవ స్థానం స్పష్టంగా చెబుతుంది.*


               *"మనం చేసిన పాపాలు, ప్రారబ్ధం మన పితృదేవతలు చేసిన పుణ్యఫలితం వలన బ్రతికి బయట పడతాము" వారి పుణ్యఫలం మనల్ని కాపాడుతుంది. మనం చేసిన పుణ్యఫలం మన బిడ్డలను కాపాడుతుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కృపాకటాక్షములు ఉన్న పరీక్షిత్తు అంతటి వాడు కూడా మాయలో పడ్డాడు గదా!  కలిపురుషుణ్ణి నిలదీసిన వాడు కూడా అహంకారానికి లోనైనాడు. శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడి, గర్భం నుండి బయటపడిన వాడు నేడు మృత్యువు నుండి ఎందుకు బయట పడలేదు.*


            *అదే కర్మఫలం, కాల మహిమ.*


                   *కాలానికి, మాయకు ఎవ్వరూ అతీతులు కారు. దీనిలో మనం మరోకటి కూడా గమనించాలి. తక్షకుడు విషనాగు అంటే "ప్రారబ్దకర్మ'. దానిని కూడా జయించింది "మంత్రశాస్త్రం". కాటు చేత పుష్పించిన మహావృక్షం కాలి బూడిద అయితే,  మంత్రం మరలా దానిని చిగురింప జేసినది. అంటే "మంత్రం చేత ప్రారబ్దకర్మ తొలగబడుతుంది" అని మనం తెలుసుకోవాలి.మంత్రం ప్రాణం పోస్తుంది. కానీ ఆ "మంత్రం పనిచేయాలంటే ప్రారబ్ధకర్మ బాగుండాలి!"అంటే మనం సత్కర్మలు మాత్రమే ఆచరించాలి!*


*🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹*

శుక్రవారం,నవంబర్.6,2026

 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

శుక్రవారం,నవంబర్.6,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:ద్వాదశి ఉ10.56 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:హస్త తె5.36 వరకు

యోగం:వైధృతి ఉ7.22 వరకు తదుపరి విష్కంభం తె5.51 వరకు

కరణం:తైతుల ఉ10.56 వరకు

తదుపరి గరజి రా10.43 వరకు

వర్జ్యం:మ1.56 - 3.32

దుర్ముహూర్తము:ఉ8.19 - 9.05

మరల మ12.06 - 12.51

అమృతకాలం:రా11.34 - 1.10

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 -4.30

సూర్యరాశి:తుల||చంద్రరాశి:కన్య

సూర్యోదయం:6.04 || సూర్యాస్తమయం:5.25

ధనత్రయోదశి/ధనతేరస్

శ్రీ ధన్వంతరీ జయంతి

శ్రీ ధన్వంతరీ జయంతి శుభాకాంక్షలు

సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

మందు షాపు లిచ్చు మాత్రలే మింగేసి

 మందు షాపు లిచ్చు మాత్రలే మింగేసి

పోయె జబ్బు లనుచు పొంగిపోకు

తెలియకెదిగి జబ్బు తిక్కనే దీర్చురా

సకురు అప్ప రావు సత్య మిదిర! 


భావం: ఏ బాధ వచ్చినా, ఇంగ్లీష్ మందుల షాపు నుంచి ఏదో ఒక టెంపరరీ మాత్ర ఒకటి తెచ్చుకొని వేసేసుకుని, ఆహా! భలే తగ్గిపోయిందనుకుని, సంతోషపడిపోవద్దు! అది తగ్గిస్తున్నది నిజంగా జబ్బుని కాదు! ఆ జబ్బు ఒక బాధ ద్వారా తనకేమి కావాలో, తను భవిష్యత్తులో ఎటువంటి విపత్తులోకి వెళుతుందో, తనదైన భాషలో చెబుతూ, పన కేమి కావాలో అడుగుతుంది! అది ఒక మూగవాడి సైగల భాషలాగా రకరకాల లక్షణాలతో తెలియజేస్తూ ఉంటుంది! అటువంటి ఆ భాషలో ఉండే లక్షణాలను అర్ధం చేసుకుని, ఆ రాబోయే ఉపద్రవాన్ని నివారించగలిగే శక్తి హోమియో వైద్యానికి ఉంది! మెషీన్లు కనిపెట్టలేని   క్లిష్టమైన సమస్యలను సైతం హోమియోలో అవలీలగా గుర్తించి, నయం చేయవచ్చు! శరీర భాషను తెలిసిన ఏకైక వైద్యం హోమియో మాత్రమే! కాబట్టి టెంపరరీ ఇంగ్లీషు మాత్రలతో సమస్యలు ముదరబెట్టుకుని ఆపదలపాలవ్వకుండా, మంచి హోమియో వైద్యుల సహాయంతో ప్రతీ బాధనూ సవ్యంగా నయం చేయించుకోండి! టెస్ట్ లూ, స్కానింగ్ ల చుట్టూ తిరిగి టైమ్, డబ్బులూ వేస్ట్ చేసుకోకుండా, సింపుల్ గా శరీర లక్షణాలను బట్టి వ్యాధులను నయం చేయగలిగే మంచి హోమియో వైద్యుల దగ్గరకు వెళ్ళండి! 

సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, 


ఆన్లైన్లో హోమియోపతి వైద్యం కొరకు సంప్రదించండి దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 

తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు

మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలర

మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.

మందులు భారతదేశము మొత్తము ఆన్లైన్లో పంపించబడును.

వివరాలకు క్రింద పేర్కొన్న నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 

మీ పేరు, వయస్సు, లింగము మీ చిరునామా ముందుగా , ఇంగ్లీషులో పేర్కొని

తరువాత మీ సమస్యను క్లుప్తంగా వివరించండి మీరు పైన పేర్కొన్న ఏ భాషలో నాయనా డాక్టర్ గారి ని సంప్రదించవచ్చు తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

 స్త్రీల రోగముల నిపుణురాలు

WhatsApp No. 9035231905

భక్తి నుండి ఆత్మజ్ఞానం వైపు

  నామస్మరణ – 

భక్తి నుండి ఆత్మజ్ఞానం వైపు


నామస్మరణ అంటే కేవలం భగవంతుని నామాన్ని పదేపదే పలకడం మాత్రమే కాదు. మనస్సును భగవంతునిపై నిలిపి, క్రమంగా మనలోని చంచలత్వాన్ని తొలగించుకునే ఆధ్యాత్మిక సాధన.


మరి నామస్మరణ వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి?


మనస్సు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో పరుగులు తీస్తుంటుంది. కోరికలు, ఆందోళనలు, ఆశలు, అహంకారం మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వవు. అలాంటి మనస్సుకు భగవంతుని నామమే ఒక ఆధారం.


నామస్మరణ వల్ల మొదట మనస్సుకు ఏకాగ్రత, 

ఆ తరువాత చిత్తశుద్ధి, క్రమంగా అంతర్ముఖత్వం కలుగుతాయి.


ఒక చిన్న ఉదాహరణ చూద్దాం...


ఒక మొక్క నాటిన వెంటనే పండ్లు రావాలని ఆశించలేము. దానికి ప్రతిరోజూ నీరు పోసి, సంరక్షిస్తేనే అది వృక్షంగా ఎదిగి ఫలాలను అందిస్తుంది.


అలాగే నామస్మరణ కూడా నిరంతర సాధనతోనే మనస్సులో స్థిరపడుతుంది. ఈ రోజు జపం చేశాను, రేపు ఏ అనుభూతి కలుగుతుంది అని ఆశించకూడదు. నామమహిమను అనుభవాల ద్వారా పరీక్షించకుండా, విశ్వాసంతో సాధన కొనసాగించాలి.


**నామస్మరణ ఎప్పుడు చేయాలి?**


నామస్మరణకు ప్రత్యేకమైన సమయం మాత్రమే కాదు. ఉదయం, సాయంత్రం నియమితంగా జపం చేయడంతో పాటు, నిత్యజీవితంలోని ప్రతి పనిలోనూ భగవంతుని స్మరించుకోవచ్చు.


అయితే నామం నోటితో పలుకుతూనే మనస్సు ప్రపంచ విషయాల్లో తిరుగుతుంటే అది యాంత్రికమైన జపంగా మిగిలిపోతుంది. అందుకే నామంతో పాటు మనస్సు కూడా భగవంతునిపై నిలవాలి.


**ఇందులోని అసలైన వేదాంత రహస్యం ఏమిటంటే...**


మొదట మనం భగవంతుని నామాన్ని స్మరిస్తాం. ఆ స్మరణ వల్ల మనస్సు ప్రశాంతమవుతుంది. ప్రశాంతమైన మనస్సులో ఆత్మవిచారణకు అవకాశం కలుగుతుంది.


అప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది.


నేను ఈ శరీరమే కాదు, ఈ మనస్సు మాత్రమే కాదు. శరీరాన్ని, మనస్సును గమనిస్తున్న సాక్షి చైతన్య స్వరూపుడను అనే జ్ఞానం వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది.


భగవంతుని నామస్మరణ మనస్సును శుద్ధి చేస్తుంది. ఆ శుద్ధమైన మనస్సు ఆత్మతత్త్వాన్ని తెలుసుకోవడానికి అర్హతను పొందుతుంది.


అయితే నామజపం ఒక్కటే ఆత్మజ్ఞానానికి సమానం కాదు. అది ఆత్మజ్ఞాన సాధనకు మనస్సును సిద్ధం చేసే పవిత్రమైన మార్గం.


చివరిగా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి...


నామం నాలుకపై ఉండటం భక్తి ప్రారంభం.

నామం మనస్సులో నిలవడం ఏకాగ్రత.

నామస్మరణతో మనలోని ద్వేషం, అహంకారం, మమకారం తగ్గడం చిత్తశుద్ధి.

సర్వత్రా భగవత్ చైతన్యాన్ని దర్శించడం జ్ఞానమార్గం వైపు ప్రయాణం.


నామస్మరణ ద్వారా మనం భగవంతుడిని కొత్తగా పొందడం కాదు; అజ్ఞానం, అహంకారం అనే ఆవరణాలను తొలగించుకొని, మనలోనే ప్రకాశిస్తున్న పరమసత్యాన్ని తెలుసుకునే దిశగా సాగుతాం.


నామం నుండి ధ్యానానికి... ధ్యానం నుండి ఆత్మవిచారణకు... ఆత్మవిచారణ నుండి ఆత్మజ్ఞానానికి చేసే ప్రయాణమే నామస్మరణ యొక్క అంతరార్థం.

— శ్రీ సద్గురు పీఠం

ఆదర్శము

  *ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు*.


సభ్యులకు నమస్కారములు.


యావద్భారతము గురించి గాకుండా ముందు తెలుగునాట గురించి తెలుసుకుందాము. మన తెలుగు నాట వేద, పురాణ, ఇతిహాస మరియు ఆధ్యాత్మిక పండితులు, జ్యోతిష్య, వాస్తు నిపుణులు, విద్వన్మూర్తులు, చండి, శత చండి, సహస్ర చండీ, సుదర్శన, నారసింహ ఇత్యాది హోమ, రుద్ర అతి రుద్ర మహా యాగ, శ్రీ రాజ రాజేశ్వరీ, చండి, మానసా దేవి, దంతేశ్వరి దేవి, కాళీ పూజా దురంధురులు, స్మార్త, వైదిక, ఆగమ శాస్త్ర శిరోమణులు, సిద్ధాంతులు, ఆధ్యాత్మిక వేత్తలు, స్వర్ణ కంకణధారులు, ధార్మిక వరేణ్య, మహామహోపాధ్యాయ, పౌరాణిక సార్వ భౌమ, సాహిత్య రత్న బిరుదాంకితులు, ఘన పాఠీలు, మహా మహా ఘనత వహించిన పీఠాధిపతులు, తత్వ వేత్తలు, భాగవతొత్తములు, పారమార్థికులు, జీయరు స్వాములు, ప్రవచన చక్రవర్తులు, సంగీత, సాహిత్య, నాట్య, నాటక రంగ విద్వాంసులు, నటనా వైభవ సంపన్నులు, అవధానులు, అష్టావధానులు, శతావధానులు, సహస్రావధానులు, ద్వి సహస్రావధానులు, కవి పుంగవులు, కవి వరేణ్యులు, రచనా సార్వ భౌములు, అన్ని రంగాలలో ప్రజ్ఞా పాటవాలు కల్గి ఉన్న మహిళా విదుషీమణులు, నిస్వార్థ సమాజ సేవా త్యాగమూర్తులు.


అధునాతన శాస్త్రీయ, పారిశ్రామిక రంగాలను పరిశీలించితే...విద్య, వైద్య, సాంకేతిక ఇంజినీర్లు, భూ భౌతిక, ఖగోళ, వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు, పేరెన్నికగన్న పారిశ్రామిక, ఆర్థిక శాస్త్రవేత్తలు, ధన మాన ప్రాణ విపత్తులకు గూడా వెరువకుండా దేశాన్ని దివా రాత్రాలు సంరక్షించే సైనికులు.


ఇక భారతావని మొత్తంలో ఇంకా ఎన్నెన్ని రంగాలో, ఎందరెందరు మహానుభావులో అందరికీ సవినయ వందనములు.


సామాన్యులలో ఒకరైన నా గురించి తల్చుకుంటే... నా స్థాయి సముద్రంలో ఒక నీటి బొట్టు లాగా, యావద్ భూతలంలో ఒక ఇసుక రేణువు లాగా ఉంది ...ఆశ్చర్యంతో బాటు నిరాశా, నిస్పృహలతో ఖిన్నుడనవుతుంటాను. సామాన్య మానవ సహజమైన వాచాలత్వము, అతిశయ అహంకారాలు గూడా బాధిస్తుంటాయి. ఒక్కొక్క సారి *కిం కర్తవ్యం* అని ఆలోచిస్తుంటాను.


ఒక గొప్ప సంఘ సేవకుడు, మహనీయుడు ఈలా అంటారు *"I PASS THROUGH THE LIFE ONLY ONCE, SO I WILL DO THE MAXIMUM GOOD AND HELP TO THE LARGEST NUMBER OF PEOPLE"*. 


నాకు గూడా అనిపిస్తుంది ఇంతకంటే గొప్ప మరియు మంచి ఆదర్శము ఇంకొకటి ఉండబోదు అని.


ధన్యవాదములు.