15, సెప్టెంబర్ 2026, మంగళవారం

భాగవతం

  *"భాగవతం వింటే బాగవుతాం"*

శ్రీ పోతన భాగవత మధురిమలు 


(8-615-క.)

"క్షితిదానమిచ్చు నతఁడును

నతికాంక్షఁ బరిగ్రహించు నతఁడును దురిత

చ్యుతులై శతవత్సరములు

శతమఖ లోకమునఁ గ్రీడ సలుపుదు రెలమిన్ 


*భావము:-* అంతట మాయాబ్రహ్మచారి బలిచక్రవర్తి తో ఇలాఅన్నాడు. “భూమిని దానం ఇచ్చినవాడికి; దానిని ప్రీతితో తీసుకున్నవాడికి పాపాలు నశించిపోతాయి. వారు సంతోషంగా నూరు యాగాలు చేస్తే దక్కే స్వర్గలోకంలో నూరేండ్లు విహరిస్తారు.


శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన ఘంటసాల హంస ధ్వని రాగంలో శ్రీ గణేశుని స్తుతిస్తూ.... *వినాయక చవితి శుభాకాంక్షలు*


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

కామెంట్‌లు లేవు: