*మానవ జీవిత పరిణామక్రమం*
🪷🪷🪷🪷🪷🪷🪷
*అవును... బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే...తీసి స్కూల్ లో వేస్తారు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే...బాధ్యత గుర్తు చేస్తాడు. సరే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు...డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే,..లాగి పెట్టి ఒకటి పీకి,..పెళ్లి అనే బంధాన్ని ముడి వేస్తాడు... సరే భార్యా-పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే...పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే, ప్రేమని కోల్పోతున్నాం అని గుర్తు చేసి వెనక్కు లాగుతాడు...కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని మనిషి మేధావిలా ఈసారి దేవుడి మాట కూడా వినడు...కట్టల కొద్దీ పైసలు కూడబెడతాడు...హమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోడానికి ఎవ్వరూ ఉండరు,..పిల్లలు పెద్ద వాళ్ళు అయిపోతారు...సరే పిల్లలకు పెళ్ళి చేసి, కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాడు వాడి పిల్లల భవిష్యత్తు అని ఎక్కడికో ఎగిరి పోతారు...అప్పుడు ప్రతీ మగధీరుడుకి భార్య విలువ తెలవడం ప్రారంభిస్తుంది...కొందరు పిల్లలైతే ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళ బంగారు భవిషత్తు కోసం అని...తీసి అనాథ శరణాలయంలో పడేస్తారు. శక్తి మొత్తం క్షీణించి ఏమీ చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు సినిమా లా కదలాడుతుంది. తెలియకుండానే అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయ్. అప్పుడొస్తాడు దేవుడు, ఏడ్చింది చాలు నాయనా! నీ టైం అయిపోయింది వెళ్దాం పదా అని తీసుకెళ్లిపోతాడు. ఇదే సగటు మనిషి గా బతుకుతున్న జీవితం.*
*అందుకే మన జీవితంలో ప్రతి నిత్యం నీ కోసం కూడా కొంత సమయం కేటాయించుకో...బాధ్యతల బరువుతో పాటూ నీ మరియు నీ జీవిత భాగస్వామీ సంతోషాన్ని ప్రతి దశలోనూ వెతుకు. Help ever, hurt never సూత్రాన్ని పాటించు...ఏదీ మోసుకుపోలేవని గుర్తెరిగి, నీకు వీలైనంతలో ఇవ్వడం నేర్చుకో, నవ్వడం నేర్చుకో, మన తల్లి దండ్రులు, భార్య/భర్త, మన పిల్లలు, మన రక్తసంబదీకులైన బంధువులు,మిత్రులతో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఆనందంగా గడపడానికి గట్టిగా ప్రయత్నించు. ప్రతి పనిలో నీదైన ఆనందాన్ని వెతుకు. బ్రతకడం మాని ఆనందంగా, ఆరోగ్యంగా... నాలుగు మంచి జ్ఞాపకాలు మిగుల్చుకో.* 💐🙏🇮🇳
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి