మహాత్ములు తాము సత్కార్యము చేసినపుడు మేము చేసాము అని పలుకరు. నా నుంచి జరిగినదని అంటారు. జరగటము, జరగకపోవడము లో మహిమ వేరే ఉన్నది. అవ్వడము, అవ్వకపోవడము అనే దానితో సంబంధము లేకుండా మనము చేసే పనులలో చిత్తశుద్ధి ఉందా, లేదా అని చూసుకోవాలి. ఆ ఒక్కటే మన నుంచి భగవంతుడు ఆశిస్తాడు.
చిత్తశుద్ధి లేకుండా ఎన్ని మహత్కార్యములు చేసినా మనము ఒక అంగుళం కూడా ముందుకి వెళ్ళలేము. మనసా, వాచా, కర్మణ చేయడము వలన మన మనసులో ఉండే చైతన్యము అనే బిందువు క్రమముగా వికాసం చెందును. ఆ వికాసము పరమాత్మ లోకాల వరకు వ్యాప్తి చెందుతుంది.
*
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి