పెసరట్టు-ఉప్మా:
పెసరట్టు ఉప్మా కి వెనుక చాలా పురాతనమైన పురాణం ఉంది.
ఉప్మా కి పూర్వీకులు ముగ్గురు
ఉప్పు పిండి,చప్పిడి పిండి,పులుసు పిండి (పిండి పులిహార).
ఘోర తపస్సు ఆచరించిన ఉప్పుపిండి 6 గురు పుత్రికలు పొందింది. అవి వరుసగా:
1.వరినూక ఉప్మా
2.జొన్ననూక ఉప్మా
3.గోధుమనూక ఉప్మా
4.మొక్క జొన్న ఉప్మా
5.కొర్ర నూక ఉప్మా
6.బొంబాయిరవ్వ ఉప్మా
మొదటి 5 గురు కన్యలు వివాహం చేసుకోకుండా, ఉపవాసములు, ఏకాదశినాడు వ్రతములయందు భక్తులకు ఫలహారాలు గా సేవచేయుచున్నారు.
వీరి సేవకు మెచ్చిన పరమేశ్వరుడు
మీకు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు.అంతట ఆ అయిదుగురు మా ఆఖరి సోదరికి
వివాహం జరిగి,దాని దాంపత్యం కలియుగాంతం వరకు అన్యోన్యంగా ఉండేలా వరమివ్వమని కోరగా పరమేశ్వరుడు సంతోషించి,నవగ్రహములలో విశిష్టత పొందిన బుధుడి అంశతో
జన్మించిన పెసరట్టు తో వివాహం జరిపించిన ట్టు పురాణం వచనం.
అన్యోన్యంగా ఉండే దంపతులను
పెసరట్టు ఉప్మా లా కలిసిఉన్నారనడం ఓ నానుడి.
జయంతి లక్ష్మీ నరసింహం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి