18, అక్టోబర్ 2022, మంగళవారం

క్షౌరకర్మను గురించి

 

క్షౌరకర్మను గురించి శాస్త్రము ఒక క్రమపద్ధతిని నిర్దిష్టపరచినది.

మనలో చాలామంది ఆదివారం సెలవు అని ఆదివారం నాడు  క్షౌరకర్మ (Hair Cutting) కు వెళుతుంటారు.  నిజానికి ఆదివారం పనికిరాదని చాలామందికి తెలియదు.  ఏ ఏ వారాలు ఏ ఎ తిధులు క్షౌరకర్మను ఆచరించాలని మన శాస్త్రాలు తెలుపుతున్నాయో తెలుసుకుందాం. 

ఈ క్రింది తిధుల యందు క్షుర కర్మ నిషేధం. అవి.

ఏకాదశీ, చతుర్దశీ, అమావాస్య, పూర్ణిమా, సంక్రాంతి, వ్యతిపాతము, విష్టి (భద్రా) ఇత్యాదులయందు, మరియు వ్రతదినములయందు, శ్రాద్ధదినముల యందు, 

ఇక వారములు మంగళ,, శనివారములయందు క్షౌరకర్మ పనికిరాదు. ఆదివారము క్షౌరము చేయించుకొనుటవలన ఒకమాసము ఆయువును, శనివారము క్షురకర్మ చేయించుకొనుటచేత ఏడుమాసములు ఆయువును, భౌమవాసరము (మంగళవారము) వలన ఎనిమిది మాసముల ఆయువును, ఆయా దినములకు చెందిన అభిమాన దేవతలు క్షీణింపచేయుదురు. ఇదేవిధముగా బుధవారము క్షౌరము చేయించుకొనుటచే ఐదు మాసముల ఆయుర్దాయమును, సోమవారము వలన ఏడుమాసముల ఆయువును, గురువారమువలన పదిమాసముల ఆయుష్యమును, శుక్రవారమువలన పదునొకండు నెలల ఆయువును, ఆయా దినములయొక్క అభిమానదేవతలు వృద్ధి చేయుదురు. గృహస్థులు మరియు ఒకే ఒక పుత్రుడు గలవారలు సోమవారమునాడు చేయించుకొనగూడదు. అట్లే విద్యను, లక్ష్మిని కోరుకొనెడువారలు క్షురకర్మ చేయించుకొనుట పనికిరాదు. అని ఈవిధముగా గూర్చి గర్గాదిమహర్షులు వచించియున్నారు. 

ఇక బ్రాహ్మణుల క్షౌర విధిని పరిశీలిద్దాం.  ప్రతి బ్రాహ్మణుడు శిరో ముండనం (గుండు) చేయించుకోవలెను  శిఖదారణ (పిలక కలిగి ఉండటం.)  చేయటం తప్పనిసరి. అది మూర్ఖత్వం కాదు ప్రతి బ్రాహ్మడు విధిగా శిఖ కలిగి ఉండటం ఆవశ్యకం.  శిఖ లేకుండా ఆచరించే ఏ క్రతువు కూడా ఫలితాలను ఇవ్వదు.  మన దురదృష్టం ఏమిటంటే కేవలం పితృ కర్మలను ఆచరించేటప్పుడే శిఖ ధరించటం ఆనవాయతీగా అనుకుంటున్నాము.  కానీ శిఖ లేకుండా సంధ్యావందనం చేయటానికి కూడా అయోగుదే  అది తెలుసుకొనవలెను.. పౌరోహితం చేసే బ్రాహ్మణోత్తములు ఈ విషయం ప్రతి బ్రాహ్మణుడికి తెలపాల్సిన అవసరం వున్నది.  ముందుగా వారు ఆచరించాల్సిన విధి  కుడా వున్నది. . ఎలాంటి కర్మలు చేస్తే ఎలాంటి ఫలితాలు చేకూరుతాయి అన్నది మన మహర్షులు శోధించి సాధించి మనకు ఒక చక్కటి జీవన విధానాన్ని ఏర్పాటు చేశారు.  కేవలం మనం వారిని అనుసరించి,  వాటిని ఆచరించి తరించటమే మన కర్తవ్యము

ఈ విషయములను గీత ప్రెస్ వారి ప్రచురణ "నిత్యకర్మ - పూజా ప్రకాశిక " అను గ్రంధము నుండి సేకరించపడినవి . బ్రాహ్మణులు ఆచరించవలసిన అనేక విషయములను అందు ప్రస్తావించబడెను.  ఆ గ్రంధము ధర వెరసి రూ . 150/- వలసిన వారు గీతాప్రెస్ పుస్తక బండారం నుండి ఖరీదు చేయవచ్చు. సికిందరాబాదు రెయిల్వేస్టేషన్ ప్లాట్ఫారం నెం 1 నందు స్టాలు కలదు. 

 

 

 

 



 

అన్నదాన సత్రములు

 అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్య అన్నదాన సత్రములు  & Contact phone nos.

శ్రీశైలం

8333907784

8333907787

కాశీ

8333907790

8333907791

రామేశ్వరం

8333907793

04573-222156

భద్రాచలం

8333907796

8333907795

మహానంది

8333907803

8333907802

షిర్డీ

8333907800

8333907798

అలంపూర్

8333907806

8333907805

త్రిపురాంతకం

8333907794

యాదాద్రి

8333907815

08685-299909

విజయవాడ(వృద్ధాశ్రమం)

8333907807

8333907813

కర్నూల్ ( శంకర మఠం)

8333907783

8333907808

అరుణాచలం

8333907813.

Rs.3000/- permenant yearly oneday అన్నదానం.

Rs 15000/- permenantly yearly 5 days అన్నదానం.

రాస 30000/- permenantly daily అన్నదానం.

Rs 1500/- only one day అన్నదానం లేదా oneday sweet.

అన్నీ దానములలో అన్నదానం గొప్పది.దీనిని సద్వినియోగం చేసుకొందాం.బ్రాహ్మణులకు చేయూత నిస్తాం.