20, మే 2026, బుధవారం

దృష్టి

 *మన దృష్టి ఎలా వుండాలి ?**

 

ముందు మనం పొగడ్తలకు 

పొంగి పోయి, నిందలకు కృంగిపోకూడదు, 


ఏది మంచి? 

ఏది చెడ్డ? 

అనే విషయానికి వస్తే,

 ఏది నీకు మంచిదో 

అది ఇతరులకు చెడ్డ కావచ్చు, ఇతరులకు ఏది చెడ్డదో అది నీకు మంచి కావచ్చు. 


*ఉదా!!*

ఒకరి ఇంట్లో పెళ్ళి జరుగుతోంది, వారు వాన రాకూడదని ప్రార్ధిస్తున్నారు, 


కాని, వానలు లేక పైర్లు ఎండి పోతున్నాయి,

 కాబట్టి వ్యవసాయం చేసేవారు వానలు రావాలని ప్రార్ధిస్తున్నారు...


చూశారా! 

వాన రావటం ఒకరికి మంచిది, మరొకరికి చెడ్డది, 

అందుచేత వాటి గురించి పట్టించుకోవద్దు"... 


అయితే రెండు కరెక్ట్, 

మరి ధర్మం మాటేమిటి? 

దైవం ఎవరి మాట వింటాడు  ?అని అడిగితే,

"నిజంగా నీవు అందరి మంచీ కోరుకుంటే, అందరి క్షేమాన్ని కోరి ప్రార్ధిస్తే, నీ పొలం పైన వాన కురుస్తుంది;  


గాలికి మేఘము తొలగి పోయి ఊరిలో వాన పడకుండా, పెళ్ళి వారికి ఇబ్బంది లేకుండా  కూడా ఉంటుంది. 

ఇద్దరికీ మంచిదే జరుగుతుంది, అట్లు కాకుండా నీ ప్రార్థనలో సంకుచితమై మైన బుద్ధి ఉంటే అంతటా వర్షం పడినా, నీ పొలం పైన కురవదు...కనుక విశాలమైన దృష్టి అవసరము. 


        *_శుభమస్తు_*

🙏 *శ్రీ సద్గురు  పీఠం ద్వారా* ...✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

కామెంట్‌లు లేవు: