28, అక్టోబర్ 2026, బుధవారం

ఆంజనేయస్వామికి

  *ఆంజనేయస్వామికి మాల రూపంలో తమలపాకులను ఎందుకు వేస్తారు ..........!!* 


ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకలశుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి ఒక కారణం ఉంది. 


అదేంటంటే- ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని ‘‘స్వామీ ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు.


స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం అంటే అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్రసంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించడం వలన మనకు కూడా శాంతి, సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు నాగవల్లీదళాలు. తమలపాకులతో పూజించడంవలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది.


1. లేత తమల పాకుల హారాన్ని వేస్తె రోగాలతో ఇబ్బందులు ఎదుర్కొనే వారికీ త్వరగా గుణం కనిపిస్తుంది.

2. ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె మంత్ర సంభందమైన పీడలు తొలగిపోతాయి.

3. స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లబిస్తుంది.

4.స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే పిల్లల ఆరోగ్యం బాగుపడి వారు బాగా ఎదుగుతారు.

5.వ్యాపారం చేసి సమయంలో చాలా నష్టాలు వస్తుంటే స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు దక్షిణ సమేతంగా, దానం చేస్తే వ్యాపారం భాగుపడుతుంది.

6.స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంఘంలో గౌరవనీయ వ్యక్తిగా మారుతారు.

7.శనైశ్చర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనిశ్వరుని అనుగ్రహం కలుగుతుంది.

8.వైద్య పరంగా నయంకానీ వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని తింటూ వుంటే అన్ని రోగాలు నివారణ అవుతాయి.

9.సుందర కాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తె అన్ని కార్యాలలో విజయం సిదిస్తుంది.

10.హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తె పరమాత్ముని అనుగ్రహం ఉంటుంది.

11. వాద వివాదాల్లో స్వామిని ప్రార్థించి తమలపాకుల హార ప్రసాదాన్ని తింటే జయం మీది అవుతుంది.

12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది.పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు .

29అక్టోబరు26🌷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

*🌹బృహస్పతివారం*🌹       

 *🌷29అక్టోబరు26🌷*  

  *దృగ్గణిత పంచాంగం*  

               

        *ఈనాటి పర్వం*  

    *సంకష్టహర చతుర్థి*

 

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - శరదృతువు*  

*ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం*


*తిథి       : చవితి* రా 10.09 వరకు ఉపరి *పంచమి*

*వారం : గురువారం*

(బృహస్పతివాసరే)

*నక్షత్రం   : రోహిణి* ఉ 11.11 వరకు ఉపరి *మృగశిర*

*యోగం  : పరిఘ* రా 12.06 వరకు ఉపరి *శివ* 

*కరణం   : బవ* ఉ 11.37 *బాలువ* రా 10.09 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ06.00-07.00 & 11.00-12.00*

అమృత కాలం  :*ఉ 08.15 - 09.44* & *రా 01.03 - 02.30*

అభిజిత్ కాలం  : *ఉ 11.28 - 12.14*

*వర్జ్యం         : సా 04.17 - 05.45*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.42 మ 02.33 - 03.19*

*రాహు కాలం :మ01.18 - 02.45*

గుళికకాళం      : *ఉ 08.57 - 10.24*

యమగండం     : *ఉ 06.04 - 07.31*

సూర్యరాశి : *తుల*                    

చంద్రరాశి : *వృషభం*   

సూర్యోదయం :*ఉ 06.13*  

సూర్యాస్తమయం :*సా 05.46*

*ప్రయాణశూల  :దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    : *ఉ 06.04 - 08.23*

సంగవ కాలం        :  *08.23 - 10.42*

మధ్యాహ్న కాల  : *10.42 - 01.00*

అపరాహ్న కాలం: *మ 01.00 - 03.19*

*ఆబ్ధికం తిధి        : ఆశ్వయుజ బహుళ చవితి*

సాయంకాలం   : *సా 03.19- 05.38*

ప్రదోష కాలం     : *సా 05.38- 08.07*

రాత్రి కాలం       : *రా 08.07 - 11.26*

నిశీధి కాలం      : *రా 11.26 - 12.16*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.24 - 05.14*

¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■¤■

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

     *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మా భ్రాతా భ్రాతరం ద్విక్షన్ మా స్వసారముత

 మా భ్రాతా భ్రాతరం ద్విక్షన్ మా స్వసారముత స్వసా


🟢🔴🔵🟡🙏🟡🔵🔴🟢


అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు పరస్పరం ద్వేషించుకోవద్దు-ద్వేషించుకోరాదు

(అథర్వవేదం)


కుటుంబవ్యవస్థలో సోదరీ సోదరుల బంధానికి ప్రాధాన్యముంది. అందరూ ఒకే తల్లిదండ్రుల సంతానాలైనా ఎవరికి వారికే ప్రత్యేక అభిప్రాయాలు, విభిన్న సామర్ధ్యాలు ఉంటాయి. ఒకొక్కరు ఒకొక్క రంగంలో రాణిస్తారు. శారీరక, బౌద్ధిక తారతమ్యాలు కూడా సహజం. ఈ తారతమ్యం క్రమంగా అసూయకీ, ఈర్ష్యకీ దారితీసి-ద్వేషంగా

బలపడే అవకాశముంది. కనుకనే వేదమాత ఆ ప్రమాదం రాకుండా హెచ్చరిస్తోంది.


"మీకు లేని సుఖం నాకు అక్కర్లేదు" అని శ్రీరాముడు లక్ష్మణ, భరతులతో

పలుకుతాడు. ఈ భ్రాతృ ప్రేమ ఒకే తల్లిదండ్రుల బిడ్డల్లోనేకాక, పెద్దనాన్న చిన్నాన్న పిల్లల పట్ల కూడా విస్తరించిన మంచిరోజులు నాడు ఉండేవి. ద్వాపరాంతంలో

దుర్యోధనుడు మాత్రం దీనికి విరుద్ధం. కేవలం ఈర్ష్య వల్ల వంశనాశనం తెచ్చుకున్నాడు.

“నువ్వెందుకు పెత్తనం చెలాయించాలి? నేనెందుకు విధేయుడుగా ఉండాలి?" అనే

తర్కాల వల్ల విభేదాలు వస్తాయి. అదే పెద్దల్ని గౌరవించడం, పిల్లల్ని లాలించడం వంటి భావంలో 'అహం' భావనను లోపింపజేసేది ధర్మం. ఆ ధర్మానికి కట్టుబడ్డారు అర్జున, భీమ, నకుల, సహదేవులు.


( తరతరాలకు విస్తరిల్లవలసిన భ్రాతృభావం ఎప్పటికప్పుడే చివికిపోతోంది.సోదరీమణుల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒక అక్క చెల్లెలిని చూసి మరో అక్క చెల్లెలు అసూయపడుతోంది. "అందరూ అన్నదమ్ముల్లా

కలిసి ఉండాలి" అని ఆ రోజుల్లో బోధించేవారు. ఇప్పుడామాటను వాడలేని పరిస్థితి. ‘సౌభ్రాతృత్వ భావన'ను ఉపమానంగా చెప్పలేని కాలం వచ్చింది.)


కలి ప్రవేశంతో ఒకే తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లో కూడా భయంకర ద్వేషాలు,అసూయలు పెచ్చరిల్లా(ల్లుతున్నాయి.


చివరికి ఒకరి కుటుంబ నాశనానికి ఇంకొకరు వెనుదీయడం లేదు. ఒకరి అభివృద్ధిని చూసి మరొకరు సహించలేని దుస్స్వభావం పెరుగుతోంది.


తరతరాలకు విస్తరిల్లవలసిన భ్రాతృభావం ఎప్పటికప్పుడే చివికిపోతోంది.సోదరీమణుల పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఒక అక్క చెల్లెలిని చూసి మరో

అక్క చెల్లెలు అసూయపడుతోంది. ఇది వారి పిల్లల్లో కూడా విస్తరిల్లుతోంది. ఒకవేళ

అప్పుడప్పుడూ కథాకార్యాల్లో కలిసినప్పుడు కూడా 'పెదవినవ్వులు - నొసలిచిట్లింతలు'అన్నట్లు కపటాల కలయికలే అవుతున్నాయి. ఎవరి స్వార్థం వారిది.


“అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి" అని ఆ రోజుల్లో బోధించేవారు.ఇప్పుడామాటను వాడలేని పరిస్థితి. 'సౌభ్రాతృత్వ భావన'ను ఉపమానంగా చెప్పలేని

కాలం వచ్చింది.


ఒకరికొకరు పరస్పర పూరకంగా ఉంటూ కుటుంబాల ఉమ్మడి సౌఖ్యాన్ని, ప్రతిష్ఠని నిలబెట్టడం సోదరీ సోదరుల బాధ్యత. అక్క చెల్లెళ్ళని జీవితాంతం 'ఆడబడుచు'గా

ప్రత్యేక గౌరవస్థానంలో అన్నదమ్ముల కుటుంబాలు గౌరవించే సంప్రదాయం మనది.అయితే- కొండొకచో ఈ గౌరవస్థానాన్ని దబాయింపు స్థానంగా భావించే గయ్యాళితనమున్న ఆడబడుచులూ లేకపోలేదు. పరస్పరం ఆత్మీయంగా ఉండవలసిన

బంధాలు హక్కులుగా పరిణమించడంతో వికృతవేషాలే మిగులుతున్నాయి.


కుటుంబ వ్యవస్థకి ప్రాధాన్యమిచ్చిన మన వైదిక సంస్కారం ఇంత చక్కగా

బోధించి-పరస్పరానుబంధానికి పెద్దపీట వేసింది. ఈ వేదవాక్కును గౌరవించే కుటుంబాలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. ఆ ఉత్తమ పరివారాలకు నమస్కరిస్తూ ఈ సు(స్వ)ధర్మాన్ని అనుసరిద్దాం.



🔴🔵🟡🟢🙏🟢🟡🔵🔴


*నాహం కర్త*🙏*హరి కర్తా*


*కర్తను నేను కాదు,చేసేది చేయించేది అంతా శ్రీహరి*


🔴🟣🔵🟢🙏🟢🔵🟣🔴



*సమస్త దేవతల శుభాశీస్సులతో...*

*శుభమస్తు! నిత్య శుభమస్తు! సమస్త సన్మంగళాని భవన్తు! శ్రీరస్తు! విజయోస్తు! దిగ్విజయోస్తు! అవిఘ్నమస్తు! ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు! పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు! ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు!  సకల మనోభీష్ట సిద్ధిరస్తు!*


*సర్వేజనాః సుఖినోభవంతు!*


*సర్వ సజ్జనా స్వజనో భవంతు!*

*సర్వ స్వజ్జనా సుకృతో భవంతు!*

*సర్వ సుకృతజనః సుఖినోభవంతు!!*


*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు!*

*అందరికీ శుభమే జరుగుగాక!*


*సర్వేషాం శాన్తిర్భవతు!*

*అందరూ సుఖసంతోషాలతో ఉండుగాక!*


*సర్వేషాం పూర్ణంభవతు!*

*అందరి జీవితాలూ సమృద్ధిగా ఉండుగాక!*


*సర్వేషాం మంగళం భవతు!*

*అందరి జీవితాలూ మంగళకరంగా ఉండుగాక!*

🙏🌹☘️🌹☘️🌹🙏


*వేదఆశీర్వచనము 👇*                                 

గురువారం,అక్టోబర్.29,2026

 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

గురువారం,అక్టోబర్.29,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - బహుళ పక్షం

తిథి:చవితి రా2.06 వరకు

వారం:గురువారం(బృహస్పతివాసరే)

నక్షత్రం:రోహిణి మ3.28 వరకు

యోగం:వరీయాన్ ఉ8.19 వరకు తదుపరి పరిఘము తె5.16 వరకు

కరణం:బవ మ3.15 వరకు తదుపరి బాలువ రా2.06 వరకు

వర్జ్యం:ఉ7.57 - 9.27 మరల రా8.41 - 10.11

దుర్ముహూర్తము:ఉ9.49 - 10.35 మరల మ2.24 - 3.09

అమృతకాలం:మ12.28 - 1.58

మరల తె5.39 నుండి

రాహుకాలం:మ1.30 - 3.00

యమగండ/కేతుకాలం:ఉ6.00 -7.30

సూర్యరాశి:తుల||చంద్రరాశి:వృషభం

సూర్యోదయం:6.00||సూర్యాస్తమయం: 

5.29

సంకష్టహరచతుర్థీ

శుక్ర మౌఢ్య త్యాగము ఉ9.41

సర్వేజనా సుఖినో భవంతు -శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

27, అక్టోబర్ 2026, మంగళవారం

కాశీలో నివాసం

  కాశీలో నివాసం - ఇల్లు కొంటే వచ్చేది కాదు, శివుడు అనుమతిస్తే వచ్చేది*


కాశీలో ఇల్లు కొనడం తేలిక, కానీ కాశీలో ఉండటం చాలా కష్టం. కాశీలో ఉండటాన్ని "కాశీవాసం"  అంటారు, అది ఒక యోగం. అది అద్దెకు ఉండటం కాదు, ఒక సాధన.


 ఎంతోమంది ఋషులు ఎందుకు ఉండలేకపోయారు?


పురాణం ప్రకారం కాశీలో ఉండాలంటే శివుడి పరీక్ష పాస్ కావాలి. కాశీ విశ్వనాథుడే స్వయంగా మిమ్మల్ని పరీక్షిస్తాడు.


అతిపెద్ద ఉదాహరణ  వ్యాస మహర్షి స్వయంగా.


వ్యాసుడు కాశీలో ఉంటూ భిక్ష కోసం తిరిగితే, కాశీలో ఎవరూ భిక్ష వేయలేదు. మూడు రోజులు ఆకలితో ఉన్న వ్యాసుడు కోపంతో "కాశీలో ఇక ఎవరికీ తిండి, చదువు, భక్తి దొరకకూడదు" అని కాశీని శపించబోయాడు. అప్పుడు అన్నపూర్ణా దేవి స్వయంగా వచ్చి ఆయనకు భోజనం పెట్టి, "కాశీలో అహంకారంతో, కోపంతో ఉండలేవు, కేవలం శరణాగతితోనే ఉండగలవు" అని చెప్పింది. వ్యాసుడిని కూడా కాశీ 3 రోజులు బయటకు పంపించింది.


అంటే కాశీలో  అహంకారం, నేను అనే భావం, డబ్బు గర్వం, కోపం  ఉన్నవారు ఉండలేరు. కాశీ వారిని బయటకు విసిరేస్తుంది. ఏదో ఒక కారణంతో వారికి ఇక్కడ ఇబ్బందులు వచ్చి వాళ్ళే వెళ్ళిపోతారు.


అందుకే స్కాంద పురాణం చెబుతుంది - "కాశ్యాం మరణం ముక్తిః"  అంటే కాశీలో చావు ముక్తి, కానీ   "కాశ్యాం వాసః దుర్లభం"   కాశీలో నివాసం దొరకడం దుర్లభం.


 మరి అక్కడే ఉండి మరణించిన మహాత్ములు ఎలా సాధన చేశారు?


కాశీలో ఉండి ముక్తి పొందిన వారు ఇల్లు కట్టుకోలేదు, వారు తమ అహంకారాన్ని కూల్చుకున్నారు.


1. తైలంగ స్వామి (160 సంవత్సరాలు కాశీలో ఉన్నారు):

ఆయనకు ఇల్లు లేదు, బట్టలు లేవు. అస్సీ ఘాట్ లోనే పడి ఉండేవారు. ఆయన సాధన ఏమిటంటే -  "నేను లేను, అంతా శివుడే" . ఎవరు తిట్టినా, కొట్టినా, పూజించినా సమానంగా చూసేవారు. కాశీ ఆయనను తన బిడ్డలా చూసుకుంది.


2. కినారామ్ అఘోరీ:

శ్మశానంలోనే ఉండేవారు. ఆయన సాధన జుగుప్సాను జయించడం . మురికిలో కూడా శివుడిని చూడటం. కాశీలో పవిత్రం, అపవిత్రం అనే తేడా లేదు అని నిరూపించారు.


3. లహిరి మహాశయులు:

ఇంట్లో సంసారిగా ఉంటూనే సాధన చేశారు. ఉద్యోగం చేస్తూ, పిల్లలను పెంచుతూ కాశీలోనే క్రియా యోగాన్ని పంచారు. ఆయన సాధన  "కర్మలోనే ముక్తి".


వీరి సాధనలో 3 సూత్రాలు కామన్ గా కనిపిస్తాయి:


అ) అన్నాన్ని గౌరవించడం:  కాశీ అన్నపూర్ణది. అన్నాన్ని వృధా చేయకూడదు, ఎవరొచ్చినా అన్నం పెట్టడం.


ఆ) మణికర్ణికను గుర్తుంచుకోవడం: ప్రతిరోజూ శ్మశానం వైపు వెళ్ళి "నేను కూడా ఒకరోజు కాలిపోతాను" అని గుర్తు తెచ్చుకోవడం. అప్పుడు అహంకారం పోతుంది.


ఇ) శివోహం కాదు, దాసోహం: "నేను శివుడిని" అని కాశీలో అనకూడదు. "నేను శివుడి కుక్కని, శివుడి సేవకుడిని" అని ఉండాలి. అంత వినయంగా ఉంటేనే కాశీ మిమ్మల్ని ఉంచుకుంటుంది.


 కాశీలో నివాసం ఉండాలంటే ఏం చేయాలి?


1.  మొదట 3 నెలలు అద్దెకు ఉండండి. ఇల్లు కొనకండి. కాశీ మిమ్మల్ని ఉండనిస్తుందో లేదో చూడండి.

2.  రోజూ గంగాస్నానం, విశ్వనాథ దర్శనం, ఒక పేదవాడికి అన్నదానం - ఈ మూడు నియమం పెట్టుకోండి.

3.  ఎవరితోనూ పోట్లాడకండి, ఎవరినీ మోసం చేయకండి. కాశీలో చేసిన కర్మకు వెయ్యి రెట్లు ఫలితం ఉంటుంది.


కాశీకి మీరు వెళ్లరు, కాశీ మిమ్మల్ని పిలుస్తుంది. పిలిచినప్పుడు మీ సంచులు కాదు, మీ అహంకారాన్ని వదిలి వెళ్ళండి, అప్పుడు కాశీ మిమ్మల్ని ఎప్పటికీ వదలదు.


               జై శ్రీరామ్.

నవవిధ భక్తి -

  నవవిధ భక్తి - జీవితానికి తొమ్మిది పాఠాలు


1 శ్రవణం - ఎదుటివారిని ఓపికగా వినడం

2 కీర్తనం - మంచిని నలుగురికీ పంచడం

3 స్మరణం - కృతజ్ఞతతో జీవించడం

4 పాదసేవనం - ఆపదలో ఉన్నవారికి సేవ చేయడం

5 అర్చనం - కర్తవ్యాన్ని పూజగా భావించడం

6 వందనం - పెద్దలను గౌరవించడం

7 దాస్యం - బాధ్యతతో జీవించడం

8 సఖ్యం - భగవంతుని మిత్రునిగా భావించడం

9 ఆత్మనివేదనం - ఫలితాన్ని భగవంతునికి వదిలేయడం


భక్తి మనసులో మొదలై మన ప్రవర్తనలో కనపడాలి.


🔴🔵🟢🟡🙏🟡🟢🔵🔴


ఋణానుబంధం


పూర్వజన్మలో మనకు గల ఋణాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా కలుస్తారు. ఋణం తీరగానే దూరమవుతారు.


ఉచితంగా ధనం, వస్తువులు తీసుకున్నా, సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే వారిగా వస్తారు.


ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో పగ ఉంటే ఈ జన్మలో హింసించే యజమానిగా, సంతానంగా వస్తారు. ఉపకారం చేస్తే మిత్రులుగా వస్తారు.


కథ: కొల్లూరు మూకాంబిక గుడి దగ్గర ఒక బిచ్చగాడు నెలకు పదివేలు సంపాదిస్తూ ఇద్దరు కొడుకులను డాక్టర్ చదివిస్తున్నాడు. ఒక మహానుభావుడు పూర్వజన్మలో ఇతను వారి దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కష్టపడి వారి ఋణం తీర్చుకుంటున్నాడు అని చెప్పాడు.


చిన్న వస్తువులు ఉచితంగా తీసుకోవడం, ఇతరుల చేత మోయించడం కూడా కర్మ బంధం అవుతుంది. అంగుళం పాము విషం కూడా ప్రమాదమే. కర్మ చిన్నదైనా ఫలితం ఉంటుంది.


స్వార్థ కర్మలు మనల్ని బంధిస్తాయి, నిస్వార్థ కర్మలు రక్షిస్తాయి.


🔴🔵🟢🟡🙏🟡🟢🔵🔴




భూదేవి భారం - గాంధారి శాపం


కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్రుని నూరుగురు కొడుకులు చనిపోయారు. ధృతరాష్ట్రుడు దుఃఖిస్తే వ్యాసుడు ఓదార్చాడు.


వ్యాసుడు చెప్పిన కథ: ఒకనాడు దేవసభలో భూదేవి వచ్చి నా భారం తొలగిస్తానన్నారు కదా ఎందుకు ఆలస్యం అని అడిగింది. అప్పుడు నారాయణుడు ధృతరాష్ట్రునికి నూరుగురు కొడుకులు పుడతారు. పెద్దవాడైన దుర్యోధనుని వల్ల నీ భారం తీరుతుంది. అతన్ని చంపడానికి, రక్షించడానికి వచ్చిన రాజులంతా కురుక్షేత్రంలో చనిపోతారు అని చెప్పాడు.


తరువాత ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వెళ్ళాడు. ధర్మరాజు కనపడగానే కోడళ్ళు ఏడ్చారు. గాంధారికి నమస్కరిస్తే ఆమె కోపంతో మీకు అపకారం చేయని వాడు ఒక్కడైనా లేడా అని అడిగింది. ధర్మరాజు కాలి గోళ్ళపై ఆమె చూపు పడగానే గోళ్ళు కందిపోయాయి.


తరువాత గాంధారి కృష్ణుని పిలిచి శపించింది. కృష్ణా నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధం ఆపగలిగేవాడివి. ఆపలేదు. అందుకే నేటికి 36వ సంవత్సరంలో నీ యాదవ వంశం కూడా కొట్టుకుని చస్తుంది. నువ్వు దిక్కులేని చావు చస్తావు అని శపించింది.


కృష్ణుడు చిరునవ్వుతో ఆ శాపం మునులు ఇంతకు ముందే ఇచ్చారు. దేవతలు కూడా యాదవులను చంపలేరు. అందుకే వారిలో వారే చనిపోతారు అని చెప్పాడు.


🔴🔵🟢🟡🙏🟡🟢🔵🔴

విద్యయా అమృతమశ్నుతే

  విద్యయా అమృతమశ్నుతే


🟢🔴🔵🟡🙏🟡🔵🔴🟢


విద్యద్వారా అమృతత్వం లభిస్తుంది(వేదవాక్యం)


విద్యవల్ల ఏం సంపాదించాలి? వెంటనే 'ధనం సంపాదించాలి' అని

తడుముకోకుండా సమాధానమిస్తారు. విద్యకు ధనమే పరమ ప్రయోజనం అని భావించడం చేత విద్య కూడా వ్యాపార రంగమైపోయింది. దానితో రాజకీయ వాదుల హస్తాలు సోకి ఆ రంగం కూడా కలుషితమయింది. అలాంటి వ్యవస్థలో నుంచి ఎటువంటి సంస్కారాలు లభిస్తాయి!.


( ధనం ద్వారా వచ్చే సుఖం కన్నా, ధర్మం ద్వారా లభించే సుఖంలో

సంతృప్తి, శాంతి ఉంటాయి. జీవితంలో లభించే సుఖాలకు దూరంగా ఉండమని, వ్యర్థమైన విరక్తిని బోధించలేదు మన ధర్మం. హాయిగా బ్రతకమంది. ఆనందంగా బ్రతకమంది. అయితే ఆ ఆనందం అర్థవంతం కావాలి. ఏ వ్యక్తికీ హాని కలిగించనిదై ఉండాలి. అలాంటి అర్థవంతమైన అవగాహన కలిగించేదే విద్య. ఆ అవగాహనతో ఆర్జించేదే ధనం. ఆ లక్ష్యం కోసం వినియోగం కావడమే దాని ఉద్దేశం. ఆ వినియోగం వల్ల లభించే ఆనందమే జీవిత సార్థకం.)


చివరకు తల్లిదండ్రులు కూడా విద్య ద్వారా డబ్బును సంపాదించే యంత్రాలుగా పిల్లలను తీర్చిదిద్దే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు.


కానీ మన ఆర్షధర్మం (ఋషులు ఏర్పరచిన మార్గం) విద్యకు లక్ష్యాలను చాలా చక్కగా నిబంధించింది.


విద్యా దదాతి వినయం

వినాయత్ యాతి పాత్రతా |

పాత్రత్వాత్ ధనమాప్నోతి

ధనాత్ ధర్మం తతస్సుఖమ్ ||


విద్యవల్ల 'వినయం' రావాలి. వినయం అనే మాటకు అణకువ,విధేయత-అనే

అర్థాలే కాక 'జ్ఞానం' అనే అర్థముంది. విజ్ఞానిని వినీతుడు అని అంటారు.


విద్య వల్ల ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. ఆ ప్రవర్తనకు కూడా

వినయమనే పేరు. ఇక్కడ 'వినయ' శబ్దానికి ఈ అర్థాలన్నింటినీ తీసుకోవచ్చు. విద్య వల్ల విధేయత, విజ్ఞానం, ప్రవర్తనాసరళి లభిస్తాయి. దాని ద్వారా అర్హత, ఆ అర్హత

వల్ల ధనం, ఆ ధనం వల్ల ధర్మం, ధర్మం ద్వారా సుఖం. ఈ వరుసలో ఉన్న ఔచిత్యం ఎంత గొప్పది!


విద్యకీ, ధనానికీ మధ్య వినయమా, పాత్రతా ఉన్నాయి. ధనానికీ, సుఖానికీ మధ్య ధర్మం ఉంది.


ఈ మధ్యలోని ముఖ్య విషయాలను గమనించక విద్య నుంచి ధనం, ధనం నుంచి సుఖం అనే 'జంపింగ్' వ్యవహారం వల్ల వ్యక్తిత్వానికి అవసరమైన వినయం, పాత్రత,

ధర్మం అనే విలువలకు నీళ్ళొదులుతున్నాం. ఈ పద్ధతి వ్యక్తినీ, సమాజాన్నీ కూడా

క్రమంగా బలహీనపరుస్తుంది.


ఇక్కడ విద్యకీ లక్ష్యం, ధనానికి లక్ష్యం రెండూ చెప్పారు. ధనం వల్ల

సంపాదించవలసినది ధర్మం. ధర్మం ద్వారా సుఖాన్ని సంపాదించాలి. ఎంత నిశితమైన అవగాహన ఇందులో ఉందో గమనించారా?


ఈ ఒక్క శ్లోకాన్ని విద్యార్థులూ, విద్యాలయాలూ గమనిస్తే విలువలుగల విద్యావ్యవస్థను సాధించవచ్చు. ధనానికి ముందూ వెనకా ఉత్తమ లక్షణాలుంచారు.

ఆ లక్షణాల వల్ల వ్యక్తి నియంత్రణ సాధ్యపడుతుంది. సమాజానికి భద్రత ఉంటుంది.


ధర్మాన్ని ఆచరించడానికి తగిన వనరులు లేక చాలామంది అసహాయులైపోతారు.

కానీ ధర్మాచరణకు తగిన సంపాదన కలిగి ఉండడం భాగ్యం. ఆ భాగ్యాన్ని

వినియోగించుకోవడమే ధనాన్ని ధర్మం కోసం ఖర్చుచేయడం.


ధనం ద్వారా వచ్చే సుఖం కన్నా, ధర్మం ద్వారా లభించే సుఖంలో సంతృప్తి, శాంతి ఉంటాయి. జీవితంలో లభించే సుఖాలకు దూరంగా ఉండమని, వ్యర్థమైన విరక్తిని బోధించలేదు మన ధర్మం. హాయిగా బ్రతకమంది. ఆనందంగా బ్రతకమంది. అయితే ఆ ఆనందం అర్థవంతం కావాలి. ఏ వ్యక్తికీ హాని కలిగించనిదై ఉండాలి. అలాంటి

అర్థవంతమైన అవగాహన కలిగించేదే విద్య. ఆ అవగాహనతో ఆర్జించేదే ధనం. ఆ లక్ష్యం కోసం వినియోగం కావడమే దాని ఉద్దేశం. ఆ వినియోగం వల్ల లభించే ఆనందమే జీవిత సార్థకం.


సమాజపు శాశ్వత సౌఖ్యం కోసం పరితపించే బుద్ధి ఉన్నవారు ఈ విధంగా ఆలోచిస్తారు.


ఒక్క శ్లోకంలో వ్యక్తి జీవిత మార్గనిర్దేశాన్ని ఇంత సమగ్రంగా బోధించిన మన సనాతనధర్మానికి మోకరిల్లవలసిందే.


విద్యకు ప్రాధాన్యమిచ్చిన గురుపీఠం మనదేశం. భౌతిక సుఖాలను కూడా

లక్ష్యపెట్టకుండా అరణ్యాలలో వాసం చేస్తూ జీవితమంతా జ్ఞాన సముపార్జన కోసం వెచ్చించి మహాతపస్వులు-"విద్యయా అమృతమశ్నుతే" విద్య ద్వారా అమృతత్వం లభిస్తుందని బోధించారు. సౌఖ్యాలనూ, సౌకర్యాలనూ పరిగణించకుండా తపస్సులా విద్యాభ్యాసం చేయాలని మన సంప్రదాయం. విద్యను వ్యాపారం చేసే దుష్ట సంస్కృతిలోనే ఈ సుఖసౌకర్యాల ఆలోచనలు పుడతాయి.


నిరంతర అధ్యయనం వల్లనే నిరంతర ధర్మం, తద్వారా సుఖం వర్థిల్లుతాయి.

సత్యస్పృహతో అసలైన ఆనందాన్ని పొందాలంటే విద్య ధనాల ముందు వెనుకనున్న సులక్షణాలను సాధించవలసిందే.



🔴🔵🟡🟢🙏🟢🟡🔵🔴


*నాహం కర్త*🙏*హరి కర్తా*


*కర్తను నేను కాదు,చేసేది చేయించేది అంతా శ్రీహరి*


🔴🟣🔵🟢🙏🟢🔵🟣🔴



*సమస్త దేవతల శుభాశీస్సులతో...*

*శుభమస్తు! నిత్య శుభమస్తు! సమస్త సన్మంగళాని భవన్తు! శ్రీరస్తు! విజయోస్తు! దిగ్విజయోస్తు! అవిఘ్నమస్తు! ఆయురారోగ్య అష్టైశ్వర్య వృద్ధిరస్తు! పితృదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు! ఇష్టదేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు!  సకల మనోభీష్ట సిద్ధిరస్తు!*


*సర్వేజనాః సుఖినోభవంతు!*


*సర్వ సజ్జనా స్వజనో భవంతు!*

*సర్వ స్వజ్జనా సుకృతో భవంతు!*

*సర్వ సుకృతజనః సుఖినోభవంతు!!*


*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు!*

*అందరికీ శుభమే జరుగుగాక!*


*సర్వేషాం శాన్తిర్భవతు!*

*అందరూ సుఖసంతోషాలతో ఉండుగాక!*


*సర్వేషాం పూర్ణంభవతు!*

*అందరి జీవితాలూ సమృద్ధిగా ఉండుగాక!*


*సర్వేషాం మంగళం భవతు!*

*అందరి జీవితాలూ మంగళకరంగా ఉండుగాక!*

🙏🌹☘️🌹☘️🌹🙏


*వేదఆశీర్వచనము 👇*                                 

కృతఘ్నత

  *ॐ కృతఘ్నత* 



    *"కృతఘ్నత" (ఇతరులు మనకు చేసిన మేలు మరచి పోవడం) మహాపాపం.*

    *అన్ని పాపములకు "ప్రాయశ్చిత్తం" శాస్త్రములలో చెప్పబడి ఉంది.*

    *కానీ "కృతఘ్నతా దోషానికి" మాత్రం ప్రాయశ్చిత్తం లేదు.*

    *భగవంతుడు కూడా ఈ దోషాన్ని పోగొట్టలేడు.*

    *ఒక్క సద్గురువు మాత్రమే ఈ దోషమునుండి భక్తులను కాపాడగలరు.*


    *కృతఘ్నతా దోషము పాలుగాకుండా, ఒక మహా పండితుని శ్రీ కంచి పరమాచార్యులవారు అనుగ్రహించిన సంఘటన ఒకటి ఇప్పుడు చెప్పుకుందాము.*


    *అనంతపురంలో "మొదలి శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు" అనే వేద విద్వాంసులు ఉండేవారు.*

    *వారు అనేకమంది శిష్యులకు వేదము చెప్పేవారు. సంస్కృతములో కూడా గొప్ప పండితులు.*

    *అనంతపురం, ప్రభుత్వ కళాశాలలో సంస్కృత భాషోపన్యాసకులుగా ఉద్యోగం చేసే వారు.*


    *మా బావమరిది శ్రీ అమ్మనమంచి శివప్రసాదు, అనంతపురం వైశ్యాబాంక్ లో పనిచేస్తుండగా వీరి సాంగత్యం లభించి, వీరి శిష్యులైనారు. వీరిదగ్గర "అరుణము", మొదలైనవి అధ్యయనం చేశారు.*

    *వారికి శ్రీ శర్మగారు స్వయముగా చెప్పినదే ఈ వృత్తాంతమంతా.*


    *శ్రీ శాస్త్రిగారు నిత్యము " సప్తశతి"పారాయణ చేసేవారు.*

    *అనేకమంది చేత చండీయాగములు చేయించారు.*

     *ఆగమ శాస్త్ర పండితులు కూడా కాబట్టి అనేక దేవాలయ ప్రతిష్టలు కూడా నిర్వహించారు.*

    *నెల్లూరు దగ్గరవున్న" పెంచలకోన" లో శ్రీ విజయేశ్వరి అమ్మవారు అనేకసార్లు వీరిచేత తమ ఆశ్రమంలో చండీయాగములు చేయించారు.*


    *ఒకసారి శ్రీ కంచి పరమాచార్యులవారు అనంతపురంలో పదిరోజులు బస చేశారు.*

    *శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు రోజూ వారిని దర్శించుకునేవారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామివారు వీరితో మాట్లాడేవారు కాదు.*

    *అందరితో మాట్లాడుతూ, ప్రత్యేకంగా, ఆ ఊరిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వీరితో మాత్రం శ్రీ స్వామివారు మాట్లాడక పోవడము అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించేది.*

    *శ్రీ స్వామి వారు తనతో మాట్లాడక పోవడముతో శ్రీ శర్మగారు ఎంతో మనస్తాపం చెందారు.*

    *కారణము తెలియక వారికి రోజు రోజుకు దుఃఖము అధిక మవుతుండేది.*

    *ఇలా పదిరోజులు గడిచినై.*


    *శ్రీ స్వామివారు అక్కడనుండి "ధర్మవరము" నకు ప్రయాణమయినారు.*

    *శ్రీ శర్మగారు చింతాగ్రస్తులయినారు. ఏమైనా సరే, శ్రీ స్వామివారు మాట్లాడేదాకా వారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.*

   *"నేను ఎప్పుడు వస్తానో తెలియదు.అప్పటివరకు సెలవు మంజూరు చేయ వలసినది" అని కళాశాలకు సెలవు చీటీ పంపించి, శ్రీ స్వామివారి వెంట ధర్మవరము వెళ్లారు.*

    *శ్రీ స్వామివారు నదీ స్నానం ఆచరిస్తుండగా అక్కడ నిలబడి " అఘమర్షణ " సూక్తము మొదలైన స్నాన మంత్రములు చదివారు.*

    *మంత్రములు చదవటం పూర్తి అయినా, శ్రీ స్వామివారు, ఇంకా స్నానం చేస్తూనే ఉన్నారు.*

    *శ్రీ శర్మగారు కొంత తటపటాయిస్తూ "రుద్రము" చదవటం మొదలుపెట్టారు.*

    *శ్రీ స్వామివారు చదవమని చేయి ఊపి సైగ చేశారు.*


    *పది రోజుల తరువాత అదే మొదటిసారి శ్రీ స్వామివారు, శ్రీ శర్మగారివంక చూడటము.*

    *శ్రీ శర్మగారు మహదానంద భరితులయినారు.*


    *సాయంకాలము ఊరి వారందరితో కూడిన సభ జరుగుతున్నది. శ్రీ స్వామివారు ఉన్నట్లుండి శ్రీ శర్మగారిని పేరు పెట్టి పిలిచి, వేదికపైకి రమ్మన్నారు.*

    *శ్రీ శర్మగారు వేదికపైకి వెళ్లి శ్రీ స్వామివారికి " న కర్మణా న ప్రజయా" అని వేదమంత్రం చదువుతూ సాష్టాంగ నమస్కారం చేశారు.*

    *శ్రీ పరమాచార్యులవారు వీరితో సంస్కృతములో సంభాషణ ప్రారంభించారు.*


   *"మీరు మీ గురువులను విస్మరించారు*

    *మీ కుటుంబము వారందరికి శ్రీ శృంగేరీ జగద్గురువులతో ఎన్నో తరములనుండి అనుబంధము ఉన్నది.*

    *మీకు చిన్న తనములో నత్తి వల్ల మాటలు సరిగా రాకపోవడంతో మీ ఇంట్లో వారందరు దిగులు పడ్డారు.*

    *మీ తాతగారు, మిమ్ములను, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములవారి సన్నిధికి తీసుకు వెళ్లి విషయం విన్నవించారు.*

    *జగద్గురువులు మీ నోరు తెరవమన్నారు. ఎంతో అనుగ్రహంతో మీ నాలుకమీద వారి అమృతదృష్టి ప్రసరింపజేసి, చిరునవ్వు నవ్వుతూ "ఈ అబ్బాయి గొప్ప పండితుడు అవుతాడు. చాలా ప్రఖ్యాతి సంపాదిస్తాడు" అని ఆశీర్వదించారు.*

    *ఆ క్షణం నుండీ మీకు నత్తి పోయింది స్పష్టమైన ఉచ్ఛారణ వచ్చింది. వేదము, సంస్కృతము అధ్యయనం చేసి మంచి పండితులైనారు.*

    *అటువంటి సద్గురువులను మీరు విస్మరించారు" అన్నారు.*


    *శ్రీ శర్మగారు నిశ్చేష్టులైనారు.*

    *ఒక్కసారిగా వారికి గతమంతా గుర్తుకు వచ్చింది.*

    *తనను తన తాతగారు, శృంగేరీ తీసుకువెళ్లడము, జగద్గురువులు ఆశీర్వదించడము,తన విద్యాభ్యాసము, క్రమంగా శ్రీ జగద్గురువులను మరచి పోవడము అన్నీ జ్ఞప్తికి వచ్చినవి.*

    *ఎంతో సిగ్గు పడ్డారు.*

    *వారికి ఆశ్చర్యం కూడా వేసింది.*

    *ఎప్పుడో తన చిన్నతనంలో జరిగిన ఈ విషయాలు శ్రీ స్వామివారికి ఎలా తెలుసు?*


    *శ్రీ స్వామివారు సాక్షాత్తూ భగవంతుని అవతారం అనటానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలి?*

    *తనకు "నత్తి" పోగొట్టి, వాక్పటుత్వము ప్రసాదించిన శ్రీ శృంగేరీ జగద్గురువులు కనులకు గోచరించారు. వారి మనస్సు భక్తి భావంతో నిండిపోయింది.*

    *శ్రీ పరమాచార్యులవారికి సాష్టాంగ నమస్కారము చేశారు.*


    *తాను శ్రీ శృంగేరీ జగద్గురువులను విస్మరించి గొప్ప పాపం చేశానని, మీరు నన్ను కాపాడాలని, శ్రీ పరమాచార్యులవారిని వేడుకున్నారు.*

    *శృంగేరీ వెళ్తానన్నారు.*

    *ఆ తరువాత వారిద్దరూ అనేక విషయములు మాట్లాడుకున్నారు.*

    *శ్రీ శర్మగారి సందేహాలు ఎన్నో శ్రీ స్వామివారు తీర్చారు.*

    *వారిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి అనుజ్ఞ ఇచ్చి పంపారు.*

    *శ్రీ శర్మగారు అప్పటినుండి శ్రీశృంగేరీ వారితో తమ అనుబంధం కొనసాగించారు. అనేకమందికి,వేదము, సంస్కృతము చెప్పారు. అనేక గ్రంధాలు రచించారు.*

    *అనేక సత్కార్యాలు చేసి జన్మ చరితార్ధము చేసుకొన్నారు.*

    *దేహత్యాగ పర్యంతము ఏటువంటి రుగ్మతా లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో వున్నారు.*

    *కృతఘ్నతా మహా దోషం నుండి తనను కాపాడిన శ్రీ పరమాచార్యులవారిని ఆ జన్మాంతమూ, స్మరించుకుంటూనే ఉండేవారు.*


    *కేవలము తమ భక్తులనే కాదు, సన్మార్గంలో ఉండే వారందరినీ శ్రీ పరమాచార్యులవారు ఇలా కాపాడుతూ ఉంటారు.*


*శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః.*


                    *శుభమస్తు.*

*తూములూరి మధుసూదనరావు.*

*25-12-'21.*


                   **********

    *పరమాచార్య నడిచే దైవం.*

    *ఇప్పుడూ సమాధినించీ నడిపించే ఆ దైవానికి ప్రణామాలు.*


*"కృతఘ్నత" గురించి శ్రీరాముడు లక్ష్మణుని వాలివద్దకు పంపుతూ లక్ష్మణునితో అన్న మాట*


*కృతార్థా హ్యకృతార్థానాం*

*మిత్రాణాం న భవన్తి యే I*

*తాన్మృతానపి క్రవ్యాదాః*

*కృతఘ్నాన్నోపభుఞ్జతే ॥*

          *- కిష్కింధకాండ 30/73*


    *మిత్రులసహాయముతో తమ పనులను పూర్తి చేసికొని,*

    *పిదప వారికి సహాయపడనివారు కృతఘ్నులు.* 

    *అట్టివారు చనిపోయిన పిమ్మట వారి కళేబరములను పచ్చిమాంసములను తినెడి క్రూరమృగములుగూడ ముట్టవు.*


    *Even the carnivorous animals*

    *dislike to eat the body of such ungrateful men*

    *who do not help their friends even though they have received help and have achieved their objective.*


    *— రామాయణం శర్మ*

              *భద్రాచలం*

శ్రీరాముని చెప్పిన లోకం పోకడ*

 *ॐ శ్రీరాముని చెప్పిన లోకం పోకడ* 

 

*आत्मप्रशंसिनंदृष्टं* 

*धृष्टं विपरिथावकम् ।* 

*सर्वत्रोत्सृष्टदण्डंच* 

 *लोकस्सत्कुरुतेनरम् ।।* 

               *- युद्धकाण्ड 21/15* 


*ఆత్మప్రశంసినం దుష్టం ధృష్టం* 

                        *విపరిధావకం I* 

*సర్వత్రోతృష్టదండం చ లోకః* 

                       *సత్కురుతే నరమ్ ॥*      

                    *- యుద్ధకాండ 21/15* 


     *ఈ లోకము* 

   *- ఆత్మస్తుతి చేసుకునేవాడు,* 

   *(తననితా పొగడుకొనేవాడు)* 

  *- దుష్టుడు,* 

  *- ధార్ష్ట్యము గలవాడు,*  

  *(నిర్దయుడు)* 

  *- కర్తవ్యముల విషయమున వెనుకాడువాడు,* 

   *(అటూ-ఇటూ పరుగులెత్తేవాడు)* 

  *- న్యాయ - అన్యాయములను విచారింపక,*

    *అందరిపైన దండప్రయోగం చేసేవాడూ అయిన* 

   *నరుణ్ణి సత్కరిస్తుంది.* 


    *The world treats with respect a man who* 

  *- indulges in self-praise,* 

  *- is vile,* 

  *- is impudent,* 

  *- runs about *advertising himself and* 

  *- uses the rod of punishment every where (indiscriminately).* 


  *- రామాయణం శర్మ* 

          *భద్రాచలం*

లక్ష్మణుడు చెప్పిన లోకం పోకడ -

  *ॐ లక్ష్మణుడు చెప్పిన లోకం పోకడ - 1* 


    *(మాయా సీతను ఇంద్రజిత్తు సంహరించగా, మరణించినది అసలు సీతే అనుకుని, బాధపడుతున్న శ్రీరామునితో)* 

              

        *यस्यार्थास्तस्यमित्राणि*  

        *यस्यार्थाः तस्य बान्धवाः ।*  

        *यस्यार्थाः स पुमान्लोके* 

        *यस्यार्थाः स च पण्डितः ।।* 

                *- युद्धकाण्ड 83.35*  


   *యస్యార్థాస్తస్యమిత్రాణి* 

   *యస్యార్థాస్యస్యబాన్ధవాః I* 

   *యస్యార్థాస్సపుమాన్లోకే* 

   *యస్యార్థాః స చ పణ్డితః II*  

                  *- యుద్ధకాండ 83.35।।* 


    *ఎవనివద్ద ధనముండునో వానికే మిత్రులుంటారు.* 

     *ఎవనివద్ద ధనముండునో వానిదగ్గరకే బంధువులు చేరతారు.* 

    *ఈ లోకంలో ధనమున్నవాడే పురుషుడు; ధనమున్నవాడే పండితుడుగా పరిగణింపబడతాడు.* 


    *Friends gather round him in whom riches abide;* 

    *Kinsfolk too stand by him in whom riches have found their way.* 

    *He alone is virile, in whom riches find their place ; nay,* 

    *he alone is learned, in whom riches have found their abode.* 


  *- రామాయణం శర్మ* 

         *భద్రాచలం* 

    *బెజవాడ మకాం*