ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
6, నవంబర్ 2020, శుక్రవారం
శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు
శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు
సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహా లక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె దృష్టి మన మిద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మం గ తెలుసుకొందాము. పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వార లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.
1. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మిద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.
2. ప్రధాన ద్వారం తలుపు మిద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.
3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.
4. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.
5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.
6. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.
7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.
8. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.
9. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.
10. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.
11. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.
12. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.
13. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జుదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.
14. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.
15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు
ధర్మరాజు జూదమెందుకు
ధర్మరాజు జూదమెందుకు ఆడాడు?
సమాధానం వ్యాస భారతం సభాపర్వం 46 వ అధ్యాయం
( వ్యాసుని భవిష్య వాణి - యుధిష్ఠిరుని ప్రతిజ్ఞ )
ధర్మరాజు రాజసూయయాగం పూర్తి అయిన తరువాత వ్యాసుడు తన శిష్యులతో కలిసి ధర్మరాజు దగ్గరకు వచ్చాడు.
ధర్మరాజు ఆయనకు అర్ఘ్య పాద్యాదులు సమర్పించి, పితామహా ! రాజసూయయాగం జరుగుతున్న సమయంలో శిశుపాల వధ జరిగింది. దాని వలన ఏమైనా ఉత్పాతాలు జరుగుతాయా అని అడిగాడు.
వ్యాసుడు ధర్మనందనా ఈ మహోత్పాతాల ఫలితం పదమూడు సంవత్సరాలు ఉంటుంది. సర్వ క్షత్రియ నాశనం జరుగుతుంది. ( త్రయోదశ సమా రాజన్ ఉత్పాతానాం ఫలం మహత్. సర్వ క్షత్రియ వినాశాయ భవిష్యతి విశాంపతే )
సమయం రాగానే నీ కారణంగా, దుర్యోధనుని అపరాధం వలన, భీమార్జునుల పరాక్రమం వలన భూమి మీద రాజులందరూ యుద్ధం లో నాశనమౌతారు. కాలో హి దురతిక్రమః కాలం దాటరానిది. అని చెప్పి కైలాసానికి వెళ్ళాడు.
తాతగారు వెళ్ళాక ధర్మరాజు పౌరుషం తో దైవాన్ని అడ్డుకోవడం ఎలా శక్యము. మహర్షి చెప్పింది తప్పకుండా జరుగుతుంది. అనుకొని తమ్ములతో పురుష సింహాల్లారా ! వ్యాస మహర్షి చెప్పింది విన్నారుకదా! సర్వ క్షత్రియ వినాశానికి విధి నన్నే కారణం చేయదలచుకొంటే నేను జీవించటం వలన ప్రయోజనమేంటి? ధర్మరాజు మాటలు విని అర్జునుడు రాజా పాప భూయిష్టమైన మోహాన్న పొందకు. ధైర్యం వహించి ఏది మేలో అది ఆచరించు అన్నాడు.
అర్జునుని మాటలు విని ధర్మరాజు ,
మీ అందరికి క్షేమం కలుగుగాక! నాయనలారా బ్రతికి ఉన్నా పదమూడేళ్ళ నా వలన ప్రయోజనమేముంటుంది. కనుక నేటి నుండి నేను చేసే ప్రతిఙ్ఞ వినండి
( న ప్రవక్ష్యామి పరుషం భ్రాతృనన్యాంశ్చ పార్ధివాన్
స్థితో నిదేశే ఙ్ఞాతీనాం యోక్ష్యే తత్
సముదాహరన్ )
సోదరులను గాని, ఇతర రాజులను గాని పరుషంగా మాట్లాడను. ఙ్ఞాతుల ( దుర్యోధనునాదుల ) ఆఙ్ఞను పాటిస్తూ, వారు అడిగినవన్ని ఇవ్వటంలో నిమగ్నమౌతాను.
వైర భావాన్ని దూరంగా ఉంచుతూ, అందరికీ ప్రియాన్ని ఆచరిస్తూ ఉంటే నాకు లోకంలో నింద కలుగదు.
తమ అన్నగారి ప్రతిఙ్ఞ విని పాండవులందరూ అతనికి మేలు చేయటంలో తత్పరులై అన్నను అనుసరించసాగారు.
ఈ ప్రతిన కారణంగా ధర్మరాజు జూదానికి వెళ్ళాడు. అక్కడ అవమానాలు జరిగినా పంటి బిగువున భరించి వనవాసానికి బయలు దేరాడు.
( నేను సంక్షిప్తంగా చెప్పాను. ఔత్సాహికులు వ్యాస భారతం ( గీతా ప్రెస్. గోరక్‌పూర్ ) వారి సభా పర్వం 46 వ అధ్యాయం సంప్రతించగలరు. .... ఈ అధ్యాయాన్ని నన్నయభట్టు అనువదించలేదు. )
భవదీయుడు
శారదా ప్రసన్న -- కడప.
6.3 మానసిక అంశ :-
6.3 మానసిక అంశ :-
మూడవ స్థాయి మానసిక అంశ. మనసుని నియంత్రించుకునే కార్యక్రమం.అన్నిరకాల ధ్యానాలూ మానసిక తపస్సు క్రిందకి వస్తాయి. కాని ధ్యానం ఒక్కటే మానస తపస్సుకి చాలదు. ప్రాధమికంగా ఉపాసన అంటే మానస తపస్సుకి చేసే ధ్యానం. కాని శరీరాన్ని, వాక్కుని నియంత్రించందే మనసుని నియంత్రించలేము కాబట్టి, కాయిక, వాచిక తపస్సులని మానసిక
తపస్సుకి తొలిమెట్టుగా భావిస్తాము. ఎందుకంటే మనస్సు సూక్ష్మమైనది. తేలిగ్గా అదుపులో పెట్టలేనిది. అందువల్ల ముందు శరీరాన్ని, వాక్కుని అదుపులో పెట్టుకోవాలి. ఇవి తర్వాత
మనసుని నియంత్రించటానికి పరోక్షంగా పనికొస్తాయి.
అందుకే ఏ ధ్యానయోగ కార్యక్రమమున్నా దాంట్లో కాయిక, వాక్ తపస్సులు కూడా ఉంటాయి. అష్టాంగయోగంలో కూడా పతంజలి ముఖ్య ఉద్దేశం మానస తపస్సే
అయినా కాయిక వాచిక తపస్సులను కూడా ప్రస్తావిస్తాడు. భగవద్గీతలో ఆరవ అధ్యాయం పేరు ఆత్మసంయమన యోగం అయినా కృష్ణభగవానుడు ఆహార నియమాలని గురించి కూడా
మాట్లాడుతాడు.మనసు,వాక్కులకు సంబంధమున్నట్టుగా, మనసు, శరీరానికి కూడా సంబంధముంది. అందుకే విపరీతమైన కోపం వచ్చినప్పుడు నిదానంగా, మర్యాదగా ఉండటం
కష్టం.అందుకని ఉపాసన అంటే ప్రాధమికంగా మానస తపస్సు. పరోక్షంగా కాయిక, వాచిక తపస్సు.
మన వీలు కోసం, అన్ని రకాల ధ్యానాలనీ నాలుగు రకాలుగా విభజించవచ్చు మన మనసులో మనం పెంపొందించుకోవాలనుకుంటున్న అంశాన్ని బట్టి.
అద్వైత వేదాంత పరిచయం
6.3.1 విశ్రాంతి ధ్యానం :- ఈ ధ్యానంలో ముఖ్యంగా మనసుని విశ్రాంతిపరచటం ఉన్నా, తక్కిన శరీర భాగాలనికూడా విశ్రాంతి పరుస్తాము. ఇందులో శారీరక విశ్రాంతి,
వాచిక విశ్రాంతి, ఇంద్రియాత్మక విశ్రాంతి యిస్తాము. అప్పుడు చివరికి మనసుకి విశ్రాంతి లభిస్తుంది. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి తగ్గించుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
అందుకని విశ్రాంతి ధ్యానాన్ని ఒత్తిడి నిర్మూలించే ధ్యానం అని కూడా అనవచ్చు. ప్రతిరోజూ కాసేపు విశ్రాంతిగా కూర్చోవటం సాధన చేయండి. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా
అవసరం. దీనికి ఏ పద్ధతి అన్నా వాడవచ్చు. ఉదాహరణకి ఒక మంత్రాన్ని జపించటమో, మీ శ్వాసమీద ధ్యాస పెట్టటమో, లేదా కేవలం శాంతి: అనటమో చేయవచ్చు.
అద్వైత వేదాంత పరిచయం
6.3.2 ఏకాగ్రతాధ్యానం :- ఈ ఏకాగ్రత ధ్యానంలో మనసుని ఒక దానిమీద కేంద్రీకరించటం, కేంద్రీకరించే సమయాన్నిపెంచటం సాధన చేస్తాము. ప్రాపంచిక విషయం మీద
కానీ, ఆధ్యాత్మిక విషయం మీద కాని కొంత నియమిత కాలపరిమితి సేపు ఏకాగ్రత కలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.
దీనికి మన శాస్త్రంలో మూడు పద్ధతులు సూచించబడ్డాయి.
మానసపూజ - షోడశోపచార పూజ చేయటం.
మానస పారాయణం - ఏ ప్రార్థన అన్నా చేయటం
మానస జపం - ఏదో ఒక నామం తీసుకుని జపం
చేయటం.
అద్వైత వేదాంత పరిచయం
6.3.3 విశాలదృక్పధ ధ్యానం :- ఇందులో సృష్టిమొత్తాన్ని ఊహించుకుంటాము. అప్పుడే అనంత విశ్వంలో మనం చాలా, చాలా చిన్నవాళ్ళమని - దాదాపు సున్నాతో
సమానమని అర్థమవుతుంది. మనకేదో మన జీవితం గురించి, పరిస్థితుల గురించి తలకి మించిన భావాలున్నాయి. మన సమస్యలే అంతర్జాతీయ సమస్యలంత పెద్దవనీ, మనం లేకపోతే
ప్రపంచం తల్లకిందులై పోతుందనీ తెగ ఊహించేసుకుంటాం.అలాంటి తప్పుడు ఆలోచన,దేని స్థానంలో అది ఉండాలనే తప్పుడుప్రతిస్పందనలకి దారి తీస్తుంది.మన స్థానం విశ్వంలో
ఎక్కడుందో మనకొక అవగాహన
ఉండాలి. సృష్టినంతా ఊహించుకోవాలి. ఆకాశం, నక్షత్ర కూటమి, సౌర కుటుంబం, గ్రహాలు, ఖండాలు, నదులు, కొండలు, పక్షులు, జంతువులు, మనష్యులు. దీన్ని విశ్వరూప ధ్యానం
అంటారు. ఇందులో సృష్టి ప్రకరణం ఉంటుంది.
అద్వైత వేదాంత పరిచయం
6.3.4 విలువల ధ్యానం : దీన్ని మార్పు ధ్యానం అనికూడా అంటారు. ఇక్కడ మన ఆలోచనా తీరుని మార్చటం వల్ల, మనం సంపూర్ణంగా అంతర్గతంగా మారుతాము.
మనం సాధారణంగా మన ఆలోచనా తీరుని పట్టించుకోము. ఎందుకంటే, అది చాలా సూక్ష ్మంగా ఉంటుంది, క్షణంలో మాయమవుతుంది. తక్కిన వాళ్ళు చూడలేరు. కాని మన
ఆలోచనా తీరు మన జీవితాన్ని, మన గమనాన్ని, మన లక్ష్యాన్ని నిర్ణయిస్తుందన్న విషయం మర్చిపోకూడదు.
మీ ఆలోచనలని గమనించండి, అవి మీ మాటలవుతాయి.
మీ మాటలను గమనించండి, అవి మీ కార్యాలవుతాయి.
మీ కార్యాలను గమనించండి, అవి మీ అలవాట్లవుతాయి.
మీ అలవాట్లను గమనించండి, అవి మీ నడవడిక అవుతుంది.
మీ నడవడికను గమనించండి, అది మీ గమ్యం అవుతుంది.
అందుకని మీ ఆలోచన, మీ భవిష్యత్తుని నిర్ణయించే సూక్ష ్మమైన బీజం. యద్భావం తద్భవతి మీరెలా ఆలోచిస్తే, అది అవుతారు.
🙏🙏🙏
సేకరణ
మానవ సంబంధాలు
:
"మానవ సంబంధాలు" (భావప్రకటనా నైపుణ్యము). 1) "మాటలేనా, మరి చూపులు కావా? సహజమే కదా! కాసేపు పక్కన పెట్టండి. ,(2)"ఒక "బొమ్మ" వేల ఊహలకు ప్రాణం పోస్తుంది. "బొమ్మ",. "ఊహ లు"? , వేల ఊహలు? "ప్రాణం పోయడం". ,(3)"మానవ జీవితం అందమైనది. అది ఒక అపురూపమైన వరం. వృధా చేసుకోటానికి ఇవ్వబడలేదు.". ( 4)"ఓ మనిషి, "శిలలు" నీ వే ,. శవి నీవే: "
మానవ సంబంధాలు" పార్ట్ 2,;. , ప్రస్తుతం తగ్గిపోతున్న ఉమ్మడి కుటుంబాలు, పెరుగు చున్నవి, "న్యూట్రల్" కుటుంబాలు. చాలా వరకు వాటి విలువలు తగ్గిపోతున్నాయి. మన జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉన్నాయి. ఇద్దరు వ్యక్తులు ఫీలింగ్స్, కనెక్షన్, రిలేషన్, కుటుంబములో లోపించినప్పుడు సుఖశాంతులు, దూరమై" యుద్ధాలు,", గందరగోళం, అశాంతి, పీఠం వేస్తాయి. మానవుడు సంఘజీవి, సమాజంతో నిత్యము కలిసి బతకాలి. కొలాబరేషన్ గా ఉండాలి , పని, వ్యాపారము నందు, పనిచేసే స్థలము నందు కలిసిమెలిసి జీవించాలి. సొంతంగా చేసుకోలేని పనులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ ఆఫీసులోనూ, ఇతర కార్యాలయాలతో అనుసంధానమై, మనకు కావలసినటువంటి సేవలు పొందవలసి ఉన్నది. (ఉదా: రోడ్లు, బస్సులు, పరిసరాల శుభ్రత, త్రాగునీరు) అవి వుమ్మడి గా చేసుకొనవలసిన చాలా ఉన్నవి. అందుకే మనము ఆస్తి పన్ను, ఇంటి పన్ను, వివిధ రకాలైన పనుల ద్వారా, ప్రభుత్వానికి చెల్లించి, మన అవసరాలు తీర్చు కోవాలని ఉన్నది. అధికారులతో, నాయకులతో సాటి ప్రజలతో ఎలా మాట్లాడాలి? ఎలా అనుబంధం "పెంచుకోవాలి మానవ సంబంధాలు" తెలుసుకొనుట, ఆచరించుట చాలా నేడు ముఖ్యము. కొన్ని విషయాల మీద ఆత్రుత, తాపత్రయము, పడి, ఆత్మీయుల తోనూ, స్నేహితులతో, రక్త బంధువులతో మన బాధలు ,కష్టాలు, చెప్పుకొని ఉపశమనం పొందగలము. గుండె బరువు దించుకో గలము. "ఈ మానవ సంబంధాల విషయంలో మనము తీసుకోవలసిన జాగ్రత్తలు, ఉపయోగాలు, నడుచుకోవాల్సిన విధానములు, నియమములు, తెలుసుకోదగినవి, ఆచరించదగినది, అనేకము ఉన్నవి, ప్రస్తుతము కొన్ని విషయాలు తెలుసుకుందాం! సరేనా! 1)"ముందు మనలను మనము ప్రేమించుకోవాలి. మనకి మనమే నచ్చాలి. 2)"మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి పోతే, మీరు మీరు కనిపెట్టిన వ్యక్తి లో అన్ని తప్పులే కనిపిస్తాయి. మీ ఊరికి మీద దృష్టి కేంద్రీకరిస్తే, దాన్ని అనుభవిస్తే, ప్రేమిస్తే, ప్రశంసిస్తే మిమ్మల్ని మీరు పూర్తిగా ప్రేమించు కో కాగలరు. 3) "పాజిటివ్ థింకింగ్" మాత్రమే చేయాలి, ఒకవేళ "నెగిటివ్ థాట్స్" మీ దృష్టిలో ఉన్న, వాటిని "పాజిటివ్" లోకి మార్చు కోవాలి. 4) "స్కూల్, కాలేజ్, ఫ్రెండ్స్ ను వర్క్ ప్లేస్ ఫ్రెండ్స్ ను లాంగ్ టైం మెయింటైన్ చేయాలి. "Work is worship" గుడ్ రిలేషన్స్ పెంచుకోవాలి.5) " మనం "ఎదుటి వాళ్ళు" ఎలా ఉన్నా ఇష్టమైన వాళ్ళు అయినా, కాకపోయినా, అంగీకరించాలి. 6)"కాకి పిల్ల కాకికి ముద్దు",. ఎదుటివారు వారు చెప్పినది ఓపికగా, పూర్తిగా వినడం, నేర్చుకోండి. 7)"విషయాలను"effective" గా గుర్తు పెట్టుకోండి. 8) నీ పక్క వాళ్ళను అనుమతించు. 9)"motivation" చేయుటకు ఎవరూ రారు. ఎల్లవేళలా నీకు నీవే "motivation" చేసుకో, చేసిన తప్పే తిరిగి చేయకు. 10) పోటీ అనేది ఎదుటివారితో కాదు, నీకు నీవే పోటీ? నీ అంతరాత్మ సాక్షి, నీకు నీవే "నమ్మకం", ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి, ఎదుటి వారితో పోటీ ఆరోగ్యకరమైన పోటీ గా ఉండాలి. 11) "పిల్లలను కూడా మనము గౌరవించే విధంగా మనము ఉండితీరాలి. 12) మనకు చాలా అడ్డంకులు వస్తాయి, మనలాగే మన సంబంధాలు ఉంటాయి. 13)"నేను ఉన్నాను అని భరోసా ఇస్తూ ఏమీ చింతించవద్దు అని మీ వారికి చెప్పండి (ఆపదలు వచ్చి బాధపడేవారికి). 14)"ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఒప్పుకునేది ధైర్యం ఉండాలి, "క్షమించండి" అనే పదము వెంటనే చెప్పే సంస్కారము ఉండాలి. 15) "మీరు ఎదుటివారి నుంచి" చిన్న ప్రశంస" చేస్తే వారు ఇంకా పని బాగా చేస్తారు అని గుర్తుపెట్టుకోండి". 16)"హెచ్చరిక" ఎలా కాకుండా, సలహా గా ఇవ్వు,. బాగా చేశావు. ఇలా చేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పు? 17) ఎదుటివారిని "కించపరచి " మాట్లాడుట చేయరాదు. 18) నీ జీవితమంతా thank you, please, many many thanks, కృతజ్ఞతా భావంతో చిరునవ్వుతో, మందహాసముతో స్నేహ వాతావరణాన్ని నీ కళ్ళతో చూపించు, నీ మనసుతో మాట్లాడు, అట్లా అని అధికం కూడా చేయరాదు. సమ పాళ్లు సమయానికి తగ్గట్లు ఉపయోగించుట మీ నేర్పు, ఓర్పు, వీరు సంస్కారంతో ప్రవర్తించండి. 17) "నేను" అనే పదాన్ని మార్చండి, " I " చూశారా ఈ అక్షరం, నిట్ట నిలువుగా గర్వం గా "అహం" ఉంది కదా! మిగతా అన్ని అక్షరాలు ఒంగి ఉంటాయి. మనం, మనమందరము, మనకు, మేము, అనే పదాలు వాడండి, ఈ నేను ను దానికి ఎంతో బలమైన శక్తి తో ఒక సృష్టి జరుగుతుంది. 18)"గత తప్పిదాలను తవ్వకండి, మీరు మానవ సంబంధాలు పెరగాలనుకుంటున్నారా కదా! 19)"మీలో నిజాయితీ ముఖ్యం. 20)"self respect" కాపాడుకోండి. 21) నీ "emotions" కంట్రోల్ లో పెట్టుకో! 22)"మనిషిని మనిషిలాగా చూచుట నేర్చుకోండి? 23)"ఎదుటి వారి నుండి ఏది ఆశించరు చేయకు? 24)" మీ రు మాటలకి అందని "ప్రతిభ "గలవారు. నా వంకర ,టింకర అక్షరాలతో ప్రశంసించుట చేతకాని వాడిని! "Mazumdar, Bangalore"
:
4) ఓ మనిషి, శిలవు నీవే, శిల్పి వి నీవే, చెక్కిన శిల్పం నివే". ,"మానవ సంబంధాలు"(భావప్రకటనా నైపుణ్యం) ఇది మనకు ఎలా తెలుస్తుంది. (touch, movement,sight,sounds,smell, taste) ,(5) "మనం" అంటే మన ఆలోచనలు, మాటలు, చేతలు, భావాలు, భావోద్రేకాలు, వైఖరి, అలవాట్లు, ప్రవర్తన, ఇలా కొన్ని, ఇంకెన్నో పూలు పూస్తాయి, ఆ పూలను భారీగా అందంగా ఆకర్షణీయంగా, మంచి నైపుణ్యంతో, శ్రద్ధ పెట్టి, పట్టుదలగా శోభాయమానంగా, ఓర్పుగా ,నేర్పుగా,"పుష్పహారం" తగిన విధంగా ఘనంగా తీర్చిదిద్దుతాం, దానికే "మనం " వ్యక్తిత్వం" అని పేరు పెట్టి పిలుస్తాం. కదా! , (6)"ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఎంత, ఎందుకు ?ఎవరితో, మౌనంగా ఉండాలో తెలుసుకొని మసలుకో గలిగితే మానవ సంబంధాలు, ఎవరి మధ్యనైనా పరిమళాలు, వెదజల్లుతూ, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేలా చూసుకోండి! మీరు ఆలోచించాలా? దేనికి? 1) "మాట్లాడటానికి" ముందే ఆలోచించండి. 2)"లిఖితపూర్వకంగా" రాసి ఇవ్వటానికి ముందు ఆలోచించండి. 3)"వినటానికి" ముందే ఆలోచించండి. 4)"మాట "ఇవ్వటానికి ముందే ఆలోచించండి. 5)" శబధం "చేసే ముందే ఆలోచించండి. 6)"తినుటకు" ముందే ఆలోచించండి. , "అసంబద్ధమైన" మాటలు పనికిరావు,. అపార్థం ఆవేశంతో మీ నిర్ణయాలు ప్రకటించండి, "నిదానమే ప్రధానము" "అహంభావము లేని "సమతుల్య స్థితిలో" తెలియపరచండి. మన హృదయములో ప్రేమను ఎంత నింపుకుంటే, ప్రేమించగలుగు తే "జీవితపరమార్థం" అవగతం అవుతుంది. ఈ క్రింది అంశాల గురించి గమనించండి.1)"నీవు ఎదుటివారిని ప్రభావితం చేయగలవు.2)"నీవు సమస్య ఎక్కడ ఉంది ? అని తెలుసుకుని దానికి పరిష్కార మార్గాలు "అన్వేషించి" చెయ్యి. 3)"ముందుగా నీవు "మార్పులకు "స్వాగతం పలకటం నేర్చుకో! 4) నీవు మానవ సంబంధాలు అభివృద్ధి పరచు"విజయ లక్ష్యాలు " తప్పక సాధించగలవు. 5)"శ్రమ నీ ఆయుధమైతే "విజయం" నీకు బానిస అవుతుంది. 6)"పకృతి ధర్మాలకు అనుగుణంగా "సక్సెస్" సాధించగలమని తెలుసుకో! 7) ఎదుటివారి దృక్పథం నుండి కూడా పరిశీలించండి. 8) బాగా మనసుపెట్టి వి నడటం అలవాటు చేసుకోండి. 9) ప్రశాంతమైన వాతావరణం లో "మందహాసము తో కూడిన చిరునవ్వు" అలవాటు చేసుకోండి,. 10) "సమయాన్ని, సందర్భాన్ని, గమనించండి , అప్పుడు "విశ్లేషణ" చేయండి! 11)"సరైన మార్గాన్ని, తగిన సమయాన్ని, అవసరమైన ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని సమస్యలు పరిష్కారము చెయ్యండి. 12)"ఉదాత్తమైన" ప్రవర్తన అలవాటు చేసుకోండి. 13)"వ్యక్తులు చేసే పనులను బట్టి "విలువ" ఇస్తారు. 14)"ఉత్సాహం" అనేది మనిషికి ఒక "కీ" లాంటిది. 15) "మీరు విశాల హృదయంతో ఆలోచించే "మనస్తత్వాన్ని" పరిష్కార దిశగా పావులు కదపం డి,! "Majumdar, Bangalore"
:
"మానవ సంబంధాలు". పార్ట్ :3 ; సేకరణ & సమర్పణ :--" "మజుందార్, బెంగుళూర్" నేడు మానవ సంబంధాలన్నీ "ఆర్ధిక సంబంధాల తో" ముడిపడి ఉన్నాయి. మనుషులు - మమతలు; chudi కే మనిషి రూపము చూచుటకు మనిషి రూపము కానీ హృదయము సింహము యొక్క కాటిన్యం, నమ్ముట కూడా భయపడుతున్నారు. మేడిపండు లాగా ఉంది. ఆ డబ్బు సంబంధం ముడిపడిన తరువాత తిరిగి వారు మాట్లాడరు. అసలు ఈ మానవ సంబంధాలు తెచ్చుకుంటానని కి, దూరం అవడానికి ముఖ్య కారణం "డబ్బు, ఆస్తి ,హోదా," అని తెలుస్తోంది. మీకు తల్లి ,తండ్రి లేరు. కోడలు అత్త ను" అమ్మ" అనగలిగితే, అత్త కూడా కోడలు ను కూతురు లాగా చూసుకో గలిగితే ఆ ఇల్లు స్వర్గమే! మనం ఈ భూమి మీదకు వచ్చినప్పటి నుండి మరణించే వరకు ఎక్కడో ,ఎప్పుడో, మీ బంధం, "బ్రేక్" పడుతుంది. తిరిగి దానిని "Re- Built" చేసుకోవాలి. Ego తో పాటు పొయి Relation బలపరచుట కు ప్రయత్నం చేస్తే, పెరగదు, కట్ అయిపోతుంది. అప్పుడు మీరు అసలు సమస్యకు మార్పుని ఎక్కడ అనే విషయం గ్రహించాలి. ఎక్కడ ఎలా మార్చుకుంటే, మనం విజయ లక్ష్యాలు "మానవ సంబంధాలు" పెంచుకోవాలి. మధ్య జరిగే సంఘర్షణ కు మూడు (3) మాటలు వాడాలి. Sorry, Thank You, చిన్న పని అయినా, పెద్ద పని అయినా! తప్పు ఉన్న, లేకున్నా ఇప్పటినుండి మార్చుకుందాం? 1)"అ) మా ఆవిడ చాలా మంచిది, కానీ కోపము ఎక్కువ? (ఆ) కోపము ఎక్కువ? మా ఆవిడ చాలా మంచిది. అని అంటే ఎలా ఉంది. 2)"అ) మా అబ్బాయి బాగా ఆడతాడు కానీ మా అబ్బాయి బాగా చదువుతాడు. (ఆ) "మా అబ్బాయి బాగా చదువుతాడు, కానీ బాగా ఆడతాడు. ఇలా అంటే ఎలా ఉంది. బాగా ఆలోచించండి. అందుకే వీరు తప్పులు గుర్తుంచుకో వద్దు, ఎదుటివారి ఒప్పు లేనే గుర్తుంచుకోండి. మురికి నీరు త్రాగడానికి పనికి రాకపోవచ్చు కానీ మంటలు ఆర్పటానికి పనికి వస్తుంది. మీరు Top 10 friends పేర్లు వరుస క్రమం గా రాయండి. అలాగే పది మంది టాప్ రిలేషన్షిప్ ఉన్న వారు పేర్లు కూడా రాయండి? వారికి ఫోను చేసి మాట్లాడండి ? ( ఈ స్నేహితులు, రక్త బంధువులు ప్రస్తుతం మీకు చాలా దూరంగా వారితో రిలేషన్ కట్ అయిన వారై ఉండాలి. ) నీలో ఉన్న బ్యాడ్ మెమరీస్ ఎలా పోగొట్టుకోవాలి? ఆ సమస్యను కళ్ళు మూసుకుని ఒకసారి 70 M.M లో చూడండి, తదుపరి 35M.M లో చేసి చూడండి, background, sound mute చేసి చూడండి, black and white చేయాలి. పాత సినిమా రిలీజ్ ఫిలిం నలిగి పోయినది, వేస్తే బొమ్మ సరిగా కనబడదు. కరెంటు పోయినప్పుడు గీత వస్తుంది. అలాగే మీ సమస్యను కూడా మెల్లమెల్లగా చిన్నదైపోయి పోతుంది. అలాగే మీ సమస్యలను కూడా డా బయట పారేయండి. మరి మీ రేషన్ కూడా చెరిపేస్తే ఒక్కసారి గుర్తు చేసుకోండి. తల్లి తండ్రి ని ఎవరు బాగా చూసుకుంటారో వారికి జబ్బులు రావు ఆరోగ్యం బాగుండును అత్తమామలను కూడా తల్లి తండ్రులుగా భావించాలి. అప్పుడు ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. మీ ట్రీట్మెంట్ లో మార్పు ఉంటుంది. మీరందరూ పెద్ద సర్కిల్ లో ఉన్నాము అని అనుకుంటారు అసలు సర్కిల్ అంటే ఏమిటి? మొట్ట మొదట నీ తల్లిదండ్రులు, తరువాత రక్త బంధువులు, ఆ తర్వాత సొసైటీ ఫ్రెండ్స్ మొదలగువారు. నీ శ్రేయస్సు ఈ మంచి కోరే వారు మొట్టమొదట నీ తల్లి తండ్రి మాత్రమే అని గుర్తించండి. వారిని ఎటువంటి పరిస్థితులలోనూ వృద్ధాప్యం ఆశ్రమాలకు పంపకండి. పెండ్లి అనేది "హార్డ్ డిస్క్స్". బీరు ఎర్ర బస్సు ఎక్కిన తరువాత మధ్యలో హైటెక్ బస్సు వచ్చిన ఎక్కడ ఎక్కరు కదా? ఎక్కిన దొరికిన బస్సు తో తృప్తి పడాలి. Chance -."మార్చగలిగితే మార్చండి. Accept:- ఆమోదించండి. Egnore :-ఆ సమస్యను వదిలేయండి. తాళం తయారు చేసిన వాడు తాళంచెవి కూడా తయారు చేస్తాడు. మీరు సమస్యను భూతద్దంలో చూస్తారు ఎందుకు? దూరంగా ఉన్న చందమామ చిన్నదిగానే కనిపిస్తుంది. మీ సమస్యను చిన్న ముక్కలు ,ముక్కలుగా చేసి పారేయండి. నీ శ్రేష్టమైన ప్రేమను రిపేర్ చేసుకోండి. గతము ఏదైతే ఉన్నదో దానిని ఎలా చూస్తున్నారో! అంటే చాక్లెట్ ను మీరు ఆస్వాదించలేక పోవుచున్నారు అని అర్థము. (ఎరేజర్ తీయలేక పోవుచున్నారు అంటే గతాన్ని అట్టి పెట్టుకున్నారు). "గతం గతః హ"(గతాన్ని వదిలిపెట్టండి). ఇప్పుడు టూ వీలర్ బండి నుండి ఫోర్ వీలర్ కు వెళ్లి నాము. అద్దం లో ఏమి అనిపిస్తుంది. రియల్ గా ఎవరైనా వస్తే చూసి డ్రైవ్ చేస్తాము. డ్రైవింగ్ మీద కాకుండా పిర్రలు చూసి డ్రైవింగ్ చేస్తే వెళ్ళగలమా? మీ జీవితంలో జరిగిన విషయాలు మిర్రర్ ను బట్టి చేయడు కదా? "Personal relations" 1)"Equality:-. 2) Acceptance:-. 3)"Empathy :-. 4)" Ignoring :-. 5)" Erase :-. 6)" make others happy (or) C reator of happiness. ;. 7)" Building Bridges :-. "Professional relations". 1)"always smile in working place:-. 2)"be sincere. 3)" barrier of good news" :-. 4)" Try to make people happy:-. వివాదాల జోలికి పోకూడదు. 5) use proper body language:-. లెక్కలేకుండా ఉండకూడదు 6)" Organisation structure :-పై నుండి కింది వరకు అందరిని గౌరవంగా చూడాలి. నేడు మానవ సంబంధాలు బాధ పంచుకొనుటకు, నైతిక విలువలు, జీవనశైలి, కాలంతో మార్పు ఆహ్వానిస్తూ, తామరాకు మీద నీటి బిందువులా ఉండుట కాదు. కష్టసుఖాలలో, నేను అనే వాడిని ఉన్నాను అని భుజం తట్టి ధైర్యం ఉండాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సన్నాహాలు ఏమి చేయాలి. మొక్కయి వంగనిది మ్రానై వంగునా? అందుకే ఓకే మీ చిన్నారుల యొక్క పెంపకము నుండే సరియైన శిక్షణ, అనుకూలమైన వాతావరణం కల్పించి, భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు పునరుద్ధరించాలి. జై హింద్! జై భారత్!
గోచారములు - ఫలితాలు
గోచారములు - ఫలితాలు
జ్యోతిష్య శాస్త్రంలో అనేక విధాల అధ్యయనాలున్నాయి. ఇందులో భాగంగా గోచారం ఉంది. గోచారము అంటే ప్రస్తుత గ్రహస్తితిని బట్టి వ్యక్తికి సంబంధించిన రాశి ఫలము. జాతకచక్రంలో వ్యక్తి జన్మించినప్రథమ భాగాన్ని లగ్నంగా తీసుకుంటారు. చంద్రుడున్న నక్షత్రాన్ని ఆ వ్యక్తి జన్మ నక్షత్రంగానూ, ఆ చంద్రుడున్న రాశిని ఆ వ్యక్తి రాశి గానూ చెబుతారు.
ఉదాహరణకు... 2014 సెప్టెంబర్ 25 తేదీన సూర్యోదయంలో(సుమారు 6 గంటలకి) జన్మించిన వ్యక్తి ఐతే, ఆ సమయానికి చంద్రుడున్న హస్త నక్షత్రం ఆ వ్యక్తి జన్మ నక్షత్రం, అలాగే చంద్రుడున్న రాశి కన్య ఆవ్యక్తి రాశి అవుతుంది. ఆ సమయంలో ఉదయిస్తున్న రాశి లగ్నము అవుతుంది. ఈ లగ్నాన్ని అనుసరించి జీవితంలోని స్వభావ, రోగ, వృత్తి, వివాహ, సంతాన, ప్రమాద మొదలైన అంశాలు నిర్ణయిస్తారు. గోచారానికి జాతకంతో ఉన్న సంబంధం ఒక వ్యక్తికి ఈ అంశాలకి సంబంధించిన పూర్తి సమాచారం అతని జాతకం చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. కాలాన్ని బట్టి వచ్చే మార్పులు పాప పుణ్యబలాల్ని సుఖ ఫలంగానూ దు:ఖ ఫలంగానూ చూపించే పట్టిక గోచారము. జాతకంలో ఉద్యోగంకానీ వివాహంగానీ యోగమున్నా గోచారంలో అనుకూల దశ లేకపోతే అవి వికటించవచ్చు. అలాంటప్పుడు పరిమితుల్లో ప్రవర్తనని ఉంచుకోవటం పుణ్యబలం పెంచుకోవటం అవసరం. అంటే జ్యోతిష జీవితాన్ని మార్చేది కాదు జీవితాన్ని సరిదిద్దుకునే సూచనలిచ్చేది అని తెలుసుకోవాలి.
కొన్ని ఉదాహరణలు... ఆదాయవ్యయాలు గమనించినప్పుడు.. వ్యయం ఎక్కువగా ఉన్నట్లైతే ఎలాగూ తప్పని ఖర్చు కనుక ఆ ఖర్చును పుణ్యకార్యాలకు ఖర్చుపెడితే మళ్లీ అది మనకు పుణ్యంరూపంలో ఉపయోగపడి కాపాడుతుంది. ఆదాయం ఎక్కువగా ఉంటే పుణ్యకార్యాలతో పాటు స్థలాలు, ఇంటి నిర్మాణాలు మొదలైనవి కొనే ప్రయత్నం చేయటం మంచిది. భవిష్యత్ ఫలితాలను జాతకాదులలోని యోగావయోగాలతో పోల్చి చూసుకోవటం ద్వారా కాలాన్ని జీవితాన్ని సద్వినియోగంచేసుకోవచ్చు.
గోచార రీత్యా జన్మరాశి నుంచి 12 రాశులలో నవగ్రహములు సంచరించేటప్పుడు కలుగు ఫలితాలు ఈ విధముగా ఉంటాయి.
సూర్యుడు
సూర్యుడు జన్మ రాశిలో సంచరింస్తున్నప్పుడు స్థాన మార్పిడి , 2 వ రాశికి వచ్చినపుడు భయమును ౩ సంపదను 4 మాన హానిని 5 విశేష భయమును 6 శత్రు నాశనం 7 దుఃఖము 8 రోగము 9 విచారమును 10 కార్య సిద్ధిని 11 ధన లాభమును 12 ధన వ్యయమును కల్గించును.
చంద్రుడు
చంద్రుడు 12 రాశులలో సంచరింస్తున్నప్పుడు 1 భోజన సౌఖ్యమును 2 ధన క్షయమును ౩ ద్రవ్యలాభమును 4 విశేష రోగ భయమును 5 కార్య నాశనము 6 ధనరాబడిని 7 ద్రవ్య లాభమును 8 మరణ సమాన ఫలితములను 9 రాజ కోపమును 10 సౌఖ్యమును 11 లాభమును 12 ధన నష్టమును కలిగిస్తున్నాడు.
కుజుడు
కుజుడు ద్వాదశ రాశులలో సంచరిస్తున్నప్పుడు 1 దుఃఖము 2 భాగ్య హాని ౩ సౌభాగ్యము 4 శత్రువుల వలన బాధలు 5 శత్రు భయము 6 ద్రవ్య సిద్ది 7 కార్య హాని 8 శస్త్రబాధ గాయములు ఏర్పడుట 9 ధన వ్యయము 10 దుఃఖ నాశనము 11 ధన యోగము 12 క్రూరత్వమును కలుగ జేయును.
బుధుడు
బుధుడు 12 రాశులలో సంచరిచు సమయములలో 1 బంధనము 2 సువర్ణ లాభము ౩ శత్రుభాధలు 4 శత్రువుల నాశనము 5 దరిద్రము 6 ఆభరణ లాభము 7 లాభములను 8 సంతోషము 9 ధన నష్టము 10 ప్రమోదము 11 మోదమును 12 నాశనము కలిగించును .
గురుడు
గురుడు ద్వాదశ రాశులలో సంచరించు సమయములో 1 దేశ త్యాగము 2 ధన లాభము ౩ కార్య హాని 4 ధన నాశనము 5 సంపద 6 దుఃఖము 7 ఆరోగ్యము 8 ధన హాని 9 ధనాగమము 10 ఆయాసము 11 లాభములను 12 నష్టములను కల్గించు చున్నాడు .
శుక్రుడు
శుక్రుడు ద్వాదశ రాశులలో సంచరించేటప్పుడు 1 ఆరోగ్యము 2 అలంకారము ౩ లాభము 4 రతిసౌఖ్యము 5 మిత్రదర్శనము 6 మానహాని 7 విశేష రోగము 8 భూలాభము 9 ధాన్యవృద్ధి 10 ప్రమోదము 11 ధనము 12 సంతోషముల ను కలుగ జేయును .
శని
శని 12 రాశులలో సంచారము చేయునపుడు 1 ఆపదలను 2 హానిని ౩ సంపదను 4 గర్భసంభంద రోగములను 5 సంతానమునకు కష్టములను , నాశనమును 6 మహా ఐశ్వర్యమును 7 మహా దరిద్రమును 8 మరణ సమాన ఫలితములను 9 దేహ శోషణమును 10 బంధనమును 11 లాభమును 12 అనేక విధాల నష్టములను కలిగించు చున్నాడు .
రాహు , కేతువులు
రాహు కేతు గ్రహములు జన్మరాశి నుంచి 12 రాశులలో సంచరించు సమయమున 1 భయమును 2 కలహాలను ౩ సౌభాగ్యమును 4 మానహానిని 5 ధన నష్టములను 6 మహా సుఖములను 7 శత్రువుల వలన భయమును 8 చొర భయమును 9 శత్రు వృద్ధిని 10 ధన క్షయమును 11 శుభ ఫలములను 12 భ్రుత్యునాశనమును కలిగించుదురు....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557
దేహ చింతన
దేహ చింతన
గత కండికలో దేహ భావన గూర్చి తెలుసుకున్నాం. ఇప్పుడు దేహ చింతన గూర్చి తెలుసుకుందాం. రెండు ఒకే అర్ధం ఇచ్చే పదాలుకదా రెంటికి తేడా ఏమిటి అని అనుమానం రావచ్చు ఇక్కడ ఒక చిన్న వ్యత్యాసం మనకు కనపడుతుంది. దేహ భావన అంటే నేను దేహన్నా లేక ఆత్మనా అనే భావన. ఇక దేహ చింతన అంటే నేను దేహాన్ని అనే దృఢమైన ఆలోచన అని అర్ధం చేసుకుందాము.
ఈ ప్రపంచంలో కోటికి ఒక్కరికో లేక పది కోట్లకు ఒక్కరికో మాత్రమే దేహ చింతన లేకుండా ఉంటుందేమో లేక ఇంకా తక్కువేనేమో చెప్పటం చాల కష్టం. మన ముందు రోజు చాలా మంది సత్పురుషులు అనే వారు కనపడుతున్నారు. చక్కగా ఖరీదైన కాషాయ వస్త్రాలు ధరించి, ఖరీదైన కారులల్లో పయనిస్తూ, ఖరీదైన కానుకలు ఇచ్చే శిష్య గణాలకి ఉపన్యాసాలు ధారాళంగా చేస్తున్న వారు అదే నండి స్వామీజీలు, బాబాలు మనకు కనపడుతున్నారు. చాలామంది వారి మాటలకు ప్రలోభితులై వారి శిష్య్లలుగా, భక్తులుగా మారిపోతున్నారు. అంతే కాదు సాక్షాత్తు ఆ ఆదిదేముడి అవతారంగా చెప్పుకునే వారు లేకపోలేదు. కొందరు దత్తాత్రేయస్వామి అవతారంగా ఇంకొందరు ఇంకో దేముడి అవతారంగా చెప్పుకోవటం, ప్రచారం చేసుకోవటం, వాళ్లకు గుడులు కట్టి పూజించటం. అది ఆలా ఎందుకు చేస్తున్నారని ఎవరైనా ప్రశ్నిస్తే వారితో కఠినంగా ప్రవర్తించి వారి దేముడే అసలైన దేముడని ఆయనకు అపచారం చేస్తే కళ్ళు పోతాయని ఇలా రోజు రకరకాల మనుషులు మనకు తారస పడుతున్నారు. ఇలాంటి వారి వాళ్ళే మన మహోన్నతమైన హిందూ ధర్మానికి గ్లాని కలుగుతున్నదని మనకు కంటికి కట్టినట్లుగా కనపడుతున్నది. కొందరు ఇలా వితండ వాదం చేస్తారు. మనకు ముక్కోటి దేవతలు వున్నారుకదా ఇంకో దేముడు ఉంటే ఏమైనది. ఇంకా కొంతమంది వారి వాదనకు శ్రీ కృష్ణ భగవానుడు చెప్పిన భగవత్గీతను ఉదాహరణగా తీసుకొని ఇలా అంటారు. నీవు ఎవరిని ఏ ఎ రూపాలతో పూజించిన నేను నీకు ఆ ఆ రూపాలతో కరుణిస్తాను అన్నారు స్వామి మరి మమ్మలిని తప్పు పడతారు ఎందుకు అంటారు. ప్రస్తుతం మన సమాజం ఇటువంటి వితండ వాదులతో కలుషితం అయి వున్నది. వారికి ఒక నమస్కారం చేయటం తప్ప మనం ఏమి చేయలేని స్థితి.
