9, మార్చి 2021, మంగళవారం

పేర్లు రాయండి

 *ఈ రాజు లెవరో పేర్లు రాయండి* 


1. పది తలల రాజు ఎవరు?

2.  దిన రాజు ఎవరు?

3.  రారాజు ఎవరు?

4. వలరాజు ఎవరు?

5. నాగరాజు ఎవరు?

6. ఖగరాజు ఎవరు?

7. గో సేవ చేసి సంతానాన్ని పొందిన రాజు ఎవరు? 

8. ముని శాపవశాత్తూ పుత్రశోకంతో మరణించిన రాజు ఎవరు?

9. నెలరాజు ఎవరు?

10. మృగరాజు ఎవరు?

11. దేవతల రాజు ఎవరు?

12. బొందితో కైలాసానికి చేరాలనుకున్న రాజు ఎవరు?

13. సత్యం కోసం సతినే అమ్మిన రాజు ఎవరు?

14. జూదం లో ఆలిని ఓడిన రాజు ఎవరు?

15. కుమారునిపై ప్రేమతో కానిపనిని కాదనలేకపోయిన గుడ్డి రాజు ఎవరు?

16 .భాగవతం విని మోక్షం పొందిన రాజు ఎవరు?

17. భార్య ఇచ్చిన మాట కోసం ఏడుగురు పుత్రులను పోగొట్టుకున్న రాజు ఎవరు?

18. అష్టదిగ్గజాలనేలిన

రాజు ఎవరు?

19. భారతాంధ్రీకరణకు పురికొల్పిన రాజు ఎవరు?

20.  ఒకే మాట ఒకే బాణం ఒకే భామ అన్న రాజు ఎవరు?

1 కామెంట్‌:

lakki చెప్పారు...

1 రావణ
2సూర్యుడు
3 దుర్యోధన
4 మన్మథ
5హిమవంతుడు
6గరుత్మంతుడు
7 దిలీపుడు
8 దశరధ
9 చంద్రుడు
10 సింహం
11 ఇంద్ర
12 త్రిశంకుడు
13 హరిశ్చంద్ర
14 ధర్మరాజు
15 ద్రుతరాష్ట్రడు
16 పరీక్షిత్
17 శంతన
18 శ్రీ కృష్ణ దేవరాయ
19 రాజ రాజ నరేంద్రుడు
20 రాముడు