6, ఏప్రిల్ 2026, సోమవారం

పచ్చ కర్పూరం*

 *పచ్చ కర్పూరం*

                  ➖➖➖✍️

```

*మన పూర్వికులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను మనం మర్చిపోతూనే ఉన్నాము.


అందులో ప్రధానంగా.. 

ఈ ‘పచ్చ కర్పూరం!’


*మనం వెనుకటి రోజుల్లో పచ్చ కర్పూరం లడ్డూలలో, తిండి పదార్థాలలో అతి ముఖ్యంగా పండుగ సందర్భాలలో ప్రసాదాలలో మనం ఉపయోగించే వాళ్ళము. 

కానీ ఇప్పుడు ఎంత మంది ఆచరణలో పెట్టారు కనీసం ఇప్పుడు ఎంత మంది ఇంట్లో పచ్చ కర్పూరం ఉంది?


*మీకు తెలుసా..?

మన పూర్వీకులు & ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి చిన్న మూలికలలో ఒక గొప్ప శక్తి దాగి ఉంటుంది… అది మనకు అర్థం కాకపోతే సాధారణంగా వస్తువుగా కనిపిస్తుంది,అర్థమైతే అది అమూల్యమైన ఔషధం అవుతుంది.


*అదే కోవకు చెందింది పచ్చ కర్పూరం మనం సాధారణంగా కేవలం పూజలో హారతి ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకుంటాము కానీ ఇది…

మన శరీరాన్ని శుభ్రపరచే, గాలిని పవిత్రం చేసే,నరాలకు ఉత్తేజం ఇచ్చే, రోగాలను దూరం చేసే దివ్య శక్తి చిన్న పరిమాణంలోనే పెద్ద మార్పు తీసుకువచ్చే ఈ సహజ ఔషధం.

```

*పచ్చ కర్పూరం ఉపయోగాలు:*```

*నోటి దుర్వాసనను వెంటనే తగ్గిస్తుంది.


*జ్వరం, అలసట తగ్గించడంలో సహాయపడుతుంది.

*ఊపిరితిత్తులు, శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది.

*రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

*కండరాలు, నరాలకు ఉత్తేజం ఇస్తుంది.

*ఫంగల్ ఇన్ఫెక్షన్, చిన్న చర్మ సమస్యలను తగ్గిస్తుంది.```


 *వాడే విధానం :*```

*లవంగం పరిమాణంలో నోట్లో వేసుకొని చప్పరించాలి.

*స్వీట్స్/లడ్డూలలో (1kgకి 2–3g) కలపాలి.

*నువ్వుల నూనెలో కలిపి నొప్పులపై రాయాలి.

*పసుపుతో కలిపి చర్మంపై రాయాలి.

*పూజ గదిలో ఉంచితే గాలి శుభ్రం అవుతుంది.


*స్వచ్ఛమైన పచ్చ కర్పూరం ఎలా గుర్తించాలి ?

*కాల్చితే పూర్తిగా ఆవిరైపోతుంది. ఎలాంటి మిగులు ఉండదు.

*తెల్లగా, చిన్న బిళ్లల రూపంలో ఉంటుంది.

*సహజమైన గట్టి వాసన ఉంటుంది (కెమికల్ వాసనలా కాదు).

*చేతిలో పట్టుకుంటే త్వరగా ఆవిరైపోతుంది.

*నీటిలో వేసితే పూర్తిగా కరగకుండా మెల్లగా ఆవిరవుతుంది.```


*నకిలీ (కెమికల్) కర్పూరం గుర్తులు :*```

*కాల్చినప్పుడు మిగులు (బూడిద/పొడి) మిగులుతుంది.

*వాసన చాలా కఠినంగా, అసహజంగా ఉంటుంది.

*చాలా చవకగా లభిస్తుంది.✍️```

-సేకరణ.

(కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.)

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

కామెంట్‌లు లేవు: