🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*మారేడు చెట్టు*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
*లక్ష్మీదేవి కుడిచేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము’ అని పిలుస్తారు.*
*సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును చిన్న కన్నం పెట్టి తీసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగ పడుతుంది.*
*ఈ మారేడు దళము మూడుగా ఉంటుంది.అందుకే*
*త్రిదళం త్రిగుణాకారం*
*త్రినేత్రం చ త్రియాయుధం!*
*త్రిజన్మ పాప సంహారం*
*ఏకబిల్వం శివార్పణం!!*
*అని తలుస్తాము.దళములు దళములుగా ఉన్నవాటినే కోసి పూజ చేస్తారు.*
*ఈ దళం మూడు ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వదళం ఉంటుంది. అది మూడు, తొమ్మిది కూడా ఉంటాయి.*
*పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమ లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెనే పట్టుకుని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో అయిదు లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి.*
*మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది.*
*అందుకే ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా మూడు ఆకులు ఉన్న దళములను పట్టుకుని శివునికి పూజ చేసేవారు.*
*శివుడిని మారేడు దళంతో పూజ చేయగనే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట.*
*‘బాల్యం, యౌవనం, కౌమారం - ఈ మూడింటిని నీవు చూస్తావు’ అని ఆశీర్వదిస్తాడుట.కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది.*
*శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తీ మూడు గుణములకు అతీతుడు అవుతాడు.మారేడు దళం శివలింగం మీద బోర్లాపడితే జ్ఞానం సిద్ధిస్తుంది.ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి "శ్రీసూక్తం"లో ‘అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే’ (అమ్మా అలక్ష్మిని= దరిద్రమును పోగొట్టెదవుగాక) అని చెప్తాము.*
*మనిషికి మూడు గుణములు, మూడు అవస్థలు ఉంటాయి. నాల్గవదానిలోకి వెళ్ళడు. నాల్గవది తురీయము.తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి వస్తుంది.*
*మారేడు చెట్టుకి ప్రదక్షిణం చేస్తే మూడు కోట్లమంది దేవతలకి ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటె ఆ మారేడు చెట్టు క్రింద కూర్చుని ఎవరయినా జపం చేసినా పూజ చేసినా అపారమయిన సిద్ధి కలుగుతుంది.*
*యోగ్యుడయిన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టుక్రింద చక్కగా శుభ్రం చేసి ఆవుపేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోపెట్టి భోజనం పెడితే అలా చేసిన వ్యక్తికి కోటిమందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంటచేసి అన్నం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది.*
*మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీదనుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది.*
*‘మా-రేడు’ తెలుగులో - రాజు ప్రకృతి, రేడు వికృతి.*
*మారేడు అంటే మా రాజు.*
*ఆ చెట్టు పరిపాలకురాలు. అన్నిటినీ ఇవ్వగలదు.ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు.అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది.*
*అంత గొప్ప చెట్టు మారేడు చెట్టు.*
*అందుకే మీకు ఏది చేతనయినా కాకపోయినా - మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపొతే మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి మూడు విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి.*
*అందులో మొదటిది తప్పకుండా భస్మ ధారణ చేయడం.*
*రెండవది రుద్రాక్ష మెడలో వేసుకొనుట.*
*మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారయినా చేయుట.*
*ఈ మూడు పనులను ప్రతివ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు.*
*ఓం నమో భగవత రుద్రాయ॥*
*ఓం నమః శివాయ॥*
🈸🈸🈸🈸🈸🈸🈸🈸🈸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి