☘️☘️☘️☘️☘️☘️☘️☘️💐
*"పురుషులందు" రిటైరైన* *"పురుషులు" వేరయా !!!*
1) పదవి విరమించునాడు
ప్రశంశించారు పలువురు
మరునాటి నుండే పెదవి విరిచారు ప్రతి ఒక్కరు.
2) గేటు తీయరెవరు
గది తలుపు నెట్టరు
లోనికి రమ్మనకపోగా
తలుపుకడ్డముగా నిలిచెదరు తుదకు కూర్చోమనరెవరూ
పైగా పవరులేని వానిగా పరిగణింతురందరు!!
3) పింఛెనొచ్చు వరకు
పెండ్లాము గూడా పలుకరించదు,
వచ్చినాక తక్కువని
సన్నాయి నొక్కులు నొక్కుచుండు
ఏమి సేతునమ్మా
నిర్మలా సీతా రావమ్మా?
4) ప్రతీసారి సెలవులిచ్చుకొను
పనిమనిషి సైతము
పనీ పాటా లేని వాడని
పదే పదే పరిహాసపు లుక్కు లిచ్చు !
5) రిటైరైనాక పగవాని వోలె ఎదురైన ప్రియమిత్రుడు సైతము
పళ్ళికిలించ జూచు!
6) సతినాఫీసు కాడ డ్రాపు చేసినను, లేక పికప్ చేసికున్నను
పరమజాలిగజూచెదరు
ఆమె కొలీగులు !
7) నిన్న మొన్నటి వరకు గుడ్డు మార్నింగు చెప్పినారు కనబడిననూ చూడనట్లు గుడ్డివారులా పోవుచున్నారు !
8) పదవి వీడిన నాడు
కప్పిరి శాలువలెన్నో పోటీపడి!
ఇచ్చిరి భగవద్గీత ప్రతులు
ప్రేమ ఒలకబోసి మరి మరీ!!
9) వచ్చిన శాలువలు
ఇచ్చిన గీతా మకరందములు
ముసుగు కప్పుకుని
పఠించుటయే...ఇక పై తక్షణ కర్తవ్యము.
10) ఇంతేలే రిటైరైనోళ్ళ
బతుకులూ...
ఇవి ఏనాటికీ బాగుపడని అతుకులూ...!!
ఇంతేనయా ! తెలుసుకోవయా!
ఈ లోకం ఇంతేనయా !!
రిటైరైనాక బతుకింతేనయా !చదివినందుకు దండాలయా!!
సరదాగా నవ్వుకోవడానికి వ్రాసిందే కానీ ఎవరినీ నొప్పించేందుకు కాదు సుమ్మీ",
అని ఈ కవితని సర్వీసులో ఉండే ఆత్మీయ సహచరులూ, తదితరులూ చదివి ఇకనైనా రిటైర్డ్ ఉద్యోగులను ఆదరిస్తారని, వారి తరపున అభ్యర్థిస్తూ రేపటికి మీరు కూడా మా స్థితిలోకి వచ్చేస్తారు కాబట్టీ...
*అందరూ నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ*
☘️☘️☘️🙏👍👍☘️☘️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి