11, అక్టోబర్ 2020, ఆదివారం

**అద్వైత వేదాంత పరిచయం**

 

2.4 పురాణాలు :

 నాలుగో స్థాయి పురాణాలు. అవి స్మృతికన్నా మరింత వివరంగా ఉంటాయి. పురాణం అంటే అది ప్రాచీన గ్రంధం అయినా, ఇప్పటికీ వర్తిస్తుంది. పురా అపి నవ: ప్రాచీనమే కాని ఆధునికంలో కూడా తాజాగా ఉంటుంది. ఇవి కూడా పద్యరూపంలో ఉంటాయి. ఇవి కూడా వేదాల్లోని అంశాలని క్రోఢీకరించి, స్పష్టత చేకూర్చి, ఉన్నతంగా చూపిస్తాయి. 

ఇంకో ప్రత్యేకత - అంతకు ముందు గ్రంధాల్లో చెప్పిన ధర్మాలకి కథలు 

ఉంటాయి. ఈ ధర్మాలని పాటించటం ఎంత కష్టమో చూపిస్తూ, అయినా వీటికి కట్టుబడి ఉన్నవాళ్ళ కథలు వివరిస్తాయి. స్మృతిలో కొన్ని వేల శ్లోకాలుంటే, ఒక్కొక్క పురాణంలో 15000 నుంచి 80,000 శ్లోకాలుంటాయి. కేవలం ఒక్క వేదమంత్రం సత్యం వద (సత్యమే పలుకు)కి పురాణంలో మొత్తం హరిశ్చంద్రుని కథ ఉంది.అలాగే పితృదేవోభవకి రాముడు లేదా శ్రవణకుమారుని కథలున్నాయి.కామ, క్రోథ, అహంకారం లాంటి భావాలకి రూపునిచ్చాయి రాక్షసుల రూపంలో.

 మనకి 18పురాణాలు,18 ఉపపురాణాలూ ఉన్నాయి. వ్యాసాచార్యుడు రచించినవే అవి. అన్నిటిలోకి ప్రముఖమైనది భాగవత పురాణం లేదా భాగవతం.ఈ రోజుకి కూడా ఈ పురాణాలు ఆబాలగోపాలాన్నీ ఆకర్షిస్తాయి. పిల్లలకి కావల్సిన మాయలు ఉంటాయి, మనిషి రాయిగా లేదా జంతువుగా మారటం వగైరా. పెద్దలకి కావల్సిన సిద్ధాంతంతో బాటు నైతిక విలువలు, సాంఘికనియమాలు, మానసిక విశ్లేషణలాంటివెన్నో ఉంటాయి.

🙏🙏🙏

*ధార్మికగీత - 44*

    *ధార్మికగీత - 44*

                        *****

      *శ్లో:- సతాం సాప్తపదీ మైత్రీ ౹*

              *సత్సతాం త్రిపదీ మతా ౹*

              *సత్సతా మపి యే సన్తి ౹*

              *తేషాం మైత్రీ పదే పదే ౹౹*

                            *****

 *భా:- "సంబంధం సాప్తపదీనమ్" అని ప్రసిద్ధి. ఏడడుగులతో ఎలాంటి బంధమైనా ఏర్పడుతుందని అర్థము. సజ్జనులతో ఏడడుగులు నడిచినా, ఏడు మాటలు అన్నా, విన్నా , కన్నా ఇట్టే మైత్రీభావం ఏర్పడుతుంది. అదే సజ్జన శ్రేష్ఠులతో నైతే కేవలం మూడు అడుగులు గాని, మూడు మాటలు గాని సరిపోతాయి. వెనువెంటనే గాఢమైన స్నేహ భావం స్థిరపడుతుంది. ఇక సజ్జనశ్రేష్ఠులలో అగ్రేసరులతో నైతే స్నేహబంధం అడుగడుగునా ఏర్పడుతుంది. ఒక అడుగులో, ఒక మాటలోనే ఏర్పడి చిరకాలం కొన సాగుతుంది. ఇదే దుర్జన స్నేహబంధం శరత్ కాల మేఘము వలె త్వరగా ఏర్పడినా, క్షణంలో తేలిపోతుంది. కాన సజ్జన దర్శనము, స్పర్శనము, భాషణము మన సకల పాపాలను, తాపాలను, దైన్యాన్ని బాపగల సామర్ధ్యము కలిగినవి. నారదుని సత్సంగం వల్ల ఒక కీటకము పావురముగాను, లేగదూడగాను, రాజన్యునిగాను జన్మాంతరాలను పొంది జన్మ సార్ధక్యత పొందగలిగింది. నేటికి వివాహ ప్రక్రియలో "సప్తపది" పేరిట మూడుముళ్లు, ఏడడుగులు, మూడుప్రమాణాలతో స్త్రీ పురుషులు అన్యోన్యప్రేమ, అవినాభావసాహచర్యములో నూరేండ్ల పంట పండించుకోవడం సనాతన సంప్రదాయంగా వస్తున్నదే. సజ్జన సాంగత్యం చిరకాలం కొనసాగించాలనేదే మానవ జీవితానికి అర్థము. పరమార్థము*. 

                                 *****

                   *సమర్పణ : పీసపాటి* 

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

శ్రీ మదాంధ్ర మహా భారతము

 గోపాలుని మధుసూదన రావు 


ఘనుడౌ నన్నయభట్టు తా గరిమ

           తో గావించె నాంధ్రంబునన్

మునిద్వైపాయన ప్రోక్తమై బుధ జ 

         నామోదంబునైయున్న శ్రీ

ఘనమౌ భారతసంహితన్ , జనులు 

          భాగ్యంబంచు శ్లాఘించగా , 

వినుతించన్ కవివర్యులంద రిల

         లో వేదంబుగా నెంచియున్

       

ఇన్నూరేండ్లు గతించిపోవ పిదపన్ 

            యీ నేలపై భవ్యమౌ 

పెన్నా తీరమునన్ జనించి ధృతితో 

             పెంపొంది తిక్కన్న ,యా

పన్నుండైన హరీశునిన్ దలచియున్

             పర్వంబులన్ సర్వమున్

యెన్నంగన్ పరిపూర్తి జేసె కవితన్ 

            వేనోళ్ళ కీర్తించగన్ 


ఒక శత వత్సరంబులకు 

            నుర్విలొ నెఱ్ఱన జన్మ మొందియున్

సకలము నందునన్ మిగిలి

           సాగకనున్న నరణ్యభాగమున్  

సుకవిత తోడ గూర్చియును

           శోభను దెచ్చెను , భారతాఖ్య మీ 

రకముగ పూర్తి నొందియును 

         రాగము తోడుత దక్కె జాతికిన్ 


వాగనశాసనుండు కవి 

           వంద్యుడుతిక్కన యెఱ్ఱనాదులున్

యాగమ సారమైన తొలి

          యాంధ్రకవిత్వము సృష్టిజేసియున్

రాజితమైన భారతము 

          రంజిల నిచ్చిరి యాంధ్రజాతికిన్       

సాగగ మూడు వందలగు

          సాలులు దక్కెను గ్రంథ మీవిధి న్


****************************************

Strange but true

 Strange but true

1 - Inspite of so many colours - White is considered Class.

2 - Inspite of so many voices & sounds - Silence is considered ultimate. 3 - Inspite of so much to eat - Fasting is considered healthy.

4 - Inspite of so much to travel & explore - Meditating under trees & on mountains is considered superior.

5 - Inspite of so much to see - Closing your eyes & looking within is Apex.

6 - Inspite of listening to all the outside world - Voice from inside you is eternal.

7 - Inspite of a sweet charming life - A Peaceful Soul is Solace & Divine.

Quick Trust Senses.

     

    Live a Great Life🙏

*దుఃఖానికి కారణం ఏమి?*

  *దుఃఖానికి కారణం ఏమి?*

*దుఃఖాన్ని తొలగించుకోవటం ఎలా?*

*భయాన్ని అధిగమించడం ఎలా?*

*అసంతృప్తిని పోగొట్టుకోవటం ఎలా?*

*మనస్సుని అదుపుచేయటం ఎలా?*

*ఈ సృష్టి ఏమిటి?*

*నేను ఎవరు?*

*నన్ను నేను తెలుసుకోవటం ఎలా?*


ఇటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని *శ్రీమతి కర్రా సూర్యకాంతం గారు* తన ఆత్మజ్ఞాన ప్రవచనాల ద్వారా చిన్న పిల్లాడికి చదువు చెప్పినట్టు బ్లాక్ బోర్డ్ మీద వివరిస్తూ బోధిస్తారు. ఈ course(79 వీడియోలు) మొత్తం పూర్తిచేసినవారికి సర్వ సందేహాలు తొలగిపోయి ప్రశాంతత, సంతృప్తి తప్పక కలుగుతాయి.


https://www.freegurukul.org/blog/self-knowledge

       (OR)

1) https://youtu.be/accMe83Jt7s

2) https://youtu.be/oWbkOsg8FfU

3) https://youtu.be/CxNxfrmtbXA

4) https://youtu.be/72X7C59dDGo

5) https://youtu.be/9iWCAJ7yLg0

6) https://youtu.be/RpnFpYJfBn0

7) https://youtu.be/FJiJ0KmVK4M

8) https://youtu.be/vk8rPfPxocI

9) https://youtu.be/HxMn5zOQ2Og

10) https://youtu.be/Ry1HcGyWEnc

11) https://youtu.be/3SrficT7Avc

12) https://youtu.be/FDiGtT9rbag

13) https://youtu.be/ICJezTe6lms

14) https://youtu.be/HKT2k_LUKpQ

15) https://youtu.be/TVcdrC4sOic

16) https://youtu.be/QJjtH6vJw90

17) https://youtu.be/w6oG74CLzsc

18) https://youtu.be/BE-Tet1j4Xo

19) https://youtu.be/f1kDau51mPs

20) https://youtu.be/cznQ9TurVww

21) https://youtu.be/pPyeFo771Us

22) https://youtu.be/s5owJJZ1cLI

23) https://youtu.be/RxNAY7-ff1Q

24) https://youtu.be/zr8kICeRS6Y

25) https://youtu.be/WkoQ02utmoI

26) https://youtu.be/lIOLp_EsL0c

27) https://youtu.be/GEFrISxPc3g

28) https://youtu.be/ML8NcrQDteY

29) https://youtu.be/dokuyjZcItI

30) https://youtu.be/f9VD52oTe_I

31) https://youtu.be/fJJEOaGY000

32) https://youtu.be/1YtlzScAZKs

33) https://youtu.be/ZrgPzhe3lrs

34) https://youtu.be/w3MfEA5xBKk

35) https://youtu.be/EzeMVZyyFgU

36) https://youtu.be/HBOJ1GAPbyc

37) https://youtu.be/bE6ssQewWqs

38) https://youtu.be/7h0gLK0vPdo

39) https://youtu.be/CISg8R1Tk1g

40) https://youtu.be/sEtbj2vrGQQ

41) https://youtu.be/y74sg_QMPZs

42) https://youtu.be/v1zPTv9J1u8

43) https://youtu.be/_P_YxUp7qok

44) https://youtu.be/v8IU4Row_kk

45) https://youtu.be/0FB1wXMBpnY

46) https://youtu.be/6j-vGguFfuk

47) https://youtu.be/cEGWFyGVdPo

48) https://youtu.be/DooPa_N5FL8

49) https://youtu.be/igVb9tY4qbI

50) https://youtu.be/wihqjZMXhhI

51) https://youtu.be/e9xxuOO429c

52) https://youtu.be/LjDNCX8KS24

53) https://youtu.be/vGLJfYAwFko

54) https://youtu.be/Q7SV2CXB_nw

55) https://youtu.be/CRlXH83bY7Q

56) https://youtu.be/Zg0hH3axkTI

57) https://youtu.be/qw9be91rFFc

58) https://youtu.be/ewpS2WD-nao

59) https://youtu.be/AqW8uRNYGP4

60) https://youtu.be/8dPDyGsdcoY

61) https://youtu.be/vflPVtDBquM

62) https://youtu.be/1ISe7-Q-ZG8

63) https://youtu.be/kJqhywrTx6Y

64) https://youtu.be/cKpsO7ah7rU

65) https://youtu.be/gHdKCqiQjK4

66) https://youtu.be/oLJHoRpABTg

67) https://youtu.be/ew82h5U_RLw

68) https://youtu.be/zFBEEZBckro

69) https://youtu.be/-4iKLJNY9Es

70) https://youtu.be/yn_pAGMIv5Q

71) https://youtu.be/vu6lspHv6u4

72) https://youtu.be/tPnSE-65Yww

73) https://youtu.be/yyridL3ZgaM

74) https://youtu.be/qipam3gXi64

75) https://youtu.be/4wenBIeHArQ

76) https://youtu.be/SqmaEExFOR8

77) https://youtu.be/-6rp8FUYlDY

78) https://youtu.be/U76ueVvP46I

79) https://youtu.be/2FXvjKtFIGI


శ్రీమతి కర్రా సూర్యకాంతం గారి వెబ్సైట్

http://ahambrahmasmisatsang.com

0891 2710309/2504151


ఆత్మ జ్ఞానం,ఆత్మ విద్య, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ విద్య పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన సమాచారం ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, Personality Development messages daily, join in group by this link www.freegurukul.org/join

**హిందూ ధర్మం** 61

  **దశిక రాము&*

**హిందూ ధర్మం** 61



మీ సేవకులను జాగ్రత్తగా చూసుకుంటున్నారని, వారందరూ మీ ఆజ్ఞను పాలిస్తున్నారని, మీరు మీ శత్రువులను జయించారని భావిస్తున్నాను. మీ రాజ్యంలో సైన్యం, మిత్రులు, పుత్రపౌత్రాదుల విషయంలో బంధాలు సక్రమంగానే ఉన్నాయని, ఆర్ధిక పరిస్థితి/వనరులు సరిగ్గానే ఉందని భావిస్తున్నా అంటూ వశిష్టమహర్షి విశ్వామిత్రుని అడిగుతాడు. అన్నీ బాగానే ఉన్నాయి అన్న సమాధానాన్ని విశ్వామిత్రుడు ఇస్తాడు. ఎన్నో సంవత్సరాల తర్వత కలిసిన వారిలా చాలా సేపు వీరిద్దరు ఆనందంతో అనేక విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆఖరున వశిష్ట మహర్షి 'నేను మీకు, మీ సమస్త సైన్యానికి మీ హోదాకు తగ్గట్టుగా ఆతిధ్యం ఇవ్వదల్చుకున్నాను, దయచేసి నా విజ్ఞప్తిని మన్నించండి్' అని విశ్వామిత్రునితో అన్నారు.


మీరు మా ఆశ్రమానికి వచ్చిన విశిష్టవంతమైన అతిధులు, కనుక దయతో నా విజ్ఞప్తిని మన్నించి, నా సేవలు అందుకోండి అని మహర్షి వేడుకున్నారు. అతిధి దేవో భవ అన్నది సనాతన ధర్మం. మన ఇంటికి వచ్చిన అతిధి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. అతిధి తృప్తి చెందితే, దేవతలు సంతోషిస్తారు.


అందువల్ల తన ఆశ్రమానికి విచ్చేసిన విశ్వామిత్రుడికి, అతని సైన్యానికి అతిధ్యం ఇవ్వాలని వశిష్టమహర్షి వారికి ఘనస్వాగతం పలికారు. ఇంత గొప్ప రాజును, కందమూలాలు, అడవిలో దొరికే పండ్లను మాకు భోజనంగా అందిస్తారు. నా సైన్యంలో ఉన్న ఏనుగులకు, గుర్రాలకు ఎక్కడి నుంచి తీసుకువస్తారు. అర్దం లేకుండా మాట్లాడుతున్నాడీ మహర్షి అనుకున్న విశ్వామిత్రుడు, మీరు నాతో పలికిన ప్రేమపూరితమైన పలుకులే నాకు మీరిచ్చిన గౌరవం. ఈ విధంగా మీరు నాకు గొప్ప ఆతిధ్యం ఇచ్చారు. వేరే విధమైన ఆతిధ్యం అవసరంలేదు అని జవాబిచ్చాడు.


రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, దాహం తీర్చారు, మీ దగ్గర కాసే పండ్లను ఇచ్చారు, ఇవన్నీ నాకు సంతోషాన్ని కలిగించాయి. అన్నిటికంటే విలువైనది మీ దర్శన భాగ్యమే. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న మీకు నమస్కరించడం, మీతో గడపడం, మాట్లాడడమే నా భాగ్యం. కనుక నన్ను మన్నించి, నన్ను వెళ్ళనివ్వండి అన్నారు విశ్వామిత్రుడు.

🙏🙏🙏

సేకరణ

మూకపంచశతి

  *ఆర్యాశతకము*🌷

మూకపంచశతి

🌹20.

శ్లోకం


శ్వేతా మన్థరహసితే


శాతా మధ్యేచ వాఙ్మనో౽తీతా౹


శీతా లోచనపాతేస్ఫీతా


కుచసీమ్ని శాశ్వతీమాతా౹౹


🌺భావం:


  స్వచ్ఛమైన తెల్లనిమందహాసము ,చల్లని కరుణా కటాక్షము,సన్నని నడుము ,ఉన్నతమైన వక్షఃస్ధలముతో కాంచీక్షేత్రమున కొలువు తీరిన ఆ కామాక్షీమాత వాఙ్మనోతీతమైనది. వాక్కు తో వర్ణించుటకు గాని మనస్సులో ఊహించుటకు గానీ శక్యము గాని చైతన్య స్వరూపము .ఆమెనిత్య ,శాశ్వతురాలుఅయి ఉన్నది.ప్రళయకాలమున కూడా సాక్షిగా ఉండు మహాప్రళయసాక్షిణి ఆ పరాత్పరియే !🙏


     🌼 ఆ తల్లి అనుగ్రహమునకై ప్రార్ధించుచున్నాను.


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 


ధర్మము-సంస్కృతి

🥀 #శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-26 🥀

 🥀 #శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-26 🥀 


 💮శ్లోకం 20💮


మహేష్వాసో మహీభర్తా శ్రీనివాస స్సతాంగతిః||

అనిరుద్ధ స్సురానందో గోవిన్దో గోవిదాం పతిః||


183. మహేష్వాసః --- తిరుగులేని, గొప్ప బాణములు ప్రయోగించువాడు; బ్రహ్మాండమగు ధనుస్సును ధరించినవాడు; గొప్ప విలుకాడు.

184. మహీభర్తా --- భూభారమును వహించినవాడు - ఆదికూర్మమై భూమిని భరించియుండు కూర్మావతార మూర్తి, పాతాళాంతర్గతయైన భూదేవిని ఉద్ధరించిన భూవరాహమూర్తి.

185. శ్రీనివాసః --- సిరికి నిలయమైనవాడు, శ్రీమహాలక్ష్మికి తన హృదయమే నివాస స్థానముగా నున్నవాడు.

186. సతాంగతిః --- సత్పురుషులకు, ముముక్షువులకు పరమగతియైనవాడు.

187. అనిరుద్ధః --- ఎవరివల్లను, ఎన్నడైనను నిరోధింపబడనివాడు; అపరిమిత చేష్టామూర్తి.

188. సురానందః --- దేవతలకు ఆనందము ప్రసాదించు దేవదేవుడు.

189. గోవిందః --- దేవతలచే ప్రస్తుతింపబడు దేవదేవుడు; మహార్ణవమునుండి భూమిని ఉద్ధరించిన శ్రీవరాహమూర్తి; గోవులను కాచేటి గోపాలుడు; వేదములనొసగిన, వేదముల ద్వారా పొందదగినవాడు, వేదవేద్యుడు.

190. గోవిదాం పతిః --- వేదార్ధములనెఱిగిన జ్ఞానులకు రక్షకుడు.


శ్లో. మహేష్వాసో మహీ భర్తా శ్రీనివాసః సతాంగతిః


అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః !!20!!


41. కార్ముకము ధరించు, కాశ్యపి నాథుడు,


లక్ష్మిపతియె, చూడ లక్షణముగ


సాధు సంతులకును శ్రయము నిచ్చుచునుండు


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : మహేష్వాసః ... మహేష్వాసో అంటే గొప్ప బాణప్రయోగము కలవాడు, మహీ భర్తా ... మహీభర్త అనగా భూమిని భరించువాడు, శ్రీనివాసః ... లక్ష్మీపతి, సతాంగతిః .. సాధుసంతులకు సమాశ్రయం కల్పించువాడు.


భావము : సారంగమను గొప్ప విల్లు (మహా ఇష్వాసం అనగా కార్ముకము అనగా విల్లు అనే యర్థాలూ ఉన్నవి గదా) ధరించిన,మరియూ దానిని గొప్పగా ప్రయోగించగల వాడు(ఎంత గొప్పగా బాణాలు ప్రయోగించగలడో, రామాయణంలో మనకు కొన్ని చోట్ల కనబడుతుంది. ), భూమికి భర్తయై సదా కాపాడు వాడు(కాశ్యపి అంటే భూమి అనే అర్థమూ ఉన్నది కదా), లక్ష్మి నివాసముగా గలవాడు లక్ష్మీపతి, సాధు సంతులకు సజ్జనులకు కూడా ఆశ్రయమిస్తూ తనలో కలుపుకునేవాడు(శ్రయము అన్నా ఆశ్రయము అన్నా ఒకటే కదా) అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)


42. ఎదురు లేని వాడె, యదితిజుల వరుడు


గోవు నెపుడు గాచు గోపతిగను


వేదములను కాయు వేద వేద్యుడతడె


వందనాలు హరికి వంద వేలు !!


{అర్థాలు : అనిరుద్ధః ... ఎదురు లేనివాడు, సురానందః ... దేవతలకు ఆనందము చేకూర్చువాడు, గోవిందః ... గో సంరక్షకుడు, గోవిదాం పతిః ... వేద సంరక్షకుడు.


భావము : తన కార్యక్రమాలలో ఏ విధమైన అడ్డంకులు ఎదురుకానివాడు, దేవతలకు (అదితిజులు అనగా అదితి పుత్రులే కదా) ఆనందం చేకూర్చేవాడు (వరుడు అనగా వరింపదగినవాడు... కోరదగిన వాడు), గోవు అంటే భూమి, వాక్కు, ఆవు, వేదములనే నానార్థాలున్నవి కనుక వాటిలో దేనికైనా అధినాథుడు, గోవిదాంపతి అనగా వేదములు తెలిసినవారిని రక్షించువాడు అని, వేదములు తెలిసినవారిలో మేటి అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.)


-ఓం నమో నారాయణాయ.

సౌందర్య లహరి శ్లోకము - 20

  

సౌందర్య లహరి శ్లోకము - 20

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)


(శ్రీ లలితాంబికాయైనమః)


కిరన్తీమఙ్గేభ్యః కిరణ నికురుమ్బా మృతరసం

హృది త్వామాధత్తే హిమకర శిలామూర్తిమివయః,

స సర్పాణాం దర్పం శమయతి శకున్తాధిప ఇవ

జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార సిరయా !!


తల్లీ ! సర్వావయవాల నుంచి ప్రసరించే కిరణ సమూహం నుంచి జనించిన అమృత రసాన్ని 

వర్షిస్తూన్న నిన్ను ఏ సాధకుడు చంద్ర కాంతమణి నిర్మిత దేహం గల ప్రతిమ మాదిరి హృదయం లో ప్రతిష్ఠించి ధ్యానిస్తూన్నాడో అతడు గరుత్మంతుడిలా సర్పాల దర్పాన్ని శమింప జేస్తున్నాడు. జ్వర తీవ్ర త చేత ఎంతో తాపంచెందే రోగులను అమృత

నాడియైన తన చల్లని చూపుచేత జ్వర బాధను తొలగించి సుఖాన్ని హాయిని కలిగిస్తున్నాడు.

.

ఓం మహామాయాయైనమః


ఓం మంత్రారాధ్యాయైనమః


ఓం మహాబలాయైనమః


🙏🙏🙏 

హిందూ ధర్మం - 21

  దశిక రాము హిందూ ధర్మం - 21

వికలాంగులైన ఈ 100 మంది, బాధపడుతూ, భారమైన మనసుతో, కంటతడి పెడుతూ, రాజమందిరంలోనికి ప్రవేశించగా, అది చూసిన కుశనాభుడు తన కూమార్తెలతో 'ఏం జరిగింది? మిమ్మలని ఈ స్థితికి తీసుకువచ్చిందెవరు, మీ ధర్మాన్ని నాశనం చేసిందెవరు, మిమ్ములని పొట్టిగా అందవీహినంగా చేసిందెవరు, మీరెందకు ఏమి చెప్పకుండా మౌనంగా ఉన్నారు' అంటూ ప్రశించాడు.


కుశనాభుడి మాటలు విన్న ఈ 100 ఆడపిల్లలు, ఆయన పాదాలకు తమ నుదురు తగిలేలా నమస్కరించి, 'వాయుదేవుడు సంకల్పం వలన మాకు ఈ స్థితి వచ్చింది' అని చెప్పి, జరిగినదంతా వివరిస్తారు. అప్పుడు కుశనాభుడు వారితో 'చాలామంచి పని చేశారమ్మా! నాకు చాలా గర్వంగా ఉంది. క్షమించడమనేది స్వీయ నియంత్రణ (తమ మీద తమకు నియంత్రణ) ఉన్నవారు మాత్రమే చేయగలరు. మీరు మానసికంగా బలవంతులు. మీరు చేసిన పనివల్ల మన వంశం కీర్తి మరింత పెరిగింది. క్షమా గుణం స్త్రీలకు అలంకారం. ఆమాటకు వస్తే, ప్రతి పురుషుడికి ఉండవలసిన లక్షణం. మీరు అప్సరస కమార్తెలు, శపించగల శక్తి ఉండి కూడా, నిగ్రహించుకున్నారు, సాధారణ మనుష్యులలా ఆవేశానికి లోనుకాలేదు.


క్షమా దానాం క్షమా సత్యం క్షమా యజ్ఞస్య పుత్రికా

క్షమా యశః క్షమా ధర్మః క్షమాయాం విష్ఠితం జగత్


క్షమా గుణమే దానము, సత్యము, క్షమయే గొప్ప యజ్ఞము, క్షమాగుణమే యశస్సు, క్షమించడమే ధర్మం, క్షమా గుణం చేతనే ఈ జగత్తంతా నడుస్తున్నది ఓ పుత్రికలారా! అని కుశనాభుడు వారి యొక్క క్షమాగుణాన్ని పొగిడారు.


తర్వాత బ్రహ్మదత్తుడనే ఒక ఋషుతుల్యుడైన మహారాజుకిచ్చి వివాహం చేశారు. వివాహానంతరం బ్రహ్మదత్తుని చేయి తగలగానే, 100 మంది తమ పూర్వరూపాన్ని పొందారు.


తరువాయి భాగం రేపు....

🙏🙏🙏

సేకరణ