ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
21, జనవరి 2025, మంగళవారం
20, జనవరి 2025, సోమవారం
సత్యనారాయణపురం
🌹💥 మన సత్యనారాయణపురం . 💥🌹
♦️*మా బెజవాడలో ఆ పేటలో ఉండాలనే కోరిక,చిన్నతంలో మెండుగా
ఉండేది నాకు....అక్కడి స్థానికుల్ని చూస్తే రవంత అసూయ కూడా
కలిగేది.ఏదో ఒక పని కల్పించుకొని,కాసేపు ఆ పేటలో తిరిగి,తృప్తి
పడేవాణ్ణి.
♦️అలాగని,అక్కడేమీ ఆకాశ హర్మ్యాలుండేవి కావు..
నక్షత్రాల హోటళ్లసలే కనపడేవి కావు...విశాలమైన రోడ్లు మనకు
ఆహ్వానం పలుకుతాయా అంటే అదీ లేదు.
ఇంతకీ అక్కడ నాకు నచ్చిన అంశాలేమిటో తెలుసా!...
♦️#నిత్యం,కళకళలాడుతూ తిరిగే మధ్యతరగతి మనుష్యులు..ఏరోజు
సరుకులు ఆరోజు కొనుక్కుని,సంతోషంగా,తృప్తిగా జీవనం సాగించే
సగటు జీవులు..
♦️#అడుగడుగునా దర్శనమిచ్చే గుళ్లు,ఆ గోపురాలపై,లౌడ్ స్పీకర్లలో
ప్రాతఃకాలంలో వినిపించే భక్తి గీతాలు...ఇళ్లముందు అరుగులపై కూర్చొనిముచ్చట్లు చెప్పుకొనే ముత్తయిదువులు...వారి నుదుట రూపాయికాసంత కుంకుమ బొట్లు...ముచ్చటైన ముక్కుపుడకలు...గుబాళించేమల్లెల ఘుమఘుమలు..
♦️ఇంటి తరహా భోజన,ఫలహారాలు వండి
వడ్డించే బ్రాహ్మణ హోటళ్లు..అప్పడాలపిండి ముద్దలు,ఊరగాయ
పచ్చళ్లు,వేడివేడి మిరపకాయ బజ్జీలు,పెసర పుణుగులు,మద్రాసు తరహానఖార్సయిన ఫిల్టర్ కాఫీ బడ్డీలూ....ఒకటేమిటి? అన్నీ అక్కడ
నోరూరిస్తూ పలుకరిస్తాయి.
♦️#శివాజీకేఫ్ సెంటర్లో ఘాటైన గోలీసోడా, మిఠాయి కిళ్లీ ప్రత్యేకాకర్షణలు!
..
ఆప్రక్కనే #శివాలయం..బయట కూర్చొని,జంధ్యాలు అమ్మే బక్కచిక్కినముదుసలి బ్రాహ్మణులు..నుదుట విభూతి రేఖలతో,పిలక
ముడిగట్టి,సర్రున సైకిలెక్కి చక్కాపోయే యువ పురోహితులు...చేతి సంచీధరించి,పచారీ కొట్లలో గీచిగీచి బేరమాడే అతివలు,
అమ్మ ఆజ్ఞపై అరిశలపిండి మరపట్టిస్తూ,పిండిమర బయట పడగాపులు పడేపిల్లకాయలు....ఉద్యోగ బంధవిముక్తులై,విశ్రాంత జీవితాన్ని రిక్షాలోకాలుమీద కాలేసుకొని కూర్చొని అనుభవిస్తూ సాగిపోయే ముదిమివయస్కులు..
♦️గోచిపోసికట్టిన చీరె కొంగు ఒకచేత్తో,విస్తరాకుల మూట ఒక
చేత్తో పట్టుకొని,రొప్పుతూ సిటీబస్సు ఎక్కేవంటలక్కలు..
#శృంగేరీపాదుకాక్షేత్రం బయట మెట్లపక్క చేరి,వచ్చిన సంభావనలను పంచుకొనేబ్రహ్మలు...
♦️ఇరుకైన ఆరోడ్లపై గుంపులుగా గోమాతలు,వాటిని
తప్పించుకుంటూపోటీలుపడి పరిగెత్తే మూడు,పద్ధెనిమిది నంబరు
సిటీబస్సులు...వీటన్నిటికీ మించి...ఏపండగొచ్చినా అక్కడి సందడే సందడి!
♦️.#సంక్రాంతి వచ్చిందంటే,ప్రతి ఇంటి గుమ్మానికీ మామిడి
తోరణాలు,ముంగిట ముత్యాల ముగ్గులు..గొబ్బెమ్మలు...తీరుగా తీర్చిన
బొమ్మలకొలువులు...సాయంత్రం వీధులవెంట రంగురంగుల
పట్టుచీరెలు కట్టి,కాళ్లకు పసుపు పట్టించి,సకలాభరణ
భూషితలై,తలనిండ పూదండలు దాల్చి, గుంపులు గుంపులుగా
దర్శనమిచ్చే పేరంటాళ్లతో ఒకటే కోలాహలం...
♦️ఆ పేటలో అయితేనాలుగు రాళ్లు సంపాదించటం ఖాయమని తెలిసినడూడూబసవన్నలు,హరిదాసులు,పులివేషాలు,
పిట్టలదొరలు...
♦️రామనవమి,దసరా,వినాయకచవితి పండగలొస్తే,రాత్రిళ్లు
#ప్రతి కూడలిలో హరికథలు,కూచిపూడి నృత్యాలు,సంగీత
కచేరీలు,పౌరాణిక నాటకాలు..దీపాలంకరణలు....ఆ పేటకే
ప్రత్యేకతలు..ఎన్నోమార్లు అక్కడి వీధులలోని పందిళ్లలో పాటకచేరీలు
చూసాను నేను!..
.
♦️#శ్రావణ శుక్రవారాలలో,కార్తీక సోమవారాలలో,
వినాయక చవితి రోజుల్లోఆపేట రోడ్లపై నడవటమే దుర్లభం...అంత రద్దీగా ఉంటాయి...అక్కడి రైల్వే స్టేషన్ కళే వేరు...
♦️తెల్లారగట్టే,పాలబండి కోసం,సైకిల్ కి
బిందెలుకట్టుకొని వచ్చే కోరమీసాల పాలబ్బాయిలతో నిండిపోయేది.
.రైలు పట్టాలప్రక్కగా నడుచుకొని,నల్లగేటు మీదుగా ఆ పేటలో
అడుగుపెట్టేవాళ్లం..
♦️ఏకేటీపీ స్కూల్ అంటే..'ఆంధ్రకేసరి టంగుటూరి
ప్రకాశం పంతులు'స్కూల్ అని ఆరోజుల్లో తెలియదు మాకు.మాకు
తెలిసిందల్లా అక్కడి నేరేడు,మేడిచెట్ల పైకి రాళ్లేసి,కాయలు కొట్టటం
ఒక్కటే...ఇక రైల్వే కాలనీ అయితే..మామిడి కాయలు కొట్టుకోటానికి
ప్రసిద్ధి.
♦️#పాతికేళ్లక్రితం,ఆపేటలోని రైల్వేలైను తొలగించినప్పుడు
చివరి 'పాలబండి'కి కన్నీళ్లతో హారతులిచ్చి,వీడికోలుచెప్పారట
ఆ పేటవాసులు!అంతగా అక్కడివారి జీవితాలతో పెనవేసుకుపోయింది ఆ రైల్వేస్టేషన్...
♦️మారుతీవ్యాయామశాల,శిశు విద్యామందిర్,ప్రక్కనే కేఎల్రావు
బిల్డింగ్,రాజన్ కిళ్లీషాపు,బాబూరావుమేడ,పిల్లల జైలు,అగ్గిపెట్టెల
ఫాక్టరి,ఆంధ్రరత్న పార్కు..ఆ పార్కులో ఎత్తుగా స్తంభానికి కట్టిన స్పీకర్
నుంచి వినిపించే రేడియో 'బావగారి కబుర్లు'...మరిచిపోలేని రోజులవి...
దాక్షిణ్యంవారివీధిలో,లంకావారి 'పారుపల్లిరామకృష్ణయ్యపంతులు
సంగీత విద్యాలయం',నృత్య శిక్షణాలయాలు,జ్యోతిష,వాస్తు కేంద్రాలు
ఉన్నాయక్కడ!ఇక,ఇళ్లకొచ్చి సంగీత పాఠాలుచెప్పే పంతులమ్మలెందరో!.
..
.♦️పద్మవిభూషణ్ బాలమురళీకృష్ణగారి స్వగృహం ఆపేటలోనే
ఉంది..ఆయన బాల్యమంతా ఆ వీధుల్లోనే గడిచింది
.'#సంగీత సన్మండలి' నిర్వహించే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు
విచ్చేసి,ఉంఛవృత్తి,నగర సంకీర్తనలో పాల్గొని...చిన్ననాడు తను
నడయాడిన వీధులలో నడచి,తను ఆటలాడిన ప్రదేశాలను తనివారా
చూసుకున్నారాయాన తన డెబ్భై అయిదేళ్ల వయసులో....చివరిసారిగా...
ఇంతకీ...మీకు నేను ఆ పేటపేరు చెప్పలేదు కదూ!...
♦️బెజవాడ తెలిసినవారెవరైనా ఈపాటికి ఊహించే
ఉంటారు.అదే..'సత్యనారాయణపురం'...
కుర్రకారు,సాయంత్రంపూట,'కలరింగ్' పేరుతో,బాపూబొమ్మల్లాంటి
అమ్మాయిలను చూడటానికి సత్యనారాయణపురం వీధుల్లో తిరగటం
గొప్పగా ఫీలయ్యేవాళ్లం..
♦️అందంగా,లక్షణంగా ఉండే ఆడపిల్లలు వీధుల్లో
దర్శనమిచ్చేవారు.
అక్కడి వీధులపేర్లన్నీ దాదాపుగా విప్రోత్తముల ఇంటిపేర్లే!..అక్కడ
చాలావరకూ శిధిల భవనాలే...
అయితే..కాలం మారుతోంది.అక్కడా వాణిజ్య భవన సముదాయాలు
వచ్చేస్తున్నాయి.ప్రజలలో మార్పు వస్తోంది.కట్టు,బొట్టు,సంప్రదాయాలు
అదృశ్యమైపోతున్నాయి.
♦️సత్యనారాయణపురాన్ని ఆనుకొని ఉండే మా
గాంధీనగర్ అయితే 'బ్రాందీనగర్' గా రూపాంతరం చెందింది.సినిమాపిచ్చి జనం పెరిగిపోయారు.ఎంతటి రోడ్లైనా
ఆక్రమిత వ్యాపారాలతో,అపరిమిత వాహన కాలుష్యాలతో నిండిపోయి
కనిపిస్తున్నాయి.
సత్యనారాయణపురంలో మాత్రం ఇంకా పాతవాసనలు
పోలేదు.
అందుకే..సత్యనారాయణపురమంటే నాకిష్టం....
-------•°○●{}●○°•------
🌺🌺సేకరణ🌹🌹
పంచాంగం 20.01.2025 Monday,
ఈ రోజు పంచాంగం 20.01.2025 Monday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష షష్టి తిథి ఇందు వాసర హస్త నక్షత్రం సుకర్మ యోగః: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
19, జనవరి 2025, ఆదివారం
పంచాంగం 19.01.2025 Sunday
ఈ రోజు పంచాంగం 19.01.2025 Sunday
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష పంచమి తిథి భాను వాసర ఉత్తరఫల్గుణి నక్షత్రం అతిగండ యోగః: తైతుల తదుపరి గరజి కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.
యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
శుభోదయ:, నమస్కార:
పోతనగారి దర్శనం-ప్రదర్శనం !!
శు భో ద యం 🙏
పోతనగారి దర్శనం-ప్రదర్శనం !!
వినువీధిన్ జనుదేరఁగాంచిరమరుల్
విష్ణున్ సురారాతి జీ
వనసంపత్తినిరాకరిష్ణుకరుణావర్ధిష్ణుయోగీంద్రహృ
ద్వనవర్తిష్ణు సహిష్ణు భక్తజనబృంద ప్రాభవాలంకరి
ష్ణునవోఢల్లసదిందిరా పరిచరిష్ణున్
జిష్ణు రోచిష్ణునిన్;
బమ్మెఱపోతనకవితలోని కథాకథన
దక్షత అపూర్వమైనది.
.గజేంద్రమోక్షణమున భక్తరక్షణాపరాయణుడైనపరమాత్మ శ్రీమన్నారాయణుడు వైకుంఠమునుండి
వేగముగా వచ్చుసందర్భమున ఆఘట్టమును పోతనచిత్రించినతీరు.నాన్యతోదర్శనీయమైయున్నది.అదియతని కథాదర్శనము.కవితాప్రదర్శనమునకు నిదర్శనమై, అపురూపముగా మారినది.
తొలుత నారాయణుని రాకలోనివేగమును సూచించుటకైఅంత్యానుప్రాసలతోకూడిన లయాత్మకమైనవిన్యాసములతో పద్యమునలంకరించి, చివరకు కొత్తపెళ్ళికూతురుపమించులక్ష్మితోగూడి
సతీసమేతముగావచ్చునారాయణుని దర్శనమును ప్రదర్శనమొనరించినాడు.
ఆసుందరదృశ్యమును దేనతలుకనులార
కనుగొని"
యల్లవాడెహరి,పజ్జంగంటిరే లక్ష్మి,శంఖంబల్లదె,చక్రంబల్లదె భుజంగధ్వంసియున్వాడె, చ
య్యన నేతెంచెనటంచువేల్పులు నమోనారాయణాయేతి" ని
స్వనులై ,మింటహస్తిదురవస్థావక్రికిన్ జక్రికిన్!మ్రొక్కిరట!"-
ఆవిధముగా వినువీధిలో సపరివారుడై అరుదెంచునారాయణునిఅమరులుదర్శించి నమస్కరించినారు.
చూడముచ్చటగా నున్నదిగదా
పోతనగారి దర్శనము-ప్రదర్శనము.
మదిలో హత్తుకు పోయినది.🙏🌷🌷🌷
18, జనవరి 2025, శనివారం
ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్
(ఫ్లాష్ న్యూస్) ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా అవతరించనున్న ఆల్ ఇండియా ట్యాక్స్ పేయర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిన్న నిర్ణయించింది. ఏ ప్రభుత్వం పాలిస్తున్నప్పటికీ, ఈ సంస్థ ఆమోదం లేకుండా ఏ ప్రభుత్వం కూడా ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఉచిత పంపిణీ లేదా రుణమాఫీని ప్రకటించదు. డబ్బు మా పన్ను చెల్లింపుదారులకు చెందినది కాబట్టి, దాని వినియోగాన్ని పర్యవేక్షించే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి. రాజకీయ పార్టీలు ఓట్ల కోసం ఉచితంగా పంపిణీ చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రకటించే ఏ ప్రాజెక్టులైనా ముందుగా వాటి బ్లూప్రింట్‌లను సమర్పించి ఈ సంస్థ నుండి అనుమతి పొందాలి. ఇది MPలు మరియు MLAల జీతాలకు మరియు వారు పొందే ఇతర విచక్షణ రహిత ప్రయోజనాలకు కూడా వర్తింపజేయాలి. ప్రజాస్వామ్యం కేవలం ఓటుకు మాత్రమే పరిమితమా? ఆ తర్వాత పన్ను చెల్లింపుదారులుగా మనకు ఎలాంటి హక్కులు ఉన్నాయి? పార్లమెంటును అడ్డుకున్నందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలను బాధ్యులను చేసే హక్కు పన్ను చెల్లింపుదారులకు ఉండాలి మరియు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. వారు అన్ని "సేవకులు" తర్వాత పన్ను చెల్లింపుదారులచే చెల్లించబడతారు. అటువంటి "ఉచితాలను" ఉపసంహరించుకునే హక్కు కూడా తక్షణమే వినియోగించబడుతుంది. మీరు అంగీకరిస్తే, దయచేసి వీలైనంత ఎక్కువ మందిని సంప్రదించండి. దీన్ని చేయడానికి, పోస్ట్‌ను భాగస్వామ్యం చేయండి. దీన్ని మీ స్నేహితుల్లో కనీసం 10 మందికి పంపండి. దయచేసి ఈ సందేశాన్ని వైరల్ చేయడానికి షేర్ చేయండి. 🙏 చాలా కాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త.
ఆదివారం🌞* *🌹19, జనవరి, 2025🌹* *ధృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
*🌞ఆదివారం🌞*
*🌹19, జనవరి, 2025🌹*
*ధృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*ఉత్తరాయణం - హేమంత ఋతౌః*
*పుష్యమాసం - కృష్ణపక్షం*
*తిథి : పంచమి* ఉ 07.30 వరకు ఉపరి *షష్ఠి*
*వారం : ఆదివారం* ( భానువాసరే )
*నక్షత్రం : ఉత్తర* సా 05.30 వరకు ఉపరి *హస్త*
*యోగం : అతిగండ* రా 01.58 వరకు ఉపరి *సుకర్మ*
*కరణం : తైతుల* ఉ 07.30 *గరజి* రా 08.41
ఉపరి *వణజి*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 07.00 - 11.00 మ 02.00 - 04.00*
అమృత కాలం : *ఉ 09.30 - 11.17*
అభిజిత్ కాలం : *ప 11.56 - 12.41*
*వర్జ్యం : రా 02.57 - 04.45 తె*
*దుర్ముహూర్తం : సా 04.27 - 05.12*
*రాహు కాలం : సా 04.32 - 05.57*
గుళికకాళం : *మ 03.08 - 04.32*
యమగండం : *మ 12.18 - 01.43*
సూర్యోదయం :*ఉ 06.40*
సూర్యాస్తమయం :*సా 05.57*
సూర్యరాశి : *మకరం*
చంద్రరాశి : *కన్య*
*ప్రయాణశూల : పడమర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.40 - 08.55*
సంగవ కాలం :*08.55 - 11.11*
మధ్యాహ్న కాలం : *11.11 - 01.26*
అపరాహ్న కాలం : *మ 01.26 - 03.41*
*ఆబ్ధికం తిధి : పుష్య బహుళ షష్ఠి*
సాయంకాలం : *సా 03.41 - 05.57*
ప్రదోష కాలం :*సా 05.57 - 08.29*
రాత్రి కాలం : *రా 08.29 - 11.53*
నిశీధి కాలం :*రా 11.53 - 12.44*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.58 - 05.49*
________________________________
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🌞IIశ్రీ సూర్య సోత్రంII🌞*
*ఉదయాద్రిచారుచామర హరితహయఖురపరిహితరేణురాగ*
*హరితహయ హరితపరికర గగనాంగనదీపక నమస్తేఽస్తు*
🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః*
🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌞🌞🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌞🌞🍃🌷
🌹🌷🌞🌞🌞🌞🌷🌹
ప ద్య సౌ ర భ ము
ప ద్య సౌ ర భ ము
-చొప్పకట్ల.
జోటీభారతి!యార్భటిన్మెరయుమీ!చోద్యంబుగానేను, క
ర్ణాటాధీశ్వరుఁబ్రౌఢదేవనృపతిన్ ,నాసీరధాటీచమూ
కోటీఘోటక ధట్టికా ఖురపుటీకుట్టాక సంఘట్టనా
స్ఫోటీ ధూతధరారజశ్చుకిళితాంబోధిన్
బ్రశంసించెదన్!
చాటుపద్యం-
- శ్రీనాథకవిసార్వభౌముడు!
"దీనారటంకార
లతీర్థమాడించిన,కర్ణాటకసార్వభౌముని, "ప్రౌఢదేవరాయని" ప్రశంసించినపద్యరత్నము.
రాయలుగొప్పపరాక్రమవంతుడు.,సముద్రమేహద్దుగా విశాలకర్ణాటకము నేలినసార్వభౌముడు.కవిపండితాభిమాని.రాయలఔదార్యమును,అతడుశ్రీనాధునకొనరించిన కనకాభిషేకము ఋజువుపరచినది. మరియతని యవక్రవిక్రమమో?అది పైపద్యము వలన బోధపడుచున్నది.
తల్లీ!భారతీ నన్నుగ్రహింపుము.ఆసముద్రముద్రిత వసు ధావలయమంతయు నేలు కర్ణాటసార్వభౌముడగు ప్రౌఢదేవరాయని
పరాక్రమును పొగడబోవుచున్నాను.కాన నీవు నావాక్స్థానమున నిలచి"ఆరభటీవృత్తి"తోనన్ననుగ్రహింపుము.అని కవిసార్వభౌముని,వినతి .
ఈసార్వభౌముడు సముద్రసీమితమైనధరావలయమున కధినాధుడు.
తన సేనాపరివారములోని గుఱ్ఱములడెక్కలతాకిడికి లేచిన ధరణీపరాగముచే,ఔపోసించినసముద్రముగలవాడు.(అనగా గుర్రములడెక్కలధూళి సముద్రమునుగూడ కనిపించనీయకున్నదనిభావము)
అతిశయోక్తి అలంకారము.
ఆరభటీ వృత్తి!
కఠినపదములకు అర్ధము:
జోటీ-స్త్రీవాచకము, వనితా!
ఆరభటి-ఇదియొకశబ్దవృత్తి,పద్యరచనావిధానమునకఠినమైనపెద్దపెద్దసమాసములతోసాగును,వీర భయానకరసవర్ణనకు ఉపయుక్తము.
చోద్యంబుగా-ఆశ్చర్యకరముగా.
ఆసీర-ఆసముద్రపర్యంతము-సరహద్దు.
ధాటీ -పరుగెత్తు,
చమూ-సైన్యం.
కోటీ -సమూహం.
ఘోటక-గుర్రముల.
ఖురపుటీ-దొప్పలవంటిడెక్కల,
కుట్టాక-కఠినమైన.
సంఘట్టనాస్ఫోటీ-ఒరిపిడివలన.
ధూత-పైకిలేచుచున్న.
ధరారజః-నేలనుండివచ్చినదుమ్ము.
చుకిళిత-పుక్కిలిబట్టుచున్న.(మ్రింగబడుచున్న)
అంబోధిన్-సముద్రుని,
ప్రశంసించెదన్-పొగిడెదను.
స్వస్తి!!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ప్రబంధ కవుల ప్రతిభ
శు భో ద యం🙏
ప్రబంధ కవుల ప్రతిభ!! తెనాలి వారి ప్రాగల్భ్యం!!
ఉ: " సారధి ఛాదసుండు; బడి సాగదు చక్రయుగంబు ;ప్రాఁత సం
చారపు గుఱ్ఱముల్ ; రధియు శౌర్యమునందరమాని ;సాత్మవి
స్తారము ఖండ ఖండములు ; తానట మాసరి! యంచుఁదత్పురిన్
దేరులు నవ్వు శంకరుని తేరిని , కేతన కింకిణీ ధ్వనిన్
పాండురంగ మాహత్మ్యము-ప్రథమా శ్వాసము-115 పద్యము; తెనాలి రామకృష్ణ కవి;
పాండురంగ మాహాత్మ్యము చక్కని ప్రౌఢ ప్రబంధం. పాండురంగ విభుని పదగుంభనమునకు నిలయము.
ఈప్రబంధం కాశీపుర వర్ణనతో ప్రారంభమౌతోంది. అక్కడ చాలా పెద్దపెద్ద రథాలు ఉన్నాయట. అవి పరమేశ్వరుని రథాన్ని చూచి
గణగణ మని నవ్వుతున్నాయట. (వెక్కిరిస్తున్నాయని భావం) ఎందుకూ నవ్వటం? మీరు మాకు సరిగారు అని;
ఇంతకూ శివుని రథానికున్న లోపాలేమిటీ? ఒకటా రెండా ? అన్నీ లోపాలేనట!
సారధి చూద్దామా పరమ ఛాందసుడు. లోకంలో ఈఛాందసుడు అనేపదం వట్టి చాదస్తం కలవాడు అనే యర్ధంలో
వాడబడుతోంది. అంటే ఒకరిమాటవినడు తనకు తోచిందే చేస్తాడని యర్ధం. ఇక ఛాందసుడు అనేపదానికి వేదవిదుడు అనే అర్ధంకూడా ఉంది. శివుని రథ సారధి బ్రహ్మగారు. చతుర్వేదములు ఆయన ముఖతః పుట్టాయి.కాబట్టి ఆయన ఛాందసుఁడయ్యాడు.
ప్రస్తుతం మనమిక్కడ చాదస్తం కలవాడనే అనుకోవాలి.
బడి సాగదు చక్రయుగంబు- చక్రాలా ఒకేలా నడిచేవికావు. శివుని రధానికి చక్రాలు సూర్య చంద్రులు,సూర్యుడు పగలు,చంద్రుడు రాత్రి ,మాత్రమే ఉంటారు. ఒకసారి యిద్దరూ ఉండరు.అందువల్ల చక్రాలు సమంగా సాగవు.
ప్రాఁత సంచారపు గుర్రముల్: గుర్రాలు తిరిగి తిరిగి ముసలివైపోయాయి. ఇకవాటికి శక్తిలేదు.ఇంతకీ గుర్రాలు యేవి? వేదాలే
చతుర్వేదాలూ శివుని రథానికి గుర్రాలు. వేదాలు చాలా ప్రాచీనమైనవే! అందుచేత ముసలి గుర్రాలట!
రథియు శౌర్యమునం దరమానిసి"- ఇంక ఆరథమెక్కి తిరిగే ఆయన ఆడో మగో తెలియనివాడు. (పరాక్రమంలో సగంమనిషి!) అర్ధనారీశ్వరుడుగదా!
ఆత్మ విస్తారము ఖండఖండములు "- దాని పొడవు వెడల్పులు చుద్దామా ?ముక్కలూ చెక్కలు. శివుని రథం
భూమి. భూవలయం నవఖండ మండితమైనది. అంటే తొమ్మిది ముక్కలుగా ఉంటుంది. విరిగిన చెక్కముక్కలతో చేసిన రథం.దానికి
బలమెక్కడిది? అనియీసడింపుతో ఆవూరి రథాలు తమ జండాలకు కట్టిన చిరుగంటల మ్రోతలతో శివుని రథాన్ని చూసి నవ్వుతాయట!
ఆహా కవిదెంత గొప్పయూహ! దానికి శ్లేషను జోడించి , చక్కని పద్యాన్ని ప్రకల్పన చేశాడు!
ఇందులో నిందా స్తుతి గర్భితమైన శ్లిష్టోత్ప్రేక్షాలంకారం చోటుచేసికొన్నది!
స్వస్తి!🙏🌷🌷🙏🌷☝🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

