20, ఏప్రిల్ 2024, శనివారం

పంచాంగం

 ॐశుభోదయం, పంచాంగం ॐ  

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

     *_ఏప్రిల్ 19, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*చైత్ర మాసం*

*శుక్ల పక్షం*

తిథి: *ఏకాదశి* రా8.44

వారం: *భృగువాసరే*

(శుక్రవారం)

నక్షత్రం: *మఖ* ఉ11.55

యోగం: *వృద్ధి* రా2.30

కరణం: *వణిజ*  ఉ7.50

&

*భద్ర* రా8.44

వర్జ్యం: *రా8.46-10.32*

దుర్ముహూర్తము: *ఉ8.15-9.04*

&

*మ12.23-1.13*

అమృతకాలం: *ఉ9.17-11.03*

రాహుకాలం: *ఉ10.30-12.00*

యమగండం: *మ3.00-4.30*

సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *సింహం*

సూర్యోదయం: *5.46*

సూర్యాస్తమయం: *6.12*


      🙏 *సర్వ ఏకాదశి* 🙏


           *లోకాః సమస్తాః*

           *సుఖినోభవంతు*

కష్టాలు ఎదురైనప్పుడు

 మనకి కష్టాలు ఎదురైనప్పుడు మనకి మూడు లాభాలు కలుగుతున్నాయి.```



 

1.మనం గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణం తీరిపోతున్నది.```


2.వాటిని ఎదిరిస్తున్నప్పుడు మనలో అంతర్గతంగా ఉన్న శక్తులు వెలికి వస్తాయి. సాధన వలన మరింతగా ప్రకాశిస్తాయి.```


  

3.ఈ శక్తులు మన వర్తమానం లోనూ భవిష్యత్తులోను గొప్ప సత్కర్మ చేసే అవకాశం మనకిస్తాయి.


ఈ పనే పాండవులు చేశారు. మనం మాత్రం ఎందుకు చేయకూడదు.


మహర్షులు, యోగులు కర్మలనుండి ఎలా తప్పించుకోవాలా? అని ఎప్పుడు ఆలోచించలేదు. కర్మ క్షాళనం కోసం తపించారు. వారు అనుసరించిన పద్ధతినే మనం కూడా అనుసరించ వచ్చును.


మనం గత జన్మల్లో చేసుకున్న పాప రాశి కొండంత ఉంటుంది. దీనిని చాలా నెమ్మదిగాను, వాటినుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటే ఈ కర్మ భారం వచ్చే జన్మలకి వాయిదా పడి ఇంకా జన్మలు పెరిగి పోతాయి.


విష్ణుమూర్తి ద్వారపాలకులు అయిన జయవిజయులని


మూడు జన్మల్లో హరి వైరులుగా మారి, శ్రీహరి తో చంపబడి వైకుంఠం చేరతారా? లేదా ఏడు జన్మల్లో హరిభక్తులు గా జన్మించి వైకుంఠం చేరతారా? అని అడిగితే


వారు ఏడు జన్మల హరి విరహం భరించలేము. ఏడు జన్మల సుదీర్ఘ కాలం భరించలేము అన్నారు.


మనం మాత్రం మన కర్మాభారాన్ని కొద్ది జన్మల్లోనే వదిలించు కోవద్దూ? దీనికి మనం ఏమి చేయాలి. దీనికి శ్రీకృష్ణుడు ఒక మహాద్భుత మార్గాన్ని సూచించాడు.```

               

                                                  

ఎవరి సమస్త కర్మలు కోరిక సంకల్పం లేకుండా ఉంటాయో, వారి కర్మలు జ్ఞానం అనేయగ్ని చేత దహించబడతాయి.```

                  

                                                                  అర్జునా! బాగా ప్రజ్వలింప చేయబడిన అగ్ని కట్టెలని ఏ విధంగా బూడిద చేయగలుగుతుందో, మనం సంపాదించిన జ్ఞానం మన సర్వకర్మలని బూడిద చేయగలుగుతుంది.


జ్ఞానం మనలో అగ్నిలా జ్వలిస్తే… మన కర్మలు మనలని బాధించలేవు. మనం గతంలో ఎవరినో మానసికంగా హింసిస్తే, ఇప్పుడు వారు తిరిగి ఆ కర్మ మనకి ప్రసాదించడానికి వచ్చారు.


