4, నవంబర్ 2026, బుధవారం

04-11-2026 బుధవారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

04-11-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ అధికం అవుతుంది. ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు ఉంటాయి.           

---------------------------------------


వృషభం


నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. స్నేహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. విలువైన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.           

---------------------------------------


మిధునం


సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.                 

---------------------------------------


కర్కాటకం


దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి విమర్శలు అధికమవుతాయి. దీర్ఘకాలిక ఋణాలు తీర్చడానికి నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.         

---------------------------------------


సింహం


పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఉంటాయి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగయత్నాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు తప్పవు. కుటుంబ సభ్యుల నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. నూతన ఋణాలు చేస్తారు.          

---------------------------------------


కన్య


ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహాకాలు అందుతాయి. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తినిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి.             

---------------------------------------


తుల


విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవసేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.               

---------------------------------------


వృశ్చికం


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ధన పరంగా కొంత ఇబ్బందులు తప్పవు. నూతన ఋణప్రయత్నాలు కలిసిరావు. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.           

---------------------------------------


ధనస్సు


రాజకీయ ప్రముఖులతో చర్చలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది.                   

---------------------------------------


మకరం


సంతాన వివాహ విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. రాజకీయ సంబంధిత సభా సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.              

---------------------------------------


కుంభం


దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తికావు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. సోదరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.                 

--------------------------------------- 


మీనం

 

సన్నిహితుల నుండి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయం సాధిస్తారు.  

---------------------------------------

కామెంట్‌లు లేవు: