21, నవంబర్ 2020, శనివారం

కార్తీకపురాణం 7 వ అధ్యాయము*

 *కార్తీకపురాణం 7 వ అధ్యాయము*


🌺🌺🌺🌺🌺🌺🌺🌺


*శివ కేశ వార్చనా విధులు*


వశిష్టులు వారు జనకున కింకను యిటుల బోధించిరి 'రాజా!కార్తీక మాసము గురించి, దాని మహత్యము గురించి యెంత వినిననూ తనివి తీరదు. ఈమాసము లో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజి౦చిన వారి     ఇంట లక్ష్మిదేవి స్థిరముగా నుండును తులసీ దళములతో గాని సహస్ర నామ పూజ చేసిన వారికి జన్మ రాహిత్యము కలుగును కార్తీక మాసమందు ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామ ముంచి భక్తి తో పూజి౦చిన  యెడల వారికీ కలుగు మోక్ష మింతింత గాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద బోజనము పెట్టి తను తినిన, సర్వ పాపములు పోవును. ఈ విదముగా కార్తీక స్నానములు దీపా రాదనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం యే గుడికైనను వెళ్లి భక్తితో సాష్టా౦గ నమస్కారము లైననూ చేసిన యెడల వారి పాపములు నశించును. సంపత్తి  గల వారు శివ కేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో దేవతార్చన,  హొమాదులు,  దానధర్మములు చేసిననచో అశ్వ మేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృ దేవతలకు కూడా వైకు౦ట ప్రాప్తి కలుగును. 

శివాలయమున గాని, విష్ణ్యలయమున గాని జండా ప్రతిష్టించినచొ  యమ కింకరులకు దగ్గరకు  రాలేరు సరి కదా, పెను గాలికి ధూళిరాసు లెగిరి పోయినట్లే కోటి పాపములైనను పటా ప౦చలై పోవును. ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి  వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నంద దీపమందురు. ఈ విదముగా జేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువు చుండిన  యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. అటులనే కార్తీక మాసములో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్ వృద్ది కలుగును. సాలగ్రామమునకు ప్రతి నిత్యము గంధము పట్టించి తులసి దళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగి యూ కార్తీక మాసమందు పూజాదులు సలపడో అ మానవుడు  మరుజన్మలో శునకమై  తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క  సోమవార మైనను చేసి శివ కేశవులను పూజించిన మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను. 


*' నమ శివాభ్యం నవ యౌ వనాభ్యాం పరస్ప రాశ్లి ష్ట వపుర్ధ రాభ్యాం*

*నాగేంద్ర కన్యా వృష కేత నాభ్యం నమో నమ శంకర పార్వతీ భ్యాం''*


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్య మందలి*

*సప్తమధ్యాము - సప్తమదిన పారాయణము సమాప్తం.*

   🙏🙏🙏🙏

స్త్రీలు_ఎందుకు_వేదాలు_పఠించకుడదు

 స్త్రీలు_ఎందుకు_వేదాలు_పఠించకుడదు..


వేదాలకి అధిదేవత గాయత్రి మాత, వాక్కును ప్రసాదించే దేవి సరస్వతి, వారిరువురు స్త్రీ రూపాలే. మరి స్త్రీలు ఎందుకు వేదం చదవకూడదన్న వాదన వింటుంటాం.

.

 వేదాలు స్వర, మాత్రానుగుణంగా ఉచ్చరింపబడాలి వాటి పూర్తి ప్రభావం ప్రకటింపబడాలి. అంటే పురుషదేహ నిర్మాణానికి, స్త్రీ దేహ నిర్మాణానికి తప్పక తేడా వుంది. వారికున్న నాడీమండల వ్యవస్థ ఆడవారికి సరైన స్వరోచ్చారణకు పూర్తిగా సహకరించదు. పురుషుల వోకల్ ఫోల్డ్స్/కార్డ్స్ 17mm-25mm పొడవు వుండగా, స్త్రీలకు 12.5 Mm-17.5mm దీనివల్ల వారి pitch లో తేడా వుంటుంది. వేద మంత్రాలన్నీ ఉదాత్త, అనుదాత్త, స్వరానుగుణంగా ఆయా స్థాయిలో ఉచ్చరించడం ఈ నిర్మాణం వలన స్త్రీలకు పూర్తిగా సాధ్యపడదు.


 ఈ వేదమంత్రాల స్వరాలు నాభినుండి పలకవలసి వస్తుంది. కావున నమకచమక మంత్రాలలో ఇటువంటి ప్రయోగాలు ఎక్కువ వుండడం వలన వాటికి పొత్తికడుపు మీద ఒత్తిడి ఎక్కువ కలుగుతుంది. వారి శరీరనిర్మాణం ప్రకారం వారికి ఇటువంటి ఒత్తిడి పెట్టడం వలన ఉచ్చారణ చెయ్యగా చెయ్యగా వారి ఋతుకాలం మీద ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.


నేడు మనం చూస్తున్న సంగీత థెరపీ వలన రోగులలో హార్మోన్లు అధికంగా ఉత్పత్తి కావడమూ, తక్కువ చెయ్యబడడమూ శాస్త్రీయంగా నిరూపింపబడినది. వేదము, వేదమునందలి ఈ నమక చమక మంత్రాలు ప్రధానంగా శబ్దప్రధానం. వీటి శబ్దప్రకంపనల వలన ఈస్ట్రోజెన్ తదితర హార్మోన్లపై ప్రభావం అధికంగా వుండి కాలక్రమేణా కొన్ని కొన్ని మంత్రాల వలన గర్భస్రావం కూడా జరుగుతుందని ఆడవారు ఆ మంత్రాలు వినరాదు చదవరాదు అని నియమం పెట్టారు.


 వేదమంత్రాన్ని కొంచెం తప్పుగా చదివితే రావలసిన ఫలితాలకు వ్యతిరికంగా దుష్ఫలితాలు కలుగుతాయి. ఆడవారికి గురూపదేశం లేకుండా సరైన ఉచ్చారణ అబ్బదు, కాబట్టి వారికి వేదపఠనం, అందునా మరింత శక్తివంతమైన రుద్రాధ్యాయ, ఆదిత్య, సౌర సూక్తాలు వద్దని చెప్పారు. నేటి సాంకేతిక పరిజ్ఞానం చెబుతున్న దాని ప్రకారం ఆడవారికి మెనోపాజ్ వరకు వారిని చాలా శక్తివంతమైన హార్మోన్లు కాపాడతాయి. ఒకసారి ఆ సమయం వచ్చాక వారికి వ్యాధినిరోధక శక్తి తక్కువ అవుతుందని పరిశోధనల ద్వారా నిరూపించారు. వారికున్న రక్షణాత్మక కవచాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం కొద్దీ వారికి కొన్ని పనులు నిషేధించారు, అందులో ముఖ్యంగా ఇటువంటి వేదనాదాన్ని ఉచ్చరించడం.


నేటి యుగధర్మ ప్రకారం ఆడవారికి ద్విజత్వం సిద్ధించదు, ఎందుకంటె వారికి ఉపనయన సంస్కారం లేదు కనుక. కావున వారికి గాయత్రి మంత్రోచ్చారణ కానీ వేదపఠన కానీ వద్దని చెప్పారు. ద్విజులంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అన్న విషయం అందరికీ తెలుసు. వేదం పఠించడం వలన శరీరంలో చక్రం ఉత్తేజితం వలన, ఉచ్చారణాక్రమం వలన ఎక్కువగా ఉష్ణం ఉత్పన్నమవుతుంది. అది ఆడవారి శరీరానికి మంచిది కాదని వారిని చదవద్దని వారిస్తారు. కొందరు ఏడ్చి పెడబొబ్బలు పెట్టినట్టు ఇందులో ఆడవారిని తక్కువగా ఎక్కడా చూడమని చెప్పలేదు. ఆడదంటే ఆదిశక్తి అని కొలిచిన ధర్మం మనది. వేదం చదవద్దని చెప్పిన మన ధర్మశాస్త్రాలు వారికి మరెన్నో సౌలభ్యాలు కలుగచేసాయి.


1. వారు వేద వ్యాఖ్యానాలు మనసులో పూర్తిగా చదివి తత్త్వం తెలుసుకోవచ్చును. మనకు పూర్వం కూడా ఎందరో నారీమణులు వేదార్ధాన్ని, వేదంగాలను నేర్చిన వైనం వినే ఉన్నాము.


2. వారు సౌందర్యలహరి, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం వంటి ఎన్నో శక్తివంతమైన స్తోత్రాలు, వివిధ దేవతల శ్లోకాలు, దివ్యప్రబంధాలు, పురాణ ఇతిహాసాలు, భజనలు, కీర్తనలు తప్పక చదవమని చెబుతుంది శాస్త్రం


 3. వారు మాత్రమే చెయ్యగలిగిన ఎన్నో శక్తివంతమైన ఫలవంతములైన వ్రతాలు చెప్పబడి ఉన్నాయి.


4. ఆత్మ విచారం ఇత్యాది గొప్ప ఆధ్యాత్మిక సాధనలు నిషిద్ధం కావు. ఇలా ఎన్నో దైవపూజలకు వారికి అధికారం వుంది. కేవలం వేదం చదవరాదన్న నియమం వలన వారు ఏ రకంగాను కూడా పురుషులకన్నా తక్కువ స్థాయిలో చూడలేదు.


                        ఇట్లు 

                          మీ

         అవధానుల శ్రీనివాస శాస్త్రి

చాణక్య నీతి

 చాణక్య నీతి


వరం న రాజ్యం న కురాజరాజ్యం 

వరం న మిత్రం న కుమిత్రమిత్రమ్

వరం న శిష్యో న కుశిష్యశిష్యో 

వరం న దారా న కుదారదారాః 


చెడు రాజ్య వాసంబు చేయుట కంటె 

వీడుటే మేలగు విజ్ఞత తోడ 

చెడు మిత్ర స్నేహంబు సేయుట కంటె 

మిత్రుడే లేకుండ మెలగుట మేలు 

చెడు శిష్య పాలన సేయుట కంటె 

శిష్యులే లేకుంట శ్రేష్టంబు యగును

చెడు భార్యతో పొత్తు జేగుట కంటె 

భార్యయే లేకుండ బ్రతుకుట మేలు.           


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

శ్రీ విష్ణు షట్పది స్తోత్రం

 *శ్రీ ఆదిశంకరాచార్య విరచిత శ్రీ విష్ణు షట్పది స్తోత్రం*

 


ఆది శంకరులు రచించిన స్తోత్రాలలో విష్ణు షట్పది ఒకటి. మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం.

 


భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు.


 భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం  ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.



*౧. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ |*

*భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ||*


ఓ విష్ణో!  నాలోని అహంకారాన్ని తొలగించు. మనస్సును శాంతితో నింపుము. పాశవిక కోరికలనుంచి నన్ను దూరము చేయుము. సకల ప్రాణుల పట్ల నేను దయతో ఉండునట్లు చేయుము. ఈ భవసాగరాన్ని దాటుటకు చేయూతనీయుము.




*౨. దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగసచ్చిదానందే |*

*శ్రీపతిపదారవిందే భవభయఖేదచ్ఛిదే వందే ||*


సంసార సాగరములోని భయాన్ని, దుఖాన్ని పోగొట్టే, పవిత్రమైన పుప్పొడి నది వంటి, సచ్చిదానందాన్ని ఇచ్చే దివ్య సుగంధము వంటి నీ పాదపద్మములకు నమస్కరించు చున్నాను.




*౩. సత్యపి భేదాపగమే నాథ తవా‌உహం న మామకీనస్త్వమ్ |*

*సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః ||*


ఎలాగైతే సముద్రము అలలు ఒకటే అని అనిపించినా, సముద్రపు అల సముద్రములోని భాగమే కానీ సముద్రం అలలోని భాగం కాదో, అలాగే సత్యము గ్రహించు నపుడు కూడా, భేదము గ్రహించలేనప్పుడు, నేను నీలోని భాగమే కానీ నీవు నాలో భాగము కావు.




*౪. ఉద్ధృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్రశశిదృష్టే |*

*దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవతిరస్కారః ||*


పర్వతమును ఎత్తిన వాడవు { కృష్ణుడవు, కూర్మావతారము కూడా } , పర్వతరాజు శత్రువైన ఇంద్రుని సోదరుడవు, అసురుల శత్రువువు, సూర్య చంద్రులు కన్నులుగా చూసేవాడవు, నిన్ను చూసిననంత లోకపు శోకము పోవును. నిన్ను చూసిన తర్వాత ఇంకా జరుగ వలసినది ఏమైనా ఉందా?




*౫. మత్స్యాదిభిరవతారైరవతారవతా‌உవతా సదా వసుధామ్ |*

*పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాపభీతో‌உహమ్ ||*


మత్స్య రూపము మొదలకొని వివిధ అవతారములతో ఈ భువిని కాపాడుతున్నావు. పరమేశ్వరా! ఈ భవసాగరమును చూసి భయపడుతున్న నన్ను కాపాడుము.




*౬. దామోదర గుణమందిర సుందరవదనారవింద గోవింద |*

*భవజలధిమథనమందర పరమం దరమపనయ త్వం మే ||*


నడుమునకు త్రాడు కట్టుకున్న విష్ణో { దామోదరా } ! సకల సద్గుణ సంపన్నా! కలువ వంటి అందమైన ముఖము కలవాడా ! అందరి రక్షకుడా ! ఈ భవ సాగరాన్ని మధించ అత్యుత్తమ సాధనమైన వాడా ! ఈ జీవనసాగరంలో నా భయాలను పోగొట్టుము.



*నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ |*


ఓ నారాయణా ! కరుణామయా ! నా చేతులు నీ పదములకు మ్రొక్కనీ !



*ఇతి షట్పదీ మదీయే వదనసరోజే సదా వసతు |*


ఈ ఆరు శ్లోకములు నా వదనములో ఎల్లప్పుడూ నిలవనీ !



🚩


*శ్రీవిష్ణు షట్పది స్తోత్రం భావం:*


మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.



🚩


*భ్రమర నాదాలు* 


భ్రమరం అంటే తుమ్మెద. దీనికి మధువ్రతం, మధుకరం, మధుపాళి, ద్విరేఫం, భృంగం, షట్పదం, అళి మొదలైన పేర్లు ఉన్నాయి. పూలలోని తేనెను తాగుతూ, ఝుమ్మని నాదాలు చేయడం తుమ్మెదకు అలవాటు. విష్ణువును స్తుతించిన శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’ రచించి, లోకానికి ప్రసాదించారు. షట్పది అనే మాటకు అర్థం ‘ఆరు పదాలు గలది’. తుమ్మెదకు ఆరు కాళ్లుంటాయి కాబట్టి, ఆ పదం సరిపోతుంది. భగవత్పాదుల స్తోత్రంలోనూ ఆరు పదాలు విరాజిల్లుతున్నా, అవి తుమ్మెదకు సంబంధించినవి కావు. విష్ణువును ఉద్దేశించిన నామాలు అవి. అందువల్ల ఆ స్తోత్రం ‘షట్పది’ అయింది. పద్మం చుట్టూ తుమ్మెద తిరిగినట్లే, తన ముఖం అనే పద్మం చుట్టూ ఆరు పదాలూ తిరుగుతుండాలని హరిని భగవత్పాదులు కోరుతున్నారు. ‘నారాయణా, కరుణామయా, శరణం కరవాణి తావకౌ చరణౌ’ అనే వాక్యంలో ఆరు పదాలు ఉన్నందువల్ల, అది షట్పదీ స్తోత్రమైంది.



తుమ్మెదలు పద్మం నుంచి మకరందాన్ని తాగుతాయి. అలాగే ముఖపద్మంలో నుంచి ఆరు విష్ణు పదాల మకరందం గ్రోలడానికి స్తోత్రం అనే తుమ్మెద తిరుగుతుండాలని సారాంశం. ఆ ఆరింటి మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించాల్సిందే.



‘ఓ హరీ! మొదట నా అవినయాన్ని పోగొట్టు. నా మనసును నియంత్రించు. భూతదయను పెంపొందించు. సంసారం అనే సముద్రం నుంచి నన్ను ఒడ్డుకు చేర్చు. నీ పాదాలు కమలాలు. ఆ పాదాల నుంచి ఉద్భవించిన ఆకాశ గంగ మకరంద ప్రవాహం వంటిది. సచ్చిదానందాలే ఆ పద్మాల సుగంధాలు. సంసార బంధాలవల్ల కలిగే భయాల్ని పోగొట్టేవి ఆ పాదపద్మాలే !



హరీ! నీకు, నాకు భేదం లేకున్నా- ఎప్పుడూ నేను నీవాణ్ని అవుతాను కానీ, నువ్వు నా వాడివి కాదు. అదెలా అంటే- కెరటాల్ని చూసే జనం అవి సముద్రానివే అంటారు. అంతే తప్ప, సముద్రమే కెరటాలకు సంబంధించినదని ఎవరూ అనరు.



పర్వతాల రెక్కల్ని తొలగించిన ఇంద్రుడి సోదరుడివి నువ్వు. అందుకే నీకు ‘ఉపేంద్రుడు’ అని పేరు. రాక్షసులకు నువ్వు శత్రువు. సూర్యచంద్రులే నీ కళ్లు. ఇంతటి మహిమ గల నిన్ను చూస్తే చాలు, సంసార దుఃఖాలన్నీ దూరమవుతాయి.



ఓ హరీ! లోకాల్ని రక్షించడం కోసం నువ్వు ఎన్నో అవతారాలెత్తావు. ఎందరినో రక్షించావు. సంసార బంధాలతో భయపడుతుండే నన్ను కాపాడేదీ నువ్వే! నువ్వు వనమాల ధరించావు. గుణాలన్నీ నీలో మణుల్లా వెలుగుతున్నాయి. నీ వదనం అనే పద్మం ఎంతో అందమైనది. సంసార సాగరాన్ని మధించడానికి మందర పర్వతంలా నిలుస్తావు నువ్వు. నా భయాలన్నింటినీ పోగొడతావు...’- ఇలా షట్పదీ స్తోత్రం అంతా మానవుడిలోని ఆర్తికి ప్రతిబింబంగా కనిపిస్తుంది. ఆర్తుల్ని ఉద్ధరించాలంటూ స్వామిని స్తుతించడమే భగవత్పాదుల పరమార్థంగా స్పష్టమవుతుంది.



మహర్షులు, యోగులు, మహాకవులు విశ్వక్షేమాన్నే కాంక్షిస్తారు. లోకుల భయాల్ని పోగొట్టడానికి త్రికరణశుద్ధిగా కృషిచేస్తారు. అదే పనిని శంకర భగవత్పాదులు ‘షట్పదీ స్తోత్రం’లో చేశారు. ఆరు శ్లోకాలు, ఆరు విష్ణునామాంకిత పదాలు మకరంద బిందువుల వంటివి. వాటిని ఆస్వాదించే ఆ స్తోత్రమే ఒక తుమ్మెద. ‘అది ఎప్పుడూ ఇలాగే నా వదన సమీపంలో తిరుగుతుండాలి’ అని కోరడం అంటే, స్తోత్రాన్ని నిరంతరం పఠించే భాగ్యాన్ని అర్థించడమే! ఇదే ఆ స్తుతిలోని అసలు రహస్యం.



మనిషిని సంసారం అనేక విధాలుగా బాధిస్తుంది. ఇలాంటి భయాలు, బాధల నుంచి మనసుకు శాంతి కావాలి. అది భగవన్నామ స్మరణతోనే సాధ్యమని పెద్దల మాట. షట్పదీ స్తోత్రం ద్వారా శంకర భగవత్పాదులు చేసిన మహోపదేశం ఇదే. మనిషి తనలోని ఆత్మశక్తిని విస్మరించకూడదు. మనిషిలోనే శాంతి ఉంటుందని, దాన్ని అతడే తెలుసు కోవాలని స్తోత్ర భ్రమరం ఉపదేశిస్తుంది. ఆ భ్రమర నాదం హృదయంగమం!



🕉🕉🕉🕉🕉🕉

శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ వ్రత మహాత్మ్యము



క. బ్రాహ్మణప్రియుడగు విష్ణువు 

    బ్రాహ్మణు వెతలెల్ల బాప భావించి మదిన్ 

    బ్రాహ్మణు నడుగగ యవ్విధి 

    బ్రాహ్మణు డిట్లనియె భక్తి భావము పొంగన్  29


ఆ. "బ్రాహ్మణుండ నేను బహుశాస్త్ర పఠితుడ  

     యుంఛవృత్తితోడ నుండు చుందు 

     దార సుతులతోడ దారిద్ర్యమున నుండి 

     బ్రతుకు నీడ్చుచుంటి భారముగను         30


క. సతతము శ్రీహరి నుతులతొ 

    ప్రతి గేహముచెంత బిక్ష ప్రార్ధించడుగన్ 

    యతితక్కు వొచ్చుభిక్షతొ 

    సతిసుతులతొబ్రతుకుచుందు సతమతమౌచున్"31


క. విప్రు0డాడిన మాటలు 

    విప్రోత్తమ వేషధారి విష్ణుడు వినియున్ 

    విప్రుని కావగ దలచియు 

    'విప్రా ! చింతించ వలదు విను'యంచనియన్  32


ఆ. "నీదు పేదతనము నిస్సేషముగ బోవ 

    దివ్య వ్రతము నొకటి తెలియ సేతు 

    యాచరించ దాని యాత్మ సాక్షిగ నీవు 

    పొందగలవు యిలను భూరిసుఖము        33


ఆ. అదియె నరునికిచ్చు యాముష్మికంబును 

     అదియె నరునికిచ్ఛు యాత్మశాంతి 

     యెయ్యది హరి దొల్లి యెఱిగించె , నయ్యదే 

     సత్య దేవు దివ్య  సద్వ్రతంబు             34


తే. విష్ణుదేవుని దివ్యమౌ వేఱు రూపె 

     సత్యనారాయణస్వామి సత్త్వరూపు 

     సత్యదేవుని మనసార సన్నుతించ 

     సకల కోర్కెలు దీరును సర్వులకును     35


క. వేగమె పేదరికంబును 

    పోగొట్టగ జాలునట్టి పుణ్య వ్రతంబున్ 

    రాగముతో గృహ మందున 

    జాగించుక సేయకుండ సల్పుము భక్తిన్ "   36


ఆ. విప్ర వేష ధారి విష్ణుడా విధముగ 

     పేదబ్రాహ్మణునకు ప్రియము తోడ 

     సత్యవ్రతమువిధిని  సంపూర్ణముగ జెప్పి

     మహిమ తోడ యపుడు మాయ మయ్యె  37


తే. వృద్దవిప్రుని మాటలు విశ్వసించి 

     సత్యనారాయణస్వామి సద్వ్రతమును 

     చేతు రేపని మనమందు చెప్పి కొనియు 

     విప్రవర్యుడు నిద్రించె వీడి చింత            38


                                     సశేషము….


✍️ గోపాలుని మధుసూదన రావు 🙏

ధార్మికగీత - 87*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 87*

                                   *****

       *శ్లో:- అజరా౽మరవత్ ప్రాజ్ఞ: ౹*

              *విద్యా మర్థం చ సాధ యేత్ ౹*

              *గృహీత ఇవ కేశేషు ౹*

              *మృత్యునా ధర్మ మాచరేత్ ౹౹*

                                   *****

*భా:- "జర" అంటే ముసలితనం. "అజర" - అంటే ముదిమి లేకపోవడం ; "అమర" - చావులేక పోవడం; లోకంలో వివేకవంతులు తమకు ముసలితనం లేదనే నిర్ణయానికి వచ్చి, విద్యను ఆర్జించాలి. "గుణాః పూజాస్థానం గుణిషు న చ లింగం న చ వయః" అని ఆర్యోక్తి. వయో నిమిత్తము లేని చక్కని విద్య వల్లనే మనలోని సుగుణాలు ప్రవర్ధ మానమై పరిమళిస్తాయి. ఫలాలనిస్తాయి. జీవితాన్ని సార్థకం చేస్తాయి. నేడు దూరవిద్య ద్వారా పెద్దలు చదువుకోవడం కద్దు. అలానే బుద్ధిమంతులు చావులేదనే నమ్మకంతో జవసత్త్వాలను కూడగట్టుకొని, ధనార్జన చేయాలి. గడిచింది చాలు అని ఆగిపోరాదు. అలాగే ప్రతిక్షణం మృత్యుదేవత తన జుట్టు పట్టుకుని ఈడ్చుకొని పోతున్నట్లు భావిస్తూ, ధర్మాన్ని నిర్వర్తించాలి. దానధర్మాలను నిత్యము, నిరంతరము చేస్తూనే ఉండాలని సారాంశము. కాన వయస్సుతో పనిలేకుండా చదువు, చావు లేదనే భావనతో డబ్బును గడిస్తూనే, అడుగడుగునా ధర్మనిరతుడవై, జీవన సమరం కొనసాగించాలని భావము*.

                                    *****

                     *సమర్పణ : పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

దుర్గా సప్తశతి

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 21  / Sri Devi Mahatyam - Durga Saptasati - 21 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 5*

*🌻. దేవీ దూతసంవాదం -6 🌻*


111. ఓ శోభనాంగీ! దేవతల, గంధర్వుల, నాగుల వద్ద ఉన్న రత్నతుల్యాలైన ఇతర వస్తువులన్ని ఇప్పుడు నా వద్దనే ఉన్నాయి.


112. ఓ దేవీ! మేము నిన్ను ప్రపంచ స్త్రీలందరిలో రత్నసమానమైన

దానిగా తలచుచున్నాం. అటువంటి నీవు నన్ను చేరు. రత్నతుల్యములైన వస్తువుల నంన్నిటిని అనుభవించేవారం మేమే కదా.


113. ఓ క్రాలుగంటీ! నీవు రత్నసమానవడం చేత నన్ను గాని, మహాపరాక్రమశాలి అయిన నా తమ్ముడు నిశుంభుణ్ణి గాని సేవించు.


114. నన్ను పెళ్ళాడితే, అసమాన మహాసంపద నీకు లభింస్తుంది. నీ మదిలో ఇది చక్కగా ఆలోచించుకుని నా భార్యవు కమ్ము.


115-116. ఋషి పలికెను : ఇలా చెప్పగా, ఈ జగత్తును భరించే శరణ్య, శుభంకరి అయిన దుర్గాదేవి లోననవ్వుకొని గంభీరంగా ఇట్లనెను :


17–118. దేవి పలికెను: నీవు సత్యాన్నే పలికావు. ఈ విషయంలో నీవు కొద్దిపాటి అసత్యమైనా చెప్పలేదు. శుంభుడు త్రైలోక్య సార్వభౌముడే. నిశుంభుడూ అట్టివాడే. 


119. కాని ఈ విషయంలో నేను దృఢనిశ్చయంతో ఆడిన మాటను బొంకు చేయడమెలా? మునుపు నేను అల్పబుద్ధినై చేసిన ప్రతిజ్ఞను విను.


120. యుద్ధంలో నన్ను ఎవడు ఓడిస్తాడో, నా గర్వాన్ని ఎవడు పోగొడతాడో, నా బలానికి లోకంలో సమానుడెవడో, అతడే నాకు భర్త అవుతాడు.


121. కాబట్టి ఇక్కడకు శుంభుడైనా, నిశుంభ మహాసురుడైనా వచ్చు గాక, నన్ను ఓడించి నాతో వెంటనే పాణిగ్రహణం చేయు గాక. జాగు ఎందుకు?


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

దీపారాధన

 🌹💐🥀🙏🌸🌷🌺🌾


*ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి*


*సాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహా*


మామూలుగా పత్తినుంచి తీసిన సన్నని దారపుపోగును మూడుసార్లు మూడువేళ్ల చుట్టూ తిప్పితే వత్తి తయారవుతుంది. 


ఈ తరహా వత్తిని ప్రమిదలో వేసి ఒక కొన పైకి వచ్చేలా పెడతారు. అక్కడ నూనెతో తడిపి దీపం వెలిగిస్తారు.


మూడువత్తులను కలిపి ఒక వత్తిగా చేసి, త్రివర్తి సంయుక్తంగా దీపం వెలిగించాలని తద్వరా గృహంలో మంగళప్రదంగా  ఉంటుందని  దీపారాధన శ్లోకం తెలియచేస్తూ ఉంది.  అది ఆచరించటం సాంప్రదాయం.


కొందరు రెండు లేదా అయిదు వత్తులు కూడా పెడతారు. అది సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది. మరికొందరు కుంభం వత్తి లేదా బొడ్డువత్తి తయారుచేస్తారు. క్రిందగుల్లగా ఉండి ఒకటే కొసపైకి తేలి గరాటులా కనిపించే వత్తి అది. దానిని ప్రమిద మధ్యలో వెలిగిస్తారు కుంభం వత్తిని సాధారణంగా ఒకటికి మించి వెలిగించరు. 


*దేవస్య పార్శ్వయోః దీపానుద్దీప్య అని గృహంలో పూజామందిరంలో  దేమునికి ఇరుప్రక్కలా రెండు కుందుల్లో దీపారాధన చేయాలి.*

Draksharamam






 

Divali