3, జూన్ 2026, బుధవారం

ఆచారం

 మన పెద్దలు చెప్పిన ప్రతి ఆచారం వెనుక ఒక జీవన విధానం, ఆరోగ్య రహస్యం, క్రమశిక్షణ దాగి ఉన్నాయి. కాలక్రమంలో వాటి అసలు ఉద్దేశ్యం మరిచిపోయి, కొన్ని చోట్ల అవి కేవలం మూఢనమ్మకాలుగా లేదా సామాజిక భేదాలుగా మిగిలిపోయాయి.```


అలాంటి వాటిలో ముఖ్యమైనవి “శౌచం”, “మడి”, “ఎంగిలి” అనే భావాలు. వీటిని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన వైద్యశాస్త్రమైన మన ఆయుర్వేదం ఎలా నిర్వచించిందో చూద్దాం..```



*#1. శౌచం:*```

*కేవలం బాహ్య శుభ్రత కాదు, అంతఃశుద్ధి!

*ఆయుర్వేదంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ‘స్వస్థవృత్తం’ (ఆరోగ్యకరమైన జీవనశైలి) చెప్పారు. అందులో మొదటి మెట్టు ‘శౌచం’.


*బాహ్య శౌచం: స్నానం, దంతధావనం(పళ్ళు తోముకోవడం), శుభ్రమైన వస్త్రాలు ధరించడం. ఇది చర్మ వ్యాధులను, క్రిములను దరిచేరనివ్వదు.


*అంతర శౌచం: సత్సంకల్పాలు, మంచి ఆలోచనలు కలిగి ఉండడం. ఈరోజు మోడ్రన్ మెడిసిన్ చెప్పే Hygiene & Sanitation అనే భావనలను ఆయుర్వేదం వేల ఏళ్ల క్రితమే “మల త్యాగానంతరం హస్త ప్రక్షాళన” (చేతులు కడుక్కోవడం) రూపంలో జీవన విధానంలో భాగం చేసింది.```



*#2.మడి:*```

*ఐసోలేషన్ (Isolation) & కలుషిత నివారణ శాస్త్రం. 


ఆయుర్వేదంలో ఆహారాన్ని అమృతంతో సమానంగా చూస్తారు. వంట చేసేటప్పుడు మన మనస్సు, శరీరం ఎంత పవిత్రంగా ఉంటే, ఆ ఆహారం అంత ‘సాత్వికంగా’ మారి శరీరానికి బలాన్ని ఇస్తుంది.


*క్రిమి నివారణ:

బయట తిరిగి వచ్చినప్పుడు మన శరీరంపై, బట్టలపై ఎన్నో రకాల కంటికి కనిపించని సూక్ష్మజీవులు (క్రిములు) ఉంటాయి. అందుకే స్నానం చేసి, ఉతికిన బట్టలు కట్టుకుని వంటగది లోకి వెళ్ళడమే ‘మడి’. ఇది నిజానికి ఆధునిక వైద్యశాస్త్రం హాస్పిటల్స్ లేదా ల్యాబ్స్‌లో పాటించే "Sterilization & Clean Cooking Practices" వంటిదే.


1. ఎంగిలి:  


సంసర్గజ వ్యాధులు (Contagious Diseases) రాకుండా నివారణ:


ఆయుర్వేదంలో ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే రోగాలను ‘ఔపసర్గిక రోగాలు’ లేదా ‘సంసర్గజ రోగాలు’ అంటారు. ఒకే పాత్రలో తినడం, ఎంగిలి పంచుకోవడం వల్ల లాలాజలం (Saliva) ద్వారా వ్యాధులు వ్యాపిస్తాయని ఆయుర్వేద సంహితలు స్పష్టంగా చెప్పాయి..లాలాజలంలో ఉండే బాక్టీరియా, వైరస్‌లు ఒకరి నుంచి ఒకరికి సులభంగా బదిలీ అవుతాయి.


కరోనా వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం పర్సనల్ హైజీన్, సెపరేట్ ప్లేట్లు, గ్లాసులు వాడటం అలవాటు చేసుకుంది. కానీ మన పూర్వీకులు ఎప్పుడో ‘ఎంగిలి’ అనే నియమం ద్వారా దీనిని అడ్డుకున్నారు.



ముగింపు:

మన పూర్వీకులు సూక్ష్మజీవులను మైక్రోస్కోప్‌లో చూడకపోవచ్చు. కానీ ప్రకృతి పరిశీలనతో, త్రికాల జ్ఞానంతో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన నియమాలను మనకు అందించారు.


"స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం చ"


ఆరోగ్యంగా ఉన్నవాడి ఆరోగ్యాన్ని కాపాడటం, రోగి యొక్క రోగాన్ని నయం చేయడం - ఇదే ఆయుర్వేద పరమ ప్రయోజనం.)


సంస్కృతి అంటే మూఢనమ్మకం కాదు, అది సైన్స్ కంటే ముందే నడిచిన జీవన మార్గం

కామెంట్‌లు లేవు: