సమస్యాపూరణం
సమస్య.ఘనముగ గాడిదల్ మధురగానమొనర్చె, సభాంతరమ్మునన్.
వినుతిని గాంచె శాస్త్రమది, విజ్ఞతజాటుచు విశ్వమంతటన్,
దొనరగ నన్నికార్యముల దోహదమయ్యెను నవ్యమార్గమై,
ధ్వనులను రూపముల్ సరిగ దాల్చెడి కృత్రిమ మేధ గూర్పగా,
ఘనముగ గాడిదల్ మధురగానమొనర్చె సభాంతరమ్మునన్.
సురభిశంకరశర్మ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి