2, డిసెంబర్ 2023, శనివారం

 #ఆముక్త మాల్య#


విష్ణుచిత్తుడు "వాదించడానికి రాజ సభకు వెళ్ళు" అనిన స్వామితో      ఇలా అంటున్నాడు.



సీ. "స్వామీ ! మహాదేవ ! శరణాగతుడ నేను

               పెనుభార మీరీతి  బెట్ట దగునె !

     అపఠితశాస్త్రుండ నత్యంతమూఢుండ 

              గ్రంధజాత్యంధుండ కడుజడుండ 

     నారామభూమిని ననయంబు ద్రవ్వుచు

              పట్టియు గుద్దలిన్  బాటు పడగ

     పటు ఘర్షణంబున పాణి ద్వయంబున 

            కాయలు గాచిన కర్షకుడను

     భక్తితో నీ గీము బరిశుభ్ర మొనరించు

            భావమ్ము నందుండు  సేవకుడను

తే. అట్టి నను వాదమున కీవు పట్టుబట్టి

      ప్రభువు సభకును దెలిసియు పంపితేని

      గల్గు నపజయ, మపకీర్తి కాదె నీది,

      పంపుటకు ముందె యోచించు పరమపురుష! 


సీ. పరమాత్మ ! నిరతంబు భవదాలయమ్మునన్

                పరిమార్జనము సేయు పనిని కాని 

     స్నానమ్మునకు దివ్య సలిలమున్ దెచ్చెడి

                భవ్యమౌదివ్యమౌ పనిని కాని

     శృంగార పల్లకిన్ జేబూని మోసెడు

                వాహనసేవయన్ పనిని కాని

     తులసిదండలు గట్టి తోమాలగా నీకు

                 భక్తితో నర్పించు పనిని కాని

      ప్రభువు లర్పించెడు పలువిధ ధ్వజముల 

                 పట్టియల్ మోసెడు పనిని కాని

      ఛత్ర చామరములు సద్భక్తి తోడను 

                 పరవశమ్మున బట్టు పనిని గాని

      ముందు దీపమ్ముల  మోదమ్ము తో  నెత్తి

               నిను గాంచు భాగ్యమౌ  పనిని కాని

 తే. సల్ప నర్హుండ  నేను, నో  సర్వవినుత !

     వాదమది యేల యీశ్వరా ! వదలు నన్ను

     నన్యు లెవ్వరు కనరారె యవనియందు

     నీదు లీలలు ప్రకటించ నీరజాక్ష !"       


సరళపద్యానుసరణము :

గోపాలుని మధుసూదన రావు

 021223-2.కంచి పరమాచార్య వైభవం.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀265.



            *పురాతన భాష ఏది?*

                   ➖➖➖✍️



```నేను పరమాచార్య స్వామివారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు విదేశీయులు ఉన్నారు. 


ఒక ఇజ్రాయిలి, ఒక ఇటలీయుడు, 

ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. 

వారు ‘పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రాచీన భాషలు’ అనే అంశంపై పి.హెచ్.డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హీబ్రూ మరియు గ్రీకు భాషలు; తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు. 


మహాస్వామి వారు అనుష్టానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి ఫోటో తీయాలనుకున్నారు కాని సహాయకులు ఒప్పుకోలేదు. వారు ఉదయం నుండి ఒక చెట్టు నీడన నిలుచున్నారు. స్వామివారి పూజ ఎంతసేపటికి అవుతుంది అని సేవకులను అడిగారు కాని వారికి సరైన సమాధానం దొరకలేదు. 


మహాస్వామి వారు పది నిముషాలలో బయటకు వచ్చారు. మేమందరమూ వెళ్ళి సాష్టాంగం చేసాము. మెడలో కెమెరా తగిలించుకున్న వ్యక్తివైపు చూసి మహాస్వామి వారు ఫోటోలు తీసుకోండి అన్నట్టు సైగ చేసారు. మూడు చిత్రాలకు అనుమతి ఇచ్చి నాల్గవ చిత్రం తీస్తుండగా ఆపమన్నారు. వారి రాకకు కారణం అడిగారు. 


వారు వచ్చిన ఉద్దేశమును వివరించారు. 


మహాస్వామి వారు వారితో, ”ఏది అత్యంత ప్రాచీన భాష అని మీరు ఒక నిర్ణయానికి వచ్చారా?” అని అడిగారు. 


”పాశ్చాత్య భాషలలో హీబ్రూ చాలా ప్రాచీనమైనది. కాని తూర్పు ఆసియాలో సంస్కృతము తమిళము రెండు ప్రాచీనమైనవి అని అందరూ అంటున్నారు. మాకు అనుమానం వచ్చి మీ వద్దకు వచ్చాము” అని ఇజ్రాయిలీ చెప్పాడు.


అందుకు మహాస్వామి వారు “వీటన్నిటికంటే ప్రాచీనమైన భాష ఒకటి ఉంది. అది వైదిక భాష. సంస్కృతము హీబ్రూ కూడా దాని నుండే వచ్చాయి” అని అన్నారు. 

”హీబ్రూ లో పునర్జన్మ గురించి ఒక శ్లోకం ఉంది. దాన్ని మొత్తం చెప్పగలవా?” అని ఇజ్రాయలీని అడిగి మొదటి రెండు పదాలు ఎత్తిచ్చారు.


అతను మూడు నాలుగు నిముషాలపాటు దాన్ని చెప్పాడు. స్వామి వారు చుట్టూ చూసి, అక్కడున్న పిల్లలతో “మీరు ఋగ్వేదం చదువుకున్నారా? ఈ శ్లోకాన్ని చెప్పగలరా?” అని అడిగారు. 


ఆ పిల్లలు ఐదు నిముషాలపాటు ఉచ్ఛరించారు. 


స్వామి వారు నాతో “ఈ పిల్లలు చెప్పినది వారికి అర్థమైందేమో అడుగు!” అన్నారు. 


నలుగురూ ఏమి మాట్లాడలేదు. స్వామి వారు ఆ పిల్లలవైపు తిరిగి “ఇతను హీబ్రూ లో చెప్పినది మీకు ఖచ్చితంగా అర్థమై ఉండదు” అని అన్నారు. 


మరలా నావైపు తిరిగి, “ఆ ఇజ్రాయిలీతో చెప్పు అతను చెప్పినది ఈ పిల్లలు చెప్పినది రెండూ ఒక్కటేనని” అని అన్నారు. 


నేను అతనితో, “నువ్వు చెప్పిన శ్లోకం ఆ పిల్లలు చెప్పిన శ్లోకం రెండూ ‘ఉచ్ఛారణలలో’ ఒక్కటే అని స్వామివారు చెప్తున్నారు” అని చెప్పాను. 


”ఏమిటి? కేవలం ‘ఉచ్ఛారణలలో’ మాత్రమే కాదు ‘అక్షరాలలో’ కూడా రెండూ ఒక్కటే” అని నా మాటలను సరిచేసారు. 


ఈ విషయాన్ని నిరూపిస్తానని ఒక కలం కాగితం ఇమ్మనారు. “వేదాలలో భూగోళం 32 భాగాలుగా విభజించబడింది అని చెప్పబడింది. ఈ 32 భాగాలలోని ప్రతి భాగంలో వేదాక్షరాలు ఎలా మార్పు చెందాయి ఎలా ఉచ్చరింపబడతాయి అని కూడా చెప్పబడింది”. వచ్చిన ఆ నలుగురిని వారు ఏ ప్రాంతం వారో కనుక్కుని ప్రతి వేదాక్షరం వారి ప్రాంతాలలో ఎలా మార్పు చెందింది అనే విషయం చెప్పారు. ఆ పిల్లల్ని ఋగ్వేదం నుండి మళ్ళా ఒక శ్లోకం చెప్పమని ఆ శ్లోకంలోని ప్రతి అక్షరం వారి వారి ప్రాంతంలో ఎలా పలుకుతారో చెప్పారు. 


ఆ పిల్లల వైపు తిరిగి “ఈ శ్లోకాన్ని నేను కొద్దిగా వేరే ఉచ్ఛారణలో హీబ్రూ భాషలో వీటిని ఎలా పలుకుతారో అలా చెప్తాను. అది తప్పు అనుకోకండి. వేదాలలో ఇది ఇలా కూడా ఉచ్ఛరించవచ్చు అన్న ఆదేశము ఉన్నది” అని అన్నారు. 


పరమాచార్య స్వామివారు మెల్లిగా మొదలుపెట్టారు. అద్భుతం ఆ ఇజ్రాయిలీ కూడా స్వామివారితో చెప్పడం ప్రారంభించాడు. 


మేమందరమూ నిర్ఘాంతపోయాము. “నేను అప్పుడే చెప్పాను. ఋగ్వేదములో ఉన్న శ్లోకమే హీబ్రూ లో కూడా ఉన్నదని! కాని అక్షరాలు కొద్దిగా మార్పుతో ఉంటాయి. (దక్షిణాన ‘యమున’ అంటే ఉత్తరాన ‘జమున’ అంటారు. దక్షిణాన ‘వ’ పశ్చిమ బెగాల్ లో ‘బ’. తమిళంలో ‘ప’ కన్నడంలో ‘హ’ అలా...) కాబట్టి ప్రపంచంలో అతి ప్రాచీనమైన భాష ‘వైదిక భాష!’


మహాస్వామి వారు ఆ నలుగురిని ఋగ్వేద అక్షరములు వారి వారి భాషలలో ఎలా ఉచ్ఛరింపబడతాయో ఒక పట్టిక వెయ్యమన్నారు. పదిహేను నిముషాలలో అంతా రాసారు. దాన్ని చూసి ఇజ్రాయిలీ ఆశ్చర్యముతో ఇది అసలు ఊహింపశక్యము కానిది అని అన్నాడు. 


స్వామి వారు అతనితో “ఏమిటి అన్ని భాషలూ వేద భాషనుండే పుట్టాయని ఇప్పుడు ఒప్పుకుంటావా?” అని అడిగారు. 


కాని అతని మొహంలో అతను ఒప్పుకున్నట్టు కనబడడంలేదు. 

”హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండొచ్చు. అని అతని సందేహము కదా?” అని అడిగారు. 


అందుకు అతను అవును “హీబ్రూ నుండే వేదాలు పుట్టి ఉండొచ్చు కదా?” అన్నాడు. 


స్వామి వారు నవ్వుతూ, “మీవద్ద తాళం మాత్రమే ఉంది. మా వద్ద తాళంచెవి కూడా ఉంది. వేదాలలో ఏ మహర్షి భారతదేశం నుండి వెళ్ళి ఇజ్రాయల్ లో వేదాన్ని వ్యాప్తి చేసారో అనే విషయం కూడా ఉంది” అని చెప్పారు. 


అతను చివరికి ఒప్పుకున్నాడు.✍️```


     --- తిరువణ్ణామలై గౌరీశంకర్ గారి తమిళ ఇంటర్వ్యూ వీడియో నుండి.


అపార కరుణా సింధుం

జ్ఞానదం శాంతరూపిణం।

శ్రీ చంద్రశేఖర గురుం 

ప్రణమామి ముదావహం॥


#KanchiParamacharyaVaibhavam

#కంచిపరమాచార్యవైభవం


                       🌷🙏🌷


  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Panchaag


 

 🌹  🌹  ॐ  卐  ॐ  🌹  🌹

🙏 *ఓం శ్రీ గురుభ్యోనమః* 🙏

  🌞 *_డిసెంబరు 2, 2023_* 🌝

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*

*దక్షిణాయనం*

*శరదృతువు*

*కార్తీక మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *పంచమి* సా4.34

వారం: *స్థిరవాసరే*

(శనివారం)

నక్షత్రం: *పుష్యమి* రా7.05

యోగం : *బ్రహ్మం* రా9.13

కరణం: *తైతుల* సా4.34

&

*గరజి* తె5.28

వర్జ్యం: *లేదు*

దుర్ముహూర్తము: *ఉ6.16-7.45*

అమృతకాలం: *మ12.09-1.53*

రాహుకాలం: *ఉ9.00-10.30*

యమగండం: *మ1.30-3.00*

సూర్యరాశి: *వృశ్చికం*

చంద్రరాశి: *కర్కాటకం*

సూర్యోదయం: *6.17*

సూర్యాస్తమయం: *5.20*

           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

  *సర్వే జనాః సుఖినోభవంతు*

    ☘️🇮🇳☘️🙏☘️🇮🇳☘️

   🕉🕉 *_శుభమస్తు_* 🕉🕉


 

 https://youtu.be/nBG0kThvxXg?si=YPubL0gBP1tgv5yz


 *_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_*

𝕝𝕝 శ్లో 𝕝𝕝 

*తపోబలం తాపసానాం*

*బ్రహ్మ బ్రహ్మవిదాం బలమ్|*

*హింసా బలమసాధూనాం*

*క్షమా గుణవతాం బలమ్||*

(సుభాషితరత్నకోశః)


𝕝𝕝తా𝕝𝕝 

తాపసులకు తపస్సు బలం. బ్రహ్మవేత్తలకు వేదమే బలం. పాపాత్ములకు హింస బలం. గుణవంతులకు సహనమే బలం.

 *#కృష్ణా_నీ_మీద_మనసాయెరా   #గోపికావిలాపము*

 

 ( కందములలో శతకము - 04 )


🌺🍃 *----------------* 🍃🌺


🌹🙏🌹


*ఎంతటి గబ్బితనంబులొ*

*యింతగ ప్రాధేయపడితి నింతిని నైనన్*

*వింతగ నీ మనసు కరుగ-*

*దెంత విచిత్రంబిది సరి యెరుగుము గృష్ణా !*

 

( 31 ) 


🌹🙏🌹( భావము )


ఎంత గర్వమో ఎంత కొంటెతనమో నీది.

ఇంత ఆశతో బ్రతిమాలుచూ వేడుకుంటున్నా ,

మగువనైనా సరే నేనే అడుగుతున్నా నీ పొందును !🙏


అయినా సరే నీ మనసు కరుగుటలేదు ఇదేమి విచిత్రమో 

మరి అది నీకే తెలియాలి *కృష్ణా !*🙏


🌹🙏🌹


*కష్టము నెరిగిన వాడవు* 

*దుష్టుల నైనను విడువక దొరకొందువు , నీ* 

*యిష్టసఖిని విడిచితివే !*

*కష్టము గాదా మనసుకు కలతై కృష్ణా ??*


 ( 32 ) 


🌹🙏🌹( భావము )


నీవు స్వయముగా కష్టములనెన్నో అనుభవించి తెలుసుకున్నవాడవు .

చెడ్డవారినైనా , మంచిగా యత్నించి చేరదీసెడి వాడవు ! 🙏


మరి ఇదేమిటయ్యా నీ ప్రియురాలనే అయినా నన్ను ఇలా విడిచిపోయావు ?🙏


నా మనసుకు కష్టముగా ఉండదా ఈ బాధ *ఓ కృష్ణా !!*🙏


🌹🙏🌹


*మజ్జన మాడెడి వేళన్*

*గజ్జెలు గట్టు సమయాన , గానంబులనున్*

*నొజ్జ యరు దెంచినను నీ*

*సజ్జనులకడ తవనామ స్మరణయె కృష్ణా !*


 ( 33 ) 


🌹🙏🌹( భావము )


స్నానము చేస్తున్నా ,  కాళ్ళకు గజ్జెలు కట్టుకుంటున్నా, 

పాడుకుంటున్నా చివరకు గురువులు వేంచేసినా ,

ఇక్కడ మంచివారి అందరి నడుమనా ,

 నాకు నీ పేరును తలుచుకోవటమే పనిగా అయినది *కృష్ణా !* 🙏


🌹🙏🌹


*ప్రీతిగ నిన్నే వలచిన*

*నాతిని దూరమున వెట్ట న్యాయంబౌనా ?*

*శీతల మనంబుతో నా*

*రీతిన ప్రేమింపరార రివ్వున కృష్ణా !*

 

( 34 )


🌹🙏🌹( భావము )


ఎంతో ఇష్టపడి నిన్నే ప్రేమించిన వనితను ,

నన్ను దూరమున పెట్టటము నీకు ఒప్పిదముగా ఉన్నదా *కృష్ణా ?*🙏


కొంచెము చల్లని మనసు చేసుకో నాపైన .

ఆ విధముగా నన్ను ప్రేమించుటకు వేగిరమే రారాదా *కృష్ణా ?*


🌹🙏🌹


*గట్టిగ నీ కౌగిలిలో*

*నిట్టే యొదగని పరువము లేలా కృష్ణా ?*

*గట్టున పొరలెడి మీనం-*

*బెట్టుల వగచునొ నదియిదియేగద కృష్ణా !*


( 35 ) 


🌹🙏🌹( భావము )


నీ కౌగిలిలో  గట్టిగా నన్ను తీసుకోగా , ఆ కౌగిలిలో చక్కగా ఒదిగపోవాలిగానీ ,

అవియేమియూ లేని ఈ నా వయస్సు అసలెందుకు *కృష్ణా ?*🙏


నీటి నుంచీ విడివడిన చేప ఎలా అయితే విలవిలా కొట్టుకుంటూ బాధపడుతుందో 

చూడాలంటే , నన్ను చూస్తే చాలు .🙏


 ఆ బాధయే నా బాధ గదా *కృష్ణా !*🙏


🌹🙏🌹


*గోవుల గాచెడి కృష్ణా*

*గోవువలెనె జూడరాద గోముగ నన్నున్ ?*

*జేవకు గొదవేమయె ? యీ*

*జీవికి నీవే జవముయు జీవము కృష్ణా !*

 

( 36 ) 


🌹🙏🌹( భావము )


గోవులను ఎంతో లాలనగా గాచే వాడవు కదా *ఓ కృష్ణా !*🙏 


అ గోవుల మంద లోనే ఒక గోవునని నన్ను గారాబముగా చూచుకొనరాదా ?🙏


ప్రేమను పంచుటలో నీ శక్తికి అరుదేమి గలదయ్యా ?🙏


ఈ జీవికి నీ పొందే శక్తినిచ్చును , అదియే ఈ జీవికి జీవితము కూడా *కృష్ణా !* 🙏


🌹🙏🌹


*పక్కనె బాన్పదె యున్నది* 

*పక్కనె బండ్లుయు నగరులు బాలుయు దేనెల్ ,*

*పక్కెనె యున్నవి యేలకొ ?*

*పక్కన నినుబాయగనవి వట్టివె కృష్ణా !*


 (37 )


🌹🙏🌹( భావము )


పక్కనే చక్కగా మెత్తని పానుపు ఉన్నది.

పక్కనే మధుర ఫలములు ఉన్నవి , సుగంధ పరిమళ ద్రవ్యములున్నవి .

అలాగే గోరువెచ్చని పాలు , తేనియ కూడా ఉన్నాయి .🙏


అవి అన్నీ నా ప్రక్కన ఉండి ఏమి ప్రయోజనము 

పక్కన నువ్వు లేకుండగా *కృష్ణా ?*🙏


🌹🙏🌹


*రెక్కలు జాచిన గోర్కెలు* 

*దిక్కులనన్ని వెదకినవి దేవర నీకై !*

*పెక్కగు నాశల మునిగితి*

*నెక్కుడవీవని పొగడుచు నీకడ కృష్ణా !*

 

( 38 ) 


🌹🙏🌹( భావము )


నా కోరికలు బాగా రెక్కల తొడిగిన రీతిలో వ్యాపిస్తున్నాయి నీ కొరకు .

అవి అన్ని దిక్కులా వెతుకుతున్నాయి , నా దేవుడవైన నిన్నే !🙏


అపరిమితమైన ఆశలలో మునిగిపోయానయ్యా ,

గొప్పవాడవు నాకు నీవే అని , 

నిన్నే పొగుడుకొనుచున్నాను ఇక్కడ *కృష్ణా !* 🙏


🌹🙏🌹


*ఫలము ,సుమము పత్రమునున్*

*జలంబుకైన సరి సంతసపడుదు వకటా !*

*యిల నా మనంబు నర్పణ*

*మెలమిన జేసిన నను గనవేమయ కృష్ణా ?*

 

( 39 ) 


🌹🙏🌹( భావము )


నిన్ను బాగుగా తెలిసిన వారు చెప్పారు .

నువ్వే అన్నావట వారితో .🙏


నీకు ఫలమైనా , పుష్పమైనా , పత్రమైనా , జలమైనా 

ప్రీతితో ఒసగితే సంతోషముగా స్వీకరిస్తావట .🙏


మరి నా మనసునే ఉన్నతముగా నీకే అర్పితము చేసినా ,

నా వైపు అసలు చూడను కుడా చూచుటలేదు ఎందుకు *కృష్ణా ?*🙏


🌹🙏🌹


*తింటివొ లేదో యనుచున్*

*గంటన నొత్తులనువెట్టి గాంచుచు నీకై*

*యింటన నుండిన వనితను*

*నొంటరి తనమున నొదులుట యొప్పా కృష్ణా ??*


 ( 40 ) 


🌹🙏🌹( భావము )


ఎమన్నా అసలు తిన్నావో లెదో అని ,

నా కంటిలో వత్తులు వేసుకొని మరీ వేచి చూస్తున్నాను నీకొరకే ! 🙏


ఇంట్లోన బిక్కుబిక్కు మంటూ ఉంటున్న నన్ను ,

ఇలా వదిలివేయుట సరియైనదేనా *కృష్ణా ?*


🌹🙏🌹


*హరే కృష్ణ ! హరే కృష్ణ !* 🙏


పద్యములు  41 to 50  రేపటి శీర్షికలో .....


మీ ఆశీర్వాదములను కోరుకొనుచూ ..


మీ సూచనలు అభిప్రాయములు సదా స్వాగతిస్తూ ...


భవదీయుడు 


✍ *-- వేణుగోపాల్ యెల్లేపెద్ది*

 *_ॐ卐 -|¦¦| సుభాషితమ్ |¦¦|- ॐ卐_*

𝕝𝕝 శ్లో 𝕝𝕝 

*తపోబలం తాపసానాం*

*బ్రహ్మ బ్రహ్మవిదాం బలమ్|*

*హింసా బలమసాధూనాం*

*క్షమా గుణవతాం బలమ్||*

(సుభాషితరత్నకోశః)


𝕝𝕝తా𝕝𝕝 

తాపసులకు తపస్సు బలం. బ్రహ్మవేత్తలకు వేదమే బలం. పాపాత్ములకు హింస బలం. గుణవంతులకు సహనమే బలం.

 *1985*

*కం*

సుతగణముల చెంతనె(యెదుటనె) సతి

పతినట చులకనగజూడ పసిహృదయములౌ

సుతజనములు జనకునెటుల

మతిభక్తిన కొలువగలరు మహిలో సుజనా.

*భావం*:-- ఓ సుజనా! తమ పిల్లల ముందే భార్య తనభర్తను చులకనగా చూస్తే పసిహృదయాలైన ఆ పిల్లలు తమ తండ్రి ని ఏవిధంగా మనఃపూతమైన భక్తి తో పూజించగలరు!!??.

*సందేశం*:-- మాతృదేవోభవ అని పిల్లలు ముందు గా తల్లి ని పూజిస్తారు, అప్పుడు ఆ తల్లి ఆ పిల్లల కు తమ తండ్రి పూజనీయము ను తెలుపవలెను,అలా పితృదేవోభవ అని పిల్లలు తెలుసుకొనగలరు,ఆ తదుపరి తల్లిదండ్రులు ఇరువురు నూ గురువు యొక్క గొప్పదనాన్ని తెలుపగా ఆచార్య దేవోభవ అని తెలుసుకొనగలరు. అంటే బాధ్యత గల తల్లి తన పిల్లల ముందు ఎన్నడూ పతిదూషణ చేయరాదు. ఇది ఈనాడు ప్రతీ కుటుంబమునకూ తెలియవలసినదని నా అభిప్రాయం.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*