14, సెప్టెంబర్ 2026, సోమవారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము



రసోఽహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయోః ।

ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ।। 8 ।।



ప్రతిపదార్థ:


రసః — రుచి; అహం — నేను; అప్సు — నీటిలో; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; ప్రభా — తేజస్సు; అస్మి — నేను; శశి-సూర్యయోః — సూర్య చంద్రులలో; ప్రణవః — పవిత్రమైన 'ఓం' కారము; సర్వ — సమస్త; వేదేషు — వేదములు; శబ్దః — శబ్దము; ఖే — ఆకాశంలో; పౌరుషం — సామర్థ్యము; నృషు — మనుష్యులలో.




తాత్పర్యము:



నీటి యందు రుచిని నేను, ఓ కుంతీ పుత్రుడా, మరియు సూర్య చంద్రుల యొక్క తేజస్సుని నేను. వేదములలో నేను పవిత్ర 'ఓం' కారమును (ప్రణవము); ఆకాశములో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును.



వివరణ :


తానే అన్నిటికీ మూలము మరియు ఆధారము అని చెప్పిన పిదప, శ్రీ కృష్ణుడు ఇప్పుడు తను చెప్పిన దానిలో ఉన్న యదార్థమును ఈ నాలుగు శ్లోకాలలో చెప్తున్నాడు. మనం పండ్లు తిన్నప్పుడు, ఆ రుచిలో ఉన్న తియ్యదనం, అందులో చక్కెర ఉంది అన్న విషయాన్ని సూచిస్తుంది. అదే విధంగా, శ్రీ కృష్ణుడు తన శక్తి యొక్క సమస్త రూపాంతరాలలో తన ఉనికిని ప్రకటిస్తున్నాడు. అందుకే, నీటి యందు ఉన్న రుచి తనే అంటున్నాడు, అది దాని ప్రత్యేక సహజ స్వభావము. ఎవరైనా నీటి యొక్క రుచిని నీటి నుండి వేరు చేయగలరా? మిగతా అన్ని భౌతిక శక్తి స్వరూపాలు - వాయువులు, అగ్ని, ఘన పదార్థములు – వీటికి తమ రుచిని వ్యక్తీకరించటానికి నీరు కావాలి. తేమ లేని (ఎండిన) నాలుకపై ఎదైనా ఘనపదార్థమును పెట్టి ప్రయత్నించండి, మీకేమీ రుచి తెలియదు. కానీ, ఘన పదార్థములు నోటిలోని లాలాజలములో కరిగినప్పుడు, వాటి యొక్క రుచి నాలిక పైనున్న రసాంకురములకు (taste buds) తెలుస్తుంది.


అదే విధంగా, ఆకాశము శబ్దమునకు వాహకం లాగా పని చేస్తుంది. శబ్దమే ఎన్నో రకాల భాషలుగా రూపాంతరం చెందుతుంది, మరియు శ్రీ కృష్ణుడు తనే వీటన్నిటికి మూలాధారము అని వివరిస్తున్నాడు, ఎందుకంటే ఆకాశంలో ఉండే శబ్దము తన శక్తి స్వరూపమే. ఇంకా, తనే వేద మంత్రాలకు ముఖ్యమైన 'ఓం' కారమును (ప్రణవము) అని అంటున్నాడు. సమస్త మానవులలో వ్యక్తమయ్యే సామర్థ్యానికి కూడా శ్రీ కృష్ణుడే మూల శక్తి.

14సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

    🕉️ *ఇందువారం*🕉️

  *🌹14సెప్టెంబర్26🌹*  

   *దృగ్గణిత పంచాంగం*       

                  

      *🪷వినాయక చవితి🪷* 

*🙏వరసిద్ధి వినాయక వ్రతం🙏* 


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - శుక్లపక్షం* 


*తిథి : తదియ* ఉ 07.06 వరకు ఉపరి *చవితి*

*వారం: సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : చిత్త* మ 01.55 వరకు ఉపరి *స్వాతి*

*యోగం : బ్రహ్మ* మ 12.47 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం  : గరజి* ఉ 07.06 *వణజి* రా 07.20 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ11.00-12.00 సా04.00-05.00*

 అమృత కాలం  : *ఉ 07.18 - 08.57*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.27*

*వర్జ్యం    : రా 07.51 - 09.33*

*దుర్ముహూర్తం  : మ 12.27- 01.16 & 02.54 - 03.43*

*రాహు కాలం   : ఉ 07.27- 08.59*

గుళికకాళం      : *మ 01.35 - 03.07*

యమగండం    : *ఉ 10.31 - 12.03*

సూర్యరాశి : *సింహం*                           

చంద్రరాశి : *తుల* 

సూర్యోదయం :*ఉ 06.04* 

సూర్యాస్తమయం :*సా 06.19*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం :*ఉ 05.55 - 08.22*

సంగవ కాలం        : *08.22 - 10.49*

మధ్యాహ్న కాలం    : *10.49 - 01.16*

అపరాహ్న కాలం  : *మ 01.16-03.43*

*ఆబ్ధికం తిధి :భాద్రపద శుద్ధ చవితి*

సాయంకాలం    : *సా 03.43 - 06.10*

ప్రదోష కాలం     : *సా 06.10 - 08.32*

రాత్రి కాలం         : *రా 08.32- 11.39*

నిశీధి కాలం       : *రా 11.39 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


       🕉️ *ఓం నమః శివాయ*🕉️


*🪷ఓం నమో విజ్ఞరాజాయ నమః🙏*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


           🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

తెలుగు నేర్చుకోండి

 తెలుగు నేర్చుకోండి




 మన తెలుగు వాళ్ళు ఎన్నో దేశాలలో ఉండి నిత్యం ఈ బ్లాగును చూస్తున్నా వాళ్ళు, వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పాలని అభిలాష ఉండటం సర్వసాధారణం.


కాకపోతే విదేశాలలో తెలుగు నేర్పే వాళ్లు లేరని మీరు సందేహించవచ్చు అటువంటి వాళ్లను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ లో తెలుగు నేర్చుకుందాం అనే కోర్సును ప్రారంభించదల్చాము.




ప్రాథమికంగా తెలుగు మీద అవగాహనసం ప్రత్యేకంగా ఆన్లైన్లో తెలుగు పాఠాలను నేర్పటం కోసం ఈ కోర్సును ఏర్పాటు చేసాము




మీ పిల్లలకు తెలుగు మాట్లాడటం రాయటము నేర్పించదలిచితే వెంటనే కింద కామెంట్ రూపంలో సంప్రదించగలరు మీరు పెట్టే కామెంట్ గోప్యంగా ఉంచబడును అది ఇక్కడ ఎవరికీ కనబడదు కేవలము ఉపాధ్యాయులు గారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మీరు మీ కామెంట్ ల మీ పిల్లల వయస్సు తెలుగుతో వారికి ఉన్న అనుబంధం తెలియచేస్తూ మీ మొబైల్ నెంబరు పేర్కొంటే ఆ నెంబర్కు వాట్సాప్ లో సంప్రదించబడును లేక మీ ఈమెయిల్ ఐడి ఇస్తే దాని ద్వారా సంప్రదించుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే మీరు మీ పిల్లలను ఈ కోర్సులో చేర్పించడానికి ఉద్యోత్తులు కండి.





హనుమాన్ బాహుక్*

 *🕉️ఇందువారం 14 సెప్టెంబర్ 2026🕉️*


**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

              *🍁మూడవ రోజు🍁*


                      *శ్లోకం*

పంచముఖ – ఛముఖ భృగుముఖ్య - భట - అసుర 

-సుర సర్వ –సరి – సమర సమరత సూరో | 

బాంకురో దీర బిరుదైత బిరుదావలీ వేద వందీ వదత పై జపూరో॥

 జాసు గునగాథ రఘునాథ కహ జాసు బల

విపుల జల - భరిత జగ - జలధి ఝూరో ।

దువన - దల - దమనకో కౌన్ తులసీస హై 

పవనకో పూత రజపూత రూరో ॥


ప్రతిపదార్థం (పదాల అర్థాలు)


* **పంచముఖ** = ఐదు ముఖములు గలవాడా (పంచముఖ హనుమంతుడు),

* **ఛముఖ** = ఆరు ముఖములు గల కుమారస్వామి (షణ్ముఖుడు),

* **భృగుముఖ్య** = భృగు వంశంలో శ్రేష్ఠుడైన పరశురాముడు,

* **భట** = గొప్ప యోధులు,

* **అసుర** = రాక్షసులు,

* **సుర** = దేవతలు,

* **సర్వ** = వీరందరితో,

* **సరి** = సమానంగా,

* **సమర సమరత** = యుద్ధ రంగంలో పోరాడగల,

* **సూరో** = శూరుడైనవాడా!

* **బాంకురో** = అత్యంత పరాక్రమవంతుడా/వీరుడా,

* **దీర (ధీర)** = ధైర్యశాలియా,

* **బిరుదైత బిరుదావలీ** = కీర్తి ప్రతిష్టలు, బిరుదుల సమూహం గలవాడా,

* **వేద వందీ వదత** = వేదములు మరియు బంధీజనులు (స్తుతించేవారు) ఎవరి కీర్తిని గానం చేస్తారో,

* **పై జపూరో** = తన ప్రతిజ్ఞను పూర్తిగా నెరవేర్చేవాడా!

* **జాసు గునగాథ** = ఎవరి గుణగాథలను (కీర్తిని),

* **రఘునాథ కహ** = స్వయంగా శ్రీరామచంద్రుడే కొనియాడాడో,

* **జాసు బల** = ఎవరి అపారమైన బలమును చూసి,

* **విపుల జల-భరిత** = విశాలమైన నీటితో నిండిన,

* **జగ-జలధి** = ప్రపంచం అనే సముద్రం (లేదా లంకను ఆవరించిన సముద్రం),

* **ఝూరో** = ఎండిపోయిందో/భయపడిందో,

* **దువన-దల-దమనకో** = శత్రు సైన్యాన్ని సంహరించడంలో,

* **కౌన్ తులసీస హై** = తులసీదాసు నాథుడైన (హనుమంతుడి) తో సమానమైనవారు ఎవరున్నారు?

* **పవనకో పూత** = పవన పుత్రుడా (వాయునందనా),

* **రజపూత రూరో** = క్షత్రియ తేజస్సుతో ప్రకాశించే అత్యంత సుందరుడైన వీరుడా!


**భావం**

పంచముఖుడగు పరమేశ్వరుడు, షణ్ముఖుడగు

కుమారస్వామి, పరశురాముడు వంటివారు దేవతలు, రాక్షసులు ఎందరు యుద్ధమున ఎదురు నిలచినను విజయమును సాధింప గలవాడని వీరధీరునిగా ఆతని బిరుదావళిని వేదరూపులగు వందిజనము కీర్తించుచున్నారు. అతని పరాక్రమముచే అపారమగు సంసారజలధి యింకిపోయెనని ఆతని గుణగాథను స్వయముగా శ్రీరామచంద్రుడే పొగెడెను. అట్టి తులసీదాసుయొక్క స్వామియు, సుందరరూపుడు అగు పవనసుతుడను రాజకుమారుడు దప్ప రాక్షస సేనను నాశనముచేయగల వా డెవడున్నాడు?( లేడని యర్థము).


 **తాత్పర్య**


ఈ సవయ్యాలో తులసీదాస్ గారు హనుమంతుడిని సృష్టిలోని అత్యంత శక్తివంతమైన శక్తులతో పోలుస్తూ, ఆయన అందరి కంటే సర్వశ్రేష్ఠుడని కొనియాడారు.


1. వీరాధివీరులతో పోలిక


పంచముఖ – ఛముఖ భృగుముఖ్య - భట - అసుర -సుర సర్వ –సరి – సమర సమరత సూరో |


యుద్ధరంగంలో పంచముఖ శివుడు, షణ్ముఖుడు (ఆరు ముఖాల కార్తికేయుడు), భృగువంశ శ్రేష్ఠుడైన పరశురాముడు, అలాగే లోకంలో ఉన్న గొప్ప గొప్ప యోధులు, అసురులు (రాక్షసులు), సురులు (దేవతలు) — వీరందరితో ఒంటరిగా, సమానంగా తలపడి విజయం సాధించగల ఏకైక మహాశూరుడు హనుమంతుడు. వీరందరి శక్తులు ఒకెత్తయితే, హనుమ బాహుబలం ఒకెత్తు.


 2. ప్రతిజ్ఞా పాలకుడు


 బాంకురో దీర బిరుదైత బిరుదావలీ వేద వందీ వదత పై జపూరో॥


హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, పరమ ధీరుడు. వేదాలు, పురాణాలు ఎవరి మహిమను నిరంతరం గానం చేస్తాయో అలాంటి బిరుదాంకితుడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన **"పై జపూరో"** — అంటే ఒకసారి పట్టిన పట్టును, చేసిన ప్రతిజ్ఞను ప్రాణమున్నంత వరకు నెరవేర్చే సత్యసంధుడు (రామకార్యం కోసం సముద్రాన్ని దాటడం, సంజీవని తెవడం దీనికి ఉదాహరణలు).


 3. శ్రీరాముడే కొనియాడిన గుణనిధి


 జాసు గునగాథ రఘునాథ కహ జాసు బల విపుల జల - భరిత జగ - జలధి ఝూరో 


ఎవరి గుణాలను, సేవను స్వయంగా సృష్టికర్త అయిన శ్రీరామచంద్రుడే స్వనోటితో ప్రశంసించాడో, అలాంటి మహనీయుడు హనుమ. సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు లంకకు వెళ్లేందుకు సముద్రాన్ని లంఘిస్తున్నప్పుడు, ఆయన వేగానికి, బలానికి భయపడి ఆ అపార జలరాశి గల సముద్రమే వణికిపోయింది (ఇక్కడ "ఝూరో" అంటే భయంతో ఎండిపోవడం లేదా క్షీణించడం అనే భావం వస్తుంది).


4. అద్వితీయ రక్షకుడు


 దువన - దల - దమనకో కౌన్ తులసీస హై పవనకో పూత రజపూత రూరో ॥


దుష్టశిక్షణలో, శత్రువుల సైన్యాన్ని సర్వనాశనం చేయడంలో తులసీదాసు స్వామియైన హనుమంతుడితో సమానమైన వారు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. వాయుపుత్రుడైన ఆ హనుమ, క్షత్రియ తేజస్సుతో (రజపూత) వెలిగిపోతూ, భక్తుల పాలిట అత్యంత సుందరమైన, మంగళకరమైన రూపంలో దర్శనమిస్తాడు.


 **సందర్భం - సాధన:**

 ఈ 3వ రోజు చరణాన్ని పఠించడం వల్ల శరీరంలోని దీర్ఘకాలిక నొప్పులు, శారీరక బలహీనతలు తొలగిపోయి, హనుమంతుని అనుగ్రహంతో అపారమైన ధైర్యం, రక్షణ, శత్రు బాధల నుండి విముక్తి లభిస్తాయి.


🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹


          *🕉️సేకరణ🕉️*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

13, సెప్టెంబర్ 2026, ఆదివారం

ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు

 


 విదేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్లు, సంగీత ప్రియులు సంగీతం నేర్చుకోవాలని అభిలాష పడే వారి కోసం ఆన్లైన్లో సంగీత క్లాసులు నిర్వహించడం జరుగుతున్నది .


బాల బాలికలు ఈ క్లాసులు లో చేరవచ్చు .


మీరు మీ కుమార్తెను గాని మీకుమారుని గాని ఈ క్రాసులలో చేర్పించదల్చుకొనిన మీ ఫోను నెంబర్ తో లేక మీ ఈమెయిల్ ఐడి తో కింద కామెంట్ రూపంలో పేర్కొని వివరాల కోసం సంప్రదించగలరు.




మీరు రాసే కామెంట్ ఈ బ్లాగులో కనపడదు పూర్తిగా గోప్యంగా ఉంచబడును .


అది కేవలం టీచర్ గారికి మాత్రమే చేరుతుంది కాబట్టి నిస్సందేహంగా మీరు వివరాల కోసం సంప్రదించండి.


మీరు ఫోన్ నెంబర్ ఇస్తే వాట్సాప్ లో మీకు వివరాలు తెలుపబడును అదే విధంగా ఈమెయిల్ ఐడి ఇస్తే మేలు ద్వారా మీకు వివరాలు తెలుపబడును.


మీకు కర్ణాటక సంగీతం మీద ఏమైనా పట్టు ఉంటే దాని గురించిన వివరాలు కూడా తెలియజేస్తే అనుగుణంగా క్లాసులు ఏర్పాటు చేయబడును ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే వివరాల కోసం సంప్రదించండి


పంచాంగం 13.09.2026 Sunday,

  ఈ రోజు పంచాంగం 13.09.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష ద్వితీయ తిథి భాను వాసర హస్త నక్షత్రం శుక్ల యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి : తృతీయ 



 

నమస్కాచాలా మటుకు కల్తీరః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము


మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ।। 7 ।।



ప్రతిపదార్థ:


 

మత్తః — నా కంటే; పర-తరం — ఉన్నతమైనది; న అన్యత్ కించిత్ అస్తి — వేరైనది ఏదియునూ లేదు; ధనంజయ — అర్జునా, ధనమును జయించేవాడా; మయి — నా యందే; సర్వం — సమస్తము; ఇదం — మనకు కనిపించే ఇవి; ప్రోతం — ఆధారపడి (దూర్చబడి) ఉన్నవి; సూత్రే — దారం పై; మణి-గణాః — పూసలు; ఇవ — లాగా.



తాత్పర్యము:


నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.



వివరణ :


సర్వోత్కృష్ట భగవానుడు శ్రీ కృష్ణుడు ఇక అన్నిటికన్నా ఉత్కృష్టమైన తన అత్యున్నత స్థానం గురించి మరియు తన ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే విశ్వానికి సృష్టికర్త, స్థితికర్త, మరియు లయకర్త. ఆయనే అన్నింటి అస్తిత్వానికి మూలాధారము. దారంలో గుచ్చిన పూసల యొక్క ఉపమానం ఇక్కడ వాడబడింది. అదే విధంగా, జీవాత్మలు తమకు నచ్చినట్టుగా చేసుకునే స్వేచ్ఛ ఉన్నా, దానిని వారికి ప్రసాదించినది భగవంతుడే, అందరిని నిలబెట్టి సంరక్షించేది ఆయనే, మరియు ఆయన యందే అందరూ ఉంటారు. కాబట్టి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య

శక్తిర్వివిధైవ శ్రూయతే (6.8)


‘భగవంతునితో సమానమైనది ఏదీ లేదు, ఆయన కన్నా ఉన్నతమైనది ఏమీ లేదు’


భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం, చాలా మంది మనస్సులో ఉన్న సందేహాన్ని నివృత్తి చేస్తుంది, వారు శ్రీ కృష్ణుడు పరమ సత్యము కాదని, కృష్ణుడికే మూలాధారమైన ఇంకేదో నిరాకార తత్త్వం ఉందని అనుకుంటారు. కానీ, ఈ శ్లోకంలో ఆయన, అర్జునుడి ముందు నిల్చొని ఉన్న తన యొక్క ఈ శ్రీకృష్ణ సాకార రూపంలో ఉన్న అతనే, సర్వోన్నత సర్వోత్కృష్ట పరమ సత్యమని స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ప్రకారంగా, ప్ర-ప్రథమంగా జన్మించిన బ్రహ్మ, శ్రీ కృష్ణుడిని ఈ క్రింది విధంగా స్తుతించాడు.


ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః

అనాదిరాదిర్ గోవిందః సర్వ కారణకారణమ్


(బ్రహ్మ సంహిత 5.1)


‘శ్రీ కృష్ణుడే పరమేశ్వరుడు; ఆయన సనాతనుడు (నిత్యుడు), సర్వజ్ఞుడు, మరియు అనంతమైన ఆనంద స్వరూపుడు. ఆయన ఆది, అంతము లేనివాడు, అన్నిటికి మూలహేతువు, సర్వ కారణ కారకుడు’

12, సెప్టెంబర్ 2026, శనివారం

13సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌞 *భానువారం*🌞

 *🌹13సెప్టెంబర్26🌹*  

   *దృగ్గణిత పంచాంగం*       

                

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - శుక్లపక్షం* 


*తిథి : విదియ* ఉ 07.08 వరకు ఉపరి *తదియ*

*వారం   :ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : హస్త* మ 01.07 వరకు ఉపరి *చిత్త*

*యోగం : శుక్ల* మ 01.43 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : కౌలువ* ఉ 07.08 *తైతుల* రా 07.02 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00-10.00 & 11.00-12.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *ఉ 07.04 - 08.40*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.28*

*వర్జ్యం    : రా 09.23 - 11.02*

*దుర్ముహూర్తం: సా 04.33-05.22*

*రాహు కాలం   : సా 04.39- 06.11*

గుళికకాళం      : *మ 03.07 - 04.39*

యమగండం    : *మ 12.03 - 01.35*

సూర్యరాశి : *సింహం*                    

చంద్రరాశి : *కన్య/తుల*  

సూర్యోదయం :*ఉ 06.04*   

సూర్యాస్తమయం :*సా 06.20*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం   :*ఉ 05.55-08.23*

సంగవ కాలం        : *08.23 - 10.50*

మధ్యాహ్న కాలం    : *10.50 - 01.17*

అపరాహ్న కాలం  : *మ 01.17- 03.44*

*ఆబ్ధికం తిధి :భాద్రపద శుద్ధ తదియ*

సాయంకాలం  :  *సా 03.44 - 06.11*

ప్రదోష కాలం  :  *సా 06.11 - 08.32*

రాత్రి కాలం     :  *రా 08.32 - 11.40*

నిశీధి కాలం      :*రా 11.40 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🙏 *ఓం నమో సూర్యదేవాయ నమః🌞* 


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

చాలా మటుకు కల్తీ

 మనం తినే మామిడి పండ్లు నూటికి 90 శాతం కార్బెట్ తో పండించినవే అందులో అనుమానమే లేదు

 మనం తినే ఆహారంలో నిత్యం అనేక రకాలైన రసాయనాల కల్తీలతో ఉన్నవే అందుకే మనకు చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఇతర సమస్యలు వస్తున్నాయి 

ముఖ్యంగా మనం వాడే వంట నూనెలు చాలా మటుకు కల్తీ నూనెలే 

మీరు ఒక్క విషయం ఆలోచించండి ఒక కిలో పల్లీలు రెండు వందల రూపాయలు ఉంటే ఒక లీటరు పల్లీ నూనె 150 ,170 రూపాయలకు ఎలా ఇవ్వగలుగుతారు.అంటే అవి నిజంగా స్వచ్ఛమైన నూనెలు కావని వాళ్ళు ఒప్పుకున్నట్లేనా కాదా


 ఒక కిలో పల్లీలను నూనెగా తీస్తే ఒక పావు కిలో నూనె మాత్రమే వస్తుంది అంటే స్వచ్ఛమైన పల్లీలతోటి కిలో నూనె తీయాలంటే నాలుగైదు కిలోల పల్లీల అవసరపడతాయి.

అట్లా చేస్తే మీకు కిలో నూనె ఎనిమిది వందల రూపాయలకి తక్కువకి దొరకదు.

అదే విధంగా ఇతర నునెలలో కూడా చాలా కల్తీలు ఉన్నాయి అని అంటున్నారు.

ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే మనం వాడే పాలలో యూరియా వంటి కెమికల్స్ తోటి తయారు చేస్తున్నారట.అది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.


ఇది ఇట్లా ఉంటే నేను మాకు దగ్గరలో ఉన్న పశువుల షెడ్డు నుంచి అప్పుడే తీసిన పాలను తెచ్చుకుంటున్నాను అందులో ఎటువంటి కల్తీ లేదని కూడా మనం అనటానికి వీల్లేదు.

ఎందుకంటే గేదెలకు పాలు రావటానికి ఇంజక్షన్లు చేస్తున్నారు అలానే డ్రైనేజీ నీళ్లలో పెంచిన గడ్డి తినిపిస్తున్నారు.

దానివల్ల ఆ గేదల నుంచి వచ్చే పాలు పూర్తిగా కలిసికతమై ఉంటున్నాయి.


ఇంకా బియ్యానికి వస్తే మనం తినే బియ్యం స్టీమ్డ్ రైస్, హెచ్ఎంటి బియ్యం లను పాత బియ్యంగా విక్రయిస్తున్నారు.


ఆ బియ్యమును పాలిష్ చేసి దాని మీద పూర్తిగా తౌడును తొలగించి తెల్లగా నిగలాడేరట్టు చేయటం వలన బియ్యంలోని పోషక విలువలు పూర్తిగా పోయి కేవలం పిప్పి మాత్రమే మిగులుతున్నది.


మనలో చాలామందికి బి కాంప్లెక్స్ లోపము ఏర్పడటానికి కారణం ఇదే.


మనం తినే ఆహారంలో సరైన విటమిన్లు, ప్రోటీన్లు విలువైన ఆహారపు విలువలు లేని కేవలం పిప్పిని మాత్రమే భుజిస్తున్నాము.


ఇక వాతావరణం విషయానికొస్తే మనం రోజు అనేక రకాల రేడియేషన్స్ కి గురి అవుతున్నాము.


కొన్ని మన ఇంట్లో మనమే సృష్టించుకుంటున్నాము.


ముందుగా బయట రేడియేషన్స్ తేల్చుకుందాం.

మన చుట్టూ అనేక మైక్రోవేవ్ రేడియేషన్లు సెల్ఫోన్ టవర్ల నుండి వెలువడుతున్నాయి.


ఇక రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉండనే ఉన్నది.

మన ఇంట్లో మనం వైఫై ఏర్పాటు చేసుకొని ఆ రేడియేషన్కు కూడా గురి అవుతున్నాము.


ఇది చాలదు అన్నట్లు మనము బ్లూటూత్ పరికరాలను ఉపయోగించి బ్లూటూత్ రేడియేషన్ కూడా కొని తెచ్చుకుంటున్నాము.


ఈ రకమైన రేడియేషన్లు మన శరీరంలో ఉన్న నరాల మీద ప్రభావితం చూపెడతాయి ఇంకా మన రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ మీద కూడా చూపెడతాయి.


సెల్ఫోన్ టవర్లకి దగ్గరగా ఉన్న మానవులకి మైక్రోవేవ్ రేడియేషన్ వల్ల మెదడు లోపల అనేక చెడు లక్షణాలు కనబడుతున్నాయి.

మొదలుగా తలనొప్పి వస్తుంది తర్వాత నరాలకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది.

ఇక మనంతట మనమే కొని చేర్చుకున్న అలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఒకసారి చూద్దాం.

మనం రోజు ఎక్కువ సమయం సెల్ ఫోను లాప్టాప్ టీవీ చూడటం లో గడగడుపుతున్నామ

దానివల్ల అల్ట్రా వైలెట్ రేడియేషన్ కి ఇంకా ఎక్కువ ప్రకాశమైనా వెలుతురుని చూడటం వల్ల అది మన కంటిలోని రెటీనా మీద ప్రభావం చూపెట్టి కను గుడ్లు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి.

చిన్న వయసులోనే పిల్లలకి కళ్ళజోళ్ళు రావడం మనం గమనిస్తున్నాము.

ఇంకా సెల్ ఫోనులో మన యొక్క పూర్తి ఏకాగ్రత ఉంచి వీడియోలు చూడటం వలన అవి మెదడు మీద ప్రభావం చూపుతున్నాయి.


ఇటువంటివి అనారోగ్య సమస్యలు ప్రతి వాళ్ళకి వస్తున్నాయి.


ఇట్లా ఉంటే వాహనాల పొగ వలన వాతావరణంలో ఆక్సిజన్ శాతం రోజురోజుకీ తగ్గుతున్నది.


ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే వృక్షాలను మానవులు కొట్టివేసి ఆ స్థలాలలో అనేక మల్టీస్టోరీడ్ బిల్డింగులు కట్టడం వలన ఆక్సిజన్ తక్కువ అవుతున్నది.

అందువలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మనుషులు పూర్తిగా అనారోగ్య పరిస్థితులలో ఉన్నారు అన్నది సత్యం.

ఇక శారీరిక దృఢత్వానికి వస్తే పూర్వకాలంలో ఆడవారు కానీ మగవారు కానీ బావిలో చేత వేసి నీళ్లు చేదుకునేవాళ్లు దానివల్ల వాళ్లకి చక్కటి వ్యాయామం అయ్యేది.


అప్పుడే పెతికిన పాలు తాగేవాళ్లు దంచిన బియ్యం తినేవాళ్లు దానివల్ల పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారము ఆరోగ్యకరమైనటువంటి అంటే వ్యాయామ కరమైనటువంటి అలవాట్లు ఉండేవి.

ఇప్పుడు ప్రతిదీ యాంత్రికం కావడం వలన శారీరిక శ్రమ పూర్తిగా తగ్గింది వంట ఇంట్లో ఆడవారు పిండి రుబటం లేదు.

మిక్సీలో పడుతున్నారు కట్టెలపై పొయ్యి వెలిగించటం లేదు గ్యాస్ స్టవ్ మీద వండుతున్నారు.


కూర్చొని వండటం వల్ల చక్కగా ఆ వంట కుదురుగా ఉండి రుచికరంగా ఉండేది.


ఇప్పుడు వండటం నిల్చమని తినటం కుర్చీలో కూర్చొని.

ఇటువంటి అలవాట్ల వల్ల మనం తినే ఆహారం శరీరానికి సరిగా పట్టటం లేదు.

దానివలన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నాయి ఇకపోతే శారీరకంగా ఏమాత్రం అలసట చెందకుండా తినంగానే వెంటనే పడుకోవటం వలన కడుపు ఉబ్బి లావుగా తయారవుతున్నారు.

ఆహారం సరిగా అరగటం లేదు దానివల్ల అనేకమైన రుగ్మతలు వస్తున్నాయి.

ఇట్లా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు పుస్తకాలు రాయవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే మనము పూర్తిగా అనారోగ్యకరమైన వాతావరణంలో ఉంటున్నాం తింటున్నాం పడుకుంటున్నాము.

ఇది సత్యము సత్యము సత్యము ముమ్మాటికీ

వినాయకచవితి

 *వినాయకచవితి*  గణపయ్య మన అందరిని కాపాడతాడు.  కానీ ఈప్రకృతిని కాపాడేది ఎవరు?” వినాయకుడి విగ్రహానికి  వాతావరణం కాలుష్య కారక రంగులు పుసేది  ఏమిటి?

భక్తి వెనుక దాగిన ఒక పర్యావరణ ప్రశ్న…

వినాయకచవితి సమీపిస్తోందంటే చాలు…

వాడవాడలా గణపయ్య మండపాలు సిద్ధమవుతాయి.

విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద సందడి మొదలవుతుంది.

అడుగు, రెండు అడుగుల విగ్రహాల నుంచి…

30-40, అడుగుల భారీ విగ్రహాల వరకు…

విభిన్న రూపాలు, విభిన్న ఆకృతులు, అద్భుతమైన రంగులతో గణనాథులు తయారవుతుంటే చూడటానికే కన్నుల పండుగగా ఉంటుంది.

కానీ ఈసారి నా దృష్టిని ఆకర్షించినది వినాయక విగ్రహం కాదు… ఆ రంగుల మహత్యం!🙏

 ఒక్కసారి గమనించండి

ఎన్ని విగ్రహాలో…

అన్నింటికీ ప్రత్యేకమైన  రకరకాల  కెమికల్స్

పెద్ద విగ్రహాలు

 ఎలా తయారవుతుంది?

ఎక్కడ తయారవుతుంది?

ఎవరు తయారు చేస్తారు?

 ధర కూడా వేల రూపాయల్లో ఉంటుందని చెబుతున్నారు.

అంటే… ఇది ఒక చిన్న విషయం కాదేమో!

విగ్రహాల తయారీకి ఒక పెద్ద వ్యవస్థ ఉన్నట్లే, 

మనలో చాలామంది ఈ ప్రశ్న ఎప్పుడూ వేసుకున్నామా? గణపతి నవరాత్రులు అయిన తరువాత వాటిని ఏమి చేస్తున్నారు

విగ్రహం  అవసరం తీరిన తరువాత దాని పరిస్థితి ఏమిటి?

అది ఎక్కడికి వెళ్తుంది?

ఎన్ని రీసైకిల్ అవుతున్నాయి?

ఏమైనా పర్యవేక్షణ ఉందా?

ఇది వినాయక చవితిని ప్రశ్నించడం కాదు.

ఇది మన పండుగలను పర్యావరణ హితంగా ఎలా చేసుకోవాలనే ప్రశ్న.

ఎందుకంటే మనం పూజించేది విఘ్నేశ్వరుడిని.

ఆయనను మనం ప్రకృతికి ప్రతీకగా కూడా భావిస్తాం.

అయితే…

గణపయ్య  తయ్యార్ కి ఉపయోగించిన రంగులు   మనం నివసించే ప్రకృతికి భారంగా మారకూడదు కదా!

భక్తి ఉండాలి…

వేడుక ఉండాలి…

వినాయక మండపాలు ఉండాలి!

కానీ వాటితో పాటు బాధ్యత కూడా ఉండాలి.

ప్రభుత్వాలు కూడా భారీ పరిమాణంలో ఉండే విగ్రహలు కు ఉపయోగించే  కెమికల్స్, పునర్వినియోగం, వ్యర్థ నిర్వహణపై దృష్టి పెట్టాలి. విగ్రహ తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి.

మండప నిర్వాహకులు అవసరమైనంతవరకే విగ్రహలు ఉపయోగించాలి.

మనమూ ఒకసారి ఆలోచించాలి.

వినాయకుడు అందంగా  ఉండటానికి రంగులు అవసరం…

కానీ ప్రకృతికి కూడా  కలుషిత రహితo అవసరమే కదా!

ఈ వినాయక చవితికి మనం గణపయ్యను ఒక కోరిక కోరుకుందాం—

“విఘ్నాలను తొలగించే వినాయకా…

మా పండుగల్లో తెలియకుండానే ప్రకృతికి కలిగిస్తున్న విఘ్నాలను కూడా తొలగించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించు.” 🙏

భక్తి ప్రకృతిని బాధించకుండా ఉంటేనే…

ఆ భక్తికి మరింత అందం.  🌱🙏 

 అందుకే మిత్రులారా నా ఈ సందేశం మీ మిత్రులు కు కూడా  షేర్ చేయండి.