166వ రోజు: (భాను వారము) 21-05-2023
మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:
ఆటపాటలతోడ హాయిగా చదువంగ
చదువు తలల కెక్కు ఛాత్రులకును
ఆటపాట లెపుడు ఆరోగ్య మందించు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.
విద్యార్ధులు చదువు మరియు ఆట పాటలకు, ప్రతి దినము ప్రత్యేక సమయమును కేటాయించిన ఎడల వారి శారీరక మానసిక ఆరోగ్యముతో పాటు, ఇష్టముతో చదివిన చదువు వారి మనస్సుకు హత్తుకుని భావి జీవితములో పేరు ప్రఖ్యాతులను, కీర్తి ప్రతిష్టలను అందించును.
ఈ రోజు పదము.
మేక పోతు (Goat): అగ్నివాహనము, అజము, చగల, ఛగము, దేవానాంప్రియము, బస్తము, బుక్కము, వేట, స్తభము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి