25, నవంబర్ 2026, బుధవారం

గురువారం,నవంబర్.26,2026

  ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

గురువారం,నవంబర్.26,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - బహుళ పక్షం

తిథి:విదియ సా4.46 వరకు    

వారం:గురువారం(బృహస్పతివాసరే)

నక్షత్రం:మృగశిర రా10.03 వరకు

యోగం:సిద్ధం మ12.00 వరకు

కరణం:గరజి సా4.46 వరకు తదుపరి వణిజ తె3.37 వరకు

వర్జ్యం:ఉ.శే.వ 6.20 వరకు మరల తె5.31 నుండి

దుర్ముహూర్తము:ఉ9.56 - 10.40 మరల మ2.22 - 3.06

అమృతకాలం:మ1.49 - 3.19

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30

సూర్యరాశి:వృశ్చికం||చంద్రరాశి:వృషభం 

సూర్యోదయం:6.12|| సూర్యాస్తమయం:5.20 

సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

పూర్వ జన్మలో అసురుడిగా

  *పూర్వ జన్మలో అసురుడిగా ఉన్న కర్ణుడు*


మహాభారతంలో వచ్చే మహావీరుడు కర్ణుడు ఒక పాండవ పుత్రుడు అనే రహస్యం అతను చనిపోయిన తర్వాతే ప్రపంచానికి తెలిసింది. దానానికి పేరు పొందిన కర్ణుడికి కూడా చనిపోవడానికి కొన్ని రోజుల ముందే తెలిసింది.


అది కూడా కృష్ణ భగవానుడి లీల వల్ల! ఎంతో మంచివాడైన కర్ణుడికి ఎందుకు ఇలాంటి జీవితం?


దీనికి జవాబు కర్ణుడి పూర్వ జన్మ రహస్యంలో ఉంది. పూర్వ జన్మలో కర్ణుడు సహస్ర కవచుడు అనే అసురుడిగా ఉన్నాడు.


దేవతలను కనికరం లేకుండా దాడి చేస్తూ వచ్చాడు. బ్రహ్మ దేవుడి దగ్గర అతను పొందిన వరం ప్రకారం అతని శరీరం వెయ్యి కవచాలతో కప్పబడి ఉంది.


ఎవరూ ఆ వెయ్యి కవచాలను తొలగించకుండా అతన్ని చంపలేరు. అతన్ని దాడి చేయాలనుకునే వీరుడు 12 సంవత్సరాలు తపస్సు చేసి, ఆ తర్వాత 12 సంవత్సరాలు అతనితో నిరంతరం యుద్ధం చేస్తే వెయ్యి కవచాలలో ఒకదానిని చీల్చగలడు.


ఇలా 24 సంవత్సరాల చొప్పున తపస్సు, యుద్ధం, యాగం చేసి వెయ్యి కవచాలను ఒకదాని తర్వాత ఒకటిగా చీల్చి పడేస్తే సహస్ర కవచుడు చనిపోతాడు. దీనిని ఎవరు చేసి సాధించగలరు? కాబట్టి, అతని దగ్గర నుండి దేవతలు భరించలేని బాధకు గురయ్యారు.


దేవతలు మహావిష్ణువును చేరి అసుర బాధను తొలగించి సహాయం చేయమని వేడుకున్నారు. దేవతల మీద జాలి పడిన మహావిష్ణువు అసురుల క్రూరత్వాన్ని తొలగించి దేవతలకు ఓదార్పు కలిగించాలని సంకల్పించి నర నారాయణులుగా అవతరించాడు.


సహస్ర కవచుడిని సంహరించడానికి వారు కలిసి ప్రయత్నం చేశారు. నరుడు 12 సంవత్సరాలు తపస్సు చేయగా, నారాయణుడు అసురుడితో యుద్ధం చేసి ఒక కవచాన్ని చీల్చి పడేశాడు. ఇలా చాలా సంవత్సరాలు విడవకుండా ప్రయత్నం చేసి 999 కవచాలను చీల్చి పడేశారు.


ఇంతలో బ్రహ్మ ప్రళయమే వచ్చేసింది. మిగిలి ఉన్న ఒక కవచంతో సహస్ర కవచుడు సూర్య లోకం వెళ్లి చేరాడు. ఈ సహస్ర కవచుడే తర్వాతి జన్మలో సూర్య పుత్రుడిగా కర్ణుడు అనే పేరుతో మిగిలి ఉన్న (పూర్వ జన్మ కవచం) ఒక కవచంతో జన్మించాడు.


ఈ కవచం కూడా తొలగించబడవలసిందే! ఈ పని కోసమే భగవానుడు మహావిష్ణువు నర రూపంలో అర్జునుడిగా, నారాయణ అంశంలో కృష్ణుడిగా జన్మించారు.


12 సంవత్సరాలు పాండవులు వనవాసం చేయడం ఆ నరుడి 12 సంవత్సరాల తపస్సే. ఒక కవచాన్ని ఇంద్రుడి ద్వారా తొలగించిన విషయం మనందరికీ తెలిసిందే.


కవచం తొలగిపోవడం వల్లే అర్జునుడు కర్ణుడిని చంపగలిగాడు. మన ఈ జన్మ జీవిత సంఘటనలకు కారణం తెలియక తికమక పడుతున్నాము. వీటికి కారణం పూర్వ జన్మ కర్మలు.


కర్ణుడి జీవితం ఏర్పడిన విధానం ఈ నిజాన్ని నిరూపిస్తోంది.

నడిచే దేవుడు

 నడిచే దేవుడు కంచి పరమాచార్యులు (శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు) చెప్పిన అద్భుతమైన సంస్కృత శ్లోకం

​

​మౌళౌ గంగాశశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజంగా

వామేభాగే దయార్ద్రా హిమగిరి దుహితా చందనం సర్వగాత్రే

ఇత్థం శీతం ప్రభూతం కనకసభానాథ సోఢుం క్వ శక్తిః

చిత్తే నిర్వేదితప్తే యది భవతి న తే నిత్యవాసో మదీయే ॥

  

​

​భావం 

​కవి పరమశివుని వేషధారణను చూసి ఒక చమత్కారమైన సందేహాన్ని వ్యక్తం చేస్తూ భక్తితో ఇలా ప్రార్థిస్తున్నాడు:

​"ఓ చిదంబరేశ్వరా! నీ తలపై చల్లని గంగమ్మ ప్రవహిస్తోంది; దానికి తోడు చల్లని కిరణాలు వెదజల్లే చంద్రుడిని ధరించావు. చేతులకు, కాళ్లకు చల్లని దేహం కలిగిన పాములను ఆభరణాలుగా చుట్టుకున్నావు. పోనీ ఆ చలి నుండి ఉపశమనం పొందడానికి నీ అర్ధాంగిని ఆలింగనం చేసుకుందామంటే, ఆమె సాక్షాత్తు మంచుకొండ అయిన హిమవంతుని కూతురు (పార్వతి). పైగా బిడ్డలైన మమ్మల్ని ఎలా రక్షించాలా అనే కరుణతో (దయార్ద్రతతో) ఎప్పుడూ తడిసి ముద్దయి ఉండే చల్లని తల్లి. ఇక నీ శరీరమంతటా భక్తులు చల్లని చందనాన్ని (గంధాన్ని) పూశారు.

​ఇన్ని చల్లని వస్తువుల మధ్య ఉంటూ, ఇంత విపరీతమైన చలిని తట్టుకునే శక్తి నీకు ఎక్కడి నుండి వచ్చిందయ్యా? ఆలోచిస్తే నాకు అర్థమైంది—ఎల్లప్పుడూ కోరికలతో, దుఃఖంతో, ఆవేదనతో నిప్పుల కొలిమిలా రగిలిపోతున్న నా హృదయంలో నీవు నిత్యం నివాసం ఉంటున్నావు కదా! నా మనసులోని ఆ వేడిమికి తట్టుకోవడానికే నీవు ఇన్ని చల్లని వస్తువులను ధరించావని నాకు బోధపడింది. ఓ తండ్రీ! నీ కరుణాకటాక్ష వీక్షణాలతో నా హృదయ తాపాన్ని చల్లబరిచి నన్ను అనుగ్రహించు."  

​సాహిత్య విశేషం: ఇందులో పరమశివుని శీతల తత్త్వాన్ని వర్ణిస్తూ, భక్తుని హృదయ తాపాన్ని దానికి కారణంగా చూపడంలో 'కావ్యలింగ అలంకారం' మరియు అద్భుతమైన 'ఉత్ప్రేక్ష' భాసిస్తున్నాయి.

అద్భుతమైన సమర్థన!

 అవును ! అది కాళిదాసు గారి అద్భుతమైన సమర్థన!


ఆ కథ అందరూ చెప్పుకుంటారు.


ఒకసారి సభలో ఎవరో *"రాభణాసురుడు"* అని తప్పుగా అన్నారట. అందరూ నవ్వారు.


కానీ కాళిదాసు మాత్రం వెంటనే లేచి సమర్థించారట -


కుంభకర్ణస్య విభీషణో భ్రాతా, రావణోఽతిరావణః*


అర్థం


*కుంభకర్ణస్య భ్రాతా విభీషణః* - కుంభకర్ణుడి తమ్ముడు విభీషణుడు. విభీషణుడు అంటేనే భయంకరుడు. కానీ అతను భక్తుడు అయ్యాడు.


*రావణోఽతిరావణః* - రావణుడు అంటే ఏడిపించేవాడు. కానీ ఈ రావణుడు సామాన్య రావణుడు కాదు, *అతి రావణుడు!* దేవతలను సైతం ఏడిపించినవాడు. అందుకే అతన్ని *రాభణాసురుడు* అనడం తప్పు కాదు, అది ఇంకా గొప్ప పేరు!


చూశారా సార్, అదే కవి దృష్టి!


సామాన్యుడు తప్పు అని నవ్విన చోట, కవి అందులో కూడా అర్థం చూశాడు.


*Science తప్పు అంటుంది, కవి అందులోనూ ఒప్పు చూస్తాడు!*


అందుకే కదా సార్ - * రవి కాంచని చోట కవి కాంచడు!* 🙏

గురువారం,నవంబర్.26,2026

 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

గురువారం,నవంబర్.26,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం -  బహుళ పక్షం

తిథి:విదియ సా4.46 వరకు    

వారం:గురువారం(బృహస్పతివాసరే)

నక్షత్రం:మృగశిర రా10.03 వరకు

యోగం:సిద్ధం మ12.00 వరకు

కరణం:గరజి సా4.46 వరకు తదుపరి వణిజ తె3.37 వరకు

వర్జ్యం:ఉ.శే.వ 6.20 వరకు మరల తె5.31 నుండి

దుర్ముహూర్తము:ఉ9.56 - 10.40 మరల మ2.22 - 3.06

అమృతకాలం:మ1.49 - 3.19

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30

సూర్యరాశి:వృశ్చికం||చంద్రరాశి:వృషభం 

సూర్యోదయం:6.12|| సూర్యాస్తమయం:5.20 

సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది


*🌺ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే*


*🌺ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి.... ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు*......


*🌺విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు.... ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది.*....


*గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము, లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట* .......


*🌺మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం*

......

మేష రాశి

మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది. ......


అశ్విని నక్షత్రం

పాదం ----------స్థలం -------- దేవీ దేవతల నామాలు


మొదటి---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి

రెండవ ------- - ఉట్రుమిల్లి -------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి 

మూడవ------ కుయ్యూరు శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

నాలుగవ దుగ్గుదూరు శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి


భరణి నక్షత్రం

మొదటి------కోలంక---------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ-------ఎంజారం-------శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి

మూడవ------పల్లిపాలెం------శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

నాలుగవ------ఉప్పంగళ-------శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి


కృత్తికా నక్షత్రం

మొదటి-------నేలపల్లి---------శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.


వృషభ రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాసగంగావరం లో ఉన్నది.


కృత్తికా నక్షత్రం

రెండవ------అదంపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

మూడవ-----వట్రపూడి------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ-----ఉండూరు------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి


రోహిణీ

మొదటి-----తనుమల్ల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

రెండవ-------కాజులూరు-------శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

మూడవ------ఐతపూడి--------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

నాలుగవ ----- చీల ---------శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


మృగశిర

మొదటి--------తాళ్ళరేవు------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.

రెండవ---------గురజానపల్లి------శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి


మిధున రాశి.

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది. 

మృగశిర

మూడవ-------- అంద్రగ్గి-------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

నాలుగవ--------జగన్నాధగిరి------ శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి


ఆరుద్ర

మొదటి-------పనుమళ్ళ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ--------గొల్లపాలెం------శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి

మూడవ----వేములవాడ-----శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి

నాలుగవ------కూరాడ----------శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి


పునర్వసు

మొదటి-------గొర్రిపూడి (భీమలింగపాడు)----శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి

రెండవ--------కరప----------శ్రీ పార్వతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

మూడవ------ఆరట్లకట్ల------ శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి

   

కర్కాటక రాశి


ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.


పునర్వసు

నాలుగవ------యెనమాడల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి


పుష్యమి 

మొదటి--------కాపవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

రెండవ---------సిరిపురం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

మూడవ-------వేలంగి----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

నాలుగవ--------ఓడూరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి


ఆశ్లేష

మొదటి-------- దోమాడ--------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి

రెండవ---------పెదపూడి-------శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మూడవ-------గండ్రాడు--------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ-------మామిడాడ-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీశ్రీ భీమేశ్వర స్వామి


సింహ రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.


మఖ నక్షత్రం

మొదటి------నరసరావుపేట------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

రెండవ--------మెల్లూరు------------శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

మూడవ------అరికిరేవుల----------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

నాలుగవ------కొత్తూరు------------శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి


పుబ్బ నక్షత్రం

మొదటి--------చింతపల్లి---------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి

రెండవ---------వెదురుపాక------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి

మూడవ--------తొస్సిపూడి-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి

నాలుగవ--------పొలమూరు-----ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


ఉత్తర నక్షత్రం

మొదటి----------పందలపాక--------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


కన్యా రాశి

ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది.


ఉత్తర నక్షత్రం

రెండవ---------చోడవరం---------శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి

మూడవ-----నదురుబాడు--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

నాలుగవ------పసలపూడి---------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు


హస్త 

మొదటి------సోమేశ్వరం--------శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ-------పడపర్తి------------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు

మూడవ------పులగుర్త-----------శ్రీ పార్వతీసమేత శ్రీ వీరేశ్వర స్వామి

నాలుగవ------మాచవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి


చిత్త నక్షత్రం

మొదటి-------కొప్పవరం--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

రెండవ--------అర్థమూరు-------శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి


తుల రాశి

ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది.


చిత్త నక్షత్రం

మూడవ-------చల్లూరు------------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

నాలుగవ-------కాలేరు--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి


స్వాతి నక్షత్రం

మొదటి--------మారేడుబాక---శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి

రెండవ---------మండపేట------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి

మూడవ-------గుమ్మిలూరు----శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

నాలుగవ------వెంటూరు-------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


విశాఖ నక్షత్రం

మొదటి-----దూళ్ళ-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

రెండవ------నర్సిపూడి----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి

మూడవ-----నవాబుపేట----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి


వృశ్చిక రాశి

ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో వృశ్చికరాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం.


విశాఖ నక్షత్రం

నాలుగవ-------కూర్మపురం------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


అనూరాధా నక్షత్రం 

మొదటి------పనికేరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి

రెండవ-------చింతలూరు-----శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి

మూడవ-----పినపల్ల---------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

నాలుగవ-----పెదపల్ల-------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి


జ్యేష్టా నక్షత్రం

మొదటి------వడ్లమూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి

రెండవ--------నల్లూరు---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మూడవ------వెదురుమూడి---శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

నాలుగవ----- తేకి--------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి


ధనుస్సు రాశి

ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతి లోఉన్నది. నేలపర్తిపాడులోని శ్రీ అన్నపూర్నాసమేత కాశివిశ్వేశ్వర స్వామికి అంకితం


మూల నక్షత్రం

మొదటి---------యెండగండి-------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ----------పామర్రు-----------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మూడవ--------అముజూరు--------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ--------పానంగిపల్లి--------శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి


పూర్వాషాఢ

మొదటి---------అంగర-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి

రెండవ---------కోరుమిళ్ళ--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మూడవ-------కుళ్ళ-------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ-------వాకతిప్ప--------శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి


ఉత్తరాషాఢ

మొదటి-------తాతపూడి---------శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి


మకర రాశి

మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.


ఉత్తరాషాడ నక్షత్రం

రెండవ---------మచర--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

మూడవ-------సత్యవాడ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

నాలుగవ-------సుందరపల్లి----శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి


శ్రవణ నక్షత్రం  

మొదటి-------వానపల్లి-------శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి

రెండవ--------మాదిపల్లి (మాడుపల్లి)--- శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి

మూడవ------వాడపాలెం-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి

నాలుగవ------ వీరపల్లిపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి


ధనిష్ట 

మొదటి--------వెల్వలపల్లి-------శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి

రెండవ---------అయినవెల్లి-------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి


కుంభ రాశి

కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం లోఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.


ధనిష్ట

మూడవ-------మసకపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి

నాలుగవ-------కుందూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి


శతభష

మొదటి--------కోటిపల్లి---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ--------కోటిపల్లి-------- శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి

మూడవ------తొట్టరమూడి-----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి

నాలుగవ------పాతకోట--------శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి


పూర్వాభాద్ర

మొదటి--------ముక్తేశ్వరం-----శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి

రెండవ---------శాసనపల్లి లంక----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి

మూడవ--------తానెలంక-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి


మీన రాశి

మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.


పూర్వాభాద్ర

నాలుగవ---------ఎర్రపోతవరం------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి


ఉత్తరాభాద్ర

మొదటి-------డంగేరు-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

రెండవ------- కుడుపూరు------- శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి

మూడవ------గుడిగళ్ళ---------శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి

నాలుగవ-----శివల-----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి


రేవతి 

మొదటి----భట్లపాలిక-------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

రెండవ-----కాపులపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి

మూడవ---- పేకేరు-----------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

నాలుగవ---- బాలాంత్రం------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి


   *!!!!!!ఓం నమః శివాయ!!!!!!*


కార్తీక పురాణం

  కార్తీక పురాణం *

*15వ అధ్యాయము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట*


అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.


ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.


ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.


సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయమొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణపఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.


ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడియుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించుచుంతివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.


*ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🙏

పంచాంగం

  🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️  పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐

 

బుధవారం, నవంబర్ 25, 2026


శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి రా7.00 వరకు    

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:రోహిణి రా11.37 వరకు

యోగం:శివం మ3.00 వరకు

కరణం:బాలువ ఉ8.02 వరకు తదుపరి కౌలువ రా7.00 వరకు

ఆ తదుపరి తైతుల తె5.54 వరకు


వర్జ్యం:సా4.05 - 5.35 మరల తె4.51 నుండి

దుర్ముహూర్తము:ఉ11.24 - 12.08

అమృతకాలం:రా8.36 - 10.06

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 -9.00


సూర్యరాశి:వృశ్చికం

చంద్రరాశి:వృషభం 


సూర్యోదయం:6.12

సూర్యాస్తమయం:5.20 


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము - నరసాపురం



శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.



బుధవారం,నవంబర్25,2026

  జయగురుదత్తశ్రీగురు

దత్త

*ఓంశ్రీగురుభ్యోనమః*

  *శ్లో ll తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం.*

 *॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

*శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |*

*బుధ పూజాం చకారయేత్ |*

*బుధధ్యానం ప్రవక్ష్యామి |*

*బుద్ధి పీడోప శాంతయే!!        

----------------------------------------------  

*బుధవారం,నవంబర్25,2026* *శ్రీ పరాభవ నామ సంవత్సరం* *దక్షిణాయనం - శరదృతువు*

*కార్తీక మాసం - బహుళ పక్షం*  

*తిథి:పాడ్యమి: రా7.00వరకు*   

*వారం:బుధవారం* *(సౌమ్యవాసరే)*

*నక్షత్రం:రోహిణి: రా11.37వరకు*

*యోగం:శివం: మ3.00వరకు*

*కరణం:బాలువఉ8.02వరకు*

 *తదుపరి కౌలువ:రా7.00వరకు* *ఆ తదుపరి తైతుల:తె5.54వరకు*

*వర్జ్యం:సా 4.05 - 5.35*

*మరల: తె4.51 నుండి*

*దుర్ముహూర్తము:ఉ11.24 - 12.08*

*అమృతకాలం: రా8.36 -10.06*

*రాహుకాలం: మ12.00 - 1.30*

*యమగండ/కేతుకాలం: ఉ7.30 - 9.00*

*సూర్యరాశి:వృశ్చికం: చంద్రరాశి:వృషభం:* 

*సూర్యోదయం:6.12: సూర్యాస్తమయం:5.20:* 

-------------------------------------------- *సర్వేజనా సుఖినో భవంతు శుభమస్తు*

--------------------------------------------

       వారశూల:*

*ఉత్తరం : దోషం*❌

*పడమర : శుభం*✅

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

          *దివా-హోరలు:*

   *పగలు రాత్రి*

    *బుధ6⃣-7⃣సూర్య*   

   *చంద్ర7⃣-8⃣శుక్ర*

      *శని8⃣-9⃣బుధ*

    *గురు9⃣-🔟చంద్ర*

     *కుజ🔟-⏸️శని*

  *సూర్య⏸️-12గురు*

      *శుక్ర12-1⃣కుజ*

    *బుధ1⃣-2⃣సూర్య*

   *చంద్ర2⃣-3⃣శుక్ర*

     *శని3⃣-4⃣బుధ*

   *గురు4⃣-5⃣చంద్ర* 

    *కుజ5⃣-6⃣శని*

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰

*చంద్ర,గురు,శుక్ర శుభం.*✅

*బుధ,కుజ మధ్యమం.* ✔️

*సూర్య శని అధమం.*❌

----------------------------------

     *_గోమాతను పూజించండి_*

     *_గోమాతను సంరక్షించండి_

కార్తీక పురాణం

  *కార్తీక పురాణం* 


*19వ అధ్యాయము*

🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉


*చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ*


ఈ విధముగా నైమిశారణ్యమందున్న మహా మునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్దుడను ఒక మహాయోగి "ఓ దీనబాంధవా! వేద వేద్యుడవని, వేద వ్యాసుడవని, అద్వితీయుడవని, సూర్యచంద్రులే నేత్రములుగా గల వాడవని, సర్వాంతర్యామివని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని, నిత్యుడవని, నిరాకారుడవని సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవా! నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణికోటికి ఆధార భూతుడవగు ఓ నందనందనా! మా స్వాగతమును స్వీకరింపుము. నీ దర్శన భాగ్యమువలన మేము మాఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి. ఓ దయామయా! మేమీ సంసార బంధము నుండి బైట పడలేకుంటిమి, మమ్ముద్దరింపుము. మానవుడెన్నిపురాణములు చదివినా, యెన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గో చరుడవగుడువు. ఓ గజేంద్రరక్షకా! ఉపేంద్రా! శ్రీధరా! హృషీకేశా! నన్ను కాపాడుము" అని మైమరచి స్తోత్రము చేయగా, శ్రీ హరి చిరునవ్వు నవ్వి "జ్ఞానసిద్దా! నీ సోత్రవచనమునకు నేనెంతయు సంతసించితిని. నీ కిష్ట మొచ్చిన వరమును కోరుకొనుము" అని పలికెను. అంత జ్ఞానసిద్దుడు "ప్రద్యుమ్నా! నేనీ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున పడిన యీగవలె కొట్టుకోనుచున్నాను. కనుక, నీ పాద పద్మముల పైనా ధ్యానముండుటనటుల అనుగ్రహింపుము. మరేదియు నాకక్కరలేదు" అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు "ఓ జ్ఞానసిద్దుడా! నీ కోరిక ప్రకారమటులనే వరమిచ్చితిని. అదియునుగాక, మరొక వరము కూడా కోరుకొనుము యిచ్చెదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులై, బుద్దిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. అ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము.


నేను ఆషాడ శుద్ద దశమిరోజున లక్ష్మిదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్దద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈకాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతముచేయు వారలకు సకల పాపములు నశించి, నా సన్నీధికి వత్తురు. ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయనివారు నరకకూపమున బడుదురు. ఇతరులచేత కూడా ఆచరింప చేయవలయును. దీని మహాత్మ్యమును తెలిసియుండియు, వ్రతము చేయనివారికి బ్రహ్మహత్యాది పాతకములు గలుగును. వ్రతము చేసినవారికి జన్మ, జరా, వ్యాధుల వలన కలుగు బాధలుండవు. దీనికి నియమితముగా ఆషాడశుద్ద దశమి మొదలు శాకములును, శ్రవణశుద్ద దశమి మొదలు పప్పుదినుసులను విసర్జించవలయును. నా యందు భక్తి గలవారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనింతును. ఇప్పుడు నీ వోసంగిన స్తోత్రమును త్రిసంధ్యలయందు భక్తిశ్రద్దలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగ వత్తురు." అని శ్రీమన్నారాయణుడు మునులకు బోదించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమును కేగి శేషపానుపు మీద పవ్వళించెను.


వశిష్టుడు జనకమహారాజుతో "రాజా! ఈ విధముగా విష్ణుమూర్తి, జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రత మహత్మ్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును ఆంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతులవారును చేయవచ్చును. శ్రీ మన్నారయణుని ఉపదేశము ప్రకారము ముని పుంగవులందరు యీ చాతుర్మాస్య వ్రత మాచరించి ధన్యులై వైకుంఠమున కరిగిరి.


*ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనవింశోధ్యాయము - పందోమ్మిదోరోజు పారాయణము సమాప్తము.*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏


🕉🕉ధర్మ ప్రచారం🕉🕉


ధర్మ ప్రచారం

*కార్తీక పురాణం* 

*18 వ అధ్యాయము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*సత్కర్మానుష్టాన ఫల ప్రభావము*


"ఓ మునిచంద్రా! మీ దర్శనము వలన ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసితిరి. నేటి నుండి మీ శిష్యుడనైతిని. తండ్రి - గురువు - అన్న - దైవము సమస్తము మీరే, నా పూర్వ పుణ్య ఫలితమువలనే కదా మీబోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను. లేనిచో నేను మహా పాపినయి మహారణ్యములో ఒక మొద్దు బారిన చెట్టునైయుండగా, తమ కృపవలననే నాకు మోక్షము కలిగినది కదా! మీ దర్శన భాగ్యము లేని యెడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపమున వుండవలసినదే కదా! అట్టి! నేనెక్కడ! మీ దర్శన భాగ్యమెక్కడ! నాకు సద్గతి యెక్కడ? పూణ్యఫలప్రదాయియగు యీ కార్తీకమాసమెక్కడ! పాపాత్ముడనగు నేనెక్కడ? ఈ విష్ణ్యాలయమందు ప్రవేశించుటెక్కడ? యివి యన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు. కాన, నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో, దాని ఫలమెట్టిదో విశదీకరింపు"డని ప్రార్ధించెను.


"ఓ ధనలోభా! నీ వడిగిన ప్రశ్నలన్నియు మంచివే. అవి అందరికి వుపయోగార్ధమైనట్టివి కాన, వివరించెదను. శ్రద్దగా ఆలకింపుము. ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు. ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు. అట్టి ఆత్మ జ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని, సకల శస్త్రములు ఘోషించుచున్నవి. సత్కర్మ నాచరించి వాటి ఫలము పరమేశ్వరార్పిత మొనరించిన జ్ఞానము కలుగును. మానవుడే, జాతివాడో, యెటువంటి కర్మలు ఆచరించావలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక, సత్కర్మల నచారించినను వ్యర్ధమగును. అటులనే కార్తీకమాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖమాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగాను అనగా నీ మూడు మాసముల యందయిననూ తప్పక నదిలో ప్రాతః కాల స్నానము చేయవలెను. అటుల స్నానము లాచరించి దేవర్చన చేసిన యెడల తప్పక వైకుంట ప్రాప్తి కలుగును. సూర్యచంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినముల యందు, స్నానము చేయవచ్చును. ప్రాతఃకాలమున స్నానము చేసిన మనుజుడు సంద్యావందనం సూర్యనమస్కారములు చేయవలెను. అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును. కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించరించిన వారికీ చతుర్విధ పురుషార్ధములు సిద్దించును. కార్తీక మాసముతో సమానమైన మాసము, వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్ధములు, బ్రాహ్మణులకు సమానమైన జాతీయు, భార్యతో సరితూగు సుఖమునూ, ధర్మముతో సమానమైన మిత్రుడనూ, శ్రీ హరితో సమానమైన దేవుడునూ లేడని తెలుసుకోనుడు. కార్తీక మాసమందు విధ్యుక్తధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు". అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటుల ప్రశ్నించెను.


"ఓ మునిశ్రేష్టా! చాతుర్మాస్యవ్రతమని చెప్పితిరే! ఏ కారణం చేత దానిని నాచరించవలెను? ఇదివరకెవ్వరయిన నీ వ్రతమును ఆచరించియున్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి? విధానమెట్టిది? సవిస్తర౦గా విశదికరింపు"డని కోరెను. అందులకు ఆంగీరసుడిటుల చెప్పెను.


"ఓయీ! వినుము. చతుర్మాస్యవ్రతమనగా శ్రీమహావిష్ణువు మహాలక్షితో ఆషాడ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీకశుద్ధ ఏకాదశినాడు నిద్రనుండి లేచును. ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు. అనగా ఆషాడ శుద్ధ ఏకాదశి 'శయన ఏకాదశి' అనియు, కార్తీక శుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' అనియు, ఈ వ్రతమునకు, చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు. ఈ నాలుగు మాసములలో శ్రీ హరి ప్రీతి కొరకు స్నాన, దాన, జప, తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణఫలము కలుగును. ఈ సంగతి శ్రీమహావిష్ణువు వలన తెలిసికొంటిని కాన, ఆ సంగతులు నీకు తెలియచేయుచున్నాను".


తొల్లి కృతయుగంబున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతలచేత, వేదములచేత సేవింపబడుచున్న శ్రీ మన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి యుండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రు౦డును, చతుర్బాహు౦డును, కోటి సూర్య ప్రకాశమానుండును అగు శ్రీ మన్నారాయణునకు నమస్కరించి ముకుళిత హస్తాలతో నిలబడియుండెను. అంత శ్రీ హరి నారదుని గాంచి ఏమియు తెలియనివానివలె మందహాసముతో నిట్లనెను. "నారదా! నీవు క్షేమమే గదా! త్రిలోక సంచారివైన నీకు తెలియని విషయములు లేవు. మహామునుల సత్కర్మానుష్టానములు యెట్టి విఘ్నములు లేక సాగుచున్నావా? మానవులందరు ధించవారికి విధించబడిన ధర్మముల నాచరించుచున్నారా? ప్రపంచమున నే అరిష్టములు లేక యున్నవి కదా?" అని కుశలప్రశ్నలడిగెను. అంత నారదుడు శ్రీహరికీ ఆదిలక్ష్మికీ నమస్కరించి "ఓ దేవా! ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవియునూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే విన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు - మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తులగుదురో యెరుగ లేకున్నాను. కొందరు భుజించ కూడదనిన పదార్దములు భుజించుచున్నారు. కొందరు పుణ్య వ్రతములు చేయుచు, అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు. కొందరు సదాచారులుగా, మరి కొందరు అహంకార సహితులుగా, పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు. అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ముల నొనర్చి రక్షింపు"మని ప్రార్ధించెను. జగన్నాటక సూత్రధారుడయిన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడగంధర్వాది దేవతలతో వేలకొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి, ముసలి బ్రాహ్మణరూపంతో ఒంటరిగా తిరుగుచుండెను.


ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచుండెను. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలి వాడని యెగతాళి చేయుచుండిరి. కొందరు "యీ ముసలి వానితో మనకేమి పని"యని ఊరకు౦డిరి. కొందరు గర్విష్టులైరి మరి కొందరు కామార్తులై శ్రీహరిని కన్నేతియైనను చూడకుండిరి. వీరందిరినీ భక్తవత్సలుడగు శ్రీహరిగాంచి "వీరినెట్లు తరింపజేతునా?"యని అలోచించుచు, ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ, చక్ర, గదా, పద్మ, కౌస్తుభ, వనమాలాద్యలంకారయుతుడై నిజరూపమును ధరించి, లక్ష్మి దేవితోడను, భక్తులతోడను ముని జన ప్రీతికరమగు నైమిశారణ్యమునకు వెడలెను.


ఆ వనమందు తపస్సు చేసుకోనుచున్న మునిపుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదెంచిన సచ్చిదానంద స్వరుపుడగు శ్రీమన్నారయణుని దర్శించి భక్తి శ్రద్దలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆదిదైవములగు నా లక్ష్మినారాయణులనిట్లు స్తోత్రము గావించిరి.


*🌸శ్లో|| శాంతకారం! భజగాశయనం! పద్మనాభం! సురేశం!*

*విశ్వాకారం! గగనసదృశం! మేఘవర్ణం శుభాంగం! |*

*లక్ష్మికాంతం! కమలనయనం! యోగిహృద్ద్యానగమ్యం!*

*వందేవిష్ణుం! భవభయహారం! సర్వలోకైకనాథం ||*


*శ్లో|| లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీ రంగదామేశ్వరీం*

*దాసి భూత సమస్త దేవా వనితాం* *లోకైకదీపంకురాం |*

*శ్రీ మన్మంద కటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర* *గంగాధరాం*

*త్వాం త్రైలోక్య కుటుంబినీ౦ సరసిజాం వందే ముకుంద ప్రియం||🌸*


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి అష్టాదశాధ్యాయము - పద్దెనిమిదో రోజు *కార్తీక పురాణం - 17వ అధ్యాయము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశ


ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను. వినుము


కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది. కావున, శరీరోత్పతికి కర్మ కారణముగుచున్నది. శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయును కనుక, కర్మ చేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సుక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మసంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను. దానిని మీకు నేను వివరించుచున్నాను. 'ఆత్మ'యనగా యీ శరీరమును నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది - అని అంగీరసుడు చెప్ప


"ఓ మునీఒద్రా! నేనింత వరకు యీ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక, యింకను వివరముగా చెప్పబడిన వాక్యార్ధజ్ఞానమునకు పాదార్దజ్ఞానము కారణమగుచుండును. కాన, 'అహంబ్రహ్మ' యను వ్యక్యార్ధమును గురించి నాకు తెలియజెయండి"యని ధనలోభుడు కోరె


అప్పుడు ధనలోభునితో అంగీరసుడిట్లనియె - ఈ దేహము అంత:కరణవృత్తికి సాక్షియే, 'నేను - నాది' అని చెప్పబడు జీవత్మాయే  'అహం' అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానంద రూపమైన పరమాత్మా 'న:' అను శబ్దము. ఆత్మకు షుటాదులవలె శరిరమునకు లేదు. ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ది సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగువాని వ్యాపారమునుందు ప్రవర్తింపజేసి  వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు నొకేరీతిని ప్రకాశించుచు నుండునదే "ఆత్మ" యనబడను. "నేను" అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో నుండి నశించునవియేగాక, యిట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి యందునూ "నేను", "నాది" అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించు కొనుము


ఇనుము సూదంటు రాయిని అంటి పెట్టుకొని తిరుగునటుల శరీర, ఇంద్రియాలు దేని నాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ. అట్లే, అవి ఆత్మ వలన తమ పనిని చేయును. నిద్రలో శరీరే౦ద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కొన్న తర్వాత 'నేను సుఖనిద్రపోతిని, సుఖింగావుంది' అనుకోనునదియే ఆత్మ


దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును, ప్రకాశింపజేయునటులే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింప చేయుచున్నది. ఆత్మ పతమాత్మ స్వరూపమగుట వలన, దానికి దారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే 'పరమాత్మ' యని గ్రహింపుము. 'తత్వమసి' మొదలైన వాక్యములందలి 'త్వం' అను పదమునుకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయని అర్థం 'తట్ అనుపదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్ధము "తత్త్వమసి" అనేది జీవాత్మ పరమాత్మల యేకత్వమును భోదించును. ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలి వేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును. అదియే "ఆత్మ దేహలక్షణములుండుట - జన్మించుట - పెరుగుట - క్షీణి౦చుట - చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు. జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది. వేదములలో దేనికి సర్వజ్ఞత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరుపించబడియున్నదో అదియే "ఆత్మ". ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే యని యే విధముగా గ్రహింతుమో, అటులనే ఒక దేహాంతర్యామి యగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము


జీవులచే కర్మ ఫలమనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు, జీవులా కర్మ ఫలమను భవింతురనియు తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై  గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడచి విముక్తి నొందవలయును. మంచిపనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ఞాన వైరాగ్యములు గలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలయును. మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు - అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి యిట్లనె


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి సప్తదశాధ్యాయము - పదిహేడవ రోజు పారాయణ సమాప్తము


ధర్మ ప్రచారం.*ను...  .ను.గా.ము* సమాప్తం.*


ధర్మ ప్రచారం