.
_*సుభాషితమ్*_
𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝
*యదా కించిద్‌జ్ఞోఽహం ద్విప ఇవ మదాంధః సమభవం*
*తదా సర్వజ్ఞోఽస్మీత్యభవ దవలిప్తం మమ మనః ।*
*యదా కించిత్కించిద్బుధజన సకాశాదవగతం*
*తదా మూర్ఖోఽస్మీతి జ్వర ఇవ మదో మే వ్యపగతః ॥*
తా॥
నాకేమి తెలియని కాలములో - అంతయూ తెల్సిన సర్వజ్ఞునిగా భావించుకొని మదగజములా విర్రవీగాను....తదుపరి ప్రాజ్ఞుల వలన కొద్దిగా తెల్సుకొన్నంతనే - నేను మూర్ఖుడినని, నాకేమీ తెలియదని గ్రహించి - జ్వరము తగ్గి కుదుటపడినట్లుగా నన్ను ఆవరించి వున్న గర్వము వదిలి సుఖించాను....*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి