*మహాభారతం: అభిమన్యుడు* గొప్ప వీరులలో ఒకడు.ఇతడు అర్జునుడు,సుభద్రల కుమారుడు.శ్రీకృష్ణుడు ఇతనికి మేనమామ.చిన్న వయస్సులోనే అస్త్రవిద్యలు,యుద్ధ విద్యలు నేర్చుకుని అపారమైన ప్రతిభను ప్రదర్శించాడు.ధైర్యం,శౌర్యం,ఆత్మవిశ్వాసం ఇతని ముఖ్య లక్షణాలు.
కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు తన అసమాన వీరత్వాన్ని చూపించాడు.పదమూడవ రోజు కౌరవులు ఏర్పాటు చేసిన చక్రవ్యూహంలోకి ప్రవేశించడానికి ఇతడు ముందుకు వచ్చాడు.చక్రవ్యూహంలోకి ప్రవేశించే విధానం ఇతనికి తెలుసు.కానీ బయటకు వచ్చే విధానం పూర్తిగా తెలియదు.అయినప్పటికీ పాండవుల కోసం,ధర్మం కోసం వెనుకాడకుండా చక్రవ్యూహంలోకి ప్రవేశించి అనేక మంది శత్రు వీరులను ఓడించాడు.
చివరికి కౌరవ మహారథులు అన్యాయంగా కలిసి అభిమన్యుడిపై దాడి చేశారు.ఇతని రథం,ఆయుధాలు ధ్వంసమైనా అతడు ధైర్యాన్ని కోల్పోలేదు.చివరి వరకు వీరోచితంగా పోరాడి నాడు.అభిమన్యుడి కథ ధైర్యం,త్యాగం,దేశభక్తి,కర్తవ్యనిష్ఠకు ప్రతీకగా నిలిచింది. అందుకే భారతీయ సాహిత్యంలో అభిమన్యుడి పేరు చిరస్మరణీయుడుగా నిలిచిపోయింది.
.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి