వినాయక ప్రార్ధన
అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ
బా ల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్ కబళింపబోయి
ఆ వంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్
హిమాలయ వర్ణన
అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట
నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్
కటకచరత్ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
నర్మగర్భంగా వరూధిని పలుకులు
ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర ఏ
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు లా
గింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్
ప్రవరుడు వరూధినిని తిరస్కరించుట
ప్రాంచద్భూషణ బాహుమూలగతితో పాలిండ్లుపొంగార పై
యంచుల్ మోవగ కౌగిలించి యధరంబాసింప హా శ్రీహరీ
యంచున్ బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్ ద్రోచె కలంచునే సతులమాయల్ ధీరచిత్తంబులన్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి