26, జనవరి 2023, గురువారం

జనగణమన

 *జనగణమన..* 


పిడికిలి బిగించి

నడుములు నిటారెట్టి

గొంతులు పిక్కటిల్లి

శ్వాసలన్నీ బిగబెట్టి

పలుకులన్నీ ఒక మాట

వందేమాతరం గీతమేగి

జన గణ మన

ఆలపిస్తుంటే

గగనాన త్రివర్ణం రెపరెఫలాడే..


జెండా ఊంచా రహే హమారా.


భారత దేశం

రత్నగర్భ సుసంపన్నం.


భిన్నత్వంలో ఏకత్వం...

కులమతాల ఐకమత్యం..


వేష,భాషలు వేరైనా

ప్రాంతాలు అనేకమైన

దేశమొక్కటే భారతీయం.


స్వేచ్చా స్వాతంత్ర్యం విరసిల్లే..

హక్కుల బాటన

నేటి భారతం.


రాజ్యాంగం అమలయ్యే

గణతంత్రం సిద్దించే

సువిశాల భారతావని

ప్రపంచానికే ఆదర్శమై...


స్వాతంత్ర్య కాంక్షన

ప్రాణాలొడ్డిన వీరులొకవైపు

ఉరితాడులను ముద్దాడిన సమిధలొకవైపు...


శాంతి మంత్రంతో పోరు సలిపిన స్వాతంత్ర్య సమర యోధులొక వైపు..


స్వేచ్చాగాలులు వీచిన వేళ..


ఎక్కడో అపసృతులు..

స్వేచ్చా సమాన హక్కులు లేని రాజ్యమది...


రాజ్యాంగ రూపకల్పనతో

అన్ని హక్కులకు ప్రాణం పోసిన తరుణం...


అది అమలయ్యిన నాడే ఈ గణతంత్ర దినోత్సవం.


అంబేద్కర్ అంటే దారిలో పెట్టిన విగ్రహం కాదు.

అది సమాజానికి దిశ, దశను చూపే రాజ్యాంగ నిర్మాత..


ఎలిగెత్తి పిలవాలి

నా దేశం భారతదేశం

సమాన హక్కులు కలిగివున్నది.


ఈ నేలన ఎన్ని వన్నెలు ఉన్నా 

భారతావనికి మువ్వన్నెలనే అందం...


అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం..


భారతదేశం నా మాతృభూమి......


వందేమాతరం.


శుభాకాంక్షలతో


అశోక్ చక్రవర్తి.నీలకంఠం.

9391456575.

వసంత పంచమి*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

      *నేడు… వసంత పంచమి*


          *వసంత పంచమి విశిష్టత*

                    ➖➖➖


*సరస్వతీదేవిని మాఘపంచమినాడు శ్రీపంచమి పేరిట ఆరాధిస్తారు.*


*సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు.* 


*సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు.*


*ఈ శ్రీపంచమినే ‘వసంత పంచమి’ అని ‘మదన పంచమి’ అని అంటారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది.* 


*ఈ శ్రీపంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.*


*మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నముగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.*


*అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు.*


*మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని ‘శివానుజ’ అని పిలుస్తారు.* 


*శరన్నవరాత్రులల్లో మూలా నక్షత్రం రోజున సరస్వతీ రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ మాఘమాసంలో పంచమి తిథినాట సరస్వతీదేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు.*


*”చంద్రికా చంద్రవదనా తీవ్రా మహాభద్రా మహాబలా భోగదా భారతీ భామా గోవిందా గోమతీ శివా” అని ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి.*


*అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది.* 


*అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.*

 

*ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు.* 


*జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు కదా. ఈ తల్లిని తెల్లని పూవులతోను, శ్వేత వస్త్రాలతోను, శ్రీగంథముతోను, అలంకరిస్తారు.* 


*పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని, నేతితోకూడిన వంటలను, నారికేళము, అరటిపండ్లను చెఱకును నివేదన చేస్తారు. ఆ తల్లి చల్లని చూపులలో అపార విజ్ఞాన రాశిని పొందవచ్చు.*


*”వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి” ఇలా అనేక నామాలున్నప్పటికీ “సామాంపాతు సరస్వతీ.... “ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.*


*సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావస్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు.* 


*వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు.* 


*పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.*

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ధనాశాపరులకు

 శ్లోకం:

అర్థాతురాణాం నగురుర్నబంధు:, కామాతురాణాం నభయం నలజ్జా !

విద్యాతురాణాం నసుఖం ననిద్రా, క్షుధా తురాణాం నరుచిర్నపక్వం !!


తాత్పర్యము:

ధనాశాపరులకు గురువు, బంధువుల పట్టింపు లేదు, కామం కళ్ళకెక్కిన వాడికి భయమూ, సిగ్గు ఉండదు. విద్యాపేక్ష కలవానికి సుఖము, నిద్ర ఉండదు. ఆకలిగొన్న వానికి రుచి గూర్చి, ఉడకటం గురించి ఆలోచన ఉండదు.

*💐💐శుభం భూయాత్💐💐*

పరివేదన చెందనవసరములేదు.

 శ్రీ ఆది శంకర - వేదాంతం


1. మాతా నాస్తి, పితా నాస్తి, 

నాస్తి బంధు సహోదరః| 

అర్థం నాస్తి, గృహం నాస్తి, 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


2. జన్మ దుఃఖం, జరా దుఃఖం, 

జాయా దుఃఖం పునః పునః| 

సంసార సాగరం దుఃఖం 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


3. కామః క్రోధశ్చ, లోభశ్చ 

దేహే తిష్ఠతి తస్కరాః| 

జ్ఞాన రత్నాపహారాయ 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


4. ఆశయా బధ్యతే జంతుః 

కర్మణా బహు చింతయా| 

ఆయుక్షీణం న జానాతి 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఏదో ఆశకు, కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో, జీవితాలు గడుపుతుంటారు. ఆయుర్ధాయం తరిగిపోతుందన్న విషయాన్ని గమనించరు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


5. సంపదః స్వప్న సంకాశాః 

యౌవనం కుసుమోపమ్| 

విధుఛ్చచంచల ఆయుషం 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, అంటే అశాశ్వతాలు. యౌవనం పూవుతో సమానం అంటే ఎపుడు వాడి నశిస్తుందో తెలియదు. ఆయుష్షు మెరుపుతీగవలె చంచలమైనది. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


6. క్షణం విత్తం, క్షణం చిత్తం, 

క్షణం జీవితమావయోః| 

యమస్య కరుణా నాస్తి 

తస్మాత్ జాగ్రత జాగ్రత|| 


తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవులారా, సావధానులై ఉండండి. 


7. యావత్ కాలం భవేత్ కర్మ 

తావత్ తిష్ఠతి జంతవః| 

తస్మిన్ క్షీణే వినశ్యంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- ప్రపంచంలో తమ కర్మబంధము ఎంతవరకు ఉంటుందో, అంతవరకే ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడిపోగానే మరణిస్తారు. జననమరణాలు జీవుని ధర్మము. దానికి బాధపడటం ఎందుకు. 


8. ఋణానుబంధ రూపేణ 

పశుపత్నిసుతాలయః| 

ఋణక్షయే క్షయం యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- గత జన్మ ఋణానుబంధము ఉన్నంతవరకే భార్య, సంతానం, ఇల్లు, పశువులు ఉంటాయి. ఆ బంధం తీరగానే ఇవన్నీ నశించిపోతాయి. అందుకు వ్యథ చెందడ మెందుకు. 


9. పక్వాని తరుపర్ణాని 

పతంతి క్రమశో యథా| 

తథైవ జంతవః కాలే 

తత్ర కా పరివేదన|| 


తా:- పండిన ఆకులు చెట్టునుండి ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు? 


10. ఏక వృక్ష సమారూఢ 

నానాజాతి విహంగమాః| 

ప్రభతే క్రమశో యాంతి 

తత్ర కా పరివేదన|| 


తా:- చీకటి పడగానే అనేక జాతులు పక్షులు ఒకే వృక్షం ఆశ్రయించి విశ్రమిస్తాయి. తెల్లవారగానే ఆ పక్షులు అన్నీ చెట్టును విడచి తమతమ ఆహార సంపాదనకు వెళ్ళిపోతాయి. అదే విధంగాబంధువులతో కూడిన మానవుడు కాలమాసన్నమైనపుడు తన శరీరాన్ని ఇంటిని వదలి వెళ్ళిపోతాడు. అందుకు బాధపడ నవసరములేదు. 


11. ఇదం కాష్టం ఇదం కాష్టం 

నధ్యం వహతి సంగతః| 

సంయోగాశ్చ వియోగాశ్చ 

కా తత్ర పరివేదన|| 


తా - ప్రవహించే నదిలో రెండు కట్టెలు దగ్గరకు చేరతాయి. కొంతదూరం కలిసి పయనిస్తాయి తరువాత విడిపోతాయి. అదేవిధంగా మానవుడు ఈ ప్రపంచ ప్రవాహంలో కొంతకాలం సంయోగసుఖమును, మరికొంతకాలం వియోగదుఃఖమును అనుభవిస్తాడు. దానికి పరివేదన చెందనవసరములేదు.

25, జనవరి 2023, బుధవారం

Advocate in Telangana

 Respected Advocate,


Pls check your COP status by entering your Enrolment number. If the particulars are with empty space it infers that you have to submit COP, which you can submit by 31-1-2023. Pls also inform to your colleague advocates.


Advocates enrolled after June 2010 upto December 2017 and who have not submitted the COP, should submit Form A ( COP application) on or before 31-01-2023.


Advocates enrolled from 2018 onwards have to submit declaration form without fail.


If required download the COP forms from Bar Council website.



http://www.telanganabarcouncil.org/cop-details/


A Ananthasen Reddy

Bar Council Member, TS

సుభాషితమ్

 *సుభాషితమ్* 


శ్లో𝕝𝕝 కుతోఽహమాగతః కోఽస్మి  క్వ గమిష్యామి కస్య వా।

కస్మిన్ స్థితః క్వ భవితా కస్మాత్కిమనుశోచసి॥


తా𝕝𝕝  "నేను ఎవడను? ఎక్కడినుండి వచ్చాను? ఎక్కడికి పోతాను? ఎవరితోనైనా నాకు ఉన్న సంబంధం ఏమిటి? ఏ ప్రదేశంలో ఉన్నాను? ఎక్కడ మళ్లీ జన్మిస్తాను? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం మనకు తెలుసునా? ఇవి అన్నీ బాగా ఆలోచిస్తే ఇంకా దుఃఖించడం ఎందుకు?".


*సేకరణ*

సన్యాసి - సమాధి

 సన్యాసి - సమాధి


1986లో తిరుచిరాపల్లిలోని ఆంగరై నుండి కొంతమంది భక్తులు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. స్వామివారు వారితో చాలా విషయాలు మాట్లాడిన తరువాత కావేరీ తీరంలో ఉన్న సంధ్యావందన ఘాట్ గురించి వారిని అడిగారు.


అక్కడే దగ్గర్లో నిలబడి మహాస్వామివారి భిక్షా కైంకర్యం పర్యవేక్షిస్తున్న ఆంగరై శ్రీకంఠన్ ను చూపిస్తూ, “నేను ఎప్పుడు ఆంగరై గురించి అడిగినా, ఇతను తనకు ఏమి తెలియదని సమాధానం చెబుతాడు” అని అన్నారు.


అందుకు శ్రీకంఠన్ స్వామివారితో, “నేను ఆంగరై వదిలి నలభై సంవత్సరాలు అయ్యింది. కాబట్టి నాకు అక్కడి విషయాలు ఏమి తెలియవు” అని సమాధానం చెప్పాడు.


“ఎవరో కొంతమంది ఆ సంధ్యావందన ఘాట్ ని ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు అక్కడ కేవలం కొంత స్థలం మాత్రమే మిగిలిఉంది” అని దర్శనానికి వచ్చిన భక్తులు చెప్పారు.


“వారంతా పేదవారు. వారిని మీరు అక్కడినుండి పంపించాల్సిన పని లేదు. ఆ మిగిలిన స్థలానికి ఒక ప్రహరీ కట్టి, రెండు మారేడు చెట్లు తులసి చెట్టు నాటి వాటిని పోషించండి” అని స్వామివారు ఆదేశించారు.


పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం చేస్తామని వారు స్వామివారితో విన్నవించుకున్నారు.


2003వ సంవత్సరంలో శ్రీకంఠన్ సన్యాసం స్వీకరించారు. వారు తిరువానైకోవిల్(జంబుకేశ్వరం) లోని శ్రీమఠం శాఖలో ఉంటూ అక్కడే సిద్ధి పొందారు. అక్కడి శ్రీమఠం తోటలోనే వారిని శరీరాన్ని ఉంచాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే తిరువానైకోవిల్ శ్రీమఠం దేవాలయ పంచ ప్రాకారాలలోనే ఉండటం వల్ల ఇక్కడ ఖననం చెయ్యడం సరికాదని కొంతమంది ఈ నిర్ణయాన్ని ఆక్షేపించారు.


వారికి ఏమి చెయ్యాలో అర్థం కాక ఆంగరైలో ప్రహరీ నిర్మిచిన వ్యక్తీ సూచన మేరకు, పెద్దస్వామి ఆదేశానుసారం వారి పార్థివ దేహాన్ని అక్కడకు తీసుకుని వెళ్లి సన్యాస సంపరదాయం ప్రకారం సమాధి చేశారు.


2003లో దేహత్యాగం చేసే తన సన్యాస శిష్యుని కోసం 1986లోనే స్థలాన్ని సిద్ధం చేసి ఉంచారు పరమాచార్య స్వామివారు. ఇది కేవలం కాకతాళీయమా? లేక పరమాచార్య స్వామివారి దిర్ఘదృష్టికి నిదర్శనమా?


--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 3


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

పరమాచార్య వారి హాస్య చతురత....

 పరమాచార్య వారి హాస్య చతురత....

ఒకసారి స్వామి వారి దర్శనానికి ఒక వృద్దుడు వచ్చాడు.

వృద్దుడు "స్వామి. నాకు మూడు రోజులుగా జ్వరం తగులుతున్నది. దాని వల్ల ఏ పని చేయలేక పోతున్నాను. తమరు దయతో నాకు ఈ బాధ నుండి విముక్తి ఇవ్వండి."

స్వామి నవ్వుతూ "సరిపోయింది. నాకూ మూడు రోజులుగా జ్వరం. ఎవరికీ చెప్పుకోలేక చూస్తున్నాను. అలా కూర్చోండి. మీకోసంగతి చెప్పాలి.ఒక ఊర్లో ఒక పూజారి ఉండేవాడు. అతనికి వాక్ శుద్ధి ఉన్నది. అతను జరగబోయేది ఖచ్చితంగా చెప్పేవాడు. అతనికి ఆ ఊరి పోలీస్ మంచి మిత్రుడు.

ఒకరోజు గుడి తలుపులు తీసేసరికి ఆభరణాలు మాయమయినట్లు గుర్తించాడు. వెంటనే తన పోలీస్ మిత్రుడికి ఫిర్యాదు చేయడానికి బయలుదేరాడు.అదే సమయంలో పోలీస్ కూడా పూజారిని వెతుక్కుంటూ గుడివైపు వస్తున్నాడు."ఆడబోయిన తీర్ధం ఎదురైందని "పూజారిని చూసి పోలీస్ అనుకుంటే,"వేదకబోయిన తీగ కాలికి తగిలిందని "పోలీస్ ను చూచిన పూజారి అనుకున్నాడు.

పూజారి "నువ్వెందుకు పరిగెత్తుకొని వస్తున్నావ్ "

పోలీస్ "నా సైకిల్ ఎవరో ఎత్తుకొని పోయారు. నువ్వు భవిష్యవాణి చెబుతావని వస్తున్నా "

పూజారి "అరె రామ. గుడిలో పూజ సామాగ్రి పోయిందని నీకు ఫిర్యాదు చేద్దామని వస్తున్నా."

ఇలా ఉంది మన పరిస్థితి

నువ్వు జ్వరం తగ్గాలని నా దగ్గరకు వచ్చావు. నాకూ మూడు రోజులుగా జ్వరం నేనెవరికీ చెప్పుకోవాలి."

అంటూ స్వామి నవ్వితే వృద్దుడూ శృతి కలిపాడు.

***జ్వరం సంగతి పక్కన పెడితే స్వామి వారి చతురత, సమయస్ఫూర్తి కి భక్తులు ఆనందించారు.

నేతాజీ జయంతి

 ॐ నేతాజీ జయంతి శుభాకాంక్షలు. 


    జై హింద్ నినాదంతోనూ, 

   "ఆజాద్ హింద్ ఫౌజ్" అనే భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేసీ, 

    భారత స్వాతంత్ర సమరంలో ఎంతో ఉత్తేజ పరచిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ నుంచి జాతి ఇప్పటికీ ఎంతో నేర్చుకోవలసి ఉంది.  

    

అందుకు ప్రబల ఉదాహరణ


    ఆ రోజుల్లో మహాత్మాగాంధీ మాటకి తిరుగుండేదే కాదు. 

    భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆయన మాటను ధిక్కరించి నిలబడడమే ఎంతో సాహసం. 

    కాంగ్రెస్ సాధారణ సభ్యత్వం నాలుగు అణాలు. కాంగ్రెస్సులో తనకు నాలుగణాల సభ్యత్వం కూడా లేదంటూనే, గాంధీ, నేతాజీకీ ప్రత్యర్థిగా భోగరాజు పట్టాభి సీతారామయ్యని నిలబెట్టి, 

   "పట్టాభి ఓటమే నా ఓటమి" అని ప్రకటించినా, 

    అటువంటి పరిస్థితులలో దానికి ఎదురీది, గెలిచిన నేతాజీని చూసి మనమెంతో నేర్చుకోవాలి కదా! 

    గెలిచి చూపించిన ధైర్యమూ, రాజీనామా చేసిన ఆయన త్యాగమూ మన యువతకు అలవడితే, 

   మన జాతి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. 

    అడుగు ముందుకేద్దాం. 

    నేతాజీ మనకిచ్చిన మార్గంలో పయనించి, దేశ ఔన్నిత్యాన్ని నిలబడదాం. 

                జై హింద్

మాతృ భాష పరిరక్షింప బడవలెననిన

 47వ రోజు:

Know about a telugu word Daily.

మన మాతృ భాష పరిరక్షింప బడవలెననిన ముందు అందరకు ఆ భాష మీద అవగాహన, పదకోశము అత్యంతావశ్యకము. అందు నిమిత్తము నా వంతు కృషిలో భాగముగా ప్రజోపయోగము గల ఒక పదమునకు గల పర్యాయ పదములను అందించ సంకల్పించినాను. ఈ నా కృషికి అందరు సహకరించి తమ తమ సమూహములలో ఉంచి విశేష ప్రచారణకు తమవంతు సహాయమును అందింతురని ఆశించు చున్నాను.

47వ రోజు (23-01-2023):

వజ్రము : అక్షజము, గుండుఱాయి, తెలిమిన్న  దృఢాంగము, పోతుమానికము, భార్గవప్రియము, షట్కోణము, సూచూముఖము, హీరకము, హీరము 

ఆంగ్లము: Diamond