మనం ఈ కర్మ రహస్యాన్ని.. జ్ఞానాన్ని పొందితే మన పెదవులపైన చిరునవ్వే ఉంటుంది కదా! కర్మలు వస్తాయి, మనలని చుట్టుముడతాయి. అవి మనపైన ఏ ప్రభావం చూపవు.

*జ్ఞానం చేత ఆ కర్మ దగ్ధమయింది కదా.*


🙏🏻🌷🙏🌷🙏

నడుము నొప్పికి

https://www.facebook.com/reel/2153634395007379?mibextid=rS40aB7S9Ucbxw6v 

లోకేశ్వరునకు అంజలి!!

 లోకేశ్వరునకు అంజలి!!


"ఎవ్వనిచే జనించు ?జగమెవ్వని లోపలనుండు లీనమై,?

ఎవ్వనియందు డిందు,? పరమేశ్వరుడేవ్వడు,?మూలకారణం,

బెవ్వ,?డనాది మధ్య లయుడేవ్వడు, ?సర్వము తావెయైనవా,

డెవ్వడు,?వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదవ్;


లోకమంతా ఎవనిచే సృష్టింపబడుచున్నదో,?పోషింపబడుచున్నదో,?లయింపబడుచున్నదో,?


పుట్టుట, పెరుగుట,గిట్టుటలు యెవనితిలేవో,?

ఎవనియందీసృష్టి పరివృధ్ధినొందుచున్నదో,?పరమేశ్వరుడెవ్వడో,సకలమునకూ మూలకారణమెవ్వడో,?నాహృదయమున చైతన్యరూపుడైనిలచిన ఆసర్వేశ్వరుని శరణువేడెదను.!!


       బమ్మెఱపోతన భాగవతములోని గజేద్రుని ప్రార్ధనమిది.

       గజేంద్రుడు  సకలజీవకోటికి ప్రతినిధి

.అహంకారమున్నంతవరకూ పరమేశ్వరుడు గుక్తుకురాడు.

అహంకారమణగినంతవే జీవునకు పరమాత్మజ్ఙప్తికి వచ్చును.

సహజమైన యీపరిణామమును పోతన కడుంగడు సహజముగా చిత్రించి నాడు.


          మనమందరము గజేంద్రులమే! భోగపరాయణులమైఅహంకార మమకారములలో మునిగి,యాదేవదేవునకు నానాటికి దూరమవుచున్నాము.

ఒక్కసారి మనయాత్మలను పరిశీలించికొందము.మరచిన యాపరమేశ్వరుని పాదపద్మములకు ప్రణమిల్లి,మనలోనియహంకారరూపమైన గ్రాహమును పరిమార్చి, భవసాగర  తరణము నొనరింజేసి రక్షింపు మనిశరణువేడెదముగాక!

                           స్వస్తి!🙏🙏👍🌷🌷🌷

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం  -‌ ద్వాదశి - పూర్వాఫల్గుని -‌‌ స్థిర వాసరే* *20-04-2024.* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*20-04-2024 / శనివారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు. పుణ్య క్షేత్రాలు సందర్శించుకుంటారు.

---------------------------------------

వృషభం


ఉద్యోగస్తులు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి.

---------------------------------------

మిధునం


నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

---------------------------------------

కర్కాటకం


మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

---------------------------------------

సింహం


వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

---------------------------------------

కన్య


చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలోఅధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి.

---------------------------------------

తుల


పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. నూతనవాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

---------------------------------------

వృశ్చికం


ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో కొందరు ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు.

---------------------------------------

ధనస్సు


ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. పాత మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి.

---------------------------------------

మకరం


వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులకు వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపుబాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు.

---------------------------------------

కుంభం


కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి.అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది.వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు.

---------------------------------------

మీనం


అవసరానికి ధన సహాయం లభిస్తుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

మూర్ఖుని మనసు

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

      🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝. 

*శక్యో వారయితుం జలేన హుతభుక్చత్రేణసూర్యాతపో*

*నాగేంద్రో నిశితాంకుశేన సదండేన గౌర్గర్దభః*

*వ్యాధిర్భేషజ సంగ్రహైశ్చ వివిధైర్మన్త్ర ప్రయోగైర్విషం*

*సర్వస్వౌషధమస్తి శాస్త్ర విహితం మూర్ఖస్య నాస్త్వౌ షధం!!*


  నీటితో నిప్పును, గొడుగుతో సూర్యుణ్ణి, ముల్లుకర్రతో ఎద్దును, గాడిదలనూ,అంకుశంతో మదపుటేనుగును, ఔషధంతో రోగాన్ని, మంత్ర ప్రయోగంతో విషాన్ని చక్కబరచవచ్చు.... కానీ, *మూర్ఖుని మనసును మాత్రం ఏ విధంగానూ సరిచేయలేము*..

19, ఏప్రిల్ 2024, శుక్రవారం

Joke


















 

బ్రహ్మరాక్షసత్వము

 "అకృత ప్రాయశ్చితాః, అప్రతిగ్ర్రాహ్య ప్రతిగ్రాహ్యః, ఆయాజ్యయాజనాధిపాపైః, రాక్షసత్వం ప్రాప్తాః, బ్రాహ్మాణాః బ్రహ్మరాక్షసాః""


చేయకూడని పనులు చేసిన వాటికి ప్రాయశ్చితాలు చేసుకొననివారు,ఏది పడితే అది దానము పుచ్చుకొనేవారు అనగా గ్రహింపకూడనివి గ్రహించేవారు, అనర్హులచే యజ్ణకార్యములు చేయించేవారు వారు బ్రాహ్మణులైనా బ్రహ్మరాక్షసులవుతారు""(గోవింరాజీయ వ్యాఖ్యానము నుండి)


రామాయణము బాలకాండములో దశరథమహారాజు పుత్రకామేష్టికై అశ్వమేధయాగము చేయతలపెట్టి వశిష్టాది మహర్షులందరి సమక్షములో తన కోరిక తెల్పి దీవెనలు పొందుతాడు. సరయూనది తీరమున ఉత్తరదిశగా యజ్ఞభూమిని సిధ్దపరిచి మంచిఋత్విక్కులను ఆహ్వానించి ఆ సందర్భముగ ఇలా అంటాడు.

"" ఛిధ్రం హి మృగయంతే~త్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః||,

నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తాః వినశ్యతి||,(8-17),,

నేను చేసే ఈ యజ్ఞములో ఎటువంటి దోషములు లేని విద్వాసులు ఉన్నారు.అనగా ఈ అశ్వమేధయాగము చేయగలిగిన పండితులు గలరు.అంతేగాని బ్రహ్మరాక్షసత్వము పొందు జ్ఞానహీనులు లేరు.ఇది చాలా క్లిష్టమైన యజ్ఞము.తేలికైనది అయినచో అందరు నిర్వహించెదరు కదా.జాగ్రత్తగా నిర్వహించవలెను.లేనిచో కర్త వెంటనే నశించునని శాస్ర్తోక్తముగ నిర్వహించమని అభ్యర్థిస్తాడు.


రామాయణము చేసేపనులలో అశ్రధ్ద కూడదని,కార్యము చక్కగ నిర్వహించేవారిని ముందుగ మంచి ఎంపిక చేసుకోవాలని పైన చెప్పినట్లు బ్రహ్మరాక్షసత్వాన్ని పొందగల అవకాశమున్న ఋత్విజ్ఞులను యాగాలకి దూరముగ ఉంచాలని హెచ్చరిస్తున్నది.

కాశ్మీరు ఎవరిది ?

 _*కాశ్మీరు ఎవరిది ?*_ 


_-{ప్రతి భారతీయుడు తెలుసుకోవలసిన చరిత్ర}-_


_ఇది, కశ్యప మహర్షి పేరుతో ఏర్పడిన ప్రదేశము. "మైరా" అనే సంస్కృత పదానికి అర్థము "సరోవరము"._


_ఈ మన్వంతరములోని సప్త ఋషులలో ఒక్కరు కశ్యపుడు. ఇతడు బ్రహ్మ దేవుని మనవడు. ఇతడి తండ్రి మరీచి మహర్షి. ఈ మరీచి, బ్రహ్మ దేవుని మానస పుత్రుడు. దక్ష ప్రజాపతి తన పదముగ్గురు కుమార్తెలనూ కశ్యప మునికి ఇచ్చి వివాహము చేశాడు. కశ్యప గోత్రము ఆరంభమయ్యేదే ఇక్కడి నుండే ! వీరి సంతానములో, దేవతలు, దైత్యులు, దానవులు, నాగులు, మానవులు-మొదలుగా సర్వజీవులూ చేరి ఉన్నారు._ 


_నీలమత పురాణము ప్రకారము, ఇప్పటి కాశ్మీర్ ఉన్న ప్రదేశములో ’సతీసరము’ అనే అతిపెద్ద సరోవరము వుండేది. శివుడు, సతీదేవి - ఇద్దరికీ అది చాలా ఇష్టమైన సరోవరము అయినందువల్ల కశ్యపుడు ఈ సరోవరాన్ని వారికి బహుమానముగా ఇచ్చాడు. అయితే ఆ సరోవరములో ’జలోద్భవుడు’ అనే రాక్షసుడు దాగిఉండి, కశ్యపుడి సంతానాన్ని వేధించేవాడు. అప్పుడు, కశ్యపుడు, తన కొడుకైన ’అనంత నాగుడి’తో కలసి, ఒక వరాహ ముఖము [ఇప్పటి బారాముల్లా] అనబడు కాలువను తవ్వి, ఆ సరోవరపు నీటిని బయటికి ప్రవహింపజేశాడు. ఈ విధముగా ప్రవహించిన నీరు పశ్చిమములోనున్న మరొక కాలువ కు చేరుతుంది. దానిని కశ్యప సాగరము [ఈనాటి కాస్పియన్ సముద్రము] అని పిలుస్తారు._


_ఆ తరువాత సరోవరము నుండీ బయట పడిన జలోద్భవుడిని విష్ణువు సంహరించాడు. ఇలాగ నిండుకున్న సరోవరపు ప్రక్కన ’వేద వ్యాసంగముల కోసము’ విశేషముగా ఒక పవిత్ర క్షేత్రాన్ని నిర్మించారు. దానిని "కశ్యప మైరా" అని పిలిచేవారు. అదే కాలక్రమేణా *’కశ్యమైరా’* అనీ, *"కశ్మీర"* అనీ నామాంతరము చెందింది._ 


_ఈ సుందర కాశ్మీరమును చూచుటకు గౌరీదేవి, గణపతితో పాటు హిమాఛ్చాదితమైన ఒక పర్వత మార్గము ద్వారా తరచు వచ్చేది. దానిని "గౌరీ మార్గ" అని పిలిచేవారు. అదే నేటి *గుల్మార్గ్*._


_’నీలమతి పురాణము ’ మరియూ దాని ఆధారముగా లిఖింపబడిన " రాజతరంగిణి" --ఇవి, కాశ్మీరపు పౌరాణిక మరియూ ఐతిహాసిక దాఖలాలు._ 


_పన్నెండవ శతాబ్దములో "కల్హణుడు" అనే పండితుడు వ్రాసిన గ్రంధాల శృంఖల, విశ్వములోని అన్ని చోట్లా అత్యంత కుతూహలముతోను, శ్రద్ధాభక్తులతోను అభ్యసించబడుతున్నాయి. భారత్ లో దీని గురించి ఎవరూ ఎక్కువగా పట్టించుకొనుట లేదు. ఎందుకంటే, మాధ్యమాలు ప్రతిబింబించే కాశ్మీరు పూర్తిగా వేరే. *కాశ్మీరు హిందువులది అంటే నమ్మే పరిస్థితి నేడు హిందువులలోనే లేదు. దురదృష్టము...!*_


_*ఇది ఎవరి కాశ్మీరము ?*_ 


_ఇది శారదాదేవి యొక్క కాశ్మీరము._ 

_|| నమస్తే శారదా దేవి కాశ్మీర పురవాసిని|_

_త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే ||_

_ఇలాగ శారదా దేవిని స్తుతి చేసేది’ కాశ్మీర పురవాసిని’ అనే !కాశ్మీరపు లిపి ఏమిటో తెలుసా ? అది ’శారదా లిపి’ > అప్పటి కాశ్మీర వేద విద్యాలయాలను ఏమని పిలిచేవారు ? ... *"శారదా పీఠము"*._


_ఇదంతా ఎందుకు ? ఆనాడు పూర్తి కాశ్మీరాన్నే "శారదా దేశము" అని పిలిచేవారు. కాకపోతే, శంకరాచార్యులు కాశ్మీరానికి ఎందుకు వెళ్ళేవారు ..? అక్కడి కృష్ణగంగా నది యొక్క తీరములోనున్న శారదాపీఠపు సొగసును చూసి, అదే పద్దతిలో దానిని ప్రతిబింబించేలాగ ఇంకొక శారదా పీఠాన్ని తుంగభద్రా తీరపు శృంగేరిలో స్థాపించుటకు ప్రేరణ దొరికినది ఆ కాశ్మీర శారదాపీఠము వల్లనే !శారదాదేవి యొక్క శ్రీగంధపు మూల విగ్రహాన్ని కాశ్మీరు నుండే శృంగేరికి తరలించినారట._ 


_కాశ్మీరానికి తమ కొందరు శిష్యులతోపాటు వెళ్ళిన కొత్తలో శంకరాచార్యులు, ఒక కాశ్మీరీ పండితుడి అతిథిగా ఉన్నారు. మొదటి దినమే శంకరాచార్యుల పాండిత్యానికి విస్మయము చెందిన ఆ పండిత దంపతులు, వారిని మరి కొంతకాలము తమ అతిథిగా ఉండి సత్కారాలను స్వీకరించమని మనవి చేసుకున్నారట. దానికి ఒప్పుకున్న శంకరాచార్యులు, ఒక నిబంధన పెట్టారు. ఏమనగా, ’నా వంట నేనే చేసుకుంటాను ’ అని._ 


_ఇది ఆ పండిత దంపతులకు కొంత అవమానకరముగా తోచిననూ, వారిష్ట ప్రకారమే, కావలసిన సంభారములనూ, వంటపాత్రలు, వంట చెరకు లను ఇచ్చి విరమిస్తారు. అయితే వంట చేయుటకు కావలసిన అగ్నిని ఇవ్వడము మరచిపోయారు. మరొకసారి ఆ దంపతులను పిలచి ఇబ్బంది పెట్టరాదని తలచి శంకరాచార్యులు, అలాగే ఆకలితో నకనకలాడుతూనే పడుకుని నిద్రించారు._ 


_మరునాడు ఆ పండిత దంపతులు వచ్చి నమస్కరించి మాట్లాడిస్తుండగా, వంట సామగ్రి అంతా అలాగే పడి ఉండుట గమనించి, ’ఎందుకని’ విచారించగా, వారి శిష్యులు, అగ్నిలేని కారణాన శంకరాచార్యులు వంట చేసుకోలేదు-అని సమాధానమిచ్చారు._ 


_తక్షణమే ఆ గృహిణి, అక్కడే ఉన్న నీటిని ఆ కట్టెలమీద చిలకరించగానే ఆ కట్టెలు అంటుకొని మండనారంభించాయి. ఈ ప్రహసనము వల్ల, శంకరాచార్యులకు, తాము ఇంకా చాలా నేర్చుకోవలసినది ఈ శారదా దేశములో ఉంది- -అనిపించి, ఇంకొన్ని దినాలు అక్కడే నివశించారు._ 


_వారు నిలచిన ఆ ప్రదేశము -ఒక గుట్ట -ను ఈనాటికీ శంకరాచార్య గుట్ట అనే పిలుస్తారు. ఆ పేరుతోనే అది ప్రసిద్ధమైనది. అదొక పుణ్యక్షేత్రము అనిపించుకున్నది. ఇది శ్రీనగరపు నట్ట నడుమ ప్రసిద్ధమైన *’దాల్ ’* సరోవరము ప్రక్కనే ఉంది._ 


_*ఆనాటి శారదాపీఠము, దురదృష్టవశాత్తూ ఇప్పటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉంది. అక్కడికి వెళ్ళుటకు ఎవరికీ అనుమతి లేదు.*_ 

_[ఈ శారదాపీఠపు శిథిల చిత్రాలు ఈ మధ్యనే ఎవరో పోస్ట్ చేశారు.. ఉన్నవారు పంచుకోగలరు]_ 

_ఆ శారదా పీఠము శిథిలమై, దినదినానికీ కుంగిపోవుతున్నది._ 


_"విశిష్టాద్వైతము" అనే సిద్ధాంతము, "నాథ ముని" ద్వారా ప్రారంభమైనది అని ఉల్లేఖనములు ఉన్నాయి. దానిని యమునాచార్యులు విస్తరించినారు. మరియూ రామానుజాచార్యులు బ్రహ్మసూత్రపు చౌకట్టులో ప్రతిపాదించి, "శ్రీ భాష్యము" అనే మేరు గ్రంధాన్ని సృష్టించారు. ఇదే, శ్రీవైష్ణవుల మూలగ్రంధము. ఇటువంటి మహద్గ్రంధాన్ని సృష్టించుటకే రామానుజులు తమ శిష్యుడైన ’కురుత్తాళ్వార్' [ఖురేషీ ] తో కలసి బ్రహ్మసూత్రాన్ని వెదకుతూ కాశ్మీరానికి వెళ్ళారు. వారికి అప్పటికే అరవై యేళ్ళు !_

_ఇది మన కాశ్మీరు చరిత్ర !_

  సేకరణ!