10, అక్టోబర్ 2023, మంగళవారం

నవగ్రహ పురాణం - 77 వ అధ్యాయం*_

 _*నవగ్రహ పురాణం - 77 వ అధ్యాయం*_


*బుధగ్రహ చరిత్ర - 4*


*“నాయనా ! కన్నతల్లి దర్శనం కోసం కలలు కని , ఆ కలల్ని సాకారం చేసుకున్న ధన్యుడివి నువ్వు. లోకపూజ్యుడయ్యే లక్షణాలు నీలో కనిపిస్తున్నాయి. క్షేమంగా వెళ్ళు. నీ మాతృమూర్తిని చూడడానికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు. నా అనుమతి అవసరం లేదు సుమా !!"* తనకు వీడ్కోలు పలుకుతూ , శిరస్సు స్పృశించి , దీవిస్తూ ఆయన అన్న మాటలు బుధుడికి మళ్ళీ మళ్ళీ వినిపిస్తూనే ఉన్నాయి.


పాదాభివందనం చేస్తూ ముందుకు వంగిన తన శిరస్సు మీద అమ్మ అశ్రు బిందువులు అక్షతలలా రాలాయి ! తనను లేవనెత్తి తన నుదురును చుంబించినప్పుడు అదిరిన అమ్మ పెదవులు ఆమె శతకోటి ఆశీస్సులను తనకు అందించాయి ! రెండవసారి తనను విడిచి వెళ్ళిపోతున్న కన్నకొడుకును చూస్తున్న అమ్మలోంచి వాక్ శక్తి మాయమైపోయింది. అమ్మ మాటలు మరిచిపోయింది ! అయితే ఏం ? మాటలకు అందని మహావాత్సల్యాన్ని ఆమె విశాలనేత్రాలు దృష్టి కిరణాలతో తనకు చేరవేశాయి !


మలుపు తిరగగానే ఎట్టఎదుట సాక్షాత్కరించిన తామర కొలను బుధుడి దృష్టిని ఆకర్షించింది. స్వచ్ఛమైన నీరు , గాలికీ , చిన్ని చిన్ని అలలకూ కదులుతూ నేత్ర పర్వం చేస్తున్న ఎన్నో తామరలు...


తన కోసం విశ్వకర్మ నిర్మించిన ఆశ్రమం ఈ సరోవరానికి సమీపంలో ఉంటే ఎంతు బాగుంటుంది ! బుధుడు తనలో అనుకుంటూ తీరాన్ని చేరి నీళ్ళలోకి దిగాడు.  మోకాలిలోతు నీటిలో నిలుచుని , వంగి , దోసిలితో స్వచ్ఛజలాన్ని అందుకొని తాగాడు.


దోసిలితో నీళ్ళు అందుకోవడానికి వంగిన బుధుడు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోయాడు. సరోవర జలంలో , తామరల మధ్య పీతాంబరాన్ని ధరించిన వ్యక్తి చేతుల్లో వీణ ! నీటిలో తలక్రిందులుగా అగుపిస్తున్న ఆ వ్యక్తిని చూస్తూ - ఆ వ్యక్తి నీడను చూస్తూ మెల్లగా నిలుచున్నాడు బుధుడు.


*"నారాయణ ! నారాయణ !"* అన్నాడు కొలనిగట్టు మీద అటు వైపు నిలుచున్న నారదమహర్షి.


*“నారదమహర్షికి నమస్సులు !"* బుధుడు చేతులు జోడిస్తూ అన్నాడు. ఆయన వైపు తీరం వెంబడి నడుస్తూ...


*"అనుకోని విధంగా , అరణ్యంలో మీరు కనిపించడం నా అదృష్టం !"* బుధుడు నమ్రతగా అన్నాడు.


*"సందేహం లేదు తారానందనా ! నువ్వు అదృష్టవంతుడివే ! అందుకే నిన్ను నీ ఆశ్రమంలో విడిది చేయించి , విద్యుక్త ధర్మాలను వివరించి రమ్మని ఆజ్ఞాపించారు నన్ను బ్రహ్మదేవులు !"* నారదుడు నవ్వుతూ అన్నాడు.


*"బ్రహ్మదేవులా !”* బుధుడు ఆశ్చర్యంగా అన్నాడు.


*"నారాయణ ! అంత ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు , చంద్రనందనా ! ఆ సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మ నీకు చాలా దగ్గరివాడు. నీ పితామహులు ఎవరు ? స్వయానా బ్రహ్మ మానసపుత్రుడు. ఇక నీ తండ్రి చంద్రుడెవరు ? సాక్షాత్తు మా జనకులు బ్రహ్మదేవుల అంశావతారుడై , తన అవతారమైన చంద్రుడి కుమారుడైనా , తన కుమారుడైనా ఆయనకు ఒకటే కద !”* బుధుడు ఆకాశం వైపు చేతులు జోడించాడు. *"అది నా అదృష్టం !”*


*"సరే... బయలుదేరు ! చతుర్ముఖులు నీ కోసం నిర్మింపజేసిన ఆశ్రమం ఇక్కడికి సమీపంలోనే ఉంది. ఈ నాటి నుండి ఆశ్రమ నిర్వహణ నీ విధి. ఈ కొలనిలో స్నానాదులు సాగిస్తూ , కందమూలాలూ , మధుర ఫలాలూ ఆరగిస్తూ, జపతపాలు సాగిస్తూ , అందమైన అరణ్యంలో హాయిగా విహరిస్తూ , ఆనందంగా జీవించు ! అదే ప్రస్తుతానికి నీ సాధన !”* నారదుడు ఆశ్రమం వైపు నడకసాగిస్తూ అన్నాడు. బుధుడు ఆయనను అనుసరించాడు.


ప్రశాంతమైన ఆశ్రమ వాతావరణంలో బుధుడి స్వేచ్ఛా జీవితం సాగిపోతోంది. స్నానసంధ్యలు , అనుష్ఠానం , ఆహారం , విహారం ఇదే బుధుడి నిత్య జీవనసరళి !


తమంత తామే తనతో మచ్చిక చేసుకున్న పక్షులతో , నెమళ్ళతో , కుందేళ్ళతో , జింకలతో తన ఆశ్రమవాసం ఉల్లాసంగానే ఉంది. అయితే ఏదో వ్యక్తం కాని వెలితి బుధుణ్ణి వెంటాడుతోంది. ఆ వెలితి తన లోపలా ఉంది ; వెలుపలా ఉంది. అది దేని కోసమో ఎదురు చూస్తున్న వెలితి. అది ఎవరి కోసమో ఎదురు చూస్తున్న వెలితి.


వాడుక ప్రకారం సాయం సమయ ప్రశాంత వాతావరణంలో అరణ్య ప్రాంతంలో విహారం చేస్తూ , సంచరిస్తున్న బుధుడికి వేటకుక్కల అరుపులూ , జంతువుల అరుపులూ , గుర్రాలు పరుగెడుతున్న శబ్దాలూ , వేటగాళ్ళ కేకలూ వినవచ్చాయి. ఎవరో వేటాడుతున్నారు !


తనను ఆశ్రమానికి తీసుకు వచ్చిన రోజున. నారద మహర్షి తనకు చెప్పిన విషయాలు గుర్తుకు వచ్చాయి బుధుడికి.


*"ఈ అరణ్యం వైవస్వతుడి రాజ్యానికి సమీపంలో ఉంది. వైవస్వతుడు , ఎవరో తెలుసా ? సూర్యుడికీ , సంజ్ఞకు జన్మించిన జ్యేష్ఠపుత్రుడు. సూర్యుడికి వివస్వంతుడు అనే పేరు ఉంది. వివస్వంతుడి కుమారుడైన కారణంగా - 'వైవస్వతుడు' అని పేరు పెట్టారు. ఈ వైవస్వతుడు తండ్రి సూర్యుడి అనుమతితో రాజ్యపాలన చేస్తున్నాడు. ఆయన పత్ని పేరు శ్రద్ధ !"* నారదుడు వివరిస్తూ చిరునవ్వు నవ్వాడు. *"ఇదంతా ఎందుకు చెప్పానంటే , ఇక్కడ నీది ఏకాంత జీవితం. పరిసరాల్లో ఉన్న వారి గురించిన పరిచయం అవసరం !"*


నారదమహర్షి మాటలు గుర్తు చేసుకుని , నవ్వుకున్నాడు బుధుడు. తనకి ఎవ్వరి పరిచయాలూ అవసరం లేదు. వైవస్వతుడి రాజ్యానికి చెందిన వేటగాళ్ళు తన ఆశ్రమ పరిసరాల్లో కర్కశ మృగయా వినోదం సాగించి , జంతు హననం సాగించకుండా , తన ఆశ్రమ ప్రశాంతతకు భంగం కలిగించకుండా ఉంటే చాలు ! బుధుడు ఆలోచిస్తూ , 'వేట' సృష్టిస్తున్న కలకలానికి దూరంగా , తన ఆశ్రమం వైపు తిరిగి నడక ప్రారంభించాడు.


బుధుడు ఆశ్రమం లోంచి ఇవతలకి వచ్చాడు. అతని కోసమే వేచి చూస్తున్నట్టు రెండు కుందేళ్ళూ , జింకపిల్లా పరుగు పరుగున వచ్చాయి. వాటిని పలకరించి , శరీరాలు దువ్వి , ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్న నెమళ్ళను తప్పించుకుంటూ సాయంకాల వనవిహారానికి బయలుదేరాడు బుధుడు.


తామర కొలను గట్టు మీద ఆగి , సాయంకాలం నీరెండలో మెరుస్తున్న పద్మాలను కాసేపు పరికించి , నడక సాగించాడు బుధుడు. కొలను చుట్టూ ఉన్న చెట్ల గుబుర్లలోంచి రకరకాల పక్షులు ఆవేశంతో అరుస్తున్నాయి.


పక్షుల అరుపులు వినిపించనంత దూరం సాగి పోయిన బుధుడి చెవులను మరొక శబ్ద సంచయం తాకింది. వేట ! బుధుడు ఆగి క్షణకాలం ఆలోచించాడు. ఈ మృగయా వినోదులు అచిర కాలంలో తన ఆశ్రమ ప్రాంతానికి వచ్చివేస్తారు ! ఆశ్రమ ప్రదేశం వైపు రావద్దని హెచ్చరించడం మంచిది. నిర్ణయం చేసుకున్న బుధుడు వేట కలకలం వినవస్తున్న దిశగా వేగంగా నడవడం ప్రారంభించాడు.

Dvaja dtambam


 

Sivaarchana



 

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5124*

*శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు -  భాద్రపద మాసం - కృష్ణ పక్షం  -  ఏకాదశి - మఘ - భౌమ వాసరే* (10.10.2023)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/oqeRINsTvoA?si=zDVVVk6eUxEuqSYL



.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

🦅ఒక కాకి కధ

 🦅ఒక కాకి కధ

         🦅🦅  పూందతి తన్రీకర మహ‌ర్షి భార్య , మహాపతివ్రత.

         🦅

ఒకనాడు తన్రీకర మహర్షి శయనించి వుండగా ఆయన నీడ మాత్రం ఒక అరడుగు దూరాన వుండడం చూసిన పూందతి

తన భర్తకు ఏదో కీడు వాటిల్లబోతున్నదని శంకించింది. 

వేకువజామునే నిద్రలేచిన మహర్షి  నదీస్నానానికి బయలుదేరాడు.  అప్పుడు  పూందతి తన భయాన్ని వ్యక్తపర్చకుండా 

" స్వామీ..  యీ రోజు నేనొక వ్రతాన్ని అనుష్టిస్తున్నాను. అందువలన మీరు

సూర్యాస్తమయం అయ్యేవరకూ నా చెంతనే వుండమని కోరి 

తమ కుటీర ద్వారానికి ఎదురుగా  భక్తితో పూజలు చేయసాగింది.

ప్రక్కనున్న చెట్టుపైని  కాకి ఒకటి  అరవడం మొదలు  పెట్టింది. ఋషిపత్ని తన పూజకు భగ్నం కలుగరాదని  కళ్ళు మూసుకుని మంత్రాలు  పఠించసాగింది.

హఠాత్తుగా కాకి తన అరుపు  ఆపేసింది. కుటీర ప్రాంతం అంతా

నిశ్శబ్దంగా వుండడంతో కళ్ళు తెరచింది పూందతి. భగవంతుని కి నివేదించవలసిన

ప్రసాదాన్ని కాకి తినడం చూసింది.

కోపంతో  పూందతి ఆ 

కాకిని తరుముతూ భర్తను ,  కుటీరాన్ని వదలి బయటకు వచ్చింది.

మహర్షికి  మహాపతివ్రతయైన తన భార్య పూందతి రక్షణ లేకుండాపోయింది.  ఈలోగా కాకిరూపంలో వచ్చిన యమధర్మరాజు 

తన్రీకర మహర్షి ప్రాణాలను తన యమపాశంతో బంధించాడు. భర్తకోసం విలపిస్తున్న పూందతిని యముడు ఓదారుస్తూ

"అమ్మా..మన్నించండి ! విధాత వ్రాతను ఎవ్వరూ తప్పించలేరు. నీ భర్త ఆయుర్దాయం ముగిసింది. అతని ప్రాణాలను నేను తీసుకువెళ్ళ తప్పదు.

వెళ్ళేముందు మీకు ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను.

ఇంక భూలోకంలో, చనిపోయినవారి ఆత్మలకి శాంతి కలిగేలా వారి వారి  బంధువులు నివేదించే ఆహారాన్ని నీవు కాకి రూపంలో తీసుకుని ఆ పితృదేవతలకు  సమర్పిస్తూ  వారి సంతతి పుణ్యం సంపాదించే సత్కార్యం చేస్తూవుండమని ఆదేశించాడు.


యముని వరప్రసాద ఫలితంగా పూందతి యీనాటికి కాకి రూపంలో మరణించినవారి ఆత్మ శాంతికై ఆహారం తీసుకు తింటున్నదని   ప్రజలు ధృఢంగా నమ్ముతారు.🦅

A Best Collection frim Brahmana Samaakya.

🦅🦅🦅🦅🦅

ఓటు కోసం దరఖాస్తు

 


https://way2.co/MTE4MzA4NzQ=_lng1/83


అక్టోబర్ 31 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు: CEO 


https://way2.co/MTE4MzA4NzQ=_lng1/83

చ మ త్కా రం

 శుభోదయం!🙏

    

         చ మ త్కా రం !

కవులమాటలేకాదు.కవిత్వభాషవంటబట్టినవారుకూడా చమత్కారభాసురంగా మాటలాడగలరు.ఆమాటలవెనుక అర్ధం యెవరికర్ధం అవుతుందీ?ఆభాషతెలిసినవారికే! కాదుకాదు ఆభాషలో మర్మాలను తెలుసుకున్నవారికికూడా ఆచమత్కారం బోధపడుతుంది.

ఈపద్యం చిన్నదే కానీ చమత్కార రరంజితమై,సరసుల హృదయరంజకంగా మారింది.


ఇదిగో ఆపద్యం ఇదేనండీ!


క:చవిగొనఫలములుఁగొననా?

చవిజూచిన పండ్లురాలు; చక్కగబొమ్మా!!

కవినేను, కనులఁ గనవా?

కవి వైనచొ ,చంకనాకు, గంటంబేదీ?


      పూర్వం కవులకు సంఘంలో మంచిగౌరవముండేది.వారెక్కడికి వెళ్ళినా అందరూ వారిని గౌరవించి అడిగినవి సగౌరవంగా సమర్పించేవారు.

       ఒకకవిగారు అరటిపండ్లకోసం బజారు వచ్చారు.కొట్టుదగ్గనిలబడ్డారు.

పాపం వచ్చేటప్పుడు గంటం తాటియాకులు మరచారు.(అవి వారు కవులని సూచించేగుర్తులు.)

దుకాణదారునితో,


"చవిజూడపండ్లుగొననా?"అన్నారు.


రుచిచూచినచ్చితే పండ్లుకొంటానయ్యా!రుచికి పండ్లు తీసికోనా?అన్నారు.


దానికాదుకాణదారు,

"చవిజూచిన పండ్లురాలు చక్కగబొమ్మా?"-అన్నాడు.

రుచికోసంచేతులేస్తే పళ్ళురాలుతాయి.చక్కగాపో!అన్నాడు.(ఒకఅర్దంపళ్ళురాలుతాయి అనితిట్టినట్టు.మరొకఅర్ధం గెలకున్నపళ్ళురాలిపోతాయి కెలకవద్దు.అని)


కవిగారికికోపంవచ్చింది.

"కవినేను కనులగనవా?"- అన్నారు.

ఓఆసామీ యెవరనుకుంటున్నావు నన్ను నేను గవిని,ఆమాత్రంమర్యాదతెలియదా? అని;


దుకాణదారుకూడా తక్కువవాడుకాదుమరి,

"కవివైనచొ చంకనాకు, గంటంబేదీ?" అన్నాడు.(పోవయ్యా నీవుకవివైతే ఏమిగొప్ప చంకనాకవయ్యా?అనిదూషించినట్టు.ఒకఅర్ధం.మరోఅర్ధం.తమరుకవియైతే చంకలో ఆకులు ,గంటమూ కనబడవేం?

అనిమరోఅర్ధం)

   "చూశారా?శ్లేషసాయంతో  కవితనమాటలలో రెండర్ధాలను జోడించాడు.

     ఇదీ ఈకందంలోని చమత్కారం!!


            ఇదంతా వక్రోక్తి వైభవమే!

            

మీకు నచ్చితే రేపు మరోటి!!

పవిత్రమైన భక్తి

 పవిత్రమైన భక్తి మీ తలరాతనే మార్చేస్తుంది...


 ఒక ఎడారిలో ఒక చిన్న పిట్ట  నివసిస్తూ ఉండేది. అక్కడ  ఎటువంటి పచ్చదనమూ లేకపోవటం వలన ఆ చిన్న పక్షి మండే ఇసుకలో రోజంతా గెంతుతూ ఉండేది.


ఒక రోజున నారదుడు అటు పోతూ ఈ పిట్ట పడుతున్న కష్టాలను  చూసి చాలా జాలి పడ్డాడు.  ఆ పక్షి దగ్గరకు వెళ్ళి ,” ఓ చిన్ని పక్షి ! ఇంత మండే  ఎడారిలో నీవు ఏమి చేస్తున్నావు?  నీకు ఏమైనా సహాయం చేయనా ?అని అడిగాడు.


ఆ చిన్ని పక్షి,” నాకు నా జీవితం ఎంతో ఆనందంగా ఉంది.  కాని ఈ ఎండ వేడిని నేను భరించలేకపోతున్నాను. నా పాదాలు రెండు కాలిపోతున్నాయి.  ఇక్కడ ఒక చెట్టు ఉంటే, ఈ ఎండ,  వేడిని కొంచము తట్టుకుని  హాయిగా, సంతోషంగా ఉండగలను." అని చెప్పింది ...


“ఇటువంటి  ఎడారిలో చెట్టు మొలవటం అంటే, నా ఊహకి అందకుండా ఉన్నది. అయినా నేను పరమాత్మ దగ్గరకి వెళ్లి  నీ కోరిక  నెరవేర్చమని అయనను అడుగుతాను”, అన్నారు...


శ్రీమహా విష్ణువు వద్దకు వెళ్లి ఆ పిట్టకి సహాయం చేయమని ఆయనకు ఈ పిట్ట విన్నపము తెలియజేశాడు. అప్పుడు ఆయన  "నేను అక్కడ ఒక చెట్టును పెరిగేలా చేయగలను.  కానీ ఆ పిట్ట విధి రాత అందుకు అనుకూలంగా లేదు. నేను విధి లిఖితాన్ని మార్చలేను. కానీ, ఎండ నుంచి ఉపశమనము కోసము ఒక ఉపాయం చెబుతాను. ఎప్పుడూ ఏదో ఒక కాలి  పైనే గెంతుతూ ఉండమని ఆ పక్షికి చెప్పు. అప్పుడు ఒక కాలు నేలపై ఉన్నప్పుడు మరొక కాలికి  కొంత విశ్రాంతి దొరికి, ఉపశమనం కలుగుతుంది. వెళ్లి ఆ పక్షి తో ఇలా నేను  చెప్పానని చెప్పు"  అన్నారు పరమాత్మ...


నారదుడు మళ్ళీ ఎడారి లో ఉన్న  పక్షికి కనిపించి పరమాత్మ యొక్క సందేశాన్ని, సలహాను వినిపించాడు. పక్షికి  భగవానుని పై ఎంతో నమ్మకము.   ఈ ఉపాయం విని చాలా సంతోషించింది.   నారద మహర్షికి ఈ సహాయానికి కృతజ్ఞత తెలిపింది. ఈయనకు అర్థం కాలేదు "ఇందులో ఇంత సంతోషించటానికి ఏముందో. అడిగిన చెట్టు మొలిపించలేదు సరి కదా, ఒంటి కాలి  మీద నడువు" అని ఇచ్చిన సలహా వలన ఉపయోగమేమిటో అని తికమక పడ్డాడు. కానీ ఆ పక్షి ఈ ఉపాయాన్ని గ్రహించి  వెంటనే అమలు లో పెట్టటం మొదలు పెట్టింది...


మహర్షికి ఈ సందేహం అలాగే ఉండిపోయింది. కొన్నాళ్లకు మళ్ళీ అక్కడికి వెళ్లి చూద్దామని ఆ  దారిలో వెళుతూ ఆ పక్షిని చూశాడు. అది హాయిగా ఆ  ఎడారి మధ్యలో ఉన్న ఒక పెద్ద పచ్చని చెట్టు మధ్య  కూర్చుని ఉంది.  పక్షి సుఖంగా హాయిగా ఉండటం చూసి ఈయనకి  ఆనందం కలిగింది, అయినా పరమాత్మ చెప్పక పోయినా చెట్టేలా వచ్చిందనే  విషయం బోధ పడలేదు.  మళ్ళీ  దేవుడి దగ్గరకి వెళ్ళి  ఆయనతో  ఈ  పక్షి గురించి తాను చూసిందంతా చెప్పాడు...


అందుకు శ్రీమహావిష్ణువు నారదునితో ఇలా అన్నారు:" నేను చెప్పినట్లే జరిగింది.  పక్షి తల రాతలో  చెట్టు రాసి పెట్టలేదు. కానీ నీవు ఆ పక్షికి  నా సందేశం వినిపించిన తరువాత, భక్తి శ్రద్ధలతో ఆ ఉపాయాన్ని విని, అర్థము చేసికొని ఆచరించింది.  అంతే కాక కృతజ్ఞతలు కూడా తెలుపుకుంది. పవిత్రమైన హృదయముతో తనకు లభించిన  భగవత్ప్రసాదమును  స్వచ్ఛమైన అంతఃకరణతో అమలులో పెట్టింది.  ఆ పక్షి  చూపించిన ఈ భక్తి  శ్రద్ధలకు , నా అనుగ్రహము మేరకు తల రాతను మార్చేసి, అక్కడ అసంభవాన్ని సంభవం చేశాను" అన్నారు...

                                                                                                                                                                            

అందిన అనుగ్రహాన్ని ఆచరించాలి, ఆ పూటకు దొరికిన  దాన్ని ప్రసాదముగా భావించాలి. 

ఈ మాత్రము అందుకోగలిగినందుకు ఆయన పట్ల కృతజ్ఞత చూపాలి.

 మనకేమి కావాలో ఆవి యిస్తారు, మనం కోరుకున్నవన్నీ మనకు సుఖ శాంతులు అందించలేకపోవచ్చు.

 అందువలన ఇది కావాలి అది కావాలి అని కోరుకునే కంటే, మనకేది అవసరమో ఆయనే ఇచ్చేటట్లు ధన్యవాదములు తెలియచేసుకోవాలి, భగవంతుని ఆశీస్సులను పొందే ప్రయత్నం చేయాలి. భక్తి, శ్రద్ధ, కృతజ్ఞతా భావం, విశ్వాసం- వీటి వలన పరమాత్మ అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది...

డబుర ధనలక్ష్మి కథలు 💐

 డబుర ధనలక్ష్మి కథలు 💐



కథ: టెక్నాలజీ 


కాలేజ్ లో అడుగు పెట్టింది సరయు.

చూడ చక్కని అందమైన అమ్మాయి.

తండ్రి పెయింటర్ .తల్లి గృహిణి. 

తల్లిదండ్రుల కు ఒక్కగానొక్క కూతురు.


ఆ రోజు

సీనియర్స్ కొందరు సరయును వింతగా చూస్తూ వెళ్తున్నారు.

కొందరు అబ్బాయిలేమో వెకిలిగా నవ్వుతూ తన వంక అదోలా చూస్తూ వెళ్తున్నారు.

సరిగ్గా అప్పుడే కిషోర్ బైక్ పై వస్తూ సరయు దగ్గరగా వచ్చి బైక్ ఆపాడు‌


"సరయు.ఇప్పటికే నీ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్ బుక్ వాట్సాప్ ఇన్ స్టాగ్రాం ల్లో పోస్ట్ చేసేసా.

నువ్వు స్నానం చేసే వీడీయోలు.

డ్రెస్ చేంజ్ చేసుకునేవి.ఇలా ఒకటా రెండా. 

నీ హాస్టల్ మేట్ నుండి తీయించా.


ఇప్పటికే వైరల్ చేసేసా

 నన్నే కొడతావా.

నేను నిన్ను కొట్టను నీ జీవితంపై కొడతాను.


ఇక నీ జీవితం మొత్తం నాశనం. ఇప్పటికే బట్టల్లేకుండా నీ ఫోటోలు వైరల్ అయిపోయాయి.ఇక ఏం చేస్తావ్. ఉరేసుకుని చావడమే నీకు శరణుం" అంటూ కసిగా వెకిలిగా నవ్వుతూ వెళ్ళిపోయాడు.


చేతుల్లో మొహం దాచుకుని ఏడవడం మొదలు పెట్టింది సరయు.

వేగంగా హాస్టల్ కి వెళ్ళి లగేజ్ సర్దుకుని  ఇంటికి వెళ్ళింది.


ఆ రోజు రాత్రి మొబైల్ లో ఫేస్ బుక్ ఓపెన్ చేసింది. 

కిషోర్ అకౌంట్ లో తన ని మార్ఫింగ్  చేసిన ఫోటోలు. ఇంకా ఎన్నో.

కన్నీళ్ళాగలేదు. వెంటనే  ఇంట్లో పంటచేను కోసం తెచ్చిన పురుగుల మందు బాటిల్ అందుకుంది‌ . తాగి తన జీవితాన్ని ముగించేద్దాం అనుకుంది.


సమయానికి గమనించిన సరయు తల్లి అన్నపూర్ణ బలవంతంగా ఆ పురుగులమందు డబ్బాను దూరంగా విసిరి కొట్టి సరయు ను ఓదార్చి విషయం తెలుసుకుంది.

వెంటనే భర్తకు ఫోన్ చేసింది‌


సరయు తండ్రి రమణ విషయం తెలిసి కృంగిపోయాడు అయినా కూతురికి ధైర్యం చెప్పాడు. రమణ అక్క కొడుకు సరయుకు బావ వరసైన సాత్విక్ ను పిలిపించాడు.

సరయు చిన్నప్పుడే సాత్విక్ భార్య అని పెద్దలు పేరు పెట్టుకున్నారు. సాత్విక్ సరయులకు కూడా ఒకరంటే ఒకరికి ప్రేమే


విషయం తెలుసుకున్న సాత్విక్ లో ఆవేశం ఎక్కువైంది. కానీ సాత్విక్ మామ రమణ  " ఆవేశం వద్దురా. ఆలోచించి ఏ పనైనా చేయాలి.ఇవతల ఆడపిల్ల జీవితం" అంటూ రమణ సాత్విక్ ను తీసుకుని పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.

పోలీసులు  కిషోర్ ను అరెస్ట్ చేశారు.


కిషోర్ తల్లిదండ్రులు అవమానం గా భావించారు. కిషోర్ కు కూడా అక్క ఉంది. పోలీసులు దేహశుద్ది చేశారు. కిషోర్ కుటుంబానికి ఇంటా బయటా అవమానాలు. వీధిలోని ఆడపిల్లల తల్లిదండ్రులు కిషోర్ కుటుంబాన్ని అసహ్యంగా చూడటం మొదలు పెట్టారు.

కాళ్ళబేరానికొస్తుందనుకున్న సరయు ఇలా తనని తనకుటుంబాన్ని వీధి పాలు చేస్తుందని కిషోర్ ఊహించలేదు.


పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణిగింది. కిషోర్ సరయు జోలికెళ్ళనని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు.

కిషోర్ కుటుంబం సరయు కుటుంబాన్ని క్షమాపణలు కోరింది.


సరయు కుటుంబం ఆ ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయారు.

తన గతం తెలియని చోట సరయు కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది.


అయినా సరయు జీవితం క్షణం క్షణం గండం లా అనిపించ సాగింది.

పక్కనున్న ఎవరైనా గుసగుసలాడుకున్నా తన వైపు అనుమానంగా చూసినా సరయు వాళ్ళు చూస్తున్నది తన మార్ఫింగ్ ఫోటోలే మో అని భయపడిపోయేది.


అదే సమయంలో పెద్దలు సరయు కు సాత్విక్ తో పెళ్ళి జరిపించారు.

సాత్విక్ కు సరయు అంటే ఎనలేని ప్రేమ.

భార్య సరయు భయాన్ని అర్థం చేసుకుని ధైర్యం చెప్పాడు.


సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాడు.

సరయు తోటి కోడలు భావన సరయు స్థితికి ఎంతో చలించిపోయింది.

ఒకరోజు భావన "సరయూ. జరిగిందేదో జరిగిపోయింది. ఈ రోజుల్లో ఇలాంటివి కామన్. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్. టెక్నాలజీ పెరిగిపోయింది.


టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తి లాంటిది.

మంచికి వాడొచ్చు .చెడుకు వాడొచ్చు.

ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తలు ఉండాలి.సోషల్ మీడియా సైట్ లలో వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేయకూడదు.


తెలియని వ్యక్తుల పరిచయాల కు దూరంగా ఉండాలి.

మనం తినే ఆహారం కడుపులోకి వెళ్ళినట్టు

మనతో ఉండే‌ స్నేహాల ప్రభావం మాటలు మన మనసులోకి వెళ్తాయి.కాబట్టి మంచి స్నేహాలు చేయాలి.


మనం ఎంత ఎదిగినా ఆడపిల్లలం ఆడపిల్లలమే.

ఎందుకంటే ఓ మగవాడు ఓ అమ్మాయి ని రేప్ చేసినా సమాజంలో ధైర్యంగా తిరగగలుగుతాడు.


అదే ఆడది తన తప్పు లేకపోయినా అత్యాచారానికి గురైతే అందరూ వెలివేసినట్టు అపవిత్రం అయినట్టు చూస్తారు.అన్నిటికంటే నీచం ఆదరించాల్సిన తోటి మనుషులు కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తారే తప్ప ఆదరించరు.

పైగా అవమానిస్తారు.


ఎవడో తన రాక్షసానందం కోసం నిన్ను చెడుగా ప్రొజెక్ట్ చేస్తే దానికి నువ్వు అంతలా బాధపడిపోవడం ఏంటి.

పోనీ. అందరు ఆడపిల్ల ల్లాంటిదే నీ శరీరం కూడా.

చూస్తే చూడనీ.  ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోయే శరీరం.

.పైశాచిక ఆనందం పొందనీ.


ఆడపిల్ల లంటే సమాజంలో ఇంకా చిన్నచూపే.

అందంగా ఉంటే ప్రేమలంటూ వెంట పడతారు.ఒప్పుకోక పోతే హత్యలు చేస్తున్నారు.

ఒప్పుకుంటే బరితెగించి తిరుగుతోందని నిందలు వేస్తారు.

ఒంటరిగా దొరికితే అత్యాచారాలు చేస్తున్నారు.

ఏ చట్టానికి ఏ శిక్ష లకూ భయపడటం లేదు.

ఆడపిల్లల ప్రాణాలంటే మరీ ఇంత చులకనా


ప్రస్తుతం నువ్వు అశక్తురాలివై అతడిని శిక్షించలేక పోవచ్చు.

కానీ దేవుడు అనే వాడొకడు న్నాడు.

ఏదో  రోజు దేవుడు అతడికి వేసే శిక్ష భయంకరంగా ఉంటుంది.


మంచి మనసు కార్చే కన్నీటికి ఎంతో విలువ శక్తి ఉంటాయి.


ప్రపంచంలో ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించకు. 

నిన్ను వేలెత్తి చూపే వాళ్ళంతా ఎవరు. ఎందుకు పనికొస్తారు.


నీ ప్రపంచం నీ కుటుంబం.

మరి నీ కుటుంబం అంతా నీకు వెన్నుదన్నుగా ఉన్నపుడు ఎవరో ఏదో అనుకునే మాటలకు నీకు బాధెందుకు.


మన కుటుంబం లో అందరం నీ మంచి గురించే ఆలోచిస్తాం.


చెప్పడం మర్చిపోయా.


త్వరలో మీ బావ నాచే "బొటిక్" మొదలు పెట్టిస్తున్నారు.

నువ్వు నేను పార్టనర్స్. సాత్విక్ కూడా ఒప్పుకున్నాడు.

ఇద్దరికీ చేతినిండా పని.

పనికిరాని ఆలోచనలకు చెక్ పెట్టేద్దాం.

ఏమంటావు" అంది.


సరయూ "థాంక్యూ అక్కా .అలాగే" అంది.


నెల రోజుల్లో "భావనా సరయు బొటిక్ " ప్రారంభం అయింది.

ఇక సరయు పూర్తి పనిలో పడింది.


నిజానికి సరయు ఆలోచనలో ఎంతో మార్పు.


సమాజం చూసే చూపు లో ఎందుకు మార్పు కోరుకోవాలి.అనుకుంది.


ముఖ్యంగా మార్పు సరయు "ఆలోచనల్లో" వచ్చింది.


ఎవరో ఏదో అనుకుంటారని ఆలోచించడం మానేసింది.

ఇది తన జీవితం. తను సంతోషంగా జీవించాలి అనుకుంది కాబట్టి తనను బాధ పెట్టే విషయాలను బలవంతంగా మర్చిపోయింది


మనోవిజ్ఞాన శాస్త్రంలో దీనినే "దమనం"అంటారు.

బలవంతంగా మరచిపోవడం


తనను బాధించే మనుషులకు స్నేహాలకు దూరంగా ఉంటూ తన కుటుంబం తో సంతోషంగా గడపడమే ముఖ్యం అని భావించింది.


ఓ మంచి సంతోషకర జీవితానికి శ్రీకారం చుట్టింది.


ఆడపిల్ల లో ఉండాల్సింది "ఆత్మ విశ్వాసం"


ఆడపిల్ల లకు కావాల్సింది

ప్రేమించే భర్త

ఆదరించే కుటుంబం

ప్రోత్సహించే స్నేహితులు

వెన్నంటి ఉండే ఆత్మీయులు


Save girls@


సమాప్తం

సర్వేజనా సుఖినోభవంతు 


రచన: 

డబుర ధనలక్ష్మి 💐✍️

హిందూపురం

ఆత్మ విద్య

 ఆత్మ విద్య -మీ జన్మ రహస్యం :-మీ లోఎలాటి  వ్యసనములు అయినా దూరం చెయ్యొచ్చు ఐతే 3నెలలు కష్ట పడాలి, ఎన్ని వ్యసనములు ఉన్న మనసు లో ఆలోచన మాత్రమే,ఈ దేహం నాకు ఇవ్వబడిది. అది నేను కాదు. ఫ్రీ చిట్కాలు  ఇది ఒక వరం ఎవరుకి అయినా సాధ్యం ఆత్మ విశ్వాసం అంటారు ముందు మీ మనసు ఏంటో  అర్ధం చేసుకో అది తెలుసు కొంటే నీ జీవితం అంతా ఆనందం.  వ్యసనములుకి ఎదురు పడి  పోరాడుతూ ముందుకు సాగిపో దేని నైనా జయించగలవు 


.ప్రపంచం లో చెడ్డ వాడు గా( పురుగు లాగా ) మిగిలిపోకు నన్ను మించినవాడు  లేడని నిరూపించుకో ?                 ( నీ గీత- నీ రాత మార్చకో) (భగవద్గీత )మన గురించి చెప్పింది, ఎక్కడ దేవుడు గురించి చెప్పలేదు. పురాణలు దేవుడు గురిం చి చెప్పాయి  గురువులు చెప్పేది వినాలి .ఇంకా తెలుసు కోవాలి అనుకొంటే. ధన్యవాదములు  my కాంటాక్ట్ :-9440546282👍