*వినాయకచవితి* గణపయ్య మన అందరిని కాపాడతాడు. కానీ ఈప్రకృతిని కాపాడేది ఎవరు?” వినాయకుడి విగ్రహానికి వాతావరణం కాలుష్య కారక రంగులు పుసేది ఏమిటి?
భక్తి వెనుక దాగిన ఒక పర్యావరణ ప్రశ్న…
వినాయకచవితి సమీపిస్తోందంటే చాలు…
వాడవాడలా గణపయ్య మండపాలు సిద్ధమవుతాయి.
విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద సందడి మొదలవుతుంది.
అడుగు, రెండు అడుగుల విగ్రహాల నుంచి…
30-40, అడుగుల భారీ విగ్రహాల వరకు…
విభిన్న రూపాలు, విభిన్న ఆకృతులు, అద్భుతమైన రంగులతో గణనాథులు తయారవుతుంటే చూడటానికే కన్నుల పండుగగా ఉంటుంది.
కానీ ఈసారి నా దృష్టిని ఆకర్షించినది వినాయక విగ్రహం కాదు… ఆ రంగుల మహత్యం!🙏
ఒక్కసారి గమనించండి
ఎన్ని విగ్రహాలో…
అన్నింటికీ ప్రత్యేకమైన రకరకాల కెమికల్స్
పెద్ద విగ్రహాలు
ఎలా తయారవుతుంది?
ఎక్కడ తయారవుతుంది?
ఎవరు తయారు చేస్తారు?
ధర కూడా వేల రూపాయల్లో ఉంటుందని చెబుతున్నారు.
అంటే… ఇది ఒక చిన్న విషయం కాదేమో!
విగ్రహాల తయారీకి ఒక పెద్ద వ్యవస్థ ఉన్నట్లే,
మనలో చాలామంది ఈ ప్రశ్న ఎప్పుడూ వేసుకున్నామా? గణపతి నవరాత్రులు అయిన తరువాత వాటిని ఏమి చేస్తున్నారు
విగ్రహం అవసరం తీరిన తరువాత దాని పరిస్థితి ఏమిటి?
అది ఎక్కడికి వెళ్తుంది?
ఎన్ని రీసైకిల్ అవుతున్నాయి?
ఏమైనా పర్యవేక్షణ ఉందా?
ఇది వినాయక చవితిని ప్రశ్నించడం కాదు.
ఇది మన పండుగలను పర్యావరణ హితంగా ఎలా చేసుకోవాలనే ప్రశ్న.
ఎందుకంటే మనం పూజించేది విఘ్నేశ్వరుడిని.
ఆయనను మనం ప్రకృతికి ప్రతీకగా కూడా భావిస్తాం.
అయితే…
గణపయ్య తయ్యార్ కి ఉపయోగించిన రంగులు మనం నివసించే ప్రకృతికి భారంగా మారకూడదు కదా!
భక్తి ఉండాలి…
వేడుక ఉండాలి…
వినాయక మండపాలు ఉండాలి!
కానీ వాటితో పాటు బాధ్యత కూడా ఉండాలి.
ప్రభుత్వాలు కూడా భారీ పరిమాణంలో ఉండే విగ్రహలు కు ఉపయోగించే కెమికల్స్, పునర్వినియోగం, వ్యర్థ నిర్వహణపై దృష్టి పెట్టాలి. విగ్రహ తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి.
మండప నిర్వాహకులు అవసరమైనంతవరకే విగ్రహలు ఉపయోగించాలి.
మనమూ ఒకసారి ఆలోచించాలి.
వినాయకుడు అందంగా ఉండటానికి రంగులు అవసరం…
కానీ ప్రకృతికి కూడా కలుషిత రహితo అవసరమే కదా!
ఈ వినాయక చవితికి మనం గణపయ్యను ఒక కోరిక కోరుకుందాం—
“విఘ్నాలను తొలగించే వినాయకా…
మా పండుగల్లో తెలియకుండానే ప్రకృతికి కలిగిస్తున్న విఘ్నాలను కూడా తొలగించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించు.” 🙏
భక్తి ప్రకృతిని బాధించకుండా ఉంటేనే…
ఆ భక్తికి మరింత అందం. 🌱🙏
అందుకే మిత్రులారా నా ఈ సందేశం మీ మిత్రులు కు కూడా షేర్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి