30, జులై 2026, గురువారం

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 30.07.2026 Thursday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస క్రిష్ణ పక్ష ప్రతిపత్తి తిథి బృహస్పతి వాసర శ్రవణం నక్షత్రం ఆయుష్మాన్ యోగః బాలవ తదుపరి కొలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: పాడ్యమి 


పంచాంగము 🌓 30.07.2026🕉️


పంచాంగము 🌓 30.07.2026


🪔 శ్రీ ధన్యాశ్రీధరాయనమః‌ 🪔


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: గ్రీష్మ - వర్ష


మాసం: ఆషాఢ 


పక్షం: కృష్ణ - బహుళ 


తిథి: పాడ్యమి రా.08:43 వరకు

తదుపరి విదియ

 

వారం: గురువారం - బృహస్పతి

వాసరే

 

నక్షత్రం: శ్రవణం సా.06:10 వరకు 

తదుపరి ధనిష్ఠ 


యోగం: ఆయుష్మాన్ రా.11:30 వరకు 

తదుపరి సౌభాగ్య

 

కరణం: బాలవ ఉ‌.08:05 వరకు

తదుపరి కౌలువ రా.08:43 వరకు

తదుపరి తైతుల


వర్జ్యం: రా.10:25 - 12:07 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.10:13 - 11:04 

మరియు ప‌.03:23 - 04:15


రాహు కాలం: ప‌.01:59 - 03:36


గుళిక కాలం: ఉ‌.09:08 - 10:45


యమ గండం: ఉ‌.05:54 - 07:31

 

అభిజిత్: 11:57 - 12:47


సూర్యోదయం: 05:53


సూర్యాస్తమయం: 06:50


చంద్రోదయం: రా.07:29


చంద్రాస్తమయం: ఉ‌.06:18


సూర్య సంచార రాశి: కర్కాటకం


చంద్ర సంచార రాశి: మకరం


దిశ శూల: దక్షిణం


🎋 ధర్మవ్యాప్తి‌ వ్రతం 🎋


🌟 శ్రవణోపవాసము 🌟


🚩 కంచి జగద్గురు శ్రీ వ్యాసాచల

 మహాదేవేన్ద్ర సరస్వతి స్వామి

 పుణ్యతిథి‌ 🚩


🏳️ శ్రీ బాజీప్రభు‌ దేశ్‌పాండే 

పుణ్యతిథి 🏳️


💧 విష్ణుపంచకోపవాసము‌ 💧


🪷 అప్పలాయగుంట శ్రీ ప్రసన్న 

 వేంకటేశ్వర స్వామి పుష్పయాగ

మహోత్సవారంభం 🪷


🎊 సేలం చెవైపేట శ్రీ

మారియమ్మన్ రజత‌ రథోత్సవం 🎊


🛕శ్రీ విల్లిపుత్తూరు శ్రీ పెరియ

పెరుమాళ్ రథోత్సవం 🛕


🔯

 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



నాత్యశ్నతస్తు యోగోఽస్తి న చైకాంతమనశ్నతః ।

న చాతిస్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున ।। 16 ।।



ప్రతిపదార్థ:



న — కాదు; అతి — అతిగా; అశ్నతః — తినేవాడు; తు — కానీ; యోగః — యోగము; అస్తి — ఉండును; న — కాదు; చ — మరియు; ఏకాంతం — ఏ మాత్రమూ; అనశ్నతః — తినకుండా ఉండేవాడు; న — కాదు; చ — మరియు; అతి — అతిగా; స్వప్న-శీలస్య — అతిగా నిద్ర పోయేవాడు; జాగ్రతః — అస్సలు నిద్రపోని వాడు; న — కాదు; ఏవ — ఖచ్చితముగా; చ — మరియు; అర్జున — అర్జునా.



తాత్పర్యము: 


ఓ అర్జునా, ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో; మరీ ఎక్కువ నిద్ర పోతారో లేదా మరీ తక్కువ నిద్ర పోతారో, వారు యోగములో విజయం సాధించలేరు.



వివరణ:



 ధ్యానము యొక్క విషయాన్ని మరియు దాని అంతిమ లక్ష్యాన్ని వివరించిన పిదప, శ్రీ కృష్ణుడు కొన్ని నియమాలను చెప్తున్నాడు. శారీరిక నిర్వహణ నియమాలను అతిక్రమించినవారు యోగములో సాఫల్యం సాధించలేరు అంటున్నాడు. తరచుగా, ఆధ్యాత్మిక పథంలో కొత్తగా ఆరంభించినవారు, తమ అసంపూర్ణ జ్ఞానంతో ఇలా చెప్తారు: ‘నీవు ఆత్మవు, శరీరానివి కావు. కాబట్టి శరీర నిర్వహణ మర్చిపోయి, ఆధ్యాత్మిక కార్యకలాపాలలో నిమగ్నమవ్వుము.’


కానీ, ఇటువంటి సిద్ధాంతం మనిషిని ఎక్కువ దూరం తీస్కువెళ్ళలేదు. మనము ఈ శరీరము కాదు అన్న విషయం నిజమే అయినా, ఈ శరీరమే మన జీవించి ఉన్నతకాలం మన వాహనం, మరియు దానిని చక్కగా చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. ఆయుర్వేద పుస్తకమైన చరక్ సంహిత ఇలా పేర్కొంటున్నది: ‘శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం’; ‘ఈ శరీరమే ధర్మ కార్యములు చేయటానికి వాహకము.’ ఒకవేళ శరీరం అనారోగ్యంపాలైతే ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటు పడుతాయి. రామచరితమానస్ ఇలా పేర్కొంటున్నది: ‘తను బిను భజన వేద నహీఁ వరనా’, ‘ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమై ఉన్నా శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని వేదములు చెప్పలేదు.’ నిజానికి, భౌతిక ప్రాపంచిక శాస్త్ర సహాయంతో మన శరీరాన్ని చక్కగా చూసుకొమ్మని ఉపదేశిస్తున్నాయి. ఈశోపనిషత్తు ప్రకారం:


అంధం తమః ప్రవిశంతి యే ఽవిద్యాం ఉపాసతే

తతో భూయ ఇవ తే తమో య ఉ విద్యాయాం రతాః (9)


‘భౌతిక విద్యను మాత్రమే పెంపొందించుకునేవారు నరకానికి పోతారు. కానీ, కేవలం ఆధ్యాత్మిక విద్యనే పెంపొందించుకునేవారు అంతకంటే ఘోరమైన నరకానికి పోతారు.’ భౌతిక విద్య అనేది మన శారీరిక నిర్వహణకు చాలా అవసరం, అదే సమయంలో ఆధ్యాత్మిక శాస్త్రము అనేది మనలో అంతర్గత దివ్యత్వం ప్రకటితమవ్వటానికి చాలా అవసరం. మనం ఈ రెంటినీ జీవితంలో సమతుల్యంగా ఉంచుకోవాలి. కాబట్టి, యోగాసనాలు, ప్రాణాయామం, మరియు సమతుల్య ఆహారం అనేవి వైదిక జ్ఞానంలో భాగమే.


నాలుగు వేదాలలో ప్రతిదానికీ భౌతిక జ్ఞానాన్ని ఇచ్చే అనుబంధ వేదము ఉంది. అథర్వ వేదము యొక్క అనుబంధ వేదము ఆయుర్వేదము, ఇది ప్రాచీనమైన ఆరోగ్య, వైద్య శాస్త్రము. వేదములు శారీరిక స్వస్థత పట్ల కూడా చాల శ్రద్ధ చూపిస్తున్నాయనటానికి ఇది ఒక నిదర్శనం. అందుకే, మరీ ఎక్కువ తినటం లేదా అసలు తినక పోవటం, తీవ్ర పరిశ్రమ లేదా పూర్తి జడత్వం వంటివి యోగమునకు అవరోధాలు. ఆధ్యాత్మిక సాధకులు - తాజా పోషకాలతో కూడిన ఆహారం భుజిస్తూ, ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ, రాత్రి పూట తగినంత నిద్ర పోతూ - తమ శరీరాన్ని చక్కగా నిర్వహించుకోవాలి.

గురువారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

30-07-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. నూతన వస్తు,వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు.

---------------------------------------


వృషభం


చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సోదరులతో భూవివాదాలు కలుగుతాయి. బంధువర్గంతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారమున కొన్ని నిర్ణయాలు నష్టాలు కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు.

---------------------------------------


మిధునం


కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------


కర్కాటకం


సన్నిహితుల నుండి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------


సింహం


ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. సోదరులతో కుటుంబ విషయాల గురించి చర్చిస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభలా బాటలో పయనిస్తాయి. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ అవుతాయి. 

---------------------------------------


కన్య


రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతుంది. ఆత్మీయులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి స్వంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తుల పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి.

---------------------------------------


తుల


పాత రుణాలు తీర్చడానికి నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. నిరుద్యోగ యత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం అందదు.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులు శ్రమాదిక్యాతతో కానీ పూర్తి కావు కొన్ని విషయాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. భూ సంబంధిత వివాదాలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. నూతన వ్యాపారాలు ప్రారంబానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి పని ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------


ధనస్సు


సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుతాయి. 

---------------------------------------


మకరం


సంతాన విద్యా విషయాలపై ద్రుష్టి సారిస్తారు. రాజకీయ వర్గాల ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. భూ సంభందిత క్రయ విక్రయాల లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

---------------------------------------


కుంభం


ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గవరోదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. శారీరక మానసిక అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ వాతావరణం చికాకు కలిగిస్తుంది.

---------------------------------------


మీనం


కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు కలిగిస్తుంది. చేపట్టిన పనులులో వ్యయప్రయాసలు అధికమౌతాయి. సన్నిహితులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగములు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

పంచాంగము 🌓 30.07.2026

 🕉️


పంచాంగము 🌓 30.07.2026


🪔 శ్రీ ధన్యాశ్రీధరాయనమః‌ 🪔


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: గ్రీష్మ - వర్ష


మాసం: ఆషాఢ 


పక్షం: కృష్ణ - బహుళ 


తిథి: పాడ్యమి రా.08:43 వరకు

తదుపరి విదియ

 

వారం: గురువారం - బృహస్పతి

వాసరే

 

నక్షత్రం: శ్రవణం సా.06:10 వరకు 

తదుపరి ధనిష్ఠ 


యోగం: ఆయుష్మాన్ రా.11:30 వరకు 

తదుపరి సౌభాగ్య

 

కరణం: బాలవ ఉ‌.08:05 వరకు

తదుపరి కౌలువ రా.08:43 వరకు

తదుపరి తైతుల


వర్జ్యం: రా.10:25 - 12:07 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.10:13 - 11:04 

మరియు ప‌.03:23 - 04:15


రాహు కాలం: ప‌.01:59 - 03:36


గుళిక కాలం: ఉ‌.09:08 - 10:45


యమ గండం: ఉ‌.05:54 - 07:31

 

అభిజిత్: 11:57 - 12:47


సూర్యోదయం: 05:53


సూర్యాస్తమయం: 06:50


చంద్రోదయం: రా.07:29


చంద్రాస్తమయం: ఉ‌.06:18


సూర్య సంచార రాశి: కర్కాటకం


చంద్ర సంచార రాశి: మకరం


దిశ శూల: దక్షిణం


🎋 ధర్మవ్యాప్తి‌ వ్రతం 🎋


🌟 శ్రవణోపవాసము 🌟


🚩 కంచి జగద్గురు శ్రీ వ్యాసాచల

 మహాదేవేన్ద్ర సరస్వతి స్వామి

 పుణ్యతిథి‌ 🚩


🏳️ శ్రీ బాజీప్రభు‌ దేశ్‌పాండే 

పుణ్యతిథి 🏳️


💧 విష్ణుపంచకోపవాసము‌ 💧


🪷 అప్పలాయగుంట శ్రీ ప్రసన్న 

 వేంకటేశ్వర స్వామి పుష్పయాగ

మహోత్సవారంభం 🪷


🎊 సేలం చెవైపేట శ్రీ

మారియమ్మన్ రజత‌ రథోత్సవం 🎊


🛕శ్రీ విల్లిపుత్తూరు శ్రీ పెరియ

పెరుమాళ్ రథోత్సవం 🛕


🔯

29, జులై 2026, బుధవారం

గురు పౌర్ణమి

 *గురు పౌర్ణమి రోజున పారాయణం చేసుకోవాల్సిన ముఖ్య స్తోత్రం*

****************************************

శ్లో॥ గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః


శ్లో॥ అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్ | తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః


శ్లో॥ ఓమ్ నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే । నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః


శ్లో॥ యదవిద్యావశాద్విశ్వం దృశ్యతే రశనా హివత్ | యద్విద్యయా చ తద్ధాని స్తం వందే పురుషోత్తమమ్


శ్లో॥ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్ । పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్


శ్లో॥ అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహు రపరో హరిః | అఫాలలోచన శ్శంభుర్ భగవాన్ బాదరాయణః


శ్లో॥ ముని స్నిగ్ధాంబుదాభాసం వేదవ్యాస మకల్మషమ్ । వేదా... వాసం సరస్వత్యావాసం వ్యాసం నమామ్యహమ్


శ్లో॥ నారాయణం పద్మభువం వసిష్ఠం, శక్తిం చ తత్పుత్ర పరాశరం చ | వ్యాసం శుకం గౌడపదం మహాంతం, గోవింద యోగీంద్ర మథాస్యశిష్యమ్


శ్లో॥ శ్రీశంకరాచార్య మథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యమ్ । తంతోటకం వార్తికకార మన్యాన్ అస్మద్గురూన్ సంతత మానతోస్మి


శ్లో॥ శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్ । సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః


శ్లో॥ హరలీలా వతారాయ శంకరాయ పరౌజసే ॥ కైవల్యకలనా కల్పతరవే గురవే నమః


శ్లో॥ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్ | నమామి భగవత్పా శంకరం లోకశంకరమ్


శ్లో॥ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమామ్ | అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్


శ్లో॥ బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్త్వమస్యా ది లక్ష్యమ్ |


ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి

28, జులై 2026, మంగళవారం

🌷 *బుధవారం*🌷 *🪷29 జూలై 2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *బుధవారం*🌷 

 *🪷29 జూలై 2026🪷* 

  *దృగ్గణిత పంచాంగం* 

              

       *ఈనాటి పర్వం*     

  *🌹వ్యాసపూర్ణిమ🌹* 

   *🙏గురుపూర్ణిమ🙏*


          *స్వస్తి శ్రీ పరాభవ* 

         *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - గ్రీష్మ ఋతౌః*

*ఆషాఢ మాసం - శుక్లపక్షం* 


`*తిథి :*పౌర్ణమి* రా 08.05 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

`వారం  :*బుధవారం* (సౌమ్యవాసరే)

`*నక్షత్రం:ఉత్తరాషాఢ* మ 03.37 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం : ప్రీతి* రా 11.58 వరకు ఉపరి *ఆయుష్మాన్*

*కరణం  : భద్ర* సా 07.14 బవ రా 08.05 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00 - 07.30 & 09.00 - 10.00 సా 04.30 - 05.30*       

అమృత కాలం  : ఉ 08.34 - 10.20

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : రా 07.58 - 09.42*

*దుర్ముహూర్తం*: *ప11.48-12.40*

*రాహు కాలం   : మ12.14-01.51*

గుళికకాళం      : *మ 10.37 - 12.14*

యమగండం    : *ఉ 07.24 - 09.00*

సూర్యరాశి : *కర్కాటకం*               

చంద్రరాశి : *మకరం*

సూర్యోదయం :*ఉ 05.54*  

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :*ఉ 05.47 - 08.22*

సంగవ కాలం    :*08.22 - 10.56*

మధ్యాహ్న కాలం  :*10.56 - 01.31*

అపరాహ్నకాలం   :*మ 01.31-04.06*

*ఆబ్ధికం తిధి    : ఆషాఢ పూర్ణిమ*

సాయంకాలం     :*సా 04.07- 06.41*

ప్రదోష కాలం      :*సా 06.41 - 08.54*

రాత్రి కాలం         :*రా 08.54 - 11.52*

నిశీధి కాలం        :*రా 11.52 - 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.18 - 05.03*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

27, జులై 2026, సోమవారం

భగవంతుడు శివుడు కుబేరుడిని

  భగవంతుడు శివుడు కుబేరుడిని తన మిత్రుడిగా, సమస్త సంపదలకు అధిపతిగా ఎందుకు చేశాడు? 


ధనాధిపతి కుబేరుడి పేరు వినగానే అపారమైన ఐశ్వర్యం, సంపద, దివ్య వైభవం మనసులో మెదులుతాయి. కానీ ఒకసారి తెలియక చేసిన చిన్న పొరపాటు వల్ల ఆయన ఒక కన్ను రూపం మారిందని చాలా మందికి తెలియదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ తప్పుకు భగవంతుడు శివుడు ఆయనను శిక్షించలేదు. బదులుగా తన ప్రియ మిత్రుడిగా స్వీకరించి, సమస్త నిధులకు అధిపతిగా నియమించాడు.


ఈ ప్రేరణాత్మక సంఘటన శివ మహాపురాణంలో వర్ణించబడింది. ఇది పరమశివుని అపారమైన కరుణ, భక్తవత్సలత్వం, క్షమాగుణానికి అద్భుత నిదర్శనం.


 కాశీలో కుబేరుని ఘోర తపస్సు


సాక్షాత్తు విశ్వనాథుడు కొలువై ఉన్న పవిత్ర కాశీక్షేత్రంలో కుబేరుడు ఎన్నో సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు. ఆయన హృదయంలో ఒక్క కోరిక మాత్రమే ఉండేది—భగవంతుడు శివుని ప్రత్యక్ష దర్శనం పొందడం.


రాజసుఖాలు, సంపద, భోగభాగ్యాలన్నిటినీ త్యజించి నిరంతరం తపస్సులో నిమగ్నమయ్యాడు. ఋతువులు మారాయి, కాలం గడిచింది, కానీ ఆయన భక్తి ఏమాత్రం తగ్గలేదు. శరీరం కృశించిపోయినా, ఆయన నాలుకపై నిరంతరం ఒకే నామం వినిపించేది—


"శివ... శివ... శివ..."


 పరమశివుని దివ్య దర్శనం


చివరకు ఆయన తపస్సు ఫలించింది. పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యాడు. వారి దివ్య తేజస్సుతో దిక్కులన్నీ ప్రకాశించాయి. ఆ వెలుగు ఎంత ప్రఖరంగా ఉందంటే, కుబేరుడు తన కళ్లను పూర్తిగా తెరవలేకపోయాడు.


శివుడు ప్రేమతో ఇలా అన్నాడు—


"వత్సా! నీ కళ్లను తెరువు. నీ తపస్సుతో నేను ఎంతో సంతోషించాను. నీకు కావలసిన వరం కోరుకో."


కుబేరుడు మెల్లగా కళ్లు తెరిచాడు. ముందుగా శివుని దివ్యరూపాన్ని దర్శించాడు. ఆ తరువాత ఆయన చూపు పార్వతీదేవిపై పడింది. ఆమె అపూర్వమైన దివ్యకాంతి, సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యభక్తులతో కొద్దిసేపు ఆమెను చూస్తూ నిలిచిపోయాడు.


 కుబేరుని తెలియని పొరపాటు


పార్వతీదేవి చిరునవ్వుతో శివునిని అడిగింది—


"నాథా! ఈ తపస్వి నన్ను మళ్లీ మళ్లీ ఎందుకు చూస్తున్నాడు?"


అంతే... అదే క్షణంలో కుబేరుని ఎడమ కన్ను రూపం మారిపోయింది. వెంటనే తనకు జరిగిన పొరపాటు గ్రహించిన కుబేరుడు శివుని పాదాలపై పడి వినయంతో ఇలా ప్రార్థించాడు—


"ప్రభూ! అజ్ఞానవశాత్తు నాతో తప్పు జరిగింది. దయచేసి నన్ను క్షమించండి."


 మహాదేవుని అపార కరుణ


అప్పుడు పరమశివుడు పార్వతీదేవిని ఉద్దేశించి ప్రేమతో ఇలా అన్నాడు—


"దేవీ! ఇతడు మన అనన్య భక్తుడు. ఇతని మనసులో ఎలాంటి వికారం లేదు. నీ దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యంతో చూశాడు అంతే."


ఆ తరువాత శివుడు కుబేరుని ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు—


"వత్సా! నీ కఠోర తపస్సుకు నేను ఎంతో సంతోషించాను. ఈ రోజు నుంచి నీవు యక్షరాజువి, సమస్త నిధులకు అధిపతివి, దేవతల ధనాధికారివి."


ఆనందభాష్పాలతో కుబేరుని కళ్లు నిండిపోయాయి. ఎన్నో సంవత్సరాల తపస్సు ఫలించింది.


 శివుడు ఎందుకు తన మిత్రుడిగా చేసుకున్నాడు?


అప్పుడు పరమశివుడు అమూల్యమైన వరం ప్రసాదిస్తూ ఇలా అన్నాడు—


"ఈ రోజు నుంచి నీవు కేవలం ధనాధిపతి మాత్రమే కాదు, నా మిత్రుడివి కూడా. కైలాసానికి సమీపంలోని అలకాపురిలో నివసించు. నేను ఎల్లప్పుడూ నీకు సమీపంలోనే ఉంటాను."


ఆ మాటలు విన్న కుబేరుడు పరమానందంతో శివపార్వతులను పదేపదే నమస్కరించాడు.


అప్పటి నుంచి కుబేరుడు యక్షరాజు, ధనాధిపతి, పరమశివుని ప్రియ మిత్రుడుగా ప్రసిద్ధి పొందాడు. కైలాస సమీపంలోని అలకాపురి ఆయన దివ్యనివాసంగా నిలిచింది.


 ఈ కథ మనకు చెప్పే సందేశం


ఈ పవిత్ర సంఘటన మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది.


పరమశివుడు ధనం, పదవి లేదా వైభవాన్ని చూసి ప్రసన్నుడు కాడు. నిష్కపటమైన భక్తి, వినయం, నిర్మలమైన హృదయం ఉన్నవారిపై ఆయన అనంతమైన కృపను కురిపిస్తాడు.


మనిషి తప్పు చేసినా, నిజమైన పశ్చాత్తాపంతో భగవంతుని శరణు ఆశ్రయిస్తే, మహాదేవుడు శిక్షించడు. తన అపారమైన అనుగ్రహంతో అతని జీవితాన్ని ధన్యంగా మారుస్తాడు.


 హర హర మహాదేవ!

 జై శ్రీ మహాకాళ్!

పంచాంగం 27.07.2026 Monday,

  ఈ రోజు పంచాంగం 27.07.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్ల పక్ష త్రయోదశి తిథి ఇందు వాసర మూల నక్షత్రం వైధృతి యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: త్రయోదశి 



 

నమస్కారః , Sendingశుభోదయం



భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ।

ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే ।। 12 ।।

సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః ।

సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్ ।। 13 ।।



ప్రతిపదార్థ:


తత్ర — అక్కడ; ఏక-అగ్రం — ఏకాగ్రతతో; మనః — మనస్సు; కృత్వా — చేసి; యత-చిత్త — మనస్సుని నియంత్రణలో ఉంచుకొని; ఇంద్రియ — ఇంద్రియములు; క్రియః — పనులు; ఉపవిశ్య — కూర్చొని; ఆసనే — ఆసనము పై; యుంజ్యాత్ యోగం — యోగ అభ్యాసము కొరకు పరిశ్రమించవలెను; ఆత్మ విశుద్ధయే — మనస్సు యొక్క పరిశుద్ధి కొరకు; సమం — సమముగా; కాయ — శరీరము; శిరః — శిరస్సు (తల); గ్రీవం — మెడ; ధారయన్ — నిలిపివుంచి; అచలం — నిశ్చలముగా; స్థిరః — స్థిరముగా; సంప్రేక్ష్య — దృష్టి పెడుతూ; నాసిక-అగ్రం — ముక్కు చివరి యందు; స్వం — తనయొక్క ; దిశః — దిక్కుల వైపు; చ — మరియు; అనవలోకయన్ — చూడకుండా.



తాత్పర్యము: 



దానిపై స్థిరముగా కూర్చొని, ఒకే ఏకాగ్రత గల ధ్యానములో, అన్ని ఆలోచనలను, కార్యకలాపాలను నిగ్రహించి - యోగి తన మనస్సుని పరిశుద్ధమొనర్చుకోవటానికి పరిశ్రమించాలి. అతను శరీరమును, మెడను, మరియు శిరస్సుని స్థిరముగా ఒకే క్రమములో ఉంచి, కళ్ళను అటూఇటూ తిప్పకుండా, నాసికాగ్రము మీదే చూపుని కేంద్రీకరించాలి.



వివరణ:


ధ్యానములో కూర్చునే విధానాన్ని వివరించిన శ్రీకృష్ణుడు, మనస్సుని కేంద్రీకరించటానికి ఉత్తమమైన శరీర భంగిమని వివరిస్తున్నాడు. సాధనలో, సోమరితనంగా అయిపోయి, నిద్దురలోనికి జారుకునే ధోరణి ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే, ప్రారంభంలో ప్రాపంచిక మనస్సుకి, ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం, భగవత్ ధ్యానంలో రాదు. దీనితో, భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంది. కాబట్టి, భోజనం చేస్తూచేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు, కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్నామాలు జపించటంలో మధ్యలో నిద్దురలోనికి జారుకోనే వారు కనిపిస్తారు. ఇది కాకుండా ఉండటానికి, శ్రీ కృష్ణుడు నిటారుగా కూర్చోనమంటున్నాడు. ధ్యానంలో కూర్చునే భంగిమని (posture) గురించి బ్రహ్మ సూత్రాలు కూడా 3 సూత్రాలను పేర్కొంటున్నాయి:


ఆసీనః సంభవాత్ (4.1.7)


‘సాధన చేయటానికి, సరియైన విధానంలో కూర్చోండి.’


అచలత్వం చాపేక్ష్య (4.1.9)


‘నిశ్చలంగా మరియు నిటారుగా కూర్చోండి’


ధ్యానాచ్చ (4.1.8)


‘ఈ విధంగా కూర్చొని, మనస్సుని ధ్యానంలో కేంద్రీకరించండి.’


హఠ యోగ ప్రదీపికలో చాలా రకాల ధ్యాన ఆసనాలు వివరించబడ్డాయి, పద్మాసనం, అర్ధ పద్మాసనం, ధ్యానవీర్ ఆసనం, సిద్దాసనం, మరియు సుఖాసనం వంటివి. ధ్యానంలో అటూయిటూ కదలకుండా, మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు. మహర్షి పతంజలి ఇలా పేర్కొన్నాడు:


‘స్థిర సుఖమాసనం’ (పతంజలి యోగ సూత్రములు 2.46)’


‘ధ్యాన అభ్యాసం చేయటానికి మీకు అనువుగా ఉండే ఏదో ఒక భంగిమలో నిశ్చలంగా కూర్చొనుము.’ కొందరు మోకాలు నొప్పుల వలన, లేదా వేరేఇతర ఆరోగ్య కారణాల వలన, నేల మీద కూర్చోలేరు. వారు నిరుత్సాహ పడనవసరం లేదు, ఎందుకంటే వారు కుర్చీలో కూర్చొని అయినా ధ్యానం చేయవచ్చు, కానీ తప్పకుండా నిటారుగా మరియు నిశ్చలంగా కూర్చోవాలి అన్న నియమాన్ని పాటించాలి.


దృష్టిని నాసికాగ్రము మీద కేంద్రీకరించాలి మరియు అది అటూఇటూ పోకుండా చూసుకోవాలి అని ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు పేర్కొన్నాడు. దీనికి రూపాంతరంగా, కనులను మూసి ఉంచవచ్చు. ఈ రెండు పద్దతులు కూడా ప్రాపంచిక వ్యగ్రతని నిరోధించటంలో సహకరిస్తాయి.


బాహ్యమైన ఆసనం మరియు శరీరాన్ని ఉంచిన తీరు, ధ్యానమునకు తగినట్టుగా ఉండాలి, కానీ ధ్యానం అనేది యదార్థంగా ఒక అంతర్గత ప్రయాణం. ధ్యానం ద్వారా, మనల్ని మనమే లోతుగా పరిశీలించుకోవచ్చు మరియు మనస్సుని అనంత జన్మల మలినముల నుండి పరిశుద్ధి చేసుకోవచ్చు. మనస్సుని ఏకాగ్రతతో నిలిపి ఉంచే అభ్యాసం వలన, దాని యొక్క గుప్తమైన శక్తిని వెలికితీయవచ్చు. ధ్యానం యొక్క అభ్యాసం మన వ్యక్తిత్వాన్ని వ్యవస్థీకరించుకోవటానికి, అంతర్గత చైతన్యాన్ని మేలుకోలుపటానికి, స్వీయ అవగాహన పెంపొందించు కోవటానికి, చాలా దోహద పడుతుంది. ధ్యానం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనాలు 6.15వ శ్లోకంలో తదుపరి వివరించబడుతాయి. కొన్ని ఆనుషంగిక ప్రయోజనాలు ఏమిటంటే, ధ్యానం అనేది :


– చంచలమైన మనస్సుని నియంత్రించి, క్లిష్టమైన లక్ష్యాలను సాధించటానికి ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది.


– ప్రతికూల పరిస్థితులలో కూడా మానసిక సమతుల్యతను కాపాడుకోవటానికి దోహదపడుతుంది.


– జీవితంలో విజయం కోసం కావలసిన దృఢ సంకల్ప బలాన్ని పెంపొందిస్తుంది.


– చెడు సంస్కారాలను మరియు అలవాట్లను నిర్మూలించటానికి, మంచి గుణాలను పెంపొందిచుకోవటానికి దోహదపడుతుంది


మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించటమే అత్యుత్తమమైన ధ్యాన పద్దతి. ఈ విషయం తదుపరి రెండు శ్లోకాలలో వివరించబడింది.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 41*


*ప్రచండార్తిక్షోభప్రమథనకృతే ప్రాతిభసరి-*

*త్ప్రవాహప్రోద్దండీకరణజలదాయ ప్రణమతామ్ ।*

*ప్రదీపాయ ప్రౌఢే భవతమసి కామాక్షి చరణ-*

*ప్రసాదౌన్ముఖ్యాయ స్పృహయతి జనోఽయం జనని తే ॥*


*భావము :*


*జగన్మాతా! ప్రచండమైన ఆపదలలో చిక్కుకుని, వాటిని తొలగించుకొనుటకు నీ శరణు కోరినవారికి, జ్ఞానము అనే నది ప్రవహించుటకు మేఘములైనవి, సంసారము అనే తిమిరాంధకారములో దీపములైనవి, అయిన నీ పాదముల దయ మాపై ప్రసరించుగాక.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

26, జులై 2026, ఆదివారం

మధుమేహము diabetes

 *షుగర్ ఉన్నవాళ్లు జీవితాంతం మందులు మింగబడలేదు 21 మూలికలతో తయారు చేసిన ఈ చూర్ణాన్ని కేవలం నాలుగు నెలలు తింటే చాలు* మీ షుగర్ శాశ్వతంగా నియంత్రణలో ఉంటుంది...


*షుగర్ కి చాలా అరుదైన ఫార్ములా దీన్ని సేవ్ చేసుకొని ఉంచండి.*


*"మధుమేహ చూర్ణం:-"*

21 అద్భుత ఔషధ మూలికలతో తయారు చేసిన ఈ చూర్ణం అతి ముఖ్యంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తూ సహజంగా ఇన్సులిన్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది. కేవలం నాలుగు నెలలు క్రమం తప్పకుండా వాడితే చాలు, మీకు ఎంత మొండి షుగర్ ఉన్నా, ఎన్ని మందులు వేసుకున్నా తగ్గని షుగర్ అయినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతంగా నియంత్రణలో ఉంటుంది.


*మధుమేహ చూర్ణం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు:-*


*1.పొడిపత్రి:-* మధుమేహం చూర్ణంలో ఇదే ప్రథమం. ఈ చూర్ణం 100 గ్రాములు తీసుకోండి.

*2.నేరేడు పండ్లు:-* వీటిని లోపల విత్తనంతో సహా ఎండబెట్టి చూర్ణం చేయాలి. ఈ నేరేడు చూర్ణం 50 గ్రాములు తీసుకోండి.

*3.తులసి:-* రోగనిరోధక శక్తిని పెంచుతుంది షుగర్ వల్ల అనేక సమస్యలను తగ్గిస్తుంది కనుక తులసి 50 గ్రాములు తీసుకోండి.

*4.తిప్పతీగ:-* గురించి చెప్పాల్సిన అవసరం లేదు దీన్ని ఆయుర్వేదంలో అమృతంతో పోలుస్తారు షుగరకి చాలా అవసరం అందుకే తిప్పతీగ చూర్ణం 50 గ్రాములు తీసుకోండి.

*5.కాకరకాయలను:-* చూడగానే ఇబ్బందిగా ముఖం పెట్టకండి అన్ని చూర్ణాలను కాంబినేషన్లో కలిపిన తర్వాత ఈ చూర్ణం మరీ అంత చేదుగా ఏమీ ఉండదు. అయినా తీపి రోగాన్ని తగ్గించాలంటే విరుగుడు చేదుగా అందుకే కాకరకాయ 50 గ్రాములు తీసుకోండి.

*6.నేలవేము:-* షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తూనే మంచి బలాన్ని ఇస్తుంది ఈ చూర్ణం కూడా 50 గ్రాములు తీసుకోండి.

*7.వేప:-* షుగర్ కంట్రోలకి మరో ముఖ్యమైన చూర్ణం. ఇది రక్తశుద్ధి కూడా చేసి చర్మరోగాలను తగ్గిస్తుంది 50 గ్రాములు తీసుకోండి.

*8.మెంతు చూర్ణం:* డయబెటిస్ను సహజంగా కంట్రోల్ చేసే ఔషధాల్లో ముఖ్యమైనది 50 గ్రాములు తీసుకోండి.

*9.దాల్చని:-* ఎన్నో ఔషధగుణాలను కలిగి ఉంది. షుగర్ వ్యాధిలో వచ్చే నీరసాన్ని తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది 25 గ్రాములు తీసుకోండి.

*10.అడవి జిలకర:-* లేదా చేదు జీలకర గా పిలిచే ఈ చేదు జీలకర 25 గ్రాములు తీసుకోండి ఇది షుగరను తగ్గించడంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది.

*11.కస్తూరి పసుపు:-* ఇదే రక్తశుద్ధి చేస్తూనే చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఇది పనిచేస్తుంది ఈ చూర్ణం 25 గ్రాములు తీసుకోండి.

*12.త్రిపలాలు:-* అంటే ఉసిరి కరక్కాయ తానికాయల ఈ మూడింటిని సమభాగాలుగా 50 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని తీసుకోవాలి.

*13.అశ్వగంధ:* శరీర బలం పెంచుతూ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తుంది. దీన్ని 25 గ్రాములు తీసుకోండి.

*14.గుడుచి :–* రక్తంలో గ్లూకోజ్‌ను సహజంగా తగ్గించే శక్తివంతమైన మూలిక. దీనిని 25 గ్రాములు తీసుకోండి.

*15.వసా ఆకులు :–* మధుమేహం వల్ల వచ్చే అలసట, శ్వాస సమస్యలను తగ్గిస్తుంది. 25 గ్రాములు తీసుకోండి.

*16.మధునాశిని:–*.చక్కెర శోషణను తగ్గిస్తుంది. దీనిని 25 గ్రాములు తీసుకోండి.

*17.కరివేపాకు చూర్ణం:–* ప్యాంక్రియాస్ పనితీరును మెరుగుపరుస్తుంది. 25 గ్రాములు తీసుకోండి.

*18.అర్జున చేబుడు:–* హృదయానికి మధుమేహం వల్ల వచ్చే ప్రమాదాలను తగ్గిస్తుంది. 25 గ్రాములు తీసుకోండి.

*19.భూమ్యామలకి:–* లివర్ ఫంక్షన్‌ను బలోపేతం చేస్తూ షుగర్ నియంత్రణలో సహాయపడుతుంది. 25 గ్రాములు తీసుకోండి.

*20.సజ్జ కూర ఆకు పొడి:–* ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుతుంది. 25 గ్రాములు తీసుకోండి.

*21.అవిసె గింజలు:–*.ఫైబర్ అధికంగా ఉండి షుగర్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది. ఈ చూర్ణం 25 గ్రాములు తీసుకోండి.


*#తయారు చేసే విధానం:-*

పైన చెప్పిన విధంగా ఈ 12 క్వాలిటీ కలిగిన చూర్ణాలను తీసుకుని వాటిని ఒక పాత్రలో వేసి అన్ని చూర్ణాలు సరిగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఏదైనా చూర్ణాలు దలసరిగా లేదా పీచు ఉన్నట్లు అనిపించినా మొత్తం చూర్ణాన్ని జల్లెడ పట్టుకొని ఆ చూర్ణాన్ని ఒక మంచి కాళీ సీసాలో నిల్వ చేసుకోవాలి.


*#తీసుకునే విధానం:-*

ఈ చూర్ణాన్ని మొదటి నెల ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా భోజనానికి ముందు గోరువెచ్చని నీటిలో లేదా మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు 2నెల నుంచి షుగర్ ఎక్కువ ఉన్నవాళ్లు రెండు చెంచాలు తాగాలి.


*Note:-*.మీకు మధుమేహ చూర్ణం ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలియజేసాము ఒకవేళ మీకు తయారు చేసుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే మీరు 8978621320 నెంబర్ కు వాట్సప్ లేదా కాల్ చేసి ఆర్డర్ ఇస్తే మేమే స్వయంగా తయారు చేసి మీకు అందజేస్తాము. మరొక విషయం ఇది కేవలం ఆరోగ్య ప్రయోజనాల కోసమే తప్ప వ్యాపారం ప్రయోజనాల కోసం కాదు. వ్యాపారమే చేయదలుచుకుంటే మీకు ఎలా తయారు చేయాలో అని మీకు తెలియజేసే వాళ్ళం కాదు దయచేసి గమనించగలరు


నలుగురికి ఉపయోగపడే పోస్టులను షేర్ చేసి తెలియజేయండి


*ఇట్లు,*

*మీ ఆయుర్వేద వైద్యుల,*

*Dr. Shiva Shankar*

*8978621320*

పంచాంగం 26.07.2026 Sunday,

  ఈ రోజు పంచాంగం 26.07.2026  Sunday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం  గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి భాను వాసర జ్యేష్ఠ నక్షత్రం ఇంద్ర యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: ఈ రోజు తిథి లేదు



 

నమస్కారః , శుభోదయం





భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః ।

నాత్యుఛ్చ్రితం నాతినీచం చైలాజినకుశోత్తరమ్ ।। 11 ।।



ప్రతిపదార్థ:



శుచౌ — పరిశుభ్రమైన; దేశే — ప్రదేశమున; ప్రతిష్ఠాప్య — స్థానం ఏర్పరుచుకొని; స్థిరం — స్థిరమైన; ఆసనం — ఆసనము; ఆత్మనః — తన యొక్క; న — వద్దు; అతి — ఎక్కువ; ఉఛ్చ్రితం — ఎత్తుగా; న — వద్దు; అతి — చాలా; నీచం — తక్కువ ఎత్తులో; చైల — బట్ట ; అజిన — ఒక జింక చర్మం; కుశ — కుశ గడ్డి (దర్భలు); ఉత్తరం — ఒక దాని మీద ఒకటి.



తాత్పర్యము: 



యోగాభ్యాసము చేయటానికి, పరిశుభ్రమైన ప్రదేశంలో ఆసనం తయారుచేసుకోవాలి; దీనిని కుశ గడ్డి, జింక చర్మము, మరియు ఒక వస్త్రమును ఒక దానిపై మరొకటి వేసుకోవాలి. ఈ ఆసనము మరీ ఎక్కువ ఎత్తులో ఉండకూడదు లేదా మరీ తక్కువ ఎత్తులో ఉండకూడదు.



వివరణ:


ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు బాహ్య సాధన గురించి చెప్తున్నాడు. 'శుచౌ దేశే' అంటే ఒక పవిత్రమైన లేదా పరిశుద్ధమైన ప్రదేశం. ప్రారంభిక దశలో బాహ్య వాతావరణం మనస్సుని తప్పకుండా ప్రభావితం చేస్తుంది. 'సాధన' యొక్క తరువాతి దశలలో, అపరిశుభ్రమైన మురికి ప్రదేశాలలో కూడా అంతర్గత పవిత్రత సాధించవచ్చు. కానీ ప్రారంభ దశలో వారికి మనస్సుని పవిత్రంగా ఉంచుకోవటానికి పరిశుభ్రమైన ప్రదేశము సహకరిస్తుంది. కుశగడ్డితో చేసిన చాప, నేలలో వేడిమి/చలి నుండి రక్షణ ఇస్తుంది, ఇది ఈ కాలపు యోగా-మాట్ లాగా పనిచేస్తుంది. వ్యక్తి ధ్యానములో నిమగ్నమై ఉన్నప్పుడు, పైనున్న జింక చర్మం, విషపూరిత ప్రాణులైన పాములు, తేళ్ళు వంటి వాటిని దరిచేరనీయదు. ఒకవేళ ఆసనం మరీ ఎక్కువ ఎత్తులో ఉంటే, పడిపోయే అవకాశం ఉంది; ఒకవేళ ఆసనం మరీ తక్కువ ఎత్తులో ఉంటే, నేలపై పురుగులు/కీటకములు వంటి వాటితో ఇబ్బంది కలుగవచ్చు. ఈ శ్లోకంలో బాహ్యమైన ఆసనం గురించి చెప్పబడిన కొన్ని విషయాలు ఇప్పకి కాలానికి కొంత అన్వయంకాకపోవచ్చు, కానీ ఇక్కడ భావార్థం ఏమిటంటే, మనస్సు భగవంతుని పట్ల ప్రేమయుక్త భక్తి భవాల్లో నిమగ్నమవ్వాలి.

అగద తంత్రము

 అగద తంత్రము - విషం , దాని పుట్టుక లక్షణాలు.


 ఈ అగద తంత్రము . ఆయుర్వేదాన్గములలో ఒకటి అసలు ఆయుర్వేదంగములు 8 . అవి 


 1. శల్య తంత్రము.

 2. శౌలాక్య తంత్రము.

 3. కాయ చికిత్స .

 4. భూత విద్య.

 5. కౌమార భ్రుత్యము.

 6. అగద తంత్రము.

 7. రసాయన తంత్రము.

 8. వాజికరణ తంత్రము.


 ఈ 8 విభాగములు ఆయుర్వేదం లొని భాగాలు అందులొ ఈ అగద తంత్రము అనునది అనేక రకమయిన విషాలు శరీరం నందు ప్రవేశించి నానా విధములగు బాధలు శరీరమున ఏర్పడినప్పుడు అట్టి భాధలను ఉపశమింప చేసి మరణం కలగకుండా కాపాడుటకు ఉద్దేశింపబడింది . 


       అనేక రకములు అగు పాములు , తేళ్ళు, ఎలుకలు, పిచ్చి కుక్కలు , సాలిళ్ళు , దోమలు మొదలగు జంతువులు విష జంతువులు. ఈ జంతువుల యెక్క బాగాలు అనగా శుక్రము, చొంగ మొదలగు భాగములు కూడా విషం అనియు అవి తీవ్రమయిన వ్యాధులను కలుగజేయు ప్రభావం కలవు అని మన పూర్వీకులు కనుగొన్నారు .


 విషము పుట్టుక - 


 దేవదానవులు అమృతం కొరకు పాలసముద్రం చిలుకుతున్నప్పుడు అమృతం కంటే విశేష కాంతి కలదియు , నీలవర్ణం అయిన వస్తువోకటి పుట్టి లోకమును నశింప చేయుటకు క్షణక్షణం వ్యాపించచుండగా దానిని చూసి జగత్తు అంతా విషాద భరితం అయ్యెను . అందువలన దానికి విషం అని పేరు వచ్చింది. అప్పుడు ఆ విషం ఈశ్వరునిచే ఎదుర్కొనబడినది. ఆ తరువాత ఆ విషం తన అసలు రూపం వదిలి కృత్రిమ రూపం ధరించి స్థావర, జంగమ ల యందు ప్రవేశించెను .


 విష భేదములు - 


 స్థావరం, జంగమం అను విషములు రెండు విధములు . ఇవి ఆక్రుతిమములు ( రూపం కలవి )

అందు స్థావరమునకు 10 , జంగమునకు 16 ద్రవ్యములను ఆశ్రయించుకొని ఉండును. అదే విధంగా సవిషయమనియు , సవిశావిషములు అనియు రెండు విధములు . 


            రసాది దాతువుల యందును , ముస్తకాది కందల యందు ఉండు విషములను స్థావర విషములు అనియు, పాము , ఎలుక , తేలు మొదలగు వానియందు ఉండు విషములను జంగమ విషములు అని అందురు. ఇవి విషములు అన్నింటిలోను తీవ్రమైనవి.


 విష లక్షణ గుణములు - 


 విషములు అన్నియు ఆర్చుట, ఉష్ణం , తీక్షణం , చిక్కదనం లేకుండా ఉండుట, ముందు శరీరం అంతా వ్యాపించి తరువాత జీర్ణం అగుట , శీగ్రంగా చంపుట, అలగే శరీరం నుండి పోవుచూ శరీర బంధాలును ( బాగాలు ) శిధిలం చేయుట , సూక్ష్మ నాళాల యందు కూడా ప్రవేశించుట, జట రాగ్ని వలన కూడా జీర్ణం కాకుండా ఉండుట, దోష ధాతువులను క్షీనింప చేయుట , సూక్ష్మ తత్వం వలన శరీరం యందు అవయవాల నందు ప్రవేశించి వికారం కలగచేయును .


 విష ప్రభావం - 


 విషములు యందు గుణములు తీక్షనములు . అందువలన అవి త్రిదోషములను ప్రకొపిమ్పచేయును . అట్లు విషము చే ప్రకోపించబడిన త్రిదోషములు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించ లేకపోవును. అందువలన విషము పిత్తము వలన జీర్ణం కాలేకపోవడం వలన ప్రాణం బంధించును. విషంతో కూడిన శ్లేష్మం చే పోవు త్రోవ మార్గము శ్లేష్మంచే నిరోదింప బడటం ములాన ఉచ్చ్వాసం బంధింపబడును. అందువల్ల ప్రాణం ఉన్నప్పటికి లేని వాడివలే సంజ్ఞా రహితుడై పడి ఉండును.


          విషం మొదట శరీరం నందు ప్రవేశించి మొదట రక్తమును, తరవాత కఫమును, పిత్తమును,వాతమును వాటి పనులను చెడగొట్టి చివరికి హృదయం నందు ప్రవేశించి ప్రాణాలు హరించును.


 స్థావర విషం యుండు స్థానములు - 


 వేరు , ఆకు , పండు, పువ్వు పట్ట, పాలు, చేప బంక, దాతువులు, దుంప ఈ పది స్థానములు విషం నిలువ ఉండు స్థానములు . అలాగే శుశ్రుతం నందు అశ్హ కూర , గుంజ, సుగంద, నల్ల యష్టిమధుకం , గన్నేరు , గురువింద, ఈశ్వరి, పోత్తిదుంప, గంజాయి మొక్కల వేర్లు విషపురితమైనవి .


    నేపాళ గింజ మద్య ఉండు సన్నని ఆకు , చేదు అనప, పాల టేకు, ప్రెంకనమ్ , అందుగ, మొక్కల యెక్క ఆకులు విషం కలవి.


     ఈ విధంగా స్థావర విషాలు 55 రకాలుగా ఉంటాయి అని శుశ్రుతుడు తన గ్రంధంలో వివరించాడు.


 ధాతు విషాలు - 


 పాదరసం, తాలకం , తామ్రము , సత్తు, సీసము , తగరము, అంజనము, మణిశిల, పాషానములు , మణులు ఇవి ధాతు విషములు .


 కంద విషాలు - 


 సక్తుకము, ముస్తకము, కూర్మము , నార్వికము, సర్షపము , ఫైకథమ్ , వత్స నాదము,శ్వేత శృంగి, కాలకుటము , మేష శృంగి, ధర్దుకము, హాలాహలము, కర్మాట ము గ్రంది. , హరిధ్రకము, రక్త శృంగి, కీసరము, యమధంష్ట్రా అనునవి 18 కంద విషములు 


        పైన చెప్పిన 18 విధములు అగు కంద విషములు ప్రాణాంత కములు. మొదటి 8 ఔషధాల యందు , మిగిలిన 10 రసవాదం ( బంగారం తయారు చేయు విద్య.) యందు ఉపయోగిస్తారు.


 స్థావర విషం లక్షణాలు - 


 స్థావర విషం జ్వరము, ఎక్కిళ్ళు, దంత హర్షము, మింగుడు పడకుండా ఉండుట, మరపు వచ్చుట, వమనం ( వాంతి ) , అరుచి, శ్వాస, మూర్ఛ వీటిని కలుగచేయును .


 మూల విషం లక్షణాలు. - 


 మూల విషం భక్షణ వలన చుట్టుకొని పొవుట, ప్రలాపం, మొహం కలుగును. పత్ర విషం 

( ఆకు లొని ) విషం వలన ఆవులింతలు, శరీరం చుట్టుకొని పొవుట, శ్వాస లొ ఇబ్బంది కలుగును.

ఫల విషం వలన వృషణాల వాపు , దాహం , అన్నా ద్వేషం కలుగును. పుష్ప విషం వలన వాంతి , మూర్ఛ కలుగును. పట్టచేప జిగురు విషము వలన నోటి వాసన, జిహ్వాకాటిన్యం , తలనొప్పి, సొల్లు కారుట, కలుగును. క్షార విషం వలన నోట నురుగ వచ్చుట, విరేచనం , నాలుక బరువు ఎక్కుట కలుగును. ధాతు విషం వలన గుండె యందు పీకుడు , మూర్ఛ కలుగును. సాధారణంగా ఈ విషములు అన్నియు తినిన కొంతకాలం తరువాత ప్రాణములు హరించును.


 స్థావర విషం లక్షణములు -


 స్థావర విషం తిన్న వానికి మొదటి వేగమున నాలుక నల్లగా మారి మోద్దుబారుతుంది. మూర్ఛ , శ్వాస, వాంతి కలుగును. రెండొ వేగమున వణుకు, తాపము, కం టం నందు భాద కలుగును, మూడో వేగమున గుండె యందలి భాద మొదలగును. ఆమాశయం నందు శుల మొదలై కన్నులు రంగు మారి పచ్చబడి వాచుట కలుగును. నాలుగో వేగమున పక్వాశయం నందు పోటు , ఎక్కిళ్లు , దగ్గు తలబరువు కలిగించును. అయిదో వేగమున కఫం కారుట, కళ్ళు పోటు, ఆరో వేగమున తెలివి నశించి విరేచనం ఎక్కువ అగును. ఏడో వేగమున మెడ, వీపు, నడుములు నిలవకపోవుట ఆతరువాత ప్రాణం పొవుట సంభవించును .


  

   మరింత విలువైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


 ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

        9885030034                     


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


   కాళహస్తి వేంకటేశ్వరరరావు 


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

25, జులై 2026, శనివారం

కర్మసిద్ధాంతం- 15

 #కర్మసిద్ధాంతం- 15

                  ➖➖➖✍️


స్వామి శివానంద గారి మాటల్లో🗣️


అసలు సంస్కారం అంటే ఏమిటి?


మనోసముద్రంలో వృత్తులు (ఆలోచనా తరంగాలు - సుడిగుండాలు) ఏర్పడతాయి. అవి కొంతసేపు ఉండి, తర్వాత సాధారణ చేతనా స్థాయి క్రిందకు వెళ్ళిపోతాయి. అవి అప్పటి వరకు ఉన్న చేతనావస్థ మనస్సు నుంచి, లోతుగా ఉండే ఉపచేతన మనస్సు (చిత్తం) లోకి ప్రవేశిస్తాయి. అక్కడ అవి సూక్ష్మంగా, మహత్తరంగా పని చేస్తూ, సంస్కారంగా మారుతాయి. జాగురూక స్థితిలో చేసిన కర్మ - అది స్మృతిలో ఉన్నదైనా, ఉద్వేగపూరితమైనదైనా లేదా సంకల్పమైనా- చేతనావస్థకు క్రిందనే అది సూక్ష్మమైన, అవ్యక్తమైన రూపం తీసుకుంటుంది. దాన్నే సంస్కారం అంటాము.


స్మృతి - సంస్కారం తిరిగి వ్యక్తమవుట.

సంస్కారాలు ఉపచేతన మనస్సు లేదా చిత్తంలో నిక్షిప్తమై ఉంటాయి. ఉపచేతన మనస్సునే అచేతనా మనస్సు అని పిలుస్తారు. ఈ చిత్తం ఉండేది చిన్నమెదడులో. చాలా సూక్ష్మ విషయంతో సహా అన్నీ ఇందులో రక్షించబడుతుంటాయి. కొద్దిగా కూడా ఎన్నటికీ నష్టపోవు. చేతనా మనస్సు యొక్క ఉపరితలానికి పెద్ద తరంగంలా వచ్చే సూక్ష్మమైన సంస్కారాలు, లేదా జ్ఞాపకము వలన పురాతన వృత్తి చేతనామనస్సు ఉపరితలానికి వచ్చినప్పుడు, దాన్ని స్మృతి అంటారు. సంస్కారం లేకుండా స్మృతి/జ్ఞప్తి అసాధ్యం.


సంస్కారం ఎలా ఏర్పడుతుంది?

ఇంద్రియ భూమికలో కలిగిన అనుభవం చిత్తం యొక్క లోతుల్లోకి ప్రవేశించి సంస్కారంగా మారుతుంది. మనస్సు దేన్నైనా అనుభూతి చెందిన క్షణమే, ఆ అనుభూతి యొక్క సంస్కారం ఏర్పడుతుంది. ఇప్పుడున్న అనుభూతికి, సుప్తచేతనలో ఏర్పడే సంస్కారానికి మధ్య సమయ బేధం ఉండదు. ఒక ప్రత్యేకమైన అనుభవం ప్రత్యేకమైన సంస్కారాన్ని కల్పిస్తుంది. ఈ అనుభూతి యొక్క స్మృతి/జ్ఞప్తి అనేది ఆ ప్రత్యేకమైన సంస్కారం నుంచే కలుగుతుంది.


మీరు మొదటి సారి బెల్లం రుచి చూసినప్పుడు, మీకు బెల్లం గురించి తెలుస్తుంది. దాని రుచి తెలుస్తుంది. అది బెల్లమనే వస్తువని తెలుస్తుంది. అప్పుడు సుప్తచేతన మనస్సులో ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఏ సమయంలోనైనా, ఈ సంస్కారం ఆ వస్తువు యొక్క స్మృతిని, దాని గురించి అవగాహనను మీకు కలిగిస్తుంది. వస్తువు, దాని గురించి అవగాహన వేర్వేరు చేయచ్చు గానీ, ఆ రెండు విడదీయరానివి.


బాహ్యమైన స్పందనల ద్వారా ఏ వస్తువైనా మనస్సులొని సంస్కారాన్ని తట్టిలేపుతుంది. అందువలన సంకల్పం అనేది బయట నుంచి ఏ స్పందన లేకున్నా లోపల నుంచి ఉద్భవిస్తుంది. మీరు ఇంతకముందు చూసిన ఆవు గురించి ఆలోచించినప్పుడు, మీరు మానసికంగా అవు అనే పదాన్ని స్మరిస్తారు. అప్పుడు దాని రూపం మనస్సులో ఏర్పడుతుంది. అప్పుడు ఆలోచన ఏర్పడుతుంది. ఎలాగైతే విత్తనం నుంచి చెట్టు, చెట్టు నుంచి విత్తనం వస్తుందో, అలానే సంస్కారం సంకల్పాన్ని కలిస్తుంది, సంకల్పం సంస్కారానికి కారణమవుతుంది. ఈ చక్రం బీజ-వృక్ష న్యాయమును తలపిస్తుంది. మనస్సులోని వృత్తి సంస్కారాన్ని కల్పిస్తే, ఆ సంస్కారం ఇంకో వృత్తికి కారకమవుతుంది. బాహ్యం లేదా లోపల నుంచి కలిగే స్పందనలు, ప్రేరణల వలన విత్తనాల వంటి సంస్కారాలు పెరిగి, అనేక కర్మలకు కారణమవుతాయి. వృత్తులు మరియు సంస్కారాల ఈ చక్రం అనాది, కానీ దివ్యజ్ఞానం పొందడంతోనే ఇది అంతమవుతుంది. అప్పుడతి ప్రకృతిలో లయిస్తుంది. అవి జీవన్ముక్తుని మీద ఏ ప్రభావం చూపలేవు. నిరంతర సమాధి వలన సంస్కారాలు కాలిపోతాయి. అప్పుడు మాత్రమే జీవుడు జనన మరణాదుల నుంచి విముక్తుడవుతాడు.


✍️(సశేషం)```

. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

                       

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

శనివారం రాశి ఫలితాలు

  శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

25-07-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. దూరప్రయాణాలు చెయ్యవలసిన వస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.      

--------------------------------------- 


వృషభం


ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో తొందరపాటు మంచిదికాదు. ప్రత్యర్థుల నుంచి ధన పరంగా ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలనాలు కలుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


మిధునం


దూరప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 

---------------------------------------


కర్కాటకం


ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు. బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు పరుస్తాయి. మానసిక ప్రశాంతతకు ఆలయ దర్శనాలు చేసుకుంటారు. చేపట్టిన పనులు మండకొడిగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగుతాయి.

---------------------------------------


కన్య


వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. మిత్రులతో కలహా సూచనలున్నవి. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------


తుల


వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. రాజకీయ సభ, సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలలొ శుభవార్తలు అందుతాయి.

---------------------------------------


వృశ్చికం


నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


ధనస్సు


కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ముఖ్యమైన పనులలో కార్యాటంకములు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------


మకరం


వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు. వృథా ఖర్చులు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

---------------------------------------


కుంభం


ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో సన్నిహితుల సహాయం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి ఆకస్మిక ధనలాభలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. 

---------------------------------------


మీనం

 

నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. విందువినోదాది కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభాకార్యాలలో పాల్గొంటారు.  

---------------------------------------

పంచాంగం 25.07.2026

  ఈ రోజు పంచాంగం 25.07.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి తిథి స్థిర వాసర జ్యేష్ఠ నక్షత్రం బ్రహ్మ యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


ఈ రోజు తొలి ఏకాదశి 


శ్రాద్ధ తిథి: ద్వాదశి 



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యోగీ యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ।

ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీరపరిగ్రహః ।। 10 ।।



ప్రతిపదార్థ:


యోగీ — ఒక యోగి; యుంజీత — ధ్యానములో నిమగ్నమై ఉండవలెను; సతతం — ఎల్లప్పుడూ; ఆత్మానం — ఆత్మ; రహసి — ఏకాంతములో; స్థితః — ఉంటూ; ఏకాకీ — ఒక్కడే; యత-చిత్త-ఆత్మా — మనస్సు-శరీరము నియంత్రణలో ఉంచుకొని; నిరాశీ: — కోరికలు లేకుండా; అపరిగ్రహః — భోగ వస్తువులను సమకూర్చుకోవాలనే వాంఛ లేకుండా.



తాత్పర్యము: 



యోగ స్థితిని పొందగోరే వారు ఏకాంతంలో ఉండాలి, నియంత్రించబడిన మనస్సు-శరీరంతో, కోరికలను, భోగవస్తువులను త్యజించి, నిత్యమూ భగవత్ ధ్యానంలో నిమగ్నమైఉండాలి.



వివరణ:


యోగ స్థితిని సాధించిన వాని లక్షణములు చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు దాని కోసం కావలసిన సాధన గురించి చెప్తున్నాడు. ఏదేనీ విషయంలో నైపుణ్యత సాధించాలంటే ప్రతిరోజూ సాధన అవసరం. కేవలం కాలనీలో ఉన్న ఈత కొలనుకి వారానికోసారి ప్రతి శనివారం సాయంత్రం వెళ్ళినవాడు, ఒలింపిక్ ఈత పోటీలో విజయుడు కాలేడు. ప్రతిరోజూ చాలా గంటలు అభ్యాసం చేసిన వ్యక్తే ఒలింపిక్ విజేత అవ్వగలిగే ప్రావీణ్యత సాధిస్తాడు. అభ్యాసం అనేది ఆధ్యాత్మిక ప్రావీణ్యతకి కూడా చాలా అవసరం. ప్రతిరోజూ ధ్యాన అభ్యాసము ద్వారా ఆధ్యాత్మిక ప్రావీణ్యత సాధించే పద్ధతిని, వివరిస్తున్నాడు, ఇప్పుడు శ్రీ కృష్ణుడు. శ్రీ కృష్ణుడు చెప్పే మొదటి విషయం ఏకాంత ప్రదేశం యొక్క అవసరం. రోజంతా మనం ప్రాపంచిక వాతావరణంచే చుట్టుముట్టబడి ఉంటాము; ఈ ప్రాపంచిక కార్యక్రమాలు, జనులు, మరియు మాటలు, మన మనస్సుని ఇంకా ఇంకా ప్రాపంచికంగా చేస్తాయి. మనస్సుని భగవంతుని వైపు ఉద్ధరించటానికి, కొంత సమయాన్ని ప్రతిరోజూ ఏకాంత సాధనకు ఉపయోగించాలి.


పాలు మరియు నీళ్ళ ఉదాహరణ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పటానికి సహాయపడచ్చు. పాలను నీళ్ళలో పోస్తే అది తన స్వీయ-అస్తిత్వాన్ని నిలుపుకోలేదు, ఎందుకంటే నీరు దానితో కలిసి పోతుంది. కానీ, అదే పాలను నీటి నుండి వేరుగా ఉంచి, దాన్ని పెరుగు చేసి, పెరుగునుండి వెన్న తీస్తే, ఆ వెన్న కలిసిపోదు (నీటిలో). అది ఇప్పుడు నీటిని సవాలు చేయవచ్చు – ‘నీ నెత్తి మీద కూర్చొని తేలుతాను; నీవు ఏమీ చేయలేవు ఎందుకంటే నేను ఇప్పుడు వెన్న అయిపోయాను.’ అని. మన మనస్సు పాల వంటిది మరియు ఈ ప్రపంచం నీళ్ళ వంటిది. ఈ ప్రపంచంతో సాన్నిహిత్యం వలన మనస్సు దానిచే ప్రభావితమై, ప్రాపంచికంగా అవుతుంది. కానీ, ఇంద్రియ వస్తువిషయములతో అతితక్కువ సంబంధం కలిగిఉండే, ఏకాంత వాతావరణం, మనస్సుని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి, భగవంతునిపై కేంద్ర్రీకరించటానికి అనుకూలంగా ఉంటుంది. ఒకసారి, భగవంతునితో తగినంత అనుబంధం ఏర్పడిన తరువాత, ఈ ప్రపంచాన్ని సవాలు చేయవచ్చు, ‘నేను ఈ మాయా ద్వందముల మధ్యనే నివసిస్తాను, కానీ వాటిని నాకు అంటనివ్వను’ అని.


ఈ ఏకాంతంగా ఉండమనే ఉపదేశం శ్రీ కృష్ణుడిచే మరల 18.52వ శ్లోకంలో చెప్పబడింది. ‘వివిక్తసేవీ లఘ్వాశీ’ ‘ ఏకాంత ప్రదేశంలో ఉండుము; ఆహారాన్ని మితంగా భుజించుము.’ మన వృత్తిపరమైన, సామాజిక పనులకు ఎలాంటి భంగం కలుగకుండా, ఈ ఉపదేశాన్ని ఆచరించటానికి ఒక చక్కటి పద్ధతి ఉంది. మన రోజువారీ దిన చర్యలో, కొంత సమయాన్ని సాధన అంటే ఆధ్యాత్మిక అభ్యాసానికి కేటాయించవచ్చు; అంటే మనం ప్రాపంచిక గందరగోళం లేని ఒక ఏకాంత ప్రదేశంలో ఉండాలి. ప్రాపంచికత్వం నుండి పూర్తిగా విడివడి, మన మనస్సుని పరిశుద్ధి చేసుకోవటానికి మరియు భగవంతునిపై కేంద్రీకరించటానికి 'సాధన' చేయాలి. ఈ విధంగా రోజుకి ఒకటి లేదా రెండు గంటలు అభ్యాసం చేస్తే, ప్రాపంచిక పనులలో నిమగ్నమై ఉన్నా, దాని ఫలం రోజంతా ఉంటుంది. ఈ విధంగా, ఏకాంతంలో రోజువారీ సాధనా ద్వారా సంపాదించుకున్న ఉన్నతమైన ఆధ్యాత్మిక స్పృహని కాపాడుకోవచ్చు.

24, జులై 2026, శుక్రవారం

ఆకలి లేనివారికోసం

  ఆకలి లేనివారికోసం సులభ యోగాలు - 


 * మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.


 * వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .


 * యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.


 * బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .


 * పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .


 * కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.


         పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.


 అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -


 తినవలసినవి -


 తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .


 తినకూడనవి -


        కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం, ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .


        పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.


         

  

 

మానవ ధర్మ చంద్రిక -

 మానవ ధర్మ చంద్రిక -


• ఆవునేతి దీపారాధన జ్ఞానసిద్ధి. నువ్వులనూనె దీపారాధన సంపద వృద్ది. కీర్తి.


• ధర్మ మార్గమున సంపాదించిన ధనం ఇచ్చి కొన్న పూలతో దేవ పూజ చేసిన తన పూర్వులను,7 తరాల వారిని తరిమ్పచేయును .


• తులసి దళాలు సుర్యాస్తమయం తరువాత కోయరాదు.


• చాతుర్మాస వ్రతం - ఆషాడ శుద్ద ఏకాదశి నుండి కార్తీక శుద్ద ఏకాదశి వరకు జరుగునని నిర్ణయ సింధు తెలియచేస్తుంది. ఆ కాలం నందు తులసి మొక్క పెట్టరాదు.


• ఇంట్లో పూజించు విగ్రహాలు 2 లేక 3 అంగుళాల ఎత్తు ఉండవచ్చు.


• ధర్భాసనం గాని , వేడి చర్మం గాని , నూతన వస్త్రం గాని వేసుకొని కుర్చుండాలి . కుశాసనము - పౌష్టికం. కంబలాసనం - దుఃఖ విమోచనం. ఎర్రని ఆసనం - వశ్యధికమ్ . చిత్రాసనము - సర్వార్ధములు .తెల్లని ఆసనములు - శాంతి. కృష్ణ జిననము - జ్ఞాన సిద్ది. పులి చర్మము - మోక్ష సిద్ది. ఏ ఆసనము లేకున్నను ఒక దర్భ నయినా వేసుకొని కూర్చుండ వలెను.


• పచ్చటి పట్టుబట్ట ( పీతాంబరం ) పూజకు శుభం. తెల్లని పట్టుబట్ట శుభప్రదము. రంగులవి. బొమ్మలవి మానసిక చాంచల్యం. అంచుగలవి ధరించాలి. నారపట్టు చాలా మంచిది. ఉత్తమమైన విధావలి దీనికి ఎలాంటి దోషాలు లేవు .


• తమలపాకులు 5,7,10,12 మంచివి. ఒక వక్క తాంబూలంలో పెట్టిన ఆరొగ్యం, 3 వక్కలు శ్రేష్టం .


• నందికి ఏ పక్కనుండి వెళతారో, ఆ పక్కనుండే వెనకకు రావలెను. శివలింగం, నందికి మద్య నుండి రాకుడదు. అలా వచ్చినచో పూర్వ జన్మలో పుణ్యం కుడా పొతుంది.


• శివాలయంలో ప్రదిక్షణలు చేసే విధానం -


చండీ స్వరుడు ఉన్న చోటును అనగా( చండీ స్వరుడు లేకున్నను ) శివాబిషేక జలం బయటకు వచ్చు సోమసుత్రం నుండి ప్రారంబించి ధ్వజస్తంభం వద్దకు, ధ్వజస్థంభము నుండి తిరిగి ప్రదిక్షనముగా సోమసుత్రం వద్దకు , 2.అక్కడనుండి వెనకకు తిరిగి ద్వజస్థంభం వద్దకు. 3. ద్వజస్థంభం నుండి ముందుకు సోమసుత్రం వద్దకు. 4. తిరిగి వెనుకకు ధ్వజం వద్దకు, 5. ద్వజం నుండి ముందుకు సోమాసుత్రం వద్దకు 6. తిరిగి సోమసుత్రం నుండి వెనకకు ద్వజం వద్దకు 7. ద్వజం నుండి ముందుకు సోమసుత్రం వద్దకు ,8. సోమసుత్రం నుండి ద్వజం వద్దకు 9. అక్కడనుండి శివాలయంలో ద్వజం ఎడమపక్కనుండి వెళ్లాలి . దీనినే చండ ప్రదిక్షణ అంటారు. ఇలా ఒకసారి చేస్తే శివునికి 30 వేల ప్రదిక్షణలు చేసిన పుణ్యము.


• మొదట నందీశ్వరుని అనుమతితో శివున్ని దర్శించుకోవాలి. నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమచేయి ఉంచి వెనక బాగమున కుడి చేయి ఉంచి " ఓం హర హర శివ శివ " యంటూ శివుని దర్శించి ఆలయంలో ప్రవేశించాలి.


• రుద్రాక్ష దారణ వలన పునర్జన్మ ఉండదు. ఆరొగ్యం కలుగును. రుద్రాక్ష ముఖము నందు రుద్రుడు , పుచ్ఛము నందు విష్ణువు అధి దైవతములు , ఏకాదశ ముఖములు గల రుద్రాక్ష ఏక ముఖముతో సమానము .


• విబుతి దారణ వలన మానశిక ప్రశాంతత , ధైర్యము, ఆరోగ్యము, గ్రహపీడ, అకాల మరణములకు రక్షణ, రుద్రత్వం లబిస్తుంది.


• రుద్రునికి అబిషేక ద్రవ్యములు -

ఆవుపాలతో అభిషేకించిన సర్వ సౌఖ్యములు , ఆవు పెరుగుతో ఆరొగ్యం, సర్వసౌఖ్యములు, ఆవు నెయ్యితో ఐశ్వర్య వృద్ది, పంచదారతో దుఖ నాశనం,తేనెతో తెజోవ్రుద్ది, భస్మ జలంతో మహాపాపహరం, గందోధకంతో పుత్రలాభం, పుష్పోధకంతో భులాభం, బిల్వజలంతో బోగాబాగ్యాలు, దుర్వోధకం ( పారే నీరు ) తొ నష్టద్రవ్య ప్రాప్తి, నువ్వులనూనెతో అపంరుత్యుహారం రుద్రాక్షోధకంతో మహావైశ్వర్యమ్, సువర్ణ జలంతో ధరిద్రనాశనం , అన్నంతో రాజ్యప్రాప్తి, ఆయుర్వృద్ధి, ఆయుర్వృద్ధి, సుఖజీవనం, ద్రాక్షరసంతో సకల కార్యసిద్ది, ఖర్జురఫలంతో శత్రువులకు హాని , కస్తూరి జలంతో చక్రవర్తిత్వం, నవరత్నజలంతో ధాన్యం , గృహం, గోప్రాప్తి, మామిడిపండ్ల రసంతో ధీర్గవ్యాధి నాశనం, పసుపునీళ్ళతో మంగళ ప్రధం . ఆయాద్రవ్యములతో శివుని అభిషేకించిన ఆయాఫలములు లభించును.


• విభూతితో శివుని అభిషేకించిన అష్టైశ్వర్యములు కలుగును.


• నల్లనువ్వులచే అర్చించిన శివుడు శత్రు నాశనం కలగచేయును .


• శ్వేత ( తెలుపు ) అక్షతలతో శివుని అర్చించిన మోక్షప్రాప్తి - శివపాదోధకం తాగిన మోక్షము కలుగును.


• దేవుడు ఊరేగింపుకు వచ్చినపుడు , పెద్దలు ను నడిపించుకు వస్తున్నప్పుడు స్వాగతం చెప్పుటకు ప్రతి ఇంటి ముందర బిందెడు నీళ్లు నిలువుగా పొయాలి.


• ప్రతి గురువారం ఉదయం పాలు, నీళ్లు కలిపి తులసి చెట్టుకి పొస్తే లక్ష్మి నిలయం.


• గురువారం రావి చెట్టుకి సాయంత్రం పాలు , నీళ్లు కలిపి పొస్తే కార్యసిద్ధి.


• వరాన్వేషణకు మృగశిర నక్షత్రం మంచిది.


• శ్రీ శివాబిషేకం చేసిన నీళ్లు పోను గొట్టము నుండి బయటకు వచ్చిన తీర్థం మనము తాకి నెత్తిన చల్లుకోరాదు. అది చండీ స్వరునికి మాత్రమే అర్హత.


• యాగంటి బసవన్న దర్శనం - శని భాధ నివారణం.


• చైత్రమాసంలో సర్వ దేవతలకు " ధవనంతో " పూజ మంచిది అని ధర్మ సింధు చెప్తుంది.


• స్త్రీలు ఎల్లవేళలా పాపిట సింధూరం ధరించడం వలన అక్షయ సౌబాగ్యం కలుగుతుంది.


• మధురలో జననం వలన, శ్రీకాళహస్తి లొ అర్చన వలన , శ్రీశైలం లొ శిఖరదర్శనం వలన , కాశిలో మరణం వలన, అరుణాచలం లొ స్మరణ వలన వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా మోక్షర్హత పొందుతారు. మంచి బుద్ధితో సన్మార్గాన్ని పొందండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి.


• ఉత్తర దిక్కుకి ప్రయాణం చేస్తున్నప్పుడు" ఓం ఖడ్గీ నమః " అను నామస్మరణతో సాగండి. అరిష్టాలు తోలుగుటకు" ఓం నమో నారాయణాయా నమః " అను మంత్రము జపించండి.


• అప్పు పుచ్చుకొనుట - అప్పు ఇచ్చుట . బుదవారం చేయరాదు . మంగళవారం సంక్రమణ దినం. హస్తా నక్షత్రం రోజున అప్పులిచ్చుట వలన తిరిగి రావడం చాలా కష్టం. ఆ రొజులలొ అప్పు చేయకుండా ఉండటం చాలా ఉత్తమం .


• జీవితం తొ కాలమే అదృష్టాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలకు అదే మూలం . జీవితం లొ నిత్య వసంతుడే కాలం.


• పాలు కారే చెట్లు, ముండ్ల చెట్లు, చింత, మునగ,కుంకుడు మొదలగునవి చెట్లు ఇంట్లో ఉండకూడదు .


• బియ్యం లేక గొధుమ నూకలు ప్రతి మంగళవారం గుప్పెడు పెరటిలో చల్లి భూతదయ చూపిన ధాన్యలక్ష్మి అనుగ్రహం కలుగును.


• విష్ణు సహస్రనామం ప్రతిధ్వనించిన చోటు దుష్ట శక్తులకు అది నిర్మూలనము.


• ఆయా నక్షత్రాల వారు ఇంటి ఆవరణలో గాని , రోడ్డు పైన గాని వృక్షము నాటి పోషిస్తే చాలా మంచిది.


అశ్వని - జీడి మామిడి.భరణి - దేవదారు .కృత్తిక - మేడి చెట్టు.రోహిణి - నేరేడు .మృగశిర - మారేడు .ఆర్ద్ర - చింత చెట్టు.పునర్వసు - గన్నేరు .పుష్యమి - పిప్పిలి ( రావి చెట్టు ).ఆశ్లేష - భోప్పాయి.మాఘ - మర్రి.పుబ్బ - మొదుగ .ఉత్తర - జువ్వి .హస్త - కుంకుడు.చిత్త - తాడి చెట్టు.స్వాతి - మద్ది.విశాఖ - మొగలి.అనురాధ - పొగడ.జైష్ట - కొబ్బరి.మూల - వేగిస .పూర్వా షా డ - నిమ్మ .ఉత్తరాషాడ - పనస.శ్రవణం - జిల్లెడు.ధనిష్ట - జమ్మిశతబిషం - అరటి.పుర్వాబాద్రా - మామిడి.ఉత్తరాబాద్రా - వేప .రేవతి - విప్పచెట్టు.


• శివుణ్ణి గరికతో పూజిస్తే ఆయుషు , ఉమ్మెత్త పులతో పుజ చేస్తే సంతానం. అవిసె పూలతో పూజ చేస్తే కీర్తి. తులసి దళాలతో పూజిస్తే భుక్తి, ముక్తి . జిల్లెడు పూలతో పూజిస్తే శత్రుజయం. కరవీర( గన్నేరు ) పూలతో పూజిస్తే రోగాశాంతి, మంకెన. పూలతో పూజిస్తే అలంకారములు జాజిపులతో పూజిస్తే వాహనలాభం కలుగుతాయి.


• విష్ణువును అవిసె పూలతో పూజిస్తే పదివేల యజ్ఞఫలం . కదంభ పూలతో పూజిస్తే స్వర్గసుఖం.


• గణపతిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది . గరికతో పూజిస్తే అన్ని కష్టములు తీరును


• సర్వ వాస్తు దోషాలకు తెల్ల జిల్లెడు వినాయకుని పూజా మందిరం లొ ఉంచాలి.


• సిద్ది యొగములు :


మంగళవారం తదియ, త్రయోదశి బుధువారం విదియ, సప్తమి : గురువారం పంచమి, దశమి : శుక్రువారం పాడ్యమి, ఏకాదశి కార్యనుకులత, విశేష ఫలప్రధయకత.


• ముఖ్యంగా ప్రయాణానికి పనికి రానివి.:


విదియ మంగళవారం , సప్తమి సొమవారం, చవితి ఆదివారం, పంచమి గురువారం, తదియ శుక్రవారం షష్టి శనివారం.


• బూడిద గుమ్మడికాయ మంగళవారం ఇంటి సింహద్వారానికి కట్టిన సకల ద్రుష్టిదోషాలు పొతాయి.


• మారేడు చెట్టుకి తొమ్మిది సార్లు ప్రదిక్షణ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది.


• తొమ్మిది గురువారములు సుర్యొదయం కాగానే శివ దర్శనం చేసుకుంటే గ్రహాల బాధలు తోలుగుతాయి.


• ఇంట్లో పెళ్లి కి వచ్చిన అమ్మాయి ఉంటే ఆమెకి అనుకూలమైన వరుడు లభించుటకు తరచు లక్ష్మి దేవి పూజ చేయాలి . శ్రీ మహాలక్ష్మి స్తోత్రమే ,శ్రీ సుక్తం పటించాలి .


• శనివారం నాడు ఆంజనేయ స్వామిని 108 తమలపాకులతో సేవిస్తే న్యాయ సమ్మతమైన కొరికలు నెరవేరును.


• షిరిడి సాయిబాబా వారిని గులాబిలతో పుజించి శుభాఫలితం పొందండి.


• గురు, శుక్ర వారాలలో చేతి , కాలి గోళ్లు తీయరాదు. ఆ రెండు రోజులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి.


• శివాలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేసి , తొమ్మిది కొబ్బరిబొండాలు సమర్పిస్తే త్వరలో ఋణ విముక్తులు అవుతారు.


• ధన విషయం లొ సంపత్తార, ప్రయాణికులకు క్షేమతార, కార్యజయానికి సాధనతార, వివాహానికి మిత్రతార. వైద్య విషయానికి పరమ మిత్రతార లు మంచివి. శుభప్రదం.


• గృహప్రవేశ సమయంలో గాని , గృహ ప్రవేశం అయిన 27 రోజులలోపు గాని శ్రీ సూక్త పారయణంవిష్ణు సహస్రనామ పారయణం తప్పనిసరిగా చేయాలి . అప్పుడా ఇల్లు దేవతానిలయం అవుతుంది.


• కుజదోష నివారణకు , నొప్పులకు, సంతతికి , అన్యోన్యతకు శ్రీ సుబ్రమణ్య స్వరుని ఆరాధన చేయాలి .


• దేవుని పూజకు ఏ గదిలో వీలైతే ఆ గదిలో ఈశాన్య తూర్పు దిశ లేక ఉత్తర దిశలొ అమర్చుకోవాలి.


• పితృ కార్యముల రోజు కుంకుడు కాయలతో తల స్నానం చేయ రాదు.