ఇప్పటికి హిమాలయ పర్వతాలలో కొందరు మహర్షులు అనేక వందల సంవత్సరాల్నుండి తపస్సు చేసుకుంటున్నవారు వున్నారని మనకు అప్పుడప్పుడు కొన్ని వార్తలు అందుతున్నాయి. మనకు ఒక సందేహం కలుగుతుంది. ప్రస్తుతం మానవుని ఆయుర్దాయం కేవలం వంద సంవత్సరాలు కదా అటువంటప్పుడు ఆ మహానుభావులు వందల కొద్దీ సంవత్సరాలనుండి ఎలా తప్పస్సు చేసుకొంటున్నారు. ఇక జ్యోతిష్య పండితులు ఇలా అంటారు అన్ని దశలు, అంతర దశలు కుడితే 120 సంవత్సరాలు మాత్రమే అంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తే మనిషి అత్యధికంగా అంటే 120 సంవత్సరాలే మాత్రమే జీవిస్తాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో అంతకన్నా ఎక్కువ జీవించలేడు అని వారి శాస్త్ర వాదం. శాస్త్రపరంగా ఈ వాదనను మనం అంగీకరించక తప్పదు.
ఈ సృష్టిలో మనకు తెలియని అనేక అద్భుతాలు వున్నాయి. కొన్ని మనకు తెలుస్తున్నాయి కొన్ని తెలియటం లేదు. అంటే మనకు తెలిసిన జ్ఞానం కన్నా తెలియని జ్ఞానం చాలా ఎక్కువ అన్నది వాస్తవం. అల్పాయుష్కుడు ఆయన మార్కండేయుడు చిరంజీవి కాలేదా. అలానే ఈశ్వరానుగ్రహం ఉంటే బ్రహ్మ రాతకుడా మారుతుంది ఇది తథ్యం.
దేహచింతన చాలా చిత్రమైనది. అందరు ఈ మాయలోనే వుంటారు కానీ దీనిని అంగీకరించారు. మన సమాజంలో తిరుగుతున్న స్వామీజీలు ఒక ఆత్మ విమర్శ చేసుకుంటే వారికి ఈ దేహ చింతననుండి బయట పడగలరు అప్పుడు వారు మోక్ష మార్గంలో పయనించి మనలాంటి సామాన్యులకు కూడా గురుత్వం వహించ గలరు. కానీ వారు ఆలా చేస్తున్నారా అన్నది సందేహం. వారు చెప్పేది నేను ఎవరిని అడగటం లేదు భక్తులు వారంతట వారే ఇస్తున్నారు. నిజానికి దేహ చింతన లేని వారు బంగారాన్ని, మట్టిని ఒకే విధంగా చూస్తారు.
సంసార జీవనం గడుపుతూ దేహచింతన లేని ఒక మహాను భావుడి గూర్చి తెలుసుకుందాం.
ఎంతో వెనుకకు వెళ్లనవసరం లేదు మనకు 1767 లో తంజావూరులో జన్మించిన త్యాగ రాజా స్వామి చెరిత్ర చుస్తే అయన పూర్తిగా దేహ చింతన లేని మహానుభావుడుగా మనం తెలుసుకోవచ్చు.
త్యాగ రాజా స్వామి గాన విశేషాలు తెలుసుకున్న తంజావూరు రాజుగారు అనేక కానుకలు పంపి త్యాగ రాజా స్వామిని తన ఆస్థానానికి రా వలసిందిగా అభ్యర్థిస్తాడు. కానీ పరమ భక్తుడైన మన త్యాగ రాజా స్వామి వాటన్నిటిని మర్యాదగా తిరస్కరించి తన గానామృతం కేవలం శ్రీ రాముడికే అంటారు.
అంతటి మహాను భావుడి గానం వినాలనే ఉత్సుకతవం ఆ రాజుకి కలుగుతుంది. అప్పుడు మంత్రిని పిలిచి నేను ఎట్లాగైనా త్యాగ రాజా స్వామి గానం వినాలి అని తన కోరిక తెలుపుతారు. మంత్రి రాజా మారువేషంలో మనం వెళ్లి త్యాగ రాజా స్వామి తిరిపెమెత్తుకొనే వేళ అయన చెంతన ఉండి విందామని సలహా ఇస్తారు. ఒకరోజు రాజు,మంత్రి మారువేశాలల్లో అలానే త్యాగ రాజా స్వామి వెనుకాల ఉండి ఆయన గానామృతం వింటారు. ఆ గానానికి ముగ్ధుడై రాజు తన మేడలో వున్నా నవరత్నాల హారాన్ని త్యాగ రాజా స్వామి కి తెలియకుండా అయన బిక్షమెత్తుకొనే పాత్రలో వేస్తారు.
ఆ రోజు భోజనానికి బియ్యాన్ని చాటలో పోసి రాళ్లు ఏరుతున్న భార్య కమలగారికి రక రకాల రంగులలో వున్నా రత్నాలు బియాంలో కనబడ్డాయి. స్వామి బియ్యంలో రంగురంగుల రాళ్ళూ వున్నాయి అంటుంది. దానికి త్యాగ రాజా స్వామి వాటిని చూడకుండానే రాళ్ళూ వస్తే ఏరీ పోయాలి కానీ నన్ను అడగటం దేనికని అన్సారు ఆమె వాటన్నికి ఏరి పారేసి అన్నం వండిందని కధ .
దేహ చింతన లేక పోవటం అంటే ఇది. ఇప్పుడు మనమందరము ఆలోచించవలసిన విషయం. మనం దేహ చింతనను ఎంతవరకు వదులుకున్నాము.
దేహ చింతన వదలని వారికి పరమేశ్వర చింతన ప్రాప్తించదు. ఏదో ఒకటి మాత్రమే దొరుకుతుంది. ఏది కావాలో తేల్చుకోవటం మన నిర్ణయం.
ఓం
తత్సత్. సర్వ్యే జన సుఖినోభవంతు.
భార్గవ శర్మ.

