4, నవంబర్ 2026, బుధవారం

సూర్యుడు కిరణ వాలు

  🙏🌹సూర్యుడు కిరణ వాలు 🌹🙏


ఆకాశ తెరలెత్తి కాంతి కిరణాలతో కదిలింది వాలుగా 

తెరలిత్తిన ఆకాశమున వర్ణాలు నింపి నిలిపింది వీలుగా 


కదిలిన కిరణాల వాలు పరిచింది తివాచి మైదానమున మేలుగా 

ముందుకు సాగి వనమున చేరి ఫల సంపదల సమకూర్చింది మూలాలుగా 


విడవక వడివడిగా కడలిలో కాంతులు చొప్పించ మూల మూలగా 

శ్రామికుల చెంతన నిలిచి పాడి పంటలుగా కడుపులో నింపగ మేలుగా 


మొట్టమొదటి సిందూర బింబ ప్రత్యక్ష దర్శనంతో చల్లని చూపులుగా 

అర్ఘ్యం అందివ్వగానే వెను వెంటనే అందించు శక్తి సామర్థ్యములుగా 


ఓం శ్రీ కదిలేటి కిరణాలు విశ్వాన పంచేటి సంపదలుగా దేవాది దేవా 

శ్రీ భాస్కర తేజో సవిత్రా నమో నమః నమో నమః 


🙏🌹బాలచందర్ రాజుఉమా

 03/11/26 +2169+ చూర్ణిక

కామెంట్‌లు లేవు: