17, సెప్టెంబర్ 2023, ఆదివారం

వ్యసనపరుడు

 

వ్యసనపరుడు

ఏదైనా దుర్వ్యసనాలకు ఒక మనిషి బానిసగా మారితే అతనిని వ్యసనపరుడు అనడం మన మెరుగు దము.  ఒక మనిషి రోజు మద్యం సేవిస్తూ, ఉన్న సంపాదన, ఆస్తి అంతా ఖర్చుపెట్టి భార్యా బిడ్డలను పట్టించుకోకుండా వుండే వారిని మనం సమాజంలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం.  అతని భార్యను చూసి నలుగురు అయ్యో పాపం ఆ తల్లి ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఇటువంటి వ్యసనపరుడికి భార్యగా వచ్చింది అని ముక్కు మీద వేలు వేసుకుని అంటూ ఉంటారు. ఆ తల్లి తల్లిదండ్రులు బాద్యతపరులు అయితే ఆమెను ఆమె పిల్లలను పుట్టింటికి తీసుకొని తన కూతురు మనవలు మనవరాళ్ల బాధ్యత తీసుకుంటే సరి అదే వాళ్ళు కూడా పట్టించుకోకుండా వదిలివేస్తే ఆ కుటుంబం పరిస్థితి చాలా హృదయ విదారకంగా మారుతుంది. పిల్లలు దొంగలుగా, మోసకారులుగా రౌడీలుగా మారి అక్రమ సంపాదన చేస్తూ సమాజానికి చీడపురుగులుగా మారుతారు. .  మనం కొన్ని సందర్భాలలో అటువంటి పిల్లలను చూస్తూ ఉంటాం.  వారిని చూసి జాలి కూడా పడలేము ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి సంరక్షణ ఉండదో అప్పుడు పిల్లలు తెగించి జీవిస్తారు దాని పర్యవసానమే వారి దుష్టత్వం.

తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో, బాధ్యతతో పెంచితే పిల్లలు సమాజానికి ఎంతో ఉపయోగపడే వారుగా తయారవుతారు. మనం సాధారణంగా ఎవరైనా సంఘంలో ఉన్నత స్థితికి చేరుకుంటే అతను ఏ తల్లి కన్న బిడ్డో చూడు ఎంత పెద్దవాడు అయ్యాడు అని అతని తల్లిదండ్రులను తలుచుకుంటాము. అందుకే సంతానం ఉంటే తల్లిదండ్రుల పేరుని  నిలపెట్టేవారుగా  వుండాలని అంటారు.  అదే ఒక దుర్మార్గుడిని గురించి సమాజం వీడిని ఏ పాపిష్టి తల్లి కన్నదో అని అనవసరంగా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని కూడా దూషించటం పరిపాటి.

వ్యసనపరుడికి సమాజంలో తన భార్య పిల్లలు ఏమైపోయినా పట్టదు, తన గురించి సంఘం ఏమనుకుంటున్నాదో అది కూడా పట్టదు. కేవలం అంటే కేవలం అనుక్షణం సారా మత్తులో మునిగి తేలుతూ వుంటారు. వారు వీధులలో తాగి పడిపోయి నిద్రించటం కూడా మనకు అప్పుడప్పుడు గోచరిస్తుంది. అంటే వారికి తన గురించి తన కుటుంబం గురించి అంతేకాక సమాజం గురించి కూడా ఏమి పట్టి ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారు నిత్యానంద స్వరూపులు అదేమిటి అలా అంటున్నావు అని నీవు అనవచ్చు కానీ ఇది నూటికి నూరుపాళ్లు నిజం సదా సారా మత్తులో జీవితాన్ని గడపడమే వారి జీవన లక్ష్యం.

ఇదేమిటి భార్గవ శర్మ కి ఏమైంది తాగి ఇది వ్రాస్తున్నాడా అని మీకు అనిపించవచ్చు.  కానీ నిజానికి ఒక ఆధ్యాత్మిక విషయం చెప్పాలంటే సమాజంలో ఉన్న ఏదో ఒక ఉపమానంతో చెబితే కానీ అది మనస్సుకు హద్దుకుని సాధకుని తన సాధనలో ముందుకు తీసుకొని వస్తుందని భావించి చెప్పడం జరుగుతున్నది.

మనం భగవంతుని కేవలం ఒక పది నిముషాలో లేక ఒక అర్ధగంటో ప్రార్ధిస్తే కలిగే ప్రయోజనం కేవలం స్వల్పంగా ఉంటుంది.  అదే ఒక తాగుబోతు లాగా అనుక్షణం భగవంతుని జాసలో గడిపిన అప్పుడుగాని జీవన్ముక్తి అంటే మోక్షం లభిస్తుంది. ఒక తాగుబోతు ఉపమానం నీచంగా కనిపించవచ్చు కానీ నిజానికి అదే సరైన ఉపమానం తాను తన జీవిత లక్ష్యమైన మధుపానం కోసం సంఘములో తన మర్యాదను, తన భార్య పిల్లలను చివరకు తన ఆరోగ్యాన్ని సహితం పణంగా పెట్టి తన వ్యసనానికి బానిస అయ్యాడు.  మరి ముముక్షువు అని చెప్పుకునే నీవు నిజంగా సంఘంలో నీ  మర్యాదను, నీ భార్యాపిల్లలను పణంగా పెట్టి ధ్యానం చేస్తున్నావా అంటే లేదంటే లేదనే చెప్పాలి. ప్రతి క్షణం దేహ వ్యామోహంతో కొట్టుమిట్టాడుతూ నాకు మోక్షం కావాలని అనుకోవడం కేవలం అందని ద్రాక్ష కోసం ఆరాట పడటమే. 

ప్రతి సాధకుడు ముందుగా తెలుసుకోవలసింది తన శరీరం తనకు ఆ భగవంతుడు ప్రసాదించిన ఒక పరికరం లాంటిదే అని భావించి శరీర ఫై మొహం లేకుండా అంటే శరీరాన్ని అందంగా ఆకర్షణీయంగా కనిపించాలని భావిస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా కేవలం శరీర శుభ్రత పాటిస్తూ పూర్తిగా మానసిక శుద్ధికి మాత్రం ప్రయత్నించాలి. మనస్సు పరిశుభ్రంగా లేకుండా శరీరం ఎంత పరిశుభ్రంగా ఉన్నాకూడా భగవంతుని చేరుకోలేము.

సాధకుడు శరీరానికన్నా మనస్సుకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.  సదా మనస్సును శుద్ధిగా ఉంచుకోవాలి.  నిత్యం అనుక్షణం ద్యాస భగవంతుని మీదనే ఉంచాలి ఎలా అయితే వ్యసనపరుడు నిత్యం మత్తులో మునిగి ఉంటాడో అలా.  కానీ భార్య పిల్లలను విడనాడాల్సిన పనిలేదు. సంసారాన్ని కేవలం ఒక బాధ్యతగా భావించి జీవనం చేయాలి. భార్యాపిల్లలకు  భగవంతుని పట్ల ప్రేమ, భక్తిని పెంపొందించే విధంగా తర్ఫీదు ఇవ్వాలి. తాను మాత్రం నిత్యం భగవంతుని ధ్యానంలో గడపాలి, తన కేశాలు ఎలా ఉన్నాయి, దుస్తులు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద పూర్తిగా శ్రద్ధను వదలాలి, ఒక మాటలో చెప్పాలంటే ఒక సాధకునికి అడ్డంపడే విషయాలు ఏమిటంటే అవి అరిషడ్వార్గాలు అందులో ప్రతి ఒక్కటి దాని దాని ప్రభావం కలిగి సాధకుని సాధనలో ముందుకు వెళ్లకుండా ఆపుతుంది.  ఎప్పుడైతే సాధకుడు వాటిని అధిగమిస్తాడో అప్పుడే సాధనలో ముందుకు వెళ్లగలుగుతాడు.  ముందుగా జయించాలసింది మొహాన్ని మొహం అనేది దేహ వ్యామోహంతో మొదలవుతుంది.  దేహం అందంగా వున్నది అనే భావనే మొహానికి మొదటి మెట్టు.  కాబట్టి ఆ భావనను విడనాడాలంటే ముందుగా కేశాలను నిర్ములించాలి అంటే ముండనం చేయించుకోవాలి.  అప్పుడు సాధకుడు తనను తానూ అద్దంలో చూసుకొని నేను అందంగా లేను అనే భావం కలిగివుంటాడు దానివలన శరీర మొహం కొంతవరకు తగ్గుతుంది.  సాధకుడు ఎట్టి పరిస్థితిలోను కేశాలకు రంగు వేయరాదు.  ఇలా చేసాడంటే వాడు ఈ జన్మలో సాధనకు పనికి రాడు .

తానూ ఏ పరిస్థితిలో వున్నా అంటే స్నానమాచరిస్తూవున్న, మల మూత్ర విసర్జన చేస్తూ వున్నా భగవంతుడి ధ్యానం నుండి విడివడకూడదు. ఎందుకంటే మనకు ఈ జన్మలో వున్న సమయం చాలా కొద్దిది ఈ సమయాన్ని మనం మంచి ముహూర్తం అని పరిశుభ్రం అని ఇంకా ఏదో ఏదో అని వ్యర్థం చేస్తే మన జీవిత లక్ష్యం ఆయిన మోక్షాన్ని చేరుకోలేము.  సాధకుడు సదా పరిశుద్ధుడే.  ఎందుకంటె సాధకుని మనస్సు ఎల్లప్పుడూ శుద్ధిగానే ఉంటుంది. కాబట్టి సాధక ఇంకా ఆలస్యం చేయక ఇప్పుడే నీ సాధనను మొదలు పెట్టు మోక్షార్థివి కమ్ము.

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు

మీ భార్గవ శర్మ

 

 

శివమానసపూజ

 శ్రీ శంకరాచార్య విరచిత    

                  శివమానసపూజ      

( రత్నైః కల్పిత మాసనం ... మహాదేవ శంభో ) 


                   


భాసుర రత్న పీఠికయు 

         భవ్య తుషారపు మజ్జనంబుయున్ 

భూషిత దివ్య వస్త్రములు 

        భూరి విభాసిత రత్నభూషలున్ 

వాసిత చందనాగరులు 

        వాసన కస్తురి లేపనంబు సద్

వాసన జాజి బిల్వములు 

       వ్యాపకగంధపుధూప దీపముల్ 

భాసిత శంకరా ! మదిని 

          భక్తి సమర్పణసేతు నిచ్చలున్ 01



కాంచన రత్న పాత్రముల 

            కమ్మని యాజ్యపు పాయసంబులున్ 

పంచవిధంబులైన పలు 

           భక్ష్య పయో దధి యుక్త పాకముల్ 

సంచయపాత్రపూరిత ర

          సన్మయ శర్కర పానకంబులున్        

సంచిత శాకముల్ మధుర 

            సత్ఫల వీడ్య పటీరముల్ , శివా ! 

ఆంచిత భావమందు భవ

            దర్పణ సేతును మానసంబునన్ 02



చక్కని చామరద్వయము 

           ఛత్రము నద్దము తాళ వృంతముల్

మిక్కిలి మేలుగూర్చు పలు 

            మేలగు వీణ మృదంగ వాద్యముల్ 

చక్కని నృత్య రీతులును  

          శ్రావ్యపు గానవిశేషముల్ స్తుతుల్ 

మక్కువతోడ సాంగముగ 

           మానసమందున వందనంబులన్ 

పెక్కగు పూజ లర్పితము 

          ప్రేమగ జేయుచు నుంటి శంకరా !  

దిక్కువు నీవె వేడెదను 

           తీరుగ చేకొను నాదు పూజలన్ . 03



సత్యమ నీవె యాత్మ మతి

          శాంభవి నీ ప్రమథాళి ప్రాణముల్ 

నిత్యముగాని కాయమిది

          నిక్కము గేహము భుక్త భోగమే

నిత్యసుపూజ నిద్దురయె

          నిత్యసమాధి పద ద్వయంబులన్

నిత్యమొనర్చు చాలనము 

          నీకు ప్రదక్షిణ పల్కు వాక్కులే

నిత్యనుతుల్ ప్రభూ ! యనయ

          మెయ్యెవి కర్మము లాచరింతునో ,

నిత్య విభాస ! యో యభవ !

          నిన్నిల గొల్చుటయే సదాశివా ! 04



కరచరణంబులన్ నయన 

           కర్ణ యుగంబుల కర్మ వాక్కులన్ 

నిరతము మానసంబునను 

           నే నొనరించెడి కర్మలందునన్ 

సరియును కానిచర్యలను 

          స్వాంతము నందు క్షమించి స

త్కరుణను జూపి నన్నెపుడు 

          కావుము శంకర ! పార్వతీ పతీ ! 05


ఆంధ్రానుసరణ..

✍️గోపాలుని మధుసూదన రావు శర్మ 🙏

లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

 లక్ష్మీలలితా వాస్తు జ్యోతిషాలయం

శ్రీనివాససిద్ధాంతి9494550355


*వ్యాపార అభివృద్ధి*


తంత్ర శాస్త్రంలో నిమ్మకాయకు ప్రత్యేకమైన స్థానం ఉంది. నిమ్మకాయలను ఉపయోగించి అనేకరకాల సమస్య నుండి బయటపడవచ్చు. సాధారణంగా అమ్మవారి దేవాలయాలలో మంగళవారం శుక్రవారం రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. నిమ్మకాయ దీపాలు వెలిగించడం వలన అంతః శత్రువులు బాహ్య శత్రువులు తొలగిపోతారు ఆరోగ్యము ఐశ్వర్యము అభివృద్ధి చెందుతుంది నరదృష్టి తొలగిపోతుంది. నిమ్మకాయతో వ్యాపారం అభివృద్ధి చెందడానికి కొన్ని రకాల పరిహారాలు పాటించవచ్చు. వ్యాపార స్థలంలో ఒక గాజు గ్లాసులో నీరు పోసి దానిలో ఒక నిమ్మకాయ ఉంచుతూ ఉంటారు దీనివలన నరదృష్టి వ్యాపార స్థలం పై ఉండకుండా పోతుంది వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా మరొక పరిహారం షాపు తెరిచిన తరువాత ఒక నిమ్మకాయ తీసుకుని షాపులోని నాలుగు గోడలకు తాకించాలి తరువాత దానిని నాలుగు ముక్కలుగా కోసి నాలుగు గోడల దగ్గర ఉంచాలి. ఆరోజు షాపు మూసివేసే ముందు ఈ నాలుగు నిమ్మకాయ ముక్కలను చేతితో తాకకుండా తీసి ఎవరు తొక్కని స్థలంలో వేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. ఈ పరిహారం వ్యాపార స్థలంలో నెగిటివ్ ఎనర్జీ లేదా నరదృష్టి తొలగిపోయి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మరొక మంచి పరిహారం ప్రతి బుధవారం షాపు తెరిచిన తర్వాత ఒక నిమ్మకాయ తీసుకుని దానిలో నాలుగు లవంగాలు గుచ్చండి లవంగాలు గుచ్చిన ఆ నిమ్మకాయను మీ క్యాష్ బాక్స్ లో ఉంచండి. ఆరోజు షాపు మూసివేసే సమయంలో ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్లేస్ లో వేసేయండి ఈ విధంగా చేస్తే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుంది.


జాతక,ముహూర్త విషయాలకు phone ద్వారా  సంప్రదించవచ్చును.  

*ద్విస్వర్ణ కంకణ సన్మానిత.*

*జ్యోతిషరత్న, member in international astrology federation. ..శ్రీనివాస సిద్ధాంతి*

*9494550355*


PlZ Forward the message

ఆపద సమయములందు

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


*శ్లో𝕝𝕝 ఛిన్నోఽపి రోహతి తరుః*

*క్షీణోప్యుపచీయతే పునశ్చన్ద్రః|*

*ఇతి విమృశన్తః సన్తః*

*సన్తప్యన్తే న విప్లుతా లోకే||*


*--- _భర్తృహరి నీతిశతకం_ ---*


*తా𝕝𝕝 చెట్లను కొట్టివేసిననూ అవి మరల చిగురించుచున్నవి..చంద్రుడు క్షీణించిననూ మరల పరిపూర్ణుడగుచున్నాడు.... ఇట్టి ఉదాహరణలు చూచిన ఆపదలు కలకాలం ఉండవు అని  తెలియుచున్నది కదా!!!. కావుననే సత్పురుషు లెన్నడును ఆపద సమయములందు అధైర్యమునొందరు*......


🧘‍♂️🙏🪷 ✍️🙏

ఆదివారం, సెప్టెంబరు 17, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


ఆదివారం, సెప్టెంబరు 17, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

భాద్రపద మాసం - శుక్ల పక్షం

తిథి:విదియ ఉ9.17 వరకు 

వారం:ఆదివారం (భానువాసరే)

నక్షత్రం:హస్త ఉ9.31వరకు

యోగం:బ్రహ్మం తె4.42 వరకు

కరణం:కౌలువ ఉ9.17 వరకు తదుపరి తైతుల రా9.47 వరకు

వర్జ్యం:సా6.02 - 7.44

దుర్ముహూర్తము:సా4.22 - 5.11

అమృతకాలం:తె4.15 - 5.58

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి : సింహం చంద్ర రాశి : కన్య 

సూర్యోదయం:5.51

సూర్యాస్తమయం:6.00


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

శ్రీ మహావిష్ణువు చెప్పిన శ్లోకం

శ్రీ మహావిష్ణువు చెప్పిన శ్లోకం

శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తకళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యోనారాయణోహరిః


శరీరము అనారోగ్యంతో తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు ఈ శ్లోకాన్ని భక్తితో పఠిస్తే, అదృశ్యరూపంలో వారిలోకి గంగాజలమును పంపి వారి రోగాన్ని తగ్గిస్తానని సాక్షాత్తు శ్రీమహావిష్ణువే వరమిచ్చాడు.

 కనుక ప్రతి ఒక్కరూ దీన్ని కంఠస్థం చేసి అనారోగ్యంగా ఉన్న వారితో చెప్పించండి.


 

Photo








 

Maarakam


 

సంసారసాగరాన్ని తరిస్తాడు

 శ్లోకం  ☝️


 సుఖదు:ఖే యధా సమ్యక్

అనిత్యే య: ప్రపశ్యతి !

కాయం చామేధ్యసంఘాతం

 వినాశం కర్మసంహితమ్ !!


యచ్చ కించిత్సుఖం తచ్చ

ధు:ఖం సర్వమితి స్మరన్ !

సంసారసాగరం ఘోరం

తరిష్యతి సుదుస్తరమ్ !!


భావం: సుఖధు:ఖాలను అనిత్యాలు అని భావించేవాడు, శరీరాన్ని అపవిత్ర సమూహంగా భావించేవాడు,మృత్యువు కర్మఫలం అని తెలుసుకొన్నవాడు, సుఖం అనిపించేవి సమస్తమూ ధు:ఖమే అని భావించేవాడు, ఘోరమూ, దుస్తరమూ అయిన సంసారసాగరాన్ని తరిస్తాడు

పంచాంగం 17.09.2023 Sunday,

 ఈ రోజు పంచాంగం 17.09.2023 Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: ద్వితీయా తిధి భాను వాసర: హస్తా నక్షత్రం బ్రహ్మ యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు 

విదియ పగలు 11:07 వరకు.

హస్త పగలు 10:10 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:13

వర్జ్యం : సాయంత్రం 06:41 నుండి రాత్రి 08:25 వరకు.

దుర్ముహూర్తం : సాయంత్రం 04:36 నుండి 05:25 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00  వరకు.


యమగండం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార: