4, నవంబర్ 2026, బుధవారం

పంచాంగము

 🕉️


పంచాంగము 🌓 04.11.2026


🪔 శ్రీ ఇందిరాదామోదరాయనమః‌ 🪔 


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


ఘూర్జర‌ సంవత్సరం: 2082 పింగళ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: శరద్


మాసం: ఆశ్వీయుజ 


పక్షం: కృష్ణ - బహుళ 


తిథి: దశమి ప‌.01:33 వరకు

తదుపరి ఏకాదశి 

 

వారం: బుధవారం - సౌమ్యవాసరే

 

నక్షత్రం: మఘ ఉ‌.07:00 వరకు 

తదుపరి పూర్వఫల్గుణి రా.తె.05:56 వరకు

తదుపరి ఉత్తర ఫల్గుణి 


యోగం: బ్రహ్మ ఉ‌.07:50 వరకు 

తదుపరి ఐంద్ర రా.తె.04:57 వరకు

తదుపరి వైధృతి

 

కరణం: భద్ర ప‌.01:33 వరకు

తదుపరి బవ రా.12:54 వరకు

తదుపరి బాలవ


వర్జ్యం: ప‌.02:39 - 04:11 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.11:37 - 12:23


రాహు కాలం: ప‌.11:59 - 01:25


గుళిక కాలం: ఉ‌.10:33 - 11:59


యమ గండం: ఉ‌.07:41 - 09:07

 

అభిజిత్: 11:36 - 12:22


సూర్యోదయం: 06:16


సూర్యాస్తమయం: 05:43


చంద్రోదయం: రా.02:43


చంద్రాస్తమయం: ప‌.02:22


సూర్య సంచార రాశి: తులా 


చంద్ర సంచార రాశి: సింహం 


దిశ శూల: ఉత్తరం


💧 ఏకభుక్తం‌ 💧


🌹 దశదిక్పాలక పూజ 🌹


🚩 జోలేబాబా‌ పుణ్యతిథి‌ 🚩


🏳️ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

పుణ్యతిథి‌ 🏳️


🚩 బాపురావ్‌ మహారాజ్

ఖత్ఖోడకర్‌ పుణ్యతిథి‌ 🚩


🏳️ ఉదాసి మహారాజ్ 

పుణ్యతిథి‌ 🏳️


🇮🇳 శ్రీ వాసుదేవ బల్వంత 

ఫడ్కే జయంతి 🇮🇳


🎊 మనవాళ‌ మహాముని

ఉత్సవారఃభం‌ - తిరుమల 🎊


🪄 శ్రీనివాసమంగాపురం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి 

పవిత్రోత్సవారంభం‌ 🪄


🎉శ్రీ పెరంబదూరు శ్రీ మణవాళ

 మహామునుల ఉత్సవారంభం‌ 🎉


🛕 శ్రీ విల్లిపుత్తూరు

 శ్రీ ఆండవర్ రథోత్సవం 🛕


⚛️


దశమ్యామేకభక్తస్తు

మాంసమన్నం చ వర్జయేత్ ।

కాంస్యపాత్రే న భుంజీత

రజస్వలాం న సంస్పృశేత్ ॥

ఆశ్వినస్యాసితే పక్షే 

సంయతో విజిలేంద్రియః ।

ప్రాప్నోతి పరమం పుణ్యం

హరివాసరసిద్ధయే ॥

ఆశ్వయుజ బహుళ దశమి

నాడు ఇంద్రియ నిగ్రహంతో

ఉండాలి. పగటిపూట మాత్రమే

ఏకభుక్తం (ఒక్కపూట భోజనం)

చేయాలి. కంచు పాత్రలో

భుజించడం, నూనె

పూసుకోవడం, పరుష వచనాలు

పలకడం విసర్జించాలి. 

ఈ విధంగా దశమినాడు

నియమం పాటించినప్పుడే

మరుసటి రోజు వచ్చే రమా

ఏకాదశీ వ్రతం పరిపూర్ణ

పుణ్యఫలాన్ని ఇస్తుంది.


దశమ్యాం రాత్రిసమయే 

న భుంజీత కదాచన ।

భూమౌ శయనం కుర్వీత

బ్రహ్మచర్యపరః శుచిః ॥

ప్రాతరుత్థాయ కర్తవ్యం

ఏకాదశ్యాః ప్రపూజనమ్ ।

ఏవం సంస్కృతదేహస్తు 

లభతే వైష్ణవం పదమ్ ॥

దశమి రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ

ఘనాహారం తీసుకోకూడదు. 

నేలపై దర్భాసనం లేదా చాపపై

శయనించాలి; సంపూర్ణ

బ్రహ్మచర్యం, శుచిత్వంతో

ఉండాలి. ఈ విధంగా శరీరాన్ని,

ఇంద్రియాలను సంస్కరించు

కున్నప్పుడే ఏకాదశీ వ్రతం 

ద్వారా వైష్ణవ పద ప్రాప్తి

కలుగుతుంది.


దశమీ దిక్పతేర్దైవ్యా

సర్వదిగ్విజయప్రదా ।

ఆశ్వినే బహుళే పక్షే

పూజయేద్దశదిక్పతీన్ ॥

గంధమాల్యాక్షతైర్దీపైః 

నైవేద్యైశ్చ పృథక్ పృథక్ ।

న తస్య విద్యతే బాధాః

శత్రుతో వా భయం క్వచిత్ ॥

దశమీ తిథి దిక్పాలురకు

సంబంధించినది మరియు

సర్వదిక్కులయందు విజయాన్ని

ప్రసాదించేది. ఆశ్వయుజ

కృష్ణపక్ష దశమి నాడు

దశదిక్పాలురను సుగంధ

చందనం, పుష్పాలు, అక్షతలు,

దీపాలు మరియు విశేష

నైవేద్యాలతో వేర్వేరుగా

అర్చించాలి. దీనివలన

సాధకునికి శత్రువుల వల్ల గానీ,

దిక్కుల లోపల సంభవించే

ఆపదల వల్ల గానీ ఎటువంటి

భయము ఉండదు.


ఇంద్రో వహ్నిః పితృపతిర్నైరృతో

వరుణో మరుత్ ।

కుబేర ఈశః పతయో 

దిశామేతే సదావతు ॥

ఊర్ధ్వం బ్రహ్మా తథా

చాధోఽనంతశ్చ రక్షతాం సదా ।

దశమ్యాం పూజితాః సర్వే

శాంతిం కుర్వంతు మే గృహే ॥

ఇంద్రుడు (తూర్పు), 

అగ్ని (ఆగ్నేయం), 

యముడు (దక్షిణం), 

నిర్ఋతి (నైరృతి), 

వరుణుడు (పశ్చిమం),

వాయువు (వాయవ్యం),

కుబేరుడు (ఉత్తరం), 

ఈశానుడు (ఈశాన్యం), 

ఊర్ధ్వ దిక్కున బ్రహ్మ,

అధో దిక్కున అనంతుడు

ఈ దశదిక్పాలురు ఈ దశమి

నాడు నా పూజలచేత

సంతృప్తులై నా గృహంలో

సర్వదా శాంతిని, రక్షణను

ప్రసాదింతురు గాక.


🔯

కామెంట్‌లు లేవు: