29, సెప్టెంబర్ 2020, మంగళవారం

మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతుకుదాం*

 *


_ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !_

_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !_


_దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._ 


_సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._


_కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. 


కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !_


_జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు._


*కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి.*


_పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !_


_సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి._ 


_నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !_


_మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !_


_నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._


_వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?_


*నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం*


 నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !_


_ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._

_మౌనంగావుండేవాడు ముని._

_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._ 

_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._ 

_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._


_పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !_ 


_ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు._


_వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._


_నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !_


_అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_


_మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._ 


_పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు._ 


_వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?_


_పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_

_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !_


_జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !_


*మానవులుగా బతకటం కాదు.మానవత్వంతో బతుకుదాం !*

[9/29, 5:13 PM] Mallikarjuna Sharma Akell: చాలా. మహోన్నతమైన సందేశాన్ని అందించిన వారికి ధన్యవాదాలు.

పులుపు

 (A whatsapp courtesy)


తాడు దొరికిందని ఏనుగును కొనుక్కోవడం అంటే ఇదేనేమో !


...

*++++++*


ఏమండీ వచ్చేటపుడు పెరుగు తీసుకొస్తారా.. ఇంట్లోని పెరుగు మూడు రోజుల క్రితం నాటిది.. బాగా పుల్లగా అయింది. 


అవునా... అలాగైతే దాన్నేం చేస్తావు ? 


ఏం చేయాలి ? బయట పారబోస్తానంతే...


అమ్మ చెబుతుండేది.. పెరుగును బయట పారబోయరాదని. ఏదో ఒకటి చేయి...


ఏం చేయాలి.. మజ్జిగ చేస్తే పులుపే పులుపు. నోట్లో పెట్టుకోలేమే...


ఒక పని చేయి. మజ్జిగ పులుసు చేయి. తినడానికీ రుచిగస ఉంటుంది...


గుడ్ ఐడియా .. ఎలాగూ బయటకు పోతున్నారుగా.. కొన్ని సామాన్లు చెబుతాను , వ్రాసుకోండి.


సరే చెప్పు...


ఊ.. కొత్తిమీర, కరివేపాకు, అల్లం.. ఆ.. ఒక టెంకాయ , జీలకర్ర..


సరే .. వ్రాసుకున్నాను.. బయల్దేరనా ...


ఉండండి.. ఇంకా ఉన్నాయి.. ఒక బూడిద గుమ్మడికాయ...


బూడిద గుమ్మడికాయనా ? అదెందుకు ?


మరి మజ్జిగ పులుసు బెండకాయతో చేయడానికొస్తుందా ? తెచ్చేదేదో పెద్దదే తెండి. కోసిపెట్టినది , కుళ్ళిపోయినది కాకుండా చూసి తీసుకురండి. 


సరే... బయల్దేరనా ? 


అయ్యో .. కాస్త ఆగండి.. ఒకటే గుమ్మడికాయ తేకూడదంట, అమ్మమ్మ చెబుతుండేవారు. ఎలాగూ తెస్తున్నారు రెండు తెండి. అవి కూడా పెద్దవి. ఇంకో పని చేయండి.పెద్ద గుమ్మడి కాయ తెస్తున్నారెలాగూ, ఒక కేజి చక్కెర, ఒక కేజి నెయ్యి , ఎండు ద్రాక్ష, జీడిపప్పు, ఏలకులు ...


ఇవన్నీ మజ్జిగ పులుసుకు వేస్తారేమే ?


ఛీ, పులుసుకు కాదండి.. హల్వా చేయడానికి. గుమ్మడికాయను పగలగొట్టి అలాగే వదిలివేయరాదు. అపశకునం..


ఇక చాలా ? 


కాస్త ఆగండి.. ఓ నాలుగైదు నిమ్మ కాయలు, నల్ల మిరియాలు, ఎస్ ఎస్ పి ఇంగువ తీసుకురండి. ఘమఘమల వాసనలొస్తాయి. 


హల్వాకు ఇంగువ వేస్తారా ?


థూ .. హల్వాకు ఎవరైనా ఇంగువ వేస్తారాండి.. ఇవి గుమ్మడికాయ వడియాలకు.. గుమ్మడికాయ తెస్తున్నపుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి ? 


ఇకనైనా వెళ్ళనా ? 


ఏదో జ్ఞాపకానికొస్తోంది ఉండండి. ఆ.. జ్ఞాపకమొచ్చింది. ఒక పొట్లకాయ తెండి. మజ్జిగ పులుసుకోసం గుమ్మడికాయతో బాటు మంచి కాంబినేషన్ . దాంతో బాటు ఒక అర్ధ కేజి మొత్తని శనగపిండి తీసుకురండి. ఎలాగూ పొట్లకాయ తెస్తున్నారు కాబట్టి బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి ? అలాగే వంటసోడా, రిఫైన్డ్ ఆయిలూ తీసుకురండి, వేరుశనగనూనె కాదు సన్ ఫ్లవర్ ఆయిల్...


సరే.. బయల్దేరుతున్నాను.


అదేమిటి వెనుక తలుపు వైపు. అక్కడెక్కడికి వెళ్తున్నారు. 


నేను బయటకు పోవడం లేదు, వంటింట్లోకి వెళ్తున్నాను. 


ఎందుకు ? మార్కెట్ కు పోరా ?


నీ మార్కెట్ నాశనం కాను. గ్లాసుడు మజ్జిగపులుసు కోసం వేయి రూపాయలు ఖర్చు చేయాలా ? పాపమొస్తే రానీ.. నేనే ఆ పులిసిన పెరుగును బయట పారబోస్తాను..


ఏమిటండీ, మీరే చెప్పారుగా ...


చెప్పాను.. బుద్ధిలేక.. పులుపు నాకు సరిపోదు.. అసిడిటీ... ,


😑

కేతువు రూపంలో ఉన్న విషు విష్ణు శక్తి ప్రకృతి🌿🍃

 కేతువు రూపంలో ఉన్న విషు విష్ణు శక్తి ప్రకృతి🌿🍃 రూపంలో వున్న అమ్మ రూపంలో సృష్టి కారక రూపంలో గల లక్షణము గా మారును పరిశీలన చేయుట. హక్కు దానిని యీ విధంగా తెలుపు చున్నది. కేతుం కృణ్వన్న కేతవే, ఆపేశో మర్త్యా అపేశషే, సం ఉషద్ భీః అజాను యథా. కేతు లక్షణమైన శక్తి జీవ రూపంలోనే దేహ రూపంలో మెటీరియలైజ్ చెంది పదార్ధ రూపమైన గాని శక్తిగా మారును. అగ్ని రూపంలో మనకు దీని లక్షణము కెలియదు. అనగా అది రజో గుణము అనగా చైతన్య మైన గాని, దేశంగా మారుటకు దేహమే కారణం. లేనియెడల అగ్ని యెుక్క తత్వం మనకు తెలియదు బాల్యంలో అంతరం లో కూడా వున్నదని తెలియును. కాని లక్షణము తెలియదు. అది వస్తువుగా మారిన గాని తెలియదు. అదియే డిఎన్ఏగా మారుటకు. మారిన డిఎన్ఏగా పదార్ధరూపంగా మారాలి. కొంతవరకు భౌతికంగా తెలిసినా దాని లక్షణము ,రూపం, వాసన, గుణము తెలియవు. ఏవ్యక్తియెుక్క కారణము వేరొక వ్యక్తితో సన్నిధిని భావించజాలము. అది అను క్షణము మార్పు చెందు లక్షణము కలిగియున్నది కావున. సం ఉషత్ భీమా యథా. సం పూర్ణమైన మానవ శక్తి ఉష కాంతిగా మారి లక్షణముగా తెలియవలెనని అదియే దేహ రూపంలో అనగా మానవ రూపంలోనే మనకు తెలియుచున్నది. భఃఅనే లక్షణమైన కాంతి భిః గా మారి ప్రకృతి గాని మారి, భిః పంచభాతాత్మకమైన దేహముగా తెలియుచున్నది. సం అనునది ఎల్లప్పుడు కలిగిన పూర్ణమని అదియే సత్యమని దానిని తెలియుట ఙ్ఞానాన్ని అదియే బ్రహ్మ మని తెలియుచున్నది. అది స్థిరమైనది, అనగా ఎంత స్థిరముగా ధృవప్రాంత లక్షణం శక్తి ఎంత ధృవమెూ అంత. అది కూడా ఉత్తర ధృడమైన కల శక్తి రాడార్ చూపు లక్షణమని తెలియును. ఆపేశో మర్త్యా, అపేశషే, శక్తి, ఉష, శ ,ష, లు రెండూ ప్రక్క ప్రక్కనే యుండుట సూత్రమును పరిశీలించిన శక్తి శాశ్వతమైన ఈశ శక్తి ఉష అమ్మ శక్తి అనగా ప్రకృతి గాని మారుటయని తెలియుచున్నది. దీని ప్రకారము సూర్యుని కాంతిచేత భూమిపై చేరి పదార్ధ లక్షణముగా మారి అనగా జీవ సంబంధముగా పంచభూతాత్మకమైన ప్రకృతిగా మారుటవలననే తెలియుచున్నది. సూర్య కిరణాలు శక్తి సత్యమే. అది ప్రకాశ మైనప్పుడు తెలియదు 

అది మరుత్తు లుగా మారిన జీవ లక్షణమే మార్తాండ అండ లక్షణముగా మారి అది పిండమై మారుటవలననే తెలియుచున్నది.

🌹 **మూకపంచశతి** 🌹

 దశిక రాము**


*జయ జయ జగదంబ శివే*

*జయ జయ కామాక్షి జయ జయాద్రిసుతే|*

*జయ జయ మహేశదయితే* 

*జయ జయ చిద్గగన కౌముదీధారే||*


🏵️ శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏


🌹 **ఆర్యాశతకము**

🌹


🌹11.

**కాఞ్చీరత్న విభూషాం**


**కామపి కన్దర్పసూతికాపాఙ్గీమ్౹**


**పరమాం కలాముపాసే**


**పరశివ వామాఙ్క పీఠికాసీనామ్౹౹**



🌺భావం:కామాక్షీ దేవి కాంచీ పట్టణమునకు రత్నభూషణముగా ఒప్పుచున్నది.ఆతల్లి శుభకటాక్షమే మన్మథుని ప్రసూతిగృహము (జన్మస్థానము) గా యున్నది.

పరమశివుని వామాంకమునే పీఠముగాచేసుకొని కూర్చుని యున్న ఆ పరా కళను ఉపాసించెదను.🙏



💮కాంచీపురరత్నభూష కామాక్షీ దేవి.శివుని కామిని చేయదలచిన మన్మథుడు శివుని త్రినేత్రాగ్నికి బూది అయినాడు.అట్టి కామునకు ఆమ్మవారి కనుచూపులే జన్మస్థానములయినవి. కామాక్షి సృష్టిసంకల్పభావముతో స్వాత్మరూపుడైన శివుని జూచి కామేశ్వరాంకస్థ అయినది.ఆమెకు భిన్నముగా శివుడు గానీ ,బ్రహ్మాండముగానీ ,కాముడు గానీ లేరు. సర్వమూ ఆ జగదీశ్వరియే అయిఉన్నది. అట్టి పరమోత్క్రష్టమైన ఆ పరాకళను సేవించుచున్నాను. 


సశేషం


🙏🙏🙏

సేకరణ 


ధర్మము - సంస్కృతి

🙏🙏🙏


🔱 అమ్మ పాదపద్మములకు నమస్కరిస్తూ. 🔱


   🌹 లోకాస్సమస్తా స్సుఖినోభవంతు 🌹


సశేషం....


🙏🙏🙏 

సేకరణ


ధర్మము-సంస్కృతి

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

**హిందూ ధర్మం** 52

 **దశిక రాము**




 (సత్యం)


సత్యాన్ని పాటించమన్నారని ఎప్పుడూ నేను నిజాలే మాట్లాడుతాను అంటూ అందరితో గొడవలు పెట్టుకోమని, శతృత్వం పెంచుకోమని చెప్పలేదు. రాముడి గురించి వర్ణిస్తూ 'సత్యాయ మితబాషిణాం' అంటారు వాల్మీకి మహర్షి. రాముడు సత్యవంతుడు, మాటమార్చనివాడు, అలా అని ఎక్కువగా మాట్లాడడు. ఆలోచించి మాట్లాడుతాడు, తక్కువగా మాట్లాడుతాడు, కానీ మాట్లాడితే మాత్రం అన్ని నిజాలే మాట్లాడుతాడు. రాముడు అరణ్యవాసంలో తన గురించి చెప్పుకున్నా, సీతమ్మ చెప్పినా ఎక్కడ కైక కారణంగా తాము అడవుల పాలయ్యామని, ఈ కష్టాలన్నిటికి కైకేయి కారణమని, ఆమె మీద చెడుగా చెప్పలేదు. నేను నా తండ్రి దశరధ మహారాజు ఆజ్ఞ ప్రకారం వనవాసానికి వచ్చానని మాత్రమే చెప్పుకున్నాడు. అట్లా అని నిజాలు దాచి పెట్టమని చెప్పడం ఉద్ద్యేశం కాదు.


కఠినమైన నిజాలను ప్రతి సందర్భంలో పలుకవలసిన అవసరంలేదు. సమయం కానీ సమయంలో చెప్పిన నిజం ఒక్కోసారి హానీ చేయవచ్చు. అందువలన కొన్ని సార్లు మౌనం వహించాలి. కానీ మనం మౌనంగా ఉండడం వలన వేరొకరికి అన్యాయం జరగకూడదు. మాట విషయంలో బుద్ధి ఉపయోగించాలి. 'సత్యాయ మితబాషిణాం' తక్కువగా మాట్లాడినా, నిజాలే మాట్లాడాలి. అదే వివేకవంతుని లక్షణం.


మామూలు జీవితానికి వస్తే, చాలామంది ఇతరులతో చాలా విషయాలు పంచుకుంటారు. అవి కష్టసుఖాలే కావచ్చు, లేకమరే ఇతర విషయమైనా కావచ్చు. కొందరి గురించి తప్పుగా మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు. అవన్నీ అవతలవారికి చెప్పడం అనవసరం. నిజాలే మాట్లాడమన్నారు కదా, అందుకని వీళ్ళు మనతో పంచుకున్న విషయాలన్నీ అవతలవారి ముందు చెప్పేయాలని అనుకోకండి. విమర్శలు, ఇతరుల గురించి చెప్పుకునే మాటలు మొదలైనవి అవివేకంతో మాట్లాడుకునేవి. వాటికి జీవితంలో ప్రాధాన్యం ఇవ్వడం దండగ. అసలు వాటిని గుర్తుంచుకోవడమే వృధా. అటువంటి విషయాలను విడిచిపెట్టాలి తప్ప, సత్యాన్ని పాటిస్తున్నామన్న పేరుతో అందరితో పంచుకుని, శతృవులను పెంచుకోమని ధర్మం చెప్పలేదు. ఒకరి విషయాలను మనం తెలుసుకోవడం అనవసరం, ఒకవేళ పంచుకున్నా, అక్కడికి వదిలేయడమే మంచిది. ఒకరి రహస్యాలను బయటపెట్టడం కూడా దోషమేనని గుర్తుపెట్టుకోండి. 


తరువాయి భాగం రేపు...

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

https://chat.whatsapp.com/HUn5S1ETDNTG580zg5F9PU


**ధర్మో రక్షతి రక్షితః**

https://chat.whatsapp.com/Iieurm6WILS6u4QsiHHq95


*ధర్మము - సంస్కృతి*


**ధర్మో రక్షతి రక్షితః**


 గ్రూప్స్ ద్వారా , పురాణాలు ,ఇతిహాసాలు, దైవ లీలలు పోస్ట్ చేస్తూ అందరికీ మన సనాతన ధర్మ వైభవాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తున్నాము.మీరు కూడా సహకరిస్తే అందరం కలిసి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటుదాం.


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


97 - అరణ్యపర్వం.


కర్ణుడు, దుర్యోధనుని ప్రాయోపవేశదీక్షను విరమింప జేయడానికి ప్రయత్నిస్తున్నాడు.

' దుర్యోధనా ! నీ వలన రాజ్యం పోగొట్టుకున్నప్పుడు పాండవులు నీలాగా బేలగా ప్రవర్తించలేదు. ధైర్యంగా అరణ్యవాసానికి బయలుదేరారు. వారికి జరిగిన నష్టం ముందు నీకు జరిగిన అవమానం యేపాటిది? వాళ్ళేమైనా నిరాహారదీక్షలు చేసారా ? ప్రాణాలు పణంగా పెట్టి దుస్సాహసాలు చేశారా ? '

' మిత్రమా ! అరణ్యవాస, అజ్ఞాతవాసాలు పాండవులను పూర్తి జేయనీ, వారి సంగతి రణరంగంలో నేను చూసుకుంటాను. మిత్రఋణం తీర్చుకుంటాను. ఈ భూమండలం యావత్తూ నీ పాదాక్రాంతం అయ్యేటట్లు చేస్తాను. ' అని రకరకాల మాటలతో, ధైర్యం చెబుతున్నాడు. ఇంతలో శకుని కూడా అక్కడకు చేరి, తన వంతుగా మాటల మాయాజాలంతో దుర్యోధనుని దీక్షనుంచి తప్పించి, అందరూ హస్తిన చేరే ఏర్పాట్లు చేశాడు.


ఇక హస్తినలో భీష్మాచార్యుల పదునైన మాటలకు దుర్యోధనుడు సగం చచ్చిపోయాడు. ' ఇప్పటికైనా పాండవులతో సంధి చేసుకొమ్మని, ' వారిపై ప్రేమ చూపించి చేసిన పాపాలు కడిగేసుకో ! ' అని తన మాటగా చెప్పాడు. కర్ణ, శకునులు, అవి యేమీ పట్టించుకోవద్దని, సంజ్ఞలు చెయ్యగా, భీష్ముని హితోక్తులు అక్కడే దులిపివేసుకుని, యెగతాళిగా ఆయనను చూసి నవ్వి, తన వాళ్లతో వెళ్ళిపోయాడు, దుర్యోధనుడు, భీష్మునికి దూరంగా.


ఇక దుష్టచతుష్టయం భవిష్యత్ కార్యాచరణ ఆలోచించసాగారు. భీష్మునికి, పాండవ పక్షపాతులకు సమాధానం చెప్పాలంటే, మనం కూడా ఒక జైత్రయాత్ర నిర్వహించాలని, దుర్యోధనుడు ఆజ్ఞ యిస్తే, తాను భూమండలాన్ని జయించి కీర్తి తో పాటు కప్పంగా అనేక బహుమానాలు తెస్తానని, కర్ణుడు ముందుకువచ్చాడు. 


దుర్యోధనునకు యీ ఆలోచన బాగా నచ్చింది. తాముకూడా వీరులమని యీ కురు వృద్ధులకు, ప్రజలకు తెలియవలసిన అవసరం వుందనిపించి, కర్ణునికి శుభాకాంక్షలు చెబుతూ అనుజ్ఞ ఇచ్చాడు, బయలుదేరమని. ఒక శుభముహూర్తాన, కర్ణుడు సర్వాలంకారణ శోభితుడై, ధనుర్ధారియై, విజయయాత్రకు బయలుదేరాడు.  


ముందుగా, ద్రౌపదిని తాము పొందలేకపోయామని దుగ్ధ యెప్పటినుండో వున్నందున, తన జైత్రయాత్ర ద్రుపదుని ఓడించడంతో, కర్ణుడు మొదలుపెట్టాడు. ద్రుపదుని జయించి, ఆతడు వొసంగిన అమూల్య ధనరాశులను స్వంతం చేసుకుని, ఉత్తర దిక్కుగా వున్న రాజులందరినీ తన పరాక్రమంతో, పరాభవించి, కురుసామ్రాజ్యానికి సామంతులుగా చేసుకున్నాడు. ఆ తరువాత, అంగ, వంగ, కళింగ రాజ్యాలను జయించాడు. త్రిపుటి, కోసల దేశాలను లోబరచుకున్నాడు. రుక్మి సహాయంతో, పాండ్యరాజులను, కేరళదేశంలోని నీలుడిని, ఛేదిరాజు శిశుపాలుని కుమారుని కూడా వోడించాడు. అవంతి. వృష్టి వంశీయులు కూడా కర్ణునికి దాసోహం అన్నారు.  


అపూర్వ ధనరాశులతో, కీర్తి ప్రతిష్టలను మూటగట్టుకు వచ్చిన కర్ణుని, అనేక విధాలా పొగిడాడు దుర్యోధనుడు. చాలాకాలం తరువాత తనకు ఇంత ఆనందం నీ వలననే వచ్చింది అన్నాడు. కర్ణుడు పాండవులను యెదిరించగలడని, యింకొకసారి రుజువు చేసుకున్నాడని, యెలుగెత్తి, కౌరవ సభామధ్యంలో చాటాడు. తాను తీసుకువచ్చిన ధనరాశులను దుర్యోధనునికి సంతోషంగా సమర్పించాడు కర్ణుడు సభాముఖంగా.  


ఆ ఆనందంలో తాను కూడా రాజసూయ యాగం చేస్తాననీ, తన చేత చేయించమని కర్ణుని కోరాడు, దుర్యోధనుడు. ' దానికేమి భాగ్యం, అలాగే ' అని కర్ణుడు యింకా యేదో చెప్పబోతుండగా, రాజ పురోహితులు, ' దుర్యోధనా ! ధర్మరాజు జీవించి వుండగా, రాజసూయయాగం చేసే అర్హత నీకులేదు. అదీ గాక, నీ తండ్రి ధృతరాష్ట్రుడు కూడా రాజ్య సింహాసనంపై వుండగా, నీకు రాజసూయ యాగం నిషిద్ధము. ఐతే, దానితో సమానమైన మరియొక యజ్ఞం వున్నది. దానినే వైష్ణవయజ్ఞం అంటారు. ఈయజ్ఞాన్ని ఇంతవరకు, వైకుంఠం లో విష్ణుమూర్తి ఒక్కడే నిర్వహించినట్లు చెబుతారు. నీకు యీ యాగం శుభకరం ' అని సలహా యిచ్చాడు.


ఆవిధంగానే, వైష్ణవయజ్ఞానికి ఏర్పాట్లు చేశారు. పాండవులను రమ్మని ఒకదూత ద్వారా వర్తమానం పంపారు. మేము అరణ్యవాసం లో వుండగా, నగరప్రవేశం నిషిద్ధం రాలేక పోతున్నామని దుర్యోధనునకు చెప్పు. ' అని ధర్మరాజు మర్యాదగా చెప్పగా, భీముడు మాత్రం రోషంతో, ' నీ మహారాజు దుర్యోధనునికి మా మాటగా చెప్పు. దుర్యోధన దుశ్శాసనులని వధించిన తర్వాత మేము నగరప్రవేశం చేస్తాము. ' అని చెప్పమన్నాడు.  


వైష్ణవ యజ్ఞం పరిసమాప్తమైంది. అయినా దుర్యోధనునకు రాజసూయ యాగం చెయ్యవలెననే కోరిక అలాగే వుండిపోయింది. కర్ణుడు ' ధర్మరాజుని రణరంగం లో చంపిన తరువాత నీచేత రాజసూయయాగం చేయిస్తాను. అప్పటిదాకా ఓపికబట్టు దుర్యోధనా ! ' అన్నాడు. ' లెస్స పలికితివి ' అని శకుని దుశ్శాసనుడు వంతపాడారు. దుర్యోధనుడు సంతోషించాడు కర్ణుని పలుకులకు.


అక్కడ ద్వైతవనంలో ఒకరోజు రాత్రి ధర్మరాజుకు స్వప్నంలో అక్కడి జంతువులు కనిపించి, తమకు వారు అక్కడ వుండడం వలన యిబ్బందిగా వున్నదని మొర పెట్టుకున్నాయి, అప్పటికి వారు అక్కడికి వచ్చి యిరవై నెలలు అయింది. అందుకని, ఆజంతువుల కోరిక మేరకు, మళ్ళీ కామ్యకవనం కి మారారు, పాండవులు. ఆవిధంగా పాండవులు మొత్తం 11 సంవత్సరాలు అరణ్యవాసం పూర్తిచేశారు. ఇక ఒక సంవత్సరం అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం మిగిలివున్నాయి.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

శ్రీమద్భాగవతము

 **దశిక రాము*


 తృతీయ స్కంధం -33


దేవహూతితోగ్రుమ్మరుట


కలువకన్నుల ఆ దేవహూతి కర్దముని మాటలు విన్నది. ఆమె పతిసేవలో అలసిపోయి యున్నది. చీర మాసిపోయింది. శిరోజాలు జడలు కట్టాయి. శరీరం ధూళిధూసరితమై కృశించింది. వక్షస్థలం వివర్ణమయింది. ఆమె భర్త ఆజ్ఞానుసారం సరస్వతీ నదీజలాలతోను, జలచరాలతోను నిండిన బిందుసరోవరంలో దిగి స్నానం చేసే సమయంలో ఆ జలప్రవాహంలోనుంచి నాజూకైన సన్నని పట్టువస్త్రాలు ధరించినవారూ, నవయౌవనంలో ఉన్నవారూ, కలువపూల పరిమళం కలవారూ అయిన వేలకొద్ది కన్యలు ఆమెకు కనిపించి ఇలా అన్నారు. 

ఓ యువతీ! ధర్మకార్యాలు ఆచరించే మేము నిర్మలమైన భక్తితో నీకు సేవలు చేయగలం. నీవు మమ్మల్ని దయతో చూడు.ఇలా అని వారంతా దేవహూతిని సమీపించి, ఆమెకు తలంటి, నలుగు పెట్టి, చందన కర్పూరాలు వెదజల్లే బంగారు బిందెల జలాలతో స్నానం చేయించి, తెల్లని వస్త్రాలతో తడి ఒత్తి, శరీరమంతా అగరు ధూపాలు వేసి, కస్తూరి పూతలు పూసి, మధురంగా ధ్వనించే మణిమంజీరాలు పాదాలకు తొడిగి, చిరుగంటల సవ్వడితో ఒప్పే ఒడ్డాణం నడుముకు అలంకరించి, రత్నాలు చెక్కిన కర్ణాభరణాలు, ఉంగరాలు, కంకణాలు మొదలైన విలువైన బంగారు ఆభరణాలను ఇచ్చి, పూలదండలు సింగారించి, షడ్రసోపేతమైన భోజనాదులతో సంతృప్తి పరచారు.

ఇంకా బంగారు పళ్ళెరాలలో కర్పూరం వెలిగించి హారతులిచ్చి, రమణీయమైన రత్నపీఠంమీద కూర్చోబెట్టి అద్దం చేతికిచ్చారు. దేవహూతి అద్దంలో ప్రతిఫలించిన తన రూపాన్ని చూచుకొని తన పతి అయిన కర్దముని మనస్సులో భావించింది. మరుక్షణంలో కర్దముడు, వేలకొలది కన్యకలు ఆమె చెంత ఉన్నారు. అది చూచి భర్తయొక్క యోగమాయా ప్రభావానికి ఆమె ఆశ్చర్యపడ్డది. అప్పుడు కర్దముడు స్నానం చేసి ఆసీనురాలైన దేవహూతిని చూచి, వివాహానికి పూర్వం ఆమె ఎలా ఉండేదో అలాగే చెక్కు చెదరని చక్కదనంతో ఉన్నందుకు మహానందం పొందాడు. కన్యలందరూ తమ్ము సేవిస్తూ ఉండగా సతీసమేతుడై విమానం ఎక్కి, చుక్కలతో చుట్టబడిన రోహిణీ సహితుడైన చంద్రునిలా ప్రకాశించాడు.నిత్యమంగళ స్వరూపుడైన ఆ కర్దముడు విమానారూఢుడై సమస్త దిక్పాలురు విహరించడానికి యోగ్యమైనదీ, మెల్లగా చల్లగా వీచే మలయమారుతాలతో కూడినదీ, సమీపంలో ప్రవహించే సెలయేళ్ళ నీటి తుంపురుల చల్లదనం కలదీ అయిన మేరుపర్వతం శిఖరాల మీద సురసుందరీ సమేతుడైన కుబేరునిలా విహరించాడు.ఇంకా…కర్దమ మహర్షి కోరినచోటికి సంకల్పమాత్రంతోనే తీసుకెళ్ళే ఆ విమానం ఎక్కి, దేవహూతితోపాటు గొప్ప వేడుకతో విహరించాడు. చక్కటి దివ్యఉద్యానవనాలు, సరిక్రొత్త విహారప్రదేశములు, పద్మాలతోనూ, కలువలుతోనూ కలకలాడుతున్న మానస సరోవర తీరాలు, మనోహరమైన పొదరిండ్లు, చైత్రరథం అనే కుబేరుని తోట మున్నుగు అన్నిటినీ తన ఇంతితో ప్రేమపూర్వకంగా విహరించాడు.


కపిలుని జన్మంబు  


మునిశ్రేష్ఠుడైన కర్దముడు ఒకనాడు కుతూహలంతో తొమ్మిది విధాలైన వేరువేరు దేహాలను ధరించి క్రమంగా తన వీర్యాన్ని తన భార్య అయిన దేవహూతి గర్భంలో తొమ్మిది విధాలుగా నిలిపాడు.ఆ కారణంగా కర్దమునివల్ల దేవహూతి తొమ్మిదిమంది కుమార్తెలను కన్నది. ఆమె తన మనస్సులో ఎంతో సంతోషించింది. అప్పుడా ముని (సన్యసింప దలిచాడు).(కర్దముడు) సన్యసింప దలిచాడు. ఆ విషయం అతని భార్య దేవహూతి తెలిసికొని మనస్సులో పుట్టిన ఆవేదన అధికం కాగా, చింతతో చెక్కిలిమీద చేయి చేర్చి, కాలివ్రేలితో నేలపై వ్రాస్తూ తన భర్తతో ఇలా అన్నది.

“ఓ పుణ్యాత్ముడా! సంతానం కలిగే వరకు నాతో ఉంటానని పూర్వం చెప్పి పుత్రికలను అనుగ్రహించావు. ఈ యువతులు తమకు తామే భర్తలను ఎలా వెదుక్కోగలరనే భయం నాకు కలుగుతున్నది. అందుకని కుమార్తెలకు తగిన వరులను వెదకి వారికి వివాహం చేసి, నాకు వేదాంత విషయాలను తెలియజెప్పగల కుమారుని ప్రసాదించి నన్ను కటాక్షించు. సాధుజన సంస్తవనీయా! సంసార దుఃఖాన్ని తొలగించడానికి అన్ని విధాల సమర్థుడవు నీవు. ముక్తి మార్గాన్ని తెలిపేవారు లేక మోహం వల్ల ఇంతకాలం వ్యర్థంగా గడిచిపోయింది. ఓ మహాత్మా! నాకు ఈ లోక సంబంధాలైన సుఖాలను అనుభవించాలనే ఆసక్తి నశించింది. భోగాలపై విరక్తి కలిగింది. ఇంతకు ముందు చంచలభావంతో కామోపభోగాలను కోరిన దానినై, స్వచ్ఛమైన నీ భావాన్ని తెలుసుకోలేక ఏవేవో అర్థించాను. నా పట్ల నీ అనుగ్రహం ఫలించింది. నిన్ను నిర్మల భక్తితో సేవించడం చేత ముక్తి లభిస్తుంది కదా!అంతేకాక...అందరిపట్ల సమానబుద్ధి కలిగినట్టి సజ్జనుల మైత్రి ఉత్తమగతికి కారణమౌతుంది. నీచమైన బుద్ధి కలిగి, చంచలచిత్తులైనట్టి దుర్జనుల స్నేహం వలన దుర్గతి కలుగుతుంది. ఈ సంగతి మనస్సులో భావించి, యోగిజన సన్నుతుడవైన నిన్ను నేను సేవిస్తాను. ప్రాణుల సాంగత్యం వల్లనే ఎట్టివారికైనా పుణ్యాలో లేక పాపాలో ప్రాప్తిస్తాయి”. అని ఈ విధంగా దేవహూతి మిక్కిలి వేదనతో పరితపిస్తూ పలుకగా, కర్దముడు విష్ణుదేవుని వాక్యాలు స్మరించుకొని మనుపుత్రి అయిన దేవహూతిని చూచి ఇలా 

అన్నాడు.“ఓ మనుసుతా! నీవు మనస్సులో దుఃఖించవద్దు. అనఘుడూ అక్షరుడూ అయిన విష్ణుభగవానుడు కొద్ది కాలంలోనే నీ గర్భంలో ప్రవేశిస్తాడు. నీవు ఉత్తమ నియమాలతో వ్రతాలతో నిష్ఠతో చరించు. నిగ్రహంతో కూడిన మనస్సు కలదానివై నిండైన తపస్సును, శ్రద్ధాభక్తులతో కూడిన దానధర్మాలను ఆచరించు. నారాయణుని పాదపద్మాలను నిండైన భక్తితో పూజించు. పురుషోత్తముడైన ఆ విష్ణువు నీ పూజలకు సంతృప్తి చెంది నీ గర్భంలో నివసిస్తాడు. నీ మనస్సులో పుట్టే సందేహాల ముడులను విడదీస్తాడు”.అని కర్దముడు చెప్పగా దేవహూతి తన మనస్సులో సంతోషించి, అతని మాటల ననుసరించి పరాత్పరుడు, భగవంతుడు, అనంతుడు, కమలాక్షుడు, పాపమోచనుడు అయిన విష్ణువును పూజిస్తూ ఉండగా కొన్నేండ్లు గడిచాయి. అప్పుడు రాక్షససంహారి అయిన విష్ణువు కర్దమ మునీశ్వరుని తేజస్సును (ధరించాడు). (విష్ణువు కర్దముని తేజస్సును) ధరించి జమ్మిచెట్టు తొఱ్ఱలో నుంచి అగ్ని పుట్టినట్లుగా దేవహూతి గర్భంలోనుండి జన్మించాడు. ఆ సమయంలో ఆకాశంలో దివ్యమంగళ వాద్యాలు ధ్వనించాయి. దేవతలందరూ సంతోషంతో మందారపుష్పాల వర్షాన్ని కురిపించారు. గంధర్వులూ, కిన్నరులూ పాటలు పాడారు. అప్సరసలు నాట్యం చేశారు. దిక్కుల్లో క్రమ్మిన పొగమంచు మాయమయింది. సముద్రాలు ప్రశాంతాలైనాయి. సజ్జనుల మనస్సులకు సంతోషం కలిగింది. హోమాగ్నులు మిక్కిలి తేజస్సుతో వెలిగాయి. వృక్షాలన్నీ ఫలపుష్పాలతో నిండిపోయాయి. పొలాలలో నానావిధాలైన పైరులు ప్రకాశించాయి.ఇటువంటి మహోత్సవ సమయంలో దేవహూతికి తత్త్వజ్ఞానాన్ని బోధించడానికి ఆమె గర్భంలో పుట్టిన పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుని దర్శించడానికి మరీచి మొదలైన మునులతో కూడి బ్రహ్మదేవుడు వచ్చి, ఆ మహాత్ముని దర్శనం చేసికొని కర్దమ దేవహూతులను చూచి ఇలా అన్నాడు. “ధన్యచరితులైన ఓ దంపతులారా! మీరు కృతార్థులు. నిజమైన భక్తితో, నిష్కపటమైన మనస్సుతో విష్ణుదేవుని సేవించారు. మీ పూజకు తగిన ఫలం మీకు 

లభించింది. ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడు, మునీశ్వరులు కీర్తించే చరిత్ర గలవాడు అయిన పరాత్పరుడు మీ కోర్కెను చక్కగా నెరవేర్చాడు. అందువల్ల మీ జన్మ సార్థకం అయింది. నీతికోవిదులైన ఓ దంపతులారా! వినండి. ఆసక్తితో, అద్వితీయమైన భక్తితో విష్ణువును పూజిస్తే అదే ముక్తిని ప్రసాదిస్తుంది. మీ పుణ్యాన్ని ఏమని పొగడగలను?”అని చెప్పి మళ్ళీ కర్దముని చూచి ఇలా అన్నాడు “నీ కుమార్తెలను ఉత్తమ స్వభావం కలిగివారు, సదాచార సంపన్నులూ అయిన మునిశ్రేష్ఠుల కిచ్చి వివాహం చెయ్యి. అలా అయితే వారివల్ల ప్రజాసృష్టి అనేక విధాలుగా అభివృద్ధి చెందుతుంది” అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు.“ఓ పుణ్యాత్ముడా! మహాత్ముడు, మహా తేజోవంతుడు అయిన ఈ నీ కుమారుడు సమస్త ప్రాణుల హృదయాలలోని మనోరథాలను నెరవేర్చే ఘనుడు. కనుక ఇతనిని ఈశుడు, పరమేశ్వరుడు, అపరాజితుడు, అమేయుడు, అచ్యుతుడు, అనంతుడు, ఆద్యుడు, అవికారుడు, అక్షరుడు అయిన పుండరీకాక్షునిగా భావించు.ఓ దేవహూతీ! మాననీయాలైన జ్ఞానవిజ్ఞాన యోగాలు అనబడే ఉపాయాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికై కమలాక్షుడు నీ కడుపున జన్మించాడు. బంగారు రంగు కలిగిన జటాజూటం కలవాడు, వికసించిన కమలాల వంటి కన్నులు కలవాడు, పద్మం, హలం, వజ్రం, అంకుశం మొదలైన రేఖలతో విరాజిల్లే అరికాళ్ళు కలవాడు, సత్త్వగుణ సంపన్నుడు అయి ఇప్పుడు నీ గర్భంలో జన్మించిన ఈ మహాత్ముడు నీకు తత్త్వబోధ చేస్తాడు. దానితో నీ హృదయంలోని సంశయాలన్నీ తీరిపోతాయి. ఇంకా...(నీ కుమారుడు) పేరెన్నిక గన్నవాడై, ప్రసిద్ధులైన సిద్ధపురుషులచేత సేవింప బడుతూ మహనీయమైన సాంఖ్యయోగంతో ప్రకాశించే పరతత్త్వమందు సుస్థిరుడై ‘కపిలుడు’ అనే పేరుతో ఈ మూడు లోకాలలోను సంచరిస్తాడు” అని బ్రహ్మదేవుడు తెలిపాడు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఏడవ శ్లోక భాష్యం - ఐదవ భాగం


ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క శక్తి ఉంది. వీటికి ఆ శక్తి ఎక్కడ నుండి వస్తోంది ? ఆ శక్తికి ఆధారము అంబికే కదా!! ఆమెచేత అనుగ్రహించబడిందే ఈ శక్తి. స్వయంగా శక్తిలేని మనకు యుద్ధంలో విజయానికి ఆయుధాలు కావాలి. అన్ని శక్తులకు ఆధారమయి, అన్ని శక్తులు మొత్తంగా తానే అయి ఉన్న అంబిక చేతిలోని ఆయుధాలు ఆమె సంకల్పానుసారంగా కావలసిన రీతిలో ఆమె నిర్ణయించిన మేరకు ఫలితాన్నిస్తాయి. నిజానికి ఆమె సంకల్పమే ఈ ఫలితాలనీయగలదు. కానీ ఆమెకు అదో లీల. పరమేశ్వరుడు జ్ఞానివలె ప్రశాంతుడై ఉంటే ఈ జగన్నాటకం జరిగేదే కాదు. మన్మథుడు శివుని కామమోహితుణ్ణి చేయడంలో విఫలుడైనప్పుడు అంబిక అతణ్ణి ఈ భగవల్లీల లోనికి తెచ్చింది. మన్మథుడు ధరించిన ఆ ఆయుధములే ధరించి అంబిక శివుణ్ణి శృంగారాధిదేవుని చేసింది. మన్మథుని పునరుజ్జీవితుని చేసి జీవజాలమును కామప్రేరితులను చేయడానికి అధికారం ఇచ్చింది. అయినప్పటికీ ఆ ఆయుధాలను ఇంకా తన స్వాధీనంలోనే ఉంచుకుంది.


అయితే అప్పుడు అంబిక ఆ ఆయుధముల విధులను మార్చింది. మన్మథునికి తానిచ్చిన ఆయుధములలో ఆయన మానవులను వారి కర్మానుసారంగా కామప్రేరితులను చేస్తున్నారు. కానీ అంబిక ఆ కర్మ భారాన్ని మోస్తూ వారు విషయవలయంలో చిక్కుకుపోకూడదనే కరుణతో వారిని తమవైపుకు త్రిప్పుకోవడానికి ఆ ఆయుధాలు ఉపయోగిస్తున్నది.


మన్మథుడు ధరించిన ఆయుధాలనే ఆమె కూడా ధరించినా ఆమె ఒక్క మన్మధారి విషయంలోనే కామోద్దీపన కలగచేస్తున్నది. ఆమె శివునికొక్కనికే శివకామసుందరి. భక్తులకు జ్ఞానాంబ. వారికి బంధ విమోచనాన్ని కలగచేస్తుంది. మన్మథుడు సామాన్య ప్రజల విషయంలో తన ప్రతాపాన్ని చూపగలడు. ఈశ్వరుని ముందు బూదిగా మార్చబడిన శక్తిహీనుడు.


ఆచార్యులవారు అంబిక రూపాన్ని, నాలుగు చేతులను, ఒడ్డాణము ధరించిన సన్నని నడుమును, పూర్ణచంద్రుని పోలిన ముఖాన్ని వర్ణించిన తరువాత ఆమెలోని ఆంతరంగిక సత్యాన్ని, అంబికాతత్త్వంలోని సారాంశాన్ని వివరిస్తున్నారు. *పురమధితురాహో పురుషికా* ఆకృతిగొన్న త్రిపురారి యొక్క అహంకారమట ఆమె. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఆమె శివుని యొక్క *నేను* అన్న భావనకు ఆకృతి అన్న అర్థం తోస్తుంది. బాహ్యంగా కాముడు ధరించిన ధనుర్బాణాలు ధరించిన ఈ తల్లి నిజానికి పరబ్రహ్మ యొక్క చిచ్ఛక్తి, జ్ఞానాంబ.


*పురస్తాదాస్తాం* - “మాముందు ప్రకాశించుగాక”. ఎవరైతే తన సన్నటి నడుముకు సవ్వడి చేసే చిఱుగజ్జెలు కూర్చిన మొలనూలు ధరించిందో, ఎవరి ముఖం శరత్కాలపు పున్నమి చంద్రుని పోలి ఉందొ, ఎవరు తన నాలుగు చేతులతో ధనుర్బాణములను, పాశాంకుశములను పట్టుకుందో, ఆ పరమేశ్వరుని పరాహంత మాముందు ప్రత్యక్షమవుగాక! ఆచార్యులవారు మనందరి ముందు అటువంటి తల్లి ప్రత్యక్షమవ్వాలని కోరుతున్నారు. *నః* అంటే నేను అని కాదు *మేము* అన్న అర్థం వస్తుంది.


ఆచార్యులవారు ఈ శ్లోకంలో ఎంతో అందంగా వర్ణించిన ఆ తల్లి రూపాన్ని మన అంతర్నేత్రంతో చూడగలగడం ఇక మన పని.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

**శ్రీ ఆంజనేయస్వామి మహత్యం**

 **దశిక రాము**




7- దూర్వాస మహర్షి కధ


 -1 


దూర్వాస మహర్షి అంటే కోపానికి ప్రతి రూపం అని అందరికి తెలుసు .అయితె ఆయనను గురించిన కధలు చాలా వున్నాయి అవి అందరికి తెలియవు .కొన్ని కధలను తెలుసు కొందాం

దూర్వాసుడు అతి పురాతన మహర్షి .మహా సిద్ధుడు .మహాయోగి .కనుక తనకు ఇష్టమైనప్పుడు మరణించే సిద్ధి వుందాయనకు .మార్కండేయుని వంటి చిరంజీవి .మహా మంత్ర శాస్త్రాలన్నీ ఆపోసన పట్టిన మహాత్ముడు .పుణ్య వంతుడు ,ప్రజ్ఞా శీలి,.. ఆయన జన్మ గురించి రెండు రకాల కధలున్నాయి .పూర్వం త్రిపురాసుర సంహారం చేసి శివుడు చంకలో ఒక బాణం పెట్టు కోని వస్తున్నాడు.దారిలో ఇద్దరు దేవ పురుషులు కని పించారు .వారికి శివుడి చంక లో వున్న బాణం శిశు రూపం లో వున్న శివుని లాగా కన్పించిందట .వారు శివుణ్ణి ఆ శిశువు ఎవరని అడిగారు .అప్పుడు శివుడు ఆతడు తన కుమారుడని ,పేరు దూర్వాసుడు అని చెప్పాడు .వెంటనే ఆ బాణం శివానుగ్రహం తో శిశువు గా మారి ,క్రమ క్రమం గా పెరిగి మహా మేధావి, జ్ఞాని అయిన దుర్వాస మహర్షి గా వృద్ధి చెందాడు .ఇది దూర్వాసుని గురించిన మొదటి కధ .

రెండవ కధ – అత్రి మహర్షి కి అనసూయా దేవి అనే మహా పతి వ్రత భార్య గా వుంది .అనసూయ దేవ హోతీ ,కర్దము ల కుమార్తె .అత్రి అనసూయలు చక్కని ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసు కొంటు వున్నారు .ఒక సారి త్రిమూర్తులైన బ్రహ్మ ,విష్ణు మహేశ్వరులు తమ వాహనాల మీద తిరుగుతూ ,అత్రి మహర్షి ఆశ్రమం మీదగా ప్రయాణిస్తుంటే ఆ వాహనాలు కదల కుండా ఆగి పోయాయి .కారణం వారికే తెలియ లేదు .అప్పుడు గరుత్మంతుడు విష్ణు మూర్తి తో ”స్వామీ !కింద అత్రి మహా ముని ఆశ్రమం వుంది .దాని మీద నుంచి ,దానిని ,అతిక్రమించి ఎవరు పొరాదు .పోవటం సాధ్యం కూడా కాదు ”అని విన్న వించాడు .సరే అని వారంతా చుట్టూ తిరిగి వెళ్ళారు .అప్పుడు వారికి ఒక కోరిక కలిగింది .అత్రి మహర్షి ,,అంతటి మహిమాన్వితుడా ?అయితె పరీక్షించాలి అను కొన్నారు .వాహనాలను చాలా దూరం లో ఆపేసి బ్రాహ్మణ వేషాలు వేసుకొని అత్రి మహర్షి ఆశ్రమం చేరారు త్రిమూర్తులు .ఆకలి గా వుందని ,తమకు భోజనం పెట్ట మని మహర్షిని వేడు కొన్నారు .

మహా సాధ్వి అనసూయా దేవి ,భర్త అనుమతి తో వారికి పీటలు వేసి ,విస్తళ్ళు పరిచి వడ్డించ టానికి సిద్ధ పడింది .అప్పుడు ఆ బ్రాహ్మణ వేషం లోని త్రిమూర్తులు ”అమ్మా !మాకు ఒక నియమం వుంది .మాకు వడ్డించే వారు దిస మొల తో వడ్డిస్తేనే మేం భోజనం చేస్తాం ”అన్నారు .వీరి ని గుర్తించిన సాధ్వి ,వెంటనే వారిపై మంత్రోదకాన్ని చల్లింది .వారు పసి పాపలు గా మారి పోయారు .అప్పుడు వారికి వారు కోరి నట్లే వడ్డించి ,మళ్ళీ నీళ్ళు చల్లింది .మళ్ళీ యధా రూపం పొందారు వారు .వాళ్ళు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మంత్రోదకం చల్లి పసి పాపలు గా మార్చి ఉయ్యాల లో ఊపుతూ ,పెంచసాగింది .అక్కడ త్రిమూర్తుల భార్యలు భర్తల రాక కోసం ఎదురు చూస్తూ ఎంతకీ రాక పోయే సరికి ఏదో కీడు శంకించి ,చివరికి వారు అత్రి ముని ఆశ్రమం లో అనసూయమ్మ ఒడిలో పెరుగు తున్నారని తెలుసు కోని వెంటనే అక్కడికి చేరారు .తమ పాతివ్రత్యం అనసూయా దేవి పాతివ్రత్యం ముందు ఎందుకూ పనికి రాకుండా పోయిందని గ్రహించి ,నిజ రూపాలైన లక్ష్మీ సరస్వతి ,పార్వతి రూపాలతో అక్కడికి చేరారు .తమ నాదులను తమకు ఇవ్వ వలసినది గా అనసూయా దేవిని ప్రార్ధించారు .జగన్మాతలు తమ ఆశ్రమం కు వచ్చిన కారణం తెలుసు కొన్న అనసూయ దేవి వారి అతిధి మర్యాదలు చేసి సభక్తి గా పూజించించింది .వారి కోరికను మన్నించి ,ఆ పసి బాలురను మళ్ళీ త్రిమూర్తులను గా మార్చి వేసింది మంత్ర జలం ప్రభావం తో .అప్పుడు బ్రహ్మ విష్ణు ,మహేశ్వరులు నిజ రూపం పొంది ,అనసూయా దేవి పాతి వ్రత్యానికి అబ్బుర పడి ,నమస్సు లర్పించి ,తాము పరీక్షించా టానికి వచ్చినందుకు సిగ్గు పడు తున్నామని తెలిపి ఆమె కు వరాలు ఇవ్వాలని అనుకొంటున్నామని కోరుకో మని విన్న వించారు .అనసూయ తమకు తల్లి అయి, ఇప్పటి దాకా లాలించి పాలించి నందుకు గర్వ పడు తున్నామని సవినయం గా తెలిపారు .ఆ అమ్మ త్రిమూర్తులు తనకు కుమారులు గా జన్మించి ,ఆస లైన పుత్ర ప్రేమ ను కల్గించ మని కోరింది .వారు మువ్వురు తధాస్తు అన్నారు .త్రిమూర్తులు ,జగన్మాతలు అత్రి ,అనసూయాదేవి ల అనుగ్రహం పొంది వారి ఆశీస్సులు గ్రహించి వారి వారి పట్టణాలకు వారి వారి వాహనాల పై వెళ్ళారు .కొంత కాలమ్ తర్వాత బ్రహ్మ అంశ తో అనసూయ గర్భం లో చంద్రుడు జన్మించాడు .విష్ణువు అంశ తో దత్తాత్రేయ మహర్షి ,శివాంశ తో దూర్వాస మహర్షి ఆమె కు జన్మించారు .ఇలా దూర్వాస మహర్షి మహా తపస్సంపన్ను లైన అత్రి ,అనసూయ దంపతుల కు శివాంశ వల్ల జన్మించిన కుమారుడు అని రెండో కధ వివ రిస్తోది .మిగిలిన కధలు తరువాత తెలుసు కొందాం .

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

హనుమంతమనంతవీర్యం

 దశిక రాము**


*ప్రాతఃస్మరామి హనుమంతమనంతవీర్యం*


*శ్రీరామచంద్ర చరణాంబుజచంచరీకమ్*


*లంకాపురీదహన నందిత దేవవృందం*


*సర్వార్థసిద్ధిసదనం ప్రథితప్రభావమ్.*



       *శుభోదయం*