*పూజ, సాధన, ప్రార్ధన అంటే ఏమిటి?*
*దేవుడిచ్చిన ప్రతీదానిని నిరసనలు లేకుండా, ప్రసాదంలాగా స్వీకరించడమే నిజమైన పూజ.*
*దేవుడు మనకిచ్చిన బంధాలపట్ల, చేస్తున్న వృత్తిపట్ల, ప్రవృత్తి పట్ల, ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రతిదానిపట్ల, కృతజ్ఞతాపూర్వకంగా ఉండడమే పూజ.*
*అహం, మనస్సు, రాగద్వేషాలు నాశనమే నిజమైన సాధన.*
*అంతఃకరణను శుద్ధి చేసుకోవడమే సాధన*.
*సత్కార్యమే అత్యుత్తమ ప్రార్ధన.*
*సర్వుల యందు సమస్తమందు ప్రేమగా దయగా ప్రవర్తించడమే నిజమైన ప్రార్ధన.*
*భూమి మీద కొన్ని అనుభవాలు పొందటానికే శరీరం వచ్చింది.*
*ఆ అనుభవాలు పొందింపచేయటం ద్వారా ఈశ్వరుడు మనలను వివేకవంతులను చేస్తాడు.*
*చెరుకుగడ గెడలాగే ఉంటే రసం రాదు, దానిని యంత్రంలో పెట్టి పిప్పి చేస్తేనే తియ్యటి రసం వస్తుంది.*
*అలాగే మన దేహం అనేక కష్టాలకు గురి అయితేగానీ, దానినుండి అమృతత్వం రాదని ఉపనిషద్ వచనం...*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
ఇంగువ విశ్వనాథ్/20230109
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి