4, నవంబర్ 2026, బుధవారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        అష్టమోధ్యాయః

                    అక్షర బ్రహ్మ యోగము


తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ ।

మయ్యర్పితమనోబుద్ధిః మామేవైష్యస్యసంశయమ్ ।। 7 ।।



ప్రతిపదార్థ;



తస్మాత్ — కాబట్టి; సర్వేషు — అన్నీ; కాలేషు — సమయాల్లో; మామ్ — నన్ను; అనుస్మర — స్మరించుము; యుధ్య — యుద్ధము చేయుము; చ — మరియు; మయి — నాకు; అర్పిత — శరణాగతి చేసి అర్పించి; మనః — మనస్సు; బుద్ధిః — బుద్ధి; మామ్ — నన్ను; ఏవ — ఖచ్చితంగా; ఏష్యసి — నీవు పొందుతావు; అసంశయః — సందేహము లేకుండా.



తాత్పర్యము:



కాబట్టి, సర్వ కాలముల యందు నన్ను స్మరిస్తూనే ఉండుము మరియు నీ కర్తవ్యమైన యుద్ధము కూడా చేయుము. నీ మనస్సు-బుద్ధి నాకు శరణాగతి చేసి సమర్పించినచో, నీవు తప్పకుండా నన్నే పొందుదువు; ఈ విషయంలో సందేహం లేదు.



వివరణ :


భగవంతుడిని మర్చిపోతే, మరుక్షణం అది మాయ యొక్క సైన్యం లోని యోధుల దాడికి గురౌతుంది – కామము, క్రోధము, లోభము, ఈర్ష్య, ద్వేషము వంటి నకారాత్మక భావోద్వేగాలు. అందుకే, దానిని ఎల్లప్పుడూ భగవంతునితో అనుసంధానం చేసి ఉంచాలి. తరచుగా జనులు తాము కర్మ మరియు యోగ చేస్తున్నాము కాబట్టి తమని తాము కర్మయోగులము అనుకుంటారు. రోజులో చాలా భాగము వారు కర్మ చేస్తారు, మరియు కొద్ది నిముషాలు వారు 'యోగం' చేస్తారు (భగవంతునిపై ధ్యానము). కానీ, ఇది కాదు శ్రీ కృష్ణుడు చెప్పిన కర్మయోగ నిర్వచనము. ఆయన ప్రకారం 1) కర్మలు చేస్తూనే ఉన్నా మనస్సు మాత్రం భగవంతుని స్మరణ యందే నిమగ్నమై ఉండాలి. 2) భగవంతుని స్మరణ అప్పుడప్పుడూ కాకుండా రోజంతా నిరంతరంగా జరుగుతూనే ఉండాలి.


సంత్ కబీర్ తన ప్రముఖ కావ్యంలో దీనిని ఇలా వ్యక్తపరిచాడు:


సుమిరన్ కీ సుధి యోఁ కరో, జ్యాఊఁ గాగర్ పనిహార


బోలత్ డోలత్ సురతి మేఁ, కహే కబీర విచార్


‘ఒక గ్రామీణ మహిళ తన నెత్తిపై ఉన్న నీటి కుండని ఎలా గుర్తుంచుకుంటుందో అలాగే భగవంతుడిని గుర్తుంచుకొనుము. ఆమె తోటివారితో మాట్లాడుతూ ఉంటుంది, బాటలో నడుస్తూ ఉంటుంది, కానీ ఆమె మనస్సు ఆ పైనున్న కుండపైనే ఉంటుంది.’


తదుపరి శ్లోకంలో శ్రీ కృష్ణుడు కర్మ యోగ అభ్యాసము యొక్క పరిణామాలను వివరిస్తున్నాడు.

కామెంట్‌లు లేవు: