27, అక్టోబర్ 2026, మంగళవారం

నవవిధ భక్తి -

  నవవిధ భక్తి - జీవితానికి తొమ్మిది పాఠాలు


1 శ్రవణం - ఎదుటివారిని ఓపికగా వినడం

2 కీర్తనం - మంచిని నలుగురికీ పంచడం

3 స్మరణం - కృతజ్ఞతతో జీవించడం

4 పాదసేవనం - ఆపదలో ఉన్నవారికి సేవ చేయడం

5 అర్చనం - కర్తవ్యాన్ని పూజగా భావించడం

6 వందనం - పెద్దలను గౌరవించడం

7 దాస్యం - బాధ్యతతో జీవించడం

8 సఖ్యం - భగవంతుని మిత్రునిగా భావించడం

9 ఆత్మనివేదనం - ఫలితాన్ని భగవంతునికి వదిలేయడం


భక్తి మనసులో మొదలై మన ప్రవర్తనలో కనపడాలి.


🔴🔵🟢🟡🙏🟡🟢🔵🔴


ఋణానుబంధం


పూర్వజన్మలో మనకు గల ఋణాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా కలుస్తారు. ఋణం తీరగానే దూరమవుతారు.


ఉచితంగా ధనం, వస్తువులు తీసుకున్నా, సేవ చేయించుకున్నా ఆ ఋణం తీర్చడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే వారిగా వస్తారు.


ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలో పగ ఉంటే ఈ జన్మలో హింసించే యజమానిగా, సంతానంగా వస్తారు. ఉపకారం చేస్తే మిత్రులుగా వస్తారు.


కథ: కొల్లూరు మూకాంబిక గుడి దగ్గర ఒక బిచ్చగాడు నెలకు పదివేలు సంపాదిస్తూ ఇద్దరు కొడుకులను డాక్టర్ చదివిస్తున్నాడు. ఒక మహానుభావుడు పూర్వజన్మలో ఇతను వారి దగ్గర డబ్బు తీసుకుని ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు కష్టపడి వారి ఋణం తీర్చుకుంటున్నాడు అని చెప్పాడు.


చిన్న వస్తువులు ఉచితంగా తీసుకోవడం, ఇతరుల చేత మోయించడం కూడా కర్మ బంధం అవుతుంది. అంగుళం పాము విషం కూడా ప్రమాదమే. కర్మ చిన్నదైనా ఫలితం ఉంటుంది.


స్వార్థ కర్మలు మనల్ని బంధిస్తాయి, నిస్వార్థ కర్మలు రక్షిస్తాయి.


🔴🔵🟢🟡🙏🟡🟢🔵🔴




భూదేవి భారం - గాంధారి శాపం


కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్రుని నూరుగురు కొడుకులు చనిపోయారు. ధృతరాష్ట్రుడు దుఃఖిస్తే వ్యాసుడు ఓదార్చాడు.


వ్యాసుడు చెప్పిన కథ: ఒకనాడు దేవసభలో భూదేవి వచ్చి నా భారం తొలగిస్తానన్నారు కదా ఎందుకు ఆలస్యం అని అడిగింది. అప్పుడు నారాయణుడు ధృతరాష్ట్రునికి నూరుగురు కొడుకులు పుడతారు. పెద్దవాడైన దుర్యోధనుని వల్ల నీ భారం తీరుతుంది. అతన్ని చంపడానికి, రక్షించడానికి వచ్చిన రాజులంతా కురుక్షేత్రంలో చనిపోతారు అని చెప్పాడు.


తరువాత ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వెళ్ళాడు. ధర్మరాజు కనపడగానే కోడళ్ళు ఏడ్చారు. గాంధారికి నమస్కరిస్తే ఆమె కోపంతో మీకు అపకారం చేయని వాడు ఒక్కడైనా లేడా అని అడిగింది. ధర్మరాజు కాలి గోళ్ళపై ఆమె చూపు పడగానే గోళ్ళు కందిపోయాయి.


తరువాత గాంధారి కృష్ణుని పిలిచి శపించింది. కృష్ణా నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధం ఆపగలిగేవాడివి. ఆపలేదు. అందుకే నేటికి 36వ సంవత్సరంలో నీ యాదవ వంశం కూడా కొట్టుకుని చస్తుంది. నువ్వు దిక్కులేని చావు చస్తావు అని శపించింది.


కృష్ణుడు చిరునవ్వుతో ఆ శాపం మునులు ఇంతకు ముందే ఇచ్చారు. దేవతలు కూడా యాదవులను చంపలేరు. అందుకే వారిలో వారే చనిపోతారు అని చెప్పాడు.


🔴🔵🟢🟡🙏🟡🟢🔵🔴

కామెంట్‌లు లేవు: