20, నవంబర్ 2025, గురువారం

పొద్దుతిరుగుడు మొక్కతో ఉపయోగాలు -

 పొద్దుతిరుగుడు మొక్కతో ఉపయోగాలు -


 * పొద్దుతిరుగుడు మొక్కల్ని పీకేసిన తరువాత ఎండించి , శుభ్రం చేసుకుని మెత్తగా దంచి ఆ చూర్ణం ఒక చెంచా మోతాదు రోజూ రెండుపూటలా తీసుకొంటే చర్మవ్యాధుల మీద బాగా పనిచేస్తుంది .


 * మొక్క సమూలంగా దంచిన ఈ చూర్ణానికి అమీబియాసిస్ వ్యాధిని తగ్గించే గుణం ఉంది.


 * కడుపులో క్రిములను పొగొట్టును.


 * పొద్దుతిరుగుడు మొక్కని సమూలంగా ఎండించి దంచిన పొడిని గాని , పచ్చి మొక్కని దంచి పిండిన రసాన్ని గాని కొద్దిగా తీసుకొంటే దగ్గు తగ్గుతుంది . మూత్రవ్యాధులలో కూడా బాగా పనిచేస్తుంది .


 * దీని గింజలు ప్రొటీన్లకు పుట్టిల్లు. నేతిలో ఈ గింజల్ని వేయించి పైపొట్టు ఒలిచి మెత్తగా దంచి ఆ పొడిని పాలలో కలిపి తాగితే మీకు అంతకు మించిన బలకరమైన ఆహారం మరొక్కటి ఉండదు.


 * ఇందులో 50 % కొవ్వు పదార్దాలు ఉన్నాయి. అందుకని ఈ గింజల్ని సన్నగా చిక్కి పొతున్నవారికి పెట్టినట్లు అయితే మంచి ఒళ్ళు చేస్తారు .


 * ఎప్పుడూ నీరసం , అలసట కలిగి ఉండి ఏ పనిచేయలేని అశక్తత ఉన్నవారు పొద్దుతిరుగుడు గింజల్ని తీసుకోవడం వలన శరీరంలో నీరసం , అలసటని తగ్గించి శక్తిని పెంచును.


 * పొద్దుతిరుగుడు గింజలలో "లైనోలిక్ యాసిడ్ " అనే రసాయన పదార్థం ఉన్నది. ఇది కొలెస్ట్రాల్ ని రక్తంలో పెరగకుండా చూస్తుంది. అందుకని వేరుశెనగ నూనె కంటే పొద్దుతిరుగుడు నూనెని ఆహారంలో వాడుకోవడం మంచిది .


 * B విటమిన్ ఇందులో ఎక్కువుగా ఉండును. అందుకని నీరసం మీద బాగుగా పనిచేస్తుంది . పొద్దుతిరుగుడు నూనె వాడటం మాత్రమే కాదు పొద్దుతిరుగుడు గింజలని తినవలెను .


 * రక్తక్షీణత , ఉపిరితిత్తుల జబ్బులలో కూడా పొద్దుతిరుగుడు గింజలు ఎక్కువ మేలు చేస్తాయి .


      మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


     గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

కార్తీకపురాణం - 30 వ అధ్యాయము*

 🌴🌹🪔🕉️🛕🕉️🪔🌹🌴

      🌷 _*గురువారం*_🌷

🕉️ *నవంబర్ 20, 2025*🕉️


*కార్తీకపురాణం - 30 వ అధ్యాయము*


🕉🕉🕉🕉🕉🕉️🕉️🕉️             

                

 🔱 *(చివరి అధ్యాయం)*🔱


*కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి*

```

నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాదిమహామునుల కందరకు సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను, విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి, వేయినోళ్లకొనియాడిరి. శౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున, సూతునిగాంచి, “ఓ ముని తిలకమా! కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై, అత్యాచారపరులై జీవించుచు  సంసారసాగరము తరింపలేకున్నారు. అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా? ధర్మములన్నింటిలో మోక్షసాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తినొసంగు ఉత్తమదైవమెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతోనున్నాము. కావున దీనిని వివరించి తెలియజేయు"మని కోరిరి.


అంత సూతుడా ప్రశ్న నాలకించి “ఓ మునులారా! మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసారసాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షసాధనము కాగలవు. కార్తీకవ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటె ఘనమైనదని శ్రీహరి వివరించియున్నాడు. ఆ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియేకాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యముకాదు. అయినను సూక్షముగా వివరించెదను.


కార్తీకమాసమందు ఆచరించవలసిన పద్ధతులను జెప్పుచున్నాను. శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీకమాసమున సూర్యభగవానుడు తులారాశి యందున్నప్పుడు శ్రీహరి ప్రీతికొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగ నదీస్నానము చేయవలెను. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను. తనకున్న దానితో కొంచమైనా దీపదానం చేయవలయును. ఈ నెలరోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రులు విష్ణు ఆలయమునగాని, శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను. ప్రతి దినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెలరోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తివుండికూడా ఆచరించకగాని, లేక, ఆచరించువారలను ఎగతాళి చేసినగాని, వారికి ధనసహాయము చేయువారికి అడ్డుపడిన వారును ముందు అనేక కష్టముల పాలగుటయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసలపాలుకాగలరు. అంతియేగాక అట్టివారు నూరుజన్మలవరకు ఛండాలాది హీన జన్మలెత్తుదురు.


కార్తీక మాసములో కావేరి నదిలోగాని, గంగా నదిలోగాని, అఖండ గౌతమినదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిననూ ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు.


సంవత్సరములోవచ్చు అన్ని మాసములకన్నా కార్తీకమాసము ఉత్తమోత్తమమైనది అధికఫలదాయకమైనది. హరి హరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీకమాస వ్రతము వలన జన్మజన్మలనుండి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మలేక, వైకుంఠమందుగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలెననెది కోరిక పుట్టి దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీకమాసమన్న కార్తీక వ్రతమన్నా అసహ్యము కలుగును.


కాన, ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారు కార్తీకశుద్ద పౌర్ణమినాడు అయినను తమశక్తి కొలదీ వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనమిడినచో నెలరోజులు చేసిన ఫలముతో సమానఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికినీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను, బీదవాడైనను మరెవ్వరైనను సరే శ్రీహరినామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకంబును. ఈ కథను చదివిన వారికిని వినిన వారికిని శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును.```


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*


   

  *ముప్పైవ అధ్యాయము*  

        _*ముప్పైవ రోజు*_ 

          *(ఆఖరి రోజు)*

 *పారాయణము సమాప్తం*


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🌷🌷🌷🌹

              *న్యాయపతి*

           *నరసింహా రావు*

🙏🌹🍁🕉️🛕🕉️🍁🌹🙏

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం - అమావాస్య - విశాఖ -‌‌ గురు వాసరే* (20.11.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

జీవితం ధన్యం

 🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం 🕉️🙏 🔥 * *ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపిన వ్యర్ధమే.. ఆరోగ్యం చెడిపోయాక ఆయుష్ మిగిలిన వ్యర్ధమే.. కష్ట కాలం గడిచిపోయాక కనికరం చూపిన వ్యర్ధమే.. ఉన్నప్పుడు తెలియని విలువ కోల్పోయాక తెలుసుకున్న వ్యర్థమే.. కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ.. గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ.. దూరమైతే తెలుస్తుంది మనిషి విలువ.. విడిపోతే తెలుస్తుంది బంధం విలువ.. మనల్ని అహిష్టంగా దూరం పెట్టే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనం దూరం అవ్వడం మంచిది.. మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు.. ఎవరిని ఎక్కువ చదవకూడదు.. ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు*🔥 ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో.. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది.. నిన్న అనేది తీరిపోయిన రుణం.. రేపు అనేది భగవంతుడు ఇచ్చిన సమయం.. కావలసినవారు ఎందరు ఉన్న మనశ్శాంతి లేని జీవితం వ్యర్థం.. అసంతృప్తి జీవితం గడపడం చాలా దుర్బలం.. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం🔥🔥మీ


19, నవంబర్ 2025, బుధవారం

పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ

 🙏పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ🙏


ఈ వ్యాసం సులభం కాదు. ఏకాగ్రతతో జాగ్రత్తగా చదవాలి. అప్పుడే అర్ధమవుతుంది.

ముందుగా వాగ్దేవతల ప్రార్ధనతో ప్రారంభిద్దాం

ఆ వాగ్దేవతల అనుగ్రహముతో ఈ వ్యాసం చదువుదాము.

దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపాః వశవోవదంతి! 

సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు. 

అమ్మవారు దేవతలకందరికి కామధేనువు వంటి విశ్వరూపమైన (అనంతమైన ) పదజాలం సృష్టించి ఇచ్చారు. ఆ పదజాలం మమ్ములను ఆశ్రయించి ఉండి రక్షించుగాక.


చత్వారి వాక్పరిమితా పదాని తానీ

విడుర్బ్రాహ్మాణా యే మనీషిణిః

గుహాత్రీణి నిహితా నేజ్గయంతి

తురీయం వాచో మనుష్యా వదంతి ||

భావం 

వాక్కుకు నాలుగు స్థితులు వుంటాయని విజ్ఞాలకు తెలుస్తుంది.అవియే పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ వీటిలో మొదటి మూడు స్థితులలోని వాక్కు గుహలోనే వుంటుంది. బయటకు రాదు. నాల్గవ స్థితిలోని వాక్కునే మనుష్యులు పలుకుతున్నారు. అని పై మంత్రానికి అర్థం

-

మనలో మాట పలకాలన్న భావం స్ఫురింపచేసేదే “పరా”. మాట పలికే ముందు ‘పర’ ప్రేరితమై భావాత్మకంగా గోచరించేదే ‘పశ్యంతీ’. ఆ భావం మాటలుగా కూర్చుకున్న స్థితి ‘మధ్యమా’ ఆ తరువాత శబ్దరూపంలో పైకి వినబడేదే ‘’వైఖరీ! యోగశాస్త్ర పరంగా వీటి యొక్క ప్రయాణం గురించి చెప్పాలంటే, మూలాధారం నుండి నాభి, హృదయం , కంఠ, నాలుకలు. వీటన్నింటికీ మూలమైన నాదం కూడ సరస్వతీరూపమే. ఇక, భావప్రకటన కోసం చెట్లు ‘పరా’ వాక్కుని, పక్షులు ‘పశ్యంతీ’ వాక్కును, జంతువులూ ‘మధ్యమా’ వాక్కును, మనుషులు ‘వైఖరీ’ వాక్కును ఉపయోగిస్తారు


పరాస్థితిని - సంకల్పము గాను, పశ్యంతి స్థితిని భావము గాను, మధ్యమా స్థితిని సంకేతము గామ, వైఖరి స్థితిని - ఉచ్చారణ గాను - సమన్వయ పరచుకోవచ్చును

మరొక సందర్భంలో ఈ విధంగా చెప్పబడింది


‘పరా వృక్షేషు సంజాతా, పశ్యంతీ భుజగీషుచ, మధ్యమావై పశుశ్చైవ, వైఖరీ వర్ణ రూపిణీ’’.


 చెట్టు నుంచి సృష్టింపబడుతున్న చిగుళ్లు, ఆకులు, కొమ్మలు, పూలు, ఫలాలు వస్తాయి కదా . కాని తన వల్లనే వస్తున్నాయని చెట్టు గుర్తించదు. పాముకు చూడటానికి కళ్లేగాని, వినడానికి ప్రత్యేకం ఒక శ్రవణేంద్రియం అనేది లేదు. పశువు ‘‘అంబా’’ అంటుంది. కాని, అంబను (అమ్మవారిని ) తెలుసుకొనలేదు. 

పరబ్రహ్మతత్త్వ విచారణ సందర్భంలో వాక్కు నాలుగు విధాలుగా చెప్పారు. 1. పరా, 2. పశ్యంతి, 3, మధ్యమ, 4. వైఖరి. మనిషి అక్షర సముదాయాన్ని ఏర్పరచుకొని, వాటి సహాయంతో అంతులేని సాహిత్యాన్ని సృష్టించుకొన్నాడు. కాని, దృగ్గోచరమైన సృష్టికి మూలాన్ని అన్వేషించడానికి సతమతం అవుతున్నాడు. తెలుసుకొనలేక పోతున్నాడు.


 పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ శబ్దాలకు నిర్వచనం చెప్పే సందర్భంలో ఇచ్చిన ఈ నాలుగు ఉపమానాలు వరుసగా ఈ పదాలకు వర్తిస్తాయి. మరొక విధంగా కూడా ఈ పదాలకు అర్థం చెప్పారు.

 ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు తలపునకు పూర్వస్థితి ‘‘పరా వాక్కు’’. తలపు ‘‘పశ్యంతీ వాక్కు’’. ఆలోచన కార్యరూపం ధరించే ముందున్న ఊహస్థితి ‘‘మధ్యమ వాక్కు’’. తలపు కార్య రూపం ధరించడం ‘‘వైఖరీ వాక్కు’’. ‘‘పరా’’ విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి.

అంటే, విత్తు భూమిలోపడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నస్థితి. మొలక విత్తులోనుంచి పైకి రావడం, అంటే ఆలోచన మొలకెత్తడం ‘‘పశ్యంతి’’. అవుతుంది.మొక్క ఎదిగి, వృక్షంగా మారడం ‘‘మధ్యమ’’ స్థితి. పూత పూయడం, పూలు ఫలాలు కావడం, పరిపూర్ణం చెందడం ‘‘వైఖరి’’

ఇక మానవుల విషయానికి వస్తే...

మానవుడు పుట్టినప్పుడు మూడు నెలల లోవు పసివాడు పరా రూపంగా ఉంటాడు. కనీసం కళ్ళుకూడా పూర్తిగా తెరవని స్థితి.

తరువాత కొన్ని నెలలు పశ్యంతి రూపంలో ఉంటాడు కేవలం చూస్తాడు. ప్రతిక్రియ చేయడు. 6 మాసాల తరువాత క్రమముగా ప్రతిక్రియ చేస్తాడు అరవడం, నవ్వడం, కొట్టడం, కరవడం మొదలగునవి. ఇలా ప్రతిక్రియ చేయడం మధ్యమా లక్షణాలు. తరువాత క్రమముగా అనంత పదజాలన్నీ ఉచ్చరిస్తాడు ఇది వైఖరీ లక్షణం.

ఇంక వాక్కు విషయానికోస్తే...

పరా వాక్కు : పరావాక్కు స్థానం మూలాధార చక్రం మరియు సహస్రార మధ్యస్త "ఓంకారము" ఆది ప్రణవము. దానికి "సిద్ధి" అని పేరు. ఈ ప్రణవము క్రమంగా మూలాధారమందు అవ్యక్త వాక్కుగా నిలచినది. ఈ వాక్కు పరా శక్తికి అభిన్నము. ఏ వికారము లేనిది , నిత్యమైనది,

పరావాక్కు నిత్యతత్త్వం కలది అందుకే ""శబ్దబ్రహ్మ""అయింది. దీనినే 'నాదం' అనికూడా అన్నారు.మూలాధార చక్రంలోని కుండలిని దాని స్థానం. 

 ఆత్మానుభూతినిచ్చేది. దీనిలో లయమైన ఋషులు దివ్య జ్ఞానాన్ని పొందారు., ఇందులో లయమైన ఎవరైననూ అపార జ్ఞానాన్ని పొందుతారు. పరా వాక్కు యొక్క విభిన్న రూపాలే పశ్యంతి, మధ్యమా, వైఖరులు.

ఈ వాగ్రూపము అంతర విషయవాసనలను గ్రహిస్తుంది. యోగులకు, జ్ఞానులకు విద్యుత్ రూపంలో దర్శనమిస్తుంది. త్రికాల జ్ఞానాన్ని కలిగిస్తుంది. 


పశ్యంతి వాక్కు :

వాక్కు లో రెండవ దశ –,పరా వాక్కు కంటే మరింత సాంద్రీభవించి ఉన్న వాగ్రూపాన్ని 'పశ్యంతి" అంటారు . "మధ్యమా" కంటే మరింత సూక్ష్మంగా ఉండి, వినడానికి వీలు లేనిదానినే "పశ్యన్తి వాక్కు" అంటారు ."పశ్యంతి" అంటే సంస్కృతం లో చూడగలిగినది లేక ఊహించ గలిగినది అని అర్ధం .పురాతన గ్రంథాలలో శబ్దం అనుభవైక వేద్యం... అంటే తెలియ దగినది అని అర్ధం .శబ్దాన్ని ఎలా చూడగలం ?మనం ఎప్పుడైనా కలలో శబ్దం విన్నామా ? ఈ ప్రత్యేక పరిమాణం కల శబ్దాన్నే, కలలో వినబడే శబ్దాన్నే పశ్యంతి అన్నారు .నిజంగా ఇది మానసిక శబ్దం .ఇది చేతన ,పాక్షిక అచేతన స్థితులలో వినిపించనిది .అది ఉపచేతన శబ్దం .అది మన మానసిక నాణ్యత కు చెందినదే కానీ... పంచేంద్రియ నాణ్యతలకు అంటే నాలుక ,గొంతు ,నోరు ల నాణ్యతలకు అందనిది .

మనము మాట్లాడవలసిన మాటకు అక్షరాలు సమకుర్చడం, పదాలు తయారుజేయడం పశ్యంతీలో జరుగుతుంది.


మనం "రామా, కృష్ణా శివా, అమ్మా . అంటూ ఉంటే... అది వైఖరి నాదం .మనం మన కళ్ళు ,నోరు మూసుకొని ఆ నామాన్ని మానసికంగా ఉచ్చరిస్తే అది మానసికంగా రంగు ,రూపాలను అంతరిక లోచనం తో దర్శించటమే "పశ్యంతి వాక్కు" .బాహ్య ప్రపంచానికి సంబంధం లేకుండా వినగలిగిన శబ్దమే పశ్యంతి .


మధ్యమా వాక్కు :

వైఖరి వాక్కు కంటే మరింత సూక్ష్మమైనది, మధ్యమ వాక్కు .వైఖరి శబ్దం యొక్క మిక్కిలి సూక్ష్మ అభివ్యక్త ధ్వని. కానీ మధ్యమా, వైఖరుల కంటే మరింత సూక్ష్మమైన నాదం .గుసగుస శబ్దంగా వినిపించేది మధ్యమ శబ్దం .అది వినికిడిపై ప్రభావం చూపలేదు .మధ్యమ శబ్దం లో అతి తక్కువ కంపనాలు కలిగి గుస గుస శబ్దమే వినిపిస్తుంది .రెండు వస్తువుల ఘర్షణ వలన శబ్దోత్పత్తి జరుగుతుంది .కాని "మధ్యమా నాదం" లో ఏ రెండు వస్తువుల తీవ్ర రాపిడి వలనకూడా వినబడేటంత శబ్దం జనించదు. "ఠక్ ఠక్" అనేట్లు శబ్దం పుట్టించితే, దాన్ని స్థూల శబ్దం అంటారు . మధ్యమ అంటే మధ్యగా ఉన్నశబ్దం . .రెండిటికి మధ్యగా ఉన్నదే."మధ్యమా" .మధ్యమా శబ్దమే గుసగుసలుగా వినిపిస్తుంది . ఇది ఆకాశంలో సంచారం చేస్తూ ఉంటుంది. నిరంతర జప శీలుర పరిణతుల స్థాయిని బట్టి ఇది దహరాకాశంలో వ్యాప్తి చెందుతుంది. సాధకుల/యోగుల స్థాయిని బట్టి, సూక్ష్మ దేహాన్ని దాటి వ్యాప్తి చెందుతుంది.

పశ్యంతి లోని పదాలకు ఇక్కడ రసము నిర్దేశం జరుగుతుంది. అంటే మాట్లాడు మాట కోపంగానా? హాస్యంగానా? శాంతంగానా? అలాగే నిష్ఠురాది భావములా? అని మరియు భాష కూడా నిర్ణయించేది మధ్యమాలోనే 

వైఖరి వాక్కు :


నాలుగవ వాగ్దశనే "వైఖరి" అంటారు . "వైఖరి" లో శబ్దం వినిపిస్తుంది ,ఉత్పత్తి అవుతుంది కూడా .మనం మాట్లాడే భాష అంతా వైఖరియే.వైఖరీ వాక్కు కఠినంగా ఉంటుంది. కఠోరంగా కూడా ఉంటుంది. రెండు వస్తువుల ఘర్షణ వలన వైఖరి "శబ్దోత్పత్తి" జరుగుతుంది . .


మొత్తం మీద మనకు తెలిసింది ఏమిటి అంటే –పరా అంటే ఆత్మ నాదం .మధ్యమ అంటే స్వర అవయవాల సూక్ష్మమైన నాణ్యత .వైఖరి కూడా భౌతిక అవయవాల వలన ఏర్పడిన సూక్ష్మ శబ్దమే . 

    నిత్యమైన శబ్దబ్రహ్మం మనం నోటితో ఉచ్చరించి, చెవులతో వినే లౌకిక శబ్దంగా పరిణమించడంలో నాలుగుదశలు చెప్పారు. 


పరా పశ్యంతీ దశలలోని శబ్దాన్ని ఉన్నత స్థాయి యోగులు తప్ప మన సాధారణ ఇంద్రియజ్ఞానంతో మనం గ్రహించలేకపోచ్చును. జపాదులవల్ల మధ్యమాదశలోని వాక్కును గుర్తించవచ్చును. ఇక వైఖరీవాక్కు ఒక్కటే మనకందరికీ తెలిసింది.


పరావాక్కు నిత్యతత్త్వం కలది.

     శబ్దబ్రహ్మము మూలాధార చక్రంలోని కుండలినియే దాని స్థానం. దీనినే 'నాదం' అనికూడా అన్నారు. పశ్యంతీ వాక్కు జననేంద్రియము వెనుకభాగమున స్వాధిస్థాన ములోను, బొడ్డుదగ్గర ఉండే మణి పూరక చక్రంలో ఉంటుంది. ఈ స్థితిలో ఉన్న వాక్కుపశ్యంతియే.ఈ పరా,పశ్యంతీ వాక్కులు రెండూ సూక్ష్మస్ఫోటములు అంటారు..అంటే మూలధార స్వాధిష్టాన మణిపూరక స్థానములలో ఉండేవి. హృదయ ప్రదేశంలోని అనాహత చక్రంలో ప్రవేశించిన తరువాత మధ్యమా వాక్కుఅంటారు అనాహత చక్రం మధ్యమా వాక్కుకు నెలవు. కంఠ ప్రాంతంలోని విశుద్ధ చక్రంలో ఆవిర్భూతమయ్యే వైఖరీవాక్కు బాహ్యము.


ఏదైనా సంకల్పం కలగగానే దాన్ని ఒక 'భావం లోకి మార్చుకోడం జరుగుతుంది. భావంలోకి మార్చబడిన వాక్కును పశ్యంతి వాక్కు' అంటారు..


భావంలోకి మార్చబడిన దాన్ని వ్యక్తం చెయ్యడానికి సంకేతాలతో ఒక 'భాష" లోకి మార్చుకోడం జరుగుతుంది. మనస్సులోనే జరిగే ఈ సంకేతాల భాషారూపంలో వున్న వాక్కును మధ్యమా వాక్కు అంటారు.


మనస్సులో ఒక భాషలో వున్న వాక్కును భౌతికంగా నోటితో ఉచ్చరిస్తే - అప్పుడు వ్యక్తమయిన వాక్కును ' వైఖరీ వాక్కు అంటారు. ఈ స్థితిలో వున్న వాక్కునే ఎదుటివారు వినగలరు. ఇంతకు పూర్వం మూడు స్థితులలోని వాక్కును వినలేరు. ఈ నాలుగు స్థితులను వరుసగా - పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ వాక్కు స్థితులంటారు.


   పరాస్థితిని - సంకల్పము గాను, పశ్యంతి స్థితిని - భావము గాను, మధ్యమా స్థితిని సంకేతము గాను, వైఖరి స్థితిని - ఉచ్చారణ గాను - సమన్వయ పరచుకోవచ్చును.


     లలితా సహస్ర నామావళిలో, అమ్మవారి ఒక నామం "వైఖరీ రూపా" అని ఉంటుంది.

.

   శబ్దములు కంపనములు కనుక అవి స్పష్టమైన రూపాలను జనింపజేస్తాయి. జగత్తులో ప్రతి శబ్దం ఒక రూపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఒక నిర్దిష్టమైన మంత్రాన్ని సరైన రీతిలో, ఉచ్ఛారణ చేసినపుడు, జపించినపుడు... ఏర్పడే శబ్ద తరంగాల ప్రకంపనాలు అత్యున్నత దశలో ప్రత్యేకమైన దేవతా రూపాలను సృజిస్తాయి.

వాక్కు దేవతా రూపం. కాబట్టి వాక్కును జాగ్రత్తగా ఉపయోగించాలి.


    శబ్ద బ్రహ్మము నుండి పుట్టిన పరా వాక్కు, మరల పశ్యంతిగా ఆవిర్భవించింది. మరల మధ్యమగా మారి వైఖరిగా విస్తరించింది.


   పరా-పశ్యంతి-మధ్యమా-వైఖరికి సంబంధించి మరొక కోణం చూద్దాం.

మొదట మనకు సంభాషణ చేయాలి అన్న తలంపు పుడుతుంది. అంటే స్పందన ప్రారంభం అవుతుంది. ఈ శక్తి సహస్రారంలో ఉన్న చంద్ర మండలంలో గల శక్తి. మాటలాడాలన్న ఇచ్ఛా శక్తికి, జ్ఞాన శక్తి మరియు క్రియా శక్తి...తోడవ్వాలి కదా! యోగ పరంగా ఈ స్పందనా శక్తి "ప్రాణ శక్తి". ఈ శక్తిని లలితాదేవి గానూ, శబ్ద బ్రహ్మం గానూ భావిస్తారు. సహస్రారంలో పుట్టిన ఈ శక్తి మూలాధారాన్ని చేరుతుంది. మూలాధారం నుండి మరల, ఒకానొక కుండలినీ శక్తి రూపంలో పైకి బయలుదేరుతుంది. ఇది వాక్కు యొక్క మూల రూపం. ఈ స్థితిలో ఉన్న శక్తి పేరు "పరా". ఇదే మొదటి వాగ్రూపము. ఈ శక్తి స్వాధిష్ఠానానికి వస్తే, ఆ రూపం "పశ్యంతి". ఈ స్థితిలో శబ్ద శక్తి మనస్సు ఆధీనంలో ఉంటుంది. మనస్సు సంకల్ప వికల్పాత్మకం. ఈ ప్రభంజనంతో ఆ వాగ్రూప శక్తి విశుద్ధ చక్రం వైపుకు పరుగు తీస్తుంది. ఈ విశుద్ధ చక్రం చేరేలోగా...ఈ శక్తిని బుద్ధి అడ్డుకుంటుంది. ఈ స్థాయిలో వాక్కును "మధ్యమా" అంటారు. ఇక్కడ మనస్సు చెప్పే మాటకు బుద్ధి ఒక రూపం కల్పిస్తుంది. భాషా స్వరూపం కూడా ఇక్కడే తయారవుతుంది. మధ్యమా రూప స్పందనా శక్తి...పూర్తి వాక్య రూపం ధరిస్తుంది. ఇక్కడే అకారాది...క్షకారాంత రూపం తయారవుతుంది. ఇలా పూర్తి అయిన మధ్యమా రూపం విశుద్ధ చక్రం వైపుకు పయనిస్తుంది. 


   ఈ విశుద్ధ చక్రంలోనే... శబ్ద బ్రహ్మ రూపమైన శక్తి...వైఖరీ వాక్కుగా మారుతుంది. ఇంతవరకు పూర్తి అర్థవంతంగా తయారైన శబ్దం...వరుస క్రమంలో బయటికి వస్తూ...ఒక్కో కండరాన్ని కదిలిస్తూ...మనం వినే శబ్ద రూపంగా బయటకు వస్తుంది. ఏ వైఖరితో రావాలో నిర్ణయిస్తుంది కనుక, ఇక్కడ దీని రూపం "వైఖరీ వాక్కు".


      మన ఋషులకు వాక్కు యొక్క నాలుగు రకాలు, నాలుగు దేవతా రూపాలుగా దర్శనమిచ్చాయి. ఐం బీజాక్షరం వాగ్భకూటం ఐం లో అ + ఈ +అ +o అనేవి వరుసగా - పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ అని చెప్పబడింది.అయితే ఈ వాక్కు అనేది మనుజులకే కాదు. సృష్టిలో స్థావర జంగమాలన్నిటికీ ఉన్నది. రాయి,రప్పలలో "పరా" రూపంలోనూ, చెట్టు, చేమ, వృక్షాలలో "పశ్యంతి" గానూ, జంతువులలో "మధ్యమా" గానూ కూడా ఉంటుంది 

వైఖరి మానవులకే సాధ్యం అయింది


ఇక శ్రీచక్ర విషయానికి వస్తే

పరా వాక్కు బిందు స్థానం. త్రికోణంలో పశ్యంతీ వాక్కు., వసుకోణం మధ్యమా, మిగిలిన చక్రాలు అంటే దశార యుగ్మము నుండి చతురస్రం వరకు వైఖరి వాక్కు.జాగ్రత్తగా అర్ధం చేసుకొండి.


 ప్రాణంలో పరా వాక్కు, మనస్సులో పశ్యంతి వాక్కు , ఇంద్రియములందు, మధ్యమ వాక్కు వాక్ప్రటన యందు వైఖరీ వాక్కు ఉంటాయని శాస్రం చెబుతోంది . బయటకు కనబడే చెట్టుకు కనబడని వేరు ఉన్నట్లుగా , వైఖరీ వాక్కుకు లోపల పరా, పశ్యంతి, మధ్యమా ఉన్నాయి. కంఠం నుంచి పెదవి వరకు వరకు ఉన్న ఎనిమిది స్థానాలలో ఈ వశిన్యాది దేవతలు ఉన్నారు. ఈ శరీరమే ఒక శ్రీ చక్రం. వశిన్యాది ఎనిమిది దేవతలు మన శరీరంలోనే ఉండి మనకు వాక్కు కలిగిస్తున్నారు. ఈ భావనతో అమ్మని ఆరాధిస్తే దివ్యమైన అనుభూతి కలుగుతుంది.


పరమేశ్వరుని మాయాశక్తి సంకల్ప రూపమైనది. మొదటిది పరా. .(పరస్య శక్తి )పరమాత్మతో ఏకమై ఉన్నప్పుడు అది నిశ్చలం. పరమాత్మ నాశ్రయించి ఉంటే అది కేవలం పర. తన్ను తాను పరామర్శించుకొంటే పశ్యంతి. క్రిందికి దిగి సృష్టికి అభిముఖమైతే మధ్యమ. సృష్టిగా మారిపోతే వైఖరి. పరాదశలో ఉన్న ఆ వాక్కు లేదా శబ్దం పరమమైన అర్థాన్నే చెబుతుంది. వాక్కు పరమం. అది చెప్పే అర్ధమూ పరమమే. ఇవే ప్రకాశ విమర్శలని పేర్కొంటారు . అర్ధాన్ని ఎంతెంత విమర్శిస్తూ పోతే అంతంత దాని ప్రకాశం బయట పడుతుంది. పూర్తిగా విమర్శిస్తే పూర్తిగా అనుభవానికి వస్తుంది. అదే బ్రహ్మానుభవం. ఇది శబ్దార్థ సహాయంతోనే మానవుడు సాధించాలి .


వశిన్యాది అష్ట దేవతలు శ్రీచక్రంలోని సప్తమావరణము లో ఉన్న వాగ్దేవతలు. పరా, పశ్యంతి మధ్యమా, వైఖరి అని నాలుగు విధములైన వాక్కులు – ఎనిమిది విధములైన వశిన్యాది వాగ్దేవతారూపం ధరించాయి (వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలా, అరుణ, - జయినీ, కౌళినీ, సర్వేశ్వరీ వాగ్దేవతలు) . చక్రేశ్వరి త్రిపురాసిద్ధా దేవి .. ఈ వాగ్దేవతలు అక్షారల్లోని ఎనిమిది వర్గలకు అధికారిణులు

ఎనిమిది వర్గలు :: అ - క - చ - ట - త - ప - య - శ మొత్తం ఎనిమిది 

మరొక విషయం చూద్దాము 

. వజ్రేశ్వరీ నామం లో ‘అతి రహస్య శక్తి దాగి ఉన్నది ’ 

శ్రీ చక్రంలో భూపురం నుండి లెక్కించినపుడు - శ్రీచక్రంలో కేంద్రం వద్దగల బిందువు, నవమావరణం అవుతుంది. 

దీనికి ముందుండే ఎనిమిదవ ఆవరణమైన త్రికోణం యొక్క మూడు శీర్షాల వద్ద ముగ్గురు 'అతి రహస్యశక్తు' లుంటారు. 

వారే - కామేశ్వరి, వజ్రేశ్వరీ , భగమాలిని. 


ఈ ముగ్గురిలో రెండవ శక్తి పేరు వజ్రేశ్వరీ. వజ్రశరీర రూపంలో ఉండునది - అని అర్థం. 


మనలో విశుద్ధ చక్రానికి అధిష్టాన దేవత ఈ వజ్రేశ్వరీదేవి 


విశుద్ధ చక్రం ద్వారానే సర్వ వాజ్మయం వ్యక్తం కావాలి. కాబట్టి, ఈ ' వజ్రేశ్వరీ' వాక్కుకు సంబంధించి ఉంటుంది. అందుకే 'వాగ్యై వజ్రః ' అంటారు. వాక్కుకు సంబంధించి 'వజ్రేశ్వరీ' ధ్యానం చేస్తే వాక్ శక్తి స్ఫుటంగా ఉంటుంది. దీనికి సంబంధించిన మంత్ర బీజాక్షరాలు కూడా ఉన్నాయి. వజ్రేశ్వరీ కి సంబంధించిన బీజాక్షరం 'జ్రీం'. ఈ జ్రీం కి ముందు ప్రణవ బీజం, తర్వాత కామరాజబీజం కలిపితే 'ఓం క్లీం, జ్రీం ' అవుతుంది. దీన్ని 'వజ్ర మంత్రం' అంటారు. స్ఫూటంగా వాక్కు వ్యక్తమవ్వాలంటే ఈ వజ్రేశ్వరీ మంత్రాన్ని 'ఓం క్లీం జ్రీం వజ్రేశ్వర్యై నమః అని జపిస్తారు. ఇంద్రుడు జపించి వజ్రాయుధం పొందినట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ మంత్రాన్ని గురూపదేశం లేకుండా చేయరాదు. 


లలితా సహస్రం లోని శ్లోకాన్ని స్పృశించి వ్యాసం ముగిస్తాను 


""పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా 

మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ""


శ్రీచక్రంలో బిందు స్థానమే 'పరా'. పరాను ప్రత్యక్ (స్వస్వ రూపంలో అంటే బ్రహ్మ )గానే సాధన చేస్తే ' చితి ' గా అర్ధం అవుతుంది. అంటే చైతన్య రూపంగా తెలుస్తుంది. పశ్యంతి రూపాన్ని పరదేవతగా అభివర్ణించారు. శ్రీచక్రంలో త్రికోణ రూపమే పశ్యంతీ. ఆ పైన ఉండే అష్ట త్రికోణ చక్రమే ‘ మధ్యమా '. ఆపైన అన్ని ఆవరణలూ కలుపుకుని ' వైఖరీ '' అని తెలుసుకుంటున్నాము. ఈ నాలుగు రూపాలూ కలిసి ' భక్తుడి మనసు అనే ఆడ హంస ' - అని లలితా సహస్ర నామంలో వశిన్యాది వాగ్దేవతలు వర్ణించారు. మళ్ళీ ' హంస ' అన్న మాట పరమాత్మ స్వరూపాన్నే సూచిస్తుంది. అంటే - పరా దేవతని ప్రత్యక్చితీ రూపంలోనూ, భావ రూపంలో పశ్యంతీ గానూ, జప రూపంలో మంత్రాలను మనస్సులో అనుకోవడం మధ్యమాగా తెలుసుకుని, , ఆ ప్రాణశక్తి అయిన అమ్మవారిని వైఖరి గాను భావించడం జరుగుతుంది.

                         స్వస్తి 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ 

-

17, నవంబర్ 2025, సోమవారం

ఎందుకయా! సాంబశివా! భక్తి గీతం

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు.🌹

  భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన, చాలా ప్రాచుర్యం పొందిన భక్తి గీతం ' ఎందుకయా! సాంబశివా! '. ఈ గీతానికి సంగీతం పాలగుమ్మి విశ్వనాథం గారు. ఎంతో ఆర్తితో ఆ మహాశివుని ప్రార్ధించే ఈ గీతాన్ని వినసొంపుగా ఆలపించారు శ్రీమతి ఆకెళ్ల రాధాదేవి. గొప్ప రసరమ్య గీతం. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

పిల్లలు పక్కలో మూత్రం పోయకుండా

 7 రోజుల్లో పిల్లలు పక్కలో మూత్రం పోయకుండా నివారించే అద్భుత యోగం  - 


      ప్రతినిత్యం రాత్రి పడుకునే సమయంలో 125 ml పాలల్లో చిటికెడు ఆవాల పొడి కలిపి తాగించుచున్న 7 రోజుల్లొ చిన్నపిల్లలు పక్కలో మూత్రం పోయుట ఆగిపోవును .


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

17నవంబర్ 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    🕉️ *సోమవారం*🕉️

*🌹17నవంబర్ 2025🌹*

   *ధృగ్గణిత పంచాంగం* 


       *స్వస్తి శ్రీ విశ్వావసు*

        *నామ సంవత్సరం*       

*దక్షిణాయనం - శరదృతువు*

*కార్తీక మాసం - బహుళ పక్షం*


తిథి      : *త్రయోదశి* పూర్తి

వారం   : *సోమవారం* (ఇందువాసరే)

నక్షత్రం : *చిత్ర* *తె5.32 వరకు*

యోగం : *ప్రీతి* *ఉ9.19 వరకు*

కరణం  : *గరజి* *సా5.52 వరకు*

వర్జ్యం  :  *మ12.13 - 1.57*

దుర్ముహూర్తము : *మ12.07 - 12.52*

                   మరల *మ2.21 - 3.06*

అమృతకాలం    : *రా10.37 - 12.20*

రాహుకాలం        : *ఉ7.30 - 9.00*

యమగండ : *ఉ10.30 - 12.00*

సూర్యరాశి: *వృశ్చికం*  చంద్రరాశి: *కన్య*

సూర్యోదయం: *6.09* సూర్యాస్తమయం:

*5.21*

<><><><><><><><><><><><><><>

       *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_*

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*శాంతే స్వాంతే*

*ప్రలీనే ప్రకటితవిభవే* 

*దివ్యరూపేఽ శివాఖ్యే*


🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

గోకర్ణ క్షేత్రం

 🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀


గోకర్ణ క్షేత్రం



కార్తీకమాసం సందర్భంగా రోజుకొక శైవ క్షేత్రం


గోకర్ణం...🙏🏻


గోకర్ణ క్షేత్ర వివరాలు స్కందపురాణంలో కనిపిస్తాయి.


గోకర్ణ మహాబళేశ్వరాలయంలో గణపతి విగ్రహం ఉంది; ఇక్కడ ఉన్న గణపతి విగ్రహానికి తలమీద ఓ సొట్ట ఉంటుంది.అది ఒక సందర్భంలో గణపతి తెలివికి ఉక్రోషంతో రావణుడు కొట్టిన దెబ్బవల్ల ఏర్పడిందని కథనం.


గర్భగుడిలోని లింగం కింది వైపున పెద్దగా ఉంటూ పైకి వెళ్లే కొద్ది సన్నబడి ఉంటుంది. రావణుడు పెకిలించడానికి ప్రయత్నించడం వల్ల లింగం ఈ రూపును సందర్శించుకుందని పూజారులు చెబుతుంటారు. ఇక లింగం పై భాగంలో ఉన్న రంద్రంలో వేలును పెడితే లింగం లోపల ఉన్న మరో లింగం కనిపిస్తుంది. అదే నిజమైన ఆత్మలింగంమని కథనం. పన్నేండేళ్లకు ఒకసారి ఇక్కడ ఈ లింగానికి విశేష పూజలు జరుగుతాయి.


మహాబలేశ్వర ఆలయం తూర్పున మహాగణపతి ఆలయం ఉంటుంది. రావణుడికి ఆత్మలింగం దక్కకుండా తన వంతు సహకారం అందించి నుందుకు గాను గణపతిని శివుడు మెచ్చు కుంటాడు. అంతే కాకుండా ఈ క్షేత్రంలో మొదట గణపతిని దర్శించుకున్న తర్వాతనే తనకు భక్తు పూజలు చేస్తారని చెబుతారు. ఈ విధానం ఇప్పటికీ ఆచరిస్తున్నారు. ఇక్కడి గణపతి విగ్రహం తల పైన నొక్కు రావణుడి మొట్టి కాయకు గుర్తుగా చెబుతారు. మహిమాన్మితమైన గణేషునిగా , మంచి ఇచ్ఛతో కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులు బావిస్తుంటారు


రావణుడు గొప్ప శివభక్తుడు. దక్షిణ ప్రాంతంలో ఉన్న తన దేశంలోనే శివుణ్ణి పూజించేవాడు. కొంతకాలం తర్వాత, “కైలాసాన్ని నాయింటికే ఎందుకు తెచ్చుకోకూడదు?” అని అతననుకున్నాడు. 


అతను లంక నుండి కైలాసపర్వతం దాకా నడిచాడు. కైలాసపర్వతాన్ని ఎత్తడం ప్రారంభించాడు. పార్వతికి చాలా కోపం వచ్చింది. ఆవిడ, శివుడితో , “అతను నీకెంత ప్రీతిపాత్రుడైనా కావచ్చు, కాని కైలాసాన్ని దక్షిణానికి తీసికు వెళ్ళడానికి అనుమతించవద్దు.” అన్నది. రావణుడి అహంకారం చూసి శివుడికి కూడా కోపం వచ్చింది. కైలాసాన్ని తన పాదంతో కిందికి ఒత్తాడు. కైలాసం కింద రావణుడి చేతులు ఇరుక్కున్నాయి. రావణుడు బాధతో గింజుకున్నాడు, కాని శివుడతన్ని వదిలిపెట్టలేదు.


కైలాసం కింద తన చేతులు ఇరుక్కుపోయినా, రావణుడు శివునిపై ప్రేమతో, అందమైన వివిధ గీతాలతో శివస్తోత్రం చేయసాగాడు. అతను 1001 గీతాలు రచించి శివునిపై తన భక్తిని వెల్లడించి, పూర్తిగా ఆయనకు ప్రపత్తుడయ్యాడు. 


అప్పుడు శివుడు రావణుని ముక్తుణ్ణి చేసి, “ఒక వరం కోరుకో, నీ ఇష్టం వచ్చిన వరం.” అన్నాడు. మళ్లీ రావణుడి స్వభావం వెల్లడైంది. అతను, “నేను పార్వతిని వివాహమాడాలి.” అని కోరుకున్నాడు “సరే, ఆమె ఇప్పుడు మానస సరోవరంలో ఉంది. నీవు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవచ్చు” అన్నాడు శివుడు. 


శివుని చుట్టూ ఉన్న గణాలు ఆందోళన చెంది, “ఇదెట్లా? రావణుడు పార్వతీదేవిని ఎట్లా తాకగలడు? ఇది అసంభవం” అనుకున్నారు. వాళ్లు మానస సరోవరానికి పరిగెత్తి వెళ్లి పార్వతీదేవికి, “రావణుడొస్తున్నాడు. అమ్మా! రావణుడు మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి శివుడు అనుమతి ఇచ్చాడు.” అని చెప్పారు. పార్వతి కప్పల రాణి మండూకాన్ని పిలిచింది. అందమైన యువతిగా మార్చింది. రావణుడు పార్వతినెప్పుడూ చూడలేదు. ఇప్పుడు మండూక యువతిని చూసి పార్వతే అనుకున్నాడు. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడై వివాహమాడాడు. ఆ యువతే మండోదరి.


తర్వాత రావణుడు గొప్ప సాధన చేశాడు. శివుని నుండి శక్తిమంతమైన జ్యోతిర్లింగాన్ని పొందాడు. ఇది సమాజం ఆమోదిస్తుందా లేదా అన్న సంశయాలేవీ శివునికి ఉండవు. నిజాయితీగా ఏమి చేసినా ఆయనకు ఇష్టమే. ఏకైకధ్యానంతో సాధన చేస్తే ఆయన వశమైపోతాడు. శివుడు రావణునికి జ్యోతిర్లింగాన్ని ఇస్తూ దాన్ని ఎక్కడ పెడితే అక్కడే శాశ్వతంగా ప్రతిష్ఠమైపోతుందనీ, అందువల్ల మధ్యలో ఎక్కడా కింద పెట్టవద్దనీ చెప్పాడు.


నిజాయితీగా ఏమి చేసినా ఆయనకు ఇష్టమే. ఏకైకధ్యానంతో సాధన చేస్తే ఆయన వశమైపోతాడు. 

రావణుడు చాలా జాగ్రత్తగా గొప్పశక్తితో జ్యోతిర్లింగాన్ని తీసికొని లంకకు వెళుతూ ఉన్నాడు. రావణుడు గొప్ప యోగి. ఆహరం తీసుకోలేదు, కనీసం లఘు శంక తీర్చుకోవడానికి కూడా పోలేదు, ప్రతి మనిషికీ, సహజమైనవీ, ఆవశ్యకమైనవీ అన్నీ విసర్జించాడు. 


కైలాసం నుండి దాదాపు 3000 కిలోమీటర్లు ఈ విధంగా ప్రయాణించి కర్ణాటకలోని గోకర్ణం చేరుకున్నాడు. అప్పటికి బాగా అలసిపోయి ఉంటాడు. చాలా నీళ్లు తాగి ఉంటాడు. మూత్రాశయం నిండిపోయి ఉంటుంది. ఇక మూత్ర విసర్జన చేయకుండా నిలుపుకోవడం అసాధ్యమైపోయింది. జ్యోతిర్లింగం చేతుల్లో పట్టుకొని ఈ అపవిత్రకార్యం చేయలేడు కదా.


అప్పుడతనికి పశువులను మేపుతున్న ఒక అమాయక గోపాలబాలుడు కనిపించాడు. ఎవడైనా తెలివైన వాడి చేతికి ఏదైనా విలువైన వస్తువును ఇస్తే వాడది తీసుకొని పారిపోవచ్చు. ఈ పిల్లవాడు చాలా అమాయకంగా కనిపించాడు. రావణుడు అతనితో ఇలా అన్నాడు, “కాసేపు ఈ లింగాన్ని పట్టుకో. కిందమాత్రం పెట్టకు. అందుకుగాను, నేను నీకో విలువైన నగ ఇస్తాను”. సరేనన్నాడు బాలుడు.రావణుడు బాలుడి చేతిలో జ్యోతిర్లింగం పెట్టి పక్కకు వెళ్లాడు. ఆ బాలుడెవరో కాదు, గణపతి. గణపతికి జ్యోతిర్లింగం లంకకు చేరడం ఇష్టం లేదు, అది లంకలో ఉంటే రావణుడి శక్తి అపారంగా పెరిగిపోతుంది. అందువల్ల గణపతి ఏం చేశాడు? జ్యోతిర్లింగాన్ని నేలమీద పెట్టాడు. అది అక్కడ దిగబడిపోయి ప్రతిష్ఠితమైపోయింది. ఇప్పుడు కూడా, మీరు గోకర్ణం వెళ్లి చూస్తే, లింగం రాతిలోపలకు ఉంటుంది. సన్న రంధ్రంలో నుండి వేలుపెట్టి లింగాన్ని స్పృశించాలి. అది లోపలకు వెళ్లిందన్నమాట.


రావణుడికి కోపం వచ్చి, గణపతి తలపై గట్టిగా ఒక దెబ్బ వేశాడు. గోకర్ణంలో గణపతి విగ్రహం కూడా ఉంది. దాని తల భాగం పై చిన్న గుంట ఉంటుంది. రావణుడికి మళ్లీ కైలాసం వెళ్లి, శివుణ్ణి మెప్పించి మళ్లీ జ్యోతిర్లింగం తెచ్చే ఓపిక లేకపోయింది. క్రోధంతో తన లంకకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.


మీరు మంచివాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా , మీకు ఇచ్ఛ ఉంటే, దివ్యత్వం మీకెప్పడూ అందుబాటులోనే ఉంటుంది. మీరు కలిగి ఉన్న స్వభావాన్ని బట్టి అది వరంగానో, శాపంగానో పరిణమిస్తుంది. మీరు మీ అస్తిత్వాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్నది – మీలో మీరు ఎటుంటి దృక్పథాన్ని, ఎటువంటి మనస్సును వికసింపచేసుకుంటారో- అదే నిర్ణయిస్తుంది..   


హరహర మహాదేవ శంభో శంకర 🙏🏻



✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀

మాఘోస్సన్తి త్రయోగుణాః...

 *ఉపమా కాళిదాసస్య*

*భారవేరర్థగౌరవమ్*

*దండినః పదలాలిత్యమ్*

*మాఘోస్సన్తి త్రయోగుణాః*


ఉపమాలంకారాన్ని ప్రయోగించటంలో కాళిదాసునే చెప్పుకోవాలి. అంతటి గొప్పకవి ఎవరూ లేరు. 


భారవి కవి చెప్పే శ్లోకాలకు చాలా గొప్ప, లోతైన అర్థాలు ఉంటాయి. ఈవిధంగా వ్రాయగల కవి మరొకరు లేరు. 


దండిమహాకవి చక్కని పదాలను ప్రయోగించటంలో దిట్ట. పదసంపద బాగుంటుంది. ఎక్కడ ఏ పదం ఎలా ఉపయోగించాలి? అనేది ఈయనకు బాగా తెలుసు. పదలాలిత్యంలో దండిమహాకవిని మించినవారు లేరు. 


మాఘోస్సన్తి త్రయోగుణాః...

పై ముగ్గురుకవులకూ ఒక్కొక్క లక్షణంలో నైపుణ్యం ఉంటే...  ఈ మాఘుడు పై ముగ్గురిలక్షణాలనూ పుణికిపుచ్చుకొన్న అద్భుతమైన కవి. 



*ఇది భాషావేత్తల ప్రశంస*