15, జులై 2020, బుధవారం

పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు.

వినాయకుడు బ్రహ్మచారే కావచ్చు... కానీ ఏ పెళ్లిని తలపెట్టినా, అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.

పశ్చిమ తీరాన...
మనదేశపు పశ్చిమతీరాన వెలసిన గణపతి ఆలయాలలో, ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ఒకటి. ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది. కర్నాటకలోనే పుట్టి, ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది, ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలో సంగమిస్తుంది.

స్థలపురాణం...
అది ద్వాపరయుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు రుషులంతా వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వారు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని రుషులు నిర్ణయించుకున్నారు. కానీ అదేం చిత్రమో! యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ఏవో ఒక ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో రుషులకు పాలుపోక నారదుని శరణు వేడారు. అంతట నారదుడు, గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే, ఎటువంటి విఘ్నాలూ లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. సలహాను ఇవ్వడమే కాదు, తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు. గణేశుడు అక్కడకు రావడంతోనే యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటిదేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది. తమ విఘ్నాలన్నీ తొలగించిన గణేశుని రుషులందరూ వేనోళ్లతో స్తుతించారు. వారి భక్తికి మెచ్చిన గణేశుడు, ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోర్కెలను తీరుస్తానని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభువుగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి.

భిన్నమైన రూపం....
ఇక్కడి మూలవిరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.

పెళ్లి పెద్ద....
కర్నాటకలోని బంధి అనే జాతివారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబం వారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే, దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇలా వైభవోపేతమైన స్థలపురాణానికి తోడుగా, చిత్రవిచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.

ఏవి చేయకూడదు? ,ఏవి చేయాలి?

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.
2. ఎంత అవసరమైన  కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.
3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.
4. శుభానికి వెళ్తున్నప్పుడు స్రీలు ముందుండాలి. అశుభానికి స్రీలు వెనక వుండాలి.
5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి .
6. అమంగళాలు కోపంలోను , ఆవేశంలోను ఉచ్చారించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.
7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.
8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి.కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.
9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.
10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నాం కదా ... కొన్ని నిజాలు చూద్దాం ...
అరటిఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని 
అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి ,మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి 
అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. 

అరటి ఆకులో విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది,ఆరోగ్యవంతులుగా ఉంటారు. 
తామరాకులో భోజనం చేయడo వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షo కలుగుతుంది.
బాదాం ఆకులో భోజనంచేయడంవలన కఠిన హృదయులవుతారు.
టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది. 

జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.
1) ధర్మ శాస్త్రం ప్రకారం ..మన ఇంట్లో మీకు పని వత్తిడులవల్ల వస్తున్నాను ఆగమని చెప్పి .... అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు,మనం కూర్చున్నతరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి... ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మనకోసం అన్నం ఎదురుచూడరాదు ..అలా చేస్తే రానున్నకాలంలో దరిద్రం అంటే అవకాశం ఎక్కువ. 
2) దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే ... తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది, ఎందుకనగా .... దీర్గాయుష్షు వస్తుంది 
తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్యస్థానము ,సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ. 
పడమర ముఖంగా కూర్చుంటే ... బలం వస్తుంది 
ఉత్తర ముఖంగా కూర్చుంటే ..... సంపద వస్తుంది 
దక్షిణ ముఖంగా కూర్చుంటే .... కీర్తి వస్తుంది
కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టట,దుర్భాష లాడుట చేయరాదు. 
ఏడుస్తూ తింటూ ,గిన్నె / ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,కొంచెం ఆకులో వదిలేయాలి, దెప్పి పొడువరాదు. 
ఎట్టిపరిస్థితిలో నైనా ఒడిలో కంచెం పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు,ఇది చాలా దరిద్రము,అట్టివారికి నరకము ప్రాప్తించును. 
భోజనసమయంలో నవ్వులాట,తగువులాట,తిట్టుకొనుట,గేలిచేయుట నష్టదాయకం 
భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం,అన్నదాతకు కూడారాదు.

 నీవు చేసే నీ పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ... ఆనందమే విజయానికి సోపానం.

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం

జగద్విఖ్యాతమైన శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం స్తోత్రాన్ని ప్రతివాద భయంకర అణ్ణాంగారాచార్య లేదా అణ్ణన్ స్వామి రచించారు.

ఇతడు క్రీ.శ.1361 వ సంవత్సరంలో అనంతాచార్యులు మరియు ఆండాళ్ దంపతులకు కంచి పట్టణంలో జన్మించారు. 

ఈయన శ్రీరామానుజాచార్యులచే నియమింపబడిన 74 సింహాసనాధిపతులలో ఒకరైన 'ముడుంబ నంబి' వంశానికి చెందినవారు. ఇతని గురువు మణవాళ మహాముని.

సుప్రసిద్ధమైన వేంకటేశ్వర సుప్రభాతము, రంగనాధ సుప్రభాతము కూడా అణ్ణన్ రచనలే. 

వేదాంత దేశికుల కుమారుడైన నారాయణావరదాచార్యుడు అణ్ణన్కు మొదటి గురువు. 

నారాయణ వరదాచార్యుల వద్ద వేదాలు, ఇతర విద్యలు అభ్యసిస్తున్న సమయంలో ఆణ్ణన్ను వాదంలో ఎదుర్కోవడం ప్రత్యర్ధులకు చాలా సంకటంగా ఉండేదట. 

నృసింహ మిశ్రుడనే అద్వైత పండితుడిని వాదనలో ఓడించినపుడు మణవాళ మహాముని అణ్ణన్కు "ప్రతివాద భయంకర" అనే బిరుదు ఇచ్చాడట. 


తరువాత అణ్ణన్ తిరుమలలో కొంతకాలం గడిపాడు. ఆ సమయంలో అతను మణవాళ మహాముని శిష్యుడయ్యాడు.

హిందువుల సాంప్రదాయాలు.

1) మంగళ, శుక్ర వారాలలో క్షవరం చేసుకోరాదు

2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు.

3) అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఒకేరోజు క్షవరం చేసుకోరాదు.

4) భోజనం తిన్న పళ్లెంలో చేయి కడగకూడదు.

5) నూనె, ఉప్పు, గుడ్లు చేతికి ఇవ్వరాదు.

6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు.

7) సాయంత్రం గం.5 తర్వాత ఇల్లు ఊడ్చ కూడదు.

8) మంచం మీద కూర్చుని తినకూడదు.

9) తలుపుల మీద బట్టలు వేయకూడదు.

10) సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి. వీధి తలుపు మాత్రం తీసి ఉంచాలి. (హిందువులు సంప్రదాయం ప్రకారం సంధ్యా సమయంలో లక్ష్మీ దేవి సంచరిస్తూ ఉంటుందిట.)

11) ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి.

12) మంగళ, శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు.

13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు.

14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి.

15) తెల్లవారి లేవగానే ముందు దేవుని పటములు కానీ మీ రెండు అరచేతులు గాని చూడాలి. అద్దంలో మీ ముఖం చూసుకోరాదు.

16) అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి.

17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు.

18) ప్రతినెలా కొత్త రైస్ బ్యాగు తేగానే అన్నం వండి తొలిముద్ద దేవుడికి నైవేద్యంగా పెట్టండి.

19) పూజా మందిరంలో మరణించిన మన కుటుంబీకుల ఫోటోలు ఉంచకూడదు.

20) ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు.

21) దేవాలయానికి వెళ్ళి వచ్చాక వెంటనే కాళ్ళు కడుగుకోకూడదు.

22) తూర్పు, పడమటి దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు.

23) ఆడవాళ్లు శిరోజాల విరబసుకోరదు

24) ఆదివారం అన్నదమ్ములు ఉన్న అక్కచెల్లులు తలస్నానం చేయరాదు

25) ముతైదువులు పంచ మంగల్యాలు (బొట్టు, గాజులు, నల్లపూసలు, కాలి మెట్టెలు ,పువ్వులు) ధరించవలెను

26) దానం చేసేటప్పుడు కుడి చేత్తో చెయ్యవలను.

27) సంధ్య సమయం లో పడుకోకూడదు

పాటించేవారుంటే.. ఎన్నయినా చెప్పవచ్చు. ఎవరు పాటిస్తారులే అని పెద్దలు మౌనంగా ఉండకూడదు. చెప్పడం మన విధి. ఆ పైన వారి ఇష్టం.

ఇది మన హిందువులు సాంప్రదాయాలు.

*జాగ్రత్తగా చదవండి*

*ICMR న్యూ ఢిల్లీ👇*
*జాగ్రత్తగా చదవండి*
*కొన్ని చాలా ముఖ్యమైన అంశాలు*

1) 02 సంవత్సరాల వరకు విదేశీ ప్రయాణాన్ని వాయిదా వేయండి *ప్రస్తుత పరిస్థితుల్లో  హైదరాబాద్ కి వెళ్లకుండా ఉండడం బెటర్.....* హైదరాబాద్ మొత్తం ప్రస్తుతం కరోనా సంక్షోభంలో ఉంది.... *భాగ్యనగరాన్ని కాపాడటం చాలా కష్టంతో కూడుకున్న పని.* 
2) ఒక సంవత్సరం పాటు బయట ఆహారం తినవద్దు.
*3)అనవసరమైన వివాహం లేదా ఇతర వేడుకలకు వెళ్లవద్దు*
4)అనవసరమైన ప్రయాణ యాత్రలు చేయవద్దు.
 *5)కనీసము ఒక సంవత్సరం పాటు రద్దీగా వుండే ప్రదేశాలకు వెళ్లవద్దు*
6)సామాజిక దూర నిబంధనలను పూర్తిగా పాటించండి.
*7)దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి*.
8)ఫేస్ మాస్క్‌ను ఉంచండి.
*9)ప్రస్తుత పరిస్థితుల్లో  ఈ వారం నుండి జులై నెలాఖరు వరకు చాలా జాగ్రత్తగా ఉండండి*.
10)మీ చుట్టూ ఎటువంటి గందరగోళాన్ని ఉంచవద్దు.
*11)శాఖాహార ఆహారాన్ని ఇష్టపడండి*.
*12)ఇప్పుటి నుండి వచ్చే 06 నెలలు వరకు క్రౌడ్ మార్కెట్‌కు వెళ్లవద్దు. వీలైతే పార్క్, పార్టీ మొదలైనవాటిని కూడా తప్పించాలి.
*13)రోగనిరోధక శక్తిని పెంచండి*.
14)బార్బర్ షాపులో లేదా బ్యూటీ సెలూన్ పార్లర్‌లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.
*15)అనవసరమైన సమావేశాలకు దూరంగా ఉండండి,సామాజిక దూరాన్ని ఎల్లప్పుడూ పాటించండి*.
16)."'కరోనా'" యొక్క ముప్పు అనేది ఇంతలో పోయేది కాదు. టీకా వ్యాక్సిన్ వచ్చినా కూడా తగ్గే పరిస్థితి లేదు,ఒక సంవత్సరం పాటు తీసుకునే జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష.
 *17)మీరు బయటకు వెళ్ళినప్పుడు బెల్ట్, రింగులు,రిస్ట్ వాచ్ ధరించవద్దు.వాచ్ అవసరం లేదు.మీ మొబైల్‌ నందు  సమయం ఉంటుంది*
 18)చేతి కర్చీఫ్ వద్దు, అవసరమైతే శానిటైజర్ & టిష్యూ తీసుకోండి.
 *19)మీ ఇంటి లోనికి  బూట్లు తీసుకుని పొవద్దు.వాటిని బయట వదిలివేయండి*.
 20)మీరు బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు మీ చేతులు మరియు కాళ్ళను శుభ్రం చేయండి.
 *21)మీరు ఎవరైనా అనుమానాస్పద రోగికి దగ్గరగా వచ్చారని మీకు అనిపించినప్పుడు పూర్తిగా వేడి నీటితో స్నానం చేయండి*
22)వచ్చే 06 నెలల నుండి 12 నెలల వరకు లాక్డౌన్ ఉన్నా లేకున్న  ఈ జాగ్రత్తలు  పాటించండి.
*🙏పై సూచనలను, సలహాలను మీ కుటుంబం & స్నేహితులతో పంచుకోండి.🙏

 *💐🤝ధన్యవాదాలు🤝💐*

 👆ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, న్యూ డిల్లీ.






కృతజ్ఞత చెప్పడం వల్ల ఇంత మేలు జరుగుతుందా

ఒక పక్షి రెక్కలు లేక  తినడానికి  తిండి దొరక్క  తాగడానికి నీళ్లు లేక ఉండడానికి గూడూ లేక చాలా దీనావస్థలో ఉన్నింది  
అటుగా ఓ పావురం  వెళ్లడం  చూసి  ఎక్కడకు  వెళ్తున్నావ్  అని అడిగింది

స్వర్గానికి వెళ్తున్నాను  అని చెప్పడంతో నాగురించి  దేవుడికి  విన్నవించావా  అని వేడుకుంది  
అలాగే అని చెప్పిన  పావురం అక్కడ స్వర్గపు  ద్వారపాలకులతో  పక్షి గురించి చెప్పగా  

ఆ పక్షి అదే స్థితిలో ఇంకా  ఏడేళ్ళు గడపాలి అని ద్వారపాలకులు చెప్పగా 

పావురం చాల బాధపడింది ఆ పక్షి స్థితికి
ఈ విషయం ఆ పక్షికి ఎలా చెప్పను  అని అడగగా
 "నువ్వు ఇచ్చిన  ప్రతిదానికి కృతజ్ఞత భగవంతుడా "
ఈ ఒక్క  మాట ఎప్పుడూ చెప్తూఉండమను అని చెప్పారు 

అదే విషయాన్ని పావురం ఆ పక్షికి చెప్పి  వెళ్ళిపోయింది 

సరిగ్గా వారం తరువాత   పావురం దారిలో  వెళ్తూ  పక్షిని చూసింది 

చెట్టు చిగురించింది 
ఎడారిలో నీటి కొలను  వచ్చింది 
రెక్కలు వచ్చింది పక్షికి 
ఇప్పుడు హాయిగా  ఆడుతూపాడుతూ పక్షి కనిపించింది  

ఆశ్చర్యపోయిన పావురం ఎలా అని కనుక్కోవాలని  మళ్ళీ స్వర్గం  వైపు  వెళ్లి అక్కడ వారిని అడిగింది 
ఏడేళ్లు కష్టపడుతుందని  అన్నారు మరి ఆ పక్షి ఇప్పుడు చాలాబాగుంది ఎలా అని అడిగింది 

పక్షి రెక్కలు లేక కిందపడిపోయింది దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దాహంతో ఉండగా   దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
ఆకలితో ఉండగా  దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దేవుడు చలించిపోయాడు  జాలి చూపెట్టాడు ఏడేళ్ల  తన కష్టాన్ని ఏడురోజులకు  తగ్గించేసాడు 
అందుకే  ఇలా అని 

నిజంగా కృతజ్ఞతకు ఇంత బలం  ఉందా  
దేవుడా నువ్వు ఇచ్చిన ప్రతిదానికి  కృతజ్ఞత దేవుడా
***************

 "ధనమొస్తే దాచుకోవాలి.. రోగం వస్తే చెప్పుకోవాలి"

సమాజంలో మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని తెలియచెప్పేందుకు ఈ జాతీయం ఉపకరిస్తుంది. ధనం ఉంది కదాని ముందూ వెనుకా చూసుకోకుండా ఖర్చుపెట్టకూడదు... దాచుకోవాలి. అలాగే రోగం వస్తే వైద్యుడికి చూపించుకోకుండా చెప్పకుండా ఉండకూడదు. చెప్పి తగిన మందు తీసుకుని రోగాన్ని తగ్గించుకోవాలి అనే విషయ సూచనకు ఈ జాతీయం ఉపకరిస్తుంది.

సేకరణ:డాక్టర్.యం.ప్రసాద్  
***********

ఆభరణం - కధ 
 ఒకానొక  చక్రవర్తి  యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లు నెత్తికెక్కాయని.

 అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.
'మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహకర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుండును' అన్నాడు. 

అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు. 

తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు. తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. 

దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి 'ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు' అన్నాడు. 

పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు. 

'ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండ దు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు' అన్నాడు మంత్రి మళ్ళీ. ..పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు. 

వెంటనే ఆలోచించాడు...

 మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్రల్లోని నీటిని తెప్పించడం, ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది. జ్ఞానోదయమయింది. 

వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, 'గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి' అన్నాడు.

ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్రగుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరో కాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

 నరస్యాభరణం రూపం 
 రూపస్యాభర ణం గుణమ్‌ 
 గుణస్యాభరణం జ్ఞానమ్‌ 
 జ్ఞానస్యాభరణం క్షమా 

మానవులకు ఆభరణం రూపమని, రూపానికి ఆభరణం సుగుణమని, సుగుణానికి ఆభరణం జ్ఞానమని, జ్ఞానానికి ఆభరణం క్షమ అని దీని అర్థం.

పై శ్లోకంలో మనిషికి రూపం మంచి ఆభరణమని చెప్పినా గుణం, జ్ఞానం, క్షమ అనేవి రూపం కన్నా అతి ప్రధానమైనవని స్పష్టం చేయబడింది. 

అంటే మంచి అందగాడైనా ఏ వ్యక్తి అయినా ఆ ఒక్క లక్షణం ద్వారా పూజ్యుడు కాడు. 

వినయం అనేది మనిషిలో ఎల్ల్లవేళలా అన్ని పరిస్థితుల్లోనూ ఉండాలి. 

కొందరు ఓటమి చవి చూసినప్పుడో, బాధలలో మునిగిపోయినప్పుడో తమ బాధలు వెళ్ళబుచ్చుకునేందుకు ఇతరుల ముందు వినయం ప్రదర్శిస్తారు. 

అయితే ఇలాంటి వ్యక్తులు గెలుపు సాధించి నపుడు, సంపదలు వచ్చినపుడు, మంచి పదవి ఉన్నపుడు గర్వాతిశయంతో ఇతరులను చిన్న చూపు చూస్తారు. కించ పరుస్తారు. మాటలతో ఎదుటివారిని చులకన చేస్తారు. 

అందంగా ఉండడం మంచిదే కాని తను అందంగా ఉన్నానని అందవిహీనమయిన పనులు చేయడం తగనిది. 

అన్నీ ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నపుడు కూడా హద్దులెరిగి ప్రవర్తించాలన్నది పెద్దల మాట.

కృతజ్ఞత చెప్పడం వల్ల ఇంత మేలు జరుగుతుందా

ఒక పక్షి రెక్కలు లేక  తినడానికి  తిండి దొరక్క  తాగడానికి నీళ్లు లేక ఉండడానికి గూడూ లేక చాలా దీనావస్థలో ఉన్నింది  
అటుగా ఓ పావురం  వెళ్లడం  చూసి  ఎక్కడకు  వెళ్తున్నావ్  అని అడిగింది

స్వర్గానికి వెళ్తున్నాను  అని చెప్పడంతో నాగురించి  దేవుడికి  విన్నవించావా  అని వేడుకుంది  
అలాగే అని చెప్పిన  పావురం అక్కడ స్వర్గపు  ద్వారపాలకులతో  పక్షి గురించి చెప్పగా  

ఆ పక్షి అదే స్థితిలో ఇంకా  ఏడేళ్ళు గడపాలి అని ద్వారపాలకులు చెప్పగా 

పావురం చాల బాధపడింది ఆ పక్షి స్థితికి
ఈ విషయం ఆ పక్షికి ఎలా చెప్పను  అని అడగగా
 "నువ్వు ఇచ్చిన  ప్రతిదానికి కృతజ్ఞత భగవంతుడా "
ఈ ఒక్క  మాట ఎప్పుడూ చెప్తూఉండమను అని చెప్పారు 

అదే విషయాన్ని పావురం ఆ పక్షికి చెప్పి  వెళ్ళిపోయింది 

సరిగ్గా వారం తరువాత   పావురం దారిలో  వెళ్తూ  పక్షిని చూసింది 

చెట్టు చిగురించింది 
ఎడారిలో నీటి కొలను  వచ్చింది 
రెక్కలు వచ్చింది పక్షికి 
ఇప్పుడు హాయిగా  ఆడుతూపాడుతూ పక్షి కనిపించింది  

ఆశ్చర్యపోయిన పావురం ఎలా అని కనుక్కోవాలని  మళ్ళీ స్వర్గం  వైపు  వెళ్లి అక్కడ వారిని అడిగింది 
ఏడేళ్లు కష్టపడుతుందని  అన్నారు మరి ఆ పక్షి ఇప్పుడు చాలాబాగుంది ఎలా అని అడిగింది 

పక్షి రెక్కలు లేక కిందపడిపోయింది దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దాహంతో ఉండగా   దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
ఆకలితో ఉండగా  దేవుడికి కృతజ్ఞత చెప్పింది 
దేవుడు చలించిపోయాడు  జాలి చూపెట్టాడు ఏడేళ్ల  తన కష్టాన్ని ఏడురోజులకు  తగ్గించేసాడు 
అందుకే  ఇలా అని 

నిజంగా కృతజ్ఞతకు ఇంత బలం  ఉందా  
దేవుడా నువ్వు ఇచ్చిన ప్రతిదానికి  కృతజ్ఞత దేవుడా

" దాగుడు మూతలు దండాకోర్ ,పిల్లి వచ్చే,ఎలుక గప్ చుప్ సంబారు బుడ్డి’’


ఇవి చిన్నపుడు పిల్లలు ఆడుకునే ఆటల్లో,కళ్ళు మూసి చెప్పే మాటలు.ఇందులోని సంబారు బుడ్డి అంటే ఏమిటో వివరించమని మిత్రులు సాయి వంశీ,ఇంకా కొందరు అడిగారు.వారికోసం,మరియు నా మిత్రులైన మీ అందరి కోసం నాకు తెలిసిన ఈ వివరణ...
పల్నాడు ప్రాంతాలలో,[నరసరావుపేట,పిడుగురాళ్ళ,సత్తెనపల్లి,గుంటూరు జిల్లాలోని ఇంకా కొన్ని ప్రాంతాలలో]కూరలలో వాడుకోవటానికి ఏడాదికి సరిపడా,ఎండాకాలంలోనే,సంబారు తయారుచేసుకుని పెట్టుకుంటారు.కూరల్లో పసుపు వాడరు.దీన్నే వాడతారు.దీని రుచి,వాసన చాలా బాగుంటుంది.కూరలకు అదనపు రుచి వస్తుంది.చంటిబిడ్డలకు వేడ న్నంలో నేయి,ఈ సంబారు పొడి వేసి కలిపి ముద్దలు పెడుతూ వుంటే,పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.ఇది మంచి అరుగుదల నిస్తుంది.
ఇది ఎలా తయారుచేస్తారంటే ఒకకిలో మంచి పసుపుకొమ్ములు తీసుకుని,ముక్కలుగా నలగగొట్టి ఎండలో పెడతారు.కిలో ధనియాలు,పావుకిలో చొప్పున మెంతులు,జీలకర్ర,కల్లుప్పు తీసుకుని,నూనె లేకుండా,మాడకుండా వేపుతారు.పసుపుకొమ్ములువేపిన ఇవన్నీ,ఇంకా ఎండబెట్టిన కరివేపాకు చాలా ఎక్కువ మోతాదులో తీసుకుని,ఇవన్నీ కలిపి మర పట్టిస్తారు..
ఇందులో ఎండు మిరపకాయలు గానీ,కారం గానీ వేయరు..
ఇంటికి తెచ్చాక,పొట్టు వలవని పావుకిలో వెల్లుల్లి పాయలు[ఎల్లిగడ్డలు]ఈ పొడిలోవేసి కచ్చాపచ్చాగా దంచి,ఒక బేసిన్ లోకి తీసుకుని దానిలో పావుకిలో వంటాముదం పోసి బాగా కలిపి ఒక మట్టిబుడ్డికి [మట్టిదుత్త]ఎత్తి పెట్టుకుంటారు.ఈ సంబారు బుడ్డి చిన్న కుండ సైజ్ లో వుండిమూతి సన్నగా,చేయి పట్టేంత సన్నగా వుంటుంది.అచ్చం దీపం బుడ్డి ఆకారంలో వుంటుంది.
మా చిన్నపుడు ఇళ్ళలో కాస్త చీకటిగా వుండే గదిని స్టోర్ రూమ్ గా వాడుకునేవారు.మా ఇంట్లో అయితే మా పడమటింటి గదిని అలా వాడేవారు.ఆ గదిలో అనేక సైజ్ లలో బాన లు,కుండలు,బుడ్లు ఉండేవి. బానల్లో జొన్నలు,సజ్జలు,బియ్యం కుండల్లో ఉప్పు గోంగూర,గోంగూర ,పండు మిరపకాయ పచ్చళ్లు,చింతాకు,కరివేపాకు లాంటి పొడులు,ఒరుగులు,వడియాలు ఇలా నిలువ చేసే ఆహార పదార్ధాలు,బుడ్డిల్లో కారం,సంబారు,ఆవకాయ,ఇంకా రకరకాల పచ్చళ్ళ జాడీలు,ఇంకా ఏవో పెట్టెలు ఉండేవి.అవసరమైనప్పుడు దీపం ముట్టించుకుని వెళ్ళి కావలసినవి తెచ్చుకునే వారు.ఆ పెద్దపెద్ద బానల మాటున ఈ చిన్ని సంబారు బుడ్డి , కనీ,కనపడకుండా,నక్కి వుంటుంది.
అందుకే ఈ దాగుడు మూతల  ఆటలో, సంబారు లాగా నక్కి,దాగి వున్న,దొంగను పట్టుకోవాలి.
 సాంబారు బుడ్డి మూత తీయగానే ఒక్కసారిగా గుప్పున,సువాసన ఎలా వెదజల్లు తుందో,అలాగే  దొంగ పట్టుబ డ,గానే దాంకుని వున్న  పిల్లలందరూ ఘోల్లున నవ్వుతూ ఒక్కసారిగా బయటకు వస్తారు.. ఇంకా సాంబారు  బుడ్డి లాగ చీకటిలో పెద్ద వాటి మాటున దొంగ పెట్టినవారికి కనపడకుండా నక్కి కూర్చో అనే అర్ధంలో ‘గప్ చుప్ సంబారు బుడ్డి’ అంటారు.ఇదండీ కత..ఇందులోనే దండాకోరి అనే పదం వుంది.దండాకోరి అంటే మొండి అని అర్ధం వుంది.అంటే భయపడకుండా మొండిగా,దైర్యంగా వెళ్ళిదొంగని పట్టుకో అని చెప్పుకోవచ్చు.
               పూదోట.శౌరీలు.బోధన్.

సామెతల్లో ఆయుర్వేదం!

"తల్లిని చేసినవాడే కాయమూ పిప్పళ్ళు తెస్తాడు" ..అని ..కాయము అంటే బాలింతకు పాలు ఎక్కువగా రావటానికిమూలికలతో తయారు చేసే లేహ్యం ,పిప్పలి త్రిదోషాలను పోగొడుతుంది !
.
పేరులేని వ్యాధికి పెన్నేరు గడ్డ ! ...ఏ రోగమో ఎందుకొచ్చిందో తెలియక పోతే "అశ్వగంధ" పెద్ద మందు !
.
త్రిదోషహరం తిప్పతీగ అని సామెత !
.
"ఉత్తరేణు ఉత్తమం, మధ్యమం మారేడు,కనీసం కందిపుల్ల" ...ఇవి పళ్ళుతోముకోవడానికన్నమాట
.
వాస్తే వాయిలాకు పాస్తే పాయలాకు ..
.
అప్పుడే పుట్టిన శిశువుకు దొండాకు పసరు పోసేవారు లోపలి కల్మషాలు పోతాయని ...సామెత ఏమంటే ...."కొడితే చిన్నప్పుడు తాగిన దొండాకు పసరు కక్కుతావు "
.
పుండుమీదకు ఉమ్మెత్త ,నీరుల్లి నూరి నూనెలో వెచ్చజేసి గాయాలపై కట్టేవారట ...సామెత ఇలా ..."పుండుమీదకు నూనెలేదంటే గారెలొండే పెండ్లామా అన్నట్లు"..."ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు "...
.
వెల్లుల్లి చాలా రోగాలు నయం చేస్తుంది. అది క్షయరోగాన్ని కూడా హరించే శక్తి కలది ...సామెత ...ఇలా ..."ఆశపడి వెల్లుల్లి తిన్నా రోగము అట్లానే ఉన్నది "
.
కరక్కాయ పువ్వు ,పిందె,పండు చాలా ఉపయోగకరమైనవి ...శ్వాస,కాస,ఉదర,క్రిమి,గుల్మ,హృద్రోగం ,గ్రహణి,కామిల,పాండు ..ఇన్ని రోగాలు హరిస్తుంది..అందుకే ..."మున్నూట ఇరవై రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి "..అని సామెత
.
ఆయుర్వేదం మితంగా తినమని చెపుతుంది ..సామెత ఇదుగో ..."పిడికెడు తిన్నమ్మ పీటకోడు లాగ ఉంటే చాటెడు తిన్నమ్మ చక్కపేడులాగుంది "...."ఒక పూట తింటే యోగి రెండు పూటలా తింటే భోగి మూడు పూటలా తింటే రోగి "
.
అలానే ...శిశువు పాలు వాంతి చేసుకోవడం ఆరోగ్యలక్షణమని చెప్పే సామెత ..."కక్కిన బిడ్డ దక్కుతుంది " అని...
.
ఇలా ఎన్నో సామెతలు ఒక్కొక్కటీ కనుమరుగవుతున్నాయి !
.
పిల్లవాడు భాషనే నేర్వనప్పుడు సామెత ఎలా వస్తుంది ?
.
సామెత తెలియనప్పుడు సంస్కృతి ఎలా తెలుస్తుంది ?
.
అందుకే భాషను చంపితే సంస్కృతి చస్తుంది!
జాతి జీవనాడి నశిస్తుంది!

ముచ్చటైన కుండ

        ఒక ఊరిలో ఒక కుమ్మరి ఉండేవాడు. కుమ్మరి అంటే తెలుసు కదా... మట్టితో మన ఇంటికి కావలసిన వస్తువులను తయారుచేసేవారిని కుమ్మరి అంటారు. ఒకసారి ఆ కుమ్మరి  చాలా కుండలు చేశాడు. వాటిని సంతలో అమ్మడానికి బైలు దేరాడు. దారిలో ఆకలయితా వుంటే ఒకచోట కుండలు దించి అన్నం తినసాగాడు.
అప్పుడు ఒక అందమైన రంగురంగుల కుండ అక్కడినుంచి దొర్లుకుంటా... దొర్లుకుంటా చాలా దూరం పోయింది. కుమ్మరి అది గమనించలేదు. అన్నం తిని మిగతా కుండలు తీసుకొని వెళ్ళిపోయాడు.
కొంచెం సేపటికి ఒక ఈగ ఎగురుకుంటా ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ... ఎంత బాగుంది ఈ ముచ్చటైన కుండ. ఇదే ఇప్పటినుంచీ నా ఇల్లు” అనుకొంది. 
“లోపల ఎవరయినా ఉన్నారా” అని గట్టిగా అరిచింది ఈగ. ఏమీ శబ్దం రాలేదు. దాంతో సంబరంగా ఎగురుకుంటా లోపలికి పోయింది. 

కాసేపటికి ఒక కప్ప ఎగురుకుంటా ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ... ఎంత ముచ్చటగా ఉంది ఈ రంగురంగుల కుండ. ఇలాంటి అందమైన దానిలో నివాసిస్తే ఎంత బాగుంటుంది” అనుకొంది.
 “లోపల ఎవరయినా ఉన్నారా” అని అడిగింది. “నేనున్నా... నేనున్నా” అంటూ అరిచింది లోపల నుంచి ఈగ. “నేనుగూడా లోపలికి వద్దునా” అని అడిగింది కప్ప. “దా... దా... ఇద్దరమూ కలిసే వుందాం. చాలా స్థలముంది” అంది ఈగ. కప్ప సంబరంగా ఎగురుకుంటా లోపలికి పోయింది.
కాసేసటికి ఒక ఎలుక ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ ఎంత బాగుంది ఈ కుండ. చూస్తేనే మనసుకు ఇంత హాయిగా ఉంది. ఇక దీనిలోనే వుంటే ఇంకెంత బాగుంటుందో” అనుకొంది.
“లోపల ఎవరయినా ఉన్నారా” అని అడిగింది. 
“మేమున్నాం... మేమున్నాం” అంటూ అరిచాయి ఈగ, కప్ప. “నేనుగూడా లోపలికి వద్దునా.మీతో ఉండనిస్తారా” అని అడిగింది ఎలుక. 
“దా... దా... ముగ్గురమూ కలిసే వుందాం” అన్నాయి ఈగ, కప్ప. ఎలుక సంబరంగా లోపలికి పోయింది. 
కాసేపటికి ఒక నక్క ఆ కుండ దగ్గరికి వచ్చింది. “అబ్బ ఎంత బాగుంది ఈ రంగురంగుల కుండ. దీన్ని నా ఇల్లుగా చేసుకుంటే ఇంకెంతో బాగుంటుంది” అనుకొంది. “లోపల ఎవరయినా ఉన్నారా” అని అడిగింది. “మేమున్నాం... మేమున్నాం ...” అంటూ అరిచాయి ఈగ, కప్ప, ఎలుక. “నేనుగూడా లోపలికి వద్దునా” అడిగింది నక్క.
“వద్దొద్దు. నువ్వు చాలా పెద్దగా ఉన్నావు. ఇందులో పట్టవు. అన్నాయి కప్ప, ఎలుక, ఈగ. నక్క కోపంగా నన్నే లోపలికి రావద్దు అంటారా... ఎంత థైర్యం మీకు అంటూ కుండలోపలికి పోబోయింది. కానీ నక్క కుండకన్నా పెద్దగా వుంటుంది గదా... దాంతో అది అడుగు పెట్టగానే కుండ ఫక్కున పగిలిపోయింది.
ఈగ , ఎలుక , కప్ప బాధతో మరో అందమైన ఇంటిని వెతుక్కుంటా బైలు దేరాయి. మీకు ఎక్కడైనా మంచి రంగురంగుల ఇల్లు కనబడితే పాపం వాటికి చెప్పండి. వెదికీ వెదికీ అలసిపోతున్నాయి.
********

ఏది గుడ్డిది 
**********
     ఒక రైతు దగ్గర ఒక ఆవు వుండేది. ఒక రోజు ఒక దొంగ దాన్ని ఎత్తుకొని పోయాడు. రైతు చాలా బాధపడ్డాడు. ఇంటిలో పాలకు ఇబ్బంది అయింది. ఇంకొక ఆవును కొందామని పక్క ఊరిలో జరుగుతున్న సంతకు పోయాడు. ఆ దొంగకూడా అదే సంతకు దొంగతనం చేసిన ఆవును అమ్మడానికి తెచ్చాడు. అవును చూడగానే రైతు అది తనదే అని కనుక్కున్నాడు. కానీ ఆ దొంగ ఆ ఆవు తనదే అన్నాడు. ఇద్దరూ ఆవు నాదంటే నాదని గొడవ పడడంతో జనాలంతా చుట్టూ గుంపుగా చేరారు.

 అంతలో రైతు ఛటుక్కున ఆవు రెండు కళ్ళు మూసేసి 'ఈ ఆవు నీదే అయితే దీని రెండు కళ్ళలో ఏది గుడ్డిదో చెప్పుకో చూద్దాం' అన్నాడు. దొంగకు ఎంత ఆలోచించినా ఏ కన్ను గుద్దిదో తెలియలేదు. సరే ఏమైతే అదే కానీ ఒక రాయి విసిరి చూద్దాం అని  'కుడివైపుది' అన్నాడు. రైతు 'కాదు' అన్నాడు. వెంటనే దొంగ తడబడుతూ కుడి వైపుది కాదు, ఎడమ వైపుది. తొందరపాటులో మరిచిపోయా అన్నాడు. రైతు జనాల వైపు తిరిగి “అయ్యలారా ! నిజానికి దీని రెండు కళ్ళూ బాగానే వున్నాయి. దొంగను పట్టించడానికే ఒక కన్ను గుడ్డిదని చెప్పాను. కావాలంటే చూడండి" అని చేతులు తీశాడు.

జనాలంతా ఆవు వంక చూశారు. రైతు చెప్పినట్టే ఆవు రెండు కళ్ళూ బాగున్నాయి. దాంతో వాళ్ళు దొంగను మెత్తగ తన్ని ఆవును రైతుకు అప్పగించారు
**********
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212