ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు -
• తమలపాకు కొంచెం చేదు , కారం రుచి కలిగియుండును.
• బెంగాల్ నుంచి వచ్చే తమలపాకు కంటే దక్షిణ భారతదేశం నందు దొరుకు దళసరిగా కొంచం నలుపురంగు కలిగినవి వైద్యం నందు ఎక్కువ ఉపయోగంగా ఉంటాయి .
• తమలపాకు ఉపయోగించడం వలన నోటిజిగట, దుర్గంధం , శ్లేష్మము , వాతము , గుండెల్లో భారము , అజీర్ణం పొగొట్టును.
• ఆకలి తక్కువ ఉన్నవారు దీనిని ఉపయోగించుట వలన ఆకలి పెరుగును.
• దేహములో ఉండే దుష్ట పదార్ధాలని తీసివేయను .
• గొంతుక , రొమ్ముని శుభ్రపరచును.
• జ్వరం , దగ్గు, శ్లేష్మము ఉన్న సమయంలో తమలపాకు వెచ్చచేసి రసము తీసి సేవించిన ఉపయుక్తముగా ఉండును. మోతాదు 15ml లేదా 3 టీస్పూన్స్ రెండుపూటలా వాడవలెను .
• కొంతమందికి మెదడు గట్టిపడటం జరిగి ఉత్సాహముగా ఉండరు. వారికి పైన చెప్పిన మోతాదులో రెండుపూటలా ఇవ్వడం వలన వారిలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయి .
• శిశువులకు విరేచనం కానప్పుడు తమలపాకు తొడిమను ఆముదములో ముంచి బిడ్డల మలద్వారం ద్వారా లొపలికి చొప్పించిన విరేచనం అగును.
• గొంతులో పుండు వచ్చినపుడు తమలపాకుకి ఆవనూనె రాసి వెచ్చచేసి గొంతుక మీద వేసి కట్టిన గొంతుక పుండు మానును.
• హిస్టీరియా వ్యాధిగ్రస్తులకు దీని రసంలో కొంచం కస్తూరి కలిపి ఇచ్చిన నయం అగును.
• మూత్రం బంధించినప్పుడు తమలపాకుల కు ఆముదం రాసి వెచ్చచేసి పొట్టపైన వేసినచో కేవలం 10 నిమిషాలలో మూత్రం బయటకి వచ్చును . ఇది నేను ప్రయోగించాను.
• చిన్న పిల్లలకు దగ్గు , జలుబు బాగాచేసి గాలిపీల్చుకోవడం ఇబ్బంది అవుతున్నప్పుడు పైన చెప్పిన విధంగా ఆకులకు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపైన వేయాలి .
• పక్కనొప్పి , లివర్ గట్టిపడటం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆకులకు ఆముదం రాసి వెచ్చచేసి కుడిపక్కన చంక క్రింద , లివరు భాగంలో వేయుచున్న ఆ సమస్యలు తీరును.
• స్త్రీల చన్నులపై వేడిచేసి వేసిన పాలు హరించును . గవదలపైన వేసిన టాన్సిల్స్ హరించును .